ఉత్తేజి నిస్తేజాలకు
ఊహలకు ఉల్లాసాలకు
ఉద్రేకాలకు, ఉన్మాదాలకు
ఒడిదుడుకుల జీవితాలకు
సర్వ వికారాలకు,
సమస్త సుగుణాలకు
స్వార్థచింతనకు,
సమర యోచనకు
సతతం సాగే సంఘర్షణలకు
నీవే మూలం! నీవే కారణం!
మనసా ఓ మనసా!
రంగులు మార్చే ఉషŸస్సా?
నిలకడలేని యశస్సా!
మనిషిని విడిచి మనలేవా
మనః శాంతిని ప్రసాదించలేవా?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి