మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, నవంబర్ 2026, సోమవారం

నమక విభూతులు


ప్రకృతి ద్వంద్వాత్మకం. అహెరాత్రాలు - జననమరణాలు - సుఖ దుఃఖాలు అందుకొక నిదర్శనం, కనుక అది సాత్త్విక రాజస తామస త్రిగుణాత్మకమై దానిలో స ృష్టికర్తయైన బ్రహ్మకు ప్రాముఖ్యం లేకుండా పోయి దైవత్వం సత్వతామస ప్రధానులైన శివకేశవులిద్దరి పైననే నిలిచింది. వారిలో ఒకరుగ్రుడు మరొకరు శాంతుడు - ఒకరు విరూపుడు మరొకరు సురూవుడు. కాబట్టి హరిహరుల యొక్క ఈ ఉభయతత్వాలు ప్రక ృతికి వామదక్షిణ పార్శ్వాలు, ఆస్తిక్యం అనే నాణానికి బొమ్మా, బొరుసు అనవచ్చు.

మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుని యొక్క తేరినొగల పై కూర్చుని శత్రువుల యొక్క అస్త్ర శస్త్రాలేవి అతనికి తగలకుండా ప్రత్యక్షంగా రక్షిస్తుండగా రుద్రుడదృశ్య రూపంలో శూలపాణియై ఆ రథం ముందు సంచరిస్తూ అతడు చంపవలసిన వారినందరిని మొదలే సంహరిస్తూ పోయినాడు. కాబట్టి భారతంలో కృష్ణునికెంత ప్రాముఖ్యం ఉందో రుద్రునికి గూడ అంత ప్రాధాన్యం ఉంది. అంతే కాకుండా ఆ యుద్ధారంభంలో శ్రీకృష్ణుడర్జునునికి తన విశ్వరూపం చూపగా దాని అవసానంలో రుద్రుడశ్వత్థామకు తన విశ్వరూపం చూపినాడు. కాబట్టి ఇది కేవలం ఒక మహాభారత యుద్ధం వరకే పరిమితం కాదు. సృష్ట్యారంభంలో నారాయణుడు తన సహస్రశీర్షమైన విశ్వరూపంలో విలసిల్లగా తదవసానంలో రుద్రుడు తన విశ్వరూన్ని ధరిస్తుంటాడు.

జగత్తు ఉన్నంతవరకు దానిలో మంచి చెడులకు, మానవుని మనుగడ 

ఉన్నంతవరకు అతని హృదయంలో దైవాసుర సంపత్తికి ఘర్షణలు తప్పవు. అపుడు నరుని విజయానికి నారాయణుడవతారరూపం ధరించి - ఏదో ఒక మహాపురుష రూపంలోనైనా సరే - ప్రత్యక్షంగా పనిచేయవలసివస్తే, రుద్రునికది లేదు కాబట్టి అతడద ృశ్యంగా ఏవైనా ప్రకృతి శక్తుల రూపంలోనైనా పని చేయక తప్పదు.ఈ రుద్రశక్తులు ప్రకృతిలో పంచభూతాలను, సూర్యచంద్రులను, మానవునిలో అతని ప్రాణేంద్రియాలను, హృదయాన్ని, తపస్సును అధిష్టించి పనిచేస్తుంటవి.

శివ కేశవులిద్దరూ సృష్టికి ఆస్తికులకు సమానులే. ఈ విశ్వంలో విష్ణువు స్వర్గానికి రుద్రుడు అంతరిక్షానికి అధిదేవతలు. వారిద్దరికి శాంతం ఘోరం అని రెండేసి రూపాలున్నవి. విష్ణువు శాంతరూపంలో పరవాసుదేవుడు. అపుడతడు నిత్యవిభూతి స్థానంలో సనకాదులతో ఉంటాడు. ఘోరరూపంలో సంకర్షణుడై ప్రళయాగ్నిని స ృజించి లోకాలను దహింపచేస్తాడు. ఇక రుద్రుడు శాంతరూపంలో పరమ శివుడై కైలాసంలో ఉంటాడు. అపుడు భోలాశంకరుడై భక్తులడిగిన కోరికలన్ని కాదనకుండా ఈయటమే అతని పని. రెండవ రూపంలో అతడు లయకర్త. తన ఉగ్రత్వంతో సృష్టినంతా రోదింప చేస్తుంటాడు.

వాసుదేవుడు సంకర్షణ రూపంలో ప్రళయ సమయంలోనే విజ ృంభిస్తాడు కాని రుద్రుడా విధంగా కాదు. మహాకాలుడు, కాలకాలుడు కాబట్టి- ఎల్లవేళలా ఎల్లరూపాలలో ప్రళయతాండవం చేస్తూనే ఉంటాడు. అందుచేత శాంతికాముకులైన వేదకాలంనాటి మహర్షులు దర్శించిన రుద్రవిభూతులకన్నిటికి సమస్కరిస్తూ అతని మÖర్తిని సలిలాభిషేకంతో చల్లబరుచుతూ ప్రార్థించినారు. అందుచేత ఆనాడు వారు దర్శించిన ఋక్కులీనాడు మనకు నమక చమకాల పేర రుద్రాభిషేక మంత్రాలుగా నిలిచినవి.

ఆది మానవునికి ప్రక ృతి వైపరీత్యాలలో కలిగిన భయమే దైవావిష్కరణకు దారితీసిందని ఈనాటి సామాజికవేత్తల అభిప్రాయం. ఇది మనకు వేదకాలం నుండియే “అసతో మా సద్గమయ- తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామ ృతం గమయ” నే కాంక్షలో మొగ్గ దొడిగి ఈ నమకంలో సంపూర్ణంగా వికసించి దర్శనమిస్తుంది. దానిలో వారు ప్రకృతి భీషణత్వానికి కారణంగా దర్శించిన రుద్రుడు తామ్రుడు, అరుణుడు, బభ్రుడు, విలోహితుడు, రోహితుడు. ఎరుపుగాని కపాలాస్థికలుగాని భయంకర చిహ్నాలుగా ఈనాడు పాశ్చాత్యులు నిర్ణయించినవే కావు. ఇంకా వారు దర్శించిన రుద్రుడు ఉగ్రుడు, భీముడు, శతేషుధి, శతధన్వి, అతన్వానుడు, తీక్షేషువు ‘ఉచ్చైర్గోషుడు’ ఆక్రందయతుడు. అతనిని గురించి తెలిపే ఈ రుద్రాధ్యాయం కృష్ణయజుర్వేదంలోని చతుర్ధ కాండంలో గల చతుర్థ ప్రపాఠకంలో ఉంది. దానికి నమకం - రుద్రాధ్యాయం - శతరుద్రీయం - రుద్రోపనిషత్తు అని వ్యవహారాలు.

ఈ అనువాకాలు “నమస్తే రుద్రమన్యవ” అని - నమశ్శబ్దంతో ప్రారంభమౌతవి కాబట్టి ఈ అధ్యాయానికి “నమకం” అని, రుద్రస్మరణతో మొదలవుతవి కాబట్టి రుద్రాధ్యాయం” అని పిలువబడుతున్నవి. సృష్టిలో రుద్రశక్తులు ఏకాదశస్థానాలనధివసించి పనిచేస్తున్నవి కాబట్టి ఏకాదశం, రుద్రసంఖ్య అయింది. అందుచేత ఈ అధ్యాయం ఏకాదశాను వాకాలుగా విభజింపబడింది. వీనిలో మొత్తం 25 ఋక్కులు 139 యజుస్సులు ఉన్నవి. ఋక్కులు శ్లోకరూపాలు, యజుస్సులు వచనాలు. ఈ మొత్తం సూక్తాలలో రుద్రునికి 280 పర్యాయాలు వాడబడినవి. వానిలో 20 మాత్రమే పురాణ ప్రసిద్ధాలు.

సాయణాచార్యులు శతశబ్దాన్ని అపరిమితమని వ్యాఖ్యానించి “దీనిలో రుద్రుని మహిమ బహుముఖంగా కీర్తించబడింది కాబట్టి యిది శతరుద్రీయమయింది” అన్నారు. దీన్ని పద్యరూపంలో ఆంధ్రీకరించిన శ్రీ వేదాంతం కాశీనాథంగారు ఈ అధ్యాయంలోని 164 సూక్తాలను నూరుగా విభజించి దీనికి శతరుద్రీయమనే వ్యవహారాన్ని సార్థకపరిచినారు. వారి వింగడింపు ఈ విధంగా ఉంది.

1`15 ఋ - 15 7-16 య-5

2-13 య - 8 8-17 య-8

3`12 య - 10 9-19 య-6

4-17 య - 9 10-12 య-12

5-15 య - 7 11-11G3-14

6-15 య - 6 మొత్తం 164 -100

ఈ మొత్తంలో రుద్రుని యొక్క కార్యరూపం, విరాడ్రూపం, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం అనే త్రివిధరూపాలు ప్రదర్శింపబడినవి. కాబట్టి తత్త్వజ్ఞులు దీన్ని రుద్రోపనిషత్తని పొగడినారు. ఈ అనువాకాలలో 2 నుండి 9 వరకు గల ఎనిమిదింటి లో 124 యజుస్సులున్నవి. వానిలో జగన్నిర్వహణకు కారణమైన రుద్రుని యొక్క లీలాశరీరాలు చెప్పబడినవి కాబట్టి రుద్రాధ్యాయంలోని ఈ భాగం భగవద్గీతలోని విభూతియోగంవంటిది.

భగవద్గీతలోని దశమాధ్యాయానికి విభూతియోగమని పేరు  యజుర్వేదంలోని నమకం వేదకాలంనాటి ద్రష్టమైన మహర్షి దర్శించిన విశ్వరూపమై తే భగవద్గీతలోని విభూతియోగం శ్రీక ృష్ణుడే స్వయంగా వివరించిన స్వస్వరూపం. ఈ భాగం దానిలో అనగా దశమాధ్యాయంలో 20 నుండి 38 శ్లోకాల వరకు విస్తరించి ఉంది. ఆ 18 శ్లోకాలలో గీతాచార్యుడు బ్రహ్మ యొక్క నవవిధ స ృష్టినంతా సుమారు 70 వర్గాలుగా విభజించి ఒక్కొక్కదానిలో ఉత్తమమైనదాన్ని ఎన్నుకుని అది నేను అని చెబుతూ 80 వరకు తన విభూతులను తెలిపినాడు. కాబట్టి దాన్ని పరిశీలించినపుడు అది ఒక విధంగా నమకంపై వచ్చిన పరిష్కరణ అనిపిస్తుంది. దానిలో అతడు సృష్టిని దేవతలు దేవయోనులు, దైత్యులు, ఋషులు, మానవులు, పశువులు, పక్షులు, స్థావరాలు, వస్తువులు, అవస్థలు అని ఒక క్రమం ఏర్పరచుకుని తన విభూతులను ప్రకటించినాడు. ఇక నమక ద్రష్ట ఆవిధంగాకాక

విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని 

శుని చైవ శ్వపాకే చ పండితాస్సమదర్శినః

అని గీతాకారుడు చెప్పినట్లు సృష్టిలోని ఉచ్ఛనీచ భేదాలు గమనించకుండ ప్రకృతి అంతటా పరమేశ్వరుని, మానవులందరిలో మాధవుని దర్శంచినాడు. ఇక ఇందులోని అనువాకాలను చూడండి. ఇది రుద్రాధ్యాయం - “రుద్రుడు” అంటే రోధింప చేసేవాడు కాబట్టి ప్రథమానువాకమంతా పినాకపాణియైన రుద్రుని సగుణరూపాన్ని అతని ధనుర్బాణాలను వర్ణించి స్తుతించింది. ఈ అనువాకంలోనివన్ని ఋక్కులు. ఇక రెండవ అనువాకం నుండి అసలైన రుద్ర రూపాలారంభమౌతవి. అవి ఏకతర నమస్కారాలు,

ఉభయతో నమస్కారాలు అని రెండు విధాలుగా ఉన్నవి.

రెండు, మÖడు, నాలుగు అనువాకాలు ఉభయతో నమస్కారాలు, అనగా వీనిలో రుద్రపర్యాయాని కిరువైపులా నమశ్శబ్దం జోడించబడింది. అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది అనువాకాలు ఏకతర నమస్కారాలు, అనగా వీనికి నమశ్శబ్దం ఒకే వైపు జోడించబడి ఉంటుంది. ద్వితీయానువాకంలో 13 యజుస్సులున్నవి. వానిలో ఎనిమిదింట రుద్రుని సగుణ రూపం, అయిదింట అతనికి ప్రకృతిపైగల ఆధిపత్యం చెప్పబడింది. గీతలో శ్రీకృష్ణుడు ‘ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన’ అనే పద్ధతిలోనే అంతటా చెప్పినాడు కాని “నమో హిరణ్యబాహవే - స్తేనాన్యే - దిశాంచ పతయే నమః పశూనాం పతయే నమః” అన్న పద్ధతిలో తనకు గల ఆధిపత్యాన్ని వెల్లడించలేదు. 

తృతీయంలో 13 యజుస్సులున్నవి. వానిలో ఆయుధపాణులు, చోరులు ఇంకా నిలిచిన, కూర్చున్న శయనించిన పరుగెత్తుచున్నవారు చెప్పబడినారు. అయితే ఇందులో “నమో కకుభాయ నిషంగితే - సేనానాం పతయే నమః!” అని ఆరంభించి ఏడు యజుస్సులు కేవలం వివిధ రూపులైన చోరులను గురించియే చెప్పబడినవి. ఈ సందర్భంలో ఇందులోని నిచేర - పరిచర అరణ్యులను గురించి కొంచెం గమనింపవలసి ఉంది!

నిచేరువు అంటే ఒకేచోట కదలకుండా ఉండి నాచుపట్టినవాడు, పరిచరుడంటే చుట్టుపట్ల తిరుగుతూ పరిస్థితిని కనిపెడుతూ పొంచినవాడు, అరణ్యుడంటే అడవులలో తిరిగేవాడు. ఈ ముగ్గురు అనగా ఒకే చోట నాచుపట్టినవాడుగాని అక్కడా యిక్కడా రుద్రుడు సోభ్యుడు అనగా ఉభయరూపాలు గలవాడు కాబట్టి పై మువ్వురు దొంగలు కావచ్చు, లేదా వారిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నవారు కావచ్చు. అయితే ఇది చోరులను చెబుతున్న సందర్భం కాబట్టి వీరిని చోరులుగా భావించటమే సబబు.

ఈలాగే ఉష్ణీషులను కులుంచులను కూడా - ఉష్ణీషం అంటే తలపాగ అయినా ఇక్కడ సందర్భాన్ని బట్టి దీన్ని చోరులు తలకు తగిలించుకునే ముసుగని వీరు ముసుగు దొంగలని, కులుంచులను పంటలను కోసి దొంగిలించువారు లేదా భూ, గృహ, సువర్ణాదులను దొంగిలించువారని చెప్పవలసి ఉంది. రుద్రుడు స్తేనానాం పతి కాబట్టి ఇటువంటివారి కందరికి పెంబ. శ్రీకృష్ణుడు బాల్యంలో నవనీత చోరుడు, కౌమారంలో గోపీ వస్త్రాపహారుడు  యౌవనంలో యువతీ మానసచోరుడు. అయినా విభూతులలో మాత్రం తననెక్కడా విష్ణువుననియేగాని కృష్ణుడనని చెప్పుకోలేదు.

ఈ అనువాకం చివరన 10, 11 యజుస్సులలో ధావంతుడు, తిష్ఠదుడు, ఆసీనుడు - శయానుడు చెప్పబడినారు. ఈ నలువురు వరుసగా కృతాది యుగపురుషుల కుపలక్షకంగా చెప్పబడినారనవలె. చతుర్థానువాకంలో 17 యజుస్సులున్నవి. వానిలో మొదటి రెండు తామస గుణ ప్రధాన స్త్రీలను, వాని పిమ్మట ఎనిమిది తత్పురుష సంబంధాలను, తక్కినవి వ ృత్తుల వారిని గురించి ప్రవర్తించినవి.

ఇందలి స్త్రీలలో ఆవ్యాధిని వివిధ్యంతి ఉగణ తృంహతి - అనే నాలుగు రకాల వారు పేర్కొనబడినారు. వారిలో ఉగణ శబ్దానికి ఉగ్రగణ దేవత అని ఉమ అని రెండర్థాలున్నవి. ఉమాదేవి సౌమ్యదేవత. కాబట్టి ఇక్కడ బ్రాహ్మీ మహేశ్వరీ అనే సప్తమాత ృకలను చెబితే సందర్భానికి తగినట్లుగా ఉంటుంది.

రుద్రుడు తామసగుణ ప్రధానుడు కనుక అతని నుండి తామసగుణ ప్రధానమైన స్త్రీలుదయించినపుడు సాత్వికగుణ ప్రధానమైన విష్ణువు నుండి సత్త్వగుణ ప్రధానమైన స్త్రీలుద్భవించటం ప్రక ృతి సహజం. అందుచేత గీతలో శ్రీక ృష్ణుడు ‘కీర్తి శ్రీర్వాక్చనారీణాం స్మ ృతిర్మేధా ధ ృతిః క్షమా’ 10-34 అని స్త్రీలలో కీర్తి - శ్రీ - వాక్కు - స్మ ృతి - మేధ - ధ ృతి - క్షమ - అనే వారిని తమ విభూతులుగా పేర్కొన్నాడు. ఈ స్త్రీ సప్తకం పురాణాలలో ధరణీదక్షుల కుమార్తెలు - వారిలో కీర్తి - శ్రీ - ధృతి - మేధ అనే నలుగురిని ధర్మ ప్రజాపతి, క్షమనుపులహుడు, వాక్కును విశ్రవసుడు, స్మ ృతిని అంగీరసుడు వివాహమాడినారు.

ఇక తత్పురుష సంబంధాలలో కృత్స్నుడు - క ృత్స్నపతి, వ్రాతుడు - వ్రాతపతి, గణము - గణపతి, రథి - రథపతి, సేన - సేనాని, శుని - శ్వపతి, అని రుద్రుడు భయరూపాలుగా నుతింపబడినాడు. గీతలో ఇవి  “మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ”  - అని సప్తమీ తత్పురుషాలుగా చెప్పబడినవి. అందులో ఏకరూపమే కాని పైవలె ఉభయ రూపాలు లేవు.

వీని పిమ్మట ఇందులో తక్షకుడు, రథకారుడు, కులాలుడు, కర్మారుడు మున్నగు వ ృత్తుల వారు పేర్కొనబడినారు. వారిలో నిషాదులతో పాటు పుంజిష్టులు గూడ 

ఉన్నారు. పుంజిష్ట శబ్దానికి వర్గాధిపతి, పక్షిహంత అని రెండు విధాల అర్థాలు చెప్పినారు. అయితే నిషాద సాహచర్యాన్ని బట్టి వీరిని పక్షులను వేటాడు వారు అనియే చెప్పటం బాగు.

వీరిలో ఇంకా మృగయులు శ్వపతులు గూడా ఉన్నారు. ఈ శ్వపతులను కుక్కలను పెంచిన వేటకాండ్రని చెప్పవలసి ఉంది. మన కావ్యాలన్నింటిలో వేట సందర్భంలో కుక్కలవేట తప్పకుండ వర్ణించబడింది. కాబట్టి ఇది మనకు వేదకాలం నుండియే వచ్చిన వ ృత్తి అనిపిస్తుంది. ఆంధ్రులు గూడా వడగరులుగా ఉన్నపుడు కుక్కలను పెంచి వేటాడుతూ ఉండేవారట. గీతలో శ్రీకృష్ణుడు`

విద్యావినయ సంపన్నే బ్రహ్మణే గవి హస్తిని 

శుని చైవ శ్వపాకే చ పండితాస్సమదర్శినః 

అని చెప్పినాడు. ఎవడు బ్రాహ్మణుని, శ్వపాకుని, కుక్కను గోవును సమానంగా చూస్తాడో వాడే పండితుడని దీని తాత్పర్యం. అందుచేత నమకం “నమో మహద్భ్యః క్షుల్ల కేభ్యశ్చ వో నమ:” అని వ్రాత్యులు, వ్యాధులు, శ్వపతులు మొదలైన హీనజాతులలో గూడ ఈశ్వరుని దర్శించింది. దీన్ని అనుసరించియే శంకరుడు చండాలునిలో విశ్వేశ్వరుని దర్శించినాడు.

పంచమ షష్టానువాకాలలో పదేను పదేను యజుస్సు లున్నవి. ఈ రెండు అనువాకాలంతా పురాణ నామమాల. వీనిలో పంచమంలోని నాలుగవ యజుస్సు నుండి ఆరవదానిలోని అయిదవ యజుస్సు వరకు కపర్దివ్యుప్తకేశుడు, వామనుడు,  బృహతుడు, జ్యేష్ఠుడు, కనిష్ఠుడు, పూర్వజుడు, అపరజుడు, అగ్రిముడు, జఘన్యుడు, అని sTÖ విధంగా వ్యతిరేక ద్వంద్వాలు చెప్పబడినవి.

ఈ ద్వంద్వాలు రుద్రుడు సోభ్యుడు కాబట్టి వ్యక్తివాచకాలు, దైవవాచకాలు రెండూ కావచ్చు. ఇవి దైవవాచకాలైÉనపుడు తత్వ ప్రకారం ఈ విశ్వానికంతా సృష్టికర్త లయకారకుడు ఒక్కడే. కాబట్టి అతని యందు ఈ రెండు లక్షణాలు సమన్వయపడుతవి. అందుచేత గీతలో ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు రాజవిద్యా రాజగుహ్యయోగంలో ప్రతిపాదిస్తూ “ఏకత్వేన పృథక్వేన బహుధా విశ్వతో ముఖం” - 9 - 15 అని ప్రారంభించి “ఆహమగ్ని రహం హుతం, పితా హమస్య జగతోమాతా,.........” అని తన విశ్వరూపాన్ని వివరించినాడు.

ద్వంద్వాలతో పాటు అనువాకంలో “నమ ఉర్వర్యాయచ ఖల్యాయచ, నమోవన్యాయచ కక్ష్యాయ చ” అని కొన్ని ప్రకృతివాచకాలు, “నమ ఆశుషేణాయ చాశురధాయ చ, ............ నమో బిల్మినేచ కవచినేచ” అని కొన్ని యుద్ధవాచకాలు గూడ చోటు చేసికోవటం గమనార్హం.

రుద్రుడు స్థాణువు కాబట్టి దీనిలో ఉర్వీవృక్షవాచకాలు, అతడు రౌద్రమÖర్తి కాబట్టి ఆశు సేన ఆశురథాది యుద్ధవాచకాలు చెప్పబడినవని భావించవలె. సప్తమానువాకంలో 16 యజుస్సులున్నవి. వానిలో ఆరవదానిలో ప్రారంభమైన యుద్ధవాచకాలు అయిదు యజుస్సుల వరకు సాగి ఆ పిమ్మట జలవాచకాలు వాతావరణ వాచకాలు ప్రారంభమైనవి.

గీతలో శ్రీక ృష్ణుడు “ప్రోతసామస్మి జాహ్నవీ” అని నదీవాచకాన్ని ఒక్కటే పేర్కొన్నాడు కాని శివుడు గంగాధరుడు- అంతకు మించి అభిషేకప్రియుడు కాబట్టి ఈ అనువాకాలలో జలవాచకాలు “నమః ...... శ్రీభ్యాయచ నమ ఊర్మ్యాయచ” అని ప్రారంభమై సుమారు యిరువది వరకు చెప్పబడినవి. శీభం అంటే ప్రవాహం కాబట్టి “శీభ్యుడు” అంటే ప్రవాహ రూపమైనవాడు, ఆ ప్రవాహాలలో ఉండేవాడు, ఆలాగే ఊర్మి అంటే అల కాబట్టి ఊర్మ్యుడు అంటే సముద్రాదులలో అలల రూపమైనవాడు స్నానాది సందర్భాలలో - వానలో మునిగేవాడు అని రెండేసి విధాలుగా అర్థం చెప్పవలసి ఉంది.

జలవాచకాల పిమ్మట ఈ అనువాకంలో చెప్పబడినవి వాతావరణ వాచకాలు. వానిలో మేఘాలు, విద్యుత్తు, ఈథియం, ఆతపం అనేవి చెప్పడినవి. ఈ థ్రియ శబ్దానికి శరత్కాలంలోని ప్రకాశం అని అర్థం చెప్పడింది. ఈనాటి సైన్సు విశ్వంలో ఈథర్ అనే విశ్వవ్యాప్తమైన వస్తువు ఒకటి ఉందని, వెలుతురుగాని రేడియో తరంగాలుగాని దానిలోనే ప్రయాణం చేసి తమ గమ్యాన్ని చేరుతున్నవని చెబుతుంది. శరత్కాలంలో వాతావరణం ధూళిరహితంగా ఉండి ఈథర్ యొక్క కాంతి అప్పటి వెలుతురులో ప్రతిఫలించవచ్చు. అందుచేత దాన్ని శరత్కాలపు కాంతి అంటున్నారు కాని దాన్ని దీనిలోని “ఈ థ్రియం” అనే దాన్నిగా గుర్తించటం లెస్స.

రుద్రుడు అంతరిక్షాధిదేవత కాబట్టి అంతరిక్షంలోని ఈ మేఘాదిపదార్థాలన్నీ అతని రూపాలుగా నుతించబడినవి. అష్టమాను వాకంలో 17 యజుస్సులున్నవి. వానిలో పది మళ్లీ పురాతన నామమాల. తక్కిన వానిలో మరల జలవాచకాలు చెప్పబడినవి. నవమంలో 19 యజున్నులున్నవి. వానిలో తొమ్మిదింట మరికొన్ని స్థలవాచకాలు చెప్పబడినవి. “నమ ఇరిణ్యాయచ ప్రపధ్యాయచ” అని ప్రారంభమైన ఈ స్థలవాచకాలు మొత్తం యిరువది వరకున్నవి.

శివుడు స్థాణువు కాబట్టి ఆ శబ్దానికి ఉన్నవ్యుత్పత్తిననుసరించి భూపర్యాయ వ ృక్ష పర్యాయాలు రెండూ అతనికి అన్వయించవచ్చు. అందుచేత ఇరిణం అంటే ఊసరక్షేత్రం కాబట్టి ఇరిణ్యుడు అన్నపుడు ఊసరక్షేత్ర స్వరూపుడని, ఊసరక్షేత్రం కలవాడని ఉభయ విధంగా అన్వయం చెప్పే అవకాశం ఉంది. అందుచేత ఈ కోవకు చెందిన వాచకాలన్ని అట్లే అన్వయించవలె.

వృక్ష పర్యాయంగా ఈ అనువాకాలలో హరికేశం కక్షం, కాటం అనే నామాలు వ ృక్షాణాంపతి, కక్షాణాంపతి, ఓషధీనాంపతి, అరణ్యానాంపతి అని తత్సంబంధవాచకాలు ఉన్నవి. వానిలో హరికేశ శబ్దానికి మాత్రం పచ్చని ఆకులే వెంట్రుకలుగా గలది అని వర్ణనాత్మకంగా అన్వయం చెప్పవలసి ఉంది. ఇక వ ృక్షుడు అన్నపుడు వృక్షస్వరూపుడు అని వృక్షం కలవాడు అని రెండు విధాలుగా అర్థం చెప్పవచ్చు. ఏకామ్రేశ్వరుడు, బిల్వేశ్వరుడు, మధూకేశ్వరుడు అని ఆంధ్రదేశంలో వృక్ష నామాలతో వెలసిన లింగ ప్రతిష్ఠలు మిక్కిలిగానే ఉన్నవి.

శివుడు స్థాణువేగాక స్థపతి, వాస్తువు గూడ కాబట్టి ఈ అనువాకంలో గ ృహం, తల్పం, గేహం, గోష్టం, గహ్వరం, సభ అని వాస్తువాచకాలు గూడ చెప్పబడినవి. వీనిని గూడా గృహుడు అన్నపుడు గృహస్వరూపుడు, గృహం గలవాడు అని రెండు విధాల అన్వయాన్ని చెప్పవచ్చు. కాబట్టి ఇట్టి వానికి ఉభయ రూపమైన అన్వయాలు చెప్పినపుడే ఇది సాయణాచార్యులు చెప్పినట్లు రుద్రమÖర్తుల పరిమితంగా ప్రతిపాదింపబడి శతరుద్రీయమనే వ్యవహారానికి సార్థకం అవుతుంది. ఇది మనకు కనిపించే నమక స్వరూపం. మానవునికి కుడి ఎడమల వలె సమాజంలో మంచి చెడ్డలు రెండు కూడ సహజం. వానిలో దేని స్థానం దానిది. తాత్విక దృష్టితో చూచినపుడు ఆ రెండు గూడా ఈశ్వరుని లీలావిభూతులే. అందుచేత గీత విభూతియోగంలో అన్ని 

ఉత్తమమైన వానిని ఉన్నతమైన వానిని ఎన్నుకుని చెప్పగా ఈ నమకం తామస ప్రధానమై హీనమైనవాని నెక్కువగ స్వీకరించి వివరించింది. అందుచేత మంచి చెడులు ఒక దానితో ఒకటి పేచీపడనంతవరకు మనం దేనిని తిరస్కరించనవసరం ఉండదు.

మానవ సమాజానికి దొర ఎంతముఖ్యమో దొంగ కూడ అంతే అవసరం. ధనానికి దానం, భోగం, నాశం, అని మÖడు స్థితులున్నవి. కాబట్టి వ్యక్తి తన అవసరానికి మించి ఎప్పుడు గూడ సంపాదించరాదు. సంపాదించెనా దాన్ని అనుభవించవలె లేదా దానం చేయవలె లేదా ఏదైనా ధర్మకార్యానికి వినియోగించవలె. ఆ విధంగా గాక అతడు లుబ్దుడై దాన్ని దాచెనా దాచిన సొత్తు దబ్బరకానిని పిలుస్తుందని సామెత. కాబట్టి వాడే రూపంలో వస్తాడో మనం ఎరుగలేం. అందు చేతనే దీనిలో వివిధమైన చోర రూపాలు ప్రస్తుతింపబడినవి.

ఈనాటి సమాజంలో ఉద్యోగులు, వృత్తుల వారు అని ప్రజలు రెండు తెగలుగా ఉన్నారు. వృత్తుల వారంటె ఉద్యోగులకు చిన్నచూపు కాని, వారు లేకుంటే సమాజం నడువదు. చెప్పుకు చీల ఊడిననాడు అధికారి ఆఫీసుకు వెళ్లలేడు. అందు చేత దీనిలో వివిధ వ ృత్తులవారు స్మరింపబడినారు. ఊసర భూమి లేకుంటే మంచినేల విలువ తెలియదు. అందు చేత దీనిలో ఉర్వితోపాటు ఇరిణం గూడ స్తుతించబడింది. ముండ్లకంచె లేకుంటే పచ్చనితోటకు రక్షణ లేదు కాబట్టి హరికేశాలతో పాటు (పచ్చని చెట్లు) దీనిలో కాటాలు (ముండ్ల పొదలు) గూడ స్మరింపబడినవి.

అల్పులను చూసినపుడు అధికులకు అలుసు. ఆలా ఎల్లప్పుడూ కాకూడదు. అందుచేతనే దీనిలో “నమో మహద్బ్యో క్షుల కేభ్యశ్చ” అని వారిద్దరిని ఒకచోట చేర్చి ఈ ద్రష్ట స్తుతించి నాడు కాబట్టి “కాదేదీ కైతకనర్హం” అన్నట్లుగా ఈశ్వర విభూతికి ఇతరమయింది స ృష్టిలో ఏదికూడా లేదు కాబట్టి నీవు దేనిని గూడ హీనంగా చూడకు. అన్నిటిలో ఆ జగత్కర్తయైన ఈశ్వరుని దర్శించు అని ఈ నమకం తనను పఠించేవానికి ఒక మహత్తర సందేశాన్నిస్తుంది.

చమకం 

భక్తుడు భగవంతునికి నమస్కరించిన పిమ్మట తనకు కావలసినవి కోరుకుంటూ ఉంటాడు. కనుక నమకంలో రుద్రుని వివిధ రూపాలకు నమస్కరించిన భక్తుడిక చమకంలో తన కావాలిసిన  వస్తు సముదాయము, గుణ సముదాయము ఇందులో కోరుకోవటం మనము చూస్తాం. నమకంలో వలెనే ఈ చమకంలో కూడా  11 అనువాకాలున్నాయి. మొత్తం 31 దళాలు, ఒక్కొక్క దళంలో కొన్ని కోరికలు చెప్పబడినవి. ఇందులో గల వస్తు సముదాయము, గుణసముదాయము మొత్తము కలిపి 330 కోరికలు కోరబడినవి. అయితే ఈ కోర్కెలన్నీ రుద్రంలోఒకేసారి చెప్పబడవు.నమకం 11 వాకాలు  పూర్తి అయిన పిమ్మట చమకము ఒక అనువాకం మాత్రమే చెప్పబడుతుంది. దీనికి ఏ కావర్తి లేదా లగురుద్రమని వ్యవహారం చమకం కూడా 11 అనువాకాలు చెప్ప బడవలనంటే నమకం ఒక్కొక్క ఆవృత్తి వెంట చమకం ఒక అనువాకం చెప్పవలసి 

ఉంటుంది. కాబట్టి నమకం పదకొండు ఆవృత్తులు చెప్పవలసి ఉంటుంది. అప్పుడు మొత్తం 11X11=121 అనువాకాలు చెప్పినట్లు అవుతుంది. దీనికి మహా రుద్రమని పేరు. ఇదేవిధంగా చమకం కూడా ఏకాదశ వృత్తి కావలనంటే 121ఞ11= 1331 సార్లు అనువాకాలు చెప్పవలసి ఉంటుంది. దీనికి అతి రుద్రమని పేరు.

చమకంలో ఏముంది?

ఆనాటి వారికి దైవ భీతి,శత్రుభీతి ఎక్కువ. అందువల్ల నమకంలోని ప్రథమానువాకం అంతా ఇంచుమించుగా ఆనాటి వైదికార్యులు తమపై కోపించవద్దని , తమపై బాణాలు ఎక్కు పెట్టవద్దని ప్రార్థించటంతో గడిచింది.అంతేకాక అతని వారు తమను తమ పుత్ర పౌత్రులను తమ పశువులను శత్రువుల నుండి ఆధివ్యాధుల నుండి ఏ కీడు కలుగకుండా కాపాడమని మరల మరల ప్రార్థించటం కూడా జరిగింది. ఈనాటి మను మనుష్యునికి కూడా ఇంకా ఈ భయం పోలేదు. కాగా ఈనాడు మనుష్యునికి మనుష్యుని కంటే భయంకరమైన శత్రువు మరొకరెవ్వరులేరు. నన్నయ్య గారు కోపించిన బ్రాహ్మణుడగ్ని కీలకంటే భయంకరమైన వాడ వుతాడన్నారు కానీ ఒక్క బ్రాహ్మణుడే కాదు ఈనాడెవరైనా సరే సింహం కంటే ,అగ్ని కంటే భయంకరమైన వారే అవుతున్నారు. కనుక ఇతర కోరికలేమీ లేకున్నా శత్రుభయ నివారణకైనా ఈనాడు మనిష్యునికి రుద్రాధ్యాయ పారాయణం  రుద్రాభిషేకం అవసరమవుతుంది.

మనిషికి మొదట కావలసింది అన్నం. అందువల్ల చమకంలోని ప్రతి ప్రథమానువాకం వాజశ్చమే అని అన్నంతో ప్రారంభమైంది. దేవుడు మనుష్యుని సృష్టికంతా అధికారిగా సృష్టించినాడని చెప్పబడుతుంది .కనుక మానవునికి కావాల్సింది పెద్ద తనము ,అధికారం. ఇప్పుడు మానవ సమాజంలో జరిగే పోరాటాలన్ని ఈ రెండింటి కొరకే కాబట్టి రెండవ అనువాకము జ్యేష్టంచ మ ఆధిపత్యంచమే అని, ఆ తర్వాత మనిషికి కావలసింది సుఖం కాబట్టి మÖడవ అనువాకము శంచమేమయశ్చమే అని ప్రారంభమైనవి.ఈ విధంగా అనువాకాలలో ఒక క్రమము ఈనాటి మానవుల అవసరాలు చెప్పబడినవి.

ఈ అనువాకాలలో చెప్పబడిన అవసరాలను చూస్తే దానిలో ఈనాటి వరకు మార్పిడి అంటే అనవసరమైయిందేది అనిపించదు.  కనుక వీనిలో ఆనాటి  ద్రష్టల దూర దృష్టి ఎట్టిదో మన కాశ్చర్యము కలుగుతుంది.  నాలుగవ అనువాకంలో సామాన్యమైన అన్నము అందుకవసరమ యినా  వడ్లు, యవలు , గోధుమలు,కొర్రలు, చామలు,ఆళ్ళు మొదలైన పిండి ధాన్యము మినుములు, పెసలు, కందులు, నువ్వులు మొదలైన పప్పు ధాన్యాలు.

ఐదవ దానిలో ఇంటి కవసరమైన రాయి, మన్ను, ఇసుక, పాత్రలకవసరమైన బంగారం, ఇనుము, సీసము తగరము మొదలైన లోహాలు, వనస్పతులు, ఓషధులు  అంటే ఏకవర్ష పరిమితమైనవి. అడవులలో పండేవి, దున్నిన భూములలో పండేవి ఆయిన ధాన్యాలు పెంపుడు పశువులు, ఆరణ్య పశువులు  కోరబడినవి.

యజ్ఞాలలో అవసరమైన వివిధ దేవతలు చెప్పబడినారు. 7 8 9 అనే మÖడు అనువాకాలలో పూర్తిగా యజ్ఞ సంబంధమైన సామాగ్రి కోరబడింది. ఈనాడు మన వారు ప్రతిది ఎట్లా యంత్రాలతో సాధిస్తున్నారో ఆనాటి వారట్ల తమ అవసరాలన్నీ యజ్ఞాల చేతనే సాధించుకునేవారు. అందువల్ల ఆనాడు వీనిలో చెప్పబడిన యజ్ఞ సామాగ్రి అగ్రజాతుల వారినందరికి అవసరముండేది.

యజ్ఞానికి పై సాధన సంపత్తితోపాటు పశు సంపద కూడా అవసరముండేదీ.  ఆనాటి వారికి గోజాతి ఇటు యజ్ఞాలకు అటు కృష్యాదులకు రెండు విధాల అవసరముండేది .కాబట్టి వారు తమ గోష్టాలు అనగా దొడ్లు, చూడి ఆవులు  మొదలుకొని ఏడాది ఏడాదిన్నర  రెండేండ్లు మÖడేండ్లు మÖడేండ్లన్నర ఇట్లా అయిదారేండ్ల వరకు గల  దూడలు కట్టీడుపెయ్యలు వానికి తగిన బలిష్టమైన కోడెలు కలిగి కళకళలాడుతూ ఉండవలెనని కోరేవారు.

(నాకు ఈ వివరణకు ఎక్కిరాల వారి రుద్రసూక్తం, ప్రత్నానందులవారి యజుర్వేద దర్శనం ఉపకరించినవి. శ్రీమాన్ ఎక్కిరాల క ృష్ణమాచార్యుల వారు వైష్ణవులైÉనా శివకేశవ భేదం ఎరుగనివారు. ఇక ప్రత్నానందుల వారు తమ దర్శన వాజ్మయంతో నాకు శాస్త్రమార్గంలో పయనించటానికి మార్గదర్శకంగా ఉన్నారు. కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి