మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, నవంబర్ 2026, మంగళవారం

వీర బ్రహ్మేంద్రస్వాముల ద్వాదశ సూక్తులు

1. నా భక్తులకు యే ప్రళయములు అంటవు.

2. అస్మద్దివ్యనామ పఠనాపరులై ఆనందన యుండరు.

3. పోతులూరు వారి భక్తులు జ్యోతిస్వరూపులై యుండేరు.

4. మమ్ములను దూషించినందులకైనా సహించేము. మా భక్తులను దూషించిన సహింపము.

5. నన్ను పూజించి నా కాలజ్ఞానమును పారాయణము చేసిన వారికి ఒక పుష్పమిచ్చిన జోడు పుష్పములగును.

6. నిజ భక్త హృదయంతరాళమందు నిలిచేము.

7. పుణ్య పురుషులను గురుని చెంతకు చేర్చేము.

8. ధర్మము చేసినవారు ఒకరిని దూషించనివారు, ఒకరి సొమ్ముకు ఆశపడనివారు నాకత్యంత ప్రీతి పాత్రుల.

9. తోడే కొలది బావిలోని నీరు, దానధర్మాలు చేసే కొలదీ సంపదలు వృద్ది చెందుతుంటాయి.

10.  నీ గత జన్మకర్మలే నిన్ను వేదిస్తుంటాయి. నన్నాశ్రయిస్తే అవి మెల్లగా వెనుదిరుగుతాయి.

11. నీ మనస్సును నావైపు మరలిస్తే జ్ఞాన ప్రదమౌతుంది. లేకుంటే అది అజ్ఞానం పాలవుతుంది.

12. నన్నాశ్రయించిన వారి సకల బాధ్యతలను నేనే నిర్వహింతును.

శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వాముల వారి మఠంలో ప్రతి సం॥ జరిగే ముఖ్యమైన ఉత్సవాలు

1. శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి - వైశాఖ శుద్ద దశమి

సజీవ సమాది నిష్ట వహించిన పవిత్రమైన రోజు ఆరాదనోత్సవం

2. రదోత్సవము -వైశాఖశుద్ద ఏకాదశి

3. మహాప్రసాదవినియోగం - వైశాఖశుద్ద ద్వాదశి

4. శ్రీవీర బ్రహ్మేంద్రసాములవారి కళ్యాణ మీVAత్సవము - మాఘ బహుళ త్రయోదశి

5. శ్రీ గోవిందామాంబ ఆరాధనోత్సవము -  పాల్గుణ బహుళ దశమి

6. ఈశ్వరమ్మ ఆరాధన - మార్గశిర బహుళనవమి

7. మఠాదిపతులు శ్రీశ్రీశ్రీ శ్రీనివాస స్వాముల వారి ఆరాధన - ఆషాడబహుళ పాడ్యమి

8. మఠాదిపతులు శ్రీశ్రీశ్రీ వీరభోగవసంత వేంకటేశ్వరస్వాముల వారి ఆరాధన - బాద్రపద శుద్ద ఏకాదశి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి