మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, నవంబర్ 2026, మంగళవారం

వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన మహిమ....


నా కాలజ్ఞానంబు పఠియించు స్థలమున 

సప్త ఋషులును సకలదేవతలు వసియించు

నా కాలజ్ఞానంబు భక్తితో విను ప్రజలు

సకల తీర్ధస్నాన పుణ్యంబు పొందేరు.

నా కాలజ్ఞానంబు చెప్పించు ఘనులకు 

సుఖ: సౌఖ్యముల నిచ్చి స్వయంగా నే బ్రోతు

నా కాలజ్ఞానంబును ప్రచారం చేసిన వారికి

అన్నదానము కన్న మిన్న యజ్ఞ ఫలితము గల్గును.

నా కాలజ్ఞానంబు వేదవాక్కని దలిచి

నమ్ముకున్న వారి కర్మములు విడిపోవు.

నా కాలజ్ఞానంబు నమి పూజించు వారికి

ముంజేతి కంకణంబు రీతిగా నుండును.

నా కాలజ్ఞానంబును నమ్ముకున్న వారు 

ధనికులై లక్ష్మీ భోగములు గలిగి యుందురు.

నా మఠంబు దర్శింప జన్మజన్మల సకల పాపంబు లెల్ల

తొలగిపోయి క్రొత్త జీవనంబు పొందేరు.

నన్ను నమ్మని వారు నల్లులై పోతారు

తప్పదిదిగో గురు వాక్కు తెలియండయ.

కన్న బిడ్డలనైన అమ్మోరు కఠినముగా కాలం గడిపేరు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా తనయుడు పుట్టాలని తపస్సులు చేసే తల్లులున్నారు. పుత్రునికోసం పుత్రకామేష్టి యాగం చేసిన వాళ్ళున్నారు. అయితే ఓ తల్లి తన 8 నెలల కొడుకును లక్ష రూ॥కు అమ్మేసింది. ఆడపిల్ల లంటే వివక్ష ఇంకా కొనసాగుతోంది. పేదరికంతో పోషించలేమంటూ తల్లిదండ్రులు అమ్మకానికి పెట్టిన సంఘటనలు ఒకే రోజు మÖడు వెలులోకి వచ్చాయి. రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ఎత్తుకాల్వ తండాకు చెందిన శంకర్ గౌరమ్మ, ఇదే మండలం దాస్యానాయక్ తండాకు మగ్యసీత దంపతులు తమకు ఆడపిల్ల  పుట్టిందని అమ్మకానికి పెట్టారు. నల్గొండ జిల్లా డిండి మండలం రాస్యతండాలోనూ బిచ్యానాయక్ భారతి దంపతులు తమ 22 రోజుల బిడ్డను హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులకు విక్రయించారు. అప్ప్పు తీర్చే మార్గం కానరాక ఓ తండ్రి కన్నబిడ్డనే అమ్మేశాడు. ఆడశిశివును ఖరీదు చేస్తూ పోలీసులకు చిక్కిన సంఘటన రంగారెడ్డి జిల్లా మాల్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళ తన 5 నెలల కొడుకును తన భర్తే అమ్మేశాడంటు మహిళదినోత్సవం రోజున పోలీసులను ఆశ్రయించింది. ఈ విధంగా కాలజ్ఞానం ప్రకారం కన్నతల్లిదండ్రులే తమ బిడ్డలను అమ్ముచున్నారు.


కన్నబిడ్డలను కూడా కామించకోరేటి అధములే యిలలోన పుడతారు.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగ కళ్ళలో పెట్టుకొని చూసుకోవాల్సిన కన్న తండ్రి కర్కోటకుడై తన బిడ్డ జీవితాన్ని చిదిమే వేయడమే కాకుండా తనకు పరిచయమున్న వారికి అప్పగించి వారు అత్యచారాలు చేస్తుంటే ప్రక్కనే ఉండి చూస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవించిన ఒ ఆప్టేలియన్ కామాందుడికి కోర్టు 221/2 ఏళ్ళ కఠిన కారగార శిక్ష విధించింది. 2013 నుంచి 2015 మధ్య తన 11 సం॥ల కుమార్తెపై వద్దునాన్న అని వేడుకున్నా వినకుండ జరిపిన దారుణాలకు సంబంధించి 61 కేసులునమోదుకాగా వాటన్నింటిని నిందితుడు అంగీకరించాడని న్యాయవాది వెల్లడించారు. ఇంకొక సంఘటనలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కూతిరిపైనే కన్నేశాడు ఓ కామాంధుడు. తండ్రీ కూతుళ్ళ బంధాన్ని పక్కన పెట్టి ఆరేళ్ళుగా అత్యాచారం చేశాడు. విషయం బయటికి చెప్పితే చంపేస్తానని బెదిరించి మరీ లొంగ దీసుకున్నాడు. భార్య ఇంట్లో ఉండగానే కూతిరిపై అత్యాచారయత్నం చేస్తూ దొరికిపోయాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. మరో సంఘటనలో వావివరసలు మరిచి కన్న కూతిరిపై పలుమార్లు అత్యాచారం చేసిన నేరస్తుడికి న్యాయస్థానం పదేళ్ళ కఠిన కారాగారశిక్ష, రూ॥ వేయి జరిమాన విదించింది. కన్న కూతురుపైఏ అత్యచార యత్నానికి పాల్పడిన ఓ కామాందుడి ఉదంతం ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిదిలో జరిగింది. ఈ విధంగా కన్న తల్లిదండ్రులే తమ పిల్లల్ని అమ్ముచున్నట్లు నిత్యం పేపర్లో చదువుచున్నాము, టీవీల్లో చూస్తున్నాము. ఇది కాలజ్ఞానమహిమే, 17వ శతాబ్దంలో చెప్పినదే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి