మన పురాణములందు మరుగున పడిన మహాత్ములెందరో ఉన్నారు. అట్టివారి చరిత్రలు విన్నప్పుడుగాని పఠించి పరిశీలించినపుడు గాని మిక్కిలి యాశ్చర్యము గొలుపుచుండును.
లోతుకు దిగి వారి చరిత్ర పరిశీలించినపుడు సహృదయులకు హృదయం ద్రవింపక మానదు. అట్టివారిలో అష్టావక్రుడు, సత్యకామ, జాబాలి, దీర్ఘతముడు కొందరు.
దీర్ఘÁతముడు జన్మతః అంధుడైనా కాలాంతరమున దృష్టిని పొంది మహాత్ముడైనాడు. అతడు జన్మాంధు డెందులకయ్యెను? పూర్వజన్మకృతమా! లేదా మరేదైనా విపర్యాసమా! అంధత్వమున బాహ్య ప్రపంచము నెరుగనివాడు జగద్విఖ్యాతుడెట్లు కాగలిగెను.
పరశురాముడు క్షత్రియవంశం నిర్మూలించిన పిదప మరల క్షత్రియ వంశమును సృజించుటకు క్షత్రియస్త్రీల కెందరికో నితడే పుత్రదానము జేసెను. కనుక ఇతని చరిత్ర నించుక నరయుదము. మనది కర్మభూమి కనుక ప్రాచీన సిద్ధాంతము ప్రకారము మానవుడేది చేసినను బుద్ధిఃకర్మానుసారిణి అతని బుద్ధి, అతడనుసరించవలసిన కర్మననుసరించి పనిచేయుచుండును. నవీనుల మత ప్రకార మటులగాక మానవుడు స్వతంత్రుడు కనుక తనకు తోచినట్టు చేయుచుండును.
ఇది రైలుబండి తమాషా వంటిది. నేలపై నిలిచి చూచినపుడు రైలుబండియే పరుగెత్తుట స్పష్టముగా కనిపించును కాని బండి యెక్కినపుడు మాత్రం పరిసరము పరుగెత్తు చుండును. అయితే ఈ రెంటియందు రెండు నిజము కావు. ఏదో ఒకటి నిజము. అది పైపై వారికి గాక పరిశోధకులకే తెలియును.
దీర్ఘతముడు బృహస్పతి అన్నయైన ఉతధ్యుని కుమారుడు అతడంధుటగుటకు వెనుక నెంతో కథ యున్నది.
దేవదానవులకు స్వర్గపీఠము కొరకై తగాదా యుండెను. దానినెటులైన వశపరచుకోవలెనని అసురుల సంకల్పము. అందులకై వారు నిరంతరము దేవతలపై దండెత్తుచుండిరి. ఐశ్వర్యమంతము స్వర్గమున నుండెను. దేవతలు పేదవారుగానుండిరి.
భృగు మహర్షి కుమారుడైన శుక్రుడు వారి గురువుగా నుండెను. అతడు దానవుల నెట్లయిన ఐశ్వర్యవంతులను చేయదలచి ధనార్ధియైన కుబేరుని చెంత కరిగి తన తపోబలమున నతని నిక్షేపమంతము హరించెను. అంత కుబేరుడేమీ చేయలేక తన మిత్రుడైన శివునితో నా విషయము జెప్పగా నతడుగ్రుడ్డై యొక భూతాకారము ధరించి శుక్రుని మ్రింగి దేహ ద్వారములన్నియు బంధించెను. కాని మÖత్రద్వారము బంధించలేదు.
రుద్రుని యుదరమున జిక్కిన శుక్రుడెటు వెలువడలేక అతడు మÖత్రద్వారము బంధింపకుండుట గని సూక్ష్మరూపము ధరించి యందుండి బయలు వెడలెను. అపుడు అతని యుక్తికాశ్చర్యపడి శర్వాణి భవునితో వీడు మనకు పుత్ర సమానుడయ్యెను కనుక వీనిపై కోపము నుపసంహరింపుడని వేడి శాంతింపజేసెను.
అటుల శుక్రుడు దానవులనైశ్వర్యవంతుల జేసెను. ఆ కాలమున హిరణ్య కశిపుడు దానవ రాజ్యమును పాలించుచుండెను. అతడు (726160000) డెబ్బది రెండు నియతముల రెండర్బుదముల యెనుబది వేల సంవత్సరము లేక ఛత్రాధిపత్యముగా దానవలోకమునేలెను. అపుడు కొంతకాలమున కాదానవుల చర్యలుగని యజ్ఞపురుషుడు వారిని విడిచి దేవతలవైపునకు బోయెను. అందువలన దేవతలు యుద్ధములందు పరాజయమందుచు తలెత్తుకొన లేకుండిరి. వారా విషయము శుక్రునితో మొర పెట్టుకొని తమను దేవతల కన్న మిన్నగా నుండునట్లు చేయమని ప్రార్థించిరి.
అపుడు శుక్రుడు వారిపై కరుణ గలిగి సరియే మీ కొరÂకై ఈశ్వరుని గురించి తపము జేసి యాతనిని పెప్పించి మీకొరకస్త్ర శస్త్రములు మరియు మృత సంజీవిని సంపాదించుకొని వత్తునని తపమునకు వెడలెను.
శుక్రుడటుల తపమునకై పూని వనమునకు వెళ్లి ఘోరమైన తపము చేయుచుండగా ఇంద్రునకది తెలసి భయము కలిగెను. ఎక్కడ తపము చేయుచున్నాను అతనికి తన పదవికే ముప్పు గలుగునోయని భయము. అందువలన నతడు అటుల తపము చేయువారిపై అప్సరసలను ప్రయోగించుచుండెను గాని ఈ శుక్రుడందరి వంటివాడు గాదు.
అతని తపము భంగము చేయుటెట్లు ఆలోచనలో పడెను. స్త్రీలు మాత్రమే పురుషుల తపము భంగము చేయగలరు. అందుకు మరొకరెవ్వరు సమర్థులు గారు.
ఇంద్రుడు రంభాదులను పిలిచి శుక్రుని తపము భంగము చేయుటకు వెళ్ళుమని యాజ్ఞాపించెను గాని వారతని తపోశక్తికి భయపడి నిరాకరించిరి. అంత ఇంద్రుడు బృహస్పతితో నాలోచించి తన కూతురైన జయంతినే అందుకు నియోగించెను.
జయంతి సంసారమున పెరిగిన కన్య. వేశ్య కుటుంబమున పెరిగిన వారైన పురుఘల నాకర్షింప గలుగుదురు కాని జయంతి కా విధులేమి తెలియును? అయినను స్త్రీ చెంతనున్న చాలు పురుషుడు చలించునని యతని నమ్మకము. అందుచేత నతడు కూతురును పిలిచి శుక్రభగవానుడు మన పరిసరమున తపము చేయుట కేతెంచినారు. మహర్షులను తాపసులను సేవించిన కన్యలకు భావి జీవితమునకు శుభము గలుగును. కనుక నీవు వెళ్లి ఆ మహర్షిని సేవించుమని చెప్పెను.
ఆమె తండ్రియాజ్ఞనవధరించి శుక్రుడున్న తపోవనమునకు వెళ్లి అతనికి పరిచర్యలు మొదలుపెట్టెను. అతడు ప్రతిదినము కాలకృత్యములు తీర్చుకొని వచ్చు వరకామె తపోస్థలమును శుభ్రపరచుచు అచ్చట పూలు పత్రి నుంచుచు మునులకు కావలసిన కంద మÖలములు దెచ్చి యుంచుచు ఇటుల నామె నతనిని భక్తితో సేవించ సాగెను.
శుక్రుడొకవైపు ఆమె సేవలు పరిగ్రహించుచు రెండవవైపామె యౌవన సౌందర్యమున కాకర్షితుడగుచున్నను తాను వచ్చిన పనియదిగాదని మనస్సును నిగ్రహించుకొని శివుని గురించి యుగ్రమైన తపమొనరింపసాగెను. అంత పరమశివుడు ప్రత్యక్షమై అతనికి మృత్యుంజయ మంత్రమునుపదేశించి మృతసంజీవి నిచ్చెను.
అటుల తానతి కఠోర నియమమున తపము జేయుచుండ తనను విడువక సేవించుచు నిలిచిన జయంతిని గని శుక్రుడు తన్వీ! నీవెవరోనన్ను తపో సమయమున విడువక సేవించితి నీకేమి కావలయునని అడిగెను. అది విని ఆమె సిగ్గున తలవంచెను. అంత శుక్రుడామె ఇంగిత మెరిగి గాంధర్వమున నామెను చేపట్టెను.
శుక్రుడటుల జయంతిని చేపట్టి తడయుట దేవతలకు కలసి వచ్చెను. ఆ సమయము కనిపెట్టి బృహస్పతి శుక్రరూపమున దానవులను జేరి వారికి నాస్తిక మతము బోధింప మొదలు పెట్టెను. దానియందు విధి నిషేధములు లేవు. పాపపుణ్యములు లేవు.
భక్ష్యా భక్షములు లేవు. స్వర్గనరములు లేవు. అసలు ఆత్మయే లేదు. మర ణానంతరము మరల జన్మము లేదు. కనుక బ్రతికి యున్నపుడే అన్నిటిని అనుభవించవలెనన్న సిద్ధాంతము దానవులను బాగుగా ఆకట్టుకొనెను.
అక్కడ శుక్రుడు పరమశివుని గురించిన తపము విడిచి ప్రణయ తపమున మునిగెను. అతనికి జయంతి వలన దేవయాని అనే కూతురు కలిగెను.
శుక్రునకంతవరకు ఉర్జస్వతియను భార్యయుండెను. ఆమె వలన నతనికి చండుడు, అమర్కుడు, త్రాష్టుడు, ధరాత్రుడు అనువారు కలిగియుండిరి.
శుక్రుడు సంతానము కలిగిన పిమ్మట జయంతితో సుఖము చాలించి మరల పట్టణమునకు వచ్చువరకచట బృహస్పతి తన రూపమున వారికి కాని పని బోధనంతము జేయుచుండెను. దానవులతనిని నిజమైనవాడని నమ్మి అతని బోధలు వినుచుండిరి. అదిగని శుక్రుడు ఉగ్రుడై బృహస్పతిని మÖర్ఖా! నీవు మావారి కంత పనికిమాలిన బోధచేసితివి కనుక మతి భ్రష్టుడవై తిరుగు పొమ్మని శపించెను.
దానితో బృహస్పతి పిచ్చివానివలె తిరుగుచూ ఒకనాడు అన్నగారి ఆశ్రమమునకు వచ్చెను. బృహస్పతి అన్నగారి పేరు ఉతధ్యముడు. ఆయన ఒక యజ్ఞమునకై వెళ్లి యుండెను. ఆశ్రమమున అతని భార్య మమత యొక్కతే ఉండెను. ఆమె పూర్ణ గర్పిణిగా నుండెను. అయినను ఆమెను చూడగానే బృహస్పతికి మతి చెలించి ఆమె యెంతవారించినను వినక బలవంతమున నామెపైబడి రమించెను. అపుడు గర్భస్థ శిశువు బృహస్పతిపై యలిగి అతని వీర్యమును వెడల దన్నగా ఆ వీర్యము వెలుపలబడి బాలుడు కాగా అతనిని నీవే భరింపుమని ఆ వదినా మరదులిద్దరు తగాదా పడిరి. అది గని మరుత్తులు వచ్చి ఆ బాలుడికి భరద్వాజుడని పేరు పెట్టి వారు కొని వెళ్లిరి.
మమత గర్భస్థ శిశువు బృహస్పతిని దూషించెను కనుక బృహస్పతి అతని కంధుడవు కమ్మని శాపముబెట్టి తాను తన దారిన వెళ్లెను. అతడు వెళ్లిన పిమ్మట ఉతద్యముడు వచ్చి భార్య జరిగిన సంగతి విన్నవింపగా అతనిపై యలిగి వాని భార్యను పరుడు రమించుగాక అని శాపము బెట్టెను. ఈ అంధ బాలుడే తరువాత దీర్ఘతముడనే ఋషి యయ్యెను. ఇతని చరిత్ర మనకు పూర్ణ గర్బిణియైన తర్వాత స్త్రీతో రమించరాదని అపుడు కలుగబోవు సంతానమున కేదేని అంగవైకల్యమేర్పడునని బోధించును.
చంద్రుడు అత్రి మహర్షి కుమారుడు. అతని తండ్రి విద్యాభ్యాసమునకై బృహస్పతి చెంతకు పంపెను.
అతడు నవయౌవనమున నుండెను. అతడు చదువుచున్న కాలమున బృహస్పతి ఇంద్రుని యాగమునకై వెళ్ళవలసి వచ్చెను. అపుడాశ్రమమున తారా చంద్రులిద్దŠరేయుండిరి. అంత తార స్వాతంత్య్రము వహించి చంద్రుని కామకేళికి పురికొల్పి అతనతో యధేచ్చగా క్రీడించసాగెను. అపుడామె కొన్ని దినములకు గర్భము ధరించెను. అది నానాటికి వృద్ధి పొంది ప్రసవదినములు దగ్గర పడుచుండ బృహస్పతి వచ్చి జరిగిన విషయము తెలుసుకొని ఖిన్నుడయ్యెను.
తార తన కుటీరమును విడిచి చంద్రుని కుటీరముననే నివసించుచుండెను. బృహస్పతి తన భార్యను మరల ఇంటికి రమ్మని పిలిచెను. కాని చంద్రుడామెను పంపుట కంగీకరించలేదు. దానవ బలగమంత నతనివైపుండిరి. అంత బృహస్పతి వెళ్లి బ్రహ్మతో తనకు జరిగిన యన్యాయము జెప్పుకొనగా అతడు వచ్చి ఎలాగో ఒప్పించి తారను మళ్ళీ బృహస్పతి కిప్పించెను. కాని ఈ వివాద సమయముననే తార ప్రసవించి కుమారుని గనెను. అపుడా బాలుని కొరకు చంద్రబృహస్పతుల నడుమ మరల కయ్యము రేగెను. అంత బ్రహ్మ యది చూచి తారనాబాలుడెవరికి కలిగెననియడిగి అతనిని చంద్రునికి తారను బృహస్పతి కిప్పించెను. పిమ్మట చంద్రుడా బాలుని తోడుకొని వెళ్ళగా అతనిని రోహిణిదేవి పెంచి పెద్ద చేసెను. ఆ బాలునికి వారు బుధుడు అని పేరు పెట్టుకొనిరి.
తార చంద్రుని మరచి బృహస్పతితో కాపురము చేయసాగిన పిమ్మట వారికి కచుడు, శంయుడు అని ఇద్దరు కుమారులు కలిగిరి.
శుక్రుడు శివుని గురించి తపము చేసిన పిమ్మట మృత సంజీవిని విద్యను పొందుట దేవతల కసూయగా నుండెను. దాని నెటులైన తాము గూడ సంపాదించుకొనవలెనని తహతహ పడుచుండిరి. అందువలన వారు బృహస్పతి కుమారుడైన కచుని శుక్రాచార్యుని దగ్గరకు శిష్యునిగా పంపిరి. అతడు ఎంతో వినయవిధేయతలు గలిగి శుక్రాచార్యుని సేవించు చుండెను. కాని అతడు శుక్రుని చెంత విద్య నభ్యసించుట దానవుల కిష్టము లేదు. అందువలన వారతనిని రెండు మÖడు తడవలు చంపిరి. కాని అతడు దేవయాని కోరికపై అతనిని బ్రతికించుచుండెను.
చివరగా వారతనిని చంపి దహనము చేసి ఆ బూడిదను సురలో గలిపి
శుక్రునకు త్రావించిరి. అప్పుడు కచుడు ఇంటికి రానందుకు వగచుచు దేవయాని మరల తండ్రితో మొరపెట్టగా అతడు దివ్యదృష్టితో చూచుకొనగా కచుడు తన కడుపునందే యుండెను.
అపుడు శుక్రుడతనిని బ్రతికించి మృత సంజీవనిని ఉపదేశించి తన పొట్ట చించుకొని వచ్చి మరల తనను బ్రతికించుమని చెప్పెను. అంత శుక్రుని యాజ్ఞపై అతడు అతని యుదరమును చించుకొని బయటకు వచ్చి మరల బ్రతికించెను.
దానితో కచునికి వచ్చిన పని పూర్తి కాగా గురువు దగ్గర సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళదలచగా దేవయాని అతనిని నిన్ను ప్రేమించుచున్నాను గనుక నన్ను వివాహము జేసి కొమ్మనెను. అందుకతడు నీవు గురు పుత్రివి కనుక నిన్నెట్లు వివాహ మాడగలను. ఇది ధర్మవిరుద్ధమని పలుక దేవయాని కినిసి మÖర్ఖుడా! నీవు మా యాశలన్నీ వమ్ము చేసితిని కనుక మా చెంత నేర్చిన విద్యను నీకు ఫలించక బోవుగాక అని శపించెను.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి