1. తిరుమల వాసుని దేవాలయంలోన దేవకన్యలు నాట్యమాడేరు. మహాలక్ష్మీ పాటలే పాడేను. వేంకటేశ్వరుడు సంతోషించేను.
2. శ్రీ వేంకటేశ్వరుని అసలైన పూజలు అర్ధరాత్రి వేళజరిగేను. పది వేల దేవతలు బంగారు పూలతో ప్రతిరాత్రి పూజలే చేసేరు.
3. శ్రీవేంకటేశ్వరుని గర్భగుడి శిఖరాన ఏడు శిరస్సుల పాము వెలసేను. గర్భగుడి చుట్టును సింహమొక్కటి తిరిగి గర్జించి మాయమైపోయేను.
4. శ్రీ వేంకటేశ్వరుని గర్భగుడిలోకి ఏడు శిరస్సుల పాము వచ్చి బ్రాహ్మణ రూపంబు దాల్చి వేద మంత్రములను చదివేను.
5. దనమదముత దైవంబునే మరిచి గోవిందాయను భక్తి మరిచేరు.
6. వేంకటేశ్వరుని గుడిలో మాలమాదిగలెల్ల వేదమంత్రములు చదివేరు. మహ్మదీయలు వేంకటేశ్వరుడు మాదేవుడనుచు ఆటలాడిపాటలు పాడేరు.
7. వేంకటేశ్వరుని కళ్యాణ విగ్రహము క్షణములో మాయమైపోయేను. అలివేలు మంగమ్మ గుడిలోన కనపడేను. అందరూ వింతగా చూసేరు.
8. సాదు రూపమున ఆంజనేయ స్వామి వేంకటేశ్వరుని కొలువ వచ్చేను. కొండపైనున్నట్టి కోతులన్నియు చేరి మారుతిని గుర్తించి కొలిచేను.
9. కంచి కామాక్షమ్మ మధుర మీనాక్షమ్మ కలకత్తా కాళీయు కనక దుర్గమ్మ సిద్ది విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యస్వామి వేంకటేశ్వరునని కొలువ వచ్చేరు.
10. గజదొంగ ఈ ఆరుగురు వేంకటేశ్వరుని సొమ్మును దోచుకొని పోవగా వచ్చేరు. ఏడవ దొంగగా ఏడు కొండలవాడు వారి సొమ్ము దోచి పంపేను.
11. భద్రాచలంలోని శ్రీరామ విగ్రహము భక్తులతో మాట్లాడేను.
12. బెంగుళూర్‌లోన వైశ్య కులమున మహాలక్ష్మీ పుట్టేను. ఆమె కన్యగ నుండి నమ్మి చేరిన వార్ని ఐశ్వర్య వంతులుగా జేసేను.
13. సిరివెళ్ళ హనుమంతుడు నిజరూపమును దాల్చి సిగపట్టి పాపులను చంపేను. రామభక్తులను రమ్యముగా ప్రేమించి రక్షణగా తానుండి బ్రోచేను.
14. హంపి ఆంజనేయ స్వామి అరచి మÖల్గేను. మÖల్గు విన్న వారు నీల్గి చచ్చేరు. అప్ప్పుడే నారాక హనుమన్న చెప్పేను.
15. భూమి గడగడ వణికి నిలిచేను పర్వతములు కూలిపోయేను.
16. కొండవీటి సీమ దుర్గంబు లోపల భగ భగ మంటలే పుట్టేను.
17. సర్వరూపమున నక్షత్రములు పుట్టేను. మతి లేను ధ్వనులను చేసేను. నుండి కొండలోనుండి మడుగులోని నీరు నక్షత్రములు త్రాగిపోయేను.
18. బ్రాహ్మణులు మాదిగలు వాదమాడేరు. వాదమున మాదిగల మాట చెల్లెను.
19. తాడిపత్రియందు మేకొకటి వచ్చేను. ప్రజలతో మనిషిలా మాట్లాడేను. ఇది ఏమి చిత్రమని ప్రజలెల్ల గుమిగూడ క్షణములో మాయమైపోయేను.
20. గోల్కొండయందు కొంగ మాట్లాడును. వురవకొండ యందు కోడి మాట్లాడును. తాడిపత్రి యందు మేక మాట్లాడును మేక కడుపులోన మనిషి పుట్టేను.
21. తోకలేని మేక పుట్టేను. కలికాలమును దలచి యేడ్చేను.
22. కరువు కాటకాలు వచ్చేను. కోడిగ్రుడ్డుతో బియ్యం కొలిచేరు.
23. రాజకీయ మనగ ఏమిటో తెలియని రంగడు లింగడు నిలిచేరు. రాజకీయ మనుచు వూరిలోని ప్రజలను వేయి చీలికలు చేసేరు.
24. కొంగ కడుపులోన కోతిపుట్టు. కుక్క కడుపులోన కోడి ఒక్కటి పుట్టు, కుక్క పందికి పాలు ఇచ్చేను.
25. ఆకాశమంతయు ఎర్రగా మారేను. అర్ధరాత్రి వేళ రక్త వర్షము కరిసేను. అడవిలో జంతువులు వూర్లపై పడి సంచరించేను, దుర్మార్గులందరిని చంపేను.
26. మనిషి మనిషిని చంపి మాంసంబుగా జేసి మణుగొక్క నూటికి అమ్మేరు.
27. పరమ చండాలు లే పుడతారు. భక్తులను హీనంగా చూచేరు, భక్తులైనవారు శక్తులుగా మారేరు. యాగంటి క్షేత్రంబు చేరేరు.
28. రామ రామా యను ధ్యానంబు మరిచేరు. ప్రేమ ప్రేమ యని పాడయ్యి పోయేరు.
29. ఘనమైన వాహనము చేసేరు గాలిలో గ్రద్దలో పోయేను.
30. కప్ప కోడి కూసేను. పాము కప్పలాగ అరిచేను కప్పలు పాములు కలిసి జీవించే రోజులువచ్చేను.
31. ఆంధ్రదేశములోన అనసూయ పేరుతో ధర్మదేవత పుట్టేను. అన్నపూర్ణగా వెలిసి అందరిని ప్రేమించు. ఆమెయే నా దూతని తెలుసుకోండి.
32. ఉత్తర దిక్కున వురుము ఒక్కటి పుట్టి దక్షిణమున వచ్చి మెరిసేను. వేయి సూర్యుల వెలుగునిచ్చేను, అది చూచినవారు అందులై పోయేరు.
33. నాలుగు సముద్రాల నడుమ నక్కేయున్న సొమ్ములన్ని నీటతేలేను, సర్ప రూపము దాల్చి సముద్రమే దాటి శ్రీశైలం వచ్చి చేరేను.
34. సిద్దయ్య పుట్టేను చివరికులమునందు, శివరాత్రి కనిపించు నమ్మండి. ఘోర తపమును జేసి నాలోన జేరేను, అతడే శివుడని తెలుసుకోండి.
35. కొమ్మలతో ఒక మనిషి పుట్టేను, కోటి మందిని చంపి పోయేను.
36. చంద్రగిరి దుర్గాన శక్తులే పుట్టేను, పదివేల యేనుగులు వెంకటవచ్చేను, పల్లె పల్లెలు తిరిగి పాపాత్ములను బట్టి ప్రాణాలు తీసేను.
37. పుంజు పెట్టగ మారేను, పెట్ట పుంజుగ మారు ఇది ఏమి విచిత్రమో తెలుసుకోండి.
38. బెంగుళూర్‌లోని బసవన్ని విగ్రహము పదిరెట్లు పెరగేను, కోపముతో రంకేలు వేయుచు పాపులను పసిగట్టి చంపేను.
39. కృష్ణానది యందు రక్తము ప్రవహించు యుగ మార్పు దాని చిహ్మము కోతులన్ని చేరి నృత్యంబు జేసేను, రామ రామ యనుచు మైమరిచిపాడేను.
41. తెలుగు దేశములోన ఉత్తర దీవిలోన ఉత్పాతములు పుట్టు నమ్మండయ. గ్రామ గ్రామంబులే గంగపాలైపోవు వేలది ప్రజలందు చచ్చేరు.
42. ఆకలి బాధతో ఏకకాలమున పదహారు పట్నాలు కొళ్ళగొట్టేరు.
43. పదుగురి మేలుకై ప్రాణమిచ్చేవారు బ్రహ్మరథమున నన్ను జేరేరు.
44. అక్షయ సం॥ అక్షంతు లేసేటి ఐనవారే లేకపోయేరు. అనగా 2046లో.
45. సాదు రూపంబున ఆంజనేయస్వామి వేంకటేశ్వరుని కొలువ వచ్చేను. కొండపైనున్నట్టి కోతులన్ని చేరి మారుతిని గుర్తించి కొలిచేను.
46. ఆనాటి ఆంజనేయ స్వామి కొండలను మోయగా విన్నాము, ఈనాటి భక్తులు అదియోమి ఖర్మమో కుండలైననూ మోయ వెరచేరు.
47. కంచి కామాక్షమ్మ మధుర మీనాక్షమ్మ కలకత్తా కాళీయు కనక దుర్గమ్మ సిద్ది విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యస్వామి వేంకటేశ్వరునని కొలువ వచ్చేరు.
48. కదిరికి ఆమడ దూరమున నున్నట్టి మర్రి చెట్టు వద్ద తిమ్మమ్మ వెలసేను. పడరాని కష్టాలు పడిన సాద్విమణి మహిమలెన్నో చూపి సహగమనమయ్యేను.
49. కావేరినది పొంగి ఘనమైన పట్నాలు రూపనామం లేక పోయేను, లక్షలాది ప్రజలు నిలువ నీడలేక పక్షులై తిరిగేరు.
50. ఉత్తరాదిలోన మర్రి చెట్టులో నుండి కొమ్ములతో ఒక మనిషి పుట్టేను. మహిమలెన్నో చూపి దైవము నేననుచు చెప్పేను.
51. పగటివేళ ఆకాశము నుండి నక్షత్రములురాలు, పిడుగులు పడేను. బ్రహ్మాండమైనట్టి విషగాలి వీచి లక్షలాది ప్రజలు చచ్చేరు.
52. మహానందికి ఉత్తరాన ముప్పై మంది మునులు జన్మించెదరు, ప్రజలకు వారు మహిమలు చూపించేరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి