1. కం. శ్రీ వాణీ కాత్యాయని
భావాంబర పథములందు పరుగులిడంగన్
భావాతీతుండగు న
ద్దేవున్ జూపెట్టు గురుని ధీమతి సంతున్
2. తే.గీ. తల్లి మాణిక్యాంబ సుధా స్రవంతి
తండ్రి వెంకటాచలము బుదాసువర్తి
తలప లక్ష్మయ్య గురుడు వేదాంత మÖర్తి
అయిన కలిమÖర్తి మా గురుండాత్మపర్తి
3. తే.గీ. మదిని వైరాగ్య భావంబు మాన్పినన్ను
సతము సంసారమందున సాగునట్లు
రాజయోగాన నిల్పిన రమ్యమÖర్తి
లీల నన్నేలు మద్గురు లింగమÖర్తి
--------------
ఆ. వె. కులము మతములనెడి కొలతలు బెట్టక
అందర నొకరీతి ఆదరించి
చేరదీసి శిష్యశ్రేష్ఠుల దీర్చిన
మృదు పదానువర్తి అంగమÖర్తి 7
8. గీత మాలిక. వేయి నెలవంకలను గన్న విమలమÖర్తి
నిండు నూరేండ్ల ఆయువు నీ కొసంగి
నిత్యమారోగ్యదేవత నీదు హృదిని
తాండవం సేయుచుండ గ్రంథాలు నూర్లు
కూర్చవలెనని గోవిందు గోరుకొందు
లలిత సుందరమైనట్టి లలిత నుతిని
అంకితంబును గొనుమయ్య అమలమÖర్తి
రంగదమలాంతరంగ శ్రీ లింగమÖర్తి
9. తే.గీ. మంగళము నీకు గురువర మంగళంబు
మంగళము దివ్యగుణ సాంద్ర మంగళంబు
మంగళము నీకు మీనాక్షి మాత సహిత
మంగళము సుందరేశ్వరా! మంగళంబు
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి