మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

1, నవంబర్ 2026, ఆదివారం

గురునానక్...

సిక్కుమతానికి మÖలం ఏకేశ్వరోపాసన. శ్రీకృస్ణుడి భగవద్గీత కారణంగా ఆ దైవం జగద్గురువుగా ఆరాధింపబడుతున్నట్లే, సిక్కులు సైతం తమ దైవాన్ని ‘వాహెగురు’ అని సంబోధిస్తారు. అన్ని మతాలకూ ఏదో ఒక పవిత్ర క్షేత్రం ఉన్నట్లుగానే సిక్కులకు అమృత్‌సర్‌లోని స్వర్ణమందిరం అత్యంత పవిత్రమైంది. సిక్కు మతాన్ని స్థాపించిన మహానుభావుడు గురునానక్.

నానక్‌కు తల్లిదండ్రులు పెట్టిన పేరు దేవ్‌జీ. తల్లి ప్రేమతో ఇతన్ని నానక్ అని పిలిచేది. అలా ఈ మహానుభావుడు నానక్ దేవ్‌జీగా తన చిన్నతనంలో అందరిచేత గుర్తింపబడ్డాడు. నానక్ దేవ్‌జి తండ్రి మెహతా. తల్లి త్రిపుర. వీళ్లది బ్రాహ్మణ కుటుంబం. మెహతా గ్రామ కరణంగా విధులు నిర్వహించేవాడు. తల్వండీ గ్రామానికి ఆయన పట్వారి.

నానక్ దేవ్‌కు చిన్నతనం నుంచీ ప్రశ్నించడం అýవాటు. అలా ఎందుకు చేయాలి. ఇలా ఎందుకు పూజించాలి, అసలు దైవం అంటే ఎవరు? దైవాలు అంత మంది ఎందుకున్నారు? ఎవరి మతానికి తగ్గ దైవం ఆమతానికే పరిమితమా... అంటూ తల్లినీ తండ్రినీ ప్రశ్నించేవాడు. తండ్రి నవ్వుతూ ప్రశ్నోపనిషత్తు చదువు...  అన్నీ తెలుస్తాయి అనేవాడు. పదమÖడు సంవత్సరాల వయస్సు వచ్చే సరికే వివిధ మతాలలోని మÖలాల గురించి తల్లికి చెప్పేవాడు. తల్లి త్రిపుర ఆశ్చర్యంగా వినేది. ఆ వయస్సులో మతపరంగా ఉపనయనం చేసి జంధ్యం వేయాలని తల్లిదండ్రులు ప్రయత్నిస్తే నిరాకరించాడు. భగవంతుడు జంధ్యానికి మాత్రమే పరిమితం కాదనీ, జంధ్యంతో పాటు శరీరం మట్టిలో కలిసిపోతుందని చెప్పేవాడు.అన్ని మతాలకూ పరమాత్ముడు ఒక్కడే ననీ, ఆ భావన ఆత్మలో ఉండాలే కాని నూలుపోగుకే పరిమితం కాదని వాదించాడు. నానక్ దేవ్‌జీకి ఒక అక్కఉండేది. ఆమె పేరు నాన్కి. ఒక రోజు తన తమ్ముడు నిద్రిస్తుండగా అతని నుదురుపై వెలుగుతున్న జ్యోతిని గమనించింది. కాని ఆమె ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పలేదు. నానక్ ఎన్నోసార్లు ఇల్లు వదిలి వెళ్లి పోయే వాడు. అలా వెళ్లి ఎక్కడెక్కడో తిరుగుతూ సూఫీ గురువులను కలిసేవాడు. సంత్ కబీర్, రవిదాస్ లాంటి తత్త్వవేత్తలను కలిశాడు. పలు మతాల్లోని కొత్తకొత్త మÖల సూత్రాలను తెలుసుకొని ఇంటికి తిరిగి వచ్చి తల్లికి చెప్పేవాడు. తన 24వ యేట పంజాబ్ రాష్ట్రంలోని బలాలకు చెందిన మÖల చంద్ర అనే వ్యాపారి కూతురు సులేఖినిని వివాహం చేసుకొన్నాడు. శ్రీచంద్రుడు, ýక్ష్మిదాస్ అనే కుమారులు ఈ దంపతులకు జన్మించారు.

నానక్ దేవ్‌జీ అక్క నాన్కి భర్త జైరామ్, సుల్తాన్‌పూర్ ప్రభుత్వ ధాన్యాగారంలో మేనేజర్‌గా ఉద్యోగం ఇప్పించాడు. అయితే 28 సంవత్సరాల వయస్సులో ఒక ఉదయం నానక్ దేవ్‌జీ నదీ స్నానానికి వెళ్తానని చెప్పి వారం రోజులు తిరిగి ఎవరికీ కనుపించలేదు. తిరిగి వచ్చి తాను దేవుని పవిత్రాత్మను నింపుకొన్నానని ప్రకటించుకొన్నాడు. ఆ తరవాత మతసామరస్య బోధనలతో ఒక కొత్త మతాన్ని వ్యాప్తి చేయడంర, బోధనలు చేయడం ప్రారంభించాడు. నానక్‌జి తొలి శిష్యురాలు ఆయన సోదరి నాన్కి. వేలాది కిలోమీటర్లు తిరుగుతూ భగవంతుని సందేశాన్ని ప్రబోధిస్తూ నాలుగు ప్రత్యేకమైన ప్రదేశాల్లో నాలుగు ప్రత్యేకమైన ప్రయాణాలు సాగించారు. వీటినే ఉదాసీలు అని పిలుస్తారు.

హిందూ, ఇస్లాం మతాలలో మౌలికమైన తేడా నానక్‌కు కనిపించలేదు. హిందూ మతంలోనూ, ఇస్లాం మతంలోనూ దైవం ఒక్కడేనని నమ్ముతారు.  ఈ రెండు మతాల మÖల సిద్ధాంతాల సమ్మేళనమే సిక్కు మతం. ఇలా మత సామరస్యం కోసం పాటుపడి ఏకేశ్వరీ సిద్ధాంతం ద్వారా కొత్త నిర్వచనం చెప్పగలిగిన గురువు నానక్. సిక్కు మతానికి ఇతనే ఆద్యుడు ప్రస్తుతం ఈ మతం మరింత వృద్ధి చెంది ఔన్నత్యాన్ని పొందుతోంది. గురునానక్ దైవాంశ సంభూతుడు, నిత్య వందనీయుడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి