వివిధ వర్ణ విలసితమైన సమాజం ఒక న్యూటన్ వర్ణ చక్రం. ఈ చక్రాన్ని గిరగిరా త్రిప్పి ఇందులో ఏక ప్రభను దర్శింపచేయటానికి ఎందరెందరో మహర్షులు మహాపురుషులు ఎంతో కాలం నుండి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఈ దేశంలో ముక్తికోసం మతానికో మార్గం ఉంది. అట్లా మార్గాలెన్నో ఉన్నా సనాతనం నుండి యిది కర్మభూమి అని పేరు మోసింది కాబట్టి ఇక్కడ స్వర్గాని కిగాని, మోక్షానికిగాని కర్మయోగమే ప్రాముఖ్యం వహి స్తుంది. వేదాలన్ని యజ్ఞయాగాల రూపంలో కర్మనూర్గాన్నే ఎక్కువగా ప్రతిపాదిస్తవి. ఈ కర్మమార్గ శాస్త్రానికి పూర్వమీమాంస అని వ్యవహారం.
వేదాలలో మంత్రభాగాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు అని మÖడు భాగాలున్నవి. వానిలో ఉపనిషత్తులు కేవలం ఆధ్యాత్మిక విద్యకు మాత్రమే సంబంధించినవి కనుక అవి ప్రచారం అందుకున్న కాలంలో వ్యక్తికి ఆత్మానాత్మ జ్ఞానం కలుగకుండ కేవలం కర్మాచరణం వల్లనే ముక్తి సాధ్యంకాదని వేదాంతులు కర్మయోగం పై జ్ఞానయోగానికి పట్టం కట్టినారు. ఉత్తరభారతంలో మహర్షులంతా ఈ విధంగా జ్ఞానయోగానికి ప్రాముఖ్య మీయగా దాని స్థానంలో దక్షిణదేశంలో నాయనమార్లు ఆళ్వారులు కర్మయోగం బహుళ ద్రవ్యోపేతం శారీరక శ్రమయుక్తం కాగా, జ్ఞానయోగం మేధా బలప్రధానం కాబట్టి ఈ రెండూ సామాన్యులకు సాధ్యంకారని భక్తి యోగాన్ని తెలిపినారు.
భారతీయుల మతసంస్కృతులకు రామాయణ మహాభారత భాగవతాలు మÖడు జీవగర్రలు. రామాయణ కథానాయకుడైన శ్రీరామచంద్రుడు సాక్షాత్తుగా దివ్యుడే కాగా మహాభారత కథానాయకులైన పాండవులు దేవతాంశగల మానవులై దివ్యాదివ్యులైనారు. ఇక భాగవతంలోని అవతారమÖర్తులంతా దివ్యులు. భక్తగణ మంతా అదివ్యులుగా
ఉన్నారు. రామాయణంలో శ్రీరాముడు కర్తవ్యనిష్టుడైన ధర్మవీరుడై ఒకేమాట, ఒకే బాణం, ఒకేపత్ని అనే ఆదర్శంపై నిలిచి లోకానికి గుర్వాజ్ఞాపరిపాలన కర్తవ్య నిష్ఠతా మÖలంగా కర్మయోగాన్ని బోధించినాడు.
ఇక మహాభారత నాయకుడైన అర్జునుడు తన కర్తవ్యపాలనలో ధర్మసమÖ్మడుడు కాగా శ్రీకృష్ణు డతనికి జ్ఞానోపదేశం చేసి కన్నులు తెరిపించవలసి వచ్చింది. ఈ విధంగా రామాయణం కర్మయోగాన్ని, మహాభారతం జ్ఞానయోగాన్ని భారతీయుల కందించగా భాగవతం ఆస్తి కలోకానికి భక్తియోగాన్ని పంచి పెట్టింది. భాగవతం వ్యాసభగవానుని చరమాంకంలో జరిగిన రచన. అప్పటివర కాయన కర్మప్రధానమైన వేదరాశినంతా క్షుణ్ణంగా పరిశీలించి అవగాహన చేసికొని దాన్ని ఋగ్యజుస్సామాధర్వణాలుగా వింగడించినాడు. పురాణ వాజ్మయాన్నంతా అవలోడనం చేసి పునర్వ్యవస్థీకరించినాడు. కేవల జ్ఞాన ప్రధానమైన బ్రహ్మసూత్ర రచన చేసినాడు. కురు పాండవ వంశాలకు కుదురై సుదీర్ఘజీవితం గడిపి ఆ వంశాల యొక్క ఉత్థానపతనాలనే ప్రకృతి ధర్మాన్ని కడముట్ట తిలకించి మనకు ప్రథమ మాహాతి హాసమైన భారతానికి జయకావ్యం పేర వస్తుసంచయం. చేసిపెట్టినాడు. ఈ విధంగా ఆయన భారతీయ సంస్కృతిలోని కర్మ జ్ఞానయోగాలసారాంశాన్ని మÖలమట్టంగా ఎరిగి చివరకు భక్తియోగంలో విశ్రమించి భాగవత రచన చేసినాడు.
ఈనాడు తెలుగునాట రామాయణానికంటె మహా భారత భాగవతాలకే ఎక్కువ ప్రాచుర్య ప్రాశస్త్వాలు నిలిచిపోయినవి. అవి ఒకటి జ్ఞానయోగాన్ని బోధించగా మరో కటి భక్తియోగాన్ని అందిస్తున్నవి. భక్తి అంటే తనను భగవంతునితో చేర్చేది తప్ప మరొకటి కాదు. ఈ విషయానికి మనమెంతో దూరం వెళ్లనక్కర లేదు. భారత భాగవతాల యొక్క పేర్లను, ఆంధ్రంలోని వాని వాని కృత్యాదులను పరిశీలిస్తేనే చాలు తేలిపోతుంది. భాగవతం అంటే భగవంతునికి సంబంధించింది అని తాత్పర్యం. అందుచేత దానిలో అతని యొక్క అవతారాలు, వారితోపాటు ప్రహ్లాద నారదాది వ్యాసాంబరీష శుకాది భక్తుల కథలు వర్ణింపబడినవి.
భాగవతం భక్తిప్రధానమయింది. భక్తియోగం భగవంతునికి ఒక ఆకారాన్ని అంగీకరించింది కాబట్టి సగుణ భక్తిలోని శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం అనే నవవిధ భక్తులు దానిలో విస్తరింపబడినవి. అందుచేత దాన్ని పోతనగారు “శ్రీకైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లో కరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభ కున” అని నేరుగా సగుణమార్గాన్ని ఉద్ఘాటిస్తూ ప్రారంభించినాడు.
ఇక మహాభారత విషయానికి వచ్చినపుడు అది భరతవంశీయులకు సంబంధించిన గాథ అయినా “యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నకుత్రచిత” అని “యన్న భారతే తన్న భారతే” అని ప్రశస్తిని పొందింది. భారతీయులంటే ఎవరు? భ అంటే ప్రకాశం కనుక విజ్ఞాన ప్రకాశంలో నిరంతరం రతులై ఉండేవారు భారతీయులు. ఒకప్పుడు తమ విజ్ఞానంతో ప్రపంచాన్నంతా భరించినవారు భారతీయులు.
ఆంధ్రమహాభారతం మనకేమి బోధిస్తుంది? వాగనుశాసనుడైన నన్నయగారు దాన్ని గురించి “ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, ఆధ్యాత్మవిదులు వేదాంత మనియు” అని వివరించినాడు. కనుక మహాభారతం యొక్క ముఖ్యతాత్పర్యం దాని పేరులోనే మనకు తెలిసి పోతుంది. మహాభారతానికి మణిపూస అయిన భగవద్గీతలో “నహిజ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే - సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్త్యతే” - అని శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించినాడు గదా!
రాజరాజు నన్నయగారిని “జననుత కృష్ణద్వైపా, యనముని వృషభాభిహిత మహాభారత బద్దనిరూపితార్థమేర్పడ, తెనుగు రచియింపుము” అని కోరినాడు. కాబట్టి మహాభారతంలో రాజరాజుగారు కోరిన నిబద్దనిరూపితార్థం ఎక్కడుంది అని ఆలోచిస్తే ఆ భాగం యింకా అనువాదంలో నన్నయగారి పాలబడనే లేదని పిస్తుంది.
మనమొక మహావృక్షానికి బీజావాపనం చేసినపుడు అది మొలిచి చెట్టుగా పెరిగి పూచి కాచి ఆ కాయలు పక్వానికి వచ్చినపుడుగాని దానిలోని సారంగాని రుచిగాని తెలియదు. అదేవిధంగా ఒక కవి ఒక మహాకావ్యాన్ని ప్రారంభించినపుడు గూడ కథను సమకూర్చుకుని అందలి ప్రధానపాత్రలను నిర్ణయించుకుని వాని నుచిత రీతిగా పోషించి ఉపసంహరించినపుడే కవి నిర్ణయించు కున్న అర్థప్రణాళిక దాసిలో రూపుకడుతుంది. కనుక నన్నయగారు వ్యాసభారతం ఏ విషయాన్ని నిరూపిస్తుందో దాన్ని తెల్లం చేయటానికే ఆయన భారత రచనకు శ్రీకారం చుట్టినా ఆ భాగం వరకింకా చేరకుండానే అర్థాంతరంగా నన్నయగారు అరణ్యంలోనే ఆగిపోయినారు. ఆయన తర్వాత యిన్నూరేండ్లకు మళ్లీ మహాభారత పారిజాతానికి ప్రోదిచేయటానికి తిక్కనగారు కంకణం కట్టుకొని తెరకెక్కినాడు. మహాభారతంలో ఆ కావ్యపరమార్థం - అనగా వ్యాసమహర్షి యొక్క బద్దనిరూపితార్థం భీష్మపర్వంలో భగవద్గీతా బోధతో ప్రారంభమై శాంత్యనుశాసనిక అశ్వమేథాలతో పరిపుష్టమయింది కాబట్టి ఆ భాగమంతా తిక్కనగారి పాలనే బడింది.
కర్మయోగ భక్తియోగాల కంటె మహాభారతకారునిది జ్ఞానయోగ దృష్టి అని మొదలే మనవి చేసినాను. నన్నయగారి నాటికి హిందూ సంఘంలో శైవ వైష్ణవులే కాక బ్రహ్మవాదులు, హైరణ్యగర్బులు, గాణాపత్యులు, సౌరులు, కౌమారులు, శాక్తేయులు ఇంకా చాలా తెగల వారున్నట్టున్నారు. ఆయన వారిలో ఎవరికైనా సృష్టికర్త లైన త్రిమÖర్తులు మాత్రమే ముఖ్యమని పురుషత్రయైక వాదాన్ని నిలుపుదామనుకున్నాడేమో! అందుచేత “శ్రీవా ణిగిరి జాశ్చిరాయ దధతోవక్షో ముఖాంగేషుయే - లోకానాం స్థితిఇమావహన్త్య నిహతాం స్త్రీపుంసయోగో ద్భవాం, తేవేదత్రయమÖర్తయ స్త్రీపురుషా స్సంపూజి తావస్సురైః“ అని వేదత్రయ మÖర్తులు సృష్టి స్థితి లయరూపితార్థం కారకులైన త్రిమÖర్తుల స్తుతితో ప్రారంభించినాడు. కాని తిక్కనగారి కాలం వచ్చేనాటికి కాలం మారింది. మతం ఒక మౌఢ్యమై శైవ వైష్ణవులు విజృభించి పరస్పరం ఖండించుకోసాగినారు. అందుచేత ఆయనకు ఆ యిద్దరిని సమాధానపరచి ఏకం చేయవలసిన అవసరం ఏర్పడింది. అందుకై ఆయన నన్నయగారి త్రిమÖర్తులను విడిచి “శ్రీయన గౌరీనాబరగు చెల్వకుచిత్త ముల్లవింప” అని ప్రారంభించి పరతత్వము గొల్చెద నిష్టసిద్ధికై అని ముగించినాడు. తిక్కనగారి దృష్టిలో ఈ ఒక్క పద్యమే సకల బ్రహ్మ - అనగా సకలదేవతల ప్రార్థన అయింది.
ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు ఉస్మా నియా విశ్వవిద్యాలయం వారి సంశోధిత మహాభారతం ఎనిమిదవ సంపుటానికి పీఠికగా హరిహరనాథ తత్వాన్ని వ్రాస్తూ తిక్కనగారి వ్యాసమహర్షి స్తుతి -
విద్వత్సంస్తవనీయ భవ్యకవితా వేశుండు విజ్ఞానసం
పద్విఖ్యాతుడు సంయమి ప్రకర సంభావాను భావ్యుండు కృ
ష్ణద్వైపాయను డర్ధిలోక హితనిష్ఠంబూని కావించె ధ
ర్మాద్వైతస్థితి భారతాఖ్య మగులేఖ్యంబైనయామ్నాయమున్ -
అనే పద్యంలోని ధర్మాద్వైత సమానాన్ని వివరిస్తూ వ్యాస మహర్షి పురుషార్థాలలో ధర్మానికి వేదాంతంలో అద్వైత నికి ప్రాధాన్యం కలిగేటట్లు భారతం రచించినాడని సోమయాజిగారి నిశ్చితాభిప్రాయమని చెప్పినాడు. నన్నయగారు భారతాన్ని ధర్మజ్ఞులకు ధర్మశాస్త్రం వేదాంతులు వేదాంతం అంటారని తెలిపినాడు గదా! వేదాంతుల యొక్క ఈశ్వరుడు నిరాకారమైన పర బ్రహ్మం. అతడు జ్ఞాన గమ్యుడేగాని భాగవత మతంవలె సాకారుడై మనశ్చక్షువులకు దర్శనమిచ్చేవాడు గాదు. అందుచేత తిక్కనగారు ఇదంతా బాగా ఆలోచించియే నన్నయగారు చెప్పిన ధర్మవేదాంతవాచకాలనేకం చేసి తాను ధర్మాద్వైతరూపాన్ని ప్రయోగించినా డనిపిస్తుంది.
వేదాంత పరంగా ఆలోచించినపుడు జ్ఞానులది యెపుడైనా తత్వదృష్టేగాని ఈశ్వరుడు స్త్రీపుంనపుం సకమా! శివుడా! కేశవుడా! అని కాదు. అధవా భక్తిమార్గానుసారం కొంతసేపటికి సాకారుడని అంగీకరించినా అతనికి రూపభేదమేగాని తత్వభేదం వస్తుభేదం లేదు. సృష్టి స్థితి లయాలకోసం ఎన్ని వేషాలు వేసినా అతడొక్కడే. అందుచేత మహాభారతంలో శివకేశలిద్దరికి సమప్రాధాన్యత కలిగింది.
అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపగా అశ్వత్థామకు శివుడు చూపినాడు. అర్జునునికి శ్రీకృష్ణుడు రథసారధి కాగా శివుడా రథం ముందు శూలపాణియై అదృశ్యంగా నడుస్తూ అర్జునుడు చంపవలసిన వారిని తన శూలంతో పొడిచి చంపుతూ పోయినాడు. యుద్ధారంభంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతా బోధ మిషతో ధర్మాధర్మాలు తెలిపి జ్ఞానోపదేశం చేయగా అనుశాసన పర్వంలో శివుడు పార్వతి కదే విషయం చెప్పినాడు. శాంతి పర్వంలో విష్ణు సహస్రనామ కీర్తనం ఉండగా అనుశాసనిక పర్వంలో శివ సహస్రనామ కీర్తన చేయబడింది.
తిక్కన గారి దృష్టిలో ఈ శివకేశవులు గాని శ్రీ గౌరులు గాని సాంఖ్యుల యొక్క ప్రకృతి పురుషులు తప్ప వేరు గాదు. సగుణ బ్రహ్మ ప్రపంచంలో ఎందరు దేవి దేవతలు లుదయించిన ఆ ప్రకృతి పురుషుల నుండియే కలిగినారు కనుక తిక్కన గారి విరాట పర్వంలోని ప్రథమ పద్యం ఒక్కటే విరాడ్రూ పునిలో ఉండే సకల బ్రహ్మ ప్రార్థన అయింది. ఇక ఈ ప్రకృతి పురుషులు కూడా వేరువేరు గాదు. ఒకేతత్వం యొక్క రెండువైపుల రూపాలు. అందుచేతనే ఆయన పరతత్వము గొల్పెద నిష్టసిద్ధికై అని ఆ ప్రకృతి పురుషుల నేకతత్వంగా తెలిపినాడు. శివస్య హృదయం విష్ణుశ్చ హృదయ గీతం శివః అనే శృతి ప్రమాణం మనకు ప్రబలంగా ఉన్న వైష్ణవులు గీతను పరమ ప్రమాణంగా నమ్మి అందులోని విభూతి యోగం చదువుతున్నా శైవుడు రుద్రాభిషేక సమయంలో నమకచమకాలతో శివుని యొక్క అనేక రూపాలకు నమస్కరిస్తున్నా వారికి శివకేశవ అభేదం మాత్రం అర్ధం కాలేదు, కాదు. వారు తమ తమ ప్రతిభాపాండిత్యాలనంతా తమ తమ యిష్టదైవాలకే ప్రాముఖ్యం సంతరించి తిక్కన దేవతలను నిరాకరించటానికి ఉపయోగించినారు. అందుచేత దైవభేదాన్ని నిరసించి ఆ తత్వంలోని సత్యస్వరూపాన్ని అవగతం చేయటానికి ఆంధ్రంలో మహాభారత భాగవతాలు అవతరించినవి.
ఈ తత్వం తెలుసుకోకుండా వాటిని మనం ఊరక ఎన్ని తడవలు పారాయణాలు చేసినా ఫలముండదు. ఈ యుగంలో శ్రీరామకృష్ణ పరమహంస హిందూమతంలోని శైవ వైష్ణవ శాక్తేయాలే గాక మ్లేచ్చమతాలైన యిస్లాం, క్రైస్తవాలను గూడ అచరణ పూర్వకంగా ఆసుష్టించి సర్వమతాలు మానవుని ఒకే గమ్యానికి చేర్చుతాయని నిశ్చయానికి వచ్చినాడు. అందుచేత మానవులకు మతతత్వం యొక్క ముఖ్యోద్దేశం అర్థమై వాని సారం తెలిసిననాడు అపుడిక మతం అనే ఒకపేరుతోనే అవసరం ఉండదు. ఉన్న మతాన్ని విడిచి పరమతానికి వెంపర్లాడ వలసిన స్థితి రాదు. మరో మతాన్ని ద్వేషించనవసరం ఉండదు. శైవులైనా, వైష్ణవులైనా, మహమ్మదీయులైనా చివరి కందరు చేరవలసింది ఆ పరమాత్మనే కాబట్టి పరహింసను పరిత్యజించి ధర్మబద్దులై తాము చేసే కర్మలన్ని భగవత్ప్రీతిగా భగవదర్పణంగా చేస్తుంటే చాలు. అంత కంటే పరమధర్మం మరొకటి ఉండదు. అదే ప్రపంచానికి మన మహాభారతáం యొక్క సందేశం
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి