మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, నవంబర్ 2026, సోమవారం

వైష్ణవభక్తి-పంచాచార్యులు


ప్రస్తుతం మన మతాలలో అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం అనే మÖడు మతాలు ప్రసిద్ధంగా ఉన్నవి. వానిలో మొదటిది అద్వైతం. దీనికి మÖలపురుషుడు శంకరుడు. అతని నాటికి భారతదేశంలో డెబ్బదినాలుగు మతాలుండగా, వాటినన్నింటినీ ఖండించి, ఏ పేరుతో పిలిచినా దైవం ఒక్కడేనని నిర్ధారించి తన యొక్క మతాన్ని స్థాపించినాడు. ఈ మతంలో, దేవుడందరికీ ఒక్కడే అయినందువల్ల యిది అద్వైతం అనబడింది. 

శంకరాచార్యుడు కేరళదేశంలోని కాలడిలో ఆర్యాంబ, శివగురువు అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించినాడు. అతనినాటికి ప్రధానమతం శైవమే. ఈ మతంలో శివుడొక్కడే పరదైవం, సృష్టి అంతా అతని చేతనే జరిగింది.

శంకరుని యొక్క కాలాన్ని గురించి యింకా ఒక స్థిర నిర్ణయం లేదుగాని, ఆయన మాత్రం మతకర్తలందరికీ ఆద్యుడు. అద్వైతం ఆయన సొంతమేమీ కాదు. అది ఉపనిషత్ప్రతిపాదితం. కాని, వానిలో అది దృశ్యాదృశ్యంగా ఉండగా, ఆయన దానిని స్పష్టపరిచి అందరికీ అందుబాటులోనికి తెచ్చినాడు.

ఈయన మతంలో పరబ్రహ్మం సాక్షీ మాత్రుడు మాత్రమే. సృష్టిక్రియనంతా ఆయన పరోక్షంగా, “మాయ” అనే శక్తి జరిపిస్తుంది. 

శంకరుని పిమ్మట అవతరించిన మహాపురుషుడు రామానుజాచార్యులు. ఈయన క్రీ.శ. 1014 పింగళ సంవత్సర చైత్ర శుద్ధ పంచమినాడు తమిళదేశంలోని శ్రీ పెరంబుదూరులో కాంతిమతి, ఆసూరి కేశవభట్టు అనే దంపతులకు జన్మించాడు. శంకరునివలెనే ఈయనగూడ మహాపండితుడు. అతనివలె ఈయన మతంలోగూడ పరబ్రహ్మం ఒక్కడే కాగా, శంకరుని పరబ్రహ్మం నిరాకారుడుకాగా, ఈయన పరబ్రహ్మం “ సాకారుడు. ఆయన పరబ్రహ్మం సంగరహితుడు. ఈయన  పరబ్రహ్మం అట్లాకాక చిదచిద్విశిష్ఠుడు. అనగా చిత్తు - అచిత్తుతో కూడినవాడు. చిత్ అనగా జీవుడు. అచిత్ అనగా ఈ ప్రక ృతి. 

శంకరుని మతంలో, ఈ స ృష్టినంతా పరబ్రహ్మం చేయడు. అతని పరోక్షంగా మాయాదేవి చేస్తుంది. “రామానుజుని మతంలో అట్లాగాదు. సాకారుడైన పరబ్రహ్మమే చేస్తాడు. వ ృక్షానికి బీజమొక్కటే కారణమైనా, అది నీరు  మరియు సూర్యరశ్మి లేకుంటే మొలకెత్తదు. అట్లాగే, పర బ్రహ్మంకూడ తనకు సత్తుచిత్తుల సహాయం లేకుంటే సృష్టిని చేయలేడు కనుక, సృష్టివేళలలో అవి అతని నుండి వేరయి, సహాయపడుతుంటవి. ప్రళయవేళలో మళ్లీ అతనితో ఏకమై ఒక్కటిగా కనిపిస్తుంటవి. అందువల్ల ఈయన మతం విశిష్టాద్వైతమయింది.

రామానుజుని పిమ్మట అవతరించిన, మళ్లీ అంతటి మహాపురుషుడు మధ్వాచార్యుడు. ఆయన క్రీ.శ. 1199 లో కర్ణాటకలోని ఉడిపి క్షేత్రానికి ఆగ్నేయంగా ఆరుమైళ్లలో ఉన్న ఈ “బెల్లి” అనే గ్రామంలో, వేదవతి, మధ్యగేహభట్టు అనే దంపతులకు వాయుదేవుని అంశతో జన్మించినాడు. ఈయన  రామానుజుని కంటె గొప్పపండితుడు. 

ఇతడు శంకరుని యొక్క అద్వైతాన్నీ, రామానుజుని విశిష్టాద్వైతాన్ని అంగీకరించలేదు. ఇతని మతంలో, జీవుడు ఈశ్వరునికి అంశభూతుడుగాడు, ఆయనవలెనే తానుగూడ స్వతంత్రుడు. సంసారానికి భార్యాభర్తలవలె, జీవుడు లేకుండ, ఈశ్వరుడొక్కడే ఈ సృష్టిని చేయలేడు. ఇది ఆయన “ సిద్ధాంతం. ఇట్లా, ఈ మతంలో జీవుడుగూడ ఈశ్వరునివలె  స్వతంత్రుడైనాడు. కాబట్టి యిది ద్వైతం. అనగా, యిద్దరి సమప్రాధాన్యంగల మతమయింది.

ఇక్కడ మనం రామానుజాచార్య, మధ్వాచార్యుల తండ్రుల పేర్లను బట్టి విచారించినట్లయితే ఈ రెండు మతాలు గూడ శంకరునిదైన స్మార్తం నుండే వేరైవిడివడినవని అనిపిస్తుంది.

మనకు లలాటం బ్రహ్మస్థానం. మనయొక్క మతం ఏదైనా, అవన్నీగూడ ఆ బ్రహ్మనుండి పుట్టినవే. అందువల్ల యిపుడు మనం మనయొక్క మతచిహ్నమైన తిలకాన్ని  లలాటంలో ధరిస్తున్నాం. 

శంకరుని మతం శైవమే, అయినా ఆయన మతంలో ఈ స ృష్టి అంతా మాయా కల్పితం. పరబ్రహ్మ సాక్షిమాత్రం, నిర్వికారం కనుక, అతడు ధరించిన విభూతియే అతని మతానికి సార్థకమై నిలిచింది. 

మనం తిలకంగా ధరించేవానిలో, విభూతి వైదికం, గంధాదులు పౌరాణికం. అందువల్ల విభూతి పై ఎవరుగూడ గంధంబొట్టు మళ్లీ పెట్టుకోరు.

రామానుజ, మధ్వాచార్యులిద్దరూ వైష్ణవులే. శంకరుడు శివుడే ప్రధాన దైవమనగా, అతనిని ఖండించి  విష్ణు పారమ్యాన్ని చాటిన వీరిద్దరిలోనూ, రామానుజుడు శ్రీరాముని స్వీకరించగా, మధ్వాచార్యులు శ్రీకృష్ణుని ప్రధాన  పురుషునిగా స్వీకరించినాడు. అంతేకాక, ఆయన స ృష్టికి మÖలంగా జీవుని, ఈశ్వరుని, ప్రకృతిని - మÖడింటినీ ప్రధానంగా అంగీకరించగా, ఈయన జీవేశ్వరులిద్దరినే  ప్రధానంగా అంగీకరించినాడు. అందువల్ల యిద్దరూ ఊర్ధ్వ  పుండ్రధారులే అయినా, రామానుజుడు త్రిపుండ్రధారికాగా, మధ్వాచార్యులు ద్విపుండ్రధారియైనాడు. ఇది వీరిద్దరికీ గల భేదం. 

రామానుజుని పిమ్మట, ఆయన స్థాపించిన విశిష్టాద్వైతం అనంతరం ఏ మార్పులూ పొందినట్లు లేదుగాని, మధ్వాచార్యుల ద్వైతం మాత్రం ఎంతో మార్పును సంతరించు కున్నది. మధ్వాచార్యుల పిమ్మట ఈ శ్రీకృష్ణ భక్తిమార్గంలో నింబార్కుడు, విష్ణుస్వామి, వల్లభాచార్యుడు, చైతన్య ప్రభువు అనేవారు ఉదయించి ఈ మార్గాన్నెంతో పుష్టిమంతంచేసారు.

మధ్వాచార్యుని పిమ్మట అవతరించిన మహా పురుషుడు నింబార్కుడు. ఈయన పన్నెండవ శతాబ్దంలో, బళ్లారి మండలంలోని ‘ముంజీ’ పట్టణంలో సరస్వతీ  జగన్నాథులనే బ్రాహ్మణ దంపతులకు జన్మించి, పెరిగిన పిమ్మట బృందావనం వెళ్లి అక్కడే స్థిరపడినాడు. ఈయన వేపచెట్టు క్రింద పుట్టినాడట. అందువల్ల ఇతనిని నింబార్కుడన్నారు. ఇతనికింకా నింబాదిత్యుడు, నిత్యానందుడు. నియమానందుడు, హరిప్రియుడు అనే పేర్లుగూడ ఏర్పడినవి. ఈయన పరమ నిష్ఠాగరిష్ఠుడై జీవితమంతా బ్రహ్మచర్యంలోనే గడిపినా, మధ్వాచార్యుడు స్థాపించిన ద్వైత మతాన్ని స్వీకరించి, అతడు ప్రవేశపెట్టిన కృష్ణ భక్తిలో ఈ రాధ లేకుంటే ఒంటరివాడైన కృష్ణునికి పూర్ణత్వం లేదని అతని జతకు రాధను ప్రవేశ పెట్టినాడు. దానిలో క ృష్ణభక్తి పరిపూర్ణత్వ మైంది, ఇతనికాలంనుండి రాధ గూడ అతనితో పాటు రంగం పైకి వచ్చింది.

పండరిలో పాండురంగనితో పాటు ఉండేది రుక్మాబాయియే అయినా, ఈ నింబార్కుని మతం ఇపుడు పండరిప్రాంతంలోనే ఎక్కువ ప్రచారంలో ఉంది. వీరు , మధ్వాచార్యుని తిలకంలో నడుమ మరొక చుక్క బొట్టును పెట్టుకుంటారు. 

ఈ మతంలో నింబార్కుని పిమ్మట చెప్పదగినవాడు విష్ణుస్వామి. ఇతడు పాండ్యదేశంలోని రాజాస్థానపండితుడైన దేవేశ్వరుని కుమారుడు. పదమÖడవ శతాబ్దికి చెందినవాడు. మహారాష్ట్రంలో ప్రసిద్ధులైన జ్ఞానదేవ, నామదేవులిద్దరూ  యితని శిష్యులుగానే ఉన్నారు.

వైష్ణవమతానికి దేవతలలో విష్ణువుతో పాటు, బ్రహ్మ, రుద్రుడు, మరియు సనకాదులు అనే నలుగురు ప్రసిద్ధ ప్రచారకులుగా వున్నారు. వారిలో రామానుజుడు విష్ణువు , లక్ష్మికి బోధించిన మార్గాన్ని స్వీకరించగా, మధ్వాచార్యులు  బ్రహ్మ సనకాదులకు బోధించిన మార్గాన్ని తీసుకున్నాడు. తర్వాత, విష్ణుస్వామి, శివుడు పార్వతికి చెప్పిన మార్గాన్ని ఎన్నుకున్నాడు. కాని, ఇతని మతం యితని కాలంలో ప్రచారానికి రాలేదు.

విష్ణుస్వామి తరువాత అతని మతానికి బాగా ప్రచారం కలిగించినవాడు వల్లభాచార్యుడు. వల్లభాచార్యుని తండ్రి వెలనాటి వైదికుడైన లక్ష్మణభట్టు. వల్లభుడు విష్ణుస్వామి మార్గాన్ని, అనగా శివుడు పార్వతికి తెలిపిన మార్గాన్ని  స్వీకరించినాడు. ఈ మతంలో జీవులందరూ స్త్రీలే, శ్రీక ృష్ణుడొక్కడే పురుషుడు. కాబట్టి అతని సన్నిధికొరకు జీవులందరూ ఈ ద్వాపరంనాటి గోపికలవలె తపించవలెనని చెప్పినాడు. 

గోపికల పిమ్మట, కలియుగాదిలో ఈ మార్గాన్ననుసరించి గోదాదేవి శ్రీరంగని చెట్టపట్టింది. చారిత్రకయుగంలో అక్బరు కాలంనాడు రాజపుత్ర యువతియైన మీరాబాయి యిదే మార్గాన్ని అనుసరించి, శ్రీ కృష్ణునే తన పతిగా భావించి అతని పై పాటలు పాడి తరించింది. శైవంలో అక్కమహాదేవి మీరాదేవివలె పాటలుకాక, శివునిపై వచన గీతికలు పాడి తరించింది.

పురుషులు జ్ఞానజీవులు, స్త్రీలు ప్రేమజీవులు. అందువల్ల వారిలో ఆరాధన భావమెక్కువ కాబట్టి, అనాడు ద్వాపరంలో గోపికలు ప్రవేశపెట్టిన ఈ మార్గం ఎంత కోమలమయిందో, సాధనలో అంత కఠినమైంది గూడా అవుతుంది. అందువల్ల హఠయోగం యింద్రియ శక్తులనెట్లా అణచివేస్తుందో, సాధకునికి భావనాబలం చిత్తం యొక్క చంచలత్వాన్ని అట్లా అణచివేయవలె. అపుడే ఈ మార్గం సాధ్యమవుతుంది. 

మధ్వాచార్యుడు ప్రవేశ పెట్టిన కృష్ణభక్తి ఈ విధంగా వల్లభాచార్యునితో పూర్ణత్వాన్ని పొందింది. వల్లభుని తరువాత ఈ మార్గంలో చైతన్య ప్రభువు అనే మరొక మహాపురుషుడు ఉదయించినాడు. ఈతడు వంగదేశీయుడు. పదేనవ శతాబ్దికి చెందినవాడు. శచిదేవి, జగన్నాథమిశ్రా అనే వైదిక బ్రాహ్మణ దంపతులితని తల్లిదండ్రులు. 

వల్లభాచార్యుడు, జీవులందరూ స్త్రీలే, శ్రీకృష్ణుడొక్కడే పురుషుడు, అతనికొఱకు జీవులందరూ రాధవలె తపించవలె  ననగా చైతన్యుడు, రాధవలె తపించటం కాదు రాధలే కావలె నన్నాడు. చైతన్యుడు నామసంకీర్తనంలో ములిగి, ఆహార నిద్రలుగూడ ఎరుగక పిచ్చివానివలె తిరుగుతూ ఉండేవాడట. అనంతరకాలంలో, మీరాబాయికూడా అదే స్థితి నందింది  కనుక, అంతటి తన్మయత్వసిద్ధినొందటం కారణజన్ములకు  తప్ప అందరికీ సాధ్యంకాదు.  

మనకు రాద్ధాంతం, సిద్ధాంతం అని పదాలున్నవి.  రాధ అనగా, తనను తాను సిద్ధపరుచుకొనినది అని అర్థం.  ఆమె శ్రీకృష్ణుని కొఱకు మనసావాచాకర్మణా తనను తాను  సిద్ధపరుచుకున్నది కనుక, చైతన్యుని మతంలో రాధవలె  నిరంతరం అతనికొరకు నిరీక్షణతో గడపటం కాదు, తనను తాను అతనికొరకు సిద్ధరపరుచుకోవలె. అపుడు శ్రీ క ృష్ణుడు తనంతట తానే పిలవకుండా వస్తాడు. అనగా భక్తిచేత కలుగవలసిన పరమప్రాప్యమైన ముక్తి లేదా మోక్షం, లేదా పరమపదం అనేది తనంతట తానుగానే జీవునికి సిద్ధిస్తుంది , అని చైతన్యుడంటాడు. ఇందుకొరకు అతడు హరినామ సంకీర్తనాన్ని సాధనగా తీసుకొన్నాడు.

జీవుడు అలసిపోయేటట్లు శాస్త్ర శోధన చేయటమో లేదా యోగసాధన చేయటమో గాదు. “పీత్వా పీత్వా పునః పీత్వా యావత్పతతి భూతలే” అన్నట్లు, నామసంకీర్తనలో , సర్వం మరచిపోవలె. చివరకు తననుగూడ తా నే అవస్థలో  - ఉన్నదీ మరచిపోవలె కనుక, భగవన్నాను సంకీర్తనలో ఆ దశ నందుకోవలెనంటాడు. సాధకుడీ దశనందుకున్నపుడు, ‘అహంబ్రహ్మాస్మి’ అనే మహావాక్యం అనుభవమైనపుడతడెట్లా ఆ బ్రహ్మానందంలో మునిగి నిశ్చలుడై పోతాడో, ఈ సంకీర్తనాపరుడు గూడ అపుడదే స్థితిని పొందుతాడు.

ఈ విధంగా, వైష్ణవంలో మధ్వాచార్యుడు ప్రవేశ పెట్టిన కృష్ణభక్తి, ఆచార్యుని పేరుకు తగినట్లుగా మధురభక్తియై, చైతన్యంలో పూర్ణస్థితిని పొందింది. అందువల్ల ఇపుడు వైష్ణవంలో రామానుజ, మధ్వ, నింబార్క, వల్లభ, చైతన్యులు, - అయిదుగురూ పంచాచార్యులు అని ప్రసిద్ధినిపొంది నిలిచారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి