మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, నవంబర్ 2026, సోమవారం

పురాణాలలోని జాంతవ వంశాలు

ఋష్యశృంగో మృగీజాతః కౌశికో గాధినందనః

జంబుకో జంబుజోత్పత్తిః గౌతమో గోత్రసంభవః

శునకీగర్భ సంభూతో శౌనకాది మహార్ధయః

వాల్మీకో వల్మికోత్పత్తిః అగస్త్యః కుంభసంభవః

నారదో రజకీపుత్రః కౌండిన్యో ముండకీ సుతః

వ్యాపార లుబ్దకసంభూతో వశిష్టో ఊర్వశీ సుతః

సత్యకామాస్తుజాబాలా శ్వపాకాస్తు పరాశరః 

బహవన్యోపివి ప్రత్వం ప్రాపయే పూర్వ మద్విజః

వశిష్టోప పురాణంలోనివని చెప్పబడే ఈ శ్లోకాలలోని జనన వ్యవస్థ గమనించదగింది. బెస్తదాని కొడుకైన వ్యాసుడు, ఊర్వశి కుమారుడైన వశిష్టుడు, రజకస్త్రీ పుత్రుడైన నారదుడు, నాపిత సుతుడైన కౌండిన్యుడు, జాబాల కొడుకైన సత్యకాముడు, చండాలి కొడుకైన పరాశరుడు, తమ తమ విద్యా తపోబలాలతో విప్రత్వాన్ని పొందవచ్చు. ఈనాడు నిమ్న జాతుల వారెందరో పెద్ద పెద్ద డిగ్రీలు పొంది ఉన్నత పదవులలో ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. కాని వాల్మీకి పుట్టలోనూ, అగస్త్యుడు కడవలోనూ పుట్టటం మాత్రం ప్రకృతి విరుద్ధమనిపించక తప్పదు.

ఇలాగే వశిష్టుడు, ద్రోణుడు, కలశాలలో, కుమారస్వామి, కృపాచార్యులు రెల్లుగంటలలో పుట్టినారు. అయితే ఈనాడు టెస్ట్‌ట్యూబ్ బేబీల యుగం వచ్చేసింది కాబట్టి ఆనాటి అగస్త్యాదుల జననం ఒక విధంగా అంగీకరించినా క్రోష్టి నక్కకు, గౌతముడు ఆవుకు, మాండవ్యుడు కప్పకు, గార్గేయుడు గాడిదకు, శౌనకులు కుక్కకు పుట్టటం మాత్రం విడ్డూరం. మన శాస్త్రజ్ఞులింకా జంతువులకు మానవులను పుట్టించే వరకు రాలేదు కాని మన పురాణాలలో ఇటువంటివారింకా చాలా మందే కనిపిస్తారు.

మహిష్మతి అనే రాకుమారి శాపవశంగా గేదెయై ఒక వనంలో తిరుగుతూ ఉండగా సింధు ద్వీపుడనే మహారాజు అక్కడ ఒక కొలనికి స్నానానికి వచ్చి నాడు. అప్పుడా సరస్సులో అతని రేతః పతనమైన జలాన్ని త్రావి మహిష రూపంలో ఉన్న రాకుమారి మహిషుని కన్నది.

మరో కథ ప్రకారం రంభుడనే రక్కసుడతి కాముడై సంచరిస్తూ ఒకనాడొకచోట ఒక గేదెను చూచి దానితో రమించగా మహిషుడు పుట్టినాడు. విభాండక మహర్షి ఒక నదిలో స్నానం చేస్తుండగా అక్కడికి ఊర్వశి వచ్చింది. ఆమె సౌందర్యాన్ని చూసి అతనికి రేతః పాతం జరిగింది. అపుడక్కడికి శాపవశంగా జింకయైన చిత్రరేఖ వచ్చి ఆ నీటిని త్రాగి ఋష్యశృంగుని కన్నది.

ఉపరిచర వసువు ఒకప్పుడడవికి వేటకు వెళ్ళి ఆ వన సౌందర్యం చూడగా ప్రియురాలు తలపించి స్ఖలనం జరిగింది. అపుడు తన వీర్యాన్నతడు ఒక దొప్పలో ఉంచి దీమంతో భార్యకు పంపుతూ ఉండగా దారిలో అది యమునా నదిలో వొలికి అపు డందులో శాపవశంగా చేపయై తిరుగుతున్న అద్రిక అనే అప్సరస త్రాగి మత్స్యగంధిని కన్నది.

మేరువుకు దక్షిణానగల శతయోజన వనంలో ఉన్న కొలనుకు - ఒకప్పుడు గర్గముని స్నానానికి వెళ్ళి ఆంతవరకక్కడ స్నానమాడుతూ ఉన్న అప్సరసల సౌందర్యాన్ని చూసి స్థలించినాడు. అపుడా నీటిలో పడిన అతని వీర్యాన్ని ఒక చేప మింగి, విశ్వరూపుని భార్యయైన మీనాదేవిని కన్నది.

అదే గర్గమహర్షిని ఒకప్పుడు యాదవులు నపుంసకుడని హేళన చేయగా అతడు లోహ చూర్ణం తింటూ పన్నెండేండ్లు ఒక ఆలమందలో ఉండి తపం చేసినాడు. అపుడతనికి ఒక నాడు రేతఃపతనం జరిగింది. దాన్ని అక్కడ అజగర రూపంలో ఉన్న ఒక గోపాలిక ఆహారమని భక్షించి కాలయవనుని కన్నది.

ఒకపుడు వసువుల కూతురు గుణవతిని దేవతలు మతంగ ముని తపోభంగానికి పంపినారు. అపుడామె నతడు కినిసి ఏనుగవు కమ్మని శపించినాడు. ఆమె గజమై హిమవత్ప్రాంతంలో సంచరిస్తు సామగాయనుడనే ముని విసర్జించిన మÖత్రంలోని వీర్యాన్ని గ్రహించి పాలకావ్యుడనే గజశాస్త్ర వేత్తను కన్నది.

ఈనాడు డాక్టర్లు మÖత్రంలో పతనమై పోయే వీర్యాన్ని వడకట్టి స్త్రీలకు సంతాన ప్రాప్తిని కలిగిస్తారట కాని అది వేరే విషయం.

సంజ్ఞాదేవి సూర్యుని తాపాన్ని భరించలేక ఉత్తర కురుభూములకు వెళ్ళి బడబా రూపంలో సంచరిస్తుండగా సూర్యుడామెను వెదకుచూ వెళ్ళి కలసికొని రమించినాడు. అపుడు వారికి అశ్వినులు, ఆ పిమ్మట రేవంతుడు అనే అశ్వశిక్షకుడు కలిగినారు.

లంకను కాల్చిన పిమ్మట సముద్రాన్ని దాటివస్తున్న హనుమంతుడు తన వంటి చెమటను తుడిచి వేయగా సముద్రంలో పడిన ఆ స్వేదాన్ని ఒక మొసలి మ్రింగి మత్స్యవల్లభుని కన్నది.

ఆత్మదేవుని భార్య దుంధుల సంతానార్ధమై తనకిచ్చిన రసాల ఫలాన్ని తమ దొడ్డిలోని ఒక ఆవుకు తినిపించగా అది గోకర్ణుడనే కుమారుని కన్నది.

శాతవాహనుడు శాపవశంగా సింహాలైన ఒక మునికన్య యక్ష దంపతులకు పుట్టినాడు. ఇవన్నీ పురాణ కాలంనాటి బీజవ్యాప్తి చరిత్రలు.

మన పురాణాలలోని ఈ కథలీనాడు ఎంత ప్రకృతి విరుద్ధమో అంత హాస్యాస్పదంగా కూడా కనిపిస్తవి. అయితే వీనిలో గ్రుడ్డిలో మెల్లలా గమనించదగిన విషయం ఒకటి 

ఉంది. ఋష్యశృంగాదిపైని చెప్పిన సంతానాన్నంతా కన్నవారు అచ్చంగా జంతువులు కారు. శాపకారణంగా ఆయా రూపాలు పొందినారు. కర్మవశంగా లేదా శాపవశంగా మానవుడు జంతువైపుడతాడనే సిద్ధాంతాన్ని ఈనాడు కొన్ని మతాలంగీకరించవు కాని ఈ కాలంలో పెద్దబొట్టు శారదాదేవిగారి స్వీయచరిత్రలో ఉన్న సుబ్బన్న పాము కథ ఒకటి దీనికి సత్యోదాహరణంగా కనిపిస్తుంది.

ఋగ్వేదంలో శతరూపాస్వాయంభువుల ప్రసక్తి ఉంది. శతరూప వివిధ రూపాలు ధరించగా స్వాయంభువామెతో కోరిన రూపంలో రమించినాడు. అప్పుడామె ఏయే రూపాలు ధరించిందో వారి కాయారూపసంతానం కలిగింది. లోకంలో ఈ విధంగానే మొదటి సారిగా వివిధ ప్రాణి ఉత్పత్తి జరిగిందని చెప్పబడింది.

పురాణాలు స్వాయంభువుమను స్థానంలో కశ్యప ప్రజాపతిని నిలిపినవి. అతని భార్యలలో పదముగ్గురు ప్రసిద్ధులు. వారందరూ దక్షకన్యలు. వారిలో కొందరికి దేవజాతులు కలుగగా మరికొందరికి తిర్యగ్జాతులు పుట్టినవి కాబట్టి అతని భార్యలను రెండు వర్గాలుగా విభజింపవచ్చు.

అ) అదితికి` దేవతలు దితికి ` రక్కసులు

కపిలకు-ఘాతాచీ మేనకలు కాలకు` వినాళ క్రోధలు

దనువుకు` దానవులు మునికి` భీమసేన` ఉగ్రసేనులు

అనాయువుకు విక్షరుడు, బలుడు, వృత్రుడు - వీరుడు అనువారు కలుగగా 

ఆ) ఇలకు`వృక్షలతాదులు కాష్టకు` ఏకశపాలు

కద్రువకు నాగులు తామ్రకు`భాసాదులు

తిమికి`జలచరాలు వినతకు` గరుడులు

సరమకు`శ్వానాదులు సురభికి`గోమహిషాదులు

పుట్టినట్లు చెప్పబడింది. అయితే ఎప్పుడైనా మానవులకు జంతువులు కాని, జంతువులకు మానవులు గాని పుట్టడం ప్రకృతి విరుద్ధం.

ఒకప్పుడు హైదరాబాదులో మేక కడుపున సగం మనిషి సగం మేకగా ఉన్న నిసుగు పుట్టినట్లు, బీహార్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో పీత కడుపులో మÖడంగుళాల మానవ శిశువు వున్నట్లు పత్రికలలో వార్తలు వచ్చినవి కాని ఆంతమాత్రంచేత తిర్యక్కులకు మానవులు పుడతారనలేం. నేటి పరిశోధకులకు తోడేళ్లు ఎత్తుకుపోయి పెంచిన మానవ బాలురు కొందరు లభించినారు. వారు తోడేళ్ల వలెనే అరుస్తూ పచ్చి మాంసం తింటూ చేతులను గూడా కాళ్లుగా ఉపయోగించుకుని నడిచినారు. కాని వారు జంతువులుగా పరిగణింపబడలేదు.

సర్కసులలో మనకు చాలా విచిత్రమైన మనుష్యులు, దర్శనమిస్తుంటారు. క్రీ. శ. 1884లో బి. టి. బర్నగారి సర్కస్‌లో “జోజో” అనే కుఱ్ఱవాడుండేవాడట. అతని శరీరం నిండా బొచ్చు కుక్క రోమాలుండేవట. జర్మనీలోని మరో సర్కస్‌లో “లియోనస” అనే మరోవ్యక్తి ఉండేవాడట. ఆయన ముఖంనిండా జూలు పెరిగి అచ్చంగా సింహంలాగా కనిపించేవాడట. మరో సర్కస్‌లో “జూలియా బస్త్రావా” అనే ఒక స్త్రీ ఉండేదట. ఆమె నల్లగా శరీరంనిండా రోమాలతో అచ్చంగా గొరిల్లాలాగే ఉండేదట.

ఇపుడు మనలో పిల్లి కండ్లు, గద్దముక్కు, పులిమోర కలవారున్నారు గాబట్టి ఆనాటి కశ్యపుని సంతానంలో గూడా ఇలాంటి జంతులక్షణాలు కొన్ని ఉండవచ్చు. అంతమాత్రంచేత వారిని మనం ఈనాడు పూర్తిగా జంతువులేనని తీర్మానించలేం.

సృష్టిలో మానవుడు జంతుకోటిలో పరాంకోటి కెక్కి బుద్ధిబలంలో ఎంత ముందుకు పోయినా సౌందర్యంలో మాత్రం యింకా జంతువులతో పోటీ పడలేకపోతున్నాడు. లేడికండ్లు, చిలుక పలుకులు, కోకిలకంఠం, సింహం నడుము, ఏనుగునడక, ఒంటెపిల్ల తొడలు, తాబేటి పాదాలు అని అందానికి జంతువుల పోలికలనే చెప్పుకోక తప్పటం లేదు.

ఈనాడు అగ్రజాతుల వారందరికీ ఋషి గోత్రాలున్నవి. అవి నష్టమైనవారికి ఏ వృక్ష జంతు వాచకాలో గోత్రాలుగా స్థిరపడినవి. కాని నేటి పరిశోధకులు అశ్వలాయన శ్రౌత సూత్రాలలోని ఆనేక గోత్రాలను ఋషి వాచకాలు కాక - వత్స = దూడ, శునక = కుక్క, రిక్క = ఎలుగుబంటి, భరద్వాజ = ఏట్రింత, ముద్గల = ఎఱ్ఱచేప, కపి = కోతి, అజ = మేక, కాళ్యప = తాబేలు, గౌతమ = గోవు, కుశిక = గుడ్ల గూబ, మండక = కప్ప, తిత్తిర = తీతువు అని పశు పక్షి వృక్ష లతావాచకాలుగానే అభిప్రాయపడుతున్నారు. కాబట్టి పైన చెప్పబడిన కశ్యపుని సంతానం ఆయా ప్రాణులను తమ గణ సంకేతాలుగా స్వీకరించి, ఆరాధించి లేదా తమ లాంఛనాలుగా ధ్వజ చిహ్నాలుగా స్వీకరించి వాని పేర చలామణి అయినవారనవలసి ఉంది.

ఈనాడు బాలభట విద్యార్థులు తమ దళాలను జంతువుల పేర్లతోనే సంకేతించుకుంటారు. అందుచేత ఆనాటి కశ్యప మహర్షి సంతానాన్ని గూడా ఈ దృష్టితోనే చూడవలసి ఉంది. అపుడు మన కందులో ఉన్న అసంగతం తొలగిపోతుంది.

ఈనాడు మనకు తెలిసే రాజవంశాలలో కదంబ - శాక్య అనే వ ృక్షవాచకాలతో గర్దభ, మతంగ, మత్స్య-మÖషక అనే జంతు వాచకాలతో ఉన్న తెగలు కనిపిస్తున్నవి.

కశ్యప ప్రజాపతి భార్యలలో ఇలా దేవికి కలిగిన సంతానమంతా వ ృక్షలతాదులు. ఇక్కడ ఇలా దేవి పేరు వృక్షలతాదులు పుట్టటానికి కారణమైన భూమికి సంకేతంగా కనిపిస్తుంది. ఈమెకు ఇడాదేవి అని మరో పేరు గూడా ఉంది. సంస్క ృత డకారం తెలుగులో దకారం అవుతుంది. తెలంగాణంలో ఇదమ్మ  ఒక చాలా ప్రాచీన మైన గ్రామ దేవత. ఇదమ్మకు సంబంధించిన కథలు సృష్టికంతా ఆమెనే మÖలదేవతగా చెబుతవి. అందుచేతనే కాబోలు ఆమె జాతరలు ఎప్పుడైనా శ్రావణంలో జరుగుతవి.

జ్యోతిష్కులు సంవత్సరం చైత్రంలో ప్రారంభమౌతుంది ఆంటే లోక యాత్రావేత్తలు శ్రావణంలో ప్రారంభం అంటారు.

అగ్రవర్ణాలలోని వివాహాది శుభకార్యాలలోని నాందీ ముఖంలో ఇడా వాచనం ఒకటి ఉంటుంది. అది దేవతానుమోదనార్ధం పఠించబడుతుంది. అపుడు గేస్తులు కులదేవత పేర తమతమకు నిర్ణయమైన ఒక వృక్షశాఖనే తెచ్చి దానికి పసుపు గుడ్డ చుట్టి పూజిస్తారు. కాబట్టి ఇడావాచకంలో జరిగే ఈ కుల దేవత ప్రతిష్ట కశ్యపుని భార్య యిలాదేవికి సంకేతంగానే కనిపిస్తుంది.

హరప్పా త్రవ్వకాలలో లతనుకంటున్న ఒక దేవతా ప్రతిమ లభించింది. ఆమె ఈ యిలా దేవియే కావచ్చు.

వృక్షవాచకాలతో వచ్చినవానిలో ఉత్తర భారతంలో శాక్యవంశం, దక్షిణ భారతంలో కదంబ వంశం ప్రసిద్ధి చెందినవి.

శాక్యవంశంలోని బుద్ధుడు ఒక మతస్థాపకుడై ప్రపంచ ప్రసిద్ధిని పొందితే దక్షిణ భారతంలో కదంబ వంశస్థాపకుడైన మయÖరవర్మ తెరకెక్కిన పురుషుడైనాడు. ఇక తక్కిన వంశాల వారి వివరాలు పరికించండి`

1. సైంహికేయులు :

అంటే సింహ సంబంధమైనవారని అర్థం. వీరు ఆ పేరు గలవారి సంతానంగాని లేదా ఆ పేరుగల వంశానికి చెందినవారు గాని లేదా ఆ లాంఛనం కలవారు కూడా కావచ్చు.

మన పురాణకోశంలో సైంహికేయులు అన్నపుడు వాతా పీల్వలులు, రాహు కేతువులు దర్శనమిస్తారు. హిరణ్యకశిపుని సోదరిపేరు, కూతురిపేరు రెండూ ఒకటే. అది సింహిక. తెలుగులో ఇది సింగమ్మగారికి సమానం.

పై వారిలో వాతాపి-ఇల్వలులు హిరణ్యకశిపుని మేనల్లుండ్రు. రాహు కేతువులు అతని మనుమలు అవుతారు. ఇక ఈ పేరును గణసంకేతంగా లేదా వంశ సంకేతంగా గ్రహించినపుడు, రఘువంశంలో హిమాలయ సానువులలో నందినీ ధేనువును పట్టుకున్న కుంభోదరుడు ఈ తెగకు చెందుతాడు. అతడొక యక్షుడు. శివుని సేవకుడు. యక్షులు కామరూపులు కాబట్టి దిలీప మహారాజును పరీక్షించటానికి ఆ రూపంలో కనిపిస్తాడు.

యక్షులలో సింహగోష్ఠి కూడా ఒకటి ఉంది. ఆలాగే ఆ పేరున ఒక వంశం కూడా ఉండవచ్చు కాబట్టి కుంభోదరుడు ఆ వంశానికో లేదా ఆ గణానికే చెందుతాడు.

మన చరిత్రలో ప్రప్రథమాంధ్ర రాజ్యనిర్మాత శాతవాహనుడు ఒక సింహ దంపతుల కుమారుడు. అతడు ఒకనాడు వేటలో దీపకర్ణి మహా రాజుగారికి లభించినాడు.

శాతవాహనుని తండ్రి సాతుడొక యక్షుడు. తల్లి ఒక మునికన్య. వారిద్దరి వివాహం జరిగాక దానికంగీకరించని మునులు వారిని సింహాలు కండని శపించినారు.

ఏ కాలంలో నైనా వ్యక్తులు తామంతవరకున్న కులమతాల నుండి బహిష్క ృతులైనప్పుడు మరోవర్గంలో చేరటం పరిపాటి. పురాణ ప్రకారం గుహ్యకులు యక్షులు కుబేరుని ప్రజలు. సాతుని కాలంనాడు ధాన్యకటకాన్ని కుబీరకుడనే యక్షరాజు పరిపాలిస్తున్నాడు. అతడు సింహగోష్ఠికి అధిపతి. అది ఆ కాలంలో ఏర్పడిన ఒక నూతన సంఘం కావచ్చు.

సాతుడు: 

అతని ప్రియురాలు మునుల శాపంతో సింహాలైనారు. అంటే స్వకులభ్రష్ఠులైన వీరానాడు కుబీరకుని సింహ గోష్ఠిలో చేరినారని భావించవలసి ఉంది.

సాధారణంగా తలిదండ్రి వర్ణ భ్రష్ఠులైనపుడు వారికి కలిగిన సంతానం ప్రతిభావంతులు పరాక్రమశాలులు అయితే ఆ తలిదండ్రి కళంకం మాసి పోతుంది. అదే మన పురాణ కథలలో పుత్ర ముఖ దర్శనంతో శాపావధిగా చిత్రించబడింది.

మన చరిత్రలో నందుల కంటే మొదట మగధ సామ్రాజ్యాన్ని హర్యంక వంశీయులు పాలించినారు. బింబిసారుడు, అజాత శత్రువు అదే వంశానికి చెందిన రాజులు. హరి అంటే సింహం కాబట్టి (హరిGఅంకం) వీరు సింహలాంఛనులు కానీ లేదా ఆ పేరుతో ప్రసిద్ధి చెందినవారుగాని కావచ్చు.

ఇక నంద వంశం పిమ్మట వచ్చినవాడు బిందుసారుడు. చంద్రగుప్తుని కుమారుడైన యితనిది మౌర్యవంశం. ఈ వంశసామ్యాన్ని గుఱించి చారిత్రకులలో భిన్న భిన్న మతాలున్నవి. కొందరు చంద్రగుప్తుని తల్లి “ముర” అనే శూద్రస్త్రీ పేర ఆ పేరు ఏర్పడింది అంటే మరికొందరు “మౌర్య” అనే గ్రామం పేర ఏర్పడిందని, మరికొందరిది “మయÖర” శబ్దరూపమని అన్నారు. ఆశోకుడు అంత ప్రసిద్ధ చక్రవర్తియైనా ఆతని వంశోత్పత్తి మాత్రం ఈ విధంగా సందేహాలతో ఉంది.

కళింగ యుద్ధంతో పరమ శాంతుడైన అశోకుడు ఢిల్లీలో నిలిపిన స్తంభంపై నాలుగు సింహాలను నిలుపటం గమనార్హం. సింహం శాంతానికి సంకేతం కాదు గదా!

2. సృగాల వంశం :

ఇపుడు మనకు ఒకే యింటి పేరుతో అన్ని వర్గాల వారు కనిపించినట్లు పురాణాలలో ఒకే వంశంలో దేవతలు రాక్షసులు, ఋషులు, మానవులు అనే అన్ని వర్గాలవారు కనిపిస్తుంటారు.

మార్కండేయ మహర్షిచేత అనేక ధర్మాలు తెలిసికొని విజ్ఞానియైన ‘క్రోష్టుకి’ ఈ వంశానికి చెందిన ఒక ప్రసిద్ధ ఋషి.

మహా భారత కాలం నాటికే సృగాలవంశం బాగా ప్రసిద్ధి చెందింది. ఈ వంశంలోని వాసుదేవుడనేవాడు శ్రీకృష్ణునితో వైరం సాధించి వధింపబడినాడు కాని యాదవులతో పగ పెంచుకోవటం అంటే ఆ దినాలలో ఒక సామాన్యునితో అయ్యే పని మాత్రం కాదు.

3. శౌనకులు :

మాయా కిరాతుడైన శివుని వెంట, దత్తాత్రేయ రూపం ధరించిన విష్ణువు వెంట నాలుగు వేదాలు శునకరూపం ధరించి అనుసరించినవి కాబట్టి శౌనక గణమంతా 

ఉత్తమమైన బ్రాహ్మణులై తపస్వాధ్యాయ నిరతులై నైమిశం ఆటపట్టుగా నివసించి, అక్కడ ద్వాదశ వర్షయాగం తలపెట్టి సూతమహర్షితో సమస్తమైన పురాణాలు భక్తిశ్రద్ధలతో విన్నారు. అందుచేత మనకిపుడే పురాణమైనా సూతుడు శౌనకాదులకు వినిపించినట్లే కనిపిస్తుంది. కలియుగం వచ్చిన పిమ్మట మహర్షులు పురాణ ప్రవచనం చేయటానికి యిక అదే ఆఖరు.

ఈ వంశానికి చెందిన సరమ అనే మరో ఆమె యింద్రుని గోపాలిక. ఒకపుడింద్రుడు విద్యుత్తు, సువిద్యుత్తు అనే రాక్షసులను చంపటానికి ఒక యాగం తలపెట్టి కొన్ని గోవులను తెచ్చి ఆమె కప్పగించినాడు. అది తెలిసి దానవులామెను మంచి చేసికొని వాని నపహరించినారు. అపుడది చూచిన యింద్రదూతలా వార్త తమ యజమానితో చెప్పగా అతడు వచ్చి ఈమెను డొక్కలో తన్నినాడు. అపుడు సరమ దానవులు పోసిన పాలు క్రక్కుకొని యింద్రుని తీసికొనివెళ్ళి వారు గోవుల నెక్కడ దాచినారో చూపింది.

కుక్కలీనాడు విశ్వాసానికి మారు పేరు గాని ఆ వంశానికి చెందిన సరమ ఈ విధంగా ప్రవర్తించటం దురదృష్టం. ఆ వంశానికొక మచ్చ.

ఈ వంశం చాలా కాలం వరకు సాగివచ్చింది. మిక్కిలి ప్రాచీనమయింది కూడా. రామాయణంలో శ్రీ రామునితో భిక్షు తాడితమైన ఒక శునకం తన గోడు చెప్పుకుంటుంది. అలాగే జనమేజయుని యాగానికి వచ్చిన సరమ కుమారులను అతని సోదరులు కూడా కొట్టి వెళ్ల నడచినారు కాబట్టి ఈ జాతిలో విశ్వాసంతో పాటు ఏదో కొంత దౌష్ట్యం గూడా కనిపిస్తుంది.

4. ఋక్షులు :

ఆంధ్ర భాగవతంలో చతుర్ముఖు డొనర్చిన యక్ష రాక్షసాది సృష్టిలో ఋక్షులు గూడా ఒకరుగా చెప్పబడినారు. వారిలో ఎలుగుబంటి లక్షణాలు కొన్ని కనిపించవచ్చు గాక! అంత మాత్రం చేత వారు జంతువులు గారు. కానక్కరలేదు. రామాయణాన్ని బట్టి జాంబవంతుడు గొప్ప మÖలికావైద్యుడైనట్లు తెలుస్తుంది. ఇప్పటికీ అడవులలో తిరిగే కోయలు, గోండులు ఆ వైద్యంలో ఆరితేరినవారై ఉంటారు.

జాంబవంతుడు చిరంజీవి. బ్రహ్మదేవుని విజృంభణంలో పుట్టి విష్ణువు యొక్క త్రివిక్రమావతారాన్ని చూసి శ్రీకృష్ణునికి తన కూతురినిచ్చిన యితనికి యుగాలు సంవత్సరాలుగా మారి పోయినవి. కనుక ఆదియుగం నుండి ద్వాపరం వరకు ఉన్న జాంబవంతుడొక్కడేనా! వంశం ఒక్కటే కావచ్చు కాని వ్యక్తి ఒక్కడేనని అనలేం.

జాంబవంతుని నివాసం ఋక్షగిరి అని చెప్పబడింది. శ్రీకృష్ణుడతని కూతురు జాంబవతిని వివాహమాడిన వృత్తాంతం శ్యమంతకమణి కథలో వస్తుంది. విష్ణువు నృసింహావతారంలో చెంచితను, శ్రీకృష్ణావతారంలో జాంబవతిని వివాహమాడటం అతడు ద్రావిడులతో స్నేహం చేసి ఆర్యసంస్క ృతిని అటవీ జాతుల వరకు ప్రాకించటమే అని చెప్పవలసి ఉంది. అంతేగాదు ఆ రూపంలో వారు వర్ణాంతర వివాహాలను గూడా అంగీకరించి ఆదర్శ పురుషులైనారు.

ఋక్షగిరి ప్రాంతాన్ని నేడు “గోండ్వానా” అంటున్నారు. అక్కడి ప్రజలకు జాంబవంతుడు మÖలపురుషుడగునో లేదో, కులదైవం అగునో లేదో కాని తెలుగువారుమాత్రం ఎలుగుబంటిని “ఎలుగుగొడ్డు” అనే అంటారు. తెలంగాణలో “చిందువారు “ జాంబవంతుని కులదైవంగా చెప్పుకుంటారు. వీరు పగలే వీధులలో తమ యక్షగానా లభినయిస్తారు.

5. వానరులు :

ఋక్షుల పి¾మ్మట చెప్పదగినవారు వానరులు. రామాయణ కాలం నాడు వర్ధిల్లిన వీరి సంస్క ృతీ వికాసాలు అటు లంకలోని ద్రావిడ సంస్క ృతికి ఇటు దక్షిణ భారతంలో దాదాపు దీటుగా ఉన్నవి. వీరిని కొందరు వానరకేతు లన్నారు.

ఈ వంశంలో వాలి సుగ్రీవులనే సోదరులు చెప్పదగినవారు. వారి జన్మను గుఱించి రెండు మÖడు కథలు వ్యాప్తిలో వున్నా అన్నిటా వారు వానరులుగానే ఉన్నారు.

వానరజాతికి కామం ఎక్కువ. ఇపుడు పుంస్త్వబలం చాలని వారు మర్కటగ్రంధి సూదులు వేయించుకుంటారు. ఈ అతి కామలక్షణం మనకు వాలి సుగ్రీవులలో కనిపిస్తుంది. వాలి సుగ్రీవుని వెళ్ళగొట్టి ఆతని భార్యను చేపట్టితే శ్రీరాముని సహాయంతో రాజ్యాన్ని భార్యను తిరిగి పొందిన సుగ్రీవుడు అన్నగారి అనంతరం ఆయన భార్యను చేపట్టినాడు.

ఈ వంశంలో వాలి`హనుమంతులిద్దరు మహాబలవంతులు. వాలి ముందెవరు నిలిచినా వారి బలం వెంటనే వాటికి సగం చేరేదట. అందుచేత శ్రీరామునివంటి వీరుడు గూడ అతనిని చెట్టు చాటునుండి కొట్టవలసి వచ్చింది.

ఇక హనుమంతుడు లేని రామాయణాన్ని మనం ఊహించలేం. శ్రీ రామునికి అనన్య భక్తుడైన ఈ మహనీయుడు మొదట సుగ్రీవుని బంటు. ఇతడు గొప్ప విద్యావేత్త. వ్యాకరణం చక్కగా చదివినవాడు. సంగీత వేత్త గూడ.

ఇతడు శివవీర్యంతో వాయుదేవుని వరంచేత కేసరి భార్యయైన అంజనా దేవి గర్భంలో జనించినాడు. కర్ణునికి పుట్టుకతోనే కవచ కుండలాలున్నట్లు ఇతనికి పుట్టుకతోనే కౌపీన కుండలాలున్నవి.

ఈ వానరవంశంలో అనేక శాఖలున్నవి. శ్రీరాముని సైన్యంలో నీలుడు అనే వానర విశ్వకర్మ ఉన్నాడు. అతడు సముద్రంపై లంకకు వారధి కట్టినాడు. అతడీ వంశంలో గోలాంగూల శాఖకు చెందినవాడు. గోలాంగూలాన్నిపుడు “కోనెంగ” అంటారు.

ఈ వానరవంశం ద్వాపరంవరకు సాగివచ్చింది. సుగ్రీవుని మంత్రివంశీయులైన మైంద ద్వివిదులను సంహరించినాడు.

హనుమంతుని జాతి కోతి. యిపుడు కాశ్మీర ప్రాంతంలో ఉందట. దాన్ని “హనుమాన్ బందర” అని అంటారని దాని నుదుట ఊర్ధ్వపుండ్రాలు ఉంటవని చెబుతారు.

6. ఆశ్వినేయులు :

సూర్యుని భార్యయైన సంజ్ఞాదేవి అతని తాపానికి సహించలేక ఉత్తర కురుభూములకు వెళ్ళి పోయి అక్కడ బడబా రూపంలో నివసించింది. అపుడు సూర్యుడది తెలిసి ఆమె దగ్గరకు అశ్వరూపంలో వెళ్ళి రమించగా నాసత్యుడు`దస్రుడు అనే కవలలు కలిగినట్లు మన పురాణాలు చెబుతవి.

కొన్ని పురాణా లతనికి సంజ్ఞా - ఛాయా దేవులతోపాటు బడబాదేవిని గూడా ఒక భార్యగా అంగీకరించినవి. అప్పుడామె ఆశ్వవంశానికి చెందినది అవుతుంది. అందుచేతనే ఆమె కుమారులు ఆశ్వినేయులైనారు. వీరు ప్రసిద్ధమైన దేవవైద్యులు. వికలమైన శరీర భాగాలను తొలగించి కృత్రిమ భాగాల నమర్చడంలో సుఖంగా వాజీకరణ తంత్రంలోను ప్రసిద్ధులు.

రేవంతుడు అశ్వవంశానికి చెందిన ఈ తల్లిగారికే పుట్టినారు కాబట్టి అనంతరకాలంలో అతడు అశ్వశిక్షలో మొనగాడై శాస్త్ర ప్రవర్తకుడు గూడా అయినాడు. మధ్యయుగంనాటి ప్రభువులతని పేర తాము “దుష్టతురగరేఖా రేవంతుల” మని బిరుదులు పెట్టుకున్నారు.

దేవయోనులలో కిన్నర కింపురుషులని రెండు జాతులవారున్నారు. వారిలో కిన్నరులకు అశ్వముఖం కింపురుషులకు అశ్వశరీరం ఉండేవట. అందుచేత వీరు ఈ వంశంలోనే చేరదగినట్లుగా కనిపిస్తారు.

దేవతలలో హయగ్రీవునికి రాక్షసులలో వేదాలు దొంగిలించిన హయగ్రీవునికి, దేవర్షులలో తుంబురునికి, మహర్షులలో దదá్యంగునికి గుఱ్ఱపుతలలే కాబట్టి వీరందరూ కిన్నరులలో చేరవలసినట్లుగానే కనిపిస్తారు.

కిన్నరులు గానవిద్యా ప్రియులు, గాన ప్రవీణులు. ఈనాటి కిన్నెర అనే వాయిద్యం మనకు వారి చిహ్నంగానే మిగిలింది. ఇక రాజవంశాలలో ఆశ్వి నేయులు మిగులలేరు కాని అశ్వపతులున్నారు.

7. గర్దభులు :

గాడిద ఈనాడు మనకు హీనజంతువైనా దేవతలలో అది శీతలాదేవికి వాహనం, అశ్వనీ కుమారుల రథానికి రావణుని రథానికి గాడిదలే కట్టబడేవి.

ఈనాడు మనం చదువురాని వానిని “గాడిద” అని తిడతాం గాని పూర్వం వ్రాతకు గాడిదల చర్మాన్నే ఉపయోగించేవారు. అందుచేత వానిపై వ్రాసిన వ్రాతకు ఖరోష్టి లిపి అనే పేరు నిలిచిపోయింది. అశోక చక్రవర్తి కాలంలో దేశభాషలకు ఆ లిపియే వాడబడేది.

ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని బాల్యంనాడు బృందావన సమీపంలోని “తాళవనం” “ధేనుకుడు” అనే గార్దభరాజు ఆధీనంలో ఉండేది. అతని సైన్యమంతా గాడిదలు. బృందావనానికి వెళ్ళిన పిమ్మట శ్రీరాముని కోరికపై రామకేశవులా సైన్యాన్ని తాటిచెట్లకు వేసి కొట్టిచంపి పిమ్మట ధేనుకుని వధించినారు.

8. మాతంగులు :

మాతంగ ` మÖషక వంశాలు చాలా ప్రాచీనమైనవి. మౌర్యులకంటే చాలా మొదట మగధను మాతంగ వంశ్యులు పాలించినారు. వారికి మÖషకులకు ఎప్పుడూ పడకపోయేది. ఒక పర్యాయం మాతంగులు మÖషకులను చిత్తుగా ఓడించి రాజరధం పట్టించుకున్నారు. చారిత్రకమైన ఈ సంఘటనయే ఈనాడు వినాయకునికి మÖషక వాహనంగా రూపొందింది అని ఆధునికుల మతం.

వసువుల కూతురైన గుణవతిని దేవతలు మతంగముని తపోభంగానికి పంపిన విషయం మొదట ప్రస్తావించినాను. కాబట్టి దాన్నిబట్టి గజశాస్త్రవేత్తయిన పాలకావ్యుడు గూడా ఇదే వంశానికి చెందినవాడనవలసి ఉంది.

చతుష్పాత్తులలో ఈనాడు వరాహవంశం కనిపించటం లేదు కాని వరాహదేశం, వరాహలాంఛనులైన ప్రభువులు ఉన్నారు. చాళుక్యులు వరాహ లాంఛనులు కాబట్టి వారి కాలం నుండియే మన రూపాయికి “వరహా” అనే పేరు నిలిచిపోయింది.

వరాహ వంశంలాగే గౌతముడనే ఋషి ఉన్నా గౌతమ వంశం మాత్రం మిగులలేదు. గౌతముని గోత్రం మాత్రం నిలిచింది.

శివుని సేవకులలోని నందికేశ్వరుడు ఈ వంశానికే చెందుతాడు. ఆంధ్రదేశంలోని సామంత రాజ కుటుంబాలలో నంది వంశం కూడా ఒకటి ఉంది.

9. మహిషకులు :

మన పురాణాలలో మహిషుని జననం సింధుద్వీపుని నుండి, రంధుని నుండి అని రెండు విధాలుగా చెప్పబడింది. అయితే, తండ్రులెట్లా ఉన్నా తల్లి మాత్రం మహిష కన్యగానే ఉంది. అందుచేత యితడు మాత ృస్వామ్యానికి చెందుతాడు.

ఇక తండ్రుల విషయంలో సింధుద్వీపుడు విశేషణమేగాని సంజ్ఞావాచకంకాదు. కాబట్టి రంభుడే సింధుద్వీపుడు కావచ్చు గూడ.

రామాయణంలో వాలిపై యుద్ధానికివెళ్ళి సంహరింపబడిన దుందుభి అనే రక్కసుడి వంశానికి చెందుతాడు. మొరటుతనం ఈ జాతివారి ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది.

ఈనాటి మైసూరు పురాణకాలం నాడు మహిషాసురుని రాజ్యమట. అక్కడ ఉన్న మహిషాసురుని దేవి వధించింది. అనంతరం ఇపుడా రాజ్యం రూపం మార్చుకుని మహాశూరపురం అయింది.

తెలుగుదేశంలో మహిషమర్దని ప్రతిమలు చాలా ఉన్నవి. ఉమ్మడి పాలమÖరు జిల్లాలో అవి నాలుగు విధాలుగా కనిపిస్తున్నవి. ఇంద్రకల్లులో పూర్వకాయం నరుడు 

ఉత్తరకాయం మహిషంగా, రామగిరిలో శిరస్సు మాత్రమే మహిషంగా, కందూరులో మానవ శిరస్సుకే మహిష శ ృంగాలుగా, తీగలపల్లిలో మానవుని వెనుక మహిషం పలుచని ఉబ్బెత్తు చిత్రంగా ఉన్నవి. ఇది క్రమంగా శిల్పులలో వచ్చిన భావపరిణతికి చిహ్నంగా ఉంది. మహిషాసురుడనేది పేరు మాత్రమేగాని వాడు నిజంగా పోతురాజుగాదు అనేది దీనివలన మనం గ్రహించదగినది.

కళాపూర్ణోదయంలో మహిషాసురుని మేనల్లుడు శల్యాసురుడు చెప్పబడినాడు. అతడభినవ కౌముదిని వెంటాడుతాడు. దీన్నిబట్టి ఆనాడు మహిషులకు శల్యులకు సంబంధ బాంధవ్యాలుండేనని తలపవచ్చు.

మధురలోని కంసుని ఆస్థానంలోగల చాణూరముష్టికుల శిష్యులలో శలతోసలులున్నారు. ఈ జంటలో శల్యుడు బహుశః శల్యాసురుని వంశానికి చెందినవాడే కావచ్చు.

10. హరిణములు :

తామస మనువు యొక్క తల్లి ఉత్పలావతి, ఋష్య శ ృంగుని తల్లి చిత్ర రేఖ ఈ యిద్దరూ హరిణక వంశానికి చెందిన కన్యలు. ఉత్పలావతి జన్మాంతరం పొందినప్పటికి మళ్ళీ మొదటి భర్త చేతనే కుమారుని కని, చిత్ర రేఖ విభాండక ఋషి వీర్యానికి కుమారునికని శాపవిముక్తి పొందినారు.

మహాభారతంలో పాండురాజుచేత వేటలో కొట్టబడిన గిందమ దంపతులు కూడా ఈ హరిణక జాతికే చెందినవారనే భావించవలె. అందు చేతనే పాండురాజు వారిని జింకలను కొని కొట్టినాడని కల్పించబడింది. మృగయులు వేటలో జంతువులని భ్రమించి మనుష్యులను కొట్టటం గూడ పరిపాటియే. దానికి రామాయణంలోని దశరధుడు మరో ఉదాహరణగా ఉన్నాడు.

తెలుగుదేశాన్ని పాలించిన చిన్న వంశాల హరిణకులు గూడా ఒకరున్నారు. అంతేకాక బాణులు హరిణ లాంఛనులు.

11. నాగులు

భారత దేశంలో నాగులు మిక్కిలి ప్రాచీనజాతి. వీరొక్క భారతదేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లు ఈనాటి త్రవ్వకాల వల్ల తెలుస్తుంది. వీరిలో దుర్మార్గులు, సన్మార్గులు అని రెండు రకాలవారున్నారు. నన్నయగారు తమ భారతభాగంలోని సర్పయాగ సందర్భంలో దుర్మార్గులను పాములని, పూజ నీయులను సర్పాలని వ్యవహరించినట్లు శ్రీ దివాకర్ల వెంకటావధానిగారు తమ నన్నయ భారత పరిశోధనమున తెలిపినారు.

నాగులలో చాలా తెగలున్నవి. ఇపుడు ఈ జాతిలో ఇరువదొక తెగలున్నట్లు లెక్కింపబడినారు. కాశ్మీరు లోయలో యిపుడు అనంతనాగ్, వాసుకినాగ్, శేషనాగ్ అని ఆనాటి నాగప్రభువులు నివసించిన నగరాలున్నవి. మహాభారత కాలం నాడు తక్షశిల తక్షకుడనే నాగరాజు చేత నిర్మింపబడిన ఒక గొప్ప పట్టణం.

ఈ వంశంలో విష్ణుభక్తులు, శివభక్తులు యిద్దరూ ఉన్నారు. అనంతుడు విష్ణువు నాశ్రయించి అతనికి తల్పసేవ, పాదుకాసేవ, ఛత్రసేవ చేస్తే వాసుకి శివుని ఆశ్రయించి హారసేవ చేసినాడు.

వాసుకి చెల్లెలు జరత్కారువు గొప్పయోగిని. ఆమె అన్నగారి కోరికపై జరత్కారు మహర్షిని వివాహమాడి ఆస్తీకుని కని సర్పసత్ర వినాశం నుండి తమ అన్నగారి వంశరక్షణకు కారకురాలైంది.

ఈ వంశøంలో ఏలాదేవి ఒక బ్రహ్మవాదిని. ఆమె బ్రహ్మసభకు గూడా వెళ్లుతూ 

ఉండేది. తక్షకుడు, అతని కుమారుడు అశ్వసేనుడు, సోదరుడు ఇరావంతుడు ఈ వంశంలో గొప్పవీరులు. తక్షకుడు తన కుమారుడైన అశ్వసేనునితో కలిసి అన్నిలోకాలు స్వేచ్ఛగా తిరిగేవాడు. ఇంద్రునికి మిక్కిలి సన్నిహితుడు.

ఖాండవదహన సమయంలో వీరందులోనే ఉన్నారు. అశ్వసేనుడు తల్లితో తనను తప్పించి తీసుకుపొమ్మని చెప్పగా ఆమె అతనిని ఎత్తుకుని వెళ్లుతున్నది. అదిచూచి అర్జునుడు మొదట ఆమె తలను త్రుంచి పిమ్మట అశ్వసేనుని తలనుగూడ ఎగుర వేయబోయినాడు. అది చూచి యింద్రుడు అశ్వసేనుని తక్షకుడే అని భ్రమించి - కుమారునిలో తండ్రి పోలికలు ఉంటవి కాబటి - అర్జునుడు తక్షకుని చంపుతున్నాడనుకొని తన మాయను ప్రయోగించి అతనిని కనిపించకుండా చేసి కాపాడినాడు.

పరీక్షిత్తు మరణానికి కారణమైన తరువాత జనమేజయుని సర్పసత్రంలో ఆహుతి గాకుండా తక్షకుని యింద్రుడే రక్షించినాడు.

గర్గమహార్షి గుప్తంగా ఆలమందలో ఉండి తపం చేస్తున్నపుడు అతని వీర్యంతో కాలయవనుని కన్న గోపాలిక, శ్రీక ృష్ణుని బాల్యంలో మ్రింగటానికి ప్రయత్నించిన అఘాసురుడు వీరిద్దరు ఈ వంశంలో అజగరశాఖకు చెందినవారు.

అఘాసురుడు బకుని తమ్ముడుగా భాగవతంలో చెప్పబడినాడు అని కేవలం నామవాచకాలైతే సరేగాని వంశాలైతే మాత్రం కొంగ - కొండచిలువ ఒకే శాఖకు చెందవు. అందుచేత వీరి తల్లులు అప్పాచెల్లెండ్రై వేర్వేరు వంశాలకు వెళ్ళి ఉంటారనుకోవలె.

మహాభారతంలోని భృగువంశ కీర్తనంలో ప్రమద్వర వృతాంతం వస్తుంది. ఆమె స్థూలకేశుని ఆశ్రమంలో పెరుగుతూ సర్పదష్టయై చనిపోగా రురుడు ఆ ఆశ్రమంలోని సర్పాలన్నిటిని కొట్టి చంపుతాడు. అపుడతని దెబ్బలకు గురియైన “సహస్రపాదుడు” ఈ వంశంలో డుండుభ శాఖకు చెందినవాడు.

తీర్థయాత్రకు బయలుదేరిన అర్జునుని గంగాతీరంలో చూచి మోహించి తమ లోకానికి తీసికొని వెళ్ళిన ఉలూపి మరోవంశానికి చెందిన నాగకన్య. “ఉలూపి” అంటే ఎఱ్ఱత్రాచు.

ఈ విధంగా పురాణాలలో వీరింకా అక్కడక్కడ అనేకులు దర్శనమిస్తారు. వీరు తరుచుగా పర్వతప్రాంతవాసులై స్వేచ్ఛాప్రియులుగా, నిశ్చింత స్వభావులుగా ఉండేవారు. ఆనందమయ జీవులు, స్నేహభరితులు కాని పగ ఏర్పడినపుడు మాత్రం దాన్ని వంశపరంపరగా సాధించి శత్రువును ఏ విధంగానైనా తరిమి తరిమి వధించటానికి వెనుదీయరు.

మహాభారతంలో జనమేజయుడు చేసిన సర్పయాగం ఆనాడతడు నాగులపై చేసిన దండయాత్రలే అని నేటి చరిత్రకారుల అభిప్రాయం. ఆ ప్రమాదంలో వీరనేక ప్రాంతాలకు పారిపోయి అక్కడ స్వతంత్ర రాజ్యాలు స్థాపించుకున్నారు.

ఆర్యులకు సముద్ర ప్రయాణం నిషిద్ధం కాబట్టి ఆ కాలంలో సముద్ర వ్యాపారమంతా వీరి చేతులలోనే ఉండేది.

ఉత్తరభారతం నుండి దక్షిణాపథానికి వచ్చిన పిమ్మట తమిళ ప్రాంతాన్ని పాలించినవారు చూటుకులులు అని, తెలుగు ప్రాంతాలను పాలించినవారు నాగ వంశీయులు అని వ్యవహరింపబడినారు.

తెలుగుదేశంలోని నాగవంశాన్ని ప్రక్కన ఉన్న మయÖరవర్మ మయÖరం సర్పాలను తలెత్తకుండా చేసినట్లు ఆణచివేసినాడు.

12. మాత్స్యులు :

మన పురాణాలలో మత్స్యవంశం గూడా మిక్కిలి ప్రాచీనమై కనిపి స్తుంది. భరత వంశానికి కుదురైన మత్స్యగంధి ఉపరిచర వసువు యొక్క వీర్యంచేత ఒక మత్స్యకన్యకు కలిగిన బిడ్డ..

బృహస్పతి అలిగిపోయినపుడు సురాచార్యుడై యింద్రునికి నారాయణ కవచాన్ని సృజించి యిచ్చిన విశ్వరూపాచార్యుని భార్య మీనాదేవి మరో మత్స్యకన్య కూతురు. హనుమంతుని చెమట వలన కలిగిన మత్స్యవల్లభుడు ఒక మకరాంగన కుమారుడట. ఈ శాఖలో ఇదొక విచిత్రం.

నాథŠ సంప్రదాయానికి మÖల పురుషుడైన మత్స్యేంద్రనాధుడు గూడా మత్స్యకన్య కుమారుడే. ఈ విధంగా ఈ వంశం పురాణేతిహాసాల యుగంనుండి చరిత్రయుగం వరకు సాగివచ్చింది. క్రీ.శ. 13వ శతాబ్దిలో వడ్డాదిని పాలించిన ప్రభువులు మత్స్య వంశీయులుగా చెప్పబడినారు.

శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంవలెనే కూర్మావతారం గూడా ఎత్తినా ఎందుకో కూర్మంపేర ఏ రాజవంశాలు రాలేదు. కాని ఈనాటి సాంఘిక చరిత్రకారులు “కుంబి” పదాన్ని కూర్మరూపంగా భావిస్తున్నారు. కుంబీలను ఇపుడు కాపులు అంటారు. కాపు “కాంపిల్య” శబ్దభవం అని కూడా ఒక మతం ఉంది. కాబట్టి కాంపిల్య దేశవాసులు కూర్మవంశీయులా పరిశీలించవలసి ఉంది.

13. మాండవ్యులు :

వేదంలో మండూకసూక్తాలున్నవి. ఉపనిషత్తులలో మాండూక్యోపనిషత్తు ప్రసిద్ధం కాబట్టి మహా భారతకాలం నాటికే మండూక వంశం పేరు చెందింది. పరీక్షిత్తు భార్య సుశోభనాదేవి ఆ వంశానికి చెందిన ఆయువు అనే మహా రాజుగారి బిడ్డ.

ఈ వంశానికి మÖల పురుషుడు మాండవ్యుడు కావచ్చు. సతీసుమతి చరిత్రలో ఒక మాండవ్యుని వృత్తాంతం వస్తుంది. అతడు బాల్యంలో తూనీగలను తుమ్మముండ్లకు క్రుచ్చి ఆడిన ఫలితంగా కొరత వేయబడి ఉంటాడు. సుమతీదేవి తన భర్తను గంపలో వేశ్య యింటికి ఎత్తుకొని వెళ్లుతూ ఉండగా అతని కాలికి ఆ గంప తగిలి కౌశికుని శపిస్తాడు.

పాండురంగ మహాత్మ్యంలో అగస్త్యుని శిష్యులైన అయత నియతుల కథ ఉంది. ఆ సోదరులలో అయతుడు వాధూల మహర్షి శాపంచేత మండూకమై పండరిక్షేత్రంలో నివసించి తనవలెనే మరో మండూకమైన కన్యాకుబ్జ రాకుమారితో కాపురం చేస్తాడు. వీరికి గూడా పుత్ర ముఖదర్శనంతో శాపవిముక్తి కలుగుతుంది.

ఈ అయత దంపతులు మండూకాలైనారు అంటే సాతుడు అనే యక్షుని వలెనే తమ కులం నుండి వేరై మరోగణంలో చేరినారనుకోవలె.

14. మÖషకులు :

ఇంతవరకు తెలిపిన మాతంగ వంశంలో వీరి ప్రస్తావన వచ్చింది. మÖషిక నగరం మÖసీ కృష్ణా సంగమ స్థానంలో ఉండేదట. వీరిపై శాతకర్ణి గూడ దండెత్తినట్లు చరిత్ర చెబుతుంది కాని వీరిని గురించిన వివరాలేవీ తెలియలేదు.

15. గరుడులు :

కశ్యప మహార్షి భార్యలలో వినత, తామ్ర అనే యిద్దరు భార్యలకు కలిగిన సంతానం పక్షులు.

వినతకు అనూరుడు, గరుడుడు అనే యిద్దరు కుమారులు కలిగినారు. అనూరునికి శ్యేని అనే భార్యవలన సంపాతి, జటాయువు అనే కుమారులు కలిగినారు. రామాయణంలో ఈ సోదరులిద్దరిది చాలా పెద్ద పాత్ర.

ఒకపుడీ సోదరులిద్దరు పందెం వేసికొని సూర్యమండలం వరకు ఎగిరినారు. అపుడు నంపాతి తన రెక్కలు కాలి ఒకచోట పడిపోయి మెల్లగా అక్కడ ఉన్న ఒక కొండపైకి ప్రాకి దాని గుహలో నివాసం ఏర్పరచుకున్నాడు.

దశరథుని భార్య కౌసల్య దక్షిణ కోసల ప్రభువైన భానుమంతుని కూతురు. తండ్రి ఆమెకు స్వయంవరం చాటించగా దశరధుడు దానికి బయలు దేరి దారిలో ఒక నదిలో కొట్టుకొనిపోయి సముద్రంలో పడినాడు.

ఈ లోపల రావణునికి కౌసల్య కుమారునితో తనకు మరణం కలుగుతుందని తెలిసింది. అతడు స్వయంవర మండపానికి వచ్చి కౌసల్యను హరించుకొనిపోయి సముద్రమధ్యంలోని ఒక ఏకాంత ద్వీపంలో విడిచినాడు. అపుడు ఈదుతూ దైవికంగా దశరధుడా దీవికి చేరినాడు. అతనికి అక్కడ కౌసల్య కనిపించింది. ఒకరి వివరాలు ఒకరు తెలిసికొని వారాదీవిలోనే వివాహం చేసికున్నారు.

జటాయువు దశరథునికి పరమమిత్రుడు. ఆతడానాడు సముద్రతీరానికి విహారానికి రాగా అతనికి ఏకాంతద్వీపంలో దశరధుడు కనిపించినాడు. అంత జటాయువు అక్కడికివెళ్ళి వారిద్దరిని కుశలంగా యిల్లు చేర్చినాడు. అదృష్టం అనేది ఉంటే అన్నీ దానంతట అవే ఈ విధంగా సమకూరుతూ ఉంటవి.

ఈ జటాయువే మళ్ళీ సీతను రావణుడెత్తుకొనిపోగా అతని కడ్డుపడి పోరాడి ప్రాణావశిష్టుడైపడి శ్రీరాముని కామె విషయం చెప్పి ప్రాణాలు విడిచినాడు.

ఆ పిమ్మట సుగ్రీవుని పంపిన వానరులు సీతను వెదకుతూ వచ్చి జాడ తెలియక సముద్రతీరంలో గల కొండపై నిరాశులై కూర్చోగా అపుడక్కడ గుహలో ఉన్న సంపాతి బయటికి వచ్చి వారిని చూచి సంగతి తెలిసికొని తన వాడియైన చూపుతో రావణుడు సీతను కొనివెళ్లి లంకలో ఎక్కడ ఉంచింది చూచి చెప్పినాడు. ఈ విధంగా ఈ సోదరులిద్దరిది రామాయణంలో మరువ రాని పాత్ర.

గ్రద్దల ద ృష్టి చాలా నిశితమయింది. అది ఎంతో ఎత్తున ఎగురుతున్నా నేలపై 

ఉన్న ఒక జొన్న గింజను కూడా చూడగలదు. కాబట్టి ఆ తీక్షణ దృష్టి ఈ సంపాతి సోదరులలో కనిపించింది.

వీరి తండ్రియైన అనూరుడు తొడలు లేనివాడు. కాబట్టి సూర్యునికి సారధికాగా తమ్ముడైన గరుడుడు విష్ణుమÖర్తికి ధ్వజము, రధము అయి సేవ చేసినాడు. అతడు తామ్రయొక్క బిడ్డలైన భాసి, శుకి, క్రౌంచి, శ్యేని, ధృతరాష్ట్ర అనే అయిదుగురిని వివాహం చేసికున్నట్టు వారివల్లనే యిక సమస్త పక్షిగణం జన్మించినట్లు బ్రహ్మాండ పురాణం చెబుతుంది. నాగులలోవలె వీరిలో గూడ అనేక శాఖలున్నవి. వానిలో గరుడులకు నాగులకు మాత్రం ముఖ్యంగా వైరం ఉండేది. అది జీమÖతవాహనుని ఆత్మత్యాగంతో తీరిపోయింది.

సీతారాములు అరణ్యంలో ఉన్నపుడు కాకి రూపంలో వచ్చి ఆమె స్తనాగ్రం చీరిన జయంతుడొక రక్కసుడైతే అదే శాఖలో భుశుండుడు ఒక మహాయోగి - మార్కండేయ మహర్షి కంటే గొప్పవాడు. కాకవంశానికి చెందిన వీరిది పాక్షిక దృష్టి.

బకులలో శ్రీకృష్ణుని మ్రింగటానికి ప్రయత్నించిన బకుడు ఒక రక్కసుడైతే అదే శాఖలో నాడీజంఘుడు పరోపకార పారీణుడైన ఉత్తమ పురుషుడు. అతనికి రాజధర్ముడని మరోపేరు. అతడు బ్రహ్మ దేవునికి మిత్రుడు.

కౌశికి శాఖలో “ప్రావార కర్ణుడు” ఒక దీర్ఘ జీవి. గాన బంధుడు అనే వాడు గొప్ప విష్ణుభక్తుడు. వీరు దివాంధులు - అంటే పగలు బాగా చూడలేక పోయేవారు. విశ్వామిత్రుడు అనంతర కాలంలో ఇదే వంశంలో వచ్చిన ఒక గొప్పరాజర్షి.

మహాభారతంలో “పూజని” అనే ఒక గొరవంక వృత్తాంతం వస్తుంది. ఆమె శారికా వంశానికి చెందిన స్త్రీ యనవలె. అదేవిధంగా జరిత లావుక (లవంక) శాఖకు చెందిన యువతి. ఆమెను సంతానార్ధమై మందవాల మహర్షి చేపట్టినాడు. వారికి జరితారి, సారిసృకుడు, ఆపస్తంబ మిత్రుడు, ద్రోణుడు అనే నలువురు కుమారులు కలిగినారు. వీరు బ్రహ్మవిదులు.

వీరిలో ద్రోణుని భార్య తార్షి. ఈ దంపతులకు పింగాక్షుడు, విరాటుడు, వృతుడు, సుముఖుడు అనే నలువురు కుమారులు కలిగినారు. వీరికి ధర్మపక్షులని వ్యవహారం. ఈ సోదరులు వింధ్య పర్వతంపై తపం చేసుకుంటూ ఉండగా జైమిని మహర్షి వారి దగ్గరకు వెళ్ళి మహాభారతంలో తనకు గల ధర్మసందేహాలన్నీ అడిగి తెలుసుకున్నాడు.

ఈ విధంగా వీరి వంశం శాఖోపశాఖలుగా విస్తరించి మహాభారత కాలం వరకు మని ఉన్నది. గాంధార దేశపు రాజైన సుబలుడు ఇదే వంశానికి చెందినవాడు. “గాంధారం” అంటే ఒక జాతి గ్రద్ద. ఆయన కూతురైన గాంధారిని ధృతరాష్ట్రుడు వివాహమాడినాడు. కాబట్టి గాంధారి గరుడ వంశానికి చెందిన కన్య. కౌసల్య, కైకేయి, గాంధారి అనే పేర్లు దేశ వాచకాలతో ఏర్పడిన తద్దితాలు కాని వీరి నిజనామం ఏదో తెలియదు.

ఈ సందర్బంలో గాంధారి సోదరుని పేరు శకుని, అతని కుమారుని పేరు 

ఉలూకుడు అనేవి గమనించదగిన అంశాలు. అవి వీరు పక్షిజాతికి చెందినవారు అని స్పష్టంగా తెలుపుతవి.

కశ్యప మహర్షి సంతానంలో మొదటి వర్గంవారు పితృస్వామ్యంతో జీవించగా రెండవ వర్గం వారు మాతృస్వామ్యంతో బ్రతికినారు. మొదటివారు తమ గణ సంకేతాన్ని ఋషినామంగా దిద్దుకొని గోత్రంగా మార్చుకోగా రెండవవారు దాన్నాలాగే జాతి వాచకంగా ఉంచుకున్నా రనిపిస్తుంది. దీనికి ఈ వ్యాసం మొదట నేను చూపిన గోత్రనామాలు ఒక 

ఉదాహరణంగా ఉన్నవి.

ఇక మాతృస్వామ్యంలో నిలిచినవారిలో కన్యలే ఎక్కువగా కనిపిస్తున్నారు. వారిని మహారాజులు, మహర్షులు వంశవివక్షత లేకుండా వివాహమాడి సంతానాన్ని పొందినారు. వారికి కలిగిన సంతానం తండ్రి గోత్రాలకు చెందినారు. అంటే క్రమంగా sTÖ రూపంలో మాతృస్వామ్యం పితృస్వామ్యంగా రూపొందింది. పురాణాలలోని కన్యలు శాపగ్రస్తలై జాంతవ గణాలకు చెందినపుడు పుత్ర ముఖదర్శనంతో వారికి శాపవిముక్తి కలగటం పరిపాటి.

అశోకుని కాలంలో బానిస విధానం ఉండేది కాని ఆ బానిస స్త్రీ తమ యజమానికి ఒక బిడ్డను కన్నట్టయితే ఆమెకు దాస్యవిముక్తి కలిగి కలిగిన బిడ్డకు తండ్రి వారసత్వం లభించేది కనుక బహుశః ఆ నియమమే మన పురాణాలలో పుత్రముఖ దర్శనంతో శాపావసానంగా రూపుదిద్దుకున్నది అని పిస్తుంది.

పితృస్వామ్యానికి చెందినవారంతా మైదానాలకుచేరి పెద్ద పెద్ద పట్టణాలు కట్టి నాగరికతకు పునాదులు వేస్తే మాతృస్వామ్యం వారు వీలైనంత వరకు అరణ్యాలలోనే ఉండి ప్రాకృతిక జీవితాన్ని అవలంబించినారు. అయినా వారిద్దరి నడుమ సంబంధ బాంధవ్యాలు మాత్రం తెగి పోలేదు.

sTÖ విధంగా చరిత్రలో గతించిన సుదీర్ఘ కాలంలో sTÖనాటి ఆర్య-ద్రావిడ వాదం sTÖ వంశాలతోనే రూపుదిద్దుకున్నదా అనిపిస్తుంది. జిజ్ఞాసువు లెవరైనా పరిశోధిస్తే sTÖ వంశాల వెనుక యింకా ఎన్నెన్నో విశేషాలు బయటపడగలవు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి