1. మంచినీటిచే దీపాలు వెలిగించేరు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా భారతదేశంలో నదులకు వర్షాలే ఆధారం కావడంతో వర్షాల ఆధారంగా కురిసిన నీటిని కాలువల ద్వారా నదులకు నదుల ద్వారా ప్రాజెక్టులకు మళ్ళించి తద్వారా విద్యుదుత్పత్తిని చేస్తున్నారు. భారతదేశంలో నిత్యం ప్రవహించే జీవనదులుండటంతో ఆయా రాష్ట్రాలు జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోగల్గుతున్నాయి. ప్రస్తుతం ఇళ్ళలో, ఆఫీసుల్లో, వీదుల్లో, పరిశ్రమల్లో వెలిగే లైట్లన్ని నీటి ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంట్ ద్వారా వెలుగుచున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ కేంద్రాలు:
ప్రాజెక్టుపేరు నిర్వహించే సంస్థ
నాగార్జున సాగర్ మెయిన్ పవర్ హౌస్ టీఎస్ జెన్కో
నాగార్జున సాగర్ ఎడమకాలువ పంప్‌హౌస్ “ “
శ్రీశైలం ఎడమకాలువ పవర్ హౌస్ “ ”
పోచంపాడు పవర్ హౌస్ “ ”
సింగూర్ పవర్ హౌస్ “ ”
నిజాంసాగర్ పవర్ హౌస్ “ ”
జూరాల హైడల్ ప్రాజెక్టు “ ”
జూరాల హైడల్ ప్రాజెక్టు “ ”
ఈ విధంగా జలవిద్యుత్ కేంద్రాలద్వారా విద్యుత్పత్తి జరగడము వల్ల మంచి నీటిచే దీపాలు వెలుగుచున్నాయి. ఇదా కాలజ్ఞాన మహిమే 17 వ శతాబ్దంలో చెప్పినదే.
2. రోగాలు ఘనమయ్యేను మందు పారకపాయ్యేను
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగ ప్రాణాలు నిలబెట్టాల్సిన మందులన్ని పదును కోల్పోతున్నాయి. వ్యాది కారక క్రిములు జడలు విచ్చుకుంటున్నాయి. వీటి బలం ముందు మందుల పవర్ దూదిపించలా తెలిపోతోంది. సాంకేతికంగా ఎంతో ప్రగతి సాధించామని, సైన్స్ మరెంతో అభివృద్ధి చెందిందని చెప్ప్పుకుంటున్న మానవుని మేదాశక్తిని సవాల్‌చేస్తూ ఎప్పటికప్ప్పుడు కొత్తజబ్బులు వస్తూనే ఉన్నాయి. వ్యాది కారకాలు డ్రగ్ రెసిసెట్టన్స్ పెంచుకొని ఏ మందుకు లొంగని స్థాయికి చేరుతున్నాయి. ఈ పరిణామం ఇప్ప్పుడు వైద్య రంగానికే పెను సవాలు విసురుతోంది. మామÖలు గాయాలు జబ్బులు ఇన్ఫెక్షన్లు కూడా తగ్గని పరిస్థితి ఏర్పడిందని,, మున్నుందు మానవాళి మనుగడే ప్రమాదంలో పడిపోతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తేలిగ్గా తగ్గిపోయే జలుబు దగ్గు జ్వరం చిన్న చిన్న జబ్బులకు సైతం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ అష్టకష్టాలు పడుతూ ఖరీదైర మందులు వాడినా లొంగని నయం కాని దుస్థితి తలెత్తిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఐదేళ్ళలో గడ్డం గీసుకుంటే అయ్యే గాయాలు కూడా మానవేమోయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా రోగాలు మొండిగా మారి పోవడం వల్ల మందులు పని చేయవు. ఇదీ కాలజ్ఞానమహిమే ముందుగా చెప్పినదే.
త్రాగునీటిని విక్రయించేరు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన ప్రకారంగ భూమి, గాలి, నీరు, అగ్ని ఆకాశం పంచ భూతాల్లో ఒక్కటైన ప్రకృతి ప్రసాదంగా లభ్యమయ్యే నీరు నేడు వ్యాపార వస్తువుగా మారి అమ్మేవారికి పన్నీరు కొనేవారికి కన్నీరులా అన్నట్లు మంచి నీరు కాసులు కురిపించే కల్పతరువుగా మారింది. సహజసిద్దంగా భూదేవి అందించే నీరు ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉండాల్సిందిపోయి నేడు త్రాగునీరు గొప్ప వ్యాపార వస్తువుగా మారంతో ఉద్యోగ వ్యాపారాలు అవసరాల నిమిత్తం బయటికి వెళ్ళినప్ప్పుడు తప్పనిసరిగా డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది. కొందరు వ్యాపారస్తులు మినరల్ వాటర్ పేర ప్లాంట్ ఏర్పాటు చేసుకొని ఎలాంటి టెస్టులు లేకుండా ఎంత వాటర్‌కు ఎంత మినరల్ కలపాలన్నది అవగాహన లేకుండా మామÖలు నీళ్ళనే మినరల్ వాటర్ ప్యాకింగ్ చేసి బాటిళ్ళలో క్యాన్లలో నింపి ప్రజలను బోల్తా కొట్టించే మల్టినేషనల్ కంపెనీల వరకు ఈ మంచినీళ్ళ వ్యాపారం కాసులు కురింపించే వరంగా మారిందని చెప్పడంలో సందేహం లేదు. ఈ విధంగా కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే మంచి నీటిని అమ్ముచున్నారు. ఇదీ కాలజ్ఞాన మహిమే ముందుగా చెప్పినదే.
ఆస్తుల కోసం అయిన వాళ్ళే చంపుకునేరు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఆస్తుల కోసం సొంత అన్నను, తమ్ముడు చంపేశాడు. ఆస్తుల పంపకాల్లో తేడా వచ్చిందని కన్న తండ్రిని ఓ కొడుకు దారుణంగా హత్యచేశాడు. తనతో విడిపోయిన మొదటి బార్యకు ఆస్థిలో వాటా ఇవ్వాల్సివస్తుందని హత్యచేశాడో ఓ భర్త, ఆస్తుల్లో బాగం ఇవాల్సివస్తుందని తోడబుట్టిన చెల్లెల్ని అన్న దారుణంగా అంతమొందించాడు. కన్నతల్లిని హింసిస్తే గుప్తనిధులు సొంతమవుతాయన్న జ్యోతిష్యుడి మాటలు నమ్మి ఓ కూతురు తన తండ్రితో కలిసి తల్లిని చిత్రహింసలకు గురి చేశారు. ఆస్తి కోసం సభ్య సమాజం తలదించుకొనేలా దారుణాలకు పాల్పడుతున్నారు. మానవత్వం మంటకలిసి పోతోంది. ప్రేమభిమానాలు మచ్చుకైన కనిపించడం లేదు. బంధాలు అనుబంధాలను ప్రక్కనపెట్టి ఆస్తుల కోసం కుటుంబ సభ్యులే ప్రాణాలు తీస్తున్నారు. మరో సంఘటనలో కన్న తల్లిని కన్న కొడుకు చంపి ఇంట్లో పాతిపెట్టాడు. ఓ ఉన్మాది ఆస్తి కోసం భార్యా, కూతురు, తల్లిని కిరాతంగా చంపేశాడు. త్రాగడానికి డబ్బు ఇవ్వలేదని చెల్లెలిని చంపేసిన అన్నయ్య. ఆస్తుల గొడవలోఅత్తను చంపిన కోడలు. తనకు తెలియకుండా రూ॥ 30 వేలు బందువులకు ఇచ్చిందని భార్యను గొంతు నులిమి చంపిన భర్త. ప్రతిరోజు ఏ పేపరు చూసిన ఏ న్యూస్ చానల్ చూసిన ఇలాంటి వార్తలే అధికం. ఇటీవలి కాలంలో హైద్రాబాద్‌లోని జంట నగరాల పరిదిలో ఏడాది కాలంగా 30కి పైగా ఆస్తి కోసం హత్యలు జరిగినట్లు పోలీస్ రికార్డులు తెలియజేస్తున్నాయి. ఇదీ కాలజ్ఞాన మహిమే. 17వ శతాబ్దంలో చెప్పి హెచ్చరించినవే.
కుంటలు బావులు చెరువులు నదులు జలాలు లేక ఇంకిపోయ్యేను. జుర్రేరు నీరింకదు.
కాలజ్ఞానంలో చెప్పినట్లుగా దేశంలో భూగర్భజలాలు దాదాపు సగానికి పైగా తగ్గి పోయాయని కేంద్ర జలవనరుల, నదుల అభివృద్ధి గంగా ప్రక్షాళన మంత్రిత్వశాఖ ప్రకటించడం ఆందోళన కలిగించే అంశం. భారత్‌లో వివిధ ప్రాంతాల్లోని 14346 బావులను పరిశీలిస్తే అందులో 46%పైగా భూగర్భ జాలాలు అడుగంటిన విషయం బయటపడినట్లు ఆశాఖ అధికారికంగా వెల్లడించింది. కేంద్ర భూగర్భ జలాల బోర్డు సేకరించిన ఈ వివరాల ప్రకారం 2010`2014 వరకు ఉన్న భూగర్భ జలాలతో పోల్చినప్ప్పుడు 46%కి పైగా తగ్గిపోయినట్లు వెళ్ళడైంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, డిల్లీ, గుజరాత్ , మేఘాలయ, పుదుచ్చేరి, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో అయితే 50% పైగా భూగర్భజలాలు అడుగంటిన విషయం వెలుగు చూసింది. ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండి పెరుగుతున్న జనాభాకు పారిశ్రామిక అవసరాలకు, వ్యవసాయానికి ప్రధాన ఆధారం భూగర్భజలాలే. రోజురోజుకు పెరుగుతున్న అవసరాలు వర్షాభావం వల్ల భూగర్భజలాలు గతంలో ఎన్నడూ లేని విధంగా అడుగంటి పోతున్నాయి. ఈ విధంగా దేశవ్యాప్తంగా వున్న బావులు, కుంటలు చెరువులు నదులలోని నీరింకి పోయినను జుర్రేరు నీరు మాత్రం ఇంకదు. ఇదీ కాలజ్ఞాన మహిమ 17వ శతాబ్దంలో చెప్పినదే.
రైతుల ఆత్మహత్యలు
ఎంతో కాలంగా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. 1995 నుండి 2014 దాకా 20 సం॥లలో 3,01,1923 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో 44 వేల మంది మహిళరైతులున్నారు.
సం॥ దేశవ్యాప్తంగా సం॥ దేశవ్యాప్తంగా
చనిపోయినరైతులు చనిపోయినరైతులు
1995 10,270 2005 17,131
1996 13,729 2006 17,060
1997 13,622 2007 16,632
1998 16,015 2008 16,196
1999 16,082 2009 17,368
2000 16,603 2010 15,964
2001 16,415 2011 14,027
2002 17,971 2012 13,754
2003 17164 2013 11,772
2004 18,241 2014 5650
రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నేషనల్ క్రై రికార్డ్ బ్యూరో , వివిధ రాష్ట్రాలలో నమోదు చేసిన వివరాలు చెబుతున్నాయి. ఇదీ కాలజ్ఞానమహిమే ముందు చెప్పినదే.
కల్లు గంజాయి నల్లమందు సేవించి దురాచారులై అజ్ఞానులైపోదురు
కాలజ్ఞానంలో చెప్పినట్లుగా మనుషుల ప్రాణాలను పీల్చి పిప్పి చేసే మాదక ద్రవ్యాలకు పెదవాళ్ళు దనికులు అనే తేడా లేకుండా వీటి భారిన పడుతున్నారు. గంజాయి, నల్లమందు, కొకైన్ హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలకు హైదరాబాద్ అడ్డాగా మారిపోయింది. దేశ విదేశాల నుండి స్మగ్లింగ్ అయ్యే కొకైన్ హెరాయిన్ వంటి డ్రగ్స్‌కు సినిమా నటుల నుంచి వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, సంపన్న వర్గాల దాకా ఈ డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. దక్షిణ అమెరికా ఆఫ్రికా దేశాలకు చెందినవారు వివిధ మార్గాల ద్వారా డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలించి వీరికి అందజేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడకు వస్తున్న మాదక ద్రవ్యాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. ఈ విధంగా డ్రగ్స్ బారినపడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదీ కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే జరుగుతున్నది.
వడ్డీల గురువయ్య వచ్చేను నూటికి పది లెక్కనిచ్చేను కొంపగోడూలేకచేసేను. పేదల రక్తంబు పీల్చేను.
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా దేశవ్యాప్తంగా మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాలో నివసించే పేద, మధ్య తరగతి వాళ్ళ అవసరాలను ఆసరా చేసుకొని నూటికి 5 నుండి 10కి అధిక వడ్డీలు వసూలు చేసే ప్రవేటు వడ్డీ వ్యాపారులు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి. అనుమతులు లేని ప్రవేట్ ఫైనాన్స్ కంపెనీలలో పేరు మోసిన రౌడీలు, గుండాలు వడ్డీల మొత్తాలను వసూలు చేస్తూ వేదింపులకు బెదింపులకు పాల్పడుతున్నారు. అత్యవసరపరిస్థితిల్లో చిన్నచిన్న వ్యాపారాలు, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు కోసం, వైద్యంకోసం, విదేశీ చదువులకోసం ఉద్యోగాల కోసం తప్పనిసరి పరిస్థితిలలో డబ్బు అవసరమైన వారు ప్రవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వీరి అవసరాలను ఆసరా చేసుకొని నూటికి 5రూ॥ నుండి 20రూ॥ల వరకు వడ్డీలు వసూలు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి వడ్డీరేట్లు పెంచుతూ వడ్డీ వ్యాపారులు కోట్లకు పడగలెత్తుతున్నారు. హైద్రాబాద్ మహానగరంలో దాదాపు 200 మందికి పైగా అధిక వడ్డీలు వసూలు చేసే వ్యాపారున్నట్లు ఒక అంచనా. ఈ మధ్యన దేశవ్యాప్తంగా సంచనం సృష్టించిన కాల్‌మని వడ్డీ వ్యాపారుల ఆగడాలు టీవిల్లో, పేపర్లో చూసి దేశమంతా నివ్వెరపోయింది. ముఖ్యంగా కాల్‌మని వడ్డీ వ్యాపారంలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు రక్షకులుగా ఉండటం గమనార్హం. అప్ప్పు తీసుకున్న వ్యక్తి సకాలంలో వడ్డీ చెల్లించకపోతే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించటం, వారి బ్యాంకు చెక్కులను ఏటీఎం కార్డులను స్వాదీనం చేసుకోవడం, వాహనాలను పట్టుకవెళ్ళడం, ఇళ్ళకు వచ్చి సామాన్లు పట్టుకుపోవడంతోపాటు, ఇళ్ళను ఫాట్లను వారి పేర వ్రాయించుకోవడం మహిళలను కిడ్నాప్ చేసి నగర శివారుల్లో ఉన్న ఇళ్ళలో వుంచి తాళాలు వేసిన సంఘటలున్నాయి. ఈ విధంగా వడ్డీవ్యాపారుల ఆగడాలు భరించలేక లక్ష రూ॥ అప్ప్పుతీసుకుంటే 4 లక్షలు వడ్డీ 5లక్షలు కట్టినట్లు బాధితులు వాపోతున్నారు. అనేకమంది వడ్డీ కట్టలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు అనేకం వున్నాయి. ఈ విధంగా వడ్డీల పేరుతో పేదల రక్తాన్ని పీల్చి వారి ఇళ్ళను, భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇదీ కాలజ్ఞాన మహిమే 17వ శతాబ్దంలో చెప్పి హెచ్చరించినదే.
లంచాల రక్కసి కాళ్ళక్రింద నలిగిఅరచరచి చచ్చేరు
కాలజ్ఞానంలో చెప్పినట్లుగా ఇందులదు అందులేదనుచు రసందేహం వలదు ఎదెందు చూచిన అందందే కలదు. దేశమంత ప్రభుత్వకార్యాలయాల్లో అవినీతి అంటువ్యాదిలా విస్తరించింది. వీరిలో చిన్నా పెద్ద అన్న తారతమ్యం లేకుండా అన్ని స్థాయిల్లోని అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఏసీబి వద్ద నమోదైన కేసులపై జరిపిన సర్వేలో వెల్లడైంది. దేశంలో సాలీనా పట్టణ ప్రాంత ప్రజలు సగటున 440 రూ॥లు, గ్రామీణ ప్రాంత ప్రజలు సగటున 2900 రూ॥లు లంచాలు లేదా ముడుపుల రూపంలో చెల్లిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు చేతులు తడపనిదే పనులు జరగడం లేదని పేర్కొనడం గమనార్హం. వివిధరకాల పెన్షన్ల మంజూరు, కుల, ఆధాయ, నివాస, ద్రువపత్రాలు, భూములు రిజిస్ట్రేషన్లు, రేషన్‌కార్డులు, ప్రభుత్వపథకాల ద్వారా లబ్ది పొందాలంటే లంచాలు ఇవ్వాల్సిందే. ఇక రాజకీయంగా చూస్తే ఉద్యోగుల నియమాకాలు బదీలు, వివిధ పనులకు సంబంధించిన కాంట్రాక్టులు సెటిల్మెంట్లు మైనింగ్, ఇసుక క్వారీలు తదితర విషయాల్లో భారీగా ముడుపులు అందుతున్నట్లు వెల్లడైంది. ప్రభుత్వ ఉద్యోగాలకు లంచాలు ఇవ్వనిదే ఉద్యోగాలు రావు. ప్రభుత్వ ఆసుపత్రిలో ముడుపులు చెల్లించనిదే వైద్యం జరగని పరిస్థితి ఏర్పడింది. ఇలా లంచాలు ఇవ్వలేక లంచాలు రక్కసి క్రింద నలిగి అరచరచి చస్తున్నారు. ఇదీ కాలజ్ఞానమహిమే ముందుగా చెప్పినదే.
యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకెవేసి రాళ్ళు మ్రింగేను.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాలోగల బనగానపల్లె నుండి 10 కి॥మీ దూరంలో ఎర్రమల కొండల్లో వెలసిన “యాగంటి”ఒక ప్రసిద్ధ శైవక్షేత్రం. ఈ ఆలయంలో ప్రధాన ముఖద్వారమునందు ఈశాన్య దిశయందు నందీశ్వరుడు వెలయడము ఈ క్షేత్రం యొక్క ప్రత్యేక ఆకర్షణ. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా యాగంటి దివ్యక్షేత్రంలో వెలసిన నందీశ్వరుడు. సుమారు 100 సం॥ల క్రితం నాలుగు స్తంబాల లోపల నందీశ్వరుని చుట్టూ ప్రదక్షణాలు చేయడానికి భక్తులకు వీలుగా ఖాళీస్థలం ఉండేదట. కానీ నేడు నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఏమాత్రము అవకాశము లేకుండా పెరిగి పోయాడు. పురావస్తు శాఖవారికి లెక్కల ప్రకారం 20సం॥లకు ఒక అంగుళము చొప్ప్పున నందీశ్వరుడు పెరుగుతున్నట్లు అంచనా వేశారు. దీనిని బట్టీ కాలజ్ఞానం ప్రకారము నందీశ్వరుడు పెరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమగుచున్నది. వీరబోగవసంతరాయలు వచ్చునప్ప్పుడు ఈ నందీశ్వరుడు కాలు దువ్వి రంకెవేసి రాళ్ళు మ్రింగును ఇదీ కాలజ్ఞానం ప్రకారం జరిగి తీరవలసివుంది.
పంచాంగములు పనికి మాలినవైపోవు
కలియుగ ప్రత్యక్షదైవము శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం ప్రముఖ పండితుల, సిద్ధాంతుల, జ్యోతిష్యుల పంచాంగంలో ఒక్కొక్కరు ఒక్కోవిధంగా నిర్ణయించిన ముహూర్తులతో ప్రతి పండగ వివాదస్పదంగా జరుగుతోంది. అదేవిధంగా 2015 జులైలో వచ్చిన గోదావరి మహాపుష్కరాలు కూడా వివాదస్పదంగా నిర్వహించారు. వీరంతా ప్రముఖ సిద్ధాంతులే జ్యోతిష్యులే. అయినప్పటికి ముహూర్తాలు వారి ఇష్టానుసారంగా నిర్ణయించుకుంటున్నారు. రాజమండ్రి పట్టణానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యులు మదుర కృష్ణమÖర్తి శాస్త్రి 2015 జూన్ 28వ తేదీన గోదావరి మహాపుష్కరాలకు ముహూర్తము నిర్ణయించి ప్రారంభించారు. రాజమండ్రి పట్టణానికి చెందిన మరో సిద్ధాంతి బుట్టె వీరభద్రదైవజ్ఞ శ్రీశైల ఆస్థాన పండితుడు పంచాంగకర్త అయిన శ్రీబుట్టే వీర భద్ర దైవజ్ఞ గోదావరి మహాపుష్కరాలకు జులై 7 2015 వ తేదీన పుష్కర ముహూర్తము నిర్ణయించారు. దీంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానము నిర్ణయించిన ముహూర్తము పుష్కరాలకు సరియైన ముహూర్తం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరి ముహూర్తాలే కాకుండ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సిద్ధాంతులు జులై 14 2015 న గోదావరి మహాపుష్కరాలకు ముహూర్తము నిర్ణయించడం జరిగింది. అయితే ఏది సరి అయిన ముహూర్తమో, ఏ ముహూర్తంలో పుష్కరస్నానం చేయాలో తెలియక భక్తులు అయోమయానికి గురయ్యారు. ఏది ఏమైనప్పటికి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి పుష్కరాల సందర్భంగా 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా పంచాంగం ప్రకారం జాతక చక్రాలు పరిశీలించి సరైన పెళ్ళి ముహూర్తాలు నిర్ణయించినప్పటికిపెళ్ళిపీటల మీదనే పెళ్ళిళ్ళు ఆగిపోవడం లేదా పెళ్ళి జరిగిన తర్వాత పెళ్ళి కుమారుని ఇంటికో పెళ్ళి కుమార్తె ఇంటికో వెళ్ళేటప్ప్పుడు మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోవటం జరుగుతున్నాయి. ఒక వేళ అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరిగినా కట్నం తక్కువ ఇచ్చారనో లంచానాలు పెట్టలేదనో, భర్త పెట్టే వేదింపులు తట్టుకోలేక నిండు నూరేళ్ళు కలిసి జీవించాల్సినవారు సం॥ గడవక ముందే విడాకులు తీసుకుంటున్నారు. ఈ విధంగా కాలజ్ఞానం ప్రకారం పంచాంగములు పనికిరాకుండా పోతున్నాయి. ఇదీ కాలజ్ఞాన మహిమే ముందుగా చెప్పినదే.
తియ్యని బెల్లం చేదయ్యేను
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారూ షుగర్ వ్యాది భారిన పడుతున్నారు. డయాబెటిస్‌ని మనవాళ్ళు మదుమేహం, షుగర్వ్యాది, చక్కెవ్యాది, అతిమÖత్ర వ్యాదిగా వ్యవహరిస్తున్నారు. రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని శరీరం సక్రమంగా నియంత్రించ లేకపోయినప్ప్పుడు డయాబేటిస్ వస్తుంది. షుగర్ ప్రపంచంలో అన్నింటి కంటే పెద్ద జబ్బుగా మారింది. ప్రపంచలో అన్నింటి కంటే పెద్ద జబ్బుగా మారింది. ప్రపంచంలో నేడు శరవేగంగా వ్యాపిస్తున్న మదుమేహం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. గుండె ఫెయిల్‌కావడం, కిడ్ని ఫెయిల్‌కావడం, పక్షవాతం, మెదడు, లివర్ ఫెయిల్ కావడం, అలసట, నీరసం, తరుచుగా మÖత్రవిసర్జన కలగడం లాంటి అనేక ఇబ్బందులు దీనివల్ల కలుగుతాయి. గ్రేటర్ హైదరాబాద్ నగరం ఇప్ప్పుడు మదుమేహనగరంగా మారుతోంది. దేశంలో ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే మదుమేహబాధితుల శాతం హైదరాబాద్‌లోనే ఎక్కువని ప్రస్తుతం వైద్యులు చెబుతున్నారు. అంటే దాదాపు 25% అన్నమాట. ఈ విధంగా షుగర్ వ్యాదితో బాధపడుతు 25% మందికి తియ్యని బెల్లం చేదుగానే ఉంటుంది. ఇదీ కాలజ్ఞాన మహిమే 17వ శతాబ్దంలో చెప్పినదే.
పసిపిల్లలు మొదలు కొని చావుకు దగ్గరయ్యేరు
సైన్స్ పరంగా మానవుడు ఎంత అభివృద్ధి సాధించినప్పటికిని నేటికి ప్రపంచవ్యాప్తంగా పసిపిల్లల మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన “యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యÖనిసెఫ్) తాజ నివేదికలో పేర్కొంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగ దేశంలో అతిసార వ్యాది కారణంగా ఏడాదికి 15లక్షల చిన్నారులు చనిపోతున్నారని సైన్స్ పర్యావరణ నివేదిక తెలిపింది. ప్రపంచ దేశాల్లో నిమిషానికి 11 మంది గంటకు 700 మంది రోజుకు 16000 మంది ఐదేళ్ళలోపు చిన్నారులు మృత్యువాత పడుతున్నారని ఆందోళనవ్యక్తం చేసింది. పౌష్టికాహార లోపం మరియు రోగాల వల్ల ఈ ఏడాది 2015 లో 59 లక్షల మంది చిన్నారులు 5వ పుట్టిన రోజు జరుపుకునే లోపే మరణానికి చేరువవుతున్నారని హెచ్చరించింది. 1990లో 1.27 కోట్లుగా నమోదైన పసి పిల్లల మరణాలు 2015 నాటికి 50% పైగా మరణాలు తగ్గి 60 లక్షల కన్నా తక్కువగా చేరుకున్నప్పటికి ఆ మరణాల రేటు ఎక్కువేనని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. న్యుమోనియా ప్రసవం సమయంలో సమస్యలు విరేచనాలు, మలేరియా వంటివి ఐదేళ్ళలోపు చిన్నారుల మరణాలకు ప్రధానకారణాలని ఈ విధంగా కాలజ్ఞానం ప్రకారం పసిపిల్లలు మొదలుకొని చావుకు దగ్గరవుచున్నారు. ఇదీ కాలజ్ఞాన మహిమే ముందుగా చెప్పినదే.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి