సృష్టిలో ప్రాణిప్రపంచం స్థావర జంగమాలని రెండు విధాలు. స్థావరాలనగా కదలకుండ ఒకేచోట ఉండేవి. జంగమాలనగా భూమి అంతటా సంచరించేవి. స్థావరాలలో వృక్షజాతులు ముఖ్యమైనవి. సృష్టిలో అవే మొదట పుట్టినవి. అవి నేలపై వేరూనిన పిమ్మటనే జంగమప్రాణులవతరించినవని పరిశోధకులు చెబుతున్నరు. అంతేకాక స్థావరాలకు గూడ జంగమాలవలెనే ప్రాణముందని వానికి గూడ సుఖదుఃఖాలున్నవని నేడు నిరూపిస్తున్నారు.
స్వర్గంలో దేవతాసృష్టి జరిగిన పిమ్మటనే భూలోకంలో మానవసృష్టి జరిగినట్లు పురాణాలు తెలపుతవి. ప్రారంభంలో దేవతలు భూలోకానికి వచ్చినపుడు వారికిక్కడ ఆవాసాలుగాని, ఆలయాలుగాని లేవు. అందువల్ల వారు ఒక్కొక్కరు ఒక్కొక్క వృక్షాన్నెన్నుకొని దానికి తమ అంశను కొంత ధారబోసి ఆ చెట్ల క్రిందనే తాము నిలిచినారు. అందువల్ల వారి కళాన్యాసాలపుడు ఆయా వృక్షాల యొక్క పుష్పాలలో మనకు దర్శనమిస్తయి. పూలలో ఈవిధంగా దేవతాంశ ఉంది కనుకనే వానికి సుమనస్సులనే పేరు నిలిచింది.
ఈనాడు ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క చెట్టు పూలు ఇష్టమైనా మొత్తంపై ఏ దేవుని పూజకైనా పూలే ప్రధాన ద్రవ్యంగా ఏర్పడినవి.
హిందువులకున్న వృక్షపూజ వేదకాలం నుండియే ఏర్పడింది. వానిని వారు దేవతలుగానే మన్నించినారు. అందుచేత ఆగమశాస్త్రంలో ధ్వజస్తంభాలకుగాని రథాలకుగాని తగిన వృక్షాలనెన్నుకొని వానిని నరికే అప్పుడు ఆ వృక్ష మÖలంలో మొదట హవనంచేసి ఆ వృక్షాధి దైవతానికి ఆహుతులిచ్చి పూజించి అతనిని అనంతరం ఆ వృక్షాన్ని విడిచి వెళ్లమని ప్రార్థించిన పిమ్మటనే దాన్ని ఛేదించవలసి ఉంటుంది. ఇట్లా మనకు వృక్షారాధన అతి ప్రాచీనం నుండియే ఏర్చరచబడింది కాబట్ట్టి మనదేశంలో ఎందరో దేవతల మొదట ఈ దేశంలో చెట్ల క్రిందనే వెలసినారు.
బ్రహ్మ మేడికింద, నారాయణుడు రావిక్రింద, శివుడు మర్రికింద
ఉంటారు. కంచిలోని ఏకామ్రేశ్వరుడు అక్కడ మొదట మామిడిచెట్టు క్రిందనే ఉన్నాడట. మధురలోని మీనాక్షిదేవి ఒక కదంబం క్రింద ఉన్నదట. నేడు ఆలయంలో దాని మ్రాను అట్లాగే ఉంది అంటారు. కళింగదేశంలోని మధూకేశ్వరుడు ఒక ఇప్పచెట్టు క్రింద ఈ తిరుపతిలోని శ్రీనివాసుడు మొదట ఒకచింత క్రిందనే యున్నాడని అంటారు. కాబట్టి యిట్లా మనయొక్క మహావృక్షాలు మానవులకు వలెనే ఎందరో దేవతా మÖర్తులకు గూడ ఆశ్రయమిచ్చినవి.
అంతేకాక అవి వారికి ఆవాసంతోపాటు వాహనాలుగూడ అయినవి. మానవులకుగాని, దేవతలకుగాని, గజాశ్వాలవలెనే వృక్షాలుగూడ వాహనాలవుతూనే ఉంటవి. ఏనుగు, గుఱ్ఱం మొనలైనవి నడిచే జంతువులు కాబట్టి వాహనాలు కావచ్చు కాని స్థావరాలు అనగా ఉన్నచోటనుండి కదలలేని చెట్లు ఎట్లా వాహనాలవుతవి అనే సందేహం మీకు కలుగవచ్చు.
పూర్వం యిల్లు కట్టినా బండి చేసినా ఒకేచెట్టుతో చేయవలెనని మయబ్రహ్మలనేవారు. పూర్వం మహావృక్షాలుండేవట. ఒక్క చెట్టును నరికితేనే ఒక యింటికి సరిపడే దూలాలు, వాసాలు వెళ్లేవట. మా మాతామహుడు చెప్పగా విన్నాను కాని ఈనాడంతటి మహావృక్షాలు లేవు. అందుచేత దారుశిల్పులు ఒకేజాతికి చెందిన రెండుమÖడు చెట్లను చూసి వానినెన్ను కుంటున్నారు కాని దేవునికి తేరుచేసినప్పుడు దానికి సరిపడిన కలప అంతా ఒకే మహావృక్షం నుండి వెళ్లింది అంటే అపుడా వృక్షం స్వామి వారికి వాహనమయినట్లే గదా! అయితే ఇప్పుడీ వృక్షరూప వాహనాలను వాహనం అనక ధ్వజం అనగా తేరంటున్నారు.
ఈ విధంగా మనకు వృక్షాలు మేనా ` పల్లకి మరియు శకటం అనే రూపాలు ధరించి వాహనాలుగా అవుతున్నవి.
తెలంగాణలో ఇప్పటికి ఎద్దులు లాగే బండ్లన్ని త£రుచుగా తుమ్మకఱ్ఱతోనే చేయబడుతుంటవి. ముండ్ల చెట్లను ఇండ్లకు, వాహనాలకు, ఆసనాలకు ఉపయోగించరాదని నియమమున్నా ఈనాటి వడ్రంగులు ఇప్పటి ‘ఫారిన్ కంప’ యొక్క కఱ్ఱతోనే సోఫాసెట్లు చేస్తున్నారు. దాని కఱ్ఱ చూడటానికి నలుపు రంగులో ‘రోజవుడ’ ఎఱ్ఱచందనం కలప వలెనే కనిపిస్తుంది. కనుక ఇప్పుడు మనమంతా కంటక సింహాసస్తులమే అవుతున్నాం కనుక మానవుల స్థితి ఎట్లున్నా దేవుని యొక్క వాహనాలకుమాత్రం దానిని వాడరాదు. దేవునికి పూలుగూడ ముండ్లచెట్లవి వాడరాదనియే శాస్త్రం.
ఆలయాలలోని దేవతల వాహనాలన్ని శ్రీకృష్ణుడు గీతలో తెల్పిన తనయొక్క విభూతులే అని యింతవరకే తెలుపటం జరిగింది.
అతడు -
శ్లో. ఉచ్చైశ్రవణమశ్వానాం విద్దిమామృతోద్భవం
ఐరావతంగజేంద్రాణాం, నరాణాంచనరాధిపమ్
శ్లో. ఆయుధానామహం వజ్రం ధేనూనా మస్మి కామధుర్
ఓ అర్జునా! అమృతం యొక్క తోడబుట్టిన ఉచ్చైశ్రవం, ఐరావతం మరియు కామధేనువు గూడ నేనేనని తెలిసికో అన్నాడు కాని యిందులో ఎక్కడా కల్పవ ృక్షం పేరెత్తలేదు. అయితే వీనికంటే మొదలే అశ్వత్థం సర్వవృక్షాణాం దేవర్షీణాంచనారదః (10.26)
నేను వృక్షాలన్నిటిలో అశ్వత్థం అనగా రావిచెట్టును అని చెప్పడం జరిగింది. కల్పవృక్షాన్ని దేవతావాసం అంటారు గాని రావిచెట్టు అచ్యుతా వాసంగా ఉంది. అందుచేతనే శ్రీకృష్ణుడింక వేరువేరుగా కల్పవృక్షాన్ని పేర్కొనలేదని భావించవచ్చు
మనవారు పండిత సభను`
శ్లో. సభా కల్పతరుం వందే వేదశాఖోపజీవితం
శాస్త్త్రపుష్ప సమాయుక్తం విద్వద్భ్రమరశోభితం
అని కల్పవృక్షంతో పోల్చినారు. కల్పవృక్షం అంటే కోరిన కోరికలన్ని తీర్చేది అని అర్థం. కనుక పూర్వం మనదేశంలోని పండిత పరిషత్తులుగూడ అట్లా కల్పవ ృక్షంవలె సామాన్య ప్రజల యొక్క కోరికలన్ని తీర్చేవిగా ఉండేవి అనవచ్చు. కాని కల్పవృక్షాన్నెవరు ప్రత్యక్షంగా చూసి ఉండరు.
శ్లో. స్వర్ణైః స్కంధ పరిగ్రీVA - మరకతైరుల్లా సితాః పల్లవా
ముక్తాభిఃస్తబకశ్రియో- మధులిహం వృందాని నీలోత్చలైౖః
సంకల్పాను విధాయ యస్యఫలితం - కస్తస్యధŠత్తేతులాం
ధిక్జాతుద్రుమసంకధాసు యదయం కల్పద్రుమో పిద్రుమః
తా. ఆ కల్పవృక్షం యొక్క మ్రాను మరియు శాఖలన్ని గూడ బంగారు మయంగా చిగురాకులు మరకతమయంగాను దాని మొగ్గలన్ని ముత్యాల గుత్తులుగాను పూలన్ని పుష్యరాగాలుగాను ఉండి పండ్లు మాత్రం ఎవరేది కోరితె ఆ రూపంలో పండుతూ ఉంటవి. కాబట్టి లోకంలోని వృక్షజాతిలో దానికేది సమానమని చెవ్పగలం. వృక్షజాతులన్ని దాని క్రింద “బలాదూరు” అని రన్హనుడు అనే కÁవి కల్పవృక్షాన్ని గుఱించి వివరించినాడు.
కల్పవృక్షం యొక్క పుట్టుక
ఈ కల్పవృక్షం దుర్వాసుని యొక్క శాపంచేత స్వర్గలక్ష్మి అంతా సముద్రం పాలైపోగా తిరిగి దాన్ని పొందటానికి దేవతలు దానవులను మంచి చేసికొని వారితో కలిసి క్షీరసాగరాన్ని మధించినారు. అపుడీ కల్పవృక్షం ఆ సాగరంలో సంభవించింది. అపుడు దీనితోపాటు మందారం-పారిజాతం - సంతానం` హరిచందనం అనే మరో నాలుగు వృక్షాలు కూడ పుట్టినవి. అపుడీ అయిదు వృక్షాలను ఇంద్రుడు స్వర్గం కొఱకు అని తీసికొని వానిని నందనంలో ప్రతిష్ఠించినాడు. ఆ తరువాత శ్రీమన్నారాయణుడు కృష్ణావతారంలో సత్యభామాదేవి కొఱకై పారిజాతాన్ని భూలోకానికి తెచ్చినాడు.
ఒకప్పుడు పైసంతాన పంచకంలోని కల్పవృక్షం నేపాలు దేశంలోని పశుపతి నాధుని ఉత్సవం దర్శించడానికి భూలోకానికి వచ్చి రాత్రివేళల్లో తన యొక్క నిజస్వరూపంతో స్వామివారి ఉత్సవం తిలకిస్తూ పగలు తననెవరు గుర్తించకుండ ఒక మహా వృక్షరాజమై నిలిచేదట. అపుడు దాన్ని ఒక మయబ్రహ్మ గుర్తించి ఈ కల్పవృక్షాన్ని మళ్లీ స్వర్గానికి వెళ్లనీయరాదని తలిచి దాన్ని ఛేదించి ఆ కలపతో అక్కడనే స్వామివారికి ఒక గొప్ప ‘కాష్ఠ మండపం’ నిర్మించినాడట. అయితె ఆ మండపం యిపుడు లేదుకాని దాని పేరుతో ఖాట్మండు (కాష్ఠముండపం) అనే చోట ఒక మహానగరం మాత్రం వెలసి నిలిచింది.
అటువంటి ఆ కల్పవృక్షరాజం ఇపుడు మళ్లీ ఈ స్వామివారిసేవకై యిక్కడ ఈ సప్తగిరులపై అవతరించింది.అయితె స్వామివారే స్వయంగా భక్తుల పాలిటి కల్పవృక్షం.
శ్లో. ఔదార్యం భువనత్రయే పివిదితం ` సంభూతిరంభోనిధే
ర్వాసోనందన కాననే ` పరిమళో గీర్వాణచేతోహరః
టవందాతృ గుణోత్కరః సురతరోః సర్వోపిలోకోత్తరః
స్యాదర్థిప్రవరార్థితార్పణవిధావేకో వివేకోయది -భారవి
జననం చూదామా! లక్ష్మీదేవితోపాటు సముద్రంలో పుట్టింది. నివాసం చూదామా! స్వర్గవనమైన నందనం. పరిమళం చూదామా! దేవతలందరి హృదయాన్ని దోచుకున్నది. దానగుణం చూదామా! సముద్రంలో పుట్టిన అన్నిటికంటే ఎక్కువగానే కలిగి ఉంది. ఔదార్యం చూదామా! ముల్లోకాలకు తెలిసింది -
అని భారవి ఈ కల్పవృక్షాన్ని పొగడినాడు. కనుక అటువంటి వృక్షరాజమైన కల్పవృక్షం ఈనాడు ఇక్కడ ఈ ఏడు కొండల సౌందర్యాన్ని మరియు స్వామివారి వైభవాన్ని చూడడానికి వారికి వాహనంగా దిగివచ్చింది.
స్వామివారే స్వయంగా భక్తులపాలిట కల్పద్రుమం`
శ్లో. అస్తికల్ప ద్రుమోకోపి జాతరూపలతా వృతా
వేంకటాద్రి శిఖారూఢః స్మరతాం పరమార్థతః
బంగారు తీగ అల్లుకోబడిన ఒకానొక కల్పవృక్షం వెంకటాద్రి శిఖరంపై
ఉందట. అది పరమార్థం కోసం స్మరింపదగింది అని చిన్నయసూరి గారు వెంకటేశ్వరుని కల్పవృక్షంతోనే పోల్చిచెప్పినారు. ఇటువంటి పరమార్థకల్పవృక్షమైన స్వామికీనాడు లౌకికమైన ఈప్సితార్థాలిచ్చే ఆ కల్పవృక్షం వాహనంగా వచ్చింది. దానిని అధిరోహించి యిదిగో యిపుడు స్వామివారు తిరువీధులలో వేంచేస్తున్నాడు. ఆ కల్పవృక్షం ద్వారా ఓ భక్తులారా! నేనుగూడ మీ పాలిటి కల్పవృక్షాన్నే అని తనయొక్క వాహన వైభవంతో మనకు సంకేతిస్తున్నాడు. కనుక మీరందరు కన్నులారా తిలకించి ధన్యులు కండి!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి