మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, నవంబర్ 2026, మంగళవారం

కలిపురుషుని యొక్క పుట్టుక


శ్రీకృష్ణుని నిర్యాణాంతరము కలియుగము ప్రారంభమైంది. కలియుగమంతయు కలిపురుషుని పాలనలోనికి వచ్చింది. కలి పుట్టిన పద్దతి ఏమనగా యుగారంభములోనే అధర్మడనే వాడు పుట్టేను. ఇతని భార్య పేరు అసత్యము. ఈ దంపతులిద్దరికి “అంబుడ”ను కుమారుడు “మాయ” అను పేరుగల కూతురు. వీరి యొక్క సంతానము. ఈ అన్నా చెల్లెళ్ళిద్దరు పరస్పరం ప్రేమించుకొని పెండ్లికూడా చేసుకొన్నారు. వీరికి “దంబుడ”ను కుమారుడు “వికృతి” యను పేరుగల కుమార్తె కలిగిరి. మరల ఈ అన్నా చెల్లెళ్ళు కూడా దంపతులై కాపు చేస్తూ “క్రోదమనే” పేరుగల కుమారుడు “హింస” యను పేరుగల కూతురు కలిగారు. వీరు కూడా యదా ప్రకారము భార్య భర్తలై కాపురం చేస్తూ ఉండగా వీరికి పుట్టినవాడే “కలిపురుషుడు”గా పేరు గాంచెను.

కలిపురుషుని శరీరము నిండా నూనె కారుచు నల్లనికాంతితో కాకి కడుపుతో వెడల్పైన నోటితో, ఎరుపెక్కిన కళ్ళతో మిడిగ్రుడ్లేసుకొని, కోరమీసాలతో, వికృత భయంకరాకారుడై శరీరము కంపుతో కూడి యుండును. కలిపురుషునికి జూదమన్న, మద్యమన్న, వ్యబిచారమన్న మిక్కిలి ప్రతీ. ఇన్ని అవలక్షణములు గల కలిపురుషుడు లోకాలు నేలడం ప్రారంభించాడు. ఇంతటి అందగాణ్ణి చూచి “ద్విరుక్తి” యను నవ మోహనాంగి వరించి పెండ్లియాడెను. ఈ జంటను “భయ” మను పేరుగల కొడుకు” అకాలమృత్యువు” అనే పేరుగల కూతురు కలిగారు. పూర్వం వలె వీరిద్దరు అన్నా చెల్లెండ్రు అయినను ఒకనినొకరు ప్రేమించుకొని వివాహమాడకుండా వ్యబిచరించుచూయధా ప్రకారము వీరిద్దరికి “నరక” మను పేరుగల కొడుకు “యాతన” అను పేరు గల కూతురు కలరు. తిరిగి వీరు కూడా పరస్పరము ప్రేమించు కొని అనేక మంది దురాచారులైన ధుర్మార్గులను పుట్టించారు. ఈ ధుర్మార్గులందరు కలిసి లోకాలన్ని ఆక్రమించుకొని గర్వముతో చెలరేగిపోవుచు ధర్మాన్ని ద్వంసం చేస్తూ యజ్ఞ యాగాలను సర్వనాశనము చేస్తూ సత్పురుషులను పీడిస్తూ పవిత్ర కార్యక్రములు చేయకుండ పాపకృత్యములు మాత్రమే పరమావదిగా తలచుచు ముసలితనము, రోగాలు, అకాల మృత్యువులతో జనులను పీడించుచు అనేక బాధలు పెట్టుచుండిరి. 

కలిపురుషుని విజృంభణములతో ఎక్కడ చూచినా, తల్లిదండ్రులను తిట్టువారు, ఆచారాలు పాటించనివారు వేదములను, పురాణములను నాశనము చేయువారు, నీచులను ఆశ్రయించువారు, విద్యను, అన్నమును అమ్ముకొనువారు, మాంసం అమ్ముకొనువారు, దొంగలుగా, లంచగొండులుగా వ్యబిచారులుగా ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించుందురు.

అన్ని కులాలయందు, మతములయందు స్రీలందరు తమ తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచు, స్వేచ్ఛాజీవులై అనేక మంది పతులతో మరల మరల వివాహాలు చేసుకొనుచు స్త్రీలు వేశ్యా వృత్తిలో ధనసంసాదనే ముఖ్యముగ తలచి ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించుచు జీవితం గడుపుతూ ఉంటారు. లోకంలో అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, తుఫానులు సంభవించుచుండును. పాలకులు పనుల పేరిట జనాన్ని హింసించుచుందురు. దరిద్ర దేవత బ్రాహ్మణుల ఇంట నాట్యమాడును. వారు నీచుల ఇళ్ళలో సేవలు చేస్తూ జీవితం గడుపుతుంటారు. స్త్రీలు భ్రూణహత్యలకు పాల్పడుదురు. జనులకు ఆయుషు తగ్గును. మతాచారములు మంట కలుస్తాయి. జనులు వ్యబిచార ప్రియులై వేశ్యల చుట్టూ తిరుగుచుందురు. బావులు, చెరువులు, నదులు ఇంకిపోతాయి. దొంగతనాలు, ఆత్మహత్యలు పెరిగిపోతాయి. నీతినియమాలుండవు, భార్యాభర్తలకు కట్టుబాట్లుండవు. సమయం సందర్భం లేకుండా స్త్రీలు, పురుషులు కామక్రీడలతో ఎప్ప్పుడు పడితే అప్ప్పుడు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. ఈ విధంగా లోకమంతా చెడు ప్రవర్తనలతో, 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి