మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

27, నవంబర్ 2026, శుక్రవారం

మౌన సముద్రంతో మొదలెట్టి

మౌన సముద్రంతో మొదలెట్టి

మన ప్రస్తానంతో ముందుకిడి

బతుకు పదాల నెన్నో చెప్పి 

తెలంగాణ బతుకమ్మ పాట పాడి

తెలంగాణ నానీలు, హైకూలు

కొన్ని వాస్తవాలు, ఒక సత్యం అంటూ

సాహితీ విహంగంపై 

తెలంగాణ రెక్కలతో విహరించె

చారిత్రక తెలంగాణ వైభవాన్ని

జనాలకు చాటి చెప్పి 

సాక మనిషియై, అవ్వను స్మరించి 

శేషేంద్ర స్పృతితో జీవిస్తూ

నది నా పుట్టుకని నినదించె

నేటి కవితతో రాటుదేలి

హైదరాబాద్ హైదరాబాద్ 

అని అరిచేసి 

నివేదించి 

అతని అక్షరం మీద చెవి పెట్టి వినండని

తన ఆవేదనను నివేదించి

చెట్టు నీడలో సేద తీరండని సెలవిచ్చె

శరత్ సాహితీ కళాస్రవంతి

తెలంగాణం సాహిత్య వేదికలను స్థాపించి 

ఎనలేని సాహితీ సేవను కొనసాగించె

వివిధ సాహితీ ప్రక్రియలతో 

వెలలేని రచన లెన్నో చేసి

తెలంగాణ గడ్డపై 

తెలివికి వెలితి లేదని నిరూపించి 

బొమ్మకల్ గ్రామంలో 

నాగమ్మ, మల్లేశం దంపతులకు

ముద్దు బిడ్డడై జనియించి

ఉత్తమ అధ్యాపకుడిగా ఎదిగె

సబ్బని ఇంటిపేరు 

సాహిత్య నిరాడంబరాలకు మారుపేరు

తన ఉద్యోగ విరమణ సంధర్బంగాÛ 

శ్రీ సబ్బని లక్ష్మీ నారాయణ కవి గారి 

భావి జీవితం 

ఆరోగ్య, ఆనందాలతో విరాజిల్లాలని కోరుతూ 

వారికివే నా మనఃపూర్వక

అక్షర అభినందన మాల 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి