మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, నవంబర్ 2026, సోమవారం

అండపిండ బ్రహ్మాండాలు


వైదిక వాఙ్మయం పరమేశ్వరుని అనంత కోటి బ్రహ్మాండ నాయకుడని స్తుతిస్తే, పురాణ వాఙ్మయం విశ్వవ్యాప్తమైన అతని లీలను కొంత కొంత పుక్కిట బట్టింది. కాబట్టి పురాణ పాఠకులకు ఆయా గాథల స్థల కాలపరిచయాలకు స్థూలంగా కొంత బ్రహ్మాండ పరిజ్ఞానం కూడ అవసరం.

మహానారాయణోపనిషత్తు విరాట్పురుషుని రోమకూపాలలో అనంత కోటి బ్రహ్మాండాలున్నాయని, అవి అతని చేతిలో కరతలామలకాలుగా తిరుగుతున్నాయని వర్ణించింది. బ్రహ్మాండాల్లో ఒక్కొక్కటి తప్తకాంచన వర్ణాభమై కుక్కుటాండాకారంగా ఉంది. వానిలో ప్రస్తుతం మనముండే బ్రహ్మాండ పరిధి యిరవై వేలకోట్ల యోజనాలు. ఈ అండానికి భిత్తిగా మహదాది భూ పర్యంతం ఏడు పొరలున్నాయి. అండమధ్యంలో మేరువు నిటారుగా నిలిచి ఉంది. దానికి పై భాగంలో నాలుగు శిఖరాలున్నాయి, ఈ మేరువుకి రెండుకొనలపై అఖండ సోపానస్థలాలు వానిపై నిరాలంబ ప్రదేశాలు ఉన్నాయి. దాని శిఖరాల క్రింద సూదికి గుచ్చిన పూలవలె పదునాల్గు లోకాలు ఒక దాని క్రింద ఒకటి ఉన్నాయి. ప్రతి లోకానికి నడుమ మేరువు స్పష్టంగా కనిపిస్తుంది.

మేరువుకి అధోభాగంలో ఉండే నిరాలంబ స్థానానికి నిర్ముక్తస్థానమని పేరు. ఆ ప్రదేశంలో మÖడున్నర కోట్ల నరకాలున్నాయి. పురాణాల్లో చెప్పబడ్డ యిరవై ఎనిమిది మహానరకాలక్కడే ఉన్నాయి. వానిలో నిష్కృతిలేని పాపులు బాధలనుభవిస్తుంటారు. ఈ పాపులకు భోక్తలు భోజనాంతంలో విడిచే ఉచ్చిష్ట తర్పణాలందుతుంటాయి. ఈ నరకాలకు పైని త్రిఖండ సోపాన స్థలాలు న్నాయి. వానిలో ప్రథమ ఖండంలో అనంగ రూపపాపులు, ద్వితీయ ఖండంలో ప్రేతరూపజీవులు తృతీయ ఖండంలో యాతనా దేహులు ఉంటారు. ఈ జీవులకు కర్మానుభవానంతరం దేహాంతరప్రాప్తి ఉంది.

ఈ త్రిఖండ సోపానాలపై పాతాళ, మహాతల, రసాతల, సుతల వితల, అత£లములనే యేడులోకాలు మేడ అంతస్థులవలె ఒక దానిపై ఒకటి ఉన్నా యి. వానిలో ఒక్కొక్క దానియెత్తు వెయ్యి యోజనాలు. పరస్పర దూరం తొమ్మిది వేల యోజనాలు, ఈలోగా ఒక్క మహా తలం మాత్రం వాలుకామయమని తక్కినవి మన గోళంవలె భూజలాలన్యోన్యాశ్రయంగా ఉన్నవని పురాణవచనం.

పాతాళం భోగభూమి.  రెండవ స్వర్గం. అక్కడ ఆనంతుడు తన బలగంతో 

ఉంటాడు. అతని పడగలపై, భూమి కందిగింజవలె ఉంది. ఈలోకానికి సూర్య చంద్ర దర్శనం లేదు. ఆయినా యిది చీకటికోన గాక ఆక్కడ ఉండే సర్పరాజుల తలలపై ఉండే మణుల చేత ఎల్లపుడు ప్రకాశిస్తూ ఉంటుంది. దీనిపై నుండే మహాతలంలో కద్రువ పుత్రులైన తక్షకాదు లుంటారు. వారికి గరుడుని భయమెక్కువ. ఈలోకంలోని మేరువు కీశాన్యంగా కైలాసముంది. దాన్ని శివుడీశానుని పేర పాలిస్తుంటాడు. ఈ రెండు  నాగలోకాలు. మహాతలంపై తలాతలం ఉంది. దాన్ని మయుడు పాలిస్తుంటాడు. అతడు సూర్యుని ఈ లోకంలోనే తరిమెన పట్టాడు. శివుడు త్రిపురాసుర సంహారం గూడా యిక్కడి నుండే చేశాడు. ఇక్కడ మేరువు కుత్తరంగా ధనిష్ఠాపురముంది. దాన్ని భేతాళుడు తన పిశాచ గణాలతో ఏలుతుంటాడు. 

ఈ తలాతలంపై రసాతలం ఉంది. అది దైత్య దానవ భూమి. ఈలోకంలోని హిరణ్యపురంలో కాలకేయులు, నివాతకవచులు ఉంటారు. వారెల్లపుడు సరమ అనే దేవదూతి మంత్రివర్ణాలకు భయపడుతుంటారు. ఈ లోకంలో మేరువుకు నైఋతిగా పుణ్యపురం 

ఉంది. దాన్ని నిరృతి పాలి స్తుంటాడు. రసాతలంపై సుతలం ఉంది. అది బలి చక్రవర్తి దేశం, అతడిక్కడి నుండే ముల్లోకాలాక్రమించగా విష్ణువు వామనావతారం ఎత్తాడు. ఈలోకంలోని మేరువుకి దక్షిణంగా సంయమినీ నగరం ఉంది. దాన్ని యముడు పాలిస్తూ జీవుల పుణ్యపాపాలు విచారిస్తుంటాడు. ఈ రెండు దైత్య భూములు. ఈ లోకానికి పైని వితలం ఉంది. అక్కడ శివుడు హాటకేశ్వరుని పేరుతో పార్వతితో ఏకాంత విహారం చేస్తుంటాడు. ఈ లోకంలోని మేరువు కుత్తరంగా అలకా పట్టణం ఉంది. దాన్ని కుబేరుడు పాలిస్తుంటాడు. 

ఈ లోకంలోనే మేరువుకి పశ్చిమంగా మరో పట్టణముంది. దాన్ని మహాసురుడు అనేవాడు పాలిస్తుంటాడు. కుబేరుని సేవకాదులైన గుహ్యకులంతా ఈ పట్టణంలోనే 

ఉంటారు. దీనిపై అతలం ఉంది. దాన్ని మయుని పుత్రుడు బలాసురు డేలుతుంటాడు. ఇక్కడ కామిని జన మెక్కువ. వారు పాతాళం చేరే పురుషులకు సిద్ధ రసఘుటిక లిచ్చి సిద్ధులను చేస్తుంటారు. ఇంతవర కవి బ్రహ్మాండ కటాహంలో అధోలోకాలు.

ఈ అతలానికి పైని ‘భూలోక ముంది. దానికి మహాభూమి అని భూచక్రమని పేరు. అది విరాట్పురుషునికి జఘనప్రాయం. అందుచేత కవులు స్త్రీ జఘనాన్ని భూచక్రంతో పోలుస్తారు. ఈ భూచక్రం మొదట దర్పణతలంవలె ఉండి క్రమంగా కూర్మ పృష్ఠంవలె మారిందని సిద్ధాంతుల అభిప్రాయం. ఇది పంచాశత్కోటి వి స్తీర్ణమై తన క్రింది అతలాదిలోకాలను గొడుగువలె కప్పింది. ఆ కారణంగా ఆ లోకాలకు సూర్యచంద్ర దర్శనం, కాలవిభాగం లేకుండా పోయాయి.

ఈలోకం వారికి సూర్యుడు మేరువును చుట్టుతు గానుగెద్దువలె కని పిస్తాడు. బహ్మ ఆజ్ఞచే స్వాయంభువు మొదటి ప్రభువై ఈ లోకాన్ని పాలించాడు. 

అతని కాలంనాటి కీ భూమిపై సప్త ద్వీప విభాగం లేదు. భూజలాలన్యో న్యాశ్రయంగా ఉండేవి. ఈ భూమిపై స్వాయంభువు చేసిన యజ్ఞ సందర్భంలో స్థలం చాలక ఆతడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా అతడు యజ్ఞవరాహ రూపం ధరించి రసాతలంలో ఉండే భూమి నుండి కొంత భాగాన్ని తన కోర నుండి ఉద్ధరించి నేటి భూగోళంగా దీనిపైగల పంజరంలో నిలిపాడు. స్వాయంభువు పిమ్మట ఆతని కుమారుడు ప్రియవ్రతుడు రాజ్యానికి వచ్చాడు. అతడు సూర్యుని మేరు ప్రదక్షిణంవల్ల తమ లోకంలో దివారాత్రా లేర్పడటం చూచి ఎప్పటికీ పగలే ఉండాలనే కోరికతో సూర్యుని గుఱించి తపస్సు చేస్తూ జ్యోతిర్మయరథాన్నెక్కి అతని వెనక ఏడు పర్యాయాలు మేరు ప్రదక్షిణం చేశాడు ఆతడా విధంగా చేయగా ఆ రథం జాడలు సప్త సముద్రాలుగా మారి వాని నడిమి భూమి సప్త ద్వీపాలుగా మారింది. ప్రియవ్రతుడు తన చివరికాలంలో తన ఏడుగురు కుమారుల నేడు ద్వీపాలకు రాజులను చేసి తాను సన్యసించాడు.

ప్రియవ్రతునిచే మహాభూమిపై ఏర్పడిన సప్తద్వీపాల్లో జంబూ ద్వీపం నడుమ 

ఉంటుంది. మహాభూమిపైగల మేరువా ద్వీపంపై క్రిందినుండి పైకి ఉమ్మెత్త పూవువలె నిలిచింది. ఆ కాంచన పుష్పంపై మధ్య భాగంలో స్వర్ణమయమైన బ్రహ్మపురం దాని కెనిమిది దిక్కులలో అష్టదిక్పాలకుల పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాల నధికృత దిక్పాలకులు పాలిస్తుంటారు.

ప్రియవ్రతుని తరువాత అతని పుత్రుడు ఆగ్నీధ్రుడు జంబూద్వీపానికి రాజైనాడు. అత·డు తన చివరిదశలో జంబు ద్వీపాన్ని సీమాపర్వతాలను బట్టి నవవర్షాలుగా విభజించి వానిని తన తొమ్మిది మంది కుమారులకు నిచ్చి తపస్సుకు వెళ్లిపోయాడు. ఈవిధంగా స్వాయంభువు కాలంలో ఏక ఖండంగా ఉన్న భూమి ప్రియవ్రతుని కాలంలో సప్త ద్వీపవసుంధరగా, ఆగ్నీధ్రుని కాలంలో నవఖండ భూమండలంగా మారింది.

ఈ మహాభూమిపై సూర్యాంతం వరకూ గల ప్రదేశం భువర్లోకమని, అక్కడినుండి ధ్రువాంతం వరకుగల ప్రదేశం సువర్లోకమని వ్యవహరింప బడ్డాయి. నేడు మనం చూసే సూర్య చంద్రులు, నవగ్రహాలు, నక్షత్రాలు ఈ భువర్లోకంలోనే ఉండి మేరువు చుట్టు తిరుగుతున్నాయి. నేటి మన భూగోళం వాటిలోనే ఒకటిగా ఉంది. దాని ఊర్థ్వఖండానికి జంబూద్వీపమని, అధఃఖండాని కసురఖండమని పేరు, ఆ రెండు ఖండాలను లవణ సముద్రం వేరు చేస్తుంది.

ఈ భూర్భువర్లోకాలు రెండూ మానవుల కావాసంగా ఉన్నాయి. వానిలో  విరాట్పురుషునికి మొదటిది జఘనమైతే రెండవది వక్ష స్థలంగా ఉంది.

భువర్లోకంపై నుండే సువర్లోకానికి స్వర్గమని మరోపేరు. ఈలోకం లోని మేరువుకి తూర్పుగా ఇంద్రుని పట్టణమైన అమరావతి ఉంది.

కర్మజీవులకు భూర్భువ స్వర్లోకాలు మÖడు ముఖ్యమైనవి, వారామÖడు లోకాలు తిరుగుతుంటారు. అందువల్ల సంధ్యావందనాది కర్మానుష్ఠానాలలో ఓం భూర్భువస్సువః అని ఆలోకాలు తఱచు స్మరింపబడుతుంటాయి.

సువర్లోకంనుండి బ్రహ్మాండ కటాహంలో ఊర్ధ్వలోకా లారంభ మౌతాయి. అధోలోకాలవలె ఈ లోకాలకు దూర నియమం లేదు. స్వర్గానికి కోటి యోజ నాలమీద మహర్లోకముంది. ఆ లోకంలోని మేరువుకి ఆగ్నేయంగా జ్యోతిష్మతి అనే పట్టణం ఉంది. దాన్ని యజ్ఞేశ్వరుడు పాలిస్తుంటాడు. గంధర్వులు మహర్షులు అతనికి సదస్యులుగా 

ఉంటారు. యోగనిష్ఠాపరులు, మాతా పితృ సేవకులు, నారాయణుని అచంచల దీక్షతో నమ్మినవారు ఈ లోకాన్ని చేరుతారు. దీనిపై రెండుకోట్లమీద జనలోకముంది. ఆలోకంలోని మేరువుకి పశ్చిమంగా ఆంభోవతి అనే పట్టణం ఉంది. దాన్ని వరుణుడు పాలిస్తుంటాడు. అతని సభలో జనులనే ఋషులు, బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాదులు 

ఉంటారు. ఈలోకంలో ముల్లోకాలు తిరిగే విమానాలు న్నాయి. పరదారద్రవ్యాల కాశింపనివా రీలోకం చేరతారు. దీని కెనిమిదికోట్ల పై తపోలోకముంది. ఈలోకంలోని మేరువుకి వాయవ్యంగా అంజనావతి అనే పట్టణ ముంది. దాన్ని వాయుదేవుడు పాలిస్తుంటాడు. అతని సభలో సాధ్యులుంటారు. కర్మభూమిలో శీతవాతా తపాల కోర్చి తపం చేసే వారీ లోకాన్ని చేరుతారు. దీనికి నలువ దెనిమిది కోట్లపై సత్యలోకముంది. ఆ లోకంలోని మేరువు కీశాన్యంగా పురాణ పురముంది. దాని కధికృత బ్రహ్మ ప్రభువు. అతని సభలో సత్యులనే ఋషులు, విద్యాధరులు ఉంటారు. ఇక్కడుండే బ్రహ్మ మనం పురాణాల్లో చదివే సృష్టిని చేస్తుంటాడు. యోగనిష్ఠులు, తపోనిష్ఠులు ఈ లోకాన్ని చేరుతారు.

సత్యలోకం దాటిన తరువాత మేరువు కొండపైకి వెళ్లి నాలుగు శిఖరాలుగా చీలింది. వానిలో నడిమి శిఖరం యెత్తు నాలుగు నూర్లయోజనాలు. దానికి మÖడు వైపుల మÖడు శిఖరాలున్నాయి. వాని యెత్తు నూరేసి యోజనాలు.

నడిమి శిఖరంపై శ్రీనగరమనే పట్టణముంది. దాన్ని మÖల ప్రకృతియని, బ్రహ్మవిద్యా స్థానమని చెబుతారు. ఆ శిఖరంపై లలితా పరమేశ్వరి ఉండి లోకాలన్నీ పాలిస్తుంది. శ్రీనగరానికి తూర్పు శృంగంపై కారణ బ్రహ్మ సరస్వతితో గూడి జగత్స ృష్టి చేస్తుంటాడు. వేద శాస్త్రాలు చదివిన వారీలోకాన్ని చేరుతారు.

శ్రీనగరానికి నైఋతి శిఖరంపై కారణవైకుంఠముంది. అక్కడ శ్రీమన్నారాయణుడు లక్ష్మీతో గూడి జగత్తును పోషిస్తుంటాడు. ఆచార్యోపదేశ మందిన భాగవతోత్తము లాలోకాల్ని చేరుతారు. శ్రీనగరానికి వాయవ్య శిఖరం పై మహా కైలాసముంది. అక్కడి మహాదేవుడు పార్వతితో గూడి ఉండి సర్వ సృష్టిని చూస్తూంటాడు.

శ్రీనగరం పైని మేరువుకి ఊర్ధ్వభాగంలో త్రిఖండ సోపాన ప్రదేశ ముంది. అక్కడ ప్రథమఖండంలో వసు సంజ్ఞ గల పితృదేవతలు, ద్వితీయ ఖండంలో రుద్ర సంజ్ఞ గల పితృ దేవతలు, తృతీయ ఖండంలో ఆదిత్య సంజ్ఞ గల పిత ృ దేవతలు ఉంటారు. వారికి వారి సంతతి జరిపే శ్రాద్ధకర్మల చేత క్రమ పరిప్రాప్తమైన ముక్తి ఉంది. ఈ త్రిఖండ సోపానంపైగల నిరాలంబ  స్థానానికి ముక్తి స్థానమని పేరు. భవబంధ రహితులైన జీవు లీప్రదేశంలో నిరతిశయానంద సుఖ స్వరూపులై ఉంటారు.

బ్రహ్మాండ కర్పరంలోని పదునాలుగు లోకాలలో భూర్భువ స్వర్లోకాలు మÖడు ప్రతికల్పంలో నశిస్తూ బ్రహ్మచే తిరిగి సృజింప బడుతుంటాయి. అందువల్ల ఈ మÖడిటిని కృతకాలంటారు. ఇవి ఏకపాద్విభూతి యని చెప్పబడుతుంటాయి. జనలోక సత్యలోక తపోలోకా లెప్పటికీ నశింపవు. అందువల్ల వాటికి అకృత కాలని పేరు. ఈలోకాలు త్రిపాద్విభూతియని చెప్ప బడుతుంటాయి. ఈ కృత కాకృత కాల నడుమ ఉండే మహర్లోకం నశింపదు. కాని ప్రళయ సమయంలోని సంకర్షణాగ్ని జ్వాల కిక్కడి భృగ్వాదిమునులు జనలోకానికి వెళ్లుతుంటారు. ఇది మన బ్రహ్మాండ స్వరూపం.

హిందూ వేదాంతం అండపిండ బ్రహ్మాండాలకు ఆకార భేదమేకాని ఆంతరభేదం లేదని అంగీకరించి మానవ దేహంలో నేయే భాగా లేలోకాలో బ్రహ్మాండంతో పోల్చి చెప్పింది.

జీవులు పురుషునిలో ఉన్నారు. బ్రహ్మాండాలు మాయావరణంలో 

ఉన్నాయి. జీవులాబ్రహ్మాండాల్లో ప్రవేశించినపుడు వానిలో సృష్టి ఆరంభమవు తుంది. సృష్ట్యారంభంలో ఒక్కొక్క బ్రహ్మాండాన్ని కోట్లాదిజీవులు చుట్టు ముడతాయి. కాని వానిలో నేది మొదట బ్రహ్మాండభి త్తిని భేదించుకొని లోపల ప్రవేశిస్తుందో అది ఆ బ్రహ్మాండానికి బ్రహ్మ అవుతుంది. దానిలోని సృష్టి  అంతా యిక ఆ బ్రహ్మ ఆధీనంలోనే జరుగుతుంది.

స్త్రీ గర్భంలోగూడా పిండోత్పత్తి ఈలాగే జరుగుతుంది. ఆమె గర్భకోశం లోని అండాన్ని వేలకొలది జీవాణువులు చుట్టు ముడతాయి. వానిలో ఏది ఆ అండాన్ని భేదించుకొని లోపల ప్రవేశిస్తుందో ఆ జీవకణమే పిండాని కంతటికీ ప్రధానమై దేహనిర్మాణమంతా దాని ఆధీనంలోనే జరుగుతుంది.

ఈ అనంత కోటి బ్రహ్మాండాలు శ్రీ మన్నారాయణుని ఉదరంలో ఓ మÖల నణగి ఉన్నట్లు పురాణాలు చెబుతాయి. పురుషుని దేహంలో ధాతు కోశమెన్నవ వంతు? దానిలో జీవాణువెన్నో వంతు? స్త్రీకి దేహంలో గర్భ కోశమెన్నో వంతు? దానిలో నెల నెలా ఏర్పడే ఆండమెన్నోవంతు? ఊహించు కుంటే పురాణాలు చెప్పే విరాట్సత్యం మనకు కొంత కొంత బోధపడుతుంది.

బ్రహ్మాండ కటాహంలో అధోలోకాలకంటే ఊర్ధ్వలోకాలకు ప్రాధాన్యం ఎక్కువ. మానవ దేహంలో గూడా ఉత్తరకాయానికంటే పూర్వకాయానికి, ప్రాధాన్యం ఎక్కువ.

బ్రహ్మాండ కటాహంలో భూర్భువ స్వర్లోకాలనడుమ తక్కిన లోకాలకు వలె శూన్యం లేదు. మానవ దేహంలో గూడా జఘనం మొదలు కంఠంవరకుగల దేహంలో సీమా విభాగం స్పష్టంగా లేదు. మొదటిదాని అంతం రెండవదాని ఆదిగా ఉంది.

మన భూగోళం విరాట్పురుషునికి హృదయ స్థానంలో ఉంది. జీవుడు మనదేహంలో హృదయ స్థానంలో ఉన్నాడు.

కర్మ జీవులు విరాట్పురుషునికి కటి మొదలు కంఠం వరకుగల లోకాల్లో పరిభ్రమిస్తున్నారు. అలాగే జీవులీలోకంలో శిశ్నోదర పరాయణులుగా హృదయ ప్రధాన వాదులుగా తిరుగుతున్నారు.

పురుషునికి నాశంలేదు కాని మాయలో కొంతకాలానికి సృష్టి శక్తి నశిస్తుంది. అపుడు ప్రళయం ఏర్పడుతుంది. సృష్టిలో పురుషుని యందు బీజశక్తి నశింపదుగాని స్త్రీలో కొంత కాలానికి ధారణాశక్తి నశిస్తుంది.

ఇవి అండపిండ బ్రహ్మాండాలకు గల పోలికలు. ప్రబంధాలలో వీని ప్రసక్తిని వచ్చే పక్షంలో గమనింతము.

ప్రబంధాలు గీసిన పరమపద సోపానపటం

పోతనగారు గజేంద్రమోక్షంలో గజరాజు విష్ణువును స్మరించునపుడు అతడు అలవైకుంఠ పురంబులో నగరులో ఉన్నాడని చెప్పాడు గాని ఆ వైకుంఠం ఎక్కడుందో చెప్పలేదు. 

విష్ణుశబ్దానికి సర్వవ్యాపకుడని వ్యుత్పత్తి. పోతన గారు కూడా దాన్ని అంగీ గరించి, గజేంద్రుడు మకరిచేజిక్కి మొరపెట్టినపుడితిర దేవత లెవరూ వినలేదా? వింటే ఏం చేశారు అనేదానికి విశ్వమయత లేమి వినియు నూరక యుండి దంబుజాసనాదు లడ్డుపడక, విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు ‘ భక్తియుతున కడ్డుపడ దలంచెం - అని చెప్పాడు.

 విష్ణువు విశ్వమయుడు గనుక మÖలంలో గజేంద్రుని మొరవిని అక్కడే సరస్సులో ఆవిర్భవించినట్లుండడానికి భిన్నంగా పోతనగా రతన్ని వైకుంఠం నుండి రప్పించాడు. దాని కాయనపైగల వైష్ణవ ప్రభావం ఒక కారణం గావచ్చు. వైష్ణవాగమాల ప్రకారం విష్ణువు వైకుంఠంలోనే ఉంటాడు. కాబట్టి పోతన గారు తన క్రాంతదర్శిత్వంలో గజేంద్రుడు మొర పెట్టినపుడు విష్ణువెక్కడున్నాడో? ఏం చేస్తున్నాడో చూసి  ‘ఆలవై కుంఠ పురంబులో అనే అమÖల్యమైన పద్యాన్ని సృజించాడు.

గజేంద్రుని వృత్తాంతం సుధారాశి లోని త్రికూట పర్వత సానువుల్లో జరిగింది. మహాభూమిపైగల సప్త సముద్రాల్లో సుధా సముద్రం ఏదీ లేదు. దానికి నానార్థాల్లో చేరిన సురాసముద్రం శాల్మలి, కుశ ద్వీపాలనడుమ, క్షీర సముద్రం శాక పుష్కర· ద్వీపాలనడుమ ఉన్నాయి, విష్ణువు క్షీరÁసముద్రంలోని శ్వేతద్వీపంలో ఉన్నాడని కొన్ని పురాణాలమత£ం. ఆ ప్రకారంగా త్రికూటం ఆ సముద్రం లోనిదే. దాని సానువుల్లో పెట్టిన గజేంద్రుని మొర శ్వేత ద్వీపంలోగల వైకుంఠంలో ఉండే విష్ణువుకి వినిపించి ఆతడు వచ్చి గజేంద్రుని రక్షించాడు.

మరికొన్నింటి ప్రకారం నవవర్షాలుగా విభక్తమైన జంబూద్వీపంలో ఇలా వృత వర్షం మధ్యగా ఉంది. స్వర్గం దానిలోనే ఉంది. దాని పాలకుడు విష్ణువు, ఆతడు క్షీరోదŠతీరభూముల కేలిక. ఆనాడు ఇలా వృత వాసులకు, దేవతలని వ్యవహారం.

ఆపుడు మసుష్యవాచకం యింత విస్తృతం గాదు. అది మనువు సంతతి వారికి పరిమితం. త్రికూట పర్వతం ఈ ద్వీపంలోనే భారతవర్షంలో మేరువుకి దక్షిణంగా ఉంది. గజేంద్రుని గాథ ఆక్కడ జరిగింది.

ఆధునికులమత ప్రచారం నేటి శాంతి మహాసాగరానికి నాడు క్షీరసాగర మని పేరు. ఆ సాగరంలోని ఒక ద్వీపంలో ఒక యేను గొకప్పుడు ఒక మొసలికి జిక్కి గీ పెట్టగా ఆ ద్వీపముఖ్యుడు, భూతదయా పరుడు, హరినామక విష్ణువు దాని మొర విని మడుగు దగ్గరకు వచ్చి చక్రంచే నక్రాన్ని ఖండించి గజేంద్రుని రక్షించాడు. అయితే పోతన గారు చెప్పిన స్వర్గం వీనిలో ఏదో మరి? అతనికి ఊర్ధ్వలోక పుదారుల్ని గుఱించి చెప్పవలసిన అవసరం ఈ స్కంధంలోనే రెండుచోట్ల కలిగింది. వానిలో మొదటిది. గజేంద్ర మోక్షం, రెండవది వామన చరిత్ర.

గజేంద్రమోక్షంలో మొదట విష్ణు వెక్కడున్నదీ స్థల నిర్ణయం చేస్తూ ఆలవైకుంఠ పురంబులో ఆనే పద్యం, తరువాత అతడు వచ్చిన మార్గాన్ని నిర్దేశిస్తూ నిటలాలకములంట అనే పద్యం చెప్పాడు.

కాళిదాసు తన మేఘసందేశాన్ని పూర్వోత్తరాలుగా విభజించి పూర్వ భాగంలో ఆలకా మార్గాన్ని, ఉత్తర భాగంలో అలకా పట్టణాన్ని వర్ణించాడు. పోతనగారిపై రెండుపద్యాలు గూడ దాని వలెనే ఉన్నాయి. కాని వానిలో మొదటి పద్యం వైకుంఠాన్ని రెండో పద్యం దారిని వర్ణించాయి. అది ఎలాగో పరిశీలించండి` 

నిటలాలకము లంటనివుర జుంజుమ్మని

ముఖ సరోజమునిండ ముసరు దేంట్లు 

ఆళులజోపగ చిల్క లల్లనల్లన జేరి

ఓష్ఠబింబద్యుతు లొడియ నురుకు

చిలుకల జోప చచ్ముర్మీనములక మం

దాకినీ పాఠీవలోక మెసగు

మీనపంక్తులుదాట మెయి దీగతో రాయ

శంపాలతలు మింట సరణిగట్టు 

శంపలను, జయింప చక్రవాకంబులు

కుచయుగంబుదాకి క్రొవ్వు సూపు

మెలత మొగులు పిరిది మెఱుగుదీగయుబోలె 

జలదవర్ణు వెనుక జనెడు నపుడు,

పోతనగారిందులో గ్రహించిన ఆళి, శుక, పాఠీన, శంపాలతా, చక్రవాకాలు లక్ష్మీదేవి ఆయా ఆంగాల కుపమానాలుగా ఉన్నా ఆవి నందనం, మేరువు. ఆకాశగంగ, మేఘమండలం, వాయు మండలాలకు ప్రతీక లై మార్గసూచకంగా గూడా ఉన్నాయి. చూడండి,

లక్ష్మీనారాయణులు వైకుంఠం నుండి వెడలి నందన ప్రాంతానికి రాగా ఆమె ముఖకమలంపై తేంట్లు మÖగాయి. నందనం మేరువుపై ఉంది. ఆమె వానిని జోపుకుంటూ మేరువు దిగుతుండగా ఆ పర్వత వృక్షాలపై గల చిలుకలు ఆధర బింబంకోసం వచ్చాయి. ఆమె వానిని తోలుకుంటూ మేరువు దిగింది.

చిన గంగ ధ్రువ మండలం సప్తర్షి మండలం దాటి మేరుశిఖరంపైబడి అక్కడ నుండి బ్రహ్మపురం యొక్క చతుర్ద్వారాల నుండి ప్రవహించినట్లు పురాణ ప్రసిద్ధి గాబట్టి మేరువు దిగగానే ఆకాశగంగ తగులుతుంది. వారక్కడికి వచ్చేసరికామె కన్నులను చూచి బేడిసలని చేపలు వచ్చాయి. అది దాటి వాయు మండలం చేరేసరికి చక్రవాకాలు వచ్చి వక్షానికి తాకాయి.

పోతన గారు చెప్పిన ఈ విశేషాల్ని బట్టి లక్ష్మీ నారాయణులు వైకుంఠం  నుండి క్రమంగా నందనం, మేరువు, ఆకాశగంగ మేఘమండలం, వాయుమండలం దాటి భూలోకానికి చేరినట్టు తెలుస్తుంది. కాళిదాసు మేఘసందేశంలో కేవలం మార్గాన్ని వర్ణిస్తూనే పోయినాడు గాని పోతన గారు లక్ష్మీనారాయణుల్ని పాదచారుల్ని చేసి ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క అనుభవాన్ని కూడా కలిగించారు.

తిమ్మనగారు కూడా శ్రీకృష్ణుని స్వర్గానికి క్రమంగా వాయు, మేఘ మండలాలు దాటించి ఆకాశగంగ మేరువు నందనం పైనుండే తీసుకువెళ్ళాడు. ఆయన గూడా వారికి దారిలోని అనుభవాలు చూపించాడు.

ఇక పోతన గారు ఊర్ధ్వమార్గం చెప్పిన రెండవ స్థలం వామనుని విక్రమం ` దాన్ని ఆయన

ఇంతింతై వటుడింతయై తుదకు తానింతై నభోవీథి పై 

అంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై 

అంతై చంద్రునికంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై 

అంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాం డాంత సంవర్ధియై

అని వర్ణించాడు. దీనిలో ఆయన గ్రహించినవి నభోవీధి, తోయదమండలం, ప్రభారాశి, చంద్రుడు, ధ్రువుడు, మహర్వాటి, సత్యలోకం అనే ప్రదేశాలు. వీనిలో నభస్సు వాయు మండలానికి సంకేతం, తోయద మండలం సరి. ఇక ఆనాటికి ఆకాశ గంగ యింకా రాలేదు కాబట్టి ప్రభారాశి ( సూర్యుడు) చంద్రుడు మేరువుకి సంకేతాలనుకుంటే పోతన గారిచట పై వరుసనే మళ్ళీ చెప్పినాడనవలసి వస్తుంది. ఇవి గాక వీనిపై నింకా ధ్రువుడు, మహర్వాటి, సత్యలోకం ఉన్నాయి. వానిలో ధ్రువునితో సువర్లోకం అయిపోతుంది. ఇక ఆవలది త్రిపాద్విభూతి, దానిలో సత్యలోకం ప్రక్కనే వైకుంఠం ఉంటుంది. విష్ణు వక్కడి నుండి గజేంద్రుని రక్షించటానికి వచ్చాడు.

కవికుల గురువైన కాళిదాసుగారి క్కూడా ఓ పర్యాయం ఊర్ధ్వలోక యాత్రావసరం గలిగింది. అభిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతుని ఇంద్రుడు పిలిపించుకున్నాడు. అయితే అతడు మాత్రం పరివహ వాయుమార్గం, మేఘమండలం దాటి హేమకూటమార్గంగా వచ్చాడు.

దుష్యంతుడు దాటిన పరివహ వాయుమార్గం మేఘమండలం క్రిందిది గాదు. దానిపైది. అది ఆకాశ గంగాప్రవాహానికి పోటీ పెట్టినట్లుగా ఉంది కాబట్టి గంగ ఆక్కడ పారగలుగుతుంది. అంతే కాక ఈ వాయువు సప్తర్షి మండలంలో ఒకరి కిరణాలు మరొకరికి తాకకుండా రక్షిస్తుంది. అందువల్ల ఇది పోతన గారి పరిభాషలో ఆకాశ గంగా పరీవాహ ప్రదేశమే. దీన్ని దాటి దుష్యంతుడు హేమకూటం చేరుకున్నాడు. దానిపైనే మారీచ మహర్షి ఆశ్రమంలో అతడు శకుంతలను కలుసుకున్నాడు. ఈ హేమకూటానికి దక్షిణంగా కిం పురుష వర్షం, దానికి దక్షిణంగా భారత వర్షం ఉన్నాయి. దుష్యంతుడు సర్వదమనుని పట్టాభిషేకానికి అక్కడికి చేరవలసి ఉంది. ఆ కారణం చేత కాళిదాసుగారత నిని మేఘమండలం దాటగానే దక్షిణమార్గం పట్టించి హేమకూటానికి చేర్చాడు.

జీవుడు స్వర్గాన్ని చేరే అపుడుత్తరాయణ మార్గంలో, భూలోకాన్ని చేరేటపుడు దక్షిణాయణ మార్గంలో పయనిస్తాడని గీత చెబుతుంది కాబట్టి కాళిదాసు గారిక్కడ భూలోకం చేరవలసిన దుష్యంతుని దక్షిణమార్గం పట్టించటంలో కర్మ ప్రవృత్తుడైన జీవుని విషయం గూడ ధ్వనిస్తుంది.

గజేంద్రుని రక్షించడానికి వచ్చే విష్ణువుకి వైకుంఠం విడువగానే నందనం తగిలింది. అది స్వర్గవనం. వైజయంతం, వైకుంఠం అమరావతిలోవే భాగాలని, వైజయంతానికే స్వర్గమని మరో పేరని కొందరి మతం. కాబట్టి పోతనగారు చెప్పిన వైకుంఠం ఈ అమరావతిలోని భాగమేనేమో పరిశీలించవలసి ఉంది.

మహాభూమి క్రింది లోకాలకు సూర్య చంద్రదర్శనం లేదు కాబట్టి ఈ మహా కవులు గ్రహించిన మార్గాన్ని చూస్తే వారు తమ కావ్యాల్లో కర్మకాండలో వలెనే భూర్భువ స్వర్లోకాలకే ప్రాధాన్యం యిచ్చినట్లు కన్పిస్తుంది. వారు తమ కావ్యాల్లో ఎంత వర్ణించినా భూర్భువస్వర్లోకాలు దాటి అటు త్రిపాద్విభూతిలోకానికి గాని మహాభూమిని దాటి యిటు అతలాది దేవభూము లకు గాని చొచ్చుకొని పోయినట్లు లేదు. ఎంతవరకు కర్మమార్గ జీవుల లోకాల్లో నే సంచరించినట్టు కనిపిస్తుందిది.

ఈ విషయంపై పరిశోధకు లెవరైనా యింకా మన కావ్య పురాణాల పరిశీలనకు పూనుకుంటే మన పూర్వుల బ్రహ్మాండ విజ్ఞానం ఈనాటి వారి కందు బాటులోకి రాగలదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి