మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

27, నవంబర్ 2026, శుక్రవారం

విషయమెరిగి తేనె విశ్వకర్మ యగును

ఆ.వె. విషయమెరిగి తేనె విశ్వకర్మ యగును

పుడమి నరుల కెల్ల పూజ్యుడితడు

పంచ దాయిలందు పనిమంతుడతడే

విశ్వ మందు వెలుగు విమల కీర్తి



ఆ.వె. కాల తత్వ మెరిగి కాలజ్ఞానము జెప్పె

ఉర్విజనుల జేరి ఊరడించ

అవని నిండియున్న అంధకారము మాప

అపర బ్రహ్మ మతడు అచల గురువు


ఆ.వె. మంచి పనులు చేయ మనుజ జన్మ గలిగె

మరువ రాదు ధర్మ మరŠ్మమిదియె

దివ్యజ్ఞాన ఫలము ధీరునికె దక్కును

ధరణిలోన అతడె ధన్య జీవి 


ఆ.వె. కార్యదీక్ష కలిగి కాలరీతి నెరిగి

కష్ట పడిన నాడె కలుగు జయము

కుశల బుద్ది గలచొ కూరిమి ఒన గూడు

కల్మశాలు వీడి కదలు ముందు 


ఆ.వె. ఒకరి కొకరు సాయమొనరించుకొన్నచో

జాతి వృద్ధి నొందు జగతి నందు

సంఘ సభ్యులంత సతŠ్య శీలులయితె 

మేలు జరుగు మనకు మేలు మేలు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి