హిందువులకు భగవద్గీతవలె దేవీ సప్తశితి గూడ ఒక ముఖ్య పారాయణ గ్రంథం. ఇది గీత కంటె చాలా మొదటిది. గీత మహాభారతంలో ఉండగా ఇది మార్కండేయ పురాణంలో ఉంది. దీనిలో అధ్యాయాలు పదమÖడే అయినా ఇది గూడ గీతంతటి గ్రంథం. దానిలో 701 శ్లోకములుండగా దీనిలో 700లున్నవి. గీతను శ్రీకృష్ణ భగవానుడర్జునునికి చెప్పగా దీన్ని మార్కండేయ మహర్షి భాగురి అనే తన శిష్యునికి చెప్పినాడు.
యుద్ధమొక భయంకర సన్నివేశం, ఆ సమయంలో భయానికేగాని భక్తికి లేదా తత్వచింతన కవకాశమే లేదు. కాని అటువంటి యుద్ధమధ్యంలో గీతవంటి కర్మ భక్తి జ్ఞాన యోగ ప్రతిపాదకమైన కృతి ఆవిర్భవించటం ఆశ్చర్యకరం, అదే విధంగా భక్తితత్వ ప్రధానమైన ఈ దేవీసస్తశితి గూడ దేవదానవుల యుద్ధ సన్నివేశాలలోనే ఆనిర్భవించింది.
భయం భక్తి అనేది తెలుగువారికి జంట వదాలు. ఇవి భయం భక్తియేగాని భక్తిభయంగావు. కాబట్టి ఈ ద్వంద్వాన్నా లోచించినపుడు వీనికేదో సంబంధ ముందనిపించక పోదు.
మనిషి నలుగురిలో ఉన్నప్పుడు, సంసారంలోగాని సంఘంలోగాని, ఏ ఆపద వచ్చినా లేదా ఎంత కష్టం ముంచుకు వచ్చినా తనకంతగా ముంచుకు వచ్చినపుడెవరైనా ఒక చేయివేసి సహాయం చేయలేరా! అనే విశ్వాసమతని హ ృదయంలో అంతర్లీనంగా ఉంటుంది. కాబట్టి అపుడు భయమనిపించదు. ఏకాకియైనపుడు మాత్రం సింహమే కానవసరం లేదు చీమకు కూడా భయపడతారు. తనకెవరూ తోడు లేరనుకుంటాడు. కాబట్టి తోడెవరు లేనపుడు దిక్కులేనివారికి దేవుడే దిక్కుగదా! అందువల్ల అపుడతనిలో ఆ భయం నుండి భక్తి పుట్టుకొని వస్తుంది - ఏదో ఒక యిష్టదైవాన్ని శరణు చొచ్చి మ్రొక్కుకుంటాడు.
అయితే అర్జునునివంటివానికి ప్రాక ృతిక భయమేది లేదుకాని, ధార్మికమైన భయమున్నది. పాశ్చాత్య విద్యలీనా డీ భయాన్ని తొలగించినవి. అందువల్లనే లోకంలో యిపుడీ హింస చెలరేగింది. అర్జునునికి మనమింత మందిని యుద్ధంలో చంపుతున్నాం కనుక దీనివల్ల మనకెంత పాపం చుట్టుకుంటుంది. అని ఊహించుకునేవరకు ముచ్చెమటలు పోసి చేతినుండి గాండీవం జారిపోయింది.
ఎపుడైనా ఎవరికైనా ఆపదలలోనే కాని సంపదలలో దైవం జ్ఞాపకంరాదు. అందువల్లనే కురుపాండవ యుద్ధ మధ్యంలో భగవద్గీత, దేవదానవ సంగ్రామం మధ్యంలో దేవీ సప్తశతి వంటి విశిష్ట కృతుల ఉత్పత్తి జరిగింది.
ఇందులో మొత్తం నాలుగు పర్యాయాలు దేవి స్తుతించబడింది. ఆ నాలుగు కూడ ఒకే మÖర్తి కాక యోగనిద్ర - దేవిచండి - విష్ణుమాయ - నారాయణి అనే నలుగురు దేవతలు స్తుతించబడినారు.
మొదటిసారి విష్ణువు యోగనిద్రలో ఉండగా అతని కర్దమం నుండి మధుకైటభులనే దానవులు జనించి విజ ృంభించి అతని నాభి పద్మంలో ఉండే బ్రహ్మను పట్టుకొని బాధింపసాగినారు. విష్ణువు అపుడు మాంచి నిద్రలో ఉన్నాడు. ఎంత మొర పెట్టినా ఎన్నితడవలు పిలిచినా పలుకలేదు.
ఈనాడు మనం నిద్రించినవారు మేల్కొనటానికి “భూపాలాలు” చదువుతాం. భగవంతునికైతే ఆలయాలలో సుప్రభాతాలు పాడుతుంటారు. కాని యిక్కడ బ్రహ్మగారట్లా చేయలేదు. తండ్రిగారైన విష్ణువునావేశించిన నిద్రాదేవిని తొలగి పొమ్మని ప్రార్థించినాడు. దానికి సంతోషించి అతని కన్నుల్లో గూడుకట్టుకున్న ఆ దేవి వెలుపలికి వచ్చి బ్రహ్మకు ప్రత్యక్షమై నమస్కరించి వెళ్ళిపోయింది.
ఇపుడు మనం సుప్రభాతాలు చదువుతున్నాం గాని నిద్రాదేవి తొలగనిదే ఆ స్వామి మాత్ర మెట్ల మేల్కొంటాడు. అందువల్ల సుప్రభాతానికి మొదలు నిద్రాదేవి స్తుతి కూడ చేయటం మంచిదనిపిస్తుంది. బ్రహ్మ చేసిన ఈ స్తుతి యిందులోని ప్రథమాధ్యాయంలో 70 నుండి 86 వరకు 17 శ్లోకాలలో ఉంది. దానిలో మొదటి పదింటిలో నిద్రాదేవి కరువది పేర్లు చెప్పబడినవి. తక్కినవానిలో ఆమె మహిమా గానముంది.
రెండవసారి దేవి మహిషాసురుని సైన్యాన్ని హతమార్చగా అందుకు సంతసించి ఇంద్రాదులు ఆమెను స్తుతించినారు. ఇది నాల్గవ అధ్యాయంలో 2 మొదలు 27 వరకు గల 26 శ్లోకాలలో ఉంది.
దీనికి దేవీ సప్తశతి అని పేరు. అయితే యిందులో దేవి అనేది ఏదో ఒక సామాన్యమైన స్త్రీ వాచకంగాదు. వ్యుత్పత్తిననుసరించి దేవి అనగా దేవతాంశ గల స్త్రీ అని అర్థం. దేవతాంశ లేకుండ ఏ స్త్రీ కూడా దేవి కాలేదు. కనుక ఈ దేవిలో ఎన్ని దేవతాంశలున్నవో గమనించండి. ఇంద్రాదులు వచ్చి త్రిమÖర్తులతో తమను మహిషుడు పెడుతున్న బాధలన్ని చెప్పుకున్నారు. అవి వినేవరకపుడక్కడున్న దేవతలందరిలో దానవుని పై తీవ్రమైన కోపం కలిగి వారందరి ముఖాలనుండి ఒక తేజస్సు వెలువడింది. అది
శ్లో. అతివ తేజస: కూటం జ్వలంత మివ పర్వతం
దద ృశస్తే సురాస్త త్రజ్వాల్యా ప్తదిగంతరం 2-12
తా. అపుడు దిక్కులన్నిటా వ్యాపించి ఒక మండుతున్న పర్వతం వలె వారికి కనిపించింది. అనంతరమా తేజస్సంతా ఏకమై
శ్లో. అతులం తత్ర తత్తేజ: సర్వదేవ శరీరజ:
ఏకస్థం తదభూన్నారీ వ్యాప్తలోకత్రయం త్విషా 2-13
ఒక నారీరూపాన్ని ధరించింది. అపుడామెకు శంభుని యొక్క తేజం ముఖం. యముని తేజం వెంట్రుకలు. అగ్నితేజం నేత్రత్రయం. ఉభయ సంధ్యలు కనుబొమ్మలు. కుబేరతేజం నాసిక. వాయు తేజం చెవులు. ప్రజాపతి తేజం దంతాలు. విష్ణువు యొక్క తేజం బాహువులు. చంద్రుని తేజం చనుకట్టు. ఇంద్రుని తేజం నడుము. వరుణ తేజం పిక్కలు. భూదేవి తేజం పిరుదులు. బ్రహ్మతేజం పాదాలు. సూర్యతేజం కాలివ్రేళ్ళు. వసువుల తేజం చేతి వ్రేళ్ళుగా రూపొందినవి. గీతలో శ్రీకృష్ణుడే కాదశాధ్యాయంలో విశ్వరూపం చూపగా దాన్ని చూచి అర్జునుడు.
శ్లో. పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమస్తా
దీప్తానలార్క ద్యుతిమప్రమేయం 11-17
ఓ కృష్ణా తేరి చూడరాకుండ మండుతున్న సూర్యునివలె, అగ్నివలె ఉన్న స్వరూపాన్ని చూస్తున్నానంటాడు. అందులో శ్రీ కృష్ణుడు విశ్వరూపం చూపినపుడు మండుతుండగా యిందులో ఆ మండుతున్న కాంతియే దేవ రూపాన్ని ధరించింది. అందులో అర్జునుడు -
శ్లో. పశ్యామి దేవాంస్తవ దేవ దే హే
సర్వాన్ స్తదా భూత విశేష సత్వాన్
బ్రహ్మాణమీశం కమలాసనస్థం
ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్
ఓ క ృష్ణా! నీదేహంలో నేను బ్రహ్మను శివుని మరియు సమస్తమైన ఋషులను, దేవతలను చూస్తున్నాననగా ఇందులో ఆ దేవతలే దేవి యొక్క శరీరాంగాలుగా రూపొందినట్లు చెప్పబడినారు కనుక ఈ సందర్భంలో ఇది దీనికి మరియు గీతకు గల భేదసాద ృశ్యం.
ఇందులో ఈ దేవి యిట్లా దేవతల యొక్క కోపం యొక్క తేజస్సుతో రూపొంది సార్ధక నామం గల దేవి అయింది. కోపానికి సంస్క ృతంలో “చండం” అని మరొక పేరు. అందువల్ల కోపంలో రూపొందింన ఈ దేవి “చండ” అనబడి ఈ సప్తశతిలో మహిషాసుర మర్ధనమే ప్రముఖ విషయం కనుక యిది దేవీ సప్తశతితో పాటు చండీ సప్తశతి గూడా అయింది.
పై విధంగా వివిధ దేవతల యొక్క తేజస్సుతో రూపొందిన ఆ దేవికి శివుడు శూలం - విష్ణువు చక్రం - అగ్ని శక్తి - యముడు కాలదండం - వరుణుడు శంఖ పాశాలు, వాయువు ధనుస్సు - తూణీరాలు, ఇంద్రుడి వజ్రాయుధం మరియు ఐరావతం యొక్క ఘంట, విశ్వకర్మ ఖండపరశు - అభేద్య కవచం మరియు వివిధ శస్త్రాస్త్రాలు - బ్రహ్మ అక్షమాల కమండలం - కుబేరుడు పానపాత్ర ఈయగా హిమవంతుడు వాహనంగా - సింహాన్నిచ్చాడు.
అనంతరం శేషుడు నాగహారం క్షీరసముద్రుడు, తారాహారం, శిరోరత్నం, పాపట బొట్టు, కుండలాలు, కంఠాభరణాలు, భుజకీర్తులు, తాటంకాలు, అంగుళీయకాలు, అందెలు వీటన్నిటితో పాటు ఒక నిత్యనూతనమైన వస్త్రం కూడా యిచ్చినాడు. అపుడు దేవి దేవతలిచ్చిన ఆయుధాలు, సముద్రుడిచ్చిన ఆభరణాలు ధరించి మహిషునిపైకి వెళ్ళి మొదలతని సైన్యాన్ని హతం చేసింది. అది చూచి ఇంద్రాదులు సంతసించి ఆమెను నుతించినారు. ఇది దీనిలోని నాల్గవ - అధ్యాయంలో 2వ శ్లోకం మొదలు 27 వరకు గల 25 శ్లోకాలలో ఉంది.
ఇంతవరకు మొదట బ్రహ్మ చేసిన “యోగ నిద్రాదేవి” స్తుతి విష్ణు సంబంధి, కాగా - సర్వస్యగాత్రస్య శిరః ప్రధానమనే న్యాయాన్ని బట్టి ఈ దేవికి శంభుడు ముఖం కనుక ఈమె శివ సంబంధమైన శక్తి అనవలె.
మహిషుని పిమ్మట దేవతలపై శుంభ నిశుంభులు దండెత్తి వచ్చినారు. అప్పుడు వారు తరమగా యింద్రాదులు హిమాలయాల పైకి వెళ్ళినారు. అక్కడ వారికి “విష్ణుమాయాదేవి” దర్శనమిచ్చింది. వారామెను తమను శుంభ నిశుంభుల బారి నుండి కాపాడమని స్తుతించినారు. ఇది పంచమాధ్యాయంలో 9 నుండి 82 వరకు గల 73 శ్లోకాలలో ఉంది. దీనిలో ఉన్న దేవీ స్తుతులన్నిటిలో యిదే పెద్దది.
గతంలో యింత వరకెవరేదేవతను గుఱించి చెప్పినా వారు వారి భౌతికమైన రూపాలను మరియు గుణాలనే చెప్పినారు. కాని వారి నిజతత్వమెట్టిదో ఎవరూ వివరించలేదు.
గీతలో శ్రీకృష్ణుడు -
శ్లో. అహమాత్మా గుణకేశ సర్వభూతాశయ స్థితః !
అహమాదిం చ మధ్యంచ భూతినామన్త ఏవచ !!
అని తన విభూతుల నధ్యాత్మంలోనే ప్రారంభించినా అనంతర మతడు చెప్పినవన్ని ఈ బ్రహ్మాండంలోని లౌకిక విభూతులే కాని అండపిండ బ్రహ్మాండాలు మÖడొకదానికొకటి బింబ ప్రతిబింబాలుగా ఉన్నా ఈ బ్రహ్మాండంలోని విభూతుల వలె పిండమయమైన ఈ దేహంలో తన పాత్ర యేమిటో వివరించలేదు. కనుక ఆ పని యిందులో ఇంద్రాదులు విష్ణుమాయను “యా దేవీ సర్వభూతేషు - చేతనేష్వభిధీయతే - (5-15) అని ప్రారంభించి స్తుతి చేసింది.
ఈ యోగమాయకు యోగనిద్ర అని కూడా మరో పేరు. విశ్వంలోని సృష్టి అంతా తమోగుణం నుండియే ప్రారంభమౌతుంది కనుక జీవుల యొక్క ఇహలోక యాత్రగూడ సుప్తావస్థ నుండియే ప్రారంభమై వారాయా క్షేత్రాలలో ప్రవేశింపజేయబడుతుంటారు కనుక ఈ దేవి సప్తశతి నిద్రాదేవి యొక్క స్తుతితో ప్రారంభమయి స ృష్టి తత్వానికి సంకేతంగా ఉంది.
నిద్ర శబ్దం సంస్క ృతంలో స్త్రీలింగం కనుక దీనిలో ఆమె స్తుతి గూడ
శ్లో. త్వం శ్రీః త్వమీశ్వరీ త్వంహః
త్వం బుద్ధిః బోధంక్షణా
లజ్జా పుష్టిః తధాతుష్టిః
త్వం క్షాంతిః శాతిరేవచ
అని స్త్రీలింగమైన శ్రీవాచకంతో యిందులో ప్రారంభమయింది. ఈ శ్లోకంలో ఈ కారాంత శబ్దాలన్నిటికి పుంలింగాలతోపాటు స్త్రీలింగ రూపాలు గూడ ఉన్నవి - కాగా చెప్పబడిన నిద్రాదేవి పేర్లన్ని నిద్ర యొక్క లక్షణాలుగా గూడ ఉండటం గమనించదగిందిగా ఉంది.
మన శరీరంలో ప్రతి యింద్రియానికొక అధిదేవత ఉన్నా ఆమె ఆవేశించినపుడు మాత్రమెవరు తమ తమ పనిని చేయలేరు కనుక ఆమె ఈ శరీరంలో ఇంద్రియాలకన్నిటికి ఈశ్వరి అంటే అధికారిణిగా ఉంది.
మానవులకు ప్రశాంతమైన మంచి నిద్రతో ముఖంపై శోభ కలుగుతుంది. వినయమేర్పడుతుంది. బుద్ధిచక్కగా పనిచేస్తుంది. అంతేకాక నిద్రవల్ల ఇంద్రియాలన్నిటికి మంచి దృష్టి పుష్టి కలిగి వ్యక్తిలో ఓర్పు మరియు శాంతి సహనాలు కలుగుతవి. బుద్ధి చక్కగా పని చేస్తుంది కనుక అతడు సిగ్గుపడవలసిన పనులు గూడ ఏవి చేయడు. ఇవన్ని నిద్ర యొక్క లక్షణాలు.
వ్యక్తికి నిద్రకు సంపూర్ణమైన విశ్రాంతి అవసరం. శరీరం మనస్సు రెండు బాగా అలసినపుడే మంచి నిద్ర పడుతుంది. కేవలం శరీరమే అలసినపుడు కలలలో కలత నిద్ర లేదా మనస్సు మాత్రమే అలసినపుడు పడక పై యిక్కడక్కడ పొర్లే నిద్ర పడుతుంది కాబట్టి ఒక్క నిద్రనే కాదు ఆరోగ్యం, అందం మరియు సంతాన శక్తి గూడ శరీర శ్రమ పైనే ఆధారపడి ఉన్నవి. అందమెపుడైనా ఆరోగ్యాన్నాశ్రయించే ఉంటుంది. ఈనాడు పల్లెటూరి జనంలో సహజ సౌందర్యం మరియు సంతాన శక్తి ఎక్కువగా ఉండటానికి వారి శ్రామిక జీవనమే కారణం - కాని యిపుడు మనం శరీర శ్రమ నామోషి అని ప్రతి పనికి ఏదో ఒక యంత్రంపై ఆధార పడుతున్నాం. ఇది యంత్రయుగం. ఆదియుగం మంత్రయుగం. ఆనాడు దేవతలు ప్రతిపని తమ సంకల్ప మాత్రం చేతనే సాధించవలెనని మంత్రమయ ప్రపంచంపై ఆధారపడి శారీరక శ్రమకు దూరమైనారు కనుక. దీని ఫలితంగానే వారు సంతాన రహితులైనారనవలసి ఉంది. ఇపుడు మనం కూడ అదే యుగంలోనికి పయనిస్తున్నాం.
మనకు పరుపులున్నప్పటికి నిద్ర పట్టక పోవటం కటిక నేలపై నిద్రించిన వారు గురకలు తీయటం యిపుడు తెరకెక్కిన సత్యం. కనుక నిజమైన నిద్ర ఎపుడైనా శ్రామికుని సొత్తేగాని భోగిది కాని యోగిది కాని కానే కాదు. ఈనాడు పెద్ద పెద్ద సంస్థలు నడిపే వారు కుటుంబాలు నడిపేవారు కూడ తరుచు నిద్రలేమితో బాధపడుతుంటారు.
మన దేవతలలో బ్రహ్మ సృష్టించే వాడు, విష్ణువు పోషించేవాడు. పుట్టించేవాని కంటె పోషించేవానిపై ఉండే భారం గొప్పది. అందుచేతనే విష్ణువు నిద్రాదేవిని తన వశంలో ఉంచుకున్నాడు. అట్లా ఉంచుకున్నాడు కనుకనే ఆయన రాజస తామస పరుడుగాక సర్వగుణుడు మరియు లీలామయుడు గూడ అయినాడు. కనుక నిద్ర చక్కగా లేనినాడు మానవుడు చికాకైపోయి అస్తవ్యస్తంగా ప్రవర్తిస్తుంటాడు. అందువల్ల ప్రశాంతమైన నిద్రను కోరేవారిందులోని ఈ నిద్రాదేవి స్తుతిని దినదినం పారాయణ చేయవలసి ఉంది.
విష్ణు మాయగా ఇక ఈ దేవి మన దేహంలో ఏయే పాత్రలు నిర్వహిస్తుందో చూద్దాము. మనదేహంలో చేతన రూపంలో జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల నధిష్టించి వానితో పనిచేయిస్తుంది. అంతేకాక ప్రాణ రూపంలో ఉండి దినానికి 21600 ఉచ్ఛ్వాస నిశ్వాసలు నడుపుతు ఈ దేహం యొక్క పరిమాణం తీరేటంతవరకు దీన్ని చైతన్య వంతంగా ఉంచి రక్షిస్తుంది.
దీనిలో ఆమె బుద్ధి రూపంలో ఉండి యుక్తా యుక్త విచారణా నిర్ణయంలో మానవుని ఎనుబదినాలుగు లక్షల జీవజాలంలో శ్రేష్ఠునిగా నిలిపింది. స్మృతి రూపంలో నిలిచి జ్ఞానేంద్రియాలతో గ్రహించిన విషయాలు కర్మేంద్రియాలతో పొందిన సంవేదనలు సమస్తం మనస్సులో దాచి వానిలో ఈ జీవుని యొక్క ఆనందానికి అభివృద్ధికి దోహదం చేస్తుంది.
లోకంలో వ్యక్తి ఏది సాధించవలెనన్నా అతనికి మొదటి సాధన మీ శరీరమే. అందువల్ల అతడు దీనికి పూటపూటకు సక్రమంగా వేళప్రకారమింత ఆహారమందిస్తుండవలె. కాని ఈనాటి మానవుడు ధనాశా పరుడై దాని వెనుక వరుగెత్తుతు ఆహార పానీయాలను గూడ విస్మరిస్తుంటాడు. అందువల్ల దేవి ఈ దేహంలో ఆకలి రూపంలో ఉండి వేళ ప్రకారమతనికాహారం తీసికోవలసిన ఆవశ్యకతను జ్ఞాపకం చేస్తుంది.
ఈ శరీరంలోని ప్రాణానికి నీరే ఆధారం. అందువల్ల దప్పిరూపంలో నీటి అవసరాన్ని గూడ జ్ఞాపకం చేస్తుంది. ఆహార పానీయాలు సేవించే సమయంలో పుష్టిరూపంలో నాలుకపై నిలిచి వాని రుచులలో మనన్సుకానందాన్ని ముష్టి రూపంలో ఆహార పానీయాలచేత శరీరానికి బలాన్ని చేకూర్చి శక్తి రూపంలో కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలతో పనులు చేయిస్తుంది.
వృత్తి రూపంలో మానవులకు జీవనోపాధి కల్పిస్తూ వారి చేతులలో నిలిచి చతుw్షŸష్టి కళలు స ృష్టింప చేస్తుంది. కాయికమే కైలాసమని బసవేశ్వరుని మతం. చిత్తశుద్ధితో చేసిన కర్మలు వ్యక్తి ముక్తి మార్గానికి కూడా దోహదమౌతుంటవి.
క్రాంతి రూపంలో ఉండి దేవి మానవునిలో ఎంతటి కష్టతరమైన కార్యమైనా సాధింపజేస్తుంది. లజ్జారూపంలో ఉండి అవమానకరమైన కార్యాలలో అతని నడ్డుకుంటుంది. దయా రూపంలో అతనినన్ని ప్రాణులను ప్రేమింపజేస్తుంది. శాంతి రూపంలో అతనికి స్థిమితాన్ని కలిగిస్తుంది.
నిద్రలో స్వప్న సుషుప్తి అని రెండవస్థలున్నవి. దేవి నిద్రా రూపంలో దుర్మార్గులను భయంకర స్వప్నాలలో పీడించగా సన్మార్గులను మధుర స్వప్నాలలో తేలించి సుషిప్తి రూపంలో ఈజీవుని పరబ్రహ్మం యొక్క వడిలోనికి పంపుతుంది. అక్కడతదు బ్రహ్మానందాన్ననుభవించి నూతనమైన శక్తిని పొంది తిరిగి వస్తుంటాడు.
ఆహార నిద్రా భయ మైధునాలు సృష్టిలో సర్వప్రాణి సహజాలు. ఆహారం లేకుంటే ఈ శరీరం కృశించి నీరసించి దేనికి సమర్థం కాకుండా పోతుంది. నిద్ర లేకపోతే అలసి పోయి అసమర్థమవుతుంది. భయం లేకుంటే ఈ జీవుడు శత్రువు తటస్థపడినపుడతని నెదిరించియో లేదా పారిపోయియో తనను తాను రక్షించుకోలేడు. కామం లేకుంటే ఈ జగత్తే ముందుకు సాగదు కనుక ఇట్లా వీటన్నిటి వెనుక ఆ దేవి యొక్క లీలనే ఉంటుంది. కాని అంతర్నేత్రం కలవారైతే ఆ తల్లిని సర్వకాల సర్వావస్థల్లోను దర్శించగలరు లేకుంటే లేదు.
ఈ విధంగా ఈ స్తుతిలో మనలో ఉండేదేవి యొక్క రూపాలొక్కొక్కటి కీర్తింపబడి వానికి నమస్తస్తై నమస్యై నమస్తస్యై నమో నమః అని ముమ్మారు కాయనవాచా మనసా నమస్కారాలు చెప్పబడినది.
దేవీ సప్తశతిలో విశేషించి ఈ భాగమంతా ఒక మహామంత్రమయంగా భావించబడుతుంది. కనుక ఇందులోని వానిలో ఏది కోరిన వారామంత్రాన్ని నిష్ఠతో జపించి దేవతానుగ్రహంతో దాన్ని పొందవచ్చు.
శంకరాచార్యుడు ‘యద్యత్కర్మ కరోతి తత్తదఖిలం శంభో తవారాధనమ్మ’ ని అన్నారు కనుక అట్లాగే మానవులు తామేది చేస్తున్నా అవి తమలో ఆ దేవియే చేయిస్తుందనే విశ్వాసంతో సమస్త కర్మలాదేవికే అర్పించవలసి ఉంది.
ఇందులో నాల్గవ సారి యింద్రాదులు దేవి శుంభుని వధించినపుడు స్తుతించినారు. ఇది ఏకాదశాధ్యాయంలో 2 మొదలు 36 వరకు గల 35 శ్లోకాలలో ఉంది. దీనికి “నారాయణి” అని పేరు.
నారాయణియనగా మళ్ళీ పార్వతియే. ఈమె విష్ణువుకు సోదరి, శివునికి భార్య అందువల్ల
శ్లో. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్య్రంబకే దేవి నారాయణి నమోస్తుతే
అని స్తుతింప బడుతుంది.
ఈ అధ్యాయంలోని స్తుతిలో 10 వృత్తాలు 22 అనుష్టుప్పులున్నవి. అనుష్టుప్పులలో 16 ఏకంగా నారాయణి మకుటంతో ఉండటంవల్ల దీన్ని నారాయణి అన్నారు. ఇందులో చివరి మÖడు శ్లోకాలలో దేవి ఆయుధాలైన త్రిశూలం ఘంట ఖండం స్తుతింపబడినవి. కనుక మÖడవది విష్ణుమాయాదేవి కాగా యిది మళ్ళీ పార్వతి అయింది. ఈ విధంగా యిది హరిహరాత్మకమై మహాలక్ష్మి, మహాకాళి అనే యిద్దరి యొక్క అభేదాన్నే చాటుతు సర్వ భూతాంతరాత్మయైన దేవీతత్వాన్ని ప్రతిపాదిస్తుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి