మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, నవంబర్ 2026, మంగళవారం

మహావిష్ణువు యొక్క దశావతారాలు


పవిత్రాణాయ సాధూనాం వినాశయచ దుష్కృతాం

ధర్మసంస్థాప నార్దాయ సంభవామి యుగే యుగే

ప్రతి యుగంలో దుష్టశిక్షణ శిష్టరక్షణార్దమై అవతరిస్తాననీ సత్పురుషుల రక్షణయే తన కర్తవ్యమని భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించాడు. భగవంతుడు భూమ్మీద ఎప్ప్పుడు అవతరించినా దేవతలకు విరోది అయినా వారిని సంహరించి ధర్మాన్ని స్థాపించడం జరుగుతుంది. దుష్టశిక్షణ శిష్టరక్షణ కొరకై కృతయుగంలో నారసింహునిగా, త్రేతాయుగంలో రావణుని సంహరించడానికై శ్రీరామునిగా, ద్వాపరయుగంలో కంసుని వదించేందుకై శ్రీకృష్ణునిగా, కలియుగంలో అన్ని పాపాలకు మÖల పురుషుడైన కలిపురుషుని సంహరించడానికి గాను శ్రీవీరభోగవసంతరాయులుగా అవతరించియున్నారు. శ్రీమహావిష్ణువు ఇప్పటి వరకు ఎత్తిన దశావతారాలు క్రింద వివరించబడ్డాయి.

1. మత్స్యావతారం: శ్రీమహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం. సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్న వైవస్వత మనువుకు చేతిలోని జలాల్లో చేపపిల్ల కనపడింది. దానిని రక్షించే ఉద్దేశంత ఒక పాత్రలోని నీట్లో దాన్ని వేసి సంరక్షించబోయాడు. అది ఇంకా పెద్దదిగా ఎదిగి పోగా దాన్ని చెరువలోకి మార్చాడు. చెరువు సహితం పట్టనంత ప్రమాణాన్ని ఆ చేప సంతరించుకోవడంతో దాన్ని ఒక సముద్రంలోకి మార్చాడు. అత్యంత స్వల్ప వ్యవదిలోనే ఇలా తన ప్రమాణాన్ని పెంచుకుంటూ పోతున్న ఆ చేపను అసాధారణ మైనదిగా దేవ మాయగా గుర్తించాడు. దానిని శ్రీహరిరూపంగా భావించి సోత్రములు చేయగా మత్స్య రూపుడైన నారాయణుడు వైవస్పతమనువీరా! త్వరలో ప్రళయం సంభవించనున్నదని చెప్పాడు. ఇంతలో బ్రహ్మ సృష్టికార్యం ప్రారంభించగా సోమకాసురుడు వేదాల్ని అపహరించి సముద్రంలో దాగియుండగా ఆమత్య్సరూపుడైన నారాయణుడే వానిని సంహరించి తిరిగి వేదాలను బ్రహ్మకు అప్పగించాడు.

2. కూర్మావతారం: ఇది దశావతారాల్లో రెండవది. దుర్వాస మహర్షి శాపం స్వర్గాదిపతి ఇంద్రుని సంపదలన్నీ సముద్రంలో కలిసిపోగా శ్రీమన్నారాయణుడి సలహాపై రాక్షసులతో చెలిమి నటించి దేవతలు సముద్రాన్ని మధించారు. ఈక్షీర సాగర మధనంలో వాసుకిని కవ్వం తాడుగాను, మందర పర్వతాన్ని కవ్వంగాను ఉపయోగించి చిలుకసాగారు. అయినప్పటికి పర్వతము సముద్రమున మునిగి పోతుండగా నారాయణుడు దానికి అధారభూతుడైన పీఠగా కూర్మరూపుడై నిలువరించాడు. దానితో మళ్ళీ యధాస్థితి నెలకొని దేవతల వస్తువులన్నీ దేవతలకు అమృతంతో సహా లభించాయి.

3. వరహావతారం: ఇది దశావతారల్లో మÖడవది. హిరణ్యాక్షుడనే రాక్షసుడు దేవతలను తరిమేసి స్వర్గాన్ని ఆక్రమించి ముల్లోకాల్నీ ముప్ప్పుతిప్పలు పెట్టుచుండగా శ్రీవారి యజ్ఞ వరాహరూపుడై భీకరమైన తన కోరలపై భూమిని నిలబెట్టి ఆరాక్షసున్ని వధించాడు.

4.  నృసింహావతారం: దశావాతారాల్లో ఇది నాల్గవది. హిరణ్యాక్షుడు సోదరుడు హిరణ్యకశిపుడు. తన అన్నను శ్రీహరి వధించినందుకు కక్ష బూని శత్రుత్వము వహించగా ఒక స్తంభం నుండి నృసింహావతారుడై బయటికి వచ్చి హిరణ్యకశ్యపుడ్ని వధించాడు.

5. వామనావతరం: దశావతారాల్లో ఐదవది వామనావతారం బలిచక్రవర్తి ఇంద్రుడిగా పదవినలంకరించి తన రాక్షస బుద్ధిచేత దేవతలను స్వర్గం నుంచి వెడలగొట్టగా నారాయణుడు వామనుడిగా అవతరించి బలియొక్క దాన గుణాన్ని అడ్డుగా పెట్టుకొని మÖడడుగుల నేల దానంగా గ్రహించి ఒక్క అడుగుతో భూమిని, మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి మÖడో అడుగు ఎక్కడ వేయమంటావో చెప్పమని అడిగి బలి తన శిరస్సును చూపగా మÖడో అడుగు అక్కడవేసి ఆ రాక్షసున్ని పాతాళానికి త్రొక్కేశాడు. 

6. పరశురామావతారం: దుష్టశిక్షణార్దమై శ్రీహరిఎత్తిన ఆరో అవతారం ఇది. ఒకప్ప్పుడు ధుర్మాదాందులైన రాజుల వల్ల సర్వులకును క్లేశములు సంభవించగా నారాయణుడు జమదగ్నికి కొడుకుగా పుట్టి పరశువు(గండ్రగొడ్డలి) ధరించి వారినందర్ని ఇరవై ఒక్క పర్యాయములు దండయాత్ర సంహరించాడు.

7. శ్రీరామావతారం: మహా బలవంతుడు శివభక్తుడైన రావణాసురుడు లంకనగరానికి రాజు దేవతలచే అనేక వరములు పొంది మారువేశంలో అడవికి చేరి సీతను అపహరించి లంకా నగరానికి చేరాడు. విషయం తెలుసుకున్న రాముడు ఆవేదనకు గురైనాడు. రాముడు సీత జాడకై హనుమంతుని సహయం కోరాడు. సీతజాడ తెలుసుకున్న హనుమంతుడు రాముడికి తెలిపాడు. రాముడు రావణుని సంహరించి రామబాణంతో రావణుని సంహరించాడు.

8. శ్రీకృష్ణావతారం: దుష్టశిక్షణార్దమై శ్రీహరి ఎత్తిన ఏనిమిదోవతారం ఇది. దేవకీ వసుదేవులకు అష్టమ గర్భాన జన్మించి రేపల్లెలో నందుని ఇంట పెరిగి బాల్యం నుంచే రాక్షసవధ చేస్తూ యశోద తనయుడిగా గోప బాలకులతో ఆటలాడి మధురనేలే  మామ కంసుడిని అంతమొందించి తాతగారికి తిరిగి రాజ్యం ఇప్పించాడు. పాండవ పక్షపాతియై భారతయుద్ధము నడుపుట మొదలగు లీలలన్నీ ఈ అవతారంలోనివే.

9. బుద్దావతారము: దశావతారల్లో తొమ్మిదోవతారం ఇది. ఎప్పటిలాగే లోకంలో అధర్మం పెచ్చరిల్లి ధర్మం సన్నగిల్లినపుడు శ్రీహరి అవతారము ఎత్తుచుండుట అందరికి తెలిసినదే. అట్టిదే ఈ బుద్దావతారం కూడా. రాక్షసులను వేద విరుద్ద బోధలతో ఆకట్టుకొని దేవతలకు తగినంత బలాన్ని చేకూర్చి రాక్షసులను సంహరించడానికే ఈ అవతారం.

10. కల్కి అవతారం: దుష్టశిక్షణ శిష్టరక్షణార్దమై మహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో చివరిది. కల్కి అవతారం. కలియుగానికి అధిపతి అయిన అక్రమాలకు అన్యాయాలకు అన్ని పాపాలకు మÖలపురుషుడైన కలిపురుషుని సంహరించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగానున్న పాలకుల రూపంలోనున్న దోపిడి దార్లను సంహరించడం ద్వారా కలియుగ ధర్మము నశించును. తద్వారా కలియుగాంతం అవుతుంది. కలియుగాంతంలో శ్రీమన్నారాయుణుడు మÖడుమÖరల ఖడ్గాన్ని ధరించి తెల్లని అశ్వాన్ని అధిరోహించి కలిమాయ విశేష పీడుతుల ఉద్దరణకై ధర్మసంస్థాపనకొరకై పాప వినాశనం జరుగుతుంది. 

2034 కలియుగాంతం:

ఆనందే దనుజాబ్దేతు లోకేశ్మిన్ కలినాశనమ్

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఏకాదశాశ్వాసము 88వ పేజి చివరలో చెప్పినట్లుగా ఆనంద రాక్షస సం॥ లోగా అనగా 2034`2035 ఉగాది లోగా లోకమందు కలియుగ ధర్మం నాశనమవుతుంది. తద్వారా 2034లో కలియుగాంతమవుతుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి