మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, నవంబర్ 2026, మంగళవారం

కాలజ్ఞానం ప్రకారం జరిగి తీరవలసినవి

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగ బహుదానదీ తీరాన ఒక చిన్న పాటి గ్రామమైన కాణిపాకంలో కొలువైన వరసిద్ది వినాయకుడు ఒక చిన్న పాటి గ్రామమైన కాణిపాకంలో కొలువైన వరసిద్ది వినాయకుడు నిరంతరము ఉబికి వచ్చే పాతాళగంగనడుమ బావిలో వెలసిన ఇక్కడి వినాయకుడు భక్తుల కోర్కేలు తీర్చుతూ కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. అంతటి మహిమాన్వితమైన కాణిపాక పుణ్యక్షేత్రంలో ఆలయం ముందుగల బావిలో వెలసిన విఘ్నేశ్వరస్వామి ఆ గంగ రక్తమై ఆరు ఆమడపారవలసి వుంది. అప్ప్పుడే వీరబోగవసంతరాయల వారి రాక ఇదీ కాలజ్ఞానం ప్రకారం జరిగి తీరవలసివుంది.


శ్రీశైల మల్లికార్జున స్వామి సాక్షాత్కారముగా మనుజులతో మాట్లాడేను 

పురాణ ప్రసిద్దమైన ఈ క్షేత్రంలో శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారు వేంచేసియున్నారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామిని చేతులతో తాకి పునర్జన్మ లేకుండా ముక్తిని పొందవచ్చు. ఇంతటి మహత్తుగల ఈ పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాములలో మొదటిది. సముద్ర మట్టానికి సుమారు 1500 అడుగుల ఎత్తులో వున్న ఈ అనాది క్షేత్రమును శ్రీ రామచంద్రుడు బ్రహ్మ హత్య పాతక విముక్తికై ప్రదిక్షణ చేశారు. ఈ క్షేత్ర దర్శనము సకలపాప హరమని శివపురాణంలో ఉంది.  కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగ శ్రీశైల మల్లికార్జున స్వామి మనుషులతో మాట్లాడేను. వీరభోగవసంత రాయలు వస్తున్నారని చెప్పేను. శ్రీశైల మల్లికార్జున స్వామి గుడిలోనున్న దేవత విగ్రహాలన్నింటికి మÖర్తివంతాలు వచ్చి ఊరూర నాట్యమాడేను. శ్రీశైల మల్లికార్జున స్వామి కంట నిప్ప్పులు రాలేను. ఆ మహాదేవుని జడలు యెగసి ఆడేను. అప్ప్పుడు రక్త వర్షము కురిసేను. శ్రీశైలం గుడిలో పొగమంటలు యెగసేను. బసవేశ్వరుడు దిమిదిమి యని నాట్యమాడేను. నాగభోగ ప్రతిమ మావారు వచ్చే అని కిలకిల నవ్వేను. మల్లికార్జునుని నొసలకన్ను నెత్తిన జడ నోట అమృతము గురిసేను. శ్రీశైలక్షేత్రం శిధిలమై పొయ్యేను. శ్రీశైల యాత్రులు తప్పేను. అరె దొండతీగ గుడి యంత చుట్టుకొనేను. ఇవన్నీ కాలజ్ఞానం ప్రకారము వీరభోగవసంత రాయలు రావడానికి ముందు జరిగితీరవలసి వుంది.


శ్రీశైల భ్రమరాంబ సముఖాన రెండు తలల  మొసలి కనిపించేను

ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్దికెక్కిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం కర్నూలుకు 150 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు శ్రీశైల భ్రమరాంబికగా నిత్యపూజలు అందుకుంటున్నారు. విష్ణుమÖర్తి ధనుర్భాణాలతో సతీదేవి చిత్కళారూపాన్ని ఖండిస్తూ వెళ్ళగా ఆమె శరీర భాగాలు భూలోకంలో అనేకచోట్ల పడి శక్తి పీఠాలుగా అవతరించాయి. ఇక్కడ సతీదేవి మెడ భాగం పడిన స్థలంగా ప్రతీతి. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగ శ్రీశైల పర్వతానకు ఒక మొసలివచ్చి ఎనిమిది దినములుండి భ్రమరాంబ గుడిలో దూరిమేకపోతు వలె కూసి మాయమయ్యేను. భ్రమరాంబ ముందున్న బసవేశ్వరుడు తోక విదళించుకొనెనేను. ఆయమ్మ కంట కన్నీరు కారేను. ఇవన్నీ కాలజ్ఞానం ప్రకారం ప్లవంగ నామ సం॥ అనగ 2027 సం॥లోపు జరిగి తీరవలసి ఉంది. 


కంచి కామాక్షమ్మ కన్నుల నుండి నీరు జలజల రాలేను

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైపట్టణానికి 75 కి.మీ దూరంలో కంచిలో వేం చేసియున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మహాపుణ్యక్షేత్ర మైన తిరుపతి తిరుమల దివ్యక్షేత్రమునకు 65 కి।మీ దూరంలో ఉన్నది. కోర్కెలు తీర్చే కన్నుల గల శక్తి స్వరూపిణి కామాక్షి అమ్మవారు. శివుని అర్దాంగి సతీదేవి శరీర భాగాలు పడిన 101 ప్రదేశాలలో 51 క్షేత్రాలు ముఖ్యమైనవి. వాటిలోను అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి 18 ప్రదేశాలు వాటినే అష్టాదశ శక్తిపీఠాలుగా గుర్తించి పూజిస్తున్నాము. ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో గుడి ద్వంసం అయింది. ఒకటి శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తీ పీఠాలు మనదేశంలోనే ఉన్నాయి. అమ్మవారి శరీరభాగాలైన కంకాళం ఇక్కడ పడినట్లు చెబుతారు. ఇక్కడ కామకోటి “పీఠం” పేరుతో ఒక బిలం వుంది. కామమనగా అక్షరమే. ఈక్షేత్రంలో చేసిన మంత్రజపం ప్రతిఅక్షరానికి కోటిరెట్లు ఫలితాన్నిస్తుంది. కాలజ్ఞానం లో చెప్పిన ప్రకారంగా కంచికామాక్షమ్మ ఉగ్రం చేతం దక్షిణ దేశ ప్రజలను శిశువులను నష్టపర్చేను. కంచికామాక్షమ్మ కన్ను నుండి నీరు జలజల రాలేను. నెత్తురు కక్కేను ఆయమ్మ స్థనాల నుండి పాలుకారేను. కంచికి పడమట గాండ్లవాని ఇంట కామదేనువు జన్మమందేను. కామాక్షి అమ్మవారి దేహాన చెమట పట్టేను. ఇవన్నీ కాలజ్ఞానం ప్రకారం ప్లవంగ నామ సం॥ లోపు అనగ 2027లోపు జరిగి తీరవలసి ఉంది.


అలంపూర్ జోగుళాంబా కంట నీరు కారేను

దేవిశక్తి పీఠాలలో మరొక క్షేత్రము అలంపూర్ జోగుళాంబ. అలంపురానికి పూర్వనామదేయం హలంపురం. ఇది హరిహరశక్తి క్షేత్రం. తెలంగాణలోని మహబూబునగర్ జిల్లాలో హైదరాబాద్ నుండి కర్నూలుకు వెళ్లు మార్గంలో తుంగభద్రనది ఒడ్డున అలంపురం గ్రామంలో జోగుళాంu అమ్మవారు వెలసియున్నారు. ఇక్కడ నవ బ్రహ్మ అలయాలు కూడా ఉన్నాయి. సతీదేవి దంతాలు ఇక్కడ పడ్డాయని ప్రతీతి. కలియుగ ప్రత్యక్ష దైవం జగద్గురు శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం చెప్పిన ప్రకారంగా అలంపూర్ జోగులాంబ కంట నీళ్ళు గారేను. ఆయమ్మ స్థనాలు పాలు కారేను అని చెప్పియున్నారు. ఇది కాలజ్ఞానం ప్రకారం క్రోది నామ సం॥ లోనగా 2024లోపు జరిగి తీరవలసివుంది.


వేంకటేశ్వరునిగుడిలో మొసళ్ళుజొరబడి మÖడురోజులు పూజ నిలిచేను.

ఏడుకొండలపై వెలసియున్న శ్రీవేంకటేశ్వరుని ఆలయం దేశంలోనే అత్యంత ప్రాచీనమైంది. శ్రీరామనుజుల వారి పాదస్పర్శతో పవిత్రమైన ఈ ప్రదేశం నిత్య పచ్చతోరణమే. నిత్య పెళ్ళికొడుకు శ్రీవేంకటేశ్వరుని చూడటానికి బ్రహ్మ ఇచ్చిన ఈ రెండు కళ్ళు చాలవు. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూడటానికి చూచి తరించడానికి భారతదేశం నలుమÖలల నుంచే కాకుండ దేశవిదేశాల నుండి లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించి తరిస్తున్నారు. సుమారు 1600 కోట్ల సం॥లకి ముందు సహజ శిలాతోరణంగా స్వామి వారు ఏర్పడ్డారని భౌగోళిక శాస్త్రజ్ఞులు, పురాతన శాస్త్రవేత్తలు, ఇతిహాసాలు, పురాణగాదలు చెబుతున్నాయి. ప్రపంచం మొత్తం మొత్తం మీద అత్యధిక ఆదాయంగల దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానమే అని చెప్పొచ్చు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్‌పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా ఈ దివ్య స్థలమున ఆరుగురు దుష్టులు పుట్టేరు. తిరుపతికొండ  మÖలన దూమ కేతువనే నక్షత్రము పుట్టేను. ఆ నక్షత్రమును చూచి అందున కొందరు నష్టమందేరు. వేంకటేశ్వరస్వామి కుడి భుజం అదిరేను. అలువేలు మంగమ్మ అదిరిపడి లేచేను. వేంకటేశ్వరుని గుడిలో వేయి వింతలు పుట్టి పూల వర్షము జూము కురిసేను. ఏనాడు కానరాని ఆ పూలు తాకినా తెలయ్యి కుట్టేను. వేంకటేశ్వరస్వామి సొమ్ము దోచేరు. తిరుపతి కొండ మీద మహమ్మదీయులు ఆడిపాడేరు. కుడిద్వజం కదిలేను. గరుడద్వజమున ఓంకార నాదము వింతగా పుట్టేను. పరమాత్మసేవకై లక్షలాది ప్రజలు ప్రతిదినము వచ్చేరు. 


మహానంది మరుగున మహిమలు పుట్టేను

నంద్యాల పట్టణమునకు సుమారు 20 కి.మీ దూరంలో మహానందీశ్వరుడు, కామేశ్వరీదేవి వెలసియున్న పరమ పవిత్రమైన క్షేత్రమిది నవనందులలో ముఖ్యమైనది శ్రేష్ఠమైనది. మహానంది కలియుగ ప్రత్యక్ష దైవం జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగ మహానందిలో రెండు సర్పాలు దేవాళములో పోరాడేను ఒక సర్పం దొడ్డది. అది శిఖరాన మÖడు రోజులుండేను. మహానంది శిఖరం విరిగిపడేను. మహానందికి ఉత్తరాన 30 మంది మునులు జన్మించేరు ప్రజలకు వారు మహిమలు చూపేరు. మహానందిలో పంచవాయిద్యాలు వాయించినట్లుండేను. హంపిలో నుండేటి హనుమంతుcడు అరచికేక వేసేను ఆకేకతో మహానందిమÖలంత ఆకు రాలినట్లు రాలేరు. ఇది కాలజ్ఞానం ప్రకారం జరిగి తీరవలసి వుంది.

మÖడు కాళ్ళావుకు మనుజుడే పుట్టేను. ప్రజలతో తర్కవాదములు చేసేను.

వెదకాలం నుండి నేట ìవరకు భారతీయులకు గోవులు అత్యంత పవిత్రమైనది మరియు శుభప్రధమైనది, ఆరాధనీయమైనది. గోవులో ఎందరో దేవతలు కొలువు దీరి ఉన్నారని పురాణాలు, శాస్త్రలు తెలియజేస్తున్నాయి. గోవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే. గోమాతకు ఆహారము ఇచ్చినచో ఋణ విముక్తి పొంది సకల సంపదలతో తులతూగుదురు. గోప్రదక్షణ చేయడమంటే భూప్రదక్షణతో సమానము. ఆవు నాలుకపై వరుణ దేవుడుండును. పూజించినచో సంతానం కల్గును. పాలిచ్చు ఆవును  దానము చేసిన వారికి ఆవుకు ఎన్ని రోమములు గలవో అన్ని వేల సం॥లు స్వర్గలోకమున ఉందురు. కలియుగ ప్రత్యక్ష దైవము జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి వారు గరియరెడ్డి అచ్చమ్మగారి ఇంటి యందున్న గోవులను బనగానపల్లెకు రెండు కి.మీ దూరంలో గల రవ్వలకొండపై కాయుచు కాలజ్ఞానం వ్రాశారు. కాలజ్ఞానంలో చెప్పినట్లుగా ఆవుకు అయిదు శిరస్సులు, రెండు యోనులుగా పుట్టును. ఒక యోని మానవ యోనిగాని, ఒక యోని ఆవు యోనిగానుండును. ఆవు కడుపునందుగల దూడ అంతర్గతముగా కనిపించేను. మÖడు కాళ్ళావుకు మనుజుడు పుట్టి ప్రజలతో తర్కవాదము చేసేను. సోమయాజుల ఇంట జరిగిన హత్యకు గోవుసాక్ష్యము పల్కేను. ఇది కాలజ్ఞానం ప్రకారం క్రోదినామసం॥ం అనగా 2024 లోపు జరిగి తీరవలసి వుంది. 

హంపిలో నుండేటి హనుమంతుడు అరచివీదుల్లో కేక వేసేను

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం చెప్పినట్లుగ బానుముక్కలలోను, బేతం చెర్లయందున, కురుకొండ యందున్న, శిరివెళ్ళ యందున్న ఆంజనేయుడు మనుష్యుల ప్రయాణం కనపడేను, హంపిలో నున్న హనుమంతుడు అరచి వీధుల్లో కేకవేసేను. ఆకేకతో మహానందిమÖలంత ఆకురాలినట్లు రాలేరు. ఇది కాలజ్ఞానం ప్రకారం క్రోది నామ సం॥ నుండి విశ్వావసు నామ సం॥లోపు జరిగి తీరవలసి వుంది.

ఒకే నెలలో రెండు గ్రహణాలు వచ్చేను

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా 

జూన్ 15 1992లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది.

జూన్ 30 1992లో సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడింది.

డిశంబర్ 10 1992లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది.

నవంబర్ 29 1993 లో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడింది.

నవంబర్ 29 1993లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది.

మే 10 1994లో సూర్యగ్రహణం ఏర్పడింది.

మే 25 1994 పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది.

ఏప్రీల్ 15 1995లో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది.

ఏప్రీల్ 29 1995లో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడింది. 

ఏప్రేల్ 4 1996లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది.

ఏప్రేల్ 17 1996లో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడింది.

 మార్చి 9 1997లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది.

మార్చి 24 1997లో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది.

మార్చి 9 2016లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది.

మార్చి 23 2016లో పాక్షిక చంద్రగ్రహం ఏర్పడింది.

సెప్టెంబర్ 12 2016లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

సెప్టెంబర్ 16 2016 పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

ఈ విధంగా కాలజ్ఞానం ప్రకారం ఒకే నెలలో రెండు గ్రహణాలు ఏర్పడటం అనేక సార్లు జరిగింది. ఇదీ కాలజ్ఞాన మహిమే ముందుగా చెప్పినదే.

భూమి వక్కలయ్యేను

కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా భూమి పొరýలో కదలికలు ఏర్పడటము వల్ల భూకంపాలు సంభవించి భూమి వ్రక్కలవ్వడం జరుగుతూనే ఉంది. ఇది కాలజ్ఞాన మహిమే 17వ శతాబ్దంలో చెప్పినదే.

మనుష్యులతో మాయ శక్తి మాట్లాడేను

కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన ప్రకారం టెలిఫోన్లు, టీవిలు, టేప్‌రికార్డులు మనుషులు లేకుండగానే మాట్లాడుచున్నాయి ఇదీ కాలజ్ఞాన మహిమే 17వ శతాబ్దంలో చెప్పినదే. 

ఒక గోతికి పట్టనంత మందిని పూడ్చేరు

కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా డిశంబర్ 26, 2004లో వచ్చిన సునామి కారణంగా ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా దీవుల సమీపంలో హిందూ మహాసముద్రంలో తీవ్ర భూకంపం కారణంగా సముద్రం ఉప్పొంగి వచ్చిన సునామి దాటికి 14 దేశాల్లోని తీర ప్రాంత గ్రామాలు, పట్టణాలను, నగరాలను అతలాకుతలం చేసింది. తత్పలితంగా 2,30,508 మంది మృత్యువాత పడ్డారు. అప్ప్పుడు చనిపోయిన వారిని జెసిబిలతో గోతులు తవ్వి వందలాదిగ ఒక గోతికి పట్టనంత మందిని పూడ్చిపెట్టడం జరిగింది. ఇదీ కాలజ్ఞాన మహిమే 17వ శతాబ్దంలో చెప్పిన కాలజ్ఞానమే.

ఇంటింటిన రోదనంబులగు ఇళ్లకు ఇళ్ళు నశించుచుండు.

కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ పేరు చెప్పగానే మొదటగా ఎవరికైనా గుర్తొచ్చేది ఫ్యాక్షన్. సీమలోను ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల ఫ్యాక్షన్‌కు పెట్టిందిపేరు అందులోనూ కడప పూరు వినపడంగానే కళ్ళముందు కదలాడేది. బాంబులు నాటు తుపాకులు, కత్తులు, వేట కొడవళ్ళతో కూడిన ముఠా తగాదాలు, పలుగ్రామాల్లో నాయకులు ముఠాలుగా  ఏర్పడి రాజకీయ చిన్నచిన్న సమస్యలపై సైతం ఘర్షణకు దిగడం ఈ సీమ జిల్లా వాసులకు సర్వసాధారణం. పగలు ప్రతికారాలతో కక్ష్యలతో రగిలిపోతూ ఒకరిపై మరొకరు బాంబులు వేట కొడవళ్థతో దాడులు చేసుకుంటూ ఒకరినొకరు చంపుకుంటు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ విధంగా కాలజ్ఞానం ప్రకారం రాయలసీమ జిల్లాలో ముఠాతగాదాల వల్ల ఇళ్ళకు ఇళ్ళు నశించుచున్నాయి. ఇదీ కాలజ్ఞాన మహిమ 17 శతాబ్దంలో చెప్పినదే.

అర్ధరాత్రి వేళ సూర్యుడు కనపడేను

కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా నార్వే దేశంలో ఉత్తరాగ్రంలో గల ట్రాంసో ఒక లక్ష జనాభా గల చిన్న నగరం. ఉత్తర అక్షాంక్ష రేఖకు సమీపంలో ఉండటం వల్ల  ట్రాంసోనగర శీతోష్ణస్థితి మిక్కిలి చల్లగా ఉంటుంది. టండ్రాల ప్రాంతం కాబట్టి వేసవి నెలలలో కూడా ఇక్కడ 15 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. శీతాకాలంలో మైనస్ 20 డిగ్రీలుంటుంది. భూమిపై ఉత్తరాగ్రంలోని నగరంగా పేరొంది. ట్రాంసో నగరంలో మధ్యరాత్రిలో కూడా సూర్యుని చూడవచ్చు. మే నెల 18 నుండి జులై26 వరకు అర్దరాత్రి సమయంలో కూడా సూర్యుడు కనిపిస్తాడు. ఏప్రీల్ నుండి ఆగష్టు వరకు మసక చీకటి ఉంటుంది. కాని రాత్రి ఉండదు. నవంబర్ నుంచి జనవరి వరకు సూర్యుడు అసలు కనిపించడు. అందుకే ఈ సమయాన్ని పొలాల్ నైట్ అంటారు. ఈ విధంగా కాలజ్ఞానం ప్రకారం ట్రాంసో నగరంలో అర్ధరాత్రి సమయంలో కూడా సూర్యుడు కనిపిస్తాడు. ఇదీకాలజ్ఞాన మహిమే. 17 శతాబ్దంలో చెప్పినదే.

బండి మీద కోడి వచ్చేను దాని రెక్క విసురుకు లక్షల మంది చచ్చేరు దానికూతకు కులక్షయమై మానవులుగట్టిగా మగ్గేరు.

కలియుగ ప్రత్యక్షదైవం దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా బాంబులకే బాంబు హైడ్రోజన్ బాంబు. ఒకప్ప్పుడు అమెరికా రష్యాల మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్న రోజుల్లో వినిపించిన మాట ఇది. మళ్ళీ ఇన్నాళ్ళకు మేం హైడ్రోజన్ బాంబును పరిక్షించామంటూ ఉత్తర కొరియా బాహాటంగా ప్రకటించిన తర్వాత అంతర్జాతీయ సమాజంలో అత్యంత చర్చనీయాంశమైన అంశంగా అది మారింది. అణుబాంబులకు హైడ్రోజన్ బాంబుకు చాలా తేడా ఉంటుందంటున్నారు నిపుణులు. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు సమయంలో 6 ఆగష్టు 1945 అమెరికా జపాన్‌లోని హిరోషిమా పట్టణంపై  అణుబాంబు వేసింది. ఈ దాడిలో దాదాపు 166,000 మంది మరణించారు. అదేనెల 9న జపాన్‌లోని నాగసాకిపై మరో అణుబాంబు వేసింది. ఈ ఘటనలో 80,00 మంది మరణించారు. నిపుణులు సూపర్‌బాంబుగా పిలుచుకునే ఈ హైడ్రోజన్ బాంబు అత్యంత శక్తి వంతమైనది. జపాన్ దేశాన్ని దశాబ్దాల పాటు ఆర్థికంగా సామాజికంగా కోలుకోలేనంత దెబ్బతీసిన అణుబాంబులకన్న వెయ్యిరెట్లు అధికశక్తి వంతమైనది హైడ్రోజన్‌బాంబు. అణుశక్తి బాంబుకన్న హైడ్రోజన్ బాంబు విడుదల చేసే శక్తి చాలా ఎక్కువ. ఒక హైడ్రోజన్ బాంబు ఒకే సమయంలో అనేక నగరాలను ద్వంసం చేయగలదు. ఇప్పటి వరకు ఏ దేశం దీనిని ప్రయోగించలేదు. హైడ్రోజన్‌బాంబును చిన్న సైజులో తయారు చేయవచ్చు. అందువల్ల వీటిని యుద్ధ విమానాల ద్వారా క్షిపణిల ద్వారా ప్రయోగించటం సులువు. ఈ హైడ్రోజన్‌బాంబు ప్రయోగించినప్ప్పుడు వచ్చే శబ్దానికి భూకంపం సంభవించినట్లుండి వేలాది గృహాలు కూలిపోయి మానవులు ఎక్కడివారు అక్కడి మగ్గిపోతారు. ఇది కాలజ్ఞానం ప్రకారం క్రోదినామ సం॥ అనగా 2024 లోపు జరిగి తీర వలసివుంది.

సృష్టికి ప్రతిసృష్టికల్పించే అల్పజీవులు ఇలలో పుడతారు.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా దేవుడు 84 లక్షల జీవరాలసులను సృష్టిస్తే అందుకు ప్రతిసృష్టిగా మనిషి తన తెలివి తేటలతో బొమ్మలను మరబొమ్మలను మరమనుష్యులను టెస్ట్ ట్యూబ్ బేబిలను సృష్టిస్తున్నాడు. వీటికి ఆకలి గురించి తెలియదు కానీ వంట చేయగలవు. పరిశుభ్రత గురించి తెలియదు కాని ఇంటిని శుభ్రం చేయగలవు. మనసు మమత తెలియదు కానీ మనిషికి తోడుగా ఉండగలవు. పంటల గురించి తెలియదు కానీ ఇప్ప్పుడు పంటలుకూడా పండిస్తున్నాయి. పంట పొలాల్లో నాట్లు వేయడం నుంచి పంట చేతికి వచ్చేవరకు అనేక పనులు రోబోలే చేస్తున్నాయి. సర్వీసింగ్, బ్యాంకులో పారిశ్రామిక రంగాల్లో కార్మికులుగా, సైనికులుగా పారిశ్రామిక వ్యాపార సంస్థలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా పాల్గొనబోతున్నాయన్నా వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఒక్కటేమిటి రోబో చేసే పనులు అన్ని ఇన్ని కావు భవిష్యత్తులో పడక గదిలోకి కూడా రోబోలు ప్రవేశిస్తాయట. ఒక్క పిల్లలు కనడం తప్ప  అన్ని పనులు చేస్తోంది. అంతేకాదు భవిష్యత్తులో జరిగే యుద్ధంలో రోబోలే ముఖ్యపాత్ర పోషించబోతున్నాయి. ఇప్పటి వరకు యుద్ధాల్లో సైనికులు మాత్రమే పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు యుద్ధాల్లో సైనికులు మాత్రమే పాల్గొంటున్నారు. త్వరలో రోబోలే ఆపని చేస్తాయట. ఈ విధంగా కాలజ్ఞానం ప్రకారం సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నారు. ఇదీ కాలజ్ఞాన మహిమే ముందుగా చెప్పినవే.

కావేరినది పొంగి ఘనమైన పట్నాలు పాడై ఏడు పుట్ల నల్లు ఏకంగా రాలేను

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లు కావేరినది దక్షిణ భారతదేశంలోని ప్రముఖనది. ఇది కర్నాటక లోని బ్రహ్మగిరి పర్వతాల్లో పుట్టి బంగాళాఖాతం దిశగా ప్రవహిస్తుంది. ఈనది కర్నాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఆగ్నేయ దిశగా ప్రయాణిస్తున్న ఈ నది చాలా పవిత్రమైనదిగా పేరు పొందింది. కావేరి నది జలాలతో ఏర్పడే శివ సముద్రం జలపాతాలు దేశంలో రెండవ జలపాతలుగా పేరు పొందాయి. ఈ కావేరి నది ప్రవహించే తీరాన వుండే ప్రాంతాలు పట్నాలు కావేరీ నది ఉప్పొంగుటవల్ల రూప నామము లేక లక్షలాది ప్రజలు నిలువ నీడలేక చచ్చేదరు. ఇది కాలజ్ఞానం ప్రకారం పరాభవ సం॥లోపు అనగా 2026 సం॥లో జరిగి తీరవలసి వుంది.

నా మఠమున ఈశాన్య భాగమున నవరత్నమంటపములు వెలసేను

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా పట్నాల సన్యాసి రావు వీరి ధర్మపత్ని శ్రీమతి రత్నం గార్లచే సృష్టికి సంబంధించిన తొమ్మిది దేవాలయములు నిర్మించబడినది. 17 ఫిబ్రవరి 2005న ప్రతిష్టింపబడిన ఈ దేవాలయంలో శ్రీ పంచముఖ హెరంబ గణపతి, శ్రీ గాయత్రి విశ్వకర్మ భగవానులు సధ్యోజాత, వాయదేవ అఘోర, తత్పురుష, ఈశాన్యముక పంచకముల నుండి ఉద్బవించిన మను, మయ, త్వష్ట, శిల్పి విశ్వజ్ఞాలనబడు, శ్రీపార్వతి పరమేశ్వరుడు, శ్రీలక్ష్మీదేవి సమేతత విష్ణుమÖర్తి, శ్రీసరస్వతి దేవి సమేత, బ్రహ్మదేవుడు, శ్రీశశిదేవి సమేత ఇంద్రభగవానుడు, శ్రీసంజ్ఞదేవి సమేత సూర్యభగవానుడు మరియు వేణుగోపాల స్వామి, శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి వార్ల ప్రపంచమున సర్వ మానవాళికి గోత్రముల పురుషులైన సానగ, సనాతన, అహబూన, లవబడు గోత్రఋషును, అలాగే వీరందరికి మÖలమైన శ్రీగాయత్రి విశ్వకర్మ భగవానులు ప్రపంచమున మరెక్కడ లేని విధంగా నవరత్న మంటపములు కాలజ్ఞానం చెప్పినట్లుగా నిర్మింపబడినాయి. ఇదీ కాలజ్ఞానమహిమే ముందుగా చెప్పిందే.






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి