విరతి లేక తిరిగి వేసారినాడ.. ని
ఘ్న మగు మనము నాదిగా నెఱిగితి..
రాజ వదనఁ గనను, రామ లంబరములు
జార నిదుర మునిగినారు, కంటి..
విరతి = విశ్రాంతి, విరామం
నిఘ్నము = అధీనమయినది
అంబరము = వస్త్రము
ఆంజనేయుడు సీతామాతను వెదికే సందర్భంలో తనలో తాను ఇలా తలపోసినాడు.
"విరతి (విరామం) లేకుండా లంక నంతా గాలించి వేసారినాను. రామ (స్త్రీ)లు ఒంటిమీది వస్త్రాలు జారిపోతున్నా (పరాకుగా) గాఢ నిద్రలో మునిగిపోయి వుండగా కంటిని (చూసినాను). కాని రాజవదనయైన సీతా మాతను మటుకు కనను (చూడను).
ఐనా ఇంత మంది మహిళలను యీ స్థితిలో చూసినా నా మనస్సు చలించలేదు. నిఘ్నమైన (స్వాధీనమైన) మనస్సు నా దని తెలుసుకో గలిగితిని."
కొందరు వనితలు "నిద్రాబలపరాజితలై" పక్కనున్న వారి వస్త్రములు లాగి కప్పుకొని నిద్రించుచుండిరి.(సుం.కాం.11-29)
మే తత్ చ సువ్యవస్థితమ్.. (11-41) నా మనస్సు ఎట్టి వికారము చెందక స్థిరముగా నున్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి