విహతమైన శ్రద్ధ, విగతమౌ నాశ, వి
ఘ్నయుత కార్య సిద్ధి, కలుష బుద్ధి
రామ వోలె నిలిచె నేమో యనెడు నట్టి
జానకిఁ గని హనుమ చాల వగచె..
ఆ సీత దెబ్బ తిన్న శ్రద్ధ వలె, అడ్డులు తగిలిన ఆశ వలె, విఘ్నము కలిగిన కార్య సిద్ధి వలె, కాలుష్యముతో కూడిన (నిర్మలముగా లేని) బుద్ధి వలె ఉండెను. (అటువంటి సీతను హనుమ చూచెను. చాలా బాధపడెను).
రామ రూపము= స్త్రీ రూపం
విహతా మివ చ శ్రద్ధా మాశాం ప్రతిహతా మివ
సోపసర్గాం యథా సిద్ధిం బుద్ధిం సకలుషా మివ (సుందరకాండ 15 - 33)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి