ప్రకటి తాంగీకృతియె సుమ్ము రాము సొమ్ము..
హ్లాదమే గాని వేదన లేదు సుమ్ము..
దుర్గ మాటవిన్ ధైర్యమే తోడు, బెదర
డు, పురమున ధర్మ మౌను తోడు,మొనగాడు.
శ్రీ రాముడు రావణ సంహారానంతరం అయోధ్యకు తిరిగి వచ్చాక ఆతని గుణగణాలను పౌరు లిలా ముచ్చటించుకుంటున్నారు...
"అరణ్యమైనా అయోధ్యయైనా రామునికి అంగీకారమే! ఆ భావనే ఆయనకు సొమ్ము (ఆభరణం). ఎందుకంటే దుర్గమమైన (చొరరాని) అరణ్యంలో అతనికి ధైర్యం తో డుంటుంది. అట్లే అయోధ్యలో (రాజ్యంలో) ధర్మం తో డుంటుంది. రామో విగ్రహవాన్ ధర్మః..అని కదా! (ఎక్కడైనా మనగలడు.) అట్లాంటి రాముడే నిజంగా మొనగాడు. ఎవరికీ బెదరడు."
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి