కరుణను రాముడు " రావణ!
సరిసరి! యలసితివి నేడు
చను" మనగానే
మరి సముచిత మిదె యనిఁ దో
చ.. రణంబులు లేనివాడు
చకచక నడచెన్
రావణుడు ఆరోజు యుద్ధంలో బాగా అలసిపోయినాడు. కరుణాస్పదుడైన రాముడు "రావణా! నీవు అలసిపోయినావు. ఇంక ఇవాళ యుద్ధం అక్కర లేదు. వెళ్ళి విశ్రాంతి తీసుకొని రేపు ర" మ్మన్నాడు. ఇదే మంచి దని (సముచిత మని) మదిలో తోచగా యుద్ధములు లేని వాడు (రావణుడు) చకచకా నడచిపోయినాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి