తెలుగు వ్యుత్పత్తరాలు
నీరజ భవుడు:- నీరజమునందు పుట్టిన వాడు (బ్రహ్మ విష్ణువు నాభి కమలము పుట్టినవాడు
త్రివిక్రముడు:-మూడడుగులచే భూమిని కొలిచిన వాడు.
విష్ణువు:-- విశ్వము అంతటా వ్యాపించిన వాడు,
విశ్వంభరుడు:- విశ్వమును భరించువాడు
బార్గవుడు :- భృగువంశమున పుట్టిన వాడు
వదాన్యుడు:- మిక్కిలిగా యిచ్చేవాడు.
హరుడు:- హరించేవాడు
హరి :- భక్తుల హృదయాలను ఆకర్షించువాడు (విష్ణువు) చీకటిని హరించువాడు
మానవకుడు:- మనువు యొక్క అల్పమైన సంతానం.
దానవులు:- ధనువువల్ల పుట్టిన వారు
బ్రహ్మ:- ప్రజలను వర్దిల్ల చేయువాడు
భాష = బాషించునది.
గురువు:- అజ్ఞానమనే అంధకారమును హరించువాడు (ఉపాధ్యాయుడు)
అధ్యక్షుడు:- చర్యలను కనిపెట్టి చూచేవాడు
పౌరాణికుడు:- పురాణములు తెలిసినవాడు (చెప్పివాడు)
పురోహితుడు:- పురము యొక్క క్షేమాన్ని కోరేవాడు
మిత్రుడు :- అన్ని ప్రాణుల యందు స్నేహంతో కూడిన వాడు (స్నేహితుడు, సూర్యుడు)
జలేజము:- నీటియందు పుట్టినది (పద్మము)
భానుడు: ప్రకాశించు వాడు (సూర్యుడు)
పారాశర్వుడు:- పరాశర మహర్షి కుమారుడు.
భాగీరధి:- భగీరథునిచే తీసుకొని రాబడినది
అతిధి :- తిధి మొదలయిని నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు
తెలుగు :- త్రిలింగముల మధ్య ఉపయోగించే బాష
హృదయము:- హరింప బడేది.
ఆయుదము:- యుద్ధము చేయుటకు తగిన సాధనము
ముక్కంటి :- మాడు కన్నులు కలవాడు
ఉష్ణ రష్మి :- చల్లని కానివి భానువులు కలవాడు.
చిగురు బోడి:- చిగురు వంటి శరీరం కలది.
భవాని : భవుని భార్య
మచ్చెకంటి:- మత్స్యముల వంటి కన్నులు కలది.
కమలాలన:- కమలముల వంటి అననము కలది.
ఛాత్రుడు : గురువు దోషములను కప్పి పుచ్చేవాడు.
ఆహిమ భానుడు : చల్లనివి కాని కిరణాలు కలవాడు
అంగన:- మంచి అవయవములు కలది.
వేదవ్యాసుడు;- వేదములను విభజించినవాడు
మనోహరమైనది: హర్మ్యము
అక్షరము - నాశనము పొందనిది.
ఈశ్వరుడు : స్వభావము చేతనే ఐశ్వర్యము కలవాడు
దాశరథి : దశరథుని కుమారుడు
మిత్రుడు : సర్వ భూతములయందు స్నేహయుక్తుడు
భీముడు : భయమును కలుగజేయువాడు
శౌరి : సూరికి మనుమడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి