వినతిఁ జేతు రామ! వెరపించు మృత్యువు
శ్లేషమందు నేను చేరకే వి
ష నిభ దైవ విరహమును బాపితి.. నిరీక్ష
ణ మిది సఫల మాయె విమల చరణ!
శబరి ఎంతోకాలం నిరీక్షించిన తదుపరి శ్రీ రాముని దర్శనం చేసుకోగలిగింది. అప్పు డామె రామునితో ఇలా అన్నది.
"నమస్కరిస్తున్నాను రామా! నీవు విమలమైన చరణములు గల వాడవు. మృత్యువు శ్లేషమందు (కౌగిలిలోకి) నేను చేరుకోకముందే విషము వంటి దైవ వియోగాన్ని తొలగించినావు. నా నిరీక్షణ సఫలమయింది. (దైవాన్ని ఎడబాసి వుండడ మంటే మృత్యువే!.. అని తాత్పర్యం.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి