మొత్తం పేజీ వీక్షణలు

22, జూన్ 2022, బుధవారం

పితృ దేవతల - తర్పణ విధులు

 పితృ దేవతల - తర్పణ విధులు 

***********************************

హిందువులకు పండుగలు, పర్వాలని అనబడే రెండు ప్రత్యేక దినాలున్నాయి

పండుగలనాడు మన మా యా దేవతలను పూజిస్తుంటాం 

పర్వాలనాడు పితృదేవతల నారాధిస్తారు 

దేవతల వల్ల మనకు ధన ధాన్య సమృద్ధి కలుగుతాయి 

పితృదేవతల వల్ల వంశాభివృద్ధి వంశోన్నతి కలుగుతుంది.  

దేవతలతో పాటు పితృదేవతలను గూడ విధిగా ఆరాధిస్తుంటారు 

పితృదేవతలకు అంగరంగ భోగాలక్కరలేదు. 

పితృదేవతలు జల తర్పాణాలతోనే తృప్తిపడగలరు. 

దేవతా కార్యాలలో భక్తి ముఖ్యమైనది 

భక్తిలో ఏదైనా లోపమైతే దేవతలు క్షమిస్తారు. 

పితృకార్యాలలో శ్రద్ధ మాత్రం ఎంతో ముఖ్యం. 

శ్రద్ధలో మాత్రం ఏ లోపం జరిగినా పితృ దేవతలు సహించరు. 

పితృకార్యాలు శ్రద్ధాపూర్వకంగా ఆచరించదగినవి కాబట్టి వానికి శ్రాద్ధమని పేరు. 

ఈ శ్రాద్ధానికి బ్రాహ్మణాగమం సమయమని చెబుతారు 

బ్రాహ్మణుడు లేకుంటే మాత్రం ఏ మాత్రం సాగదు. 

ఆనాడతని పాదార్చనం చేసి మనం పితృల పేర నలుగురికి భోజనం పెట్టవలసి ఉంటుంది.

మనవారు పనసకాయ దొరికినపుడే శ్రాద్ధం పెట్టు అంటారు 

పనసకాయ దొరకని పక్షంలో అరటితో పని దాటించవచ్చు

మరణించిన వారిని గురించి చేసే ఈ  కర్మల ఫలితం ఆ జీవుని కందుతుందా! 

ఇదంతా భ్రమ అనే వాదం ఉంది. 

ఒక సత్కర్మ ఏ రూపంలో చేసినా మంచిదే

తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలం కుమారులకు సంక్రమించినట్లు కుమారులు తమ పితృలనుద్దేశించి చేసే కర్మల ఫలితం తప్పక వారి కందుతుంది అనే దానికి మనకు మహాభారతంలో జరత్కారుని వృత్తాంతం, పాండురాజు కథ నిదర్శనంగా ఉన్నవి. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి