భూమిదేవి హరికి భామిని; రాముడై
హరియె చెట్టబట్టె నవని సుతను..
రాము డల్లు డయ్యె భూమిదేవికిఁ గాన
భర్త అల్లు డయ్యె భార్య కిపుడు
శ్రీదేవి భూదేవి శ్రీ మహా విష్ణువుకు భార్యలు. విష్ణువే రామునిగా అవతరించినాడు. భూదేవి కూతురైన సీతాదేవి రామునికి భార్యయైనది. తన భర్తయే తన కూతురును చేపట్టినాడు కాబట్టి భూదేవికి తన భర్తయైన విష్ణుమూర్తియే అల్లుడైనా డనవచ్చు.
భూమిదేవి = భూదేవి; అవనిసుత = సీత
పద్య చమత్కృతికై తప్ప తాత్విక దృష్టి ముం దీ భావన నిలువదు.
"తనువుతో గలుగు బాంధవ్యంబు లెల్ల
తనువుతో నశియించి ధరణిలో గలియు"
అనే "శ్రీ కృష్ణావతారం" సినిమాలోని మాటలు గుర్తుకు రావాలి. చుట్టరికా లన్నీ ఈ శరీరంతోనే! శరీరం మారితే అన్నీ మారిపోతాయి. ఇ దేమిటి.. అనడానికి లేదు. ఏ జన్మ బంధుత్వ మా జన్మ వరకే!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి