మా తలయె దుష్ట భావాల మాత, మంచి
తలపు లను పతివ్రతలను తరిమి చెఱచు
విటులె యీ చెడ్డ యూహ, లీ విటుల తల్లి
మా తలయె, మాయ యను విటున్ మరిగి దైవ
మను పతిని మోసగింప జూచు, నది వేశ్య -
మా తల కుమాత, విటులకు మాత, వేశ్య
రావణుడు మారీచుని ఆశ్రమానికి వెళ్ళాడు. మారీచ స్తత్ర మునివత్ జటా వల్కల ధారకః 6-2 ఆశ్రమంలో మారీచుడు జటావల్కలాలతో ముని వృత్తిలో ఉన్నాడు.
రావణుడు అతణ్ణి సీతాపహరణానికి ప్రేరేపించినాడు. అతను దైవాన్ని మోసగించడం మంచిది కాదు, మనకే ము ప్పన్నాడు.
తవ హితం వదతో మమ భాషితం
పరిగృహాణ పరాత్మని రాఘవే
(అధ్యాత్మ రామాయణం.. అరణ్య 6-25)
నేను నీకు హితము చెబుతున్నాను. పరమాత్మ యైన రాముని యందు వైరం వదలిపెట్టు.
అతో న మానుషో రామః
సాక్షా న్నారాయణోఽ వ్యయః
మాయా మానుష వేషేణ
వనం యాతోఽ తి నిర్భయః 28
రాముడు మానవుడు కాదు. సాక్షాత్తు అవ్యయుడైన నారాయణుడు. మాయా మానుష వేషంతో అడవుల్లోకి నిర్భయుడై వచ్చాడు... అన్నాడు.
కానీ చివరికి ఇష్టం లేకున్నా మారీచుడు రావణునికి సహకరించేందు కొప్పుకోవలసి వచ్చింది - ఒక మిత్రునితో తన ఆవేదన నిలా వెళ్ళగ్రక్కినాడు. మా తల (మా బుఱ్ఱ లేదా మెదడు) కుమాత (చెడ్డతల్లి) అని, విటులకు మాత యని, వేశ్య యని చెప్పినాడు. భావం సులభం.
(మాయకు లొంగిపోకుండా వుండే తల (బుఱ్ఱ)యే తన నుద్ధరించే మంచి మాత అని అతని ఆంతర్యం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి