ఇంట్లో తక్షణం అవసరం లేని వస్తువులని కొనకూడదు.
ఏ వస్తువు కొన్న అలోచించి కొనాలి.
పొదుపు మంత్రాన్ని రోజూ పఠిస్తుండాలి.
అప్పు ఎప్పటికైనా ముప్పే అన్న సంగతి మరువరాదు
ఏదైనా అవసరం పడి అప్పు చేస్తే మనకొచ్చే ఆదాయమంతా ఆ అప్పు తీర్చడానికే సరిపోతుంది
సేవ్ చేయడానికి ఇంకేమీ మిగలదు.
మీరు వారమంతా పక్కన పెట్టి మిగిల్చిన డబ్బులని వారాంతంలో తప్పనిసరిగా బ్యాంక్ లో వేసేయండి
సేవింగ్ ఎకౌంట్ లో నుండి అత్యవసరం అయితే తప్ప మనీ బయటకి తీయకూడదు అని ఒక నియమం పెట్టుకోండి.
కమోడిటీ యాప్స్ ని అన్ఇన్స్టాల్ చేసేయండి.
ఫోన్లో మొబైల్ డేటా వాడితే ఖర్చు ఎక్కువ - వేగం తక్కువ
లోకల్లో వైఫై ని వాడుకుంటే నెట్ బిల్ అదా అవుతుంది
బయట తినడం చాలావరకు దుబారా కిందికే వస్తుంది
బయట రేట్స్ ఎక్కువ - క్వాలిటీ తక్కువని మరువకండి
ఇంటి భోజనమే తీసుకోండి ఆరోగ్యం + ఆదా
పనిమీద బయటకి వెళ్ళినప్పుడు వెంట వాటర్ బాటిల్ తీసుకు వెళ్ళండి
బయట నీటిని కొనుక్కునే అలవాటు తగ్గించండి
ఇంట్లో మీకు అవసరం లేని వస్తువులని ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ లో అమ్మేయండి.
ఇంట్లో పాతబడిన వస్తువులని అటక మీద దాయకుండా తెలిసిన వారికి ఇచ్చేయండి
షాపింగ్ వెళ్ళినప్పుడు ఇంట్లోనే ముందుగా మంచి ప్లాన్ తో లిస్ట్ రాసుకుని ఆ లిస్ట్ ప్రకారమే కొనండి.
కంపెనీ బోనస్ లాంటి డబ్బులని వెంటనే సేవింగ్ ఎకౌంట్ లో వేయండి.
వాషింగ్ మెషీన్ ఫుల్ లోడ్ వెయ్యటం లాంటివి తగ్గిస్తే పవర్ బిల్ అదా చేసినట్లే .
వారానికి ఒక రోజు "నో మనీ స్పెండింగ్ డే" అనే నియమాన్ని పెట్టుకుని ఆ రోజున ఎలాంటి ఖర్చూ పెట్టకండి.
చదువుకునే పుస్తకాలని లైబ్రరీల్లో అందుబాటులో ఉంటె తీసుకోండి
మరీ అవసరమైతే తప్ప షాపుల్లో బుక్స్ కొనకండి.
పాత పుస్తకాలని ఎప్పటికప్పుడు అమ్మేయండి
మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సేవ్ చేయండి.
సేవింగ్ మనీని బంగారంపై, భూమిపై పెట్టుబడిగా పెట్టండి
సేవింగ్ మనీని పిల్లల చదువులకోసం ఖర్చుపెట్టండి
వారానికి సరిపాడా ప్లాన్ చేసుకుని ఆ ప్రకారం వస్తువులు తెచ్చుకుంటే మీకూ ఒక కరెక్ట్ ఐడియా ఉంటుంది, అనవసరమైన ఖర్చు తగ్గుతుంది
పాడయిపోని వస్తువులని బల్క్ లో తెచ్చుకుంటే డబ్బులు కలిసి వస్తాయి.
ఆఫర్స్ దండిగా ఇచ్చే డీమార్ట్ లాంటి వాటిల్లో షాపింగ్ చేస్తే మనీ అదా అవుతుంది
ఏదైనా వస్తువు కొనే ముందు ఇంట్లో ఉన్నవి రీసైకిల్ చేయవచ్చేమో చూడండి.
ఇంట్లో స్టిచ్చింగ్ మెషిన్ ఉండడం ఎంతో మంచిది
ఇల్లాలు బేసిక్ టైలరింగ్ నేర్చుకుంటే బట్టల కుట్టు కూలీల ఖర్చు కలిసివస్తుంది
హోమ్అ ప్లయన్సెస్ కొనేటప్పుడు బ్రాండెడ్వే కొనండి - రిపేర్ కాస్ట్ తగ్గుతుంది.
బయట గిఫ్ట్స్ కొనకుండా వీలున్నంత వరకూ గిఫ్ట్స్ ఇంట్లో తయారు చేయవచ్చేమో చూడండి
చిన్నచిన్న నీటి బిందువులు కలిసి ఒక పెద్ద సముద్రాన్ని తయారుచేస్తాయి
మీరు కొద్ది సమయంలో చిన్న మొత్తంతో మొదలుపెట్టి దీర్ఘకాలంలో ఒక పెద్ద మొత్తాన్ని ఆదా చేయవచ్చు.
మీ ఆదాయాన్ని, మీ ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించే వారు బాగా పొదుపు చేయగలరు.
మీరు నెలకు ఎంత సంపాదిస్తున్నారు అనేది ముఖ్య విషయం కాదు - ఎక్కువ ఇబ్బంది పడకుండా ఎంతవరకు ఆదా చేస్తున్నారనేదే లెక్క.
ఖర్చు ఎదైనాసరే ముందుగా ఒక చక్కటి బడ్జెట్ తయారుచేసుకుని, ఖర్చుల ప్రణాళిక వేసుకుని, ఒక నోట్ బుక్ ని ఏర్పాటుచేసుకోవాలి
రాబడి పోబడి కి సంబంధించి ఒక యాప్ ని మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుంటే, అది మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది.
సాధారణంగా చిన్నచిన్న ఖర్చులను లేక్కలో చేర్చుకోకుండా అశ్రద్ధ చేస్తుంటాము
చివరకు ఆ చిన్నవే కొండంతలుగా మారి కొంతకాలానికి పెద్ద మొత్తం అయి తీవ్ర ఇబ్బంది పెడతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి