మొత్తం పేజీ వీక్షణలు

7, జూన్ 2022, మంగళవారం

క్షయము వృద్ధి లేని చంద్రుండు రాముండు.. telugu padhyam with meaning

క్షయము వృద్ధి లేని చంద్రుండు రాముండు..

క్షమను నతని కెవడు సాటి లేడు..

క్షత్రియులకు నతని చరిత మాదర్శమ్ము..

క్షరము గాదు రామచంద్రు నమ్ము..

పట్టాభిషిక్తుడైన శ్రీ రామ చంద్రుని చూసి ఇన్నాళ్ళ ఇన్నేళ్ళ తమ నిరీక్షణ ఫలించిందని సంతోషించిన పౌరులు తమలో తా మిలా ముచ్చటించుకున్నారు..

     "క్షయ వృద్ధులు లేకుండా వుండే చంద్రుడు రాముడు.. అంటే ఎటువంటి సంఘటన ఎదురైనా పొంగడం కుంగడం అనేది వుండని వాడు.. క్షమలో అంటే సహనంలో నతని కెవడూ సాటి లేడు.. క్షత్రియులకు నతని చరిత్రమే ఆదర్శము.. అమ్ము అంటే బాణం. రామ బాణానికి తిరుగు లేదు. అది క్షరము (నశించేది) గాదు."


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి