కాకి యెన్నడైన "కావు కా" వనవలె..
కోకిలమ్మ మురిసి కూయగవలె..
తల్లి వోలె నితర తరుణులన్ గనవలె..
కాకి కోకి లౌనె కనక.. రాజ!
సీతాపహరణానికి ప్రేరేపిస్తున్న రావణునికి హితవు చెబుతూ మారీచుడు నర్మగర్భంగా ఇలా మందలించినాడు.
"కాకి ఎన్నడైనా కావు.. కావు.. అనవలసియే వుంది. (అంటే నన్ను రక్షించు.. రక్షించు.. అనాల్సియే వుంది.) కాని కోకిల మాత్రం సంతోషంతో కూయవలసియే వుంది. పర స్త్రీలను తల్లి లాగా కనవలె. (చూడవలె.) కనకపోతే (చూడకపోతే) ఓ రాజా! కాకి లాంటి వాడు కోకిల లాంటి వాడు అవుతాడా! (మాతృవత్ పరదారాంశ్చ.. అనేది ప్రసిద్ధమే కదా!)
నీ వా విధంగా చూడడం లేదు. రాముని భార్య నపహరిస్తా నంటున్నావు. కాబట్టి కాకి లాంటి వాడివే! (అంటే కావు.. కావు.. అంటూ ఇకముందు ఆర్తనాదం చేయవలసిందే! ఎందుకంటే రాముని బలం నీకు తెలియదు. ఎవరూ నిన్ను రక్షించలేరు.) కాని కోకిలలాగా మురిసి, మురిపించా లనే భ్రమలో వుంటున్నావు. ఎక్కడైనా కాకి కోకిల అవుతుందా మహారాజా!"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి