మొత్తం పేజీ వీక్షణలు

29, జూన్ 2022, బుధవారం

"అందముఁ జూడఁ జెప్పఁ దర మా" యని మోహితు లౌచుఁ జూచి, "యీ

"అందముఁ జూడఁ జెప్పఁ దర

     మా" యని మోహితు లౌచుఁ జూచి, "యీ

చందముఁ జూడమే!" యని ప

     సందుగ నా కడఁ జేరి సోదరుల్

మందముగా సుఖింప రొకొ!

     మానసముల్ మురియంగ.. నూహ లూ

గం.. దములమ్ము నందలి సు

     గంధము మోయుచు గాలి వీయగా..


 శూర్పణఖ రామలక్ష్మణులను జూచి మోహంలో పడిపోయింది. ఒక సుందరి రూపం ధరించింది. తాంబూలం పుక్కిట పెట్టుకున్నది. సోదరులైన రామ లక్ష్మణు లిద్దరూ తనను చూడగానే మోహితులై పోతా రని తనతో సుఖిస్తా రని కల గంటున్నది..


అర్ఘ్య పాద్యము లివె యాప్తమిత్రా!" యంటి..

    "అర్ఘ్య పాద్యము లివె  యాప్తమిత్రా!" యంటి..

    "నమల జలము త్రావు" మంటిఁ గాని

     కామ దాహ భరము గల వాడు, నే నిచ్చు

     నీరు దప్పి దీర్చనేర దాయె

మారీచుడు సీతాపహరణానికై తన సహాయం కోరి వచ్చిన రావణునికి అర్ఘ్య పాద్యాదు లిచ్చి గౌరవించినాడు. మంచి నీ రిచ్చి త్రావు మన్నాడు. అతనిది కామదాహం. మామూలు దాహం కాదు కదా! అతనిది అభ్యర్థన లాగా కాకుండా శాసనంలాగా వుండడంవల్ల ఇలా అనుకున్నాడు.


27, జూన్ 2022, సోమవారం

మాతృ మూర్తి! సెలవు.. మమ్ము దీవించు, మా

మా తృ  మూర్తి! సెలవు..మమ్ము దీవించు, మా

తృ పితృ భక్తి గొప్పది యనరె!.. పి తృ

మూ ర్తి మాట పొల్లు పోయిన ధర్మ మూ

ర్తి నెటు లౌదు.. నంటదె యప కీ ర్తి!


శ్రీ రాముడు వనవాసానికి బయలుదేరబోతూ తల్లి వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు. 

"ఇంతవరకు ధర్మమూర్తి ననిపించుకున్నాను. నాన్నగారి మాట పొల్లుపోతే ధర్మమూర్తి నెలా ఔతాను. అపకీర్తి అంటదా! కాబట్టి వనవాసానికి బయలుదేరుతున్నాను. సెలవు.."



25, జూన్ 2022, శనివారం

how to save money....money saving tips & ideas in telugu


ఇంట్లో తక్షణం అవసరం లేని వస్తువులని కొనకూడదు.

ఏ వస్తువు కొన్న అలోచించి కొనాలి. 

పొదుపు మంత్రాన్ని రోజూ పఠిస్తుండాలి. 

అప్పు ఎప్పటికైనా ముప్పే అన్న సంగతి మరువరాదు 

ఏదైనా అవసరం పడి అప్పు చేస్తే మనకొచ్చే ఆదాయమంతా ఆ అప్పు తీర్చడానికే సరిపోతుంది

సేవ్ చేయడానికి ఇంకేమీ మిగలదు.

మీరు వారమంతా పక్కన పెట్టి మిగిల్చిన డబ్బులని వారాంతంలో తప్పనిసరిగా బ్యాంక్ లో వేసేయండి

సేవింగ్ ఎకౌంట్ లో నుండి అత్యవసరం అయితే తప్ప మనీ బయటకి తీయకూడదు అని ఒక నియమం పెట్టుకోండి.

కమోడిటీ యాప్స్ ని అన్ఇన్స్టాల్ చేసేయండి.

ఫోన్లో మొబైల్ డేటా వాడితే ఖర్చు ఎక్కువ - వేగం తక్కువ 

లోకల్లో  వైఫై ని వాడుకుంటే నెట్ బిల్ అదా అవుతుంది 

బయట తినడం చాలావరకు దుబారా కిందికే వస్తుంది 

బయట రేట్స్ ఎక్కువ - క్వాలిటీ తక్కువని మరువకండి 

ఇంటి భోజనమే తీసుకోండి ఆరోగ్యం + ఆదా

పనిమీద బయటకి వెళ్ళినప్పుడు వెంట వాటర్ బాటిల్  తీసుకు వెళ్ళండి 

బయట నీటిని కొనుక్కునే అలవాటు తగ్గించండి

ఇంట్లో మీకు అవసరం లేని వస్తువులని ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ లో అమ్మేయండి.

ఇంట్లో పాతబడిన వస్తువులని అటక మీద దాయకుండా తెలిసిన వారికి ఇచ్చేయండి 

షాపింగ్ వెళ్ళినప్పుడు ఇంట్లోనే ముందుగా మంచి ప్లాన్ తో లిస్ట్ రాసుకుని ఆ లిస్ట్ ప్రకారమే కొనండి.

కంపెనీ బోనస్ లాంటి డబ్బులని వెంటనే సేవింగ్ ఎకౌంట్ లో వేయండి.

వాషింగ్ మెషీన్ ఫుల్ లోడ్ వెయ్యటం లాంటివి తగ్గిస్తే పవర్ బిల్ అదా చేసినట్లే .

వారానికి ఒక రోజు "నో మనీ స్పెండింగ్ డే" అనే నియమాన్ని పెట్టుకుని ఆ రోజున ఎలాంటి ఖర్చూ పెట్టకండి.

చదువుకునే పుస్తకాలని లైబ్రరీల్లో అందుబాటులో ఉంటె తీసుకోండి

మరీ అవసరమైతే తప్ప షాపుల్లో బుక్స్ కొనకండి.

పాత పుస్తకాలని ఎప్పటికప్పుడు అమ్మేయండి 

మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సేవ్ చేయండి.

సేవింగ్ మనీని బంగారంపై, భూమిపై పెట్టుబడిగా పెట్టండి 

సేవింగ్ మనీని పిల్లల చదువులకోసం ఖర్చుపెట్టండి 

వారానికి సరిపాడా ప్లాన్ చేసుకుని ఆ ప్రకారం వస్తువులు తెచ్చుకుంటే మీకూ ఒక కరెక్ట్ ఐడియా ఉంటుంది, అనవసరమైన ఖర్చు తగ్గుతుంది 

పాడయిపోని వస్తువులని బల్క్ లో తెచ్చుకుంటే డబ్బులు కలిసి వస్తాయి.

ఆఫర్స్ దండిగా ఇచ్చే డీమార్ట్ లాంటి వాటిల్లో షాపింగ్ చేస్తే మనీ అదా అవుతుంది 

ఏదైనా వస్తువు కొనే ముందు ఇంట్లో ఉన్నవి రీసైకిల్ చేయవచ్చేమో చూడండి.

ఇంట్లో స్టిచ్చింగ్ మెషిన్ ఉండడం ఎంతో మంచిది 

ఇల్లాలు బేసిక్ టైలరింగ్ నేర్చుకుంటే బట్టల కుట్టు కూలీల ఖర్చు కలిసివస్తుంది 

హోమ్అ ప్లయన్సెస్ కొనేటప్పుడు బ్రాండెడ్వే కొనండి - రిపేర్ కాస్ట్ తగ్గుతుంది.

బయట గిఫ్ట్స్ కొనకుండా వీలున్నంత వరకూ గిఫ్ట్స్ ఇంట్లో తయారు చేయవచ్చేమో చూడండి

చిన్నచిన్న నీటి బిందువులు కలిసి ఒక పెద్ద సముద్రాన్ని తయారుచేస్తాయి

మీరు కొద్ది సమయంలో చిన్న మొత్తంతో మొదలుపెట్టి దీర్ఘ‌కాలంలో ఒక పెద్ద మొత్తాన్ని ఆదా చేయ‌వ‌చ్చు. 

మీ ఆదాయాన్ని, మీ ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించే వారు బాగా పొదుపు చేయ‌గ‌ల‌రు. 

మీరు నెలకు ఎంత సంపాదిస్తున్నారు అనేది ముఖ్య విషయం కాదు - ఎక్కువ ఇబ్బంది పడకుండా ఎంతవరకు ఆదా చేస్తున్నారనేదే లెక్క. 

ఖర్చు ఎదైనాసరే ముందుగా  ఒక చక్కటి బడ్జెట్ తయారుచేసుకుని, ఖర్చుల ప్రణాళిక వేసుకుని, ఒక నోట్ బుక్ ని ఏర్పాటుచేసుకోవాలి

రాబడి పోబడి కి సంబంధించి ఒక యాప్ ని మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుంటే, అది మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. 

సాధారణంగా చిన్నచిన్న ఖర్చులను లేక్కలో చేర్చుకోకుండా అశ్రద్ధ చేస్తుంటాము 

చివరకు ఆ చిన్నవే కొండంతలుగా మారి కొంతకాలానికి పెద్ద మొత్తం అయి తీవ్ర ఇబ్బంది పెడతాయి. 



2022 calendar festivals | December month 2022 yea telugu calendar pancha...

24, జూన్ 2022, శుక్రవారం

ఆకారము శ్రీకారము ధీకారము మూడు గూడి త్రివృతృతమై

ఆకారము శ్రీకారము

ధీకారము మూడు గూడి త్రివృతృతమై 

పైకి కనిపించువాడవు 

ప్రాకటముగ నీవు వేంకటాచార్య వరా!


సాహిత్యము సౌహిత్యము

స్నేహంబును చెట్టబట్టి చెలువారును మీ

యూహలు వ్యూహములందున

గేహాధి పలాలు కోట కీర్తిదిలీలిపా!


అన్నయ్యా అని ప్రియమున 

సన్నుగనను బిల్చు నీదు పరిణత హృదికిన్‌ 

ఇన్నేండ్లకు ఒక తమ్ముం

డున్నాడని ఉల్ల మెంతో నుత్సాహించెన్‌


22, జూన్ 2022, బుధవారం

అమ్మ ఒడిలొ మనలనాటలాడించుచు

 అమ్మ ఒడిలొ 

           - మనలనాటలాడించుచు

మధుర పలుకులెన్నొ మనకునేర్పు

అమ్మ, నాన్న యనుచు ననుబంధ

                          - మును బెంచు

అక్షరాల నేర్పు ఆది గురువు

షడ్రుచులను గలుపు శాకమే ఉగాది పచ్చడి

 షడ్రుచులను గలుపు శాకమే

                             - "పచ్చడి"

తీపి,చేదు,పులుపు తినుము

                               - వగరు

నుప్పు కారములను ఉదకంబు

                              - తొగలిపి

ఆరగించవలయు నారురుచుల!

                ***


అధిక ధరలు నేడు నాకసంబు నుదాకె

 అధిక ధరలు నేడు నాకసంబు

                              - నుదాకె

పెట్రొ డిజీలు రేట్లు పెరిగిపాయె

బడుగు జీవి బతుకు భారమై

                           - పోయెను

వనితలార పెరిగె వంట గ్యాసు!


కష్ట సుఖములన్ని కలిసుండు జీవితం

 కష్ట సుఖములన్ని కలిసుండు

                             - జీవితం

పూల పాన్పుగాదు పుడమిపైన

సహన గుణముతోడ సాగాలి

                          - ముందుకు

ధైర్యశక్తి మనకు దారిజూపు!

                ***


varahi devi kavacham

ఆది వారాహీ కవచం

ఓం ఐం గ్లౌం అస్యశ్రీ వారాహీకవచమంత్రస్య త్రిలోచనఋషి ।

ఓం ఐం గ్లౌం అనుష్టుప్ఛన్ద ।

ఓం ఐం గ్లౌం శ్రీ ఆది వారాహీ దేవతా ।

ఓం ఐం గ్లౌం బీజం ।

ఓం ఐం గ్లౌం స్వాహా శక్తిః ।

ఓం ఐం గ్లౌం ఐం కీలకం ।

అభీష్టసిధ్యర్థే జపే వినియోగం ।

ధ్యత్వేంద్రనీలవర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనామ్‌

విధివిష్ణుసురేంద్రాది మాతృభైరవ సేవితామ్‌ ॥1॥

హారనూపుర కేయూర వలయేరుపశోభితామ్‌

జ్వలన్మణిగణ ప్రోతముకుటోజ్జ్వల సోభితామ్‌ ॥2॥

శస్త్రాణ్యస్త్రాణి సర్వాణి స్వకార్యాకరణాని చ 

కరైః సమస్తైర్వివిధైర్బిభ్రతీ ముశలం హలమ్‌ ॥3॥

వారాహీదేవి కవచం భుక్తిముక్తి ఫలప్రదమ్‌

పఠేత్రిసంధ్యం రక్షార్థం రోగశత్రనికృంతయే ॥4॥

మేఘశ్యామరుచిం మనోహరకుచాం నేత్రత్రయోద్భాసితామ్‌

కోలాస్యాం శశిశేఖరామచలితైః దంష్ట్రాతలైః శోభితామ్‌

బిభ్రాణాం స్వకరాంబుజైరసిలతాం చర్మాసిపాశం మణిమ్‌

వారాహీమనుచింతయే ను వవరారూఢాం శుభాలంకృతిమ్‌ ॥5॥

ఓం వర్తాలీ మే శిరః పాతు వారాహీ ఫాలముత్తమమ్‌

నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంధినీ ॥6॥

రుంధినీ నాసికా పాతు ముఖం పాతు చ జంభినీ

పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంఠమాదరాత్‌ ॥7॥

స్కంధౌ తు పంచమీ పాతు భృవౌ మహిషవాహినీ

సింహారూఢా కరౌ పాతు కుక్షౌ కృష్ణముఖీ సదా ॥8॥

హలాయుధం చ వక్షశ్చ మధ్యమే ముశలీ మమ

నాభిం తు శంఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణీ ॥9॥

ఖడ్గినీ పాతు కట్యాం తు మేఢ్యోః పాతు ఖేటకీ

గుదం చ క్రోడినీ పాతు జఘనం స్తంభినీ తథా ॥10॥

చండోచ్చండాచ ఊరూచ జానునీ శత్రుమర్దినీ

జంఘాద్వయం చాముండా గుల్ఫయోద్వయోః ॥11॥

పాదౌ తదాంగులీశ్చైవ పాతు చోన్మత్త భైరవీ

సర్వాంగం సతతం పాతు కాలసందీపనీ మమ ॥12॥

వారాహీకవచం దివ్యం సర్వసిద్ధిప్రదాయకమ్‌

సర్వశత్రుక్షయకరం సర్వకార్యకరం శుభమ్‌ ॥13॥


Vaaraahi Astothara Shatha Naamaavali in telugu

వారాహీ అష్టోత్తర శత నామావళి

1. ఓం శ్రీం శ్రీమాత్రే నమః

2. ఓం శ్రీం శ్రీమహాదేవ్యై నమః

3. ఓం శ్రీం శ్రీమద్బింద్వాసన స్థితాయై నమః

4. ఓం శ్రీం శ్రీకర్యై నమః

5. ఓం శ్రీం శ్రీప్రదాయై నమః

6. ఓం శ్రీం శ్రీశాయై నమః

7. ఓం శ్రీం శ్రీమన్మంగళవిగ్రహాయై నమః

8. ఓం శ్రీం క్రోడాస్యాయై నమః

9. ఓం శ్రీం కిరిచక్రస్థాయై నమః 

10. ఓం శ్రీం క్రోధిన్యై నమః

11. ఓం శ్రీం క్రూరమర్దిన్యై నమః

12. ఓం శ్రీం క్రోధినిస్తంభినీ సేవ్యాయై నమః 

13. ఓం శ్రీం జితక్రోధాయై నమః

14. ఓం శ్రీం జయాన్వితాయై నమః

15. ఓం శ్రీం కిరిచక్రరథారూఢాయై నమః

16. ఓం శ్రీం కిరివదనాయై నమః

17. ఓం శ్రీం కిరీటిన్యై నమః

18. ఓం శ్రీం క్రియాశక్తి స్వరూపాయై నమః

19. ఓం శ్రీం క్రియానుగఫలప్రదాయై నమః

20. ఓం శ్రీం దణ్ణనాథాయై నమః

21. ఓం శ్రీం దయామూర్యై నమః

22. ఓం శ్రీం దయాపూర్ణదృగంబుజాయై నమః

23. ఓం శ్రీం దడ్డిన్యై నమః

24. ఓం శ్రీం దగ్ధహసాయై నమః

25. ఓం శ్రీం దమన్యై నమః 

26. ఓం శ్రీం దరహాసిన్యై నమః

27. ఓం శ్రీం పంచపర్వరథారూఢాయై నమః

28. ఓం శ్రీం పంచార్చాపరితోషితాయై నమః 

29. ఓం శ్రీం పంచావరణయంత్రార్చ్యాయై నమః 

30. ఓం శ్రీం పంచభూతానుపాలిన్యై నమః 

31. ఓం శ్రీం జృంభిణ్యాదిభిరా సేవ్యాయై నమః

32. ఓం శ్రీం అంధిన్యాధ్యర్చితాంఘికాయై నమః

33. ఓం శ్రీం బ్రాహ్మ్యది మాతృకా సేవ్యాయై నమః

34. ఓం శ్రీం బ్రహ్మజ్ఞాన ప్రదాయై నమః 

35. ఓం శ్రీం శివాయై నమః

36. ఓం శ్రీం శక్తిషోడశిసంసేవ్యాయై నమః

37. ఓం శ్రీం శక్తిదాయై నమః

38. ఓం శ్రీం శక్తి రూపిణ్యై నమః

39. ఓం శ్రీం శాకార్చితాయై నమః

40. ఓం శ్రీం శాక్తసేవ్యాయై నమః

41. ఓం శ్రీం శాక్తతంత్ర ప్రకీర్తితాయై నమః

42. ఓం శ్రీం ధాతునాథార్చితాయై నమః 

43. ఓం శ్రీం ధాత్ర్యై నమః

44. ఓం శ్రీం ధారిణ్యై నమః 

45. ఓం శ్రీం శత్రుదారిణ్యై నమః

46. ఓం శ్రీం ఇంద్రార్చితాయై నమః

47. ఓం శ్రీం ఇంద్రశక్యై నమః

48. ఓం శ్రీం ఇరంమదసమప్రభాయై నమః

49. ఓం శ్రీం అప్సరార్చితపాదశ్రియై నమః

50. ఓం శ్రీం అరివీరభయంకర్యై నమః

51. ఓం శ్రీం దిక్పాలకార్చితాయై నమః

52. ఓం శ్రీం దివ్యాయై నమః

53. ఓం శ్రీం దిగ్దంతావళ సేవితాయై నమః

54. ఓం శ్రీం చడోచ్చణార్చితాయై నమః

55. ఓం శ్రీం చణ్యై నమః

56. ఓం శ్రీం చండవిక్రమశోభితాయై నమః

57. ఓం శ్రీం వార్తాళ్యాదిభిరా సేవ్యాయై నమః

58. ఓం శ్రీం దశభైరవసంత్రితాయై నమః

59. ఓం శ్రీం కరాళదంష్ట్రాయై నమః

60. ఓం శ్రీం కౌళిన్యై నమః

61. ఓం శ్రీం కాసూర్చితపాదుకాయై నమః 

62. ఓం శ్రీం ఘోరరూపాయై నమః

63. ఓం శ్రీం ఘోరదంష్ట్రాయై నమః

64. ఓం శ్రీం దంష్ణోద్ధృతవసుంధరాయై నమః 

65. ఓం శ్రీం బిల్వార్చనప్రియాయై నమః 

66. ఓం శ్రీం భీమాయై నమః 

67. ఓం శ్రీం భైరవీగణ సేవితాయై నమః 

68. ఓం శ్రీం కరవీరార్చితాయై నమః 

69. ఓం శ్రీం కాళ్యై నమః

70. ఓం శ్రీం కరాళవదనోద్దతాయై నమః

71. ఓం శ్రీం తార్క్యారూఢాయై నమః

72. ఓం శ్రీం హయారూఢాయై నమః

73. ఓం శ్రీం సింహారూఢాయై నమః

74. ఓం శ్రీం అతిభీషణాయై నమః

75. ఓం శ్రీం బృహత్కిరాతరూపాథ్యాయై నమః

76. ఓం శ్రీం స్వప్నాభీష్టవరప్రదాయై నమః

77. ఓం శ్రీం ఉగ్రదంష్ట్రాయై నమః

78. ఓం శ్రీం ఉగ్రరూపాయై నమః

79. ఓం శ్రీం ఉగ్రాపద్వినివారిణ్యై నమః

80. ఓం శ్రీం అరుణారుణనేత్రాయై నమః

81. ఓం శ్రీం అణిమాద్యష్టసిద్ధిదాయై నమః

82. ఓం శ్రీం హలాయుధధరాయై నమః

83. ఓం శ్రీం దేవ్యై నమః

84. ఓం శ్రీం హర్ష నిర్భరమానసాయై నమః

85. ఓం శ్రీం మోదిన్యై నమః

86. ఓం శ్రీం మదనాశిన్యై నమః

87. ఓం శ్రీం శంఖచక్రధరాయై నమః

88. ఓం శ్రీం ధీరాయై నమః

89. ఓం శ్రీం శత్రుమర్దనపజ్జితాయై నమః

90. ఓం శ్రీం భక్తప్రియాయై నమః

91. ఓం శ్రీం భక్తిగమ్యాయై నమః

92. ఓం శ్రీం భక్తావనపరాయణాయై నమః

93. ఓం శ్రీం నిష్క్రియాయై నమః

94. ఓం శ్రీం నిర్మమాయై నమః

95. ఓం శ్రీం నిత్యాయై నమః

96. ఓం శ్రీం నిసై గుణ్యాయై నమః

97. ఓం శ్రీం నిరీశ్వరాయై నమః

98. ఓం శ్రీం మహెజ్జ్వలాయై నమః

99. ఓం శ్రీం మహాదేవ్యై నమః

100. ఓం శ్రీం మహావీర్యాయై నమః

101. ఓం శ్రీం మహాబలాయై నమః

102. ఓం శ్రీం విశుక్రప్రాణహత్యై నమః

103. ఓం శ్రీం విషంగవధతోషితాయై నమః

104. ఓం శ్రీం భండ పుత్రవధోద్యుక్త బాలావిక్రమనందితాయై నమః

105. ఓం శ్రీం భవసాగరనిర్మగ్నసముద్ధరణపణితాయై నమః

106. ఓం శ్రీం శ్రీపాదుకార్చితపదాయై నమః

107. ఓం శ్రీం జీవన్ముక్తి ప్రదాయిన్యై నమః

108. ఓం శ్రీవారాహీ పరాంబికాయై నమః



పితృ దేవతల - తర్పణ విధులు

 పితృ దేవతల - తర్పణ విధులు 

***********************************

హిందువులకు పండుగలు, పర్వాలని అనబడే రెండు ప్రత్యేక దినాలున్నాయి

పండుగలనాడు మన మా యా దేవతలను పూజిస్తుంటాం 

పర్వాలనాడు పితృదేవతల నారాధిస్తారు 

దేవతల వల్ల మనకు ధన ధాన్య సమృద్ధి కలుగుతాయి 

పితృదేవతల వల్ల వంశాభివృద్ధి వంశోన్నతి కలుగుతుంది.  

దేవతలతో పాటు పితృదేవతలను గూడ విధిగా ఆరాధిస్తుంటారు 

పితృదేవతలకు అంగరంగ భోగాలక్కరలేదు. 

పితృదేవతలు జల తర్పాణాలతోనే తృప్తిపడగలరు. 

దేవతా కార్యాలలో భక్తి ముఖ్యమైనది 

భక్తిలో ఏదైనా లోపమైతే దేవతలు క్షమిస్తారు. 

పితృకార్యాలలో శ్రద్ధ మాత్రం ఎంతో ముఖ్యం. 

శ్రద్ధలో మాత్రం ఏ లోపం జరిగినా పితృ దేవతలు సహించరు. 

పితృకార్యాలు శ్రద్ధాపూర్వకంగా ఆచరించదగినవి కాబట్టి వానికి శ్రాద్ధమని పేరు. 

ఈ శ్రాద్ధానికి బ్రాహ్మణాగమం సమయమని చెబుతారు 

బ్రాహ్మణుడు లేకుంటే మాత్రం ఏ మాత్రం సాగదు. 

ఆనాడతని పాదార్చనం చేసి మనం పితృల పేర నలుగురికి భోజనం పెట్టవలసి ఉంటుంది.

మనవారు పనసకాయ దొరికినపుడే శ్రాద్ధం పెట్టు అంటారు 

పనసకాయ దొరకని పక్షంలో అరటితో పని దాటించవచ్చు

మరణించిన వారిని గురించి చేసే ఈ  కర్మల ఫలితం ఆ జీవుని కందుతుందా! 

ఇదంతా భ్రమ అనే వాదం ఉంది. 

ఒక సత్కర్మ ఏ రూపంలో చేసినా మంచిదే

తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలం కుమారులకు సంక్రమించినట్లు కుమారులు తమ పితృలనుద్దేశించి చేసే కర్మల ఫలితం తప్పక వారి కందుతుంది అనే దానికి మనకు మహాభారతంలో జరత్కారుని వృత్తాంతం, పాండురాజు కథ నిదర్శనంగా ఉన్నవి. 


20, జూన్ 2022, సోమవారం

స్త్రీలు ధరించే వివిధ ఆభరణములు - వాటి విశిష్టతలు

 స్త్రీలు ధరించే వివిధ ఆభరణములు - వాటి విశిష్టతలు 


మన పూర్వీకులు వారు వదిన ఆభరణా లందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో ముఖ్యమనే తలచారు. 

పురాణాల్లో మణిమహత్వాలకు సంబంధించిన కథలు ఎన్నో ఉన్నాయి 

వారికి మణిమంత్రౌషధాలారోగ్యదాయకాలు. 

నాడు ఆరోగ్యసాధనాల్లో మణులదే మొదటిస్థానంగా ఉండేది . 

మణులు ధరించటంవల్ల వ్యాధులు గూడా శమిస్తాయి. 


మణిధారణం వ్యక్తికి నక్షత్రాన్ని మరియు రాశినిబట్టి ఉంటుంది. 

బంగారంవిషయంలో స్త్రీలది సహజంగా ఉష్ణతత్వం గాబట్టి వారిలోని నిసర్గ మైన ఉష్ణాన్ని క్రమబద్ధం చేసేందు కుష్ణవాహక మైన స్వర్ణధారణ ఒప్పింది 

ఆరోగ్యాని కవసరమైన రత్నస్వర్ణాలు రెండూ కలసి హిందువుల్లో భూషణకల్పనకు దారితీశాయి.

భారతస్త్రీకి ఆభరణదీక్ష వివాహకాలంలో విధింపబడుతుంది. 

అగ్రవర్ణుల్లో తలంబ్రాల పిమ్మట స్థాలీపాకం, ప్రధానం, సదస్యం, నాకబలి అనేవరుసలో వివాహక్రియలు జరుగుతాయి. 

స్థాలీపాకంలో వధూవరులకు గృహస్థదీక్ష యివ్వబడుతుంది. 

సదస్యంలో సభాపూజ ఉంటుంది. గృహస్థదీక్షను పొందినవధూవరులు అలంకారయుక్తులై సభ నర్చింపవలసి ఉంటుంది. 

దానికి పూర్వరంగంగా వివాహవిధుల్లో ప్రధానం జరుపుతారు. 

ప్రధానమనేది వధువుకి భూషణారోపణక్రియ లాంటిది .

ప్రధానంలో వధువుకి అత్తవారు కొనితెచ్చిన నగలన్నీ అలంకరిస్తారు. 

అది ఒకరకంగా సువాసినీదీక్ష. 

సువాసిని యెల్లపుడు నగలు అలంకరించుకోవలసినట్లు, అది ఆమె భర్తకు క్షేమదాయక మైనట్లు, మనకు సుగాత్రి కథ చెబుతుంది. 

ప్రతిక్షేమానికి ప్రధానకారణం కనుక భూషణారోపణక్రియను వివాహంలో ‘‘ప్రధాన’’ మని పిలిచారు. 

శూద్రుల్లో ప్రధానం జరిగేంతవరకు వధువును తలంబ్రాలకే పంపరు.


ఆదిలో కేవలం స్త్రీలేగాదు పురుషులుగూడా నగలు ధరించేవారు. 

గోపాలచూడామణి నాసాగ్రంలో నవమౌక్తితం ధరించాడు. 

అతడు కేళిచలన్మణికుండలుడు. 

యజ్ఞశ్రీశాతకర్ణికి లలాటపట్టిక, తిక్కనగారి కీచకునికి మెట్టెలు ఉండేవి. 

పురాకాలంలో కంకణాలు, కుండలాలు, హారాలు కటిసూత్రాలు, స్త్రీపురుషులిద్దరికీ సమానంగా ఉండేవి 


పూర్వం ధనవంతులు తమజడను బంగారంతో చేయించుకొనేవారు. దాన్ని పడగలు విచ్చుకొన్న పెద్దనాగరాని కిరవయ్యేడుసైజువారీ అర్థచంద్రాకారపు పాళెలు గ్రుచ్చి తయారుచేసేవారు. 

దానిచివర ఓగంటల గుత్తి ఉండేది. దానిలో ఓ పెద్దగంటనుండి చిన్నచిన్నవి తొమ్మిదిగంటలు గుత్తిగా వ్రేలాడుతూ ఉండేవి.

ఈ జడలో ఉండే తొమ్మిదిగంటలు నవగ్రహాలు. 

వాని మేరువుగంట బ్రహ్మాండకర్పరం. 

ఇరవయ్యేడు అర్ధచంద్రాకారపుపాళెలు అశ్విన్యాది నక్షత్రాలు, అన్నిటికి పైనుండే నాగరం ఈసృష్టినంతా భరించే శేషుడు. 

ఆ జడను విశ్వకర్మ తన సృష్టికి సంకేతంగా రూపొందించినట్లు భామాకలాపంవల్ల తెలుస్తుంది.

కలాపమంటే శిరోభూషణం. 

ఇది స్త్రీల వేణీప్రదర్శనంతో ఆరంభ మౌతుంది కాబట్టి దీన్ని ‘‘భామాకలాప’’ మని పిలిచారు. 

దేశీసాహిత్యంలో కలాపాలు తెలుగువారి సొంత ఆస్తి.


జడపిమ్మట శిరోభూషణాల్లో చెప్పదగినవి పింపిణీ కేతకి ` రాగిడీ చంద్రవంకలు లేదా నాగరం. 

వీటిని పాపిట చివరనుండి నడినెత్తిపై వరకు వరుసగా గ్రుచ్చుకొంటారు.

పాపిడికి సీమంతమని పేరు. 

అది నడినెత్తిపైనుండి కపాలంవరకు వెళ్ళుతుంది. 

దానిచివరలో కొన్ని వెంట్రుకలు పట్టి, సన్నని జడ అల్లి , వాటికి పింపిణీ మొదలైనవి గ్రుచ్చుకొంటారు.

యోగశాస్త్రప్రకారం మన కపాలంలో సహస్రారచక్రం, 

దానిలో సూర్యచంద్రులున్నారు. 

ఆ చక్రాన్ని- మూలాధారంనుండి మొదలైన సుషుమ్నానాడి వెన్నుపాము క్రిందినుండివెళ్లి కలుసుకొంటుంది. 

దానికి ఇడా - పింగళానాడులు రెండు వైపులనుండి సర్పాలక్రమంలో పెనవైచుకొని ఉంటాయి.

మూలాధారంలో కుండలినీశక్తి నిద్రించి ఉంటుంది. 

యోగులు దాన్ని తమ సాధనద్వారా మేలుకొలుపుతారు. 

అప్పుడది సుషుమ్నానాడిద్వారా పయనించి సహస్రారాన్ని చేరుతుంది. 

అక్కడుండే చంద్రబింబంనుండి యోగిశరీరంలోకి అమృతవర్షం కురియ నారంభిస్తుంది. 

దానితో అతడజరామరుడౌతాడు. 


పింపిణి అంటే వేణిక. 

ఈ వేణిక ఇడా ` పింగళా - సుషుమ్నలకు చిహ్నం.

అందుకే దీన్ని త్రిముఖాకృతిగా చేస్తారు. 

పింపిణి పిమ్మట కేదకి ఉంటుంది. 

అది కేతకి రూపాంతరం. 

దానికి మొగిలిరేకని మరోపేరు. 

రాంబస్‌ ఆకారంలో ఉండే ఈ నగ కుండలినీనాడుల్ని సహస్రారానికి కలిపే సంధానదళానికి చిహ్నం. 

దీని వెనుక దాగిడీ చంద్రవంకలుంటాయి. 

అవి సూర్యచంద్రమండలాలకు ప్రతీకలు. 

తలలో ఇంచుమించు అదేస్థానంలో ఆ మండలాలుంటాయి.

రాగిడీచంద్రవంకల స్థానంలో పూర్వం కొందరు నాగరం వేసేవారు. అది చుట్టలు చుట్టుకొన్న సర్పాకారభూషణం. 

రాగిడీస్థానంలో ధరింపబడే ఈ భూషణం కుండలిని సహస్రారానికి చేర్చవలసినవిషయాన్ని తెలుపు తుంది.


నెత్తి తరువాత ఎక్కువ భూషణాలు చెవులకు ధరించేవారు. పంచీకరణంలో శ్రోత్రం ఆకాశతత్వం, కర్ణాభరణాల్లో ముత్యాలో మణులో ఉపయోగించనివంటూ ఉండవు. 

ముత్యాలను మణులను చుక్కలతో పోలుస్తారు. 

చెపుల సామాను నక్షత్రాలకు సంకేతంగా ఏర్పడిరదని చెప్పవలసి ఉంటుంది.

కర్ణాభరణాల్లో ముఖ్యమైనవి తాటంకాలు. 

అవి సూర్యచంద్రబింబాలకు చిహ్నాలు. 

పురుషులు చెవులకు నవగ్రహకర్ణ వేష్టనాలు ధరించేవారు. నిగమశర్మ, బావగారికవి ఉండేవి. 

చెవులను గుఱించి పూర్వులకు ఆకాశతత్వ భావన లేకుంటే కర్ణవేష్టనాలకు నవగ్రహాలపేర నామకరణం చేయవలసిన అవసరం కనిపించదు.


పూర్వం నాసాభరణం లేని పుణ్యస్త్రీ ఉండేదికాదు. 

మన ముక్కులోని ఎడమశ్వాసకు చంద్రస్వరమనీ, కుడిశ్వాసకు సూర్యస్వరమనీ పేర్లు. 

ఎడమముక్కుకి అర్ధచంద్రాకారమైన బేసరి, కుడిముక్కుకి మండలాకారమైన వొంటిరాయిపుడక విధించారు. 

మన శ్వాసకు ‘‘హంస’’ అని మరోపేరు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముక్కుకి ‘‘హంసనత్తు’’ రూపొందించారు.

ముత్తయిదువు ముక్కుకి ముత్యాన్ని తప్పక ధరించాలని పూర్వుల మతం. 

శంకరాచార్యులు శ్రీదేవి తన ముక్కుకి ముత్యాన్ని ధరించి ఉన్నట్లు వర్ణించాడు. 

స్త్రీ శ్వాస దుష్టమయిందనీ, అది పురుషులపై పొలయరాదనీ పూర్వుల నమ్మకం. 

వాయుశుద్ధిద్రవ్యమైన ముత్యాన్ని ముంగరకు విధించి వారిశ్వాసకు శుద్ధిమత్తను కల్పించారు.

ముంగర ముక్కుకి ధరించినా దాని శోభ మాత్రం అధరబింబానికే చెందుతుంది. 


కర్ణాభరణాల్లో మరో ముఖ్య భూషణం కుండలాలు. 

శ్రీమహావిష్ణువు మకరకుండలమండితుడు. 

ఈ కుండలాలుగూడ మనకు శ్రవోతత్వాన్ని నిరూపిస్తాయి.

ఆకాశంలో సమస్త గ్రహనక్షత్రాల్ని గర్భీకరించుకొన్న శింశుమార చక్రం దక్షిణావర్తమైన మకరాకారంలో తలక్రిందుగా వ్రేలుతూ, పుచ్ఛబలంపై నిలిచి, ధ్రువునిచుట్టు తాను తిరుగుతూ కాలచక్రాన్ని నడుపుతుంది. 

ఆకాశతత్వమైన చెవులకు` వ్రేలాడే కుండలాలకు` పూర్వు లావర్తమైన మకరాకారాన్ని రూపొందించారు.


వాగింద్రియమైన వదనానికి జలాధిపతిjైున వరుణుడధిదేవత. 

ముత్యాలు రత్నాలు నిజాని కతనిసొమ్మే కాబట్టి రదనచ్ఛదమైన అధరాలపై అధరచ్ఛదమైన ముంగరలోఉండే దానిమ్మ గింజల్లాంటి మణులు, మిలమిలలాడే ముత్యాలు, వరుణ దేవుని కెత్తిన మణినీరాజనంలా ముఖాని కెంతో నిండుదనాన్నిస్తాయి.


స్త్రీ కుండవలసిన భూషణాల్లో అతి ప్రధానమయింది మాంగల్యం. 

స్త్రీ ప్రకృతి స్వరూపిణిగాబట్టి ఆమె ఓ పురుషుని కంకితమైపోయి, మరోపురుషుని కనటంతోనే తనజీవితం చరితార్థమైనట్లు భావించటంలో వింతలేదు.

భారతీయ దాంపత్యం ప్రకృతి పురుష సంయోగానికి ప్రతిరూపం. పురుషునికి కలుగవలసిన మాంగల్యపరంపర స్త్రీ హృదయమూలంగా కలుగవలసిఉంది. 

కల్యాణసమయంలో మాంగల్యధారణం స్త్రీకి ఆమెకు శరీరంలో ఏ హస్తాదులకోగాక హ ృదయ స్థానంలో విధించబడింది.

వివాహసమయంలో కన్యకు తల్లివారు, అత్తవారు ఇద్దరు చెరో మాంగల్యం చేయిస్తారు. 

వాని ఆకారాలు వేరు వేరుగా ఉంటాయి 

తల్లివారు గిన్నెపుస్తె- అత్తవారు ఆకుపుస్తె చేయిస్తారు. 

పుస్తెలు గౌరీ శంకరులకు ప్రతిరూపాలు. 

గౌరి మాంగల్య దేవత కాబట్టి ఆమె ముత్తయిదువులకు నిత్యపూజనీయ. 

ఆమె గిరిరాజపుత్రి కాబట్టి స్త్రీలామెను గౌరవర్ణంగల పసుపుతో గిరి ఆకారంగా చేసి పూజిస్తారు. 

వధువుకి తల్లివారు స్త్రీపక్షంవారు కాబట్టి వారు చేయించే పుస్తె గౌరీ ఆకారంలో ఉంటే అత్తగారు వరపక్షంవారు కాబట్టి వారు చేయించే ఆకుపుస్తె, పానవట్టంపై శివలింగం నిలిపినట్లు పురుషారంగా ఉంటుంది. 

కాబట్టి కన్యకు వధూపక్షంవారు చేయించేపుస్తె గౌరీ ఆకారంలోనూ, వరపక్షంవారు చేయించే పుస్తె శివాకారంలోనూ ఏర్పరచటం తత్వమెరిగి చేసిన నిర్ణయమనక తప్పదు. 

గౌరీశంకరుల ప్రతిరూపాలైన మాంగల్యద్వయం వధువుగళాన్ని అలంకరించి ఆమెకు మాంగల్యాన్ని ప్రసాదిస్తాయి.

పుణ్యస్త్రీకి ప్రతిదినం నిద్రలేవగానే తనపుస్తెలను కళ్ళకద్దుకోవలసిన నియమం ఉంది. 

ఆమె వాని నావిధంగా దర్శించటంలో నిద్రలేవగానే ఆదిదంపతులై న గౌరీశంకరులను దర్శించిన ఫలితం దక్కుతుంది. 

వివాహానంతరం కొందరీ మాంగల్యాలకు తాలిసామాను చేయించుకొంటారు. 

దానిలో ముప్పది మూడుజతల బిళ్ళలుంటాయి. 

వాని పై మత్స్య, కూర్మ వరాహాలు-స్వస్తిక, భేరీ మొదలైన మంగళచిహ్నాలు ముప్పదిమూడుకోట్ల దేవతలకు ప్రతీకలు. 

స్త్రీలు వాటిని మాంగల్యాని కిరువైపులా గ్రుచ్చుకొంటారు. 

వాటిని వారలా గ్రుచ్చుకోవటమంటే తమ రక్షణకు వా రాయా దేవతల నాశ్రయించి సేవించటమన్న మాట. 


ఆభరణాల్లో వజ్రాన్ని దేనిలో పొదిగినా పొదగకున్నా ఉంగరంలో పొదగటం పరిపాటి. 

పురుషుడు హిరణ్యగర్భుడుగాబట్టి మానవులు తమ ఊర్ధ్వకాయాన్ని హిరణ్యంతో అలంకరించుకోవలసినట్లు శాస్త్రం చెబుతుంది.

మన దేహమొక దేవాలయం. 

‘‘దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవో సనాతనః’’ అని శాస్త్రం చెబుతుంది. 

ఆదిశంకరులు నిర్వాణషట్కంలో ‘‘చిదానందరూపః శివోహం శివోహం’’ అని చెప్పినాడు 

శివుని జడముడికి సర్పం

స్త్రీలకు తలపై నాగరం

శివుని చెవులకు సర్పాలు

స్త్రీల చెవులకు సర్పిణీలు

శివుని మెడలో పన్నగహారం

 స్త్రీల మెడలో బన్న సరం (పన్నగసరం)

శివుని దండ చేతులకు సర్పాలు

స్త్రీల చేతికి నావంకు (నాగవంకు)


ఈ విధంగా శివుడేయే స్థానాల్లో సర్పాలు ధరించాడో మనస్త్రీల కాయా స్థానాల్లో ధరించే భూషణాలు సర్పవాచకాలలో రూపొందించి, ఈ జీవునియందలి శివత్వాన్ని విశ్వకర్మలు తమ శిల్పంలో నిలిపారు.


Polytechnic diploma exam paper | technical board III sem conventional pa...

19, జూన్ 2022, ఆదివారం

10th class telugu grammar notes - తెలుగు - నానార్థాలు

 10th class - తెలుగు - నానార్థాలు

************************


ఎలుగు = ఎలుగుబంటి. కంఠస్వరము

రేఖ = హస్తరేఖ, గీర 

జీవనము = బ్రతుకు, ప్రాణము

కనకము = బంగారము, ఉమ్మెత్త

సభ = కొలువుకూటము, పరిషత్తు

జాతి= జాజికాయ, కులము

స్కంధము = కొమ్మ, సముహము

చిత్తము = అట్లాగే, మనస్సు

శ్రీ = లక్ష్మి, సరస్వతి 

సంబురం = సంతోషం, ఆనందం

సాహిత్యము = కలయిక. వాజ్మయం

పణం = పందెం, కూలి, వెల, ధనం

భాష్పము = ఆవిరి, కన్నీరు, ఇనుము

గుణము = దారం, వింటినారి, దయ, విద్య

పేరు = నామ ధేయం,హారము

భీముడు = ధర్మరాజు, తమ్ముడు, భయంకరుడు, శివుడు

మృగములు = పశువులు, జింక

మబ్బు = మేషము, చీకటి

ఫలము = పండు, ప్రయోజనము

శిరస్సు = తల, కొండకోన

వంక = వాగు, కాలువ

కుంభము = ఏనుగు కుంభస్థలం. ఒక రాశి

వీడు = ఇతడు, పట్టణము, వదులుట

బంతి = కందుకము, పంక్తి

గురుడు = తండ్రి, ఉపాధ్యాయుడు

కరము = చేయి, తొండము

గృహము = ఇల్లు, భార్య

లక్ష్మి = శ్రీదేవి, కలువ, పసుపు

ముఖము = మొగము, మాట

ముని = మామిడి చెట్టు, ఋషి

వంశము = వెదురు, పిల్లనగ్రోవి

స్నేహము = చెలిమి, నూనె

అక్క = పెద్ద తోబుట్టువు, పూజ్యస్త్రీ

సత్యము = నిజము, కృతయుగము, ఒట్టు, ఒక లోహము

మహ = భూమి, శక్తి, మహిమ, ఉత్సవము

దాత్రి = నేల, తల్లి, ఉసిరిక, దాది.

పండితుడు = విద్వాంసుడు, బుద్ధిశాలి. వ్యాపారి

వారము = ఏడు రోజులకాలం, సమయము, మద్య పాత్రము, సముహము

కులము = జాలి, ఇల్లు, శరీరము, పిల్లి, దేశము

హరి = విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, గుఱ్ఱము, కోతి

క్షేత్రము = భార్య, పుణ్వస్తానము. శరీరము, మనస్సు

చిత్రము = చిత్తరువు, అద్భుత రసము. ఆశ్చర్యము

సిరి = సంపద, లక్ష్మి

రాజులు =  ప్రభువులు, క్షత్రియులు, ఇంద్రుడు, చంద్రుడు

తేజము =  ప్రకాశము, పరాక్రమము

ధర్మము:= పుణ్యము, ఎద్దు, నీతి. విల్లు, యజ్ఞము

గురువు = ఉపాధ్యాయుడు, తండ్రి. బృహస్పతి

అర్ధము = శబ్దార్థము, ధనము. కార్వము, యాచన

హేమము = బంగారం, ఉమ్మెత్త, గుఱ్ఱము. మంచు

కవి = కావ్యము రాసిన వాడు, శుక్రుడు . నీటి కాకి

యాది = జ్ఞాపకం, స్కృతి

మిత్రుడు = సూర్యుడు, స్నేహితుడు

వర్షం = వాన. సంవత్సరం

నేస్తం = మిత్రుడు, స్నేహితుడు

తోడు = సహాయం. ఒట్టు

సమయం = శపథం. కాలం

తాత = తండ్రి, తండ్రి లేక తల్లి తండ్రి, బ్రహ్మ

అయ్య = తండ్రి, పూజ్యుడు

సీమ = ఎల్ల, వరి మ

ఉదయం = ఉదయించడం, తూర్పుకొండ, పుట్టుక, సృష్టి

ఆశ = కోరిక. దిక్కు

అభ్రము = మబ్బు, ఆకాశం, బంగారము. కర్పూరం, స్వర్గము

కల్యా ణ = మంగళం, పెండ్లి

ధార=  నీటి చాలు. ప్రవాహము

శంఖము = సంకు, మహాపద్మమ నిధి

మాసము = నెల, త్రోవ 

నేల నింగియు నేకమై నెగడు తీరు

     నేల నింగియు నేకమై నెగడు తీరు

    నీరులను జిమ్ము బాణాలు నిండి గ్రాల

    నిప్పులను గక్కు బాణాల చొప్పు మీర

    రామ రావణ రణమున రాదు గాలి


రామ రావణ మహా సంగ్రామంలో గాలి కూడా చొరబడనంతగా నేలా నింగీ ఒక్క టయ్యేలా ఒకసారి నీళ్ళను చిమ్ముతూ మరోసారి నిప్పులను కక్కుతూ వున్నాయి బాణాలు. (వారుణాస్త్రం ఆగ్నేయాస్త్రం అభిమంత్రించి వదలటం పరిపాటి కదా!)


మౌలిక వర ధర్మ పాలా! విను మొక సూ

 మౌలిక వర ధర్మ పాలా! విను మొక సూ

  క్తి.. దశకంఠు డిటులఁ దీరిపోడు..

  కడుపులోని యమృత కలశమ్ము భేదించి,

  ముదము నిమ్మ లోకమునకు రామ!


రాముడు రావణునితో యుద్ధం చేస్తున్నాడు. ఖండితములైన రావణుని తలలు మళ్ళీ మొలుస్తున్నాయి. అలసిపోయినాడు. విభీషణు డిలా అన్నాడు.

    "రామా! అన్నిటికీ మూలమైన ఉత్తమ ధర్మాన్ని (యద్ధ ధర్మాన్ని కలుపుకొని) పాలించేవాడా! ఒక సూక్తి (మంచిమాట) చెబుతా.. విను. (వినాల్సిందే! తప్పదు.) దశకంఠు డీ విధంగా తీరిపోడు (చనిపోడు). అతని పొట్టలో అమృత కలశం వుంది. దాన్ని భేదించు. లోకానికి సంతోషం ప్రసాదించు."

   రాముడు యుద్ధ ధర్మం పాటించేవాడు కాబట్టి నేరుగా రావణుని పొట్టపై అస్త్ర ప్రయోగం చెయ్యడు. చేయకపోతే ఎంతసేపైనా యుద్ధం యిట్లాగే కొనసాగుంది. అన్నిటికీ మూలం, శ్రేష్ఠం ధర్మం కాబట్టి దాన్ని గెలిపించాలని.. "మౌలిక వర ధర్మ పాలా!" అని సంబోధించినాడు విభీషణుడు.


వశి.. వనధి దాటెఁ..బనిఁ జేసె..ఫల మడుగడు..

వశి.. వనధి దాటెఁ..బనిఁ జేసె..ఫల మడుగడు..

వైనతేయ నిభ వరిష్ఠుడైన హనుమ..

ఎవరు ద్రవిణమునం దాశ యెరుగ? రొకడు

దక్క..నాకలిం గమలాప్తు దాకు హనుమ..

ఆంజనేయుడు వశి. (ఇంద్రియాలను వశమునం దుంచుకున్నవాడు). వైనతేయుని (గరుత్మంతుని) వంటి వరిష్ఠుడు (శ్రేష్ఠుడు). అనంతమైన సముద్రాన్ని లంఘించగలిగినాడు. లంకలో ప్రవేశించ గలిగినాడు. జానకి జాడ కనుక్కో గలిగినాడు. తన ప్రతాపాన్ని చూపగలిగినాడు. తిరిగి రాగలిగినాడు. ఇవన్నీ ఎవ్వడూ చేయలేని పనులే! పైగా నిష్కామంగా చేశాడు. 

ద్రవిణము (ధనము)నం దాశ ఎవ రెరుగరు? ఆకలితో కమలాప్తుని (సూర్యుని) తాక బోయే హనుమ ఒక్కడు తప్ప.

బాల్యంలో సూర్యుని పం డనుకొని మింగ బోయాడు హనుమ.

(పదాలు అన్యార్థంలో ప్రయోగించ బడినవి.)

మోహనాంగుడైన పురుషోత్తముని రాము

మోహనాంగుడైన పురుషోత్తముని రాము

క్షణము సేపు సీత గాంచి మురిసె

మిగుల దొడ్డ ధనువు మేలుగా విరిగి ద

వ్వు దవులందు గుండె లదరినపుడు..

రాముడు శివ ధనుర్భంగం గావించినాడు. ధనువు విరిగినపుడు దవ్వు దవ్వులందు (దూర దూరములందు) నున్న వారి గుండెలు కూడ అదరిపోయినవి. అంతగా ప్రతిధ్వనించింది.

  అప్పుడు సీత రాము ణ్ణొక్క క్షణం చూసి మురిసిపోయినది. రాముడు మోహనాంగుడే గాక పురుషోత్తముడు కూడా అని ఆమె గ్రహించింది. ధనువు విరగడం మేలే అనుకున్నది. (తండ్రిగారి ఆశయమూ ఫలించింది గదా!) 


అందుకొం డవనిజ జాడ నరసి తగిన

అందుకొం డవనిజ జాడ నరసి తగిన

బహుమతిని, మీరు హాయిగాఁ బండబోకు

డంత దాకను.. వేగ రం.. డవనిజఁ గని

నతడె కపి సత్తముం డగు" ననిరి కపులు.

సీతాన్వేషణలో తలమునకలైన వానరులు పరస్పరం హెచ్చరించుకుంటూ ఇలా చెప్పుకొన్నారు.

   "సీత జాడ కనుక్కొని (సుగ్రీవునినుండి) తగిన బహుమానం పొందండి. అంతదాకా విశ్రాంతి తీసుకోరాదు. వేగ రండు. సీతను చూడగలిగిన వాడే వానరోత్తముడు.."

      (పదాలు అన్యార్థాలలో ప్రయుక్తములు.)

వినతిఁ జేతు రామ! వెరపించు మృత్యువు

వినతిఁ జేతు రామ! వెరపించు మృత్యువు

శ్లేషమందు నేను చేరకే వి

ష నిభ దైవ విరహమును బాపితి.. నిరీక్ష

ణ మిది సఫల మాయె విమల చరణ!

శబరి ఎంతోకాలం నిరీక్షించిన తదుపరి శ్రీ రాముని దర్శనం చేసుకోగలిగింది. అప్పు డామె రామునితో ఇలా అన్నది. 

   "నమస్కరిస్తున్నాను రామా! నీవు విమలమైన చరణములు గల వాడవు. మృత్యువు శ్లేషమందు (కౌగిలిలోకి) నేను చేరుకోకముందే విషము వంటి దైవ వియోగాన్ని తొలగించినావు. నా నిరీక్షణ సఫలమయింది. (దైవాన్ని ఎడబాసి వుండడ మంటే మృత్యువే!.. అని తాత్పర్యం.)


శంకర స ఖావతార! విశ్వ ప్రవీర!..

శంకర స ఖావతార! విశ్వ ప్రవీర!..

భోజనం బివ్వి నీకు నీ పూట తండ్రి!

రామచంద్ర! "ఎంగిలి పం డ్లి వేమి?" యనకు..

వాసి కెక్కిన రుచి యున్న పండ్లు సుమ్మి!

సీతారామ లక్ష్మణులు పంపాసరస్సు పశ్చిమ తీరంలోని శబరి ఆశ్రమానికి చేరుకున్నారు. గురుభక్తి, సేవాభావం, వ్రతాచరణ, ధర్మనిష్ఠ కల శబరి రామునికోసం పెద్దకాలం నిరీక్షించింది. రాగానే పూజించి ఎంతో భక్తితో మధురఫలాలు సమర్పించింది.


వశి.. వనధి దాటెఁ..బనిఁ జేసె..ఫల మడుగడు..

వశి.. వనధి దాటెఁ..బనిఁ జేసె..ఫల మడుగడు..

వైనతేయ నిభ వరిష్ఠుడైన హనుమ..

ఎవరు ద్రవిణమునం దాశ యెరుగ? రొకడు

దక్క..నాకలిం గమలాప్తు దాకు హనుమ..

ఆంజనేయుడు వశి. (ఇంద్రియాలను వశమునం దుంచుకున్నవాడు). వైనతేయుని (గరుత్మంతుని) వంటి వరిష్ఠుడు (శ్రేష్ఠుడు). అనంతమైన సముద్రాన్ని లంఘించగలిగినాడు. లంకలో ప్రవేశించ గలిగినాడు. జానకి జాడ కనుక్కో గలిగినాడు. తన ప్రతాపాన్ని చూపగలిగినాడు. తిరిగి రాగలిగినాడు. ఇవన్నీ ఎవ్వడూ చేయలేని పనులే! పైగా నిష్కామంగా చేశాడు. 

ద్రవిణము (ధనము)నం దాశ ఎవ రెరుగరు? ఆకలితో కమలాప్తుని (సూర్యుని) తాక బోయే హనుమ ఒక్కడు తప్ప.

బాల్యంలో సూర్యుని పం డనుకొని మింగ బోయాడు హనుమ.

   (పదాలు అన్యార్థంలో ప్రయోగించ బడినవి.)



18, జూన్ 2022, శనివారం

ధర్మమూర్తి వీవు తండ్రి! నన్ బ్రోవవా!

      ధర్మమూర్తి వీవు తండ్రి! నన్ బ్రోవవా!

      నిర్మలమతి వీవు.. నిన్నుఁ జేర

      వచ్చినాను రామ! భక్త రక్షణ చణా!

      నాదు జనము వీడినాను రోసి..


     త్యక్త్వా పుత్రాంశ్చ దారాంశ్చ రాఘవం శరణం గతః

     నివేదయత మాం క్షిప్రం రాఘవాయ మహాత్మనే

     సర్వలోక శరణ్యాయ  విభీషణ ముపస్థితమ్

          "భార్యాబిడ్డల్ని విడిచి రాముణ్ణి శరణు వేడుతున్నాను. సర్వలోక శరణ్యుడైన రామునికి విభీషణుడు అనే పేరుగల నేను వచ్చినట్లు చెప్పండి" అని చెప్పి పంపాడు విభీషణుడు.

    అతడు సోదరులను రోసి లంకను వీడి వచ్చి రాముని శరణువేడుతూ ఇలా అన్నాడు.

(భక్త రక్షణ చణా!= భక్త రక్షణలో నేర్పరీ!)



భావన శుద్ధమౌ శబరి పల్కెను "మద్గురు నాజ్ఞ నిన్ని నా....

     భావన శుద్ధమౌ శబరి

        పల్కెను "మద్గురు నాజ్ఞ నిన్ని నా

     ళ్ళీ వరుదెంతు వంచును ని

        రీక్షణ సల్పితిఁ.. బూజ లందుకో!

     పావన మాయె జీవనము

        భద్రద! రాఘవ! నీవు దక్క నే

     దేవుడు లేనె లే డని మ

        దిన్ కడు నమ్ముచు గొల్తు భక్తితోన్."


సీతారామ లక్ష్మణులు పంపా సరస్సు పశ్చిమ తీరంలోని శబరి ఆశ్రమానికి చేరుకున్నారు. సేవాభావం, వ్రతాచరణ, ధర్మనిష్ఠ కల శబరి రాముని పట్ల శరణాగతి భావంతో పెద్దకాలం నిరీక్షించింది. రాగానే పూజించింది. మధుర ఫలాలు సమర్పించింది. రాము డెంతో ప్రేమతో స్వీకరించాడు.

    "అద్య మే సఫలం జన్మ  స్వర్గశ్చైవ భవిష్యతి 

     త్వయి దేవవరే రామ!  పూజితే భరతర్షభ! 

         దేవ శ్రేష్ఠుడవైన నీవు పూజితుడ వౌటచే నా జన్మ సఫల మయింది. నాకు పరమపదం సిద్ధిస్తుంది.

    మా గురువులు మతంగ మహర్షి దివ్య లోకాలకు వెళుతూ రాముడు వస్తా డని, చూడగానే నీకు ముక్తి లభిస్తుం దని చెప్పారు."

    అని వనమంతా చూపించి గురువుగారి పావన జీవనాన్ని కొనియాడింది. ఆమె గురుసేవను మెచ్చుకొని రాముడు అర్చితోఽ హం త్వయా భక్త్యా గచ్ఛ కామం యథా సుఖమ్.. (నన్ను భక్తితో పూజించినావు. కోరిన పుణ్య లోకానికి సుఖంగా పొమ్ము.) అన్నాడు.

    శబరి రామునితో పలికిన పలుకు లివి...



palamuru labour troubles

 పాలమూరు కూలీల బతుకులు

పాలమూరు కూలీలు భారత దేశమంతా పేరు గాంచినారు. దేశంలో ఏ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టినా, కాలువలు త్రవ్వినా, కొండల్ని పిండిచేసి కోనల్ని నరికి రహదార్లు వేసినా అక్కడ పాలమూరు కూలీల చెమట బొట్లు పునాదిరాల్లుగా మారిపోకుండా ఉండవు.

ఈ జిల్లాలో ముఖ్యంగా కొల్లాపూర్‌, నాగర్‌ కర్నూల్‌, అచ్చంపేట, గద్వాల, వనపర్తి ఆత్మకూరు తాలూకాలలో నుండి లక్షల సంఖ్యల్లో దినసరి కూలీలు తను జానెడు పొట్ట నింపుకోవడం కోసం దేశంలోని అన్ని మిగతా రాష్ట్రాలకు వెళ్తుంటారు. అయితే అక్కడ వీళ్ళు తమ అమాయకత్వం వల్ల అనాదిగా విపరీతమైన శ్రమ దోపిడికి గురవుతున్నారు. కొంత డబ్బు వీళ్ళకు అడ్వాన్సుగా యిచ్చి వీళ్ళని దూర తీరాలకు కంట్రాక్టర్లు తమ వెంట తీసుకుని వెళ్తారు. అక్కడ వీళ్ళు నిర్భంధంగా వెట్టిచాకిరి చేయవలసి వస్తుంది. మూడు నెలల జీతం అడ్వాన్సుగా పొందిన వీళ్ళు మూడు సంవత్సరాలైనా కూలీ చేస్తూనే ఉంటారు. భార్యా పిల్లలకు దూరమై కొండలలో కోనలలో దిక్కూ దివాణం లేకుండా దారి తెన్నూ తెలియకుండా  మేస్త్రీలు చెప్పిందల్లా బానిసల్లా తలవంచి రెక్కలను ముక్కలను చేసుకోవడమే వీళ్ళ పని.

ఈ నిర్బంధ దాస్యాన్ని ఎంతో కష్టం మీద తప్పించుకొని బయటపడిన వాళ్ళూ ఊరూరా వీధి వీధినా బిచ్చమెత్తుకుంటూ రెండు మూడు సంవత్సరాలకు కానీ ఇల్లు చేరని వాళ్ళు కోకొల్లలు. దిక్కూ దివానం లేకుండి అక్కడే చచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలాగోలా తిరిగి వచ్చిన వాళ్ళలో ఎంతో మంది చావు తప్పి కన్నులొట్టపోయిన చందాన తయారవుతారు.

ఇన్ని ఘోరాలు జరుగుతున్నా వీళ్ళు ఇంకా ఎందుకు వెళ్తున్నారు? తింటనికి రొట్టె లేక కట్టడానికి బట్ట లేక తలదాచు కోవడానికి నీడలేక యిక్కడ కూడా వాళ్ళకు అంతకంటే మంచి బతుకులు లేక వెళ్తున్నారనే చెప్పుకోవాలి.

ఏళ్ల తరబడిగా వస్తున్న ఈ సమస్య గతంలో పాలమూరునుంచి ఢల్లీి పార్లమెంటు దాక వెళ్ళింది. అయినా సమస్య సమస్యగానే వుంది తప్ప పెద్దగా వారికి లాభించినట్టు లేదు. దీనికి పరిష్కార మార్గం ఏమిటి?

ఈ జిల్లాలో ఏ ఏ ప్రాంతాలనుంచి ఎక్కువగా యీ రకపు కూలీలు వెళ్తున్నారో ఆ ప్రాంతాలలోకి లేబర్‌ డిపార్టుమెంటు వాళ్ళు, స్వచ్ఛంద సేవా కార్యకర్తలు వెళ్ళి సమగ్ర సర్వే జరపాలి. వాళ్ళకందరికీ వెంటనే భూములు, ఇళ్ళు ఉచితంగా సమకూర్చి తగిన జీవనోపాధికై తక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. రాష్ట్ర నిర్మాణాల సంస్థ ద్వారా వీరికి తగినన్ని పనులు కల్పించాలి.

Polytechnic diploma exam question paper | diploma students semester test...

july telugu calendar | Hindu calendar | telugu panchangam july 2022 telu...

14, జూన్ 2022, మంగళవారం

పావనమైన నామ మని పండితు లెల్ల ప్రశంస సేయగా...

     పావనమైన నామ మని

         పండితు లెల్ల ప్రశంస సేయగా..

     భావనలో స్థిరం బయిన

         పావన జీవన మిచ్చి కావగా..

     పావని జీవన మ్మయిన

         భద్రద రాముడు దక్క వేరు నే

     దేవుడు లేనె లే డని మదిన్  కడు

         నమ్ముచు గొల్తు భక్తితోన్


రామనామం గనుక భావనలో స్థిరపడిందా పావనమైన జీవన మిస్తుంది. రక్షిస్తుంది. భద్రదుడు.. భద్రము లిచ్చేవాడు.. రాముడు.. పావని (ఆంజనేయస్వామి) సర్వజీవనమూ రాముడే.



అమ్మ యనంగ లేదు, మరి....................

అమ్మ యనంగ లేదు, మరి

   యయ్య యనంగ కనంగ రాదు, మో

హమ్ము చనంగ లేదు, మరి

   హాయియె లోకమునందు లేదు, మో

ద మ్మన నేమిటో తెలియ

   దయ్య కటంచును తిట్టుచుండగా 

నమ్మయు పిల్లలున్.. ముదిమి

   యారయ దుర్భర మౌ నిజంబుగా..

సరస పదాలు లేవు, సిరి.......

సరస పదాలు లేవు, సిరి

   సంపద లన్నియు వీడసాగెడిన్,

నిరత మ దేదొ చింత మది

   నిండుచు లంకపతిన్ దహించెడిన్,

కొరకొర చూపులున్, మిగుల

   కోపము రేగుచునుండె, పిచ్చి వా

నర మొక టేదొ యీ వనము

   నంతను తొక్కునె యంచు కుందెడిన్

గాత్రము చాలకున్న, వడి ......

గాత్రము చాలకున్న, వడి 

   గా మరి పద్యము సాగకున్న, లో 

నాత్రము మీరుచున్న, సమ 

    యం బది యేగుచు చాలకున్న, నే

ఛత్రము లేక నాతపము

    సర్రున పై బడుచున్న నింక నా

క్షేత్రము వీడి పోదగును 

    చేయగ లేక వధాన మిచ్చటన్

మడత నాల్కది యూర్మిళమ్మ చెలి...telugu padhyam and its meaning

మడత నాల్కది యూర్మిళమ్మ చెలి "బీడి

పడకు, సిగ రెట్టుకొనవే! మగ డరుదెంచుఁ,

గను లయొ! పొగాకు మండుఁ గూ చొనకు మిచట,

గుట్క తాగి వత్తు"న టంచు గొణిగె నపుడు


సీతా రామ లక్ష్మణులు రావణ వధానంతరం అయోధ్యకు తిరిగివచ్చారు. రామునికి వైభవంగా పట్టాభిషేకం జరిగింది. తోడికోడళ్ళలో ఒక్క  ఊర్మిళయే పెద్దకాలం భర్తృ వియోగాన్ని భరించిం దని రాముడు ఆమె అంతఃపురాన్ని  సర్వాంగ సుందరంగా అలంకరించు మని ఆదేశించాడు. ఊర్మిళా లక్ష్మణుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, వారి పునస్సమాగమానికి యథోచితంగా ఏర్పాట్లు గావింపు డని చెలికత్తెలను పురమాయించాడు. 

     ఊర్మిళకు నాలుక మడత పడిన చెలికత్తె ఒకతె వుండేది. (అంటే చిన్నప్పుడే ప్రమాద వశాత్తు నాలుక ఒకింత మడత పడి అలాగే అతుక్కు పోయింది.) ఆమె మాటలు కొన్ని మన కర్థం కావు. కొత్తగా వింటాం కదా! (అక్క డుండేవాళ్ళు రోజూ వింటూవుంటారు కాబట్టి వాళ్ళకు అర్థ మౌతుంటాయి.) ఆమె ఊర్మిళతో ఇలా అన్నది.

    "బిడియ పడకు. సిగ కట్టుకొనవే! మగడు వచ్చే వే ళయింది. అయ్యో! పొగకు కన్నులు మండుతున్నై. ఇక్కడ కూర్చోకు. నే నిప్పుడే గట్క (సంకటి) తాగి వస్తాను."

    కాని ఆమె మాటలు మనకు వేరే విధంగా వినిపిస్తున్నాయి. ఆమె మాట తీ రది. ఏం చేస్తాం.

కాకి యెన్నడైన "కావు కా" వనవలె.. telugu padhya tatparyam

  కాకి యెన్నడైన "కావు కా" వనవలె..

  కోకిలమ్మ మురిసి కూయగవలె..

  తల్లి వోలె నితర తరుణులన్ గనవలె..

  కాకి కోకి లౌనె కనక.. రాజ!

సీతాపహరణానికి ప్రేరేపిస్తున్న రావణునికి హితవు చెబుతూ మారీచుడు  నర్మగర్భంగా ఇలా మందలించినాడు.

     "కాకి ఎన్నడైనా కావు.. కావు.. అనవలసియే వుంది. (అంటే నన్ను రక్షించు.. రక్షించు.. అనాల్సియే వుంది.) కాని కోకిల మాత్రం సంతోషంతో కూయవలసియే వుంది. పర స్త్రీలను తల్లి లాగా కనవలె. (చూడవలె.) కనకపోతే (చూడకపోతే) ఓ రాజా! కాకి లాంటి వాడు కోకిల లాంటి వాడు అవుతాడా! (మాతృవత్ పరదారాంశ్చ.. అనేది ప్రసిద్ధమే కదా!)

    నీ వా విధంగా చూడడం లేదు.  రాముని భార్య నపహరిస్తా నంటున్నావు. కాబట్టి కాకి లాంటి వాడివే! (అంటే కావు.. కావు.. అంటూ ఇకముందు ఆర్తనాదం చేయవలసిందే! ఎందుకంటే రాముని బలం నీకు తెలియదు. ఎవరూ నిన్ను రక్షించలేరు.) కాని కోకిలలాగా మురిసి, మురిపించా లనే భ్రమలో వుంటున్నావు. ఎక్కడైనా కాకి కోకిల అవుతుందా మహారాజా!"

class students telugu project work book | story on animals in circus | s...

8, జూన్ 2022, బుధవారం

మనము నిశ్చలముగ గనుక నీ వుంచిన ....శంకర సూక్తి

 శంకర సూక్తి


మనము నిశ్చలముగ గనుక నీ వుంచిన

నిన్ను జేర్చు నదియె నిక్కముగను

ధరణిలోన సరిగ పరమాత్మ దరి.. లేదొ..

పూని నిన్ను భ్రమలలోన ముంచు..

ఉబుసుపోని కబుర్లు నుత్తమ జపములౌ...devi padhyam telugu

 "ఉబుసుపోని కబుర్లు నుత్తమ జపములౌ..

    పొసగఁ జేతులుఁ ద్రిప్ప ముద్ర లగును..

ఇటు నటు తిరుగుడులే ప్రదక్షిణ లగు..

    నశనముల్ లో నగ్ని కాహుతు లగు..

పొసగ సెజ్జల మీది పొర్లాటలే సుమ్మి

     పొరలుడు దండాల పొలుపు మీరు..

మన సుఖా లన్ని యాత్మ స్వరూపిణి, దేవి

     కర్పింప నిటు సపర్య లయి మించు..

దేవీ సాయుజ్యం - సౌందర్య లహరి......జపో జల్ప శ్శిల్పం సకల మపి

దేవీ సాయుజ్యం - సౌందర్య లహరి


 జపో జల్ప శ్శిల్పం సకల మపి

            ముద్రా విరచనం

        గతిః ప్రాదక్షిణ్య క్రమణ మశనా

             ద్యాహుతి విధిః

         ప్రణామః సంవేశః సుఖ మఖిల

             మాత్మార్పణ దృశా

          సపర్యా పర్యాయ స్తవ భవతు

               య న్మే విలసితమ్


మాటలే జపాలుగా మారుతాయి. చేతులు అటూ ఇటూ తిప్పడమే ముద్ర లౌతాయి.వీధుల్లో తిరుగడాలే ప్రదక్షిణలుగా మారిపోతాయి. తినే తిం డ్లన్నీ యజ్ఞంలో వేస్తున్న హవిస్సు లైపోతాయి. పడుకోవడాలే సాష్టాంగ ప్రణామాలుగా మారిపోతాయి. 

     ఎప్పుడూ అర్చనలు చేయలేము. నిత్య కృత్యాలూ మానుకోలేము. కాని రోజు వారీ పనులనే దేవీ సేవలుగా భావించి చేస్తే అవన్నీ అలాగే పరిణమిస్తాయి. ముక్తి అన్నది చాలా సులభ మౌతుంది


మాటల్ నీ జప, మంగ విన్యసన మమ్మా!

                       ముద్ర, లా చోటు లీ

చోటుల్ ద్రిమ్మరుటే ప్రదక్షిణ, హవిస్సుల్

                       భోజ్యముల్, సెజ్జ పొ

ర్లాటల్ నీకు ప్రణామముల్, సుఖము లి 

                       ట్లాత్మార్పణ న్జేయ నే

చేటున్ గల్గక నీ సపర్య లవుగా!

                       శ్రీ చక్ర సింహాసనా!

రాళ్ళు రప్ప లనక.. కాళ్ళు నొప్పు లనక....ramayanam - telugu padhyam

     రాళ్ళు రప్ప లనక.. కాళ్ళు నొప్పు లనక

     నీళ్ళు నమలకుండ నూళ్ళు దాటి,

     జానకి, పతి, మరిది కానకుఁ బాకోళ్ళుఁ

     జెదరఁ జనిరి.. బీళ్ళు చేలు దాటి


 సీతారామ లక్ష్మణుల వనవాస గమనము.

     నీళ్ళు నమలకుండా (తండ్రి మాట నిలబెట్ట డానికి రాముడు, అన్న వెంట వెళ్ళడానికి లక్ష్మణుడు, భర్త ననుసరించడానికి జానకి ఏమాత్రం సంశయించకుండా) పాదుక లరిగిపోతుండగా చేలు, బీళ్ళు, ఊళ్ళు దాటి, 

కాన (అడవికి) కు జనిరి.

      నీళ్ళు నమలుట= సంకోచించుట

      పాకోళ్ళు= పాదుకలు



మా తలయె దుష్ట భావాల మాత, మంచి ..... ramayanam - telugu padhyam meaning

మా తలయె దుష్ట భావాల మాత, మంచి 

తలపు లను పతివ్రతలను తరిమి చెఱచు

విటులె యీ చెడ్డ యూహ, లీ విటుల తల్లి 

మా తలయె, మాయ యను విటున్ మరిగి దైవ 

మను పతిని మోసగింప జూచు, నది వేశ్య - 

మా తల కుమాత, విటులకు మాత, వేశ్య 


 రావణుడు మారీచుని ఆశ్రమానికి వెళ్ళాడు. మారీచ స్తత్ర మునివత్ జటా వల్కల ధారకః 6-2 ఆశ్రమంలో మారీచుడు జటావల్కలాలతో ముని వృత్తిలో ఉన్నాడు.

   రావణుడు అతణ్ణి సీతాపహరణానికి ప్రేరేపించినాడు. అతను దైవాన్ని మోసగించడం మంచిది కాదు, మనకే ము ప్పన్నాడు. 

    తవ హితం వదతో మమ భాషితం 

    పరిగృహాణ పరాత్మని రాఘవే

(అధ్యాత్మ రామాయణం.. అరణ్య 6-25)

    నేను నీకు హితము చెబుతున్నాను. పరమాత్మ యైన రాముని యందు వైరం వదలిపెట్టు.

    అతో న మానుషో రామః

    సాక్షా న్నారాయణోఽ వ్యయః

    మాయా మానుష వేషేణ 

    వనం యాతోఽ తి నిర్భయః 28

         రాముడు మానవుడు కాదు. సాక్షాత్తు అవ్యయుడైన నారాయణుడు. మాయా మానుష వేషంతో అడవుల్లోకి నిర్భయుడై వచ్చాడు... అన్నాడు.

    కానీ చివరికి ఇష్టం లేకున్నా మారీచుడు రావణునికి సహకరించేందు కొప్పుకోవలసి వచ్చింది - ఒక మిత్రునితో తన ఆవేదన నిలా వెళ్ళగ్రక్కినాడు. మా తల (మా బుఱ్ఱ లేదా మెదడు) కుమాత (చెడ్డతల్లి) అని, విటులకు మాత యని, వేశ్య యని చెప్పినాడు. భావం సులభం.

    (మాయకు లొంగిపోకుండా వుండే తల (బుఱ్ఱ)యే తన నుద్ధరించే మంచి మాత అని అతని ఆంతర్యం)



బావు రనలేదు కానల బోవు టనిన - sri ramayanam telugu padhyam

బావు రనలేదు కానల బోవు టనిన

హాలహలమును మ్రింగెడు హరు డిత డన

బాధ్యతగ నెంచె పితృవాక్య పాలనమునె

హిమగిరి నిభుండు రాముండు విమల గుణుడు..


సందర్భం: కి మ్మనకుండా  అరణ్యవాసానికి సంసిద్ధుడైన రాముణ్ణి చూసి విస్తుపోయిన పౌరుల మనోగత మిది.


ప్రల్లదములు పలికి భయపెట్టకుము నన్ను,....ramayanam - telugu padhyam with meaning

     ప్రల్లదములు పలికి భయపెట్టకుము నన్ను,

     హ్లాద మిదె యటంచు వాద మేల?

     దురిత మంటు గాక! దురపిల్లబోను, వే

     డుకొనలేను, రామునికి బెదరను


 "సీత నపహరించి తేవటం దురితం (పాపం). ఆమెను రాముని కప్పగించి వేడుకో. అదే హ్లాదం (సంతోషం)."  అని హితవు చెప్పిన తమ్ముడైన విభీషణునితో రావణు డన్న మాటలు..

    ప్రల్లదములు= దుర్భాషణములు

    దురపిల్లు= దుఃఖించు


ప్రకటి తాంగీకృతియె సుమ్ము రాము సొమ్ము.....ramayanam-telugu padhyam & meaning

ప్రకటి తాంగీకృతియె సుమ్ము రాము సొమ్ము..

హ్లాదమే గాని వేదన లేదు సుమ్ము..

దుర్గ మాటవిన్ ధైర్యమే తోడు, బెదర

డు, పురమున ధర్మ మౌను తోడు,మొనగాడు.


 శ్రీ రాముడు రావణ సంహారానంతరం అయోధ్యకు తిరిగి వచ్చాక ఆతని గుణగణాలను పౌరు లిలా ముచ్చటించుకుంటున్నారు...

     "అరణ్యమైనా అయోధ్యయైనా రామునికి అంగీకారమే! ఆ భావనే ఆయనకు సొమ్ము (ఆభరణం). ఎందుకంటే దుర్గమమైన (చొరరాని) అరణ్యంలో అతనికి  ధైర్యం తో డుంటుంది. అట్లే అయోధ్యలో (రాజ్యంలో) ధర్మం తో డుంటుంది. రామో విగ్రహవాన్ ధర్మః..అని కదా! (ఎక్కడైనా మనగలడు.) అట్లాంటి రాముడే నిజంగా మొనగాడు. ఎవరికీ బెదరడు."


అబ్ధి లంఘించి వచ్చినా డబ్బురముగ......ramayanam - telugu padhyam

     అబ్ధి లంఘించి వచ్చినా డబ్బురముగ

     పట్టి, పొగ రుబ్బు దనుజాళిఁ గొట్టి చంపె,

     నచటి కేగకు, జీవన మబ్బు కొడుక!

     ప్రళయ రుద్రుని మెరు గబ్బు ప్లవగ మద్ది


 అశోక వన విధ్వంసం గావించి ఎందరో రాక్షసులను మట్టి గరపించినాడు ఆంజనేయుడు.

   ఒక రాక్షసవీరుడు ఆ కోతి నిప్పుడే చంపివేస్తా నని ఇంటి నుండి బయలుదేరగా అతని తండ్రి ఇలా వారించినాడు.

     "అబ్ధినే (సముద్రాన్నే) లంఘించి వచ్చినా డబ్బురముగా (ఆశ్చర్యకరంగా). పొగ రుబ్బే గర్వం అతిశయించే (మితిమీరే) రక్కసులను గొట్టి చంపినాడట! అక్కడికి (అశోకవనానికి) మాత్రం వెళ్ళకు కొడుకా! జీవన మబ్బుతుంది. (జీవితం లభిస్తుంది.) వెళ్ళితే మాత్రం తిరిగిరావు. అది ఉట్టుట్టి ప్లవగం (కోతి) కాదు. ప్రళయ కాల రుద్రుని మెరుగు అబ్బు (కాంతితో విజృంభించే) ప్లవగం."


సంయమీంద్రు డస్త్ర సద్విద్య ఘన పుర.....ramayanam - telugu padhyam and menaing

     సంయమీంద్రు డస్త్ర సద్విద్య ఘన పుర

     స్కారముగ నొసంగె గాధి సుతుడు..

     రణ విజేత లైరి రామలక్ష్మణు లహో!

     ముదము కలిగె లోకమునకు మిగుల


 గాధి సుతుడైన విశ్వామిత్రుడు మహాతప స్సంపన్నుడు. సంయమీంద్రుడు. అస్త్రవిద్యా విశారదుడు. యజ్ఞ సంరక్షణార్థ మనే మిషతో రామ లక్ష్మణులను తోడ్కొనిపోయి వివిధములైన అస్త్రములను ప్రయో గోపసంహా రాలతో సహా ఉపదేశించినాడు. అస్త్రవిద్యనే పురస్కారంగా (కానుకగా) వారి కిచ్చినాడు. 

   భవిష్యత్తులో రావణా ద్యనేక రాక్షస వీరులను సంహరించవలసిన అవతార కార్యక్రమానికి వారిని సుశిక్షితులను గావించినాడు. రామ లక్ష్మణులు రణ విజేతలై లోకానికి సంతోషం చేకూర్చినారు.


కరుణను రాముడు " రావణ....ramayanam - telugu padhyam and meaning

    కరుణను రాముడు " రావణ!

    సరిసరి! యలసితివి నేడు

                      చను" మనగానే

    మరి సముచిత మిదె యనిఁ దో

    చ.. రణంబులు లేనివాడు

                       చకచక నడచెన్


 రావణుడు ఆరోజు యుద్ధంలో బాగా అలసిపోయినాడు. కరుణాస్పదుడైన రాముడు  "రావణా! నీవు అలసిపోయినావు. ఇంక ఇవాళ యుద్ధం అక్కర లేదు. వెళ్ళి విశ్రాంతి తీసుకొని రేపు ర" మ్మన్నాడు. ఇదే మంచి దని (సముచిత మని) మదిలో తోచగా యుద్ధములు లేని వాడు (రావణుడు) చకచకా నడచిపోయినాడు.


రవి కుల పావనుం డయిన.....srimadramayanam telugu padhyam and menaing

    రవి కుల పావనుం డయిన

       రామ నరేంద్రుని సచ్చరిత్రమున్

    కవి యను పేరు సార్థకము

       గాగను వాల్మికి కావ్య మల్లగా..

    పవిధరుడున్, మునుల్, జనులు

        భక్తి నిబద్ధతఁ గేలు మోడ్వగా..

    చెవికి పసందుగా వినుచుఁ

        జేష్టలు దక్కెను వాయుపుత్రుడున్

 కవి యనే పేరు సార్థకం అయేటట్టు వాల్మీకి కావ్య మల్లగా... పవిధరుడు (దేవేంద్రుడు), మునులు, జనులు భక్తితో కేలు మోడ్వగా (చేతులు జోడించగా)... వాయుపుత్రుడైన ఆంజనేయుడు సూర్య వంశ పావనుడైన రాముని సచ్చరిత్రను చెవులారా వింటూ (పారవశ్యంతో) చేష్ట లుడిగి అలా వుండిపోయినాడు.


విహతమైన శ్రద్ధ, విగతమౌ నాశ...telugu padhyam of ramayanam with meaning

విహతమైన శ్రద్ధ, విగతమౌ నాశ, వి

ఘ్నయుత కార్య సిద్ధి, కలుష బుద్ధి

రామ వోలె నిలిచె నేమో యనెడు నట్టి

జానకిఁ గని హనుమ చాల వగచె..

   ఆ సీత దెబ్బ తిన్న శ్రద్ధ వలె, అడ్డులు తగిలిన ఆశ వలె, విఘ్నము కలిగిన కార్య సిద్ధి వలె, కాలుష్యముతో కూడిన (నిర్మలముగా లేని) బుద్ధి వలె ఉండెను. (అటువంటి సీతను హనుమ చూచెను. చాలా బాధపడెను). 

రామ రూపము= స్త్రీ రూపం

    విహతా మివ చ శ్రద్ధా  మాశాం ప్రతిహతా మివ

    సోపసర్గాం యథా సిద్ధిం బుద్ధిం సకలుషా మివ    (సుందరకాండ 15 - 33)


విరతి లేక తిరిగి వేసారినాడ.. telugu ramayanam padhyam and meaning

   విరతి లేక తిరిగి వేసారినాడ.. ని

   ఘ్న మగు మనము నాదిగా నెఱిగితి..

   రాజ వదనఁ గనను, రామ లంబరములు

   జార నిదుర మునిగినారు, కంటి..

విరతి = విశ్రాంతి, విరామం

నిఘ్నము = అధీనమయినది

అంబరము = వస్త్రము

ఆంజనేయుడు సీతామాతను వెదికే సందర్భంలో తనలో తాను ఇలా తలపోసినాడు.

     "విరతి (విరామం) లేకుండా లంక నంతా గాలించి వేసారినాను. రామ (స్త్రీ)లు ఒంటిమీది వస్త్రాలు జారిపోతున్నా (పరాకుగా) గాఢ నిద్రలో మునిగిపోయి వుండగా కంటిని (చూసినాను). కాని రాజవదనయైన సీతా మాతను మటుకు కనను (చూడను). 

    ఐనా ఇంత మంది మహిళలను యీ స్థితిలో చూసినా నా మనస్సు చలించలేదు. నిఘ్నమైన (స్వాధీనమైన) మనస్సు నా దని తెలుసుకో గలిగితిని."

     కొందరు వనితలు "నిద్రాబలపరాజితలై" పక్కనున్న వారి వస్త్రములు లాగి కప్పుకొని నిద్రించుచుండిరి.(సుం.కాం.11-29)

మే తత్ చ సువ్యవస్థితమ్.. (11-41) నా మనస్సు ఎట్టి వికారము చెందక స్థిరముగా నున్నది.




7, జూన్ 2022, మంగళవారం

అప్పులైనను నిప్పులైనను....telugu padhyam ramayanam and meaning

     అప్పులైనను నిప్పులైనను

      నాంజనేయుని కేమిలే!

     పప్పు లుప్పుల చింతపండుల

        పాడు సంసృతి లేదులే!

     తుప్పు బట్టని యాయుధం బది..

        తోడు.. రాముని నామమే!

     తప్పు జేయగనీదు.. గెల్పును

        దప్పకుండ నొసంగులే!

 లంకకు వెళ్ళి జానకీ మాతను దర్శించి తిరిగి వచ్చిన హనుమ జరిగిన వృత్తాంత మంతా వివరించి చెప్పాడు. అప్పుడు జాంబవంతుడు సంతోషించి వానరులతో యిలా అన్నాడు.

   "అప్పు లంటే నీళ్ళు.. నీళ్ళైనా నిప్పులైనా ఆంజనేయుని కేమీ ప్రమాదం లేదు. శతయోజన విస్తీర్ణమైన లవణ సముద్రాన్నే లంఘించి వెళ్ళడమే కాదు. క్షేమంగా తిరిగి వచ్చినాడు. అంతేకాదు. లంకలో తోకకు నిప్పంటించినా ఏ ప్రమాదమూ కానేలేదు. ఆయనే లంకను దహించివేసినాడు.

   సంసృతి అంటే సంసారం. ఎంతసేపూ పప్పులూ, ఉప్పులూ, చింతపండూ లాంటి సరుకుల

ఆలోచనతో ముడివడి వున్నది. అది మనకే గాని ఆంజనేయునికి లేదు కదా!

   తుప్పుపట్టని ఆయుధమైన రామనామం ఆయన కెప్పుడూ తోడుగా వుంటుంది. (ఆయన ఆలోచన అంతా రామనామంతోనే ముడివడి వున్నది.) ఆ రామ నామం తప్పు చేయనీయదు. తప్పకుండా గెలుపే ఇస్తుంది. చూశారా! మన ఆంజనేయుడు కార్యం సాధించుకొనే వచ్చాడు."


సాగ దింక మాయ.. సంహరించెదను.. ramayanam telugu padhyam and meaning

     "సాగ దింక మాయ.. సంహరించెదను.. ల

     క్ష్య మిపు డింద్రజిత్తె" యని శరము సు

     మిత్ర సూను డేసె, మిత్తి జేర్చె నరి, న

     మ్ముల పొది నొదిగె.. జనములు మురిసిరి


ఆకాశంలో అదృశ్యరూపుడై ఇంద్రజిత్తు శర వర్షం కురిపిస్తున్నాడు. అతని రాక్షస మాయ ముందు వానరులు నిలువలేక పోతున్నారు. సుమిత్రా సూనుడైన లక్ష్మణు డిది గ్రహించి తీవ్రస్థాయిలోనే ఎదుర్కోవా లని నిశ్చయించుకొన్నాడు.

    "నే డింద్రజిత్తును సంహరించాల్సిందే! లక్ష్యం ఆతడే!" అని శర ప్రయోగం చేసినాడు. అది అరిని (శత్రువును) మిత్తి (మృత్యువును) జేర్చినది. తిరిగివచ్చి లక్ష్మణుని అమ్ములపొదిలో దూరినది. జనాలు మురిసిపోయినారు.


ఇంద్రజిత్తును వధియించె నింపుమీరఁ...ramayanam telugu padhyam and meaning

ఇంద్రజిత్తును వధియించె నింపుమీరఁ

ఘనుడు సౌమిత్రి భీష్మ విక్రముడు గాడె!

విష్ణు విద్వేషి యైనట్టి వీరవరుడు,

రావణ బ్రహ్మ కే మాట రాదు నోట..

ఇంద్రజిత్తును లక్ష్మణుడు వధించగలిగినా డంటే చిన్న విషయ మేమీ కాదు. ఆతడు భీష్మ (భయంకరమైన) విక్రముడే! అదివిని నిశ్చేష్టు డైన రావణ బ్రహ్మకు నోట మాట రాలేదు.


క్షయము వృద్ధి లేని చంద్రుండు రాముండు.. telugu padhyam with meaning

క్షయము వృద్ధి లేని చంద్రుండు రాముండు..

క్షమను నతని కెవడు సాటి లేడు..

క్షత్రియులకు నతని చరిత మాదర్శమ్ము..

క్షరము గాదు రామచంద్రు నమ్ము..

పట్టాభిషిక్తుడైన శ్రీ రామ చంద్రుని చూసి ఇన్నాళ్ళ ఇన్నేళ్ళ తమ నిరీక్షణ ఫలించిందని సంతోషించిన పౌరులు తమలో తా మిలా ముచ్చటించుకున్నారు..

     "క్షయ వృద్ధులు లేకుండా వుండే చంద్రుడు రాముడు.. అంటే ఎటువంటి సంఘటన ఎదురైనా పొంగడం కుంగడం అనేది వుండని వాడు.. క్షమలో అంటే సహనంలో నతని కెవడూ సాటి లేడు.. క్షత్రియులకు నతని చరిత్రమే ఆదర్శము.. అమ్ము అంటే బాణం. రామ బాణానికి తిరుగు లేదు. అది క్షరము (నశించేది) గాదు."


భూమిదేవి హరికి భామిని రాముడై.... telugu poem with meaning

         భూమిదేవి హరికి భామిని; రాముడై

         హరియె చెట్టబట్టె నవని సుతను..

          రాము డల్లు డయ్యె భూమిదేవికిఁ గాన

          భర్త అల్లు డయ్యె భార్య కిపుడు

శ్రీదేవి భూదేవి శ్రీ మహా విష్ణువుకు భార్యలు. విష్ణువే రామునిగా అవతరించినాడు. భూదేవి కూతురైన సీతాదేవి రామునికి భార్యయైనది. తన భర్తయే తన కూతురును చేపట్టినాడు కాబట్టి భూదేవికి తన భర్తయైన విష్ణుమూర్తియే అల్లుడైనా డనవచ్చు.

    భూమిదేవి = భూదేవి; అవనిసుత = సీత

   పద్య చమత్కృతికై తప్ప తాత్విక దృష్టి ముం దీ భావన నిలువదు.

  "తనువుతో గలుగు బాంధవ్యంబు లెల్ల

   తనువుతో నశియించి ధరణిలో గలియు"

అనే "శ్రీ కృష్ణావతారం" సినిమాలోని మాటలు గుర్తుకు రావాలి. చుట్టరికా లన్నీ ఈ శరీరంతోనే! శరీరం మారితే అన్నీ మారిపోతాయి. ఇ దేమిటి.. అనడానికి లేదు. ఏ జన్మ బంధుత్వ మా జన్మ వరకే!


6, జూన్ 2022, సోమవారం

10th class telugu vyutpathyardhalu

తెలుగు వ్యుత్పత్తరాలు


నీరజ భవుడు:- నీరజమునందు పుట్టిన వాడు (బ్రహ్మ విష్ణువు నాభి కమలము పుట్టినవాడు 

త్రివిక్రముడు:-మూడడుగులచే భూమిని కొలిచిన వాడు.

విష్ణువు:-- విశ్వము అంతటా వ్యాపించిన వాడు,

విశ్వంభరుడు:- విశ్వమును భరించువాడు

బార్గవుడు :- భృగువంశమున పుట్టిన వాడు

వదాన్యుడు:- మిక్కిలిగా యిచ్చేవాడు.

హరుడు:- హరించేవాడు

హరి :- భక్తుల హృదయాలను ఆకర్షించువాడు (విష్ణువు) చీకటిని హరించువాడు 

మానవకుడు:- మనువు యొక్క అల్పమైన సంతానం.

దానవులు:- ధనువువల్ల పుట్టిన వారు

బ్రహ్మ:- ప్రజలను వర్దిల్ల చేయువాడు

భాష = బాషించునది.

గురువు:- అజ్ఞానమనే అంధకారమును హరించువాడు (ఉపాధ్యాయుడు)

అధ్యక్షుడు:- చర్యలను కనిపెట్టి చూచేవాడు

పౌరాణికుడు:- పురాణములు తెలిసినవాడు (చెప్పివాడు)

పురోహితుడు:- పురము యొక్క క్షేమాన్ని కోరేవాడు

మిత్రుడు :- అన్ని ప్రాణుల యందు స్నేహంతో కూడిన వాడు (స్నేహితుడు, సూర్యుడు) 

జలేజము:- నీటియందు పుట్టినది (పద్మము)

భానుడు: ప్రకాశించు వాడు (సూర్యుడు)

పారాశర్వుడు:- పరాశర మహర్షి కుమారుడు.

భాగీరధి:- భగీరథునిచే తీసుకొని రాబడినది

అతిధి :- తిధి మొదలయిని నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు

తెలుగు :- త్రిలింగముల మధ్య ఉపయోగించే బాష

హృదయము:- హరింప బడేది. 

ఆయుదము:- యుద్ధము చేయుటకు తగిన సాధనము 

ముక్కంటి :- మాడు కన్నులు కలవాడు 

ఉష్ణ రష్మి :- చల్లని కానివి  భానువులు కలవాడు.

చిగురు బోడి:- చిగురు వంటి శరీరం కలది. 

భవాని : భవుని భార్య

మచ్చెకంటి:- మత్స్యముల వంటి కన్నులు కలది.

కమలాలన:- కమలముల వంటి అననము కలది. 

ఛాత్రుడు :  గురువు దోషములను కప్పి పుచ్చేవాడు.

ఆహిమ భానుడు : చల్లనివి కాని కిరణాలు కలవాడు

అంగన:- మంచి అవయవములు కలది.

వేదవ్యాసుడు;- వేదములను విభజించినవాడు

మనోహరమైనది: హర్మ్యము 

అక్షరము - నాశనము పొందనిది.

ఈశ్వరుడు : స్వభావము చేతనే ఐశ్వర్యము కలవాడు 

దాశరథి : దశరథుని కుమారుడు 

మిత్రుడు : సర్వ భూతములయందు స్నేహయుక్తుడు 

భీముడు : భయమును కలుగజేయువాడు 

శౌరి : సూరికి మనుమడు 






4, జూన్ 2022, శనివారం

గాయత్రి ముద్రలు - యువతి

గాయత్రి ముద్రలు - యువతి

అందమైన ముఖం, దువ్వి ముడుచుకున్న కురులు, మెడలో వ్రేలాడ దండలు, గొప్పనైన దండలు, గొప్పనైన స్తనయుగం మరియు నునుపెక్కిన పిరుదులు,  చేపలవంటి కన్నులు, కూర్మం వంటి పాదాలు, సింహం వంటి నడుము, ఎపుడు పతి ఎదుట కట్టుకుని నిలిచే చిగురాకులవంటి చేతులు, అందమైన నాభి కలిగిన యువతి ఎదురుగా ఉన్నపుడిక అతనికింక గాయత్రి మంత్రంపై మనస్సెలా పోతుంది?

అటువంటి సుందరి ఎదురుగా ఉన్నపుడు భర్త సంధ్యావందనాదులు, గాయత్రి జపాలు, ముద్రలు అన్నీ మరచి పోతాడు.

నవధాన్యములు అర్థాలు

నవధాన్యములు  అర్థాలు

శాల ` వరి ` శాలత్వం` వినయత్వం

సుమనం ` గోధుమ ` మంచిమనసు,

తువర ` కంది ` తువర ` తుంపర

చణకం - సెనగ - సామర్థనం

మూషం ` మినుము ` మోక్షం

కర్మాషం ` బొబ్బర్లు ` నలుపు

కుళుత్థ ` ఉలువ ` కులంలో ఉన్నది

ముగ్ద`పెసర ` సంతోషం

స్నేహఫలం ` నువ్వులు ` ప్రేమ

స్త్రీ ఎపుడైనా వినయత్వంతో పతిని సంతోషింపజేసి మనసులో చోటిచ్చి కొన పెదవులతో మంతిరిస్తు, పతిచేసే పనులకు అపశకునం పలుకక తన సామర్థనంతో సంతోషింపజేసి మూర్ఖంతో మనసు నొప్పించక కల్మషం లేకుండ ఉండి మంచి తనంతో తృప్తిపరచి సంతోషం గూర్చే విలాసంతో ఉండి ప్రేమఫలాన్ని చూపుత వలచి వలపింపజేసుకునే భార్య లభిస్తే అతని ప్రేమ పాత్రలలో నవధాన్యాలు మొలకెత్తి, ఆనందానికి అంకుర్పాణ జరిగి నట్టే లెక్క.



చిత్రాంగద

చిత్రాంగద

అంగములు అంటే బాహుపురులు. ఇవి ఒకరకమైన అభరణాలవంటివి.

అంగం అంటే శరీరం దకారానికి ఏకాక్షరపరంగా భార్య అని కూడా అర్థం.

కాబట్టి చిత్రాంగదకు చిత్రమైన అంగాలు గల భార్య అని అర్ధంగా చెప్పుకోవచ్చు.

చిత్రిని, చిత్రాంగి, చిత్రాంగద అనే పేర్లన్నీ ఒకేరకమైన అర్థాన్ని ఇస్తాయి. 

చిత్ర శబ్దానికి కల్మషం (నలుపు), కిర్మీరం (సింగడి), కర్బురం (బంగారం) అనే పర్యాయ పదాలున్నవి. 

ఆమె చిత్రాంగద కాబట్టి పురాణ కథలో అర్జునుడు ఆమెను చూసీ చూడగానే విచిత్రానుభూతికి లోనైనాడని భావించవచ్చును.



10th class school students physics formative project work 2022 | physics...

3, జూన్ 2022, శుక్రవారం

10th class pre public exam english question paper 2022 | class x english...

Forbes World's Billionaires List 2022 సంపన్నుల నికర సంపద (బిలియన్ డాలర్స్)

 ప్రతి ఏటా ఫైనాన్షియల్‌ ఇయర్‌ అయ్యాక వార్షిక ధనవంతుల జాబితాను సిద్ధం చేస్తుంది ఫోర్బ్స్‌ మ్యాగజైన్. 

అలాగే రోజువారీ ధనవంతుల జాబితాను కూడా ఫోర్బ్స్‌ సిద్ధం చేస్తుంది 

బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ 2022 కుబేరుల జాబితాను తాజాగా విడుదల చేసింది. 

2వేల 668 మంది కుబేరులకు ఫోర్బ్స్‌ 36వ వార్షిక ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు దక్కింది. 

వారి మొత్తం సంపద 960 లక్షల కోట్ల రూపాయలు 

గతేడాది 2021 జాబితాతో పోలిస్తే ఈసారి 87 మంది కుబేరులు తగ్గారు. 

మొత్తం సంపదలో 3వేల 24 కోట్ల రూపాయలు తగ్గాయి. 

ఈసారి కొత్తగా 1000 మంది బిలియనీర్లు గతేడాది కంటే ఈసారి తమ సంపదను పెంచుకున్నారు 

ఈ ఏడాది కొత్తగా ఫోర్బ్స్‌ జాబితాలో 236 మంది బిలియనీర్లు చేరారు. 

కొత్త బిలియనీర్ల జాబితాలో 166 మంది భారతీయులున్నారు 

వారిలో 12 మంది ఫార్మా రంగానికి చెందిన తెలుగువారు ఉన్నారు 


ఎలక్ట్రిక్‌ కార్ల సంస్థ టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ ప్రపంచ కుబేరుడి స్థానాన్ని దక్కించుకున్నారు. 

16 లక్షల కోట్లతో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బేజోస్‌ను వెనక్కి నెట్టి.. ఫోర్స్‌ జాబితాలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఎలాన్‌ మస్క్‌ నిలిచారు.

ఎల్‌వీఎంహెచ్‌కు చెందిన బెర్నడ్‌ అర్నో కుటుంబం మూడో స్థానంలో నిలవగా, 

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నాలుగో స్థానంలో, 

బెర్క్‌షైర్‌ హాత‌వే చైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ ఐదో ప్రపంచ కుబేరుడిగా నిలిచారు. 


ప్రపంచ కుబేరుల జాబితాలో 10వ స్థానంలో ముకేశ్‌ అంబానీ నిలిచారు

11వ స్థానంలో అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ నిలిచారు. 

ఫోర్బ్స్‌ రియల్‌ టైం బిలియనీరస్‌ జాబితా ప్రకారం అదానీయే భారత అగ్ర కుబేరుడుగా నిలిచారు  

ప్రస్తుతం ఆయన ఆస్తి 8 లక్షల 35 వేల కోట్ల రూపాయలు. 

ముకేశ్‌ అంబానీ నెట్‌వర్త్‌ 7 లక్షల 54వేల కోట్ల రూపాయలు. 

రియల్ టైమ్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అదానిది  9వ స్థానం - అంబానీది 10వ స్థానం


టాప్‌-10 కుబేరుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చేరారు. 

6 లక్షల 80వేల కోట్ల రూపాయల సంపదతో భారత్‌లో నెంబరు వన్‌ కుబేరుడిగా ముకేష్‌ అంబానీ నిలిచారు. 

అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ 6 లక్షల 75 వేల కోట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. 


2022 ఫోర్బ్స్‌ జాబితాలో అమెరికన్‌ కుబేరులు పెరిగారు

అమెరికా నుంచి అత్యధికంగా 735 మంది కుబేరులు చేరారు 

వారి సంపద మొత్తం 35 లక్షల కోట్ల రూపాయలు. 

అత్యధిక కుబేరులున్న దేశాల జాబితాలో చైనా రెండో స్థానంలో నిలిచింది. 

చైనాలో మొత్తం 607 బిలియనీర్లకు ఫోర్బ్స్ జాబితాలో చోటు లభించింది. 

వారి సంపద విలువ 17 లక్షల కోట్ల రూపాయలు


సంపన్నుల నికర సంపద (బిలియన్ డాలర్స్)

ఎలాన్ మస్క్ 227.5

జెఫ్ బెజోస్ 149.4 

బెర్నార్డ్ ఆర్నాల్డ్ - 138.3

బిల్ గేట్స్ 123.6 

వారెన్ బఫెట్ 114.1

లారీ పేజ్ 106.4

సెరీ బ్రిన్ - 101.9

ముకేశ్ అంబానీ - 99.7

గౌతమ్ అదానీ - 98.7

స్టీవ్ బామర్ - 96.8


1, జూన్ 2022, బుధవారం

10th class students telugu grammar - how to write their own words - sontha vakyalu with examples

పదవ తరగతి - తెలుగు - సొంత వాక్యాలు 

*********************************

పలికి లేదనుట :- మా వంశ చరిత్రలో ఇప్పటివరకు పలికి లేదనడం లేనే లేదు.

కుఱుచగుట :- దర్జీ  వద్ద కొట్టించిన చొక్కా మా తమ్ముడికి  కొద్దిగా కుఱుచయ్యింది. 

చేతులొగ్గు :- ఎవరి దగ్గరా చేతులొగ్గి యాచించడం మంచిది కాదు.

మానధనులు: - మానధనులే నిజమైన కోటీ శ్వరులుగా  చెప్పబడతారు 

సత్య హీనుడు:- సత్యహీనుడిగా బ్రతకడం కంటే మరనమే  ఎంతో మేలు. 

సిరిమూటగట్టుకొని పోవడం :- ఎంత గొప్ప ధనవంతుడు కూడా మరణించిన తర్వాత సిరి మూట గట్టుకొని పోలేడు. 

అభ్యాగతుడు:- అభ్యాగతుడు స్వయంగా విష్ణు మూర్తి వంటి వాడని పెద్దలంటారు. 

కాళ్ళు కడుగు : - వివాహ సందర్భంలో అత్తమామలు అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేస్తారు.

దశదిశలు:- గొప్ప వారు చేసే మంచి పనుల వలన వారి పేరు దశదిశల వ్యాపిస్తుంది.

యాది చేసుకొను. - నేను నా స్నేహితుడు పెద్దయ్యాక ఒకసారి కలుసుకున్నప్పుడు చిన్నప్పటి సంగతులు యాది చేసుకొని నవ్వుకున్నాం. 

పసందుగ : - నా మిత్రుని ఇంట్లో పండుగ నాడు చేసిన స్వీట్లు  ఎంతో పసందుగా ఉన్నాయి. 

రమ్యం :- బెంగుళూరు వద్ద బృందావన్ లో పూలతోటలు బహు రమ్యంగా ఉంటాయి

క్షేత్రం:- ఉత్తరాదిన  ఉన్న పుణ్య క్షేత్రాలలో కాశీక్షేత్రం విశిష్టమైనది . 

పట్టువడు:- మా అమ్మాయికి తెలుగు పద్యాలు చదవడం బాగా పట్టు పడింది . 

స్మరించుకొను :- స్వాతంత్య్ర దినోత్సవం నాడు విద్యార్థులు దేశ నాయకులను స్మరించుకున్నారు 

సన్నిదానం :- దేవుని సన్నిదానంలో భక్తులు పరవశించిపోయి  ఆనంద తాండవం చేస్తున్నారు. 

ప్రసగించు:- పోతన భాగవతంపై మా గురువు గారు ఎంతో చక్కగా ప్రసంగించారు.

వాజ్మయము :- పదాశివ గారు సంస్కృతాంధ్ర వాజ్ఞ్మయాలను  ఔపోసన పట్టారు. 

వాగ్ధాటి :- మా గురువు గారి వాగ్గాటికి విద్యార్థులంతా మురిసి పోతారు.

ఏకలవ్య శిష్యుడు :-  రమణ సి నారాయణ రెడ్డి గారికి  తాను ఏకలవ్య శిష్యుడిగా  చెప్పుకున్నాడు.  

సయ్యాటలాడు = గాలి కి ఊగుతున్న చెట్టు పూలు, ఆకులతో సయ్యాటలాడుతున్నాయి. 

కల్లోలం :- తెలంగాణ ఉద్యమం తెలుగు ప్రజల గుండెల్లో పెద్ద కల్లోలం కల్గించింది.

వెనుకాడరు. - తెలంగాణ పోరాటంలో యువత వెనుకంజ వేయలేదు. 

దిక్కుతోచ నప్పుడు : - పిల్లలు దిక్కు తోచనప్పుడు పెద్దల వైపు ఆశగా చూస్తారు. 

మహారవము:- భీముడు కేక పెడితే  ఆ మహారమునకు శత్రువులు భయపడి పారి

పోయారు. 

భీతిల్లి పోవు:- తీవ్రవాదుల దుశ్చర్యలకు ప్రజలు భీతిల్లి పోయారు. 

గండి కొట్టు :- అవినీతి పరుల నల్ల ధనాన్ని ప్రభుత్వం తెలివిగా గండి కొట్టింది.

ప్రతిభా విశేషాలు -  తెలుగు సాహిత్యంలో ప్రతిభా విశేషాలు కనబరచిన గల పండితులకు రవీంద్ర భారతిలో సన్మానం జరుపుతున్నారు. 

చెవి వారిచ్చి:-  తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని జాగ్రత్తగా చెవి వారిచ్చి వినాలి.

గవిన్లు :- సింహం గవిన్లలో నివసించును

కుటిలవాజి తనం :- కొందరు కుటిల వాజి తనంతో ఇతరులను మోసం చేస్తారు. 

పొలిమేర:- మా ఊరి పొలిమేరలో ఆంజనేయ స్వామి గుడి ఉంది.

వస తాగిన పిట్ట:- మా తమ్ముడు వస తాగిన పిట్టలాగా వాగుతాడు

తుమ్మ బంక అంటుకున్నట్లు:- రైతు అప్పు కోసం బ్యాంకు ఆఫీసర్ వెంట  తుమ్మ బంక అంటుకున్నట్లు తిరుగుతున్నాడు.

చెక్కు చెదరకుండ- నేటికి తాజ్ మహలు అందాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి.

కొరివితోటి తలగోక్కును :- మూర్కుడితో గొడవ పడితే  కొరివితోటి తలగోక్కున్నట్లు ఉంటుంది. కళకళ లాడు :- దీపాల వెలుతురులో మా ఊరి గుడి కళకళలాడుతుంది. 

చెప్పు కింద తేళ్ళ తీరు :- పూర్వం గ్రామాల్లో ప్రజలు కరణం పెత్తనంలో చెప్పు కింద

తేళ్ళ తీరున ఉండేవారు. 

జనిగె పట్టు:- పండుగ నాడు తమ గ్రామానికి రమ్మని మా అల్లుడు జనిగె పట్టు పట్టాడు.

తిక్క సన్యాసి :- మా మనవడు రఘు వొట్టి  తిక్క సన్యాసి

నెత్తురు కండ్ల చూచు:- ఇద్దరు తగువులాడుకొని అనవసరంగా నెత్తురు కళ్ళు చూసారు.

పచ్చపూస: మా ఊరి గ్రామాధికారి పచ్చిపూస ఏమీకాడు. 

నక్షత్రకుడు: - సినిమా చూడడానికి డబ్బులు కావాలని మా తమ్ముడు నక్షత్రకుడిలా వెంట బడ్డాడు 

పద్మ వ్యూహం : - నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమస్యల పద్మవ్యూహంలో చిక్కుకుంది

జీవన ఘోష:- పేదవారి జీవన ఘోష ఎవరు పట్టించుకోరు.

ఊపిరాడని : - నాకు నగరంలో ఊపిరాడని పనులున్నాయి.

మెర్క్యూరి నవ్వు:- కొందరు సినీ తారలు కేవలం మెర్క్యూరి నవ్వులు  పూయిస్తారు 

పఠనీయ గ్రంథం : - మహా భారతం అందరికీ పంఠనీయ గంధం

ఏకతాటిపై :- ప్రజలందరు ఏకతాటిపై నిలబడితే దేశ ప్రగతి సుసాధ్యం అవుతుంది

మచ్చుతునక :- తెలంగాణ వైభవానికి నల్గొండ కోట ఒక మందు కలవక

మహమ్మారి:- నేటికి వరకట్న మహమ్మారికి ఎన్నో జీవితాలు బలై పోతున్నాయి.

మార్గ దర్శకుడు : - నెహ్రూ  భారతదేశ అభివృద్ధికి మార్గదర్శకుడు.

నిరంతరం :- పిల్లలు నిరంతరం చదువుపై దృష్టి ఉంచాలి 

సొంత కాల్లపై నిలబడడం :- ప్రతి వ్యక్తి కష్టపడి పని చేసి తన సొంత కాళ్ళు పై నిలబడాలి. 

అంకితం కావడం :- దేశ ప్రజలందరూ త్రికర శుద్ధిగా దిశ సేవకు అంకితం కావాలి

నైతిక మద్దతు  :- ప్రజల నైతిక మద్దతు ఉండేనే  ప్రభుత్వము నిలబడుతుంది 

గట్టెక్కిందు :-  పొరబాటున నీటిలో పడిన నన్ను నా మిత్రుడు గట్టెక్కించాడు.

అవగత మగు :- నా మిత్రుడి నిజస్వరూపం నాకు మెల్లగా అవగతం అయ్యింది

చిత్తశుద్ధి : నాయకులు పదవిలో ఉన్నపుడు చిత్తశుద్ధిగా మాట్లాడాలి. 

లిఖిత బద్దం: మా గ్రామ చరిత్రను మా పూర్వీకులు లిఖిత బద్దం చేశారు.

చూరగొన కలుగు :- మంచి నాయకులు తొందర గానే ప్రజల విశ్వాసాన్ని చూరగొలుగుతారు.

మటు మాయం కావడం - మాయింట్లో పనిమనిషి వస్తువులను చిటికెలో మటు మాయం చేస్తుంది.

భాసిల్లు - మన తెలంగాణ సిరి సంపదలతో భాసిల్లు తుంది.

ఉద్భోదించు:- గాంధీ. శాంతి, అహింసా మార్గాలను ప్రజలకు ఉద్భో దించారు. 

దైన్య స్థితి:- ప్రజల దైన్య స్థితిని తొల గించిన వారే అసలైన నాయకులు. 

నరరూప రాక్షసుడు:- ఉగ్రవాదాన్ని ప్రోత్సాహంచే వాడు నరరూప రాక్షసుడు 

కొంప ముంచు :- ప్రభుత్వం సారా దుకాణం తెరిచి ప్రజల కొంప ముంచింది.

ముచ్చట లాడు:- నా స్నేహతుడు పిల్లలతో ముచ్చటలాడుతూ కాలక్షేపం చేస్తాడు . 

వరుస వావి :- వరుసవావి లేకుండా అందరితో వేళాకోళాలు పనికిరావు 

నీళ్ళు వదులు :- బ్యాంకు దివాలా తీయడంలో మా డిపాజిట్కు నీళ్లు వదులుకున్నాము

కొంపలార్పు:-  స్వార్థం కోసం దుర్మార్గులు పేదల కొంపలు ఆర్పడానికి వెను దీయరు

అనిదం పూర్వము :- మోడి ప్రదాని కావడంలో భారత దేశానికి (పూర్వమందులేని) ఆనిదం పూర్వం పేరు వచ్చింది

సత్రముల్ పెట్టు :- శివరామ గుప్త గారు తిరుపతిలో సత్రములు పెట్టారు

ముసురుకొను :- మామిడి పండు పై ఈగలు ముసురు తున్నాయి.

ప్రాణం పోయు:- భారత దేశానికి స్వాతంత్య్రం తెచ్చి భారతీయులకు తిరిగి ప్రాణం పోశారు.

గొంతు వినిపించు :- పాట పాడి నా గొంతు వినపించమని నామిత్రులు అడిగారు. 

యజ్ఞం: వర్షాలు కావాలని ప్రజలు వరుణ యజ్ఞం తల పెట్టారు

అక్షరాల:- మీరు చెప్పిన మాట అక్షరాలా నిజమైంది 

ఆనందోత్సాహాలు - నాకు పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చినందుకు ఆనందోత్సాహంతో పొంగి పోయాను

రాచఠీవి: ఈనాడు తెలంగాణలో ప్రజలు రాచఠీవితో  తిరుగుతున్నారు.

నివాళులు అర్పించు - తెలంగాణ వీరులకు ప్రజలు నివాళులు అర్పించారు.

ఆదుకోవడం :- కష్టాల్లో ఉన్నవారిని ప్రభుత్వం ఆదుకోవాలి

భాషా సంస్కృతులు - ప్రతి రాష్ట్రం తమ భాషా సంస్కృతులను కాపాడాలి 

ఆవిర్భవించు :- 2014లో తెలంగా ణ రాష్ట్రం ఆవిర్భవించింది.

వ్యాప్తి :- సుగంధ పరిమళాల వాసన ఆ ప్రాంతమంతా వ్యాపించింది.

జంకని అడుగులు:- దేశ సైనికుల జంకని అడుగులే దేశానికి గ్రీరామ రక్ష,

ఎడారి దిబ్బలు :- ఒంటెలు ఎడారి దిబ్బలను దాటుకుంటూ వేగంగా నడుస్తాయి.

చెరగని త్యాగం:- బలి చక్రవర్తి చేసిన చెరగని త్యాగం చరిత్రలో నిలిచి పోయింది

మనసు కరుగు : - అందరి మనస్సులు కరిగేలా సీత ఏడ్చింది.

జడిపించు :- బూచాడు వస్తున్నాడని మా బామ్మ నన్ను చిన్నతనంలో జడిపించేది. 

గుండెలు పగులు: - భూకంప బాధితులు గుండెలు పగిలేలా ఏడ్చి సొమ్మసిల్లి పోయారు.

ఎత్తులకెదుగు:- ఎంత ఎత్తు ఎదిగిన బుద్దిమంతుడు తన మూలాన్ని మరచిపోడు

పుట్టినిల్లు:- సంస్కృతి సంప్రదాయాలకు భారత దేశం పుట్టి నిళ్లు

 పాటు పడడం:- దేశానివుద్ది అందరు పాటు పడాలి 

పీడ వదలడం:- భారతీయులకు 1947 సంవత్సరంలో బ్రిటిష్ వారి పీడ వదిలింది

తలదాచు కోవడం :- వరదలు వచ్చినప్పుడు వరద బాధితులు సురక్షిత ప్రాంతానికి పోయి తలదాచుకున్నారు.

జన సమ్మర్ధము :- గోదావరి పుష్కరాలలో రాజమండ్రిలో జన సమ్మర్దము చాలా ఉంది.

రాక పోకలు:- మాకు మా మామయ్య గారికి మధ్య రాకపోకలు లేవు

రూపురేఖలు:- ఎండలో తిరుగుటవలన మా తమ్ముడి రూపురేఖలు మారిపోయాయి.

పెంపు సొంపులు :- నగర పెంపు సొంపులకు ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు

మిరుమిట్లు గొలుపు:- సర్కసు వారు ఏర్పాటు చేసిన దీపాలు కళ్లు మిరుమిట్లు కొల్పుతున్నాయి.

పటాటోపము:- నేటి కాలంలో రెవెన్యూ ఉద్యోగుల పటా టాపము హెచ్చుగా ఉంటుంది. 

భోగ లాలసులు:- సుల్తానుల కాలంలో రాజోద్యోగులు భోగలాలసులుగా ఉండేవారు

బిక్షాటనము :- పూర్వం విద్యార్థులు భిక్షాటనం చేసుకుని చదువుకునేవారు.

అర్ఘ్య పాద్యములు:- భక్తితో భగవంతునికి అర్గ్య పాద్యములు ఇచ్చి పూజించాలి.

భక్తి విశ్వాసము :- ప్రజలందరికి రాజుపై  భక్తి విశ్వాసాలు ఉండాలి.

107) ఆ కంఠంబుగ :- అతిధులందరికీ ఆకంఠముగా (పీకలవరకు) భోజన ఫలహారాలు అందించారు.

అంగలార్చు (గంతులేయు) :- తనకు సమాన వాటా ముట్టలేదని రవి అంగలార్చాడు

హెచ్చుకుందాడు (నిందించు):- పెద్దవారి మనస్సులు గమనించకుండా వారిని చిన్న వారు హెచ్చుకుందాడరాదు

మహా ప్రసాదము:- శిష్యులు గురువులు చెప్పిన మాటలను మహాప్రసాదంగా స్వీకరించాలి.

నడుం బిగించు :-  మంచి పనులు చేయడానికి అందరు నడుం బిగించాలి. 

ఒడిసి పట్టు :- ప్రతి వర్షపు చినుకు సముద్రం పాలు కాకుండా ఒడిసి పట్టుకోవాలి .

ఆదాన ప్రదానాలు (ఇచ్చిపుచ్చుకోవడం) :- కార్యం నెరవేరాలంటే ఆదాన ప్రధా నాలు రెండు ఉండాలి.

విశిష్ఠ స్థానం :-  తెలంగాణ కవులు దాశరధి గారికి ఒక విశిష్ట స్థానం ఉంది.

హృదయ విదారకం:- కరోనా బాధితుల కష్టాలు వినడానికి హృదయ విదారకంగా ఉన్నాయి.

అతలాకుతలం :- భూకంపం రావడంతో బీదల బ్రతుకులు అతలాకుతలం అయ్యాయి.

హృదయ సంస్కారం: నా మిత్రుడు హృదయ సంస్కారంతో పేదలను ఆదుకుంటాడు .

భారతీయ సంస్కృతి :- స్వామి వివేకానంద మన భారతీయ సంస్కృతి గురించి దేశ విదేశాల్లోప్రచారం చేశారు


10th class physics formative assessment project work notes on chapter periodic table 2022















 

10th class physics formative assessment project work notes on chapter light 2022





 

10th class physics formative assessment project work notes on chapter corrosion 2022





 

10th class english pre public exam question paper 2022 answer sheet part b 40 marks








 

10th class english pre public exam question paper 2022 answer sheet part a 80 marks







 

10th class pre public exam english question paper 2022 | x class english...

hindi festival naga panchami or garuda panchami significance

హిందూ పండుగ నాగ పంచమి విశేషాలు 

***********************************

శ్రావణ మాసంలో ముందుగా వచ్చే పంచమిని నాగపంచమి లేదా గరుడ పంచమిగా వ్యవహరిస్తారు. 

సనాతన భారతీయ సంప్రదాయంలో నాగారాధనకు, నాగరాజు పూజకు ఎంతో సముచిత స్థానం ఉంది. 

శ్రావణ శుద్ధపంచమిని గరుడ పంచమిగా / నాగపంచమిగా ... అలాగే కార్తిక శుద్ధచవితిని నాగులచవితిగా పరిగణిస్తారు. 

గరుడ పంచమీవ్రతాన్ని సోదరులు కలిగిన స్త్రీలు ఆచరిస్తుంటారు 

మానవ సమాజంలో ఈ నాగపూజ అనే ఆచారం వేదకాలం నుంచీ ఉంది. 

కేవలం హైందవ సంప్రదాయంలోనేగాక జైన, బౌద్ధ ధర్మాల్లోనూ నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది. 

నాగరాజు పరమ శివుడికి అలంకారంగా హారమైతే, కేశవుడికి శయనానికి తల్పమయ్యాడు. 

మన పురాణేతిహాసాల్లో అనేక సందర్భాల్లో ఈ నాగుల ప్రస్తావన కనిపిస్తుంది. 

భవిష్య పురాణంలో నాగపంచమి ప్రస్తావన, నాగద్రష్ట, గరుడ పంచమీవ్రతాల కనిపిస్తుంది 

ధ్యానముద్రలో ఉన్న జినుడు, బుద్ధుల శీర్షాలపై ఫణీంద్రుడు పడగవిప్పి ఉన్న శిలా ప్రతిమలు లభించాయి. 

మొహంజొదారో శిథిలాల్లో అధఃకాయం నాగం, ఊర్ధ్వకాయం మానవుడుగల చిత్రాల ముద్రలు, యోగి పక్కనే పడగఎత్తి ఆడుతున్న సర్పాల ముద్రలు లభ్యమైనాయి

మహా భారతంలో మనకు అసంఖ్యాకంగా నాగుల పేర్లు కనిపిస్తాయి. 

నాగుల్ని పూజిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకం మానవుల్లో ఉంది 

నాగదోష పరిహారార్థం చాలామంది ఎన్నో పూజలు చేస్తారు. 

పాములు పంటలను అభివృద్ధి చేస్తాయనీ కొందరు నమ్ముతారు. 


గరుడ పంచమి రోజున చతురస్రాకార మండపంలో బియ్యంపోసి సర్పప్రతిమను ఉంచుతారు 

దాని పడగకింద గౌరీదేవిని పెట్టి గౌరీదేవిని, నాగదేవతను భక్తితో పూజించి నైవేద్యం సమర్పించి కథ చెప్పుకుంటారు 

గరుడ పంచమీవ్రతాన్ని 10 సంవత్సరాలు ఆచరించి ఉద్యాపన చేస్తే మంచిదంటారు 

చతుర్థినాడు ఉపవాసం చేసి పంచమినాడు పంచముఖ సర్ప ప్రతిమను పూజిస్తే మంచిదని స్కంద పురాణం చెబుతోంది. 



వినత, కద్రువ నాగపంచమి పౌరాణిక నేపథ్యం

****************************************

కశ్యపప్రజాపతి సతీమణుల్లోని వినత, కద్రువలు అక్కాచెల్లెళ్లు. 

ఉచ్చైశ్రవమనే శ్వేతవర్ణం గల అశ్వం పాలసముద్ర మథనంలో జనించింది 

కశ్యపుడి భార్యలైన కద్రువ, వినతలు సముద్ర తీరాన విహరిస్తూ దూరంనుంచి గుర్రాన్ని చూశారు. 

కద్రువ వినతతో గుర్రం తెల్లగా ఉన్నా తోకమాత్రం నల్లగా ఉందని పలికింది. 

వినత దానికి అంగీకరించక దేహమంతా తెల్లగానే ఉందని చెప్పింది. 

కద్రువ నలుపు చూపితే వినత ఆమెకు దాసి అయ్యేటట్లు, చూపలేకపోతే కద్రువే దాసి అయ్యేట్లు పందెం కుదిరింది. 

ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వద్దామని వెళ్లిపోయారు. 

కద్రువ కపటబుద్ధితో తన సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వేలాడమని కోరింది. 

అయితే నాగులు అలా పాపం చేయడం తగదని హితవు పలికాయి. 

వారు దానికి ఒప్పుకోలేదు. 

దీంతో కోపించిన ఆమె భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో నాగులు పడి జాతి అంతమవుతుందని శాపం పెడుతుంది. 

దీంతో భీతిల్లిన కర్కోటకుడనే కుమారుడు తల్లి శాపానికి వెరచి అశ్వరాజంపై వేలాడాడు. 

మర్నాడు దూరంనుంచి గుర్రం తోక నల్లగా కనిపించగానే వినత ఓటమిని అంగీకరించి కద్రువకు దాసి అయింది. 

ఆమె కుమారుడైన గరుత్మంతుడు తల్లికి శాపవిముక్తి కలిగించాడు.

నాగులపై ద్వేషంతో వినత కుమారుడు గరుత్మంతుడు నాగులను హింసించి భక్షిస్తుంటాడు. 

పాముల ప్రాణభయాన్ని తగ్గించడంకోసం వాసుకి రోజుకు ఒక్కొక్క సర్పాన్ని ఆహారంగా పంపడానికి గరుడుడితో ఒప్పందం చేసుకుంటాడు.


నాగుల పంచమి  -  జీమూతవాహనుడు

********************************

జీమూతవాహనుడు విద్యాధర యువకుడు. అతను పర్వత ప్రాంతంలో తిరుగుతూ సర్పాల మృత అవశేషాలను చూస్తాడు

ఒక రోజు ఖగరాజుకు ఆహారంగా శంఖచూడుడనే పన్నగ కుమారుడు వస్తాడు 

దయామయుడైన  జీమూతవాహనుడు తానే గరుడుడికి ఆహారమై శంఖచూడుడి ప్రాణాలు కాపాడదలచి ఎర్రటి వస్త్రం ధరించి వధ్యశిలపైకి ఎక్కుతాడు 

గరుత్మంతుడు అతణ్ని భక్షించబోయే సమయానికి జీమూతవాహనుడి తల్లిదండ్రులు, భార్య వచ్చి అతణ్ని బతికించమని అడుగుతారు  గరుత్మంతుడు తప్పు గ్రహించి అతణ్ని వదిలిపెట్టి జీమూతవాహనుడి కోరికపై ఇకముందు సర్పజాతిని హింసించనని మాట ఇచ్చిన రోజున గరుడ పంచమిగా జరుపుకొంటారు.


ఆదిశేషువు - నాగ పంచమి 

**********************

యావత్‌ భారాన్ని మోస్తున్న ఆదిశేషువును ఒకసారి ఏదైన వరం కోరుకోమంటాడు విష్ణుమూర్తి. 

ప్రతి మాసం శుక్ల పంచమి నాడు లేదా ప్రతి ఏడాది శ్రావణ శుక్ల, మార్గశిర పంచమి నాడు నాగులను అందరూ  పూజించాలని ఆదిశేషువు కోరుకున్నాడు. 

ఆ వరాన్ని విష్ణుమూర్తి ఇవ్వడంతో శ్రావణశుక్ల పంచమి పర్వదినాన్ని నాగపంచమిగా జరుపుకొంటూ నాగులకు పూజలు చేయడం సంప్రదాయంగా మారింది.


జనమే జయుడు - సర్పయాగం 

***************************

ద్వాపర యుగంలో పరిక్షిత్తు మహారాజును తక్షకుడు కాటు వేయడంతో మరణిస్తాడు. 

తండ్రి మరణానికి నాగులే కారణమన్న కోపంతో జనమజేయుడు సర్పయాగం నిర్వహిస్తాడు. 

ఈ సర్ప యాగంలో లక్షలాది సర్పాలు పడి మృతిచెందాయి. 

వాసుకి సోదరి మాతా మానసదేవి తన కుమారుడైన అస్తీకున్ని యాగప్రదేశానికి పంపడంతో అతను యాగాన్ని నిలిపివేయమని జనమేజయుడిని ప్రార్థిస్తాడు. ఆ విధముగా దీంతో సర్ప యాగం నిలిచిపోతుంది. 

శ్రావణ శుక్ల పంచమి నాడు నాగజాతిని సంరక్షించిన దినం కావడంతో ఆ రోజును నాగపంచమిగా జరుపుకొంటారు. 


గరుత్మంతుడు - నాగ పంచమి కథనం  

********************************

అక్కాచెల్లెళ్ల బిడ్డలైన గరుత్మంతునికి, నాగులకు మధ్య వున్న ఘర్షణను నివారించేందుకు విష్ణుమూర్తి ఇరువర్గాల మధ్య సంధి కుదర్చుతాడు. ఈ ఒప్పందం శ్రావణమాసం శుక్లపంచమినాడు జరిగింది. అందుకే గరుడ పంచమి అని కూడా వ్యవహరిస్తారు.