మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, నవంబర్ 2026, మంగళవారం

తప్ప్పులు తడకలుగా పంచాంగములు

అందరు ప్రముఖ జ్యోతిష్యులే ప్రముఖ సిద్ధాంతులే గురువు ఏ రాశిలో ఎప్ప్పుడు ప్రవేశించబోతున్నాడని పంచాంగములను పరిశీలించి చూడగా ఒక పంచాంగమునకు మరొక పంచాంగమునకు చాలా తేడాలున్నాయి. అందుకని ప్రతి పండగ ప్రతి పుష్కరాలు వివాదాస్పదంగా జరుగుచున్నాయి. ఏది ఏమైన కాలజ్ఞానం ప్రకారం పంచాంగములను మÖýన ఏడేసే రోజులు రానున్నాయి. 

తులరాశిగతీజీవే ధూమకేతూద్వవం భవేత్ 

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగ గురువ ఒక్కొక్కరాశిలో ఒక సం॥ ఉంటాడు. ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించినప్ప్పుడు ఒక్కొక్కనదికి పుష్కరాలు వస్తాయి. పుష్కర రాజైన గురువు తులరాశిలో ఎప్ప్పుడు ప్రవేశించబోతున్నాడని శతాబ్ది పంచాంగమును పరిశీలించి చూడగ 02.09.2017న గురువు తులరాశిలో ప్రవేశిస్తున్నాడు మరియు రెండవ సారి అనగ స్వస్తిశ్రీ సౌమ్య నామ సం॥ శ్రావణ మాస శుక్ల చవితి సోమవారం రోజున గురువు తులరాశిలో ప్రవేశించబోతున్నాడు. ఆ సం॥లో ఆకాశమున ధూమ కేతువులు పుట్టగలవు తద్వారా కొంత జన నష్టం సంభవించును. ఇది కాలజ్ఞానం ప్రకారం 2029 శ్రావణ మాసంలో జరిగి తీరవలసి వుంది.

గురువు వృశ్చిక రాశిలో ప్రవేశించితే అధిక ఫలంభగును

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగ గురువు వృశ్చిక రాశిలో ఎప్ప్పుడు ప్రవేశించబోతుతున్నాడని శతాబ్ది పంచాంగమును పరిశీలించి చూడగా 01.10.2018న అనగ స్వస్తిశ్రీ విళంచి నామ సం॥ భాద్రపదమాస బహుళ సప్తమి సోమవారము గురువు వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడు మరియు 10.09.2030 అనగ స్వస్తిశ్రీ సాధారణ నామ సం॥ భాద్రపదమాస శుక్ల చతుర్దశి మంగళవారం రోజున గురువు వృశ్చికరాశిలలో మరల ప్రవేశిస్తున్నాడు. ఈ సం॥లలో భీమ నదికి  పుష్కరాలు వచ్చును మరియు మంచి వర్షములు కురియుటవలన పంటలు అధికంగా పండటము వల్ల అందరు సుఖ సంతోషాలతో నుండగలరు. ఇది కాలజ్ఞానం ప్రకారం 2018లోను మరియు 2030లోను జరిగి తీరవలసి వుంది.


గురువు ధనుస్సు రాశిలో ప్రవేశమైతేను వీరధర్మరాజుల వారు పుణ్యాత్ములను రక్షించును.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానలో చెప్పిన ప్రకారంగా శతాబ్ది పంచాంగమును పరిశీలించి చూడగా గురువు ధనుస్సు రాశిలో 25.10.2019న  అనగా స్వస్తిశ్రీ వికారి నామ సం॥ర అశ్వయిజ మాస బహుళ ద్వాదశి శుక్ర వారము రోజున గురువు ధనుస్సు రాశిలో ప్రవేశించబోతున్నాడు. మరల 12 సం॥ల తర్వాత అనగా 30.09.2031న అనగా స్వస్తిశ్రీ విరోదికృత నామ సం॥ నిజ భాద్రపద మాసం శుద్ద పౌర్ణమి మంగళవారము రోజున గురువు మరల ధనుస్సురాశిలో ప్రవేశించబోతున్నాడు. ఆ సం॥ పుష్కర వాహిని నదికి పుష్కరాలు వచ్చును. అప్ప్పుడు దుర్మార్గులను సంహరించును ఇది కాలజ్ఞానం ప్రకారం 2031లో జరగవలసివుంది. 


గురువు మకర రాశిలో ప్రవేశమైతేను

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా శతాబ్ది పంచాంగమును పరిశీలించి చూడగ గురువు మకర రాశిలో 08.11.2020లో ప్రవేశించబోతున్నాడు. మరల 12 సం॥ల తర్వాత అనగా 2032 స్వస్తిశ్రీ పరదావి నామ సం॥ర భాద్రపద మాస బహుళ చతుర్దశి ఆదివారము రోజున తుంగభద్రానదికి పుష్కరాలు వచ్చును. ఆ సం॥లో వీర ధర్మరాజుల వారు అన్ని విధాలా శక్తి వంతులైన సైన్యాలతో పినాకినీ నదీ తీరానికి జేరి శ్రీశైలానికి విచ్చేయుచున్నారు. ఇది కాలజ్ఞానం ప్రకారము 2032లో జరిగితీరవలసి వుంది.


గురువు కుంభరాశిలో ప్రవేశమైతేను

కలియుగ ప్రత్యక్ష్య దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా శతాబ్ది పంచాంగమును పరిశీలించి చూడగ గురువు కుంభరాశిలో 02.11.2021లోను మరల 12సం॥ల తర్వాత 09.03.2033లో అనగా స్వస్తిశ్రీ పరదావి నామ సం॥ర పాల్గుణ మాస శుద్ద నవమి బుదవారం రోజున గురువు కుంభరాశిలో ప్రవేశించు చున్నాడు. ఆ సం॥ సిందునదికి పుష్కరాలు వచ్చును. ఈ కారణంగా భూమిని దివ్యమైన శుభం కల్గుతుంది. మరియు శ్రీశైల పర్వతము మల్లిఖార్జునస్వామి వాక్యము చేతను వీర ధర్మజుల వారు కేదార రామేశ్వర పర్వంత ఏక చక్రముగా రాజ్యమేలును. ఇది కాలజ్ఞానం ప్రకారము 2033లో జరిగి తీరవలసి వుంది.


గురువు మీన రాశిలో ప్రవేశమైతేను

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా గురువు మీనరాశిలో ఎప్ప్పుడు ప్రవేశించ బోతున్నాడని శతాబ్ది పంచాంగమును పరిశీలించి చూడగ తేది 06.04.2022 లోను మరల 12సం॥ల తర్వాత 21.03.2034లోను స్వస్తిశ్రీ ఆనంద సం॥ర చైత్రమాస శుద్ద పాడ్యమి మంగళవారము ఉగాది పర్వదినము న గురువు మీనరాశిలో ప్రవేశించబోతున్నాడు. అప్ప్పుడు ప్రణితానదికి పుష్కరములు వచ్చును. ఆ సం॥ కీర్తివంతులైన రామధర్మజుల వారి పట్టాభిషేకం కుర్వంతి దేవ బ్రాహ్మణోత్తములు చేయుదురు. ఇది కాలజ్ఞానం ప్రకారం 2034లో జరిగి తీరవలసి వుంది.


గురువు ఒక్కోక్కరాశిలో ప్రవేశించినప్ప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వచ్చును. ఏ రాశిలో ప్రవేశించినప్ప్పుడు ఏ నదికి పుష్కరాలు వచ్చునో రాశి చక్రంలో చూడవచ్చును.


మీనరాశిగతే మందే మ్లేచ్ఛానాం నాశనం భవేత్

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా నవగ్రహాలలో ఒక్కటైన శనిగ్రహం ఒక్కొక్కరాశిలో 21/2 సం॥లు చొప్ప్పున 12 రాశులును చుట్టి రావడానికి 30సం॥లు సమయం పడుతుంది. ప్రస్తుతం అనగా 2016లో శని వృశ్చికరాశిలో వున్నాడు. ఈ రాశినుండి మీనరాశిలో ఎప్ప్పుడు ప్రవేశించ బోతున్నాడని శతాబ్ది పంచాంగమును పరిశీలించి చూడగా స్వస్తిశ్రీ విశ్వావసు నామ సం॥ర పుష్యమాస బహుళ అష్టమి ఆదివారము రోజున తేది 11.01.2026లో శని మీన రాశిలో ప్రవేశించబోతున్నాడు. ఆ సం॥ మ్లేచ్ఛ నాశనము అయ్యేను. మ్లేచ్ఛులు అనగా హీన జాతీ వారు నశిస్తారు. ఇది కాలజ్ఞానం ప్రకారం 2026లో జరిగి తీరవలసి వుంది.


మేషరాశిలో శని ప్రవేశమైతేను`మేలుకొందరికి అయ్యేను. దోషకారులెల్ల ధూళయ్యి పోయేరు. ధూమకేతువు బుట్టేను.

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం శతాబ్ది పంచాంగమును పరిశీలించి చూడగా స్వస్తిశ్రీ ప్లవంగ నామ సం॥ర పాల్గుణ మాస శుద్ద పౌర్ణమి శనివారం రోజున తేది 11.03.2028న శనిమేషరాశిలో ప్రవేశించబోతున్నాడు. కావున దైవభక్తులైన పుణ్యాత్ములకు మంచి జరుగుతుంది. దుర్మార్గులైన వారు నశిస్తారు. మరియు ఆకాశమున ధూమ కేతువలు అందున కొందరు నశించడము వల్ల ప్రపంచమునకు కొంత శాంతి ఏర్పడుతుంది. కాలజ్ఞానం ప్రకారం 2028లో జన నష్టం సంభవించగలదు.


వృషభరాశి గతేమందే ఈశాన్య విషవాయవ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా వృషభరాశి యందు శని స్వస్తివ్రీ సాధారణ నామ సం॥ చైత్ర బహుళసప్తమి బుదవారం తేది 24.04.2030న ప్రవేశించబోతునన్నాడు. కావున ఈశాన్య మÖల విషగాలి పుట్టడం వల్ల విపరీతజనులను యమలోకానికి తీసుకొని పోవును. ఇదికాలజ్ఞానం ప్రకారం 2030లో జరిగి తీరవలసివుంది.


శనౌస్థిఏ జుగ్మరాశౌ భవేత్ భూభార నాశనమ్

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం పంచాంగమును పరిశీలించి చూడగ శనేశ్వరుడు మీదన రాశియందు స్వస్తిశ్రీ పరధావ నామ సం॥ర వైశాఖ మాస బహుళ షష్టి ఆదివారం రోజున తేది 30.05.2032 ప్రవేశించగానే అధిక జననష్టం సంభవించగలదు. ఇది కాలజ్ఞానంలో చెప్పిన ప్రకారంగా 2032లో జరిగి తీరవలసి వుంది.  


ఆనందాత్సరే సూతాదూతనాట్యసమాగత:

వసుధాకీర్లైకృపణై: భేతాళస్య తదాగత:

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి మఠము నందున్న తాళపత్ర గ్రంథము మాతృక ఏకదశాశ్వాసము. 88వ పేజీ చివరలో చెప్పినట్లుగా ఆనంద సంవత్సరం పుట్టగానే అనగా స్వస్తిశ్రీ ఆనంద సం॥ర చైత్రమాస శుక్ల పాడ్యమి మంగళవారం ఉగాది పర్వదినము మొదలుకొని అనగా 21.03.2034 నుండి యమదూతలు నాట్యమాడుదురు. భేతాళ చేత ప్రజలు నాశనమగుదురు. ఇది బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం 2034లో జరిగితీరవలdసి వుంది. 


బాగుగా ఆనంద సంవత్సరమున నాగుమల్లె రీతిగా నరులంతా చచ్చేటి యోగంబు మందికి వచ్చేను.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన గోవింద 14లో  చెప్పినట్లుగా ఆనంద సం॥ అనగా 2034లో నాగు మల్లె రీతిగా నరులంతా చచ్చేరు అని చెప్పియున్నారు. భూలోకంలో ఇప్ప్పుడు పాపం మÖడు పాళ్ళున్న పుణ్యం ఒక పాలున్న నడుస్తూ ఉన్నది. దుష్టులదికమై ధనమదముచే గర్వాభిమానులై పెద్ద తనము తెలియక నీతి దప్పి దుర్నీతులై వావివరుసలు లేక గర్వించి యున్నందున వాండ్లను శిక్షించడానికై దుష్టశిక్షణ శిష్ట రక్షణార్థమై కల్కి అవతారమైన వీరభోగవసంతరాయులు అవతరించి యున్నారు. ప్రస్తుత జనాభా 740 కోట్లు. రాబోవుకాలంలో జనాభా పెరిగే అవకాశాలు చాý తక్కువగా వున్నందున 800 కోట్లకు మించి అవకాశాలు లేనందున, 800 కోట్లలో మÖడుపాళ్ళు దుష్టులు అనగా సుమారు 600 కోట్లమంది 2034లో జరిగే కలియుగాంతం నాటికి నాగుమల్లె రీతిగా నరులంతా నశించిపోతారు. కాలజ్ఞానం ప్రకారం 2035 ఉగాది నాటికి ప్రపంచ జనాభా 200 కోట్లకు మించి వుండదని అర్ధమగుచున్నది. ఇది కాలజ్ఞానం ప్రకారం 2034లో జరిగి తీరవలసివుంది.


ఆనంద సం॥ర పాల్గుణ బహుళసప్తమి శుక్రవారాన మాకున్నూ మీకున్నూ ధర్శనమయ్యేను

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా స్వామివారు ఆనంద సం॥లో జరిగే విపత్తులను అనేక పర్యాయాలు పదే పదే చెప్పడం జరిగింది. స్వస్తిశ్రీ ఆనంద సం॥ర పాల్గుణ బహుళ సప్తమి శుక్రమవారమున మాకున్ను మీకున్న దర్శనమయ్యేను అని చెప్పియున్నారు. కల్కి అవతారమైన వీరబోగ వసంతరాయల వారి దర్శనము ప్రపంచవ్యాప్తంగా యున్న దైవభక్తులైన పుణ్యాత్ములందరి ఆనంద సం॥ర పాల్గుణ బహుళ సప్తమి శుక్రవారము రోజున అనగా తేది 31.03.2035న స్వామి వారి దర్శనము కల్గుతుంది. ఇది కాలజ్ఞానం ప్రకారం జరిగి తీరవలసి వుంది.


నల సంవత్సర అషాడ శుద్ద పౌర్ణమి ధర్మకృత యుగమే అది! ఆ“అదే సాంద్రసిందు వేదాన”కు మొదలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగా స్వస్తిశ్రీ నల సంవత్సర అషాడ శుద్ద పౌర్ణమి రోజున అనగా తేది 08.07.02036 నుండి కృతయుగ ధర్మము ప్రారంభమవుతుంdది. ఈ విధంగా ధర్మ సంస్థాపన గావించి 108 సం॥లు పాలించును. అప్ప్పుడు నెలకు మÖడు వర్షాలు కురియను, పంటలు సమృద్దిగా పండును ప్రజలందరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యములు కలిగియుందురు. అనగా ప్రజల పాలన నశించి దైవపాలన నడుస్తుందని అర్ధం తదుపరి వారి వంశం 1000 ఏండ్లు పాలించెదరు, ఇది కాలజ్ఞానం ప్రకారం జరగ వలసి వుంది.


వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన మహిమ....


నా కాలజ్ఞానంబు పఠియించు స్థలమున 

సప్త ఋషులును సకలదేవతలు వసియించు

నా కాలజ్ఞానంబు భక్తితో విను ప్రజలు

సకల తీర్ధస్నాన పుణ్యంబు పొందేరు.

నా కాలజ్ఞానంబు చెప్పించు ఘనులకు 

సుఖ: సౌఖ్యముల నిచ్చి స్వయంగా నే బ్రోతు

నా కాలజ్ఞానంబును ప్రచారం చేసిన వారికి

అన్నదానము కన్న మిన్న యజ్ఞ ఫలితము గల్గును.

నా కాలజ్ఞానంబు వేదవాక్కని దలిచి

నమ్ముకున్న వారి కర్మములు విడిపోవు.

నా కాలజ్ఞానంబు నమి పూజించు వారికి

ముంజేతి కంకణంబు రీతిగా నుండును.

నా కాలజ్ఞానంబును నమ్ముకున్న వారు 

ధనికులై లక్ష్మీ భోగములు గలిగి యుందురు.

నా మఠంబు దర్శింప జన్మజన్మల సకల పాపంబు లెల్ల

తొలగిపోయి క్రొత్త జీవనంబు పొందేరు.

నన్ను నమ్మని వారు నల్లులై పోతారు

తప్పదిదిగో గురు వాక్కు తెలియండయ.

కన్న బిడ్డలనైన అమ్మోరు కఠినముగా కాలం గడిపేరు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా తనయుడు పుట్టాలని తపస్సులు చేసే తల్లులున్నారు. పుత్రునికోసం పుత్రకామేష్టి యాగం చేసిన వాళ్ళున్నారు. అయితే ఓ తల్లి తన 8 నెలల కొడుకును లక్ష రూ॥కు అమ్మేసింది. ఆడపిల్ల లంటే వివక్ష ఇంకా కొనసాగుతోంది. పేదరికంతో పోషించలేమంటూ తల్లిదండ్రులు అమ్మకానికి పెట్టిన సంఘటనలు ఒకే రోజు మÖడు వెలులోకి వచ్చాయి. రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ఎత్తుకాల్వ తండాకు చెందిన శంకర్ గౌరమ్మ, ఇదే మండలం దాస్యానాయక్ తండాకు మగ్యసీత దంపతులు తమకు ఆడపిల్ల  పుట్టిందని అమ్మకానికి పెట్టారు. నల్గొండ జిల్లా డిండి మండలం రాస్యతండాలోనూ బిచ్యానాయక్ భారతి దంపతులు తమ 22 రోజుల బిడ్డను హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులకు విక్రయించారు. అప్ప్పు తీర్చే మార్గం కానరాక ఓ తండ్రి కన్నబిడ్డనే అమ్మేశాడు. ఆడశిశివును ఖరీదు చేస్తూ పోలీసులకు చిక్కిన సంఘటన రంగారెడ్డి జిల్లా మాల్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళ తన 5 నెలల కొడుకును తన భర్తే అమ్మేశాడంటు మహిళదినోత్సవం రోజున పోలీసులను ఆశ్రయించింది. ఈ విధంగా కాలజ్ఞానం ప్రకారం కన్నతల్లిదండ్రులే తమ బిడ్డలను అమ్ముచున్నారు.


కన్నబిడ్డలను కూడా కామించకోరేటి అధములే యిలలోన పుడతారు.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగ కళ్ళలో పెట్టుకొని చూసుకోవాల్సిన కన్న తండ్రి కర్కోటకుడై తన బిడ్డ జీవితాన్ని చిదిమే వేయడమే కాకుండా తనకు పరిచయమున్న వారికి అప్పగించి వారు అత్యచారాలు చేస్తుంటే ప్రక్కనే ఉండి చూస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవించిన ఒ ఆప్టేలియన్ కామాందుడికి కోర్టు 221/2 ఏళ్ళ కఠిన కారగార శిక్ష విధించింది. 2013 నుంచి 2015 మధ్య తన 11 సం॥ల కుమార్తెపై వద్దునాన్న అని వేడుకున్నా వినకుండ జరిపిన దారుణాలకు సంబంధించి 61 కేసులునమోదుకాగా వాటన్నింటిని నిందితుడు అంగీకరించాడని న్యాయవాది వెల్లడించారు. ఇంకొక సంఘటనలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కూతిరిపైనే కన్నేశాడు ఓ కామాంధుడు. తండ్రీ కూతుళ్ళ బంధాన్ని పక్కన పెట్టి ఆరేళ్ళుగా అత్యాచారం చేశాడు. విషయం బయటికి చెప్పితే చంపేస్తానని బెదిరించి మరీ లొంగ దీసుకున్నాడు. భార్య ఇంట్లో ఉండగానే కూతిరిపై అత్యాచారయత్నం చేస్తూ దొరికిపోయాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. మరో సంఘటనలో వావివరసలు మరిచి కన్న కూతిరిపై పలుమార్లు అత్యాచారం చేసిన నేరస్తుడికి న్యాయస్థానం పదేళ్ళ కఠిన కారాగారశిక్ష, రూ॥ వేయి జరిమాన విదించింది. కన్న కూతురుపైఏ అత్యచార యత్నానికి పాల్పడిన ఓ కామాందుడి ఉదంతం ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిదిలో జరిగింది. ఈ విధంగా కన్న తల్లిదండ్రులే తమ పిల్లల్ని అమ్ముచున్నట్లు నిత్యం పేపర్లో చదువుచున్నాము, టీవీల్లో చూస్తున్నాము. ఇది కాలజ్ఞానమహిమే, 17వ శతాబ్దంలో చెప్పినదే.

జపాసనాది వివరములు - నియమాలు

శ్లో॥ శుక్లం సర్వత్ర వైపోక్తం వశ్యే రక్తాసనం ప్రియే 

పద్మాసనే జపే నిత్య శాంతివశ్మం కరం పరం ॥

వస్త్రాగునేచే దారిద్య్రం పాషాణ రోగ సంభవ:

మదిన్యాం దు:ఖ మాస్నాతి కాష్టేభవతి నిష్పలమ్ ॥

కృష్ణాజినే జ్ఞాన సిద్ది ర్మోక్షశ్రిర్వా: ఘ్ర భరణి

కుశాసనే జ్ఞానసిద్ది: సర్వసిద్దిస్తు కంబళే ॥

జమము చేయునప్ప్పుడు తెల్లని ఆసనంబు ఉపయోగించిన శ్రేష్టమగును. అటులనే ఉపయోగించబడిన ఆసనము యేరుపైన జనవశీకరణంబగును. పద్మాసనంబునడిన క్రమేణా శాంతివృద్ధి పొందును. వస్తానంబున దాదిద్య్రం, శవాసనంబున వ్యాది, నేలపై కూర్చుండిన దు:ఖములు, కొయ్యపీఠలయిన ఫలితం లేకపోవుటయు సంభవించును. లేడి చర్మముపై కూర్చుండి జపం చేసిననను, దర్భాసముపై గూర్చున్నను జ్ఞాన సిద్ధియగును. పులిచర్మంపై కూర్చుండి జపం చేసినను ముక్తి ప్రాప్తించును. కంబళిపై నాసీనులై సర్వసిద్ధి కలుగును. మరియు ఎరర్రని కంబళి అయిన జపవశ్యమును, తెల్లని కంబళి యైన సంపదలు సిద్ధించును. గడ్డిపై కూర్చుండిన కీర్తిభంగము, చిగురు టాకులపై జపమాచరించిన చిత్త భ్రమలునగును.

జపమాల యొక్క ఫలితము

జపము చేయువారు పగడపు మాలగాని, ముత్యముల మాలగాని, స్పటికంబుల మాలగాని, ఉపయోగించిన కోటిఫలములు కల్గును. తులసిమాలగాని, మణిమాలనుగాని నుపయోగించిన అధిక ఫలము కల్గును. రుద్రాక్షమాలనుపయోగించుట మిక్కిలి శుభం. జపమాలయందు 108 పూసలుగాని, 54గాని, 27 వున్నను మంచిదియే. నూట ఎనిమిది సంఖ్యకు తక్కువ చేసిన యెడల జపం ఫలప్రదం కాదు. జపమాల యందు 108 పూసలు లేక 54 ఉన్న మాలను రెండు సార్లు, 27 వున్న నాలుగు సార్లు త్రిప్పి 108 పూర్తి చేయవలయును.

ఎటువైపు కూర్చుండి జపం చేయ్యాలి

తూర్పు ముఖముగా కూర్చుండి జపము చేయువారికి కోరికలు సిద్ధించును. దక్షిణాభిముఖంగా జపం చేయువారికి ఇతరుల మీద దుష్ప్రయోగంబులు చేయుటయందు ప్రతిభ గల్గును. ఉత్తర దిక్కుగా జపమాచరించిన వారికి జన్మ రాహిత్యంబగును.

జపం చేయునప్ప్పుడు జపమాలను బొటన వ్రేలుగాక మిగిలిన నాలుగు వ్రేళ్ళ మీద దేని మీదనైననుంచి బొటన వ్రేలితో ఒక్కొక్క పూసను మంత్రోచ్ఛారణ చేయుచు ముందుకు ముందుకు జరుపుచు నూట ఎనిమిది పూర్తి చేయవలయును. అనామిక మనగా బొటన వ్రేలుకు పక్కగ నున్న చూపుడు వ్రేలు మీద జపమాల నుంచి బొటన వ్రేలితో పూసలను జరుపుచుండిన మంచి కార్యములు సిద్ధించును. మధ్యమ వ్రేలిమీద జపమాల నుంచి బొటన వ్రేలితో పూసలను జరుపుచుండిన యెడల ఆకర్షణ సిద్ధి చేకూరును. ఉంగరపు వ్రేలు మీద జపమాల నుంచి బొటన వ్రేలుతో పూసలను జరుపిన యెడల వాగ్ధాటికల్గును. చివరి వ్రేలుపై నుంచి చేసిన యెడల కర్మఫలములు హరించుననియు చెప్పబడి యునది.  

జమము చేయునప్ప్పుడు తెల్లని ఆసనంబు ఉపయోగించిన శ్రేష్టమగును. అటులనే ఉపయోగించబడిన ఆసనము యేరుపైన జనవశీకరణంబగును. పద్మాసనంబునడిన క్రమేణా శాంతివృద్ధి పొందును. వస్తానంబున దాదిద్య్రం, శవాసనంబున వ్యాది, నేలపై కూర్చుండిన దు:ఖములు, కొయ్యపీఠలయిన ఫలితం లేకపోవుటయు సంభవించును. లేడి చర్మముపై కూర్చుండి జపం చేసిననను, దర్భాసముపై గూర్చున్నను జ్ఞాన సిద్ధియగును. పులిచర్మంపై కూర్చుండి జపం చేసినను ముక్తి ప్రాప్తించును. కంబళిపై నాసీనులై సర్వసిద్ధి కలుగును. మరియు ఎరర్రని కంబళి అయిన జపవశ్యమును, తెల్లని కంబళి యైన సంపదలు సిద్ధించును. గడ్డిపై కూర్చుండిన కీర్తిభంగము, చిగురు టాకులపై జపమాచరించిన చిత్త భ్రమలునగును.

జపమాల యొక్క ఫలితము

జపము చేయువారు పగడపు మాలగాని, ముత్యముల మాలగాని, స్పటికంబుల మాలగాని, ఉపయోగించిన కోటిఫలములు కల్గును. తులసిమాలగాని, మణిమాలనుగాని నుపయోగించిన అధిక ఫలము కల్గును. రుద్రాక్షమాలనుపయోగించుట మిక్కిలి శుభం. జపమాలయందు 108 పూసలుగాని, 54గాని, 27 వున్నను మంచిదియే. నూట ఎనిమిది సంఖ్యకు తక్కువ చేసిన యెడల జపం ఫలప్రదం కాదు. జపమాల యందు 108 పూసలు లేక 54 ఉన్న మాలను రెండు సార్లు, 27 వున్న నాలుగు సార్లు త్రిప్పి 108 పూర్తి చేయవలయును.

ఎటువైపు కూర్చుండి జపం చేయ్యాలి

తూర్పు ముఖముగా కూర్చుండి జపము చేయువారికి కోరికలు సిద్ధించును. దక్షిణాభిముఖంగా జపం చేయువారికి ఇతరుల మీద దుష్ప్రయోగంబులు చేయుటయందు ప్రతిభ గల్గును. ఉత్తర దిక్కుగా జపమాచరించిన వారికి జన్మ రాహిత్యంబగును.

జపం చేయునప్ప్పుడు జపమాలను బొటన వ్రేలుగాక మిగిలిన నాలుగు వ్రేళ్ళ మీద దేని మీదనైననుంచి బొటన వ్రేలితో ఒక్కొక్క పూసను మంత్రోచ్ఛారణ చేయుచు ముందుకు ముందుకు జరుపుచు నూట ఎనిమిది పూర్తి చేయవలయును. అనామిక మనగా బొటన వ్రేలుకు పక్కగ నున్న చూపుడు వ్రేలు మీద జపమాల నుంచి బొటన వ్రేలితో పూసలను జరుపుచుండిన మంచి కార్యములు సిద్ధించును. మధ్యమ వ్రేలిమీద జపమాల నుంచి బొటన వ్రేలితో పూసలను జరుపుచుండిన యెడల ఆకర్షణ సిద్ధి చేకూరును. ఉంగరపు వ్రేలు మీద జపమాల నుంచి బొటన వ్రేలుతో పూసలను జరుపిన యెడల వాగ్ధాటికల్గును. చివరి వ్రేలుపై నుంచి చేసిన యెడల కర్మఫలములు హరించుననియు చెప్పబడి యునది.  

జపం ఆగ్నేయ ముఖంగా చేసిన శత్రువులకు బాధయు వాయువ్యముఖంగా జపం చేసిన శత్రు వినాశనంబును, నైరుతీ ముఖంగా జపం చేసిన దేవతా ధర్శనంబును, ఈశాన్య ముఖంగా జపం చేసిన బ్రహ్మజ్ఞానంబును, ఉత్తరాభిముఖంగా చేయుజపం వలన శాంత చిత్తమును పశ్చిమాభిముఖంగా చేయుజపం వలన ధన ప్రాప్తియు, దక్షిణాభిముఖంగా చేయు జపం వలన శత్రు హరణమును కల్గును.

సముద్రతీరం`నదీతీరం`పుణ్యభూమి`శివకేశవాలయాలు`శక్తిదేవాలయం`జ్ఞానులు మొదలైన మహనీయుల నివాసన స్థానాలు` మునీద్రులుండు మఠాలు`మర్రి చెట్టు మొదట`ఉసరి చెట్టు మొదట` బృందావనం నిర్మ ప్రదేశాలందు జపమాచరింప వలయును అట్టి వారు సంకల్ప సిద్దులయ్యెదరు.

జపం ప్రక్కవారికి వినిపించరాదు. పెద్దలు దానిని జపమనక వాచక మందురు. శబ్ధము వినిపించక పెదవుల నాడించు చేయుజపమైనను శ్రేష్టంకాదు. అది “ఉపాంశు” అనబడును. బయటకు వినిపడకయు పెదవులను గదిలింపకయు అంత:కరణమున చేయు జపము “మానసిక” మనంబడును. మొదటి వాచకమునకు అధమమని పూరు. దీని ఫలితం కన్న “ఉపాంశు జపయునకు వెయ్యిరెట్లు ఫలమదికమైన మానసిక జపం మీVAత్తమంబనియు చెప్పబడినది.


 


వీర బ్రహ్మేంద్రస్వాముల ద్వాదశ సూక్తులు

1. నా భక్తులకు యే ప్రళయములు అంటవు.

2. అస్మద్దివ్యనామ పఠనాపరులై ఆనందన యుండరు.

3. పోతులూరు వారి భక్తులు జ్యోతిస్వరూపులై యుండేరు.

4. మమ్ములను దూషించినందులకైనా సహించేము. మా భక్తులను దూషించిన సహింపము.

5. నన్ను పూజించి నా కాలజ్ఞానమును పారాయణము చేసిన వారికి ఒక పుష్పమిచ్చిన జోడు పుష్పములగును.

6. నిజ భక్త హృదయంతరాళమందు నిలిచేము.

7. పుణ్య పురుషులను గురుని చెంతకు చేర్చేము.

8. ధర్మము చేసినవారు ఒకరిని దూషించనివారు, ఒకరి సొమ్ముకు ఆశపడనివారు నాకత్యంత ప్రీతి పాత్రుల.

9. తోడే కొలది బావిలోని నీరు, దానధర్మాలు చేసే కొలదీ సంపదలు వృద్ది చెందుతుంటాయి.

10.  నీ గత జన్మకర్మలే నిన్ను వేదిస్తుంటాయి. నన్నాశ్రయిస్తే అవి మెల్లగా వెనుదిరుగుతాయి.

11. నీ మనస్సును నావైపు మరలిస్తే జ్ఞాన ప్రదమౌతుంది. లేకుంటే అది అజ్ఞానం పాలవుతుంది.

12. నన్నాశ్రయించిన వారి సకల బాధ్యతలను నేనే నిర్వహింతును.

శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వాముల వారి మఠంలో ప్రతి సం॥ జరిగే ముఖ్యమైన ఉత్సవాలు

1. శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి - వైశాఖ శుద్ద దశమి

సజీవ సమాది నిష్ట వహించిన పవిత్రమైన రోజు ఆరాదనోత్సవం

2. రదోత్సవము -వైశాఖశుద్ద ఏకాదశి

3. మహాప్రసాదవినియోగం - వైశాఖశుద్ద ద్వాదశి

4. శ్రీవీర బ్రహ్మేంద్రసాములవారి కళ్యాణ మీVAత్సవము - మాఘ బహుళ త్రయోదశి

5. శ్రీ గోవిందామాంబ ఆరాధనోత్సవము -  పాల్గుణ బహుళ దశమి

6. ఈశ్వరమ్మ ఆరాధన - మార్గశిర బహుళనవమి

7. మఠాదిపతులు శ్రీశ్రీశ్రీ శ్రీనివాస స్వాముల వారి ఆరాధన - ఆషాడబహుళ పాడ్యమి

8. మఠాదిపతులు శ్రీశ్రీశ్రీ వీరభోగవసంత వేంకటేశ్వరస్వాముల వారి ఆరాధన - బాద్రపద శుద్ద ఏకాదశి

రుద్రాక్షలను ధరించేవారు ఏ నియమాలు పాటించాలి #rudraksha #rules #astrology #jyothisham #hindu


 

2, నవంబర్ 2026, సోమవారం

స్వస్వరూపసంధానం


అద్వైతంలోను, సాంఖ్యంలోను ఈ స్వస్వరూప సంధాన ప్రసక్తి కనిపిస్తుంది. స్వస్వరూప సంధానం అంటే తాను చతుర్వింశతి తత్వాత్మకమైన దేహమా ! దానికంటె వేరైన జీవుడా ! గీత పరిభాషలో క్షేత్రమా! క్షేత్రజ్ఞుడా! అనే విషయం తేల్చుకొని దానిని పరబ్రహ్మతో ఐక్యపరచుకోవటమని తాత్పర్యం. ముముక్షువులకు ఇందుకు నేతినేతి వాక్యవిచారం చక్కగా ఉపకరిస్తుంది. అయితే అదేగాక జీవితదశలను తాను లౌకికపద్దతిలో పరిశీలించి చూచుకున్నప్పటికి ముక్తి మార్గానికి అవకాశం ఉంది. అది యేలాగో పరిశీలించండి! 

పరబ్రహ్మము ఆనందస్వరూపం గనుక తదంశమైన జీవుడుగూడ ఆ స్వరూపమే యనక తప్పదు. అలా గాకుంటే అతనికి తల్లిదండ్రి యొక్క ఆనందావస్థలోనే దేహం లభించటం, జన్మించిన పిమ్మటగూడ అతడీ లోకానందానికో లేక పరలోకానందానికో ప్రయత్నం చేయటం సంభవించదు. 

జీవుడు మాతృగర్భంలో ఉన్నంతకాలం అతనిని మావి అనే పొరరక్షిస్తుంది, అతడు పూర్ణుడైనపిమ్మట ఆ జరాయువును భేదించుకొని మాతృకుక్షినుండి బయటపడుతాడు. అనంతరం తనను నవమాసాలు రక్షించిన అది నిష్ఫలమై పడిపోతుంది. 

జ్ఞానపరిపూర్ణుడైన మానవుని ముక్తావస్థగూడ సరిగా ఈ జననంలాగే ఉంటుంది. ప్రపంచంలో ఉన్నంతసేపు అతనిని అజ్ఞానమనే పొర ఆవరించి ఉంటుంది. దాన్నే మనం “మాయ” అంటున్నాం. దానినుండియే అతనికి వాస్తవజ్ఞానం కలుగవలసి ఉంది. అది కలిగి పూర్ణత్వం సిద్ధించినపిమ్మట అంతవరకు తనను రక్షించిన మాయ యిక వ్యరమై పోతుంది. జ్ఞాని పూర్ణావస్థలో యిక దానినుండి వేరు కావలసి ఉంది. ఇక్కడ శిశువును నాభినాళచ్చేదంచేసి మావినుండి పూర్తిగా వేరుచేసేసూతిక వలె తనను ఎఱుక విడిపించి వేరుచేసె కారణగురువు అవసరం. అపుడతడు జీవన్ముకుడౌతాడు. దానినే విదేహకైవల్యం అనిగూడా అంటాము. ఆదశలో అతనికి శరీరభ్రాంతి పూర్తిగా తొలగి మాయావరణాన్ని భేదించుకొని బయటబడి పరమహంసవుతాడు. 

భాగవత తృతీయస్కంధంలో సృష్టివిషయం చెబుతు బ్రహ్మాండానికి ప్రథమావరణం పృథివియని దానిపై సలిల తేజస్సమీరగగనాహం కార మహత్వాలు ఒక దానికొకటి దశగుణావరణాలై ఉంటవని, బ్రహ్మాండంలో పంచతన్మాత్రలు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఏకీకరణ సామర్థ్యం లేక పడిఉండి ఆ అండం ప్రళయ జలరాశిలో తేలుతూ వేయి సంవత్సరాలుండగా విష్ణువు దానిలో జీవరూపుడై ప్రవేశించి వానినన్నింటి నేకంచేసికొని వై రాజపురుషుడై అది భేదించుకొని బయటికివచ్చెనని అపుడతని యింద్రియాలచేత యింద్రియాభిమాన దేవతలు పుట్టిరని చెప్పబడింది. అంతేగాక అది “అమ్మహాత్మునికి పాదమÖలంబు పాతాళంబు, నాభీ వివరంబు నభస్థలంబు, భూలోకంబు కటి ప్రదేశంబు, మేఘజాలంబులు హృషీకేశుని కేశంబులు” అని వర్ణించింది. ఈ విశ్వరూప దర్శనం యిపుడు కావ్యజగత్తులో యథాతథంగా నిలిచి ఉంది. పాదాలకు మాత్రం పాతాళానికి బదులు అక్కడ ఉండే కూర్మరాజు పాదాలు, నాభీ వివరానికి బదులు అది వుండే అవలగ్నాన్ని గ్రహించినారు. 

మన పురాణాల ప్రకారం మహాభూమి వేరు, మనముండే భూమి వేరు. ఇది భువర్లోకంలో నక్షత్రాలలో ఒక గోళంగా ఉంది. ఆలోకం విరాట్పురుషునికి హృదయస్థానం, జీవుల హృదయస్థానం ఈశ్వరనివాసం, అందుచేతనే కాబోలు ఈ భూమిపైననే అతడెక్కువగా అవతరిస్తాడు. దీనిపైన సువర్లోకం ఉంది. అక్కడ దేవతలుంటారు. అందుచేత మన గాయత్రీ వ్యాహృతులలో “ఓం భూర్భువస్సువః” అనే ముల్లోకాల స్మరణ తప్పనిసరి అయింది. 

ఈ బ్రహ్మాండ కటాహంపంచాశత్కోటి యోజన విస్తీర్ణమని భాగవతం చెబుతుంది. ఇది ఎంత పెద్దదో మనమÖహించలేం, కాబట్టి యిక దీనిపై గల ఆవరణలను గుఱించి అడుగ నవసరం లేదు. ఈ ఆవరణ లొక్క బ్రహ్మాండానికే గాదు దానిలోని గోళాలన్నిటికి సామాన్యమే నేమో అనిపిస్తుంది. అది మనకు క్షుణ్ణంగా తెలియకున్నా ప్రతిగోళానికి కొంత వాతావరణ పరిధి ఉన్నట్లు శాస్త్రజ్ఞులభిప్రాయపడుతున్నారు. 

ఇపుడు మనభూమిచుట్టు మేఘమండలం ఉంది. మేఘమంటే అది నీటి పొరక్రిందనే లెక్క నీటి పొరనేగాదు దీనికి తేజోమండలం గూడ ఉందని ఈ లోకాన్ని చంద్రలోకంనుండి చూసినవారు చెప్పినారు. ఇక వాతావరణం పొర ఒకటి ఉన్నట్లు శాస్త్రజ్ఞులందరు అంగీకరించిందే కాబట్టి అదేవిధంగా శబ్దగుణకమైన అకాశావరణం గూడా ఒకటి 

ఉండవచ్చు. ఆపైన సర్వశూన్యమైన అంతరాళం, ఇట్లా ఈ స్థితి ప్రతిగోళానికి గూడ 

ఉందేమో!

ఇక భాగవతంలో చెప్పిన బ్రహ్మాండం జలమధ్యంలో తేలుతూ ఉండటాన్ని చూస్తే అది చక్కగా ఈనాటి శరీర శాస్త్రంలోని స్త్రీగర్భంలో పిండం పెరగటానికి పరిపక్వమై నిలిచి ఉన్న అండాన్ని స్ఫురింపజేస్తుంది. భాగవతంలోని బ్రహ్మాండంలో చెప్పినట్లు జీవునికి కావలసిన యింద్రియాలన్నిటికి మÖలపదార్ధం దానిలోనే ఉందేమో! పురుష దేహంనుండి జీవుడందులో ప్రవేశించిన పిమ్మట వానినన్నిటి నేకీకరణం చేసికొని వృద్ధిపొంది పూర్ణుడై ఆ అండాన్ని భేదించుకొని బయటపడుతున్నాడు. 

పైన బ్రహ్మాండానికి మనభూమికి ఉండే ఆవరణలు చూచినాము. మన దేహంగూడ వానిలోనే పెరుగుతుంది. పరిశీలిస్తే ఆ వాస్తవం పొడకట్టకపోదు. ఈ దేహమంటే ఏమిటి? జీవుని చుట్టు ఏర్పడిన పార్థివావరణమేగదా ! అది తల్లి కడుపులో ఉన్నపుడు జలావరణంలో వృద్ధి పొందింది. అది దాటిన పిమ్మట తేజోమండలంలో పెరుగుతుంది. మన దేహంనుండి నిరంతరం తేజోకిరణాలు వెలువడుతుంటవని ఇటీవల రష్యావారు ‘ఎక్స్ రే’ వంటి కెమెరాలతో ఫోటోలు తీసి నిరూపించినారు. దీన్ని మనం విజ్ఞానమయకోశంగా గూడ అన్వయించుకోవచ్చు. ఈ తరవాత ఇది వాయు మండలంలో వర్థిల్లవలసి ఉంది.

భారతీయుని జీవితం కేవలం మరణంతోనే ముగియదు, అది పంచత్వం మాత్రమే. అతనికి దేహాన్నిచ్చిన పంచభూతాలు తమతమ అంశల్లో లీనమైపోతవి, గాని వానితో దేహాన్ని ధరించిన జీవుడు మాత్రం వసురుద్రాదిత్యరూపాలు పొందుతూనే ఉంటాడు. ఆదిత్యరూపం పొందే వరకు సంతతి అతనికి పిండోదక ప్రదానాలచేత సహాయపడవలసి ఉంటుంది. ఆదిత్యలోకం చేరినపిమ్మట అక్కడినుండి జీవులు సూర్యరశ్మి ద్వారా సుషుమ్నానాడి నధిరోహించి బ్రహ్మ లోకానికి చేరుకుంటారు. కాబట్టి ఆకాశంలో వర్థిల్లటం ఆ దశల కన్వయించుకోవచ్చు. ఇవి జీవుని చుట్టుండే భూతావరణలు. 

ఇక మానవుని దశలను అవతారాలకు సమన్వయం చేసి చూపినవారున్నారు. తల్లికడుపులో ఉన్నపుడు చేప, బోరగిలబడినపుడు తాబేలు, దోగాడుతున్నపుడు వరాహం, తప్పుటడుగులతో లేస్తున్నప్పుడు నృసింహం నిటారుగా నిలిచినపుడు వామన - ఈ అవతారసమన్వయం గూడ ఈదశలోనే మానవునిలో కనిపిస్తుంది. 

బాలుడు బ్రహ్మస్వరూపం, బాలవాక్కు బ్రహ్మవాక్కు అనే జాతీయాలు మనకున్నవి. అవిఅతని బ్రాహ్మణత్వాన్ని తెలుపుతవి. శాస్త్రం బ్రాహ్మణునికి వయోభక్షణం, క్షత్రియునికి “యవాగు” అహారం విధించింది, స్తనంధయునికిమనం పాలుతప్ప మరో ఆహారమే యివ్వలేంగదా ! ఆహారంలో గూడ ఆదశ అతని బ్రహ్మత్వాన్నే సూచిస్తుంది. బ్రహ్మజ్ఞానంకలిగినవాడు బ్రాహ్మణుడని మనం ఈనాడు చెబుతున్నాం, బ్రహ్మం ఆనంద స్వరూపం గాబట్టి బ్రహ్మజ్ఞాని నిర్మలమైన ఆనందంలో మునిగి ఉంటాడు. ఆ ఆనందానికి సరూపమయింది సుషుప్తి. అందుచేతనే కాబోలు పసిపాపలలో నిద్ర ఎక్కువ.

అతడు పెరిగి చేతులబలంతో ప్రాకటం దోగటం నేర్చేనాటికి ఏలాగూ ఉగ్గు, యవాగు పెడుతారు కాబట్టి అది అతని క్షత్రియదశ. ఈ తరువాతిది వైశ్యస్థితి వైశ్యశబ్దము విశీధాతు నిష్పన్నం. అది ప్రఉప అనే రూపాల్లో కనిపిస్తుంది. ఉపవిశ అనేదానికి కూర్చొనుట అని అర్థంగాబట్టి శిశువుకు కూర్చునే దశనుండి వైశ్యత్వం, ఆ పిమ్మట “పద్భ్యాగంశూద్రో ఆజాయత” పాదముల నుండి శూద్రుడాయెను అనుటవల్ల నడకతో శూద్రత్వం సిద్ధిస్తుంది. ఈ విధంగా నడిచే నాటికి శిశుదశ పూర్తియై “జన్మనాజాయతే శూద్రః” అనే వ్యవహారవర్ణ చక్రం ఆరంభమౌతుంది. 

శిశువులకు నిద్రఎక్కువ అన్నారు కాబట్టి ఇక్కడ ఒకసారి దాన్ని పరిశీలింతాం. మనకు జాగ్స్వప్నసుషుప్తులనే మÖడవస్థలున్నవి, వానిలో వృక్షాలతాదులది స్వప్నావస్థ, శిలాదులది సుషుప్త్యవస్థ అని విజ్ఞులమతం, అయితే ఆ స్వప్న సుషుప్తులు మానవుల కున్నటువంటి ప్రభావశీలమైనవిగావు, వృక్షాదులది లీలా మాత్రమైన స్వప్నదశ. అందుకేవాని సుఖదుఃఖానుభవం మన చర్మచక్షువులకు కనిపించనంత సూక్ష్మంగా 

ఉంటుంది. కీ.శే.జగదీశచంద్రబోస్ గారు వాని సుఖదుఃఖాల నిరూపించినారుగదా, ఈ రంగంలో యిటీవల శాస్త్రజ్ఞులింకా ముందుకుపోయి దానికిగూడ నిద్రా జాగ్రతలు మానవదర్శనంచే హర్షభయాదులుగూడ ఉన్నవని నిరూపించినారు. మహర్షులైన మన ప్రాచీన కవులు వృక్ష లతాదులయొక్క ఈ తత్వం ఏనాడో ఎరిగినారు కాబట్టే వానిపై కావ్యాలలో మానవ ప్రకృతినారోపించి కొన్ని చోట్ల కథాగతమైన పాత్రలనుగా గూడ చేసినారు. 

ఇక స్వప్నాలను పరిశీలిస్తే ప్రకృతిలో కలలుగనే హక్కు జంతువులకున్నదో లేదో యింకాతేలలేదు. మన పురాణాలలో గూడ రాకుమారులకు వచ్చిన కలలేగాని జంతువులకు వచ్చినట్లు లేదు. కనుక ఇప్పటివరకి అదృష్టం ప్రకృతి మానవుని కొక్కనికే ప్రసాదించిందనుకోవలె.

నిద్రలో సుషుప్తి అచ్చమైన బ్రహ్మానందం వంటిదైతే స్వప్నావస్థ గంధర్వాది దేవయోనుల వంటిది అవి భోగజన్మలేగాని భౌతికకాయం ఉండదు గాబట్టి కర్మిష్ఠి జన్మగాదు. వారు మానవులకంటె ఉత్తములైనా మనవంటి శరీరం లేదు గాబట్టి కర్మలాచరించి కోరికలు సాధించుకునే మార్గంలేదు, ఆ కారణంగా తఱుచుగా ఎవరో ఒకరినావేశించి అవి తీర్చుకుంటు ఉంటారు, లేదా ముక్తిని కోరినపుడు లేక మరేదో సాధించదలచినపుడు మానవ యోనిలో పుట్టి వానిని సాధించుకుంటారు. అట్టివారిని మనమీనాడు కారణజన్ములని వ్యవహరిస్తుంటాము, మానవులు ప్రయత్నించి యక్షాది దేవశరీరాలు పొందవచ్చు, క్షుద్రదేవతోపాసకులేవేవో స్వాప్నిక సుఖాలాశించి ఉపాసనలు చేసి అట్టి దేహాలు పొందుతారుగాని వారికా దేహాలభీష్ఠ సాధనకుపకరించవు. కనుక మనుష్యుజన్మయే వానికంటే ఎన్నో రెట్లు గొప్పది, ఈ దేవమానవ యోనుల పోలిక లౌకికంగా పరిశీలిస్తే ఉద్యోగజీవి, స్వతంత్ర జీవివలె ఉంటుంది. 

స్వతంత్ర జీవికంటె ఉద్యోగి వేషంలోను, ఠీవిలోను పైకి బాగా కనిపించినా అతనికి వృత్తిలో స్వాతంత్య్రముండదు, అలాగే ఆర్జనగూడ నెలనెలకు పరిమితమై పోతుందిగాని యిష్ట ప్రకారంగా సంపాదించే వీలుండదు, అందువల్ల ఈ తత్వమెరిగిన విద్యావంతులుద్యోగానికంటె స్వతంత్ర జీవితానికే ప్రాముఖ్యమిస్తారు. ఆ ధైర్యంచాలనివారే ఉద్యోగాని కఱ్ఱులు చాస్తారు. 

స్వప్నంలో మానవునికి సుఖదుఃఖానుభవం ఉందిగాబట్టి అవిలేని సుషుప్త్యవస్థ స్వచ్చమైన ఆనంద స్వరూపం అనబడుతుంది. కాని లోకానికీ మాటపైన నమ్మకం కుదరదు. ప్రకృతి యొక్క మాయా విలాసం యిక్కడనే ఉంది. అది మానవునికి అఱ్ఱులు చాచు ఆనందాన్ని దినదినం ఒకసారి ఎరుగకుండానే ప్రదర్శించి పోతుంది. లోకంలో పరబ్రహ్మం కేవలం సాక్షి మాత్రమేగాని సామాన్యుడా విధంగా అంగీకరించడు. దానియందేవేవో అతీత శక్తులూహించుకుంటాడు. కనుక నిర్గుణము, నిష్క్రయము అయిన బ్రహ్మమే సాకారమై కనుపడి నేనేది చేయలేనని చెప్పినా నమ్మడు. అలాగే సుషుప్తిలోనిదే అచ్చమైన ఆత్మానందం అన్నపుడు గూడ “హైరానా” తింటాడు. అయితే శిలాదుల సుషుప్తి ఈ కోవకు చెందదు. అది గాఢమైన తామసంతో కూడింది అంటారు. రామాయణంలో ఏనుగులతో తొక్కించినా మెలకువరాని కుంభకర్ణుని నిద్రను చూస్తాం. అదిగూడ ఇదేకోవకు చెందుతుంది. అంతేగాక గౌతముని శాపంతో అహల్య, లక్ష్మణుని విరహంతో ఊర్మిళగూడ అట్టి స్థితిలోనికే వెళ్ళినారు. 

జీవుడు నిజానికి దినదినం తానెక్కడినుండి వచ్చినాడో అక్కడికి వెళ్ళి కాస్సేపు విశ్రాంతి తీసుకొనివస్తాడు. బాల్యములో అతని మనస్సింతా ప్రపంచాయత్తం కాదుగాబట్టి అతనికా విశ్రాంతి కాలం ఎక్కువ. రాను రాను మనస్సు ప్రపంచవ్యాహృతమైన కొలది ఆ సమయం తగ్గుతూ వచ్చి చివరకు ముసలితనానికి కొందరికి నిద్రపట్టకుండాగూడ పోతుంది. జీవుడొక వేళ తనవిశ్రాంతి స్థానానికి వెళ్ళి రాకపోతే మరునాటికతనికి కావలసిన క్రొత్త శక్తిరాదు. బాగా గాఢ నిద్రపట్టి మెలకువ వచ్చిన తరువాత మనస్సుకెంత చుఱుకుతనం ఉల్లాసం కలుగుతవో అవి రాత్రి అంతా కలత నిద్రలోనే గడిచితే కలుగవు. ఇది సాధారణంగా అందరికి అనుభవమే.

హిందువుల బ్రతుకమ్మ పండుగ


హిందువులకు వారి సంవత్సరం మొదటి ఆరు నెలలు పురుష రూపంగా చివరి ఆరునెలలు స్త్రీరూపంగా ఉండి అది స్త్రీ పుంసయోగాత్మకుడైన పరమేశ్వరునికి సంకేతంగా ఉంది. ఇందుకు మనకు సంవత్సరాది నుండి ప్రారంభమయ్యే వసంత ఋతువు పుంలింగ శబ్దమై, వసంత నవరాత్రులు పురుషపరమై మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముని ఆరాధనతో ఆశ్వీయుజం నుండి ప్రారంభమయ్యే శరద్రుతువు, స్త్రీలింగశబ్దమై అపుడు జరుపబడే శరన్నవరాత్రులు దేవీ పరంగా ఉండటం ఒక దృష్టాంతంగా ఉంది.

ఈనాడు మనకు పంచాంగంలో బ్రహ్మచైత్ర శుద్ధ పాడ్యమి నుంచి సృష్టికర్మ నారంభించినట్లు చెప్పబడుతుంది. కాని శరద్రుతువు కంటె మొదటిది భాద్రపదం. అది వర్షరుతువు. ఆ నెలలో చివరి దినాలకు మహాలయ పక్షాలని పేరు. మహాలయం అనగా సంపూర్ణమైన ప్రళయమని అర్థం. కనుక ఈ మహాలయం భాద్రపదంలో జరిగినపుడు పునఃస్సృష్టి చైత్రంతో ఎట్లా ప్రారంభం కాగలదు? అందువల్ల ప్రళయానంతర సృష్టి ఆశ్వీయుజంతోనే ప్రారంభం కావలె.  ఇపుడు మనం మన నెలలను చాంద్రమానాన్ని బట్టి వ్యవహరిస్తున్నాం కాబట్టి వాని పేర్లు పూర్ణిమ నాడు చంద్రుని వెంట ఉండే నక్షత్రాలను బట్టి చిత్త - చైత్రం, విశాఖ, వైశాఖం అని ఈ విధంగా ఏర్పడినవి. 

మన నక్షత్రాలలో మొదటిది అశ్విని కనుక అశ్వినిలో ప్రారంభమయ్యేది ఆశ్వయుజం అవుతుంది. అందువల్ల ఆశ్వీయుజమే సృష్ట్యాది అవుతుంది. దేవీ భాగవతంలో ఈ సృష్టికంతా మÖలం దేవియేనని ఆమె చేతనే ఈ జగత్తంతా ఏర్పడిందని చెప్పబడింది. ప్రాకృతికంగా గూడ సృష్టి విస్తరణ కార్యమంతా స్త్రీ చేతనే జరుగుతుంది. సంతానాన్ని కని పెంచి పోషించటంలో పురుషుని కంటే స్త్రీ బాధ్యతనే ఎక్కువ. ఇది ఎవరు కూడ కాదనలేని సత్యం కనుక అది సృష్టి వర్షచక్రంలో స్త్రీ రూపమైన శరద్రుతువు నుండియే అనగా ఆశ్వీయుజ ప్రారంభం నుండియే ప్రారంభమయిందనవలె.

బ్రహ్మ యొక్క సృష్టి తొమ్మిది విధాలని భాగవతంలో చెప్పబడింది. బ్రహ్మలు గూడ తొమ్మండుగురే! ఇప్పటికారుగురు బ్రహ్మలు గడిచినారట. ప్రస్తుతం మనం ఏడవ బ్రహ్మగారి కాలంలో అతని పరార్ధంలో అనగా ఏబది ఒకటవ సంవత్సరంలోని మొదటిదినంలో ఉన్నాం. బ్రహ్మ తన యొక్క నవవిధ సృష్టి దినమొకటిగా తొమ్మిది దినాలలో సృష్టించి నాడట. అందుచేత ఆ చిహ్నంగా పూర్వం మన పల్లెటూళ్లలో ఆశ్వీయుజం ప్రారంభం కాగానే జానపదులు తొమ్మిది దినాలు బ్రతుకమ్మ అనే పండుగను చేసేవారు. బ్రతుకమ్మ (బ్రతుకు G అమ్మ) పండుగ అనగా సృష్టి ప్రథమంలో జీవోత్పత్తి ప్రారంభమైన దినం అని తాత్పర్యం.

 శరద్రుతువు రాగానే ప్రకృతిలో అంతవరకు బాగా కురిసిన వర్షాల వల్ల వాతావరణమంతా శుభ్రంగా కడుగబడి దూళి రహితమై ఉంటుంది. శరద్రుతువులో అగస్త్యోదయం అవుతుంది కాబట్టి అంతవరకు వానలతో వరదలతో జలాశయాలన్ని పొంగి పొరలి రజో భూయిష్టమై ఉండి అగస్త్యోదయంతో వండు పగిలితేట పడుతుంటవి. కాబట్టి అదే విధంగా సృష్టి ప్రథమ దశలోగూడ ఈ భూగోళం పైన గూడ వాతావరణం మరియు స్థలజలాదులు నిర్మలపడిన పిమ్మటనే జీవోత్పత్తి జరిగి వుంటుంది.

శరద్రుతువు కంటె మొదటిది వర్షరుతువు. వర్షం చేత భూమి పై అన్యోత్పత్తి జరుగుతుంది. కనుక సృష్టి మొదటి దశలో గూడ భూమిపై మొదట అన్యోత్పత్తి జరిగిన పిమ్మటనే జీవన సృష్టి ఆరంభమై ఉంటుంది. భాద్రపదంలోని కృష్ణపక్షం హిందువులకు పితృపక్షాలు, అనగా ఆ పదిహేను దినాలు వారు నక్తం పాటిస్తు పితృ దేవతలకు తర్పణాలు విడవవలసిన దినాలు. “పెత్తరమాస” పితృ అమావాస్య, సామాన్య జనానికంతా తమ పెద్దలకు పెట్టుకోవలసిన పెద్ద పండుగ.

ఈ నెలలో యమ ధర్మరాజు పితృలందరిని మీరు భూలోకంలో మీ మీకుటుంబాలకు వెళ్లి వారర్పించే నైవేద్యాలు, జలతర్పణాలు స్వీకరించిరండని పంపుతాడట. అందువల్ల శరద్రుతువులో మానస సరోవరం నుండి దేశంలోని జలాశయాలలోనికి హంసలు వచ్చినట్లు యమలోకం నుండి పితరులంతా భూలోకానికి వస్తారు. అందుచేతనే ఈ నెలంతా హిందువులు తమ పితృదేవతలను పూజిస్తుంటారు. నెలంతా కాకున్నా కృష్ణపక్షంలో విధిగా వారికి తర్పణాలు విడుస్తుంటారు. కనుక వానిని గ్రహించటానికి వచ్చిన ఆయా వంశాలకు సంబంధించిన పితరులు తాము మళ్లీ అవతరించటానికి తమతమ వంశాలలో లేదా యితరస్థలాలలో తమకనువైన క్షేత్రాలు కూడ చూసుకుంటు ఉంటారు. కనుక ఈ విధంగా కూడ ఈ శరదృతువు జీవోత్పత్తికి ఒక సూచకంగా వుంది.

హిందుపురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు అత్తవారింటికి వచ్చి పడకవేస్తాడు. అందుకే దీనికి శయనైకాదశి అని పేరు. పిమ్మట అతడు శరద్రుతువులోనే కార్తీక శుద్ధేకాదశినాడు లేచి వెళ్లుతాడు. ఆనాడతనిని గోపికలు వచ్చి పిలుచుకొని వెళ్లుతారు. ఆయన లేచి వెళ్లుతాడు కాబట్టి దీనికి ఉత్థానైకాదశి అని పేరు. కనుక ఈ శరద్రుతువు ఆషాడంలో శయనించిన విష్ణువు మేల్కోని కన్నులు విచ్చే సమయం అవుతుంది. సృష్టిలో ప్రతి ప్రాణికి గర్భధారణకు ఒక ఋతువు నియమితమై వుంది కనుక దాన్ని అనుసరించి వసంతం మానవులకు అపుడు వృక్ష జాతులన్ని చిగిర్చి పూచి మన్మథునికి బాగా సమృద్ధిని కలిగిస్తవి. కాబట్టి (మాయ విహారాల సమయంగా ఉంది. కనుక చైత్రం నుండి లెక్కించినపుడు ఆశ్వీయుజం ఏడవనెల అవుతుంది. పిండోత్పతి క్రమాన్ననుసరించి సాంఖ్యంలో గర్భస్థజీవుడు మేల్కొని అతనికి పూర్వస్మృతి కలిగే తరుణం. కనుక సముద్రుని యింటికి వచ్చి శయనించిన విష్ణువు శరద్రుతువులో కన్నులు విచ్చటం మనకు గర్భస్థుడైన ఈ జీవుడు కన్నులు విచ్చటానికి అనగా అతనికి పూర్వ స్మృతి కలుగటానికి ఒక సూచనగా ఉంది. ఈ విధంగా యిది గూడ ఒక విధంగా శరద్రుతువులోని జీవోత్పత్తి స్థితినే సూచిస్తుంది. అందువల్ల తెలంగాణంలోని పల్లెటూళ్లలో శరద్రుతువులో స్త్రీలు జరుపుకొనే బ్రతుకమ్మ పండుగ వెనుక ఈ రహస్యాలన్ని తలదాచుకొని ఉన్నవి.

ఈ బ్రతుకమ్మను స్త్రీలు పుష్పరాశిని శిఖరకారంగా పేర్చి దానిలో ఆ దేవిని ఆహ్వానించి ఆరాధిస్తారు. పుష్పం మనకు ఫలోత్పత్తికి సంకేతం. అంతేగాదు, అది సృష్టి ఆరంభానికి కూడా సంకేతమే ఆది సృష్టిలో విష్ణువు నాభినుండి కమలం పుట్టిన పిమ్మటనే దానిలో బ్రహ్మ ఉదయించి ఈ జగత్తునంతా సృష్టించినాడు గదా! అందువల్ల జానపదులు పూలతో బతుకమ్మను తొమ్మిది దినాలు తొమ్మిది రకాలుగా అలంకరించి ఆరాధించి చివరినాడు జలనిమజ్జనం చేస్తారు.

ఈ బ్రతుకమ్మ ఆరాధనలో తంగెడు పూలకు ప్రాముఖ్యమెక్కువ. దేవి రూపం ఏదైనా జానపదులలో ఆమె పార్వతికే సంకేతం. పార్వతి గిరికుమారి కాబట్టి ఆమెకు గౌరి అని పేరు. ఈమెకు మొదటి పేరు కాలి. గౌరి మొదట నల్లగానే ఉండెనట. కాని శివుడామెను వివాహమాడిన పిమ్మట నల్లగా ఉన్నావని హేళన చేయగా ఆమె బ్రహ్మను గురించి తపస్సు చేసిందట. అప్పుడాయన ఆమెకు తన వంటి బంగారు వన్నె కలిగేటట్లు వరమిచ్చినాడని అందువల్ల ఆనాటి నుండి ఆమెకు బంగారు వెన్నె ప్రియమయినదని చెప్పబడుతుంది. కనుక స్త్రీలిపుడు. ఏ పండుగలో గౌరి దేవిని ప్రతిష్ఠించు కోవలసి వచ్చినా ఆమెను పసుపుతోనే చేయటం. ఆమె గిరికుమారి కనుక గౌరి మÖర్తిని శాఖాహారకారంగా చేయటం ఆనవాయితిగా ఏర్పడింది. కందూరులోని ఆలయంలో గౌరి యిపుడు ఈ రూపంలోనే ఉంటుంది కూడ.

పసుపు వన్నె కారణంగా బ్రతుకమ్మలో తంగెడు పూవులకు ప్రాముఖ్యం ఏర్పడింది. అవి ఈ ఋతువులో విరివిగా లభించే పుష్పాలు గూడ. అందువల్ల జానపదులు వానిలో బ్రతుకమ్మను గౌరమ్మ ఆకారంలో పేర్చుకుంటారు. ఈ విధంగా మన పల్లెటూరి బ్రతుకమ్మ వెనుక ప్రాచీనమైన సృష్టి రహస్యం ఎంతో ఇమిడి వుంది.