మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

11, నవంబర్ 2026, బుధవారం

మహాలయ పక్షాలు.....పితృస్థుతి

పితృస్థుతి ని ప్రతీ రోజూ చదువుకోవచ్చు. తల్లిదండ్రులు ఉన్నవారు కూడా చదువుకోవచ్చు. పితృదేవతలు అంటే, జన్యుదేవతలు. బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి. 

పితృ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతిబాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు.  ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. పాపకర్మలు నశించిపోతాయి.

నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ!

సుఖదాయ ప్రసంనాయ సుప్రీతాయ మహాత్మనే!!

సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే!

సర్వతీర్థావలోకాయ కరుణాసాగారాయ చ!!

నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః!

సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ!!

దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మాయా వపుః!

సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః!!

తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం!

మహా గురోశ్చ గురవే తస్మై పిత్రే నమోనమః!!

యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం!

అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమోనమః!!


ఇదం స్తోత్రం పిత్రుః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః!

ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ 

స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా 

న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితమ్ 

నానాపకర్మకృత్వాపి యఃస్తౌతి పితరం సుతః 

సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్ 

పితృప్రీతికరైర్నిత్యం సర్వ కర్మాణ్యధార్హతి!!


భావం :

ఎవరివలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు.

సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణాసముద్రులైన పితరులకు నమస్కారములు. 

సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు.

ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరివలన లభించిందో ఆ పితృ దేవతలకు నమస్కారములు.

ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు. 

ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందలకొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరులకు నమస్కారము

3, నవంబర్ 2026, మంగళవారం

కాలజ్ఞానం ప్రకారం జరిగి తీరవలసినవి

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగ బహుదానదీ తీరాన ఒక చిన్న పాటి గ్రామమైన కాణిపాకంలో కొలువైన వరసిద్ది వినాయకుడు ఒక చిన్న పాటి గ్రామమైన కాణిపాకంలో కొలువైన వరసిద్ది వినాయకుడు నిరంతరము ఉబికి వచ్చే పాతాళగంగనడుమ బావిలో వెలసిన ఇక్కడి వినాయకుడు భక్తుల కోర్కేలు తీర్చుతూ కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. అంతటి మహిమాన్వితమైన కాణిపాక పుణ్యక్షేత్రంలో ఆలయం ముందుగల బావిలో వెలసిన విఘ్నేశ్వరస్వామి ఆ గంగ రక్తమై ఆరు ఆమడపారవలసి వుంది. అప్ప్పుడే వీరబోగవసంతరాయల వారి రాక ఇదీ కాలజ్ఞానం ప్రకారం జరిగి తీరవలసివుంది.


శ్రీశైల మల్లికార్జున స్వామి సాక్షాత్కారముగా మనుజులతో మాట్లాడేను 

పురాణ ప్రసిద్దమైన ఈ క్షేత్రంలో శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారు వేంచేసియున్నారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామిని చేతులతో తాకి పునర్జన్మ లేకుండా ముక్తిని పొందవచ్చు. ఇంతటి మహత్తుగల ఈ పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాములలో మొదటిది. సముద్ర మట్టానికి సుమారు 1500 అడుగుల ఎత్తులో వున్న ఈ అనాది క్షేత్రమును శ్రీ రామచంద్రుడు బ్రహ్మ హత్య పాతక విముక్తికై ప్రదిక్షణ చేశారు. ఈ క్షేత్ర దర్శనము సకలపాప హరమని శివపురాణంలో ఉంది.  కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగ శ్రీశైల మల్లికార్జున స్వామి మనుషులతో మాట్లాడేను. వీరభోగవసంత రాయలు వస్తున్నారని చెప్పేను. శ్రీశైల మల్లికార్జున స్వామి గుడిలోనున్న దేవత విగ్రహాలన్నింటికి మÖర్తివంతాలు వచ్చి ఊరూర నాట్యమాడేను. శ్రీశైల మల్లికార్జున స్వామి కంట నిప్ప్పులు రాలేను. ఆ మహాదేవుని జడలు యెగసి ఆడేను. అప్ప్పుడు రక్త వర్షము కురిసేను. శ్రీశైలం గుడిలో పొగమంటలు యెగసేను. బసవేశ్వరుడు దిమిదిమి యని నాట్యమాడేను. నాగభోగ ప్రతిమ మావారు వచ్చే అని కిలకిల నవ్వేను. మల్లికార్జునుని నొసలకన్ను నెత్తిన జడ నోట అమృతము గురిసేను. శ్రీశైలక్షేత్రం శిధిలమై పొయ్యేను. శ్రీశైల యాత్రులు తప్పేను. అరె దొండతీగ గుడి యంత చుట్టుకొనేను. ఇవన్నీ కాలజ్ఞానం ప్రకారము వీరభోగవసంత రాయలు రావడానికి ముందు జరిగితీరవలసి వుంది.


శ్రీశైల భ్రమరాంబ సముఖాన రెండు తలల  మొసలి కనిపించేను

ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్దికెక్కిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం కర్నూలుకు 150 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు శ్రీశైల భ్రమరాంబికగా నిత్యపూజలు అందుకుంటున్నారు. విష్ణుమÖర్తి ధనుర్భాణాలతో సతీదేవి చిత్కళారూపాన్ని ఖండిస్తూ వెళ్ళగా ఆమె శరీర భాగాలు భూలోకంలో అనేకచోట్ల పడి శక్తి పీఠాలుగా అవతరించాయి. ఇక్కడ సతీదేవి మెడ భాగం పడిన స్థలంగా ప్రతీతి. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగ శ్రీశైల పర్వతానకు ఒక మొసలివచ్చి ఎనిమిది దినములుండి భ్రమరాంబ గుడిలో దూరిమేకపోతు వలె కూసి మాయమయ్యేను. భ్రమరాంబ ముందున్న బసవేశ్వరుడు తోక విదళించుకొనెనేను. ఆయమ్మ కంట కన్నీరు కారేను. ఇవన్నీ కాలజ్ఞానం ప్రకారం ప్లవంగ నామ సం॥ అనగ 2027 సం॥లోపు జరిగి తీరవలసి ఉంది. 


కంచి కామాక్షమ్మ కన్నుల నుండి నీరు జలజల రాలేను

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైపట్టణానికి 75 కి.మీ దూరంలో కంచిలో వేం చేసియున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మహాపుణ్యక్షేత్ర మైన తిరుపతి తిరుమల దివ్యక్షేత్రమునకు 65 కి।మీ దూరంలో ఉన్నది. కోర్కెలు తీర్చే కన్నుల గల శక్తి స్వరూపిణి కామాక్షి అమ్మవారు. శివుని అర్దాంగి సతీదేవి శరీర భాగాలు పడిన 101 ప్రదేశాలలో 51 క్షేత్రాలు ముఖ్యమైనవి. వాటిలోను అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి 18 ప్రదేశాలు వాటినే అష్టాదశ శక్తిపీఠాలుగా గుర్తించి పూజిస్తున్నాము. ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో గుడి ద్వంసం అయింది. ఒకటి శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తీ పీఠాలు మనదేశంలోనే ఉన్నాయి. అమ్మవారి శరీరభాగాలైన కంకాళం ఇక్కడ పడినట్లు చెబుతారు. ఇక్కడ కామకోటి “పీఠం” పేరుతో ఒక బిలం వుంది. కామమనగా అక్షరమే. ఈక్షేత్రంలో చేసిన మంత్రజపం ప్రతిఅక్షరానికి కోటిరెట్లు ఫలితాన్నిస్తుంది. కాలజ్ఞానం లో చెప్పిన ప్రకారంగా కంచికామాక్షమ్మ ఉగ్రం చేతం దక్షిణ దేశ ప్రజలను శిశువులను నష్టపర్చేను. కంచికామాక్షమ్మ కన్ను నుండి నీరు జలజల రాలేను. నెత్తురు కక్కేను ఆయమ్మ స్థనాల నుండి పాలుకారేను. కంచికి పడమట గాండ్లవాని ఇంట కామదేనువు జన్మమందేను. కామాక్షి అమ్మవారి దేహాన చెమట పట్టేను. ఇవన్నీ కాలజ్ఞానం ప్రకారం ప్లవంగ నామ సం॥ లోపు అనగ 2027లోపు జరిగి తీరవలసి ఉంది.


అలంపూర్ జోగుళాంబా కంట నీరు కారేను

దేవిశక్తి పీఠాలలో మరొక క్షేత్రము అలంపూర్ జోగుళాంబ. అలంపురానికి పూర్వనామదేయం హలంపురం. ఇది హరిహరశక్తి క్షేత్రం. తెలంగాణలోని మహబూబునగర్ జిల్లాలో హైదరాబాద్ నుండి కర్నూలుకు వెళ్లు మార్గంలో తుంగభద్రనది ఒడ్డున అలంపురం గ్రామంలో జోగుళాంu అమ్మవారు వెలసియున్నారు. ఇక్కడ నవ బ్రహ్మ అలయాలు కూడా ఉన్నాయి. సతీదేవి దంతాలు ఇక్కడ పడ్డాయని ప్రతీతి. కలియుగ ప్రత్యక్ష దైవం జగద్గురు శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం చెప్పిన ప్రకారంగా అలంపూర్ జోగులాంబ కంట నీళ్ళు గారేను. ఆయమ్మ స్థనాలు పాలు కారేను అని చెప్పియున్నారు. ఇది కాలజ్ఞానం ప్రకారం క్రోది నామ సం॥ లోనగా 2024లోపు జరిగి తీరవలసివుంది.


వేంకటేశ్వరునిగుడిలో మొసళ్ళుజొరబడి మÖడురోజులు పూజ నిలిచేను.

ఏడుకొండలపై వెలసియున్న శ్రీవేంకటేశ్వరుని ఆలయం దేశంలోనే అత్యంత ప్రాచీనమైంది. శ్రీరామనుజుల వారి పాదస్పర్శతో పవిత్రమైన ఈ ప్రదేశం నిత్య పచ్చతోరణమే. నిత్య పెళ్ళికొడుకు శ్రీవేంకటేశ్వరుని చూడటానికి బ్రహ్మ ఇచ్చిన ఈ రెండు కళ్ళు చాలవు. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూడటానికి చూచి తరించడానికి భారతదేశం నలుమÖలల నుంచే కాకుండ దేశవిదేశాల నుండి లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించి తరిస్తున్నారు. సుమారు 1600 కోట్ల సం॥లకి ముందు సహజ శిలాతోరణంగా స్వామి వారు ఏర్పడ్డారని భౌగోళిక శాస్త్రజ్ఞులు, పురాతన శాస్త్రవేత్తలు, ఇతిహాసాలు, పురాణగాదలు చెబుతున్నాయి. ప్రపంచం మొత్తం మొత్తం మీద అత్యధిక ఆదాయంగల దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానమే అని చెప్పొచ్చు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్‌పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా ఈ దివ్య స్థలమున ఆరుగురు దుష్టులు పుట్టేరు. తిరుపతికొండ  మÖలన దూమ కేతువనే నక్షత్రము పుట్టేను. ఆ నక్షత్రమును చూచి అందున కొందరు నష్టమందేరు. వేంకటేశ్వరస్వామి కుడి భుజం అదిరేను. అలువేలు మంగమ్మ అదిరిపడి లేచేను. వేంకటేశ్వరుని గుడిలో వేయి వింతలు పుట్టి పూల వర్షము జూము కురిసేను. ఏనాడు కానరాని ఆ పూలు తాకినా తెలయ్యి కుట్టేను. వేంకటేశ్వరస్వామి సొమ్ము దోచేరు. తిరుపతి కొండ మీద మహమ్మదీయులు ఆడిపాడేరు. కుడిద్వజం కదిలేను. గరుడద్వజమున ఓంకార నాదము వింతగా పుట్టేను. పరమాత్మసేవకై లక్షలాది ప్రజలు ప్రతిదినము వచ్చేరు. 


మహానంది మరుగున మహిమలు పుట్టేను

నంద్యాల పట్టణమునకు సుమారు 20 కి.మీ దూరంలో మహానందీశ్వరుడు, కామేశ్వరీదేవి వెలసియున్న పరమ పవిత్రమైన క్షేత్రమిది నవనందులలో ముఖ్యమైనది శ్రేష్ఠమైనది. మహానంది కలియుగ ప్రత్యక్ష దైవం జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగ మహానందిలో రెండు సర్పాలు దేవాళములో పోరాడేను ఒక సర్పం దొడ్డది. అది శిఖరాన మÖడు రోజులుండేను. మహానంది శిఖరం విరిగిపడేను. మహానందికి ఉత్తరాన 30 మంది మునులు జన్మించేరు ప్రజలకు వారు మహిమలు చూపేరు. మహానందిలో పంచవాయిద్యాలు వాయించినట్లుండేను. హంపిలో నుండేటి హనుమంతుcడు అరచికేక వేసేను ఆకేకతో మహానందిమÖలంత ఆకు రాలినట్లు రాలేరు. ఇది కాలజ్ఞానం ప్రకారం జరిగి తీరవలసి వుంది.

మÖడు కాళ్ళావుకు మనుజుడే పుట్టేను. ప్రజలతో తర్కవాదములు చేసేను.

వెదకాలం నుండి నేట ìవరకు భారతీయులకు గోవులు అత్యంత పవిత్రమైనది మరియు శుభప్రధమైనది, ఆరాధనీయమైనది. గోవులో ఎందరో దేవతలు కొలువు దీరి ఉన్నారని పురాణాలు, శాస్త్రలు తెలియజేస్తున్నాయి. గోవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే. గోమాతకు ఆహారము ఇచ్చినచో ఋణ విముక్తి పొంది సకల సంపదలతో తులతూగుదురు. గోప్రదక్షణ చేయడమంటే భూప్రదక్షణతో సమానము. ఆవు నాలుకపై వరుణ దేవుడుండును. పూజించినచో సంతానం కల్గును. పాలిచ్చు ఆవును  దానము చేసిన వారికి ఆవుకు ఎన్ని రోమములు గలవో అన్ని వేల సం॥లు స్వర్గలోకమున ఉందురు. కలియుగ ప్రత్యక్ష దైవము జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి వారు గరియరెడ్డి అచ్చమ్మగారి ఇంటి యందున్న గోవులను బనగానపల్లెకు రెండు కి.మీ దూరంలో గల రవ్వలకొండపై కాయుచు కాలజ్ఞానం వ్రాశారు. కాలజ్ఞానంలో చెప్పినట్లుగా ఆవుకు అయిదు శిరస్సులు, రెండు యోనులుగా పుట్టును. ఒక యోని మానవ యోనిగాని, ఒక యోని ఆవు యోనిగానుండును. ఆవు కడుపునందుగల దూడ అంతర్గతముగా కనిపించేను. మÖడు కాళ్ళావుకు మనుజుడు పుట్టి ప్రజలతో తర్కవాదము చేసేను. సోమయాజుల ఇంట జరిగిన హత్యకు గోవుసాక్ష్యము పల్కేను. ఇది కాలజ్ఞానం ప్రకారం క్రోదినామసం॥ం అనగా 2024 లోపు జరిగి తీరవలసి వుంది. 

హంపిలో నుండేటి హనుమంతుడు అరచివీదుల్లో కేక వేసేను

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం చెప్పినట్లుగ బానుముక్కలలోను, బేతం చెర్లయందున, కురుకొండ యందున్న, శిరివెళ్ళ యందున్న ఆంజనేయుడు మనుష్యుల ప్రయాణం కనపడేను, హంపిలో నున్న హనుమంతుడు అరచి వీధుల్లో కేకవేసేను. ఆకేకతో మహానందిమÖలంత ఆకురాలినట్లు రాలేరు. ఇది కాలజ్ఞానం ప్రకారం క్రోది నామ సం॥ నుండి విశ్వావసు నామ సం॥లోపు జరిగి తీరవలసి వుంది.

ఒకే నెలలో రెండు గ్రహణాలు వచ్చేను

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా 

జూన్ 15 1992లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది.

జూన్ 30 1992లో సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడింది.

డిశంబర్ 10 1992లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది.

నవంబర్ 29 1993 లో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడింది.

నవంబర్ 29 1993లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది.

మే 10 1994లో సూర్యగ్రహణం ఏర్పడింది.

మే 25 1994 పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది.

ఏప్రీల్ 15 1995లో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది.

ఏప్రీల్ 29 1995లో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడింది. 

ఏప్రేల్ 4 1996లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది.

ఏప్రేల్ 17 1996లో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడింది.

 మార్చి 9 1997లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది.

మార్చి 24 1997లో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది.

మార్చి 9 2016లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది.

మార్చి 23 2016లో పాక్షిక చంద్రగ్రహం ఏర్పడింది.

సెప్టెంబర్ 12 2016లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

సెప్టెంబర్ 16 2016 పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

ఈ విధంగా కాలజ్ఞానం ప్రకారం ఒకే నెలలో రెండు గ్రహణాలు ఏర్పడటం అనేక సార్లు జరిగింది. ఇదీ కాలజ్ఞాన మహిమే ముందుగా చెప్పినదే.

భూమి వక్కలయ్యేను

కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా భూమి పొరýలో కదలికలు ఏర్పడటము వల్ల భూకంపాలు సంభవించి భూమి వ్రక్కలవ్వడం జరుగుతూనే ఉంది. ఇది కాలజ్ఞాన మహిమే 17వ శతాబ్దంలో చెప్పినదే.

మనుష్యులతో మాయ శక్తి మాట్లాడేను

కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన ప్రకారం టెలిఫోన్లు, టీవిలు, టేప్‌రికార్డులు మనుషులు లేకుండగానే మాట్లాడుచున్నాయి ఇదీ కాలజ్ఞాన మహిమే 17వ శతాబ్దంలో చెప్పినదే. 

ఒక గోతికి పట్టనంత మందిని పూడ్చేరు

కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా డిశంబర్ 26, 2004లో వచ్చిన సునామి కారణంగా ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా దీవుల సమీపంలో హిందూ మహాసముద్రంలో తీవ్ర భూకంపం కారణంగా సముద్రం ఉప్పొంగి వచ్చిన సునామి దాటికి 14 దేశాల్లోని తీర ప్రాంత గ్రామాలు, పట్టణాలను, నగరాలను అతలాకుతలం చేసింది. తత్పలితంగా 2,30,508 మంది మృత్యువాత పడ్డారు. అప్ప్పుడు చనిపోయిన వారిని జెసిబిలతో గోతులు తవ్వి వందలాదిగ ఒక గోతికి పట్టనంత మందిని పూడ్చిపెట్టడం జరిగింది. ఇదీ కాలజ్ఞాన మహిమే 17వ శతాబ్దంలో చెప్పిన కాలజ్ఞానమే.

ఇంటింటిన రోదనంబులగు ఇళ్లకు ఇళ్ళు నశించుచుండు.

కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ పేరు చెప్పగానే మొదటగా ఎవరికైనా గుర్తొచ్చేది ఫ్యాక్షన్. సీమలోను ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల ఫ్యాక్షన్‌కు పెట్టిందిపేరు అందులోనూ కడప పూరు వినపడంగానే కళ్ళముందు కదలాడేది. బాంబులు నాటు తుపాకులు, కత్తులు, వేట కొడవళ్ళతో కూడిన ముఠా తగాదాలు, పలుగ్రామాల్లో నాయకులు ముఠాలుగా  ఏర్పడి రాజకీయ చిన్నచిన్న సమస్యలపై సైతం ఘర్షణకు దిగడం ఈ సీమ జిల్లా వాసులకు సర్వసాధారణం. పగలు ప్రతికారాలతో కక్ష్యలతో రగిలిపోతూ ఒకరిపై మరొకరు బాంబులు వేట కొడవళ్థతో దాడులు చేసుకుంటూ ఒకరినొకరు చంపుకుంటు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ విధంగా కాలజ్ఞానం ప్రకారం రాయలసీమ జిల్లాలో ముఠాతగాదాల వల్ల ఇళ్ళకు ఇళ్ళు నశించుచున్నాయి. ఇదీ కాలజ్ఞాన మహిమ 17 శతాబ్దంలో చెప్పినదే.

అర్ధరాత్రి వేళ సూర్యుడు కనపడేను

కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా నార్వే దేశంలో ఉత్తరాగ్రంలో గల ట్రాంసో ఒక లక్ష జనాభా గల చిన్న నగరం. ఉత్తర అక్షాంక్ష రేఖకు సమీపంలో ఉండటం వల్ల  ట్రాంసోనగర శీతోష్ణస్థితి మిక్కిలి చల్లగా ఉంటుంది. టండ్రాల ప్రాంతం కాబట్టి వేసవి నెలలలో కూడా ఇక్కడ 15 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. శీతాకాలంలో మైనస్ 20 డిగ్రీలుంటుంది. భూమిపై ఉత్తరాగ్రంలోని నగరంగా పేరొంది. ట్రాంసో నగరంలో మధ్యరాత్రిలో కూడా సూర్యుని చూడవచ్చు. మే నెల 18 నుండి జులై26 వరకు అర్దరాత్రి సమయంలో కూడా సూర్యుడు కనిపిస్తాడు. ఏప్రీల్ నుండి ఆగష్టు వరకు మసక చీకటి ఉంటుంది. కాని రాత్రి ఉండదు. నవంబర్ నుంచి జనవరి వరకు సూర్యుడు అసలు కనిపించడు. అందుకే ఈ సమయాన్ని పొలాల్ నైట్ అంటారు. ఈ విధంగా కాలజ్ఞానం ప్రకారం ట్రాంసో నగరంలో అర్ధరాత్రి సమయంలో కూడా సూర్యుడు కనిపిస్తాడు. ఇదీకాలజ్ఞాన మహిమే. 17 శతాబ్దంలో చెప్పినదే.

బండి మీద కోడి వచ్చేను దాని రెక్క విసురుకు లక్షల మంది చచ్చేరు దానికూతకు కులక్షయమై మానవులుగట్టిగా మగ్గేరు.

కలియుగ ప్రత్యక్షదైవం దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా బాంబులకే బాంబు హైడ్రోజన్ బాంబు. ఒకప్ప్పుడు అమెరికా రష్యాల మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్న రోజుల్లో వినిపించిన మాట ఇది. మళ్ళీ ఇన్నాళ్ళకు మేం హైడ్రోజన్ బాంబును పరిక్షించామంటూ ఉత్తర కొరియా బాహాటంగా ప్రకటించిన తర్వాత అంతర్జాతీయ సమాజంలో అత్యంత చర్చనీయాంశమైన అంశంగా అది మారింది. అణుబాంబులకు హైడ్రోజన్ బాంబుకు చాలా తేడా ఉంటుందంటున్నారు నిపుణులు. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు సమయంలో 6 ఆగష్టు 1945 అమెరికా జపాన్‌లోని హిరోషిమా పట్టణంపై  అణుబాంబు వేసింది. ఈ దాడిలో దాదాపు 166,000 మంది మరణించారు. అదేనెల 9న జపాన్‌లోని నాగసాకిపై మరో అణుబాంబు వేసింది. ఈ ఘటనలో 80,00 మంది మరణించారు. నిపుణులు సూపర్‌బాంబుగా పిలుచుకునే ఈ హైడ్రోజన్ బాంబు అత్యంత శక్తి వంతమైనది. జపాన్ దేశాన్ని దశాబ్దాల పాటు ఆర్థికంగా సామాజికంగా కోలుకోలేనంత దెబ్బతీసిన అణుబాంబులకన్న వెయ్యిరెట్లు అధికశక్తి వంతమైనది హైడ్రోజన్‌బాంబు. అణుశక్తి బాంబుకన్న హైడ్రోజన్ బాంబు విడుదల చేసే శక్తి చాలా ఎక్కువ. ఒక హైడ్రోజన్ బాంబు ఒకే సమయంలో అనేక నగరాలను ద్వంసం చేయగలదు. ఇప్పటి వరకు ఏ దేశం దీనిని ప్రయోగించలేదు. హైడ్రోజన్‌బాంబును చిన్న సైజులో తయారు చేయవచ్చు. అందువల్ల వీటిని యుద్ధ విమానాల ద్వారా క్షిపణిల ద్వారా ప్రయోగించటం సులువు. ఈ హైడ్రోజన్‌బాంబు ప్రయోగించినప్ప్పుడు వచ్చే శబ్దానికి భూకంపం సంభవించినట్లుండి వేలాది గృహాలు కూలిపోయి మానవులు ఎక్కడివారు అక్కడి మగ్గిపోతారు. ఇది కాలజ్ఞానం ప్రకారం క్రోదినామ సం॥ అనగా 2024 లోపు జరిగి తీర వలసివుంది.

సృష్టికి ప్రతిసృష్టికల్పించే అల్పజీవులు ఇలలో పుడతారు.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా దేవుడు 84 లక్షల జీవరాలసులను సృష్టిస్తే అందుకు ప్రతిసృష్టిగా మనిషి తన తెలివి తేటలతో బొమ్మలను మరబొమ్మలను మరమనుష్యులను టెస్ట్ ట్యూబ్ బేబిలను సృష్టిస్తున్నాడు. వీటికి ఆకలి గురించి తెలియదు కానీ వంట చేయగలవు. పరిశుభ్రత గురించి తెలియదు కాని ఇంటిని శుభ్రం చేయగలవు. మనసు మమత తెలియదు కానీ మనిషికి తోడుగా ఉండగలవు. పంటల గురించి తెలియదు కానీ ఇప్ప్పుడు పంటలుకూడా పండిస్తున్నాయి. పంట పొలాల్లో నాట్లు వేయడం నుంచి పంట చేతికి వచ్చేవరకు అనేక పనులు రోబోలే చేస్తున్నాయి. సర్వీసింగ్, బ్యాంకులో పారిశ్రామిక రంగాల్లో కార్మికులుగా, సైనికులుగా పారిశ్రామిక వ్యాపార సంస్థలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా పాల్గొనబోతున్నాయన్నా వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఒక్కటేమిటి రోబో చేసే పనులు అన్ని ఇన్ని కావు భవిష్యత్తులో పడక గదిలోకి కూడా రోబోలు ప్రవేశిస్తాయట. ఒక్క పిల్లలు కనడం తప్ప  అన్ని పనులు చేస్తోంది. అంతేకాదు భవిష్యత్తులో జరిగే యుద్ధంలో రోబోలే ముఖ్యపాత్ర పోషించబోతున్నాయి. ఇప్పటి వరకు యుద్ధాల్లో సైనికులు మాత్రమే పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు యుద్ధాల్లో సైనికులు మాత్రమే పాల్గొంటున్నారు. త్వరలో రోబోలే ఆపని చేస్తాయట. ఈ విధంగా కాలజ్ఞానం ప్రకారం సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నారు. ఇదీ కాలజ్ఞాన మహిమే ముందుగా చెప్పినవే.

కావేరినది పొంగి ఘనమైన పట్నాలు పాడై ఏడు పుట్ల నల్లు ఏకంగా రాలేను

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లు కావేరినది దక్షిణ భారతదేశంలోని ప్రముఖనది. ఇది కర్నాటక లోని బ్రహ్మగిరి పర్వతాల్లో పుట్టి బంగాళాఖాతం దిశగా ప్రవహిస్తుంది. ఈనది కర్నాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఆగ్నేయ దిశగా ప్రయాణిస్తున్న ఈ నది చాలా పవిత్రమైనదిగా పేరు పొందింది. కావేరి నది జలాలతో ఏర్పడే శివ సముద్రం జలపాతాలు దేశంలో రెండవ జలపాతలుగా పేరు పొందాయి. ఈ కావేరి నది ప్రవహించే తీరాన వుండే ప్రాంతాలు పట్నాలు కావేరీ నది ఉప్పొంగుటవల్ల రూప నామము లేక లక్షలాది ప్రజలు నిలువ నీడలేక చచ్చేదరు. ఇది కాలజ్ఞానం ప్రకారం పరాభవ సం॥లోపు అనగా 2026 సం॥లో జరిగి తీరవలసి వుంది.

నా మఠమున ఈశాన్య భాగమున నవరత్నమంటపములు వెలసేను

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా పట్నాల సన్యాసి రావు వీరి ధర్మపత్ని శ్రీమతి రత్నం గార్లచే సృష్టికి సంబంధించిన తొమ్మిది దేవాలయములు నిర్మించబడినది. 17 ఫిబ్రవరి 2005న ప్రతిష్టింపబడిన ఈ దేవాలయంలో శ్రీ పంచముఖ హెరంబ గణపతి, శ్రీ గాయత్రి విశ్వకర్మ భగవానులు సధ్యోజాత, వాయదేవ అఘోర, తత్పురుష, ఈశాన్యముక పంచకముల నుండి ఉద్బవించిన మను, మయ, త్వష్ట, శిల్పి విశ్వజ్ఞాలనబడు, శ్రీపార్వతి పరమేశ్వరుడు, శ్రీలక్ష్మీదేవి సమేతత విష్ణుమÖర్తి, శ్రీసరస్వతి దేవి సమేత, బ్రహ్మదేవుడు, శ్రీశశిదేవి సమేత ఇంద్రభగవానుడు, శ్రీసంజ్ఞదేవి సమేత సూర్యభగవానుడు మరియు వేణుగోపాల స్వామి, శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి వార్ల ప్రపంచమున సర్వ మానవాళికి గోత్రముల పురుషులైన సానగ, సనాతన, అహబూన, లవబడు గోత్రఋషును, అలాగే వీరందరికి మÖలమైన శ్రీగాయత్రి విశ్వకర్మ భగవానులు ప్రపంచమున మరెక్కడ లేని విధంగా నవరత్న మంటపములు కాలజ్ఞానం చెప్పినట్లుగా నిర్మింపబడినాయి. ఇదీ కాలజ్ఞానమహిమే ముందుగా చెప్పిందే.






కాలజ్ఞానం ప్రకారం ప్రస్తుతం జరుగుచున్నవి


1. మంచినీటిచే దీపాలు వెలిగించేరు.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా భారతదేశంలో నదులకు వర్షాలే ఆధారం కావడంతో వర్షాల ఆధారంగా కురిసిన నీటిని కాలువల ద్వారా నదులకు నదుల ద్వారా ప్రాజెక్టులకు మళ్ళించి తద్వారా విద్యుదుత్పత్తిని చేస్తున్నారు. భారతదేశంలో నిత్యం ప్రవహించే జీవనదులుండటంతో ఆయా రాష్ట్రాలు జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోగల్గుతున్నాయి. ప్రస్తుతం ఇళ్ళలో, ఆఫీసుల్లో, వీదుల్లో, పరిశ్రమల్లో వెలిగే లైట్లన్ని నీటి ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంట్ ద్వారా వెలుగుచున్నాయి. 


తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ కేంద్రాలు:

ప్రాజెక్టుపేరు నిర్వహించే సంస్థ

నాగార్జున సాగర్ మెయిన్ పవర్ హౌస్ టీఎస్ జెన్‌కో

నాగార్జున సాగర్ ఎడమకాలువ పంప్‌హౌస్ “ “

శ్రీశైలం ఎడమకాలువ పవర్ హౌస్ “ ”

పోచంపాడు పవర్ హౌస్ “ ”

సింగూర్ పవర్ హౌస్ “ ”

నిజాంసాగర్ పవర్ హౌస్ “ ”

జూరాల హైడల్ ప్రాజెక్టు “ ”

జూరాల హైడల్ ప్రాజెక్టు “ ”

ఈ విధంగా జలవిద్యుత్ కేంద్రాలద్వారా విద్యుత్పత్తి జరగడము వల్ల మంచి నీటిచే  దీపాలు వెలుగుచున్నాయి. ఇదా కాలజ్ఞాన మహిమే 17 వ శతాబ్దంలో  చెప్పినదే. 


2. రోగాలు ఘనమయ్యేను మందు పారకపాయ్యేను

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగ ప్రాణాలు నిలబెట్టాల్సిన మందులన్ని పదును కోల్పోతున్నాయి. వ్యాది కారక క్రిములు జడలు విచ్చుకుంటున్నాయి. వీటి బలం ముందు మందుల పవర్ దూదిపించలా తెలిపోతోంది. సాంకేతికంగా ఎంతో ప్రగతి సాధించామని, సైన్స్ మరెంతో అభివృద్ధి చెందిందని చెప్ప్పుకుంటున్న మానవుని మేదాశక్తిని సవాల్‌చేస్తూ  ఎప్పటికప్ప్పుడు కొత్తజబ్బులు వస్తూనే ఉన్నాయి. వ్యాది కారకాలు డ్రగ్ రెసిసెట్టన్స్ పెంచుకొని ఏ మందుకు లొంగని స్థాయికి చేరుతున్నాయి. ఈ పరిణామం ఇప్ప్పుడు వైద్య రంగానికే పెను సవాలు విసురుతోంది. మామÖలు గాయాలు జబ్బులు ఇన్‌ఫెక్షన్లు కూడా తగ్గని పరిస్థితి ఏర్పడిందని,, మున్నుందు మానవాళి మనుగడే ప్రమాదంలో పడిపోతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తేలిగ్గా తగ్గిపోయే జలుబు దగ్గు జ్వరం చిన్న చిన్న జబ్బులకు సైతం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ అష్టకష్టాలు పడుతూ ఖరీదైర మందులు వాడినా లొంగని నయం కాని దుస్థితి తలెత్తిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఐదేళ్ళలో గడ్డం గీసుకుంటే అయ్యే గాయాలు కూడా మానవేమోయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా రోగాలు మొండిగా మారి పోవడం వల్ల మందులు పని చేయవు. ఇదీ కాలజ్ఞానమహిమే ముందుగా చెప్పినదే. 


త్రాగునీటిని విక్రయించేరు. 

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి  కాలజ్ఞానంలో చెప్పిన ప్రకారంగ భూమి, గాలి, నీరు, అగ్ని ఆకాశం పంచ భూతాల్లో ఒక్కటైన ప్రకృతి ప్రసాదంగా లభ్యమయ్యే  నీరు నేడు వ్యాపార వస్తువుగా మారి అమ్మేవారికి పన్నీరు కొనేవారికి కన్నీరులా అన్నట్లు మంచి నీరు కాసులు కురిపించే కల్పతరువుగా మారింది. సహజసిద్దంగా భూదేవి అందించే నీరు ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉండాల్సిందిపోయి  నేడు త్రాగునీరు గొప్ప వ్యాపార వస్తువుగా మారంతో ఉద్యోగ వ్యాపారాలు అవసరాల నిమిత్తం బయటికి వెళ్ళినప్ప్పుడు తప్పనిసరిగా డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది. కొందరు వ్యాపారస్తులు మినరల్ వాటర్ పేర ప్లాంట్ ఏర్పాటు చేసుకొని ఎలాంటి టెస్టులు లేకుండా ఎంత వాటర్‌కు ఎంత మినరల్ కలపాలన్నది అవగాహన లేకుండా మామÖలు నీళ్ళనే మినరల్ వాటర్ ప్యాకింగ్ చేసి బాటిళ్ళలో క్యాన్లలో నింపి ప్రజలను బోల్తా కొట్టించే మల్టినేషనల్ కంపెనీల వరకు ఈ మంచినీళ్ళ వ్యాపారం కాసులు కురింపించే వరంగా మారిందని చెప్పడంలో సందేహం లేదు. ఈ విధంగా కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే మంచి నీటిని అమ్ముచున్నారు. ఇదీ కాలజ్ఞాన మహిమే ముందుగా  చెప్పినదే.


ఆస్తుల కోసం అయిన వాళ్ళే చంపుకునేరు.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఆస్తుల కోసం సొంత అన్నను, తమ్ముడు చంపేశాడు. ఆస్తుల పంపకాల్లో తేడా వచ్చిందని కన్న తండ్రిని ఓ కొడుకు దారుణంగా హత్యచేశాడు. తనతో విడిపోయిన మొదటి బార్యకు ఆస్థిలో వాటా ఇవ్వాల్సివస్తుందని హత్యచేశాడో ఓ భర్త, ఆస్తుల్లో బాగం ఇవాల్సివస్తుందని తోడబుట్టిన చెల్లెల్ని అన్న దారుణంగా అంతమొందించాడు. కన్నతల్లిని హింసిస్తే గుప్తనిధులు సొంతమవుతాయన్న జ్యోతిష్యుడి మాటలు నమ్మి ఓ కూతురు తన తండ్రితో కలిసి తల్లిని చిత్రహింసలకు గురి చేశారు. ఆస్తి కోసం సభ్య సమాజం తలదించుకొనేలా దారుణాలకు పాల్పడుతున్నారు. మానవత్వం మంటకలిసి పోతోంది. ప్రేమభిమానాలు మచ్చుకైన కనిపించడం లేదు. బంధాలు అనుబంధాలను ప్రక్కనపెట్టి ఆస్తుల కోసం కుటుంబ సభ్యులే ప్రాణాలు తీస్తున్నారు. మరో సంఘటనలో కన్న తల్లిని కన్న కొడుకు చంపి ఇంట్లో పాతిపెట్టాడు. ఓ ఉన్మాది ఆస్తి కోసం భార్యా, కూతురు, తల్లిని కిరాతంగా చంపేశాడు. త్రాగడానికి డబ్బు ఇవ్వలేదని చెల్లెలిని చంపేసిన అన్నయ్య. ఆస్తుల గొడవలోఅత్తను చంపిన కోడలు. తనకు తెలియకుండా రూ॥ 30 వేలు బందువులకు ఇచ్చిందని భార్యను గొంతు నులిమి చంపిన భర్త. ప్రతిరోజు ఏ పేపరు చూసిన ఏ న్యూస్ చానల్ చూసిన ఇలాంటి వార్తలే అధికం. ఇటీవలి కాలంలో హైద్రాబాద్‌లోని జంట నగరాల పరిదిలో ఏడాది కాలంగా 30కి పైగా ఆస్తి కోసం హత్యలు జరిగినట్లు పోలీస్ రికార్డులు తెలియజేస్తున్నాయి. ఇదీ కాలజ్ఞాన మహిమే. 17వ శతాబ్దంలో చెప్పి హెచ్చరించినవే.


కుంటలు బావులు చెరువులు నదులు జలాలు లేక ఇంకిపోయ్యేను. జుర్రేరు నీరింకదు.

కాలజ్ఞానంలో చెప్పినట్లుగా దేశంలో భూగర్భజలాలు దాదాపు సగానికి పైగా తగ్గి పోయాయని కేంద్ర జలవనరుల, నదుల అభివృద్ధి గంగా ప్రక్షాళన మంత్రిత్వశాఖ ప్రకటించడం ఆందోళన కలిగించే అంశం. భారత్‌లో వివిధ ప్రాంతాల్లోని 14346 బావులను పరిశీలిస్తే అందులో 46%పైగా భూగర్భ జాలాలు అడుగంటిన విషయం బయటపడినట్లు ఆశాఖ అధికారికంగా వెల్లడించింది. కేంద్ర భూగర్భ జలాల బోర్డు సేకరించిన ఈ వివరాల ప్రకారం 2010`2014 వరకు ఉన్న భూగర్భ జలాలతో పోల్చినప్ప్పుడు 46%కి పైగా తగ్గిపోయినట్లు వెళ్ళడైంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, డిల్లీ, గుజరాత్ , మేఘాలయ, పుదుచ్చేరి, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో అయితే 50% పైగా భూగర్భజలాలు అడుగంటిన విషయం వెలుగు చూసింది. ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్‌ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండి పెరుగుతున్న జనాభాకు పారిశ్రామిక అవసరాలకు, వ్యవసాయానికి ప్రధాన ఆధారం భూగర్భజలాలే. రోజురోజుకు పెరుగుతున్న అవసరాలు వర్షాభావం వల్ల భూగర్భజలాలు గతంలో ఎన్నడూ లేని విధంగా అడుగంటి పోతున్నాయి. ఈ విధంగా దేశవ్యాప్తంగా వున్న బావులు, కుంటలు చెరువులు నదులలోని నీరింకి పోయినను జుర్రేరు నీరు మాత్రం ఇంకదు. ఇదీ కాలజ్ఞాన మహిమ 17వ శతాబ్దంలో చెప్పినదే. 


రైతుల ఆత్మహత్యలు

ఎంతో కాలంగా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. 1995 నుండి 2014 దాకా 20 సం॥లలో 3,01,1923 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో 44 వేల మంది మహిళరైతులున్నారు.

సం॥ దేశవ్యాప్తంగా సం॥ దేశవ్యాప్తంగా  

చనిపోయినరైతులు చనిపోయినరైతులు

1995 10,270 2005 17,131

1996 13,729 2006 17,060

1997 13,622 2007 16,632

1998 16,015 2008 16,196

1999 16,082 2009 17,368

2000 16,603 2010 15,964

2001 16,415 2011 14,027

2002 17,971 2012 13,754

2003 17164 2013 11,772

2004 18,241 2014 5650

రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నేషనల్ క్రై రికార్డ్ బ్యూరో , వివిధ రాష్ట్రాలలో నమోదు చేసిన వివరాలు చెబుతున్నాయి. ఇదీ కాలజ్ఞానమహిమే ముందు చెప్పినదే.


కల్లు గంజాయి నల్లమందు సేవించి దురాచారులై అజ్ఞానులైపోదురు

కాలజ్ఞానంలో చెప్పినట్లుగా మనుషుల ప్రాణాలను పీల్చి పిప్పి చేసే మాదక ద్రవ్యాలకు పెదవాళ్ళు దనికులు అనే తేడా లేకుండా వీటి భారిన పడుతున్నారు. గంజాయి, నల్లమందు, కొకైన్ హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలకు హైదరాబాద్ అడ్డాగా మారిపోయింది. దేశ విదేశాల నుండి స్మగ్లింగ్ అయ్యే కొకైన్ హెరాయిన్ వంటి డ్రగ్స్‌కు సినిమా నటుల నుంచి వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, సంపన్న వర్గాల దాకా ఈ డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. దక్షిణ అమెరికా ఆఫ్రికా దేశాలకు చెందినవారు వివిధ మార్గాల ద్వారా డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలించి వీరికి అందజేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడకు వస్తున్న మాదక ద్రవ్యాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. ఈ విధంగా డ్రగ్స్ బారినపడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదీ కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే జరుగుతున్నది.


వడ్డీల గురువయ్య వచ్చేను నూటికి పది లెక్కనిచ్చేను కొంపగోడూలేకచేసేను. పేదల రక్తంబు పీల్చేను.

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా దేశవ్యాప్తంగా మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాలో నివసించే పేద, మధ్య తరగతి వాళ్ళ అవసరాలను ఆసరా చేసుకొని నూటికి 5 నుండి 10కి అధిక వడ్డీలు వసూలు చేసే ప్రవేటు వడ్డీ వ్యాపారులు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి. అనుమతులు లేని ప్రవేట్ ఫైనాన్స్ కంపెనీలలో పేరు మోసిన రౌడీలు, గుండాలు వడ్డీల మొత్తాలను వసూలు చేస్తూ వేదింపులకు బెదింపులకు పాల్పడుతున్నారు. అత్యవసరపరిస్థితిల్లో చిన్నచిన్న వ్యాపారాలు, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు కోసం, వైద్యంకోసం, విదేశీ చదువులకోసం ఉద్యోగాల కోసం తప్పనిసరి పరిస్థితిలలో డబ్బు అవసరమైన వారు ప్రవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వీరి అవసరాలను ఆసరా చేసుకొని నూటికి 5రూ॥ నుండి 20రూ॥ల వరకు వడ్డీలు వసూలు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి వడ్డీరేట్లు పెంచుతూ వడ్డీ వ్యాపారులు కోట్లకు పడగలెత్తుతున్నారు. హైద్రాబాద్ మహానగరంలో దాదాపు 200 మందికి పైగా అధిక వడ్డీలు వసూలు చేసే వ్యాపారున్నట్లు ఒక అంచనా. ఈ మధ్యన దేశవ్యాప్తంగా సంచనం సృష్టించిన కాల్‌మని  వడ్డీ వ్యాపారుల ఆగడాలు టీవిల్లో, పేపర్లో చూసి దేశమంతా నివ్వెరపోయింది. ముఖ్యంగా కాల్‌మని వడ్డీ వ్యాపారంలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు రక్షకులుగా ఉండటం గమనార్హం. అప్ప్పు తీసుకున్న వ్యక్తి సకాలంలో వడ్డీ చెల్లించకపోతే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించటం, వారి బ్యాంకు చెక్కులను ఏటీఎం కార్డులను స్వాదీనం చేసుకోవడం, వాహనాలను పట్టుకవెళ్ళడం, ఇళ్ళకు వచ్చి సామాన్లు పట్టుకుపోవడంతోపాటు, ఇళ్ళను ఫాట్లను వారి పేర వ్రాయించుకోవడం మహిళలను కిడ్నాప్ చేసి నగర శివారుల్లో ఉన్న ఇళ్ళలో వుంచి తాళాలు వేసిన సంఘటలున్నాయి. ఈ విధంగా వడ్డీవ్యాపారుల ఆగడాలు భరించలేక లక్ష రూ॥ అప్ప్పుతీసుకుంటే 4 లక్షలు వడ్డీ 5లక్షలు కట్టినట్లు బాధితులు వాపోతున్నారు. అనేకమంది వడ్డీ కట్టలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు అనేకం వున్నాయి. ఈ విధంగా వడ్డీల పేరుతో పేదల రక్తాన్ని పీల్చి వారి ఇళ్ళను, భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇదీ కాలజ్ఞాన మహిమే 17వ శతాబ్దంలో చెప్పి హెచ్చరించినదే.


లంచాల రక్కసి కాళ్ళక్రింద నలిగిఅరచరచి చచ్చేరు

కాలజ్ఞానంలో చెప్పినట్లుగా ఇందులదు అందులేదనుచు రసందేహం వలదు ఎదెందు చూచిన అందందే కలదు. దేశమంత  ప్రభుత్వకార్యాలయాల్లో అవినీతి అంటువ్యాదిలా విస్తరించింది. వీరిలో చిన్నా పెద్ద అన్న తారతమ్యం లేకుండా అన్ని స్థాయిల్లోని అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఏసీబి వద్ద నమోదైన కేసులపై జరిపిన సర్వేలో వెల్లడైంది. దేశంలో సాలీనా పట్టణ ప్రాంత ప్రజలు సగటున 440 రూ॥లు, గ్రామీణ ప్రాంత ప్రజలు సగటున 2900 రూ॥లు లంచాలు లేదా ముడుపుల రూపంలో చెల్లిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు చేతులు తడపనిదే పనులు జరగడం లేదని పేర్కొనడం గమనార్హం. వివిధరకాల పెన్షన్ల మంజూరు, కుల, ఆధాయ, నివాస, ద్రువపత్రాలు, భూములు రిజిస్ట్రేషన్లు, రేషన్‌కార్డులు, ప్రభుత్వపథకాల ద్వారా లబ్ది పొందాలంటే లంచాలు ఇవ్వాల్సిందే. ఇక రాజకీయంగా చూస్తే ఉద్యోగుల నియమాకాలు బదీలు, వివిధ పనులకు సంబంధించిన కాంట్రాక్టులు సెటిల్‌మెంట్లు మైనింగ్, ఇసుక క్వారీలు తదితర విషయాల్లో భారీగా ముడుపులు అందుతున్నట్లు వెల్లడైంది. ప్రభుత్వ ఉద్యోగాలకు లంచాలు ఇవ్వనిదే ఉద్యోగాలు రావు. ప్రభుత్వ ఆసుపత్రిలో ముడుపులు చెల్లించనిదే వైద్యం జరగని పరిస్థితి ఏర్పడింది. ఇలా లంచాలు ఇవ్వలేక లంచాలు రక్కసి క్రింద నలిగి అరచరచి చస్తున్నారు. ఇదీ కాలజ్ఞానమహిమే ముందుగా చెప్పినదే. 


యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకెవేసి రాళ్ళు మ్రింగేను.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాలోగల బనగానపల్లె నుండి 10 కి॥మీ దూరంలో ఎర్రమల కొండల్లో వెలసిన “యాగంటి”ఒక ప్రసిద్ధ శైవక్షేత్రం. ఈ ఆలయంలో ప్రధాన ముఖద్వారమునందు ఈశాన్య దిశయందు నందీశ్వరుడు వెలయడము ఈ క్షేత్రం యొక్క ప్రత్యేక ఆకర్షణ. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా యాగంటి దివ్యక్షేత్రంలో వెలసిన నందీశ్వరుడు. సుమారు 100 సం॥ల క్రితం నాలుగు స్తంబాల లోపల నందీశ్వరుని చుట్టూ ప్రదక్షణాలు చేయడానికి భక్తులకు వీలుగా ఖాళీస్థలం ఉండేదట. కానీ నేడు నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఏమాత్రము అవకాశము లేకుండా పెరిగి పోయాడు. పురావస్తు శాఖవారికి లెక్కల ప్రకారం 20సం॥లకు ఒక అంగుళము చొప్ప్పున నందీశ్వరుడు పెరుగుతున్నట్లు అంచనా వేశారు. దీనిని బట్టీ కాలజ్ఞానం ప్రకారము నందీశ్వరుడు పెరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమగుచున్నది. వీరబోగవసంతరాయలు వచ్చునప్ప్పుడు ఈ నందీశ్వరుడు కాలు దువ్వి రంకెవేసి రాళ్ళు మ్రింగును ఇదీ కాలజ్ఞానం ప్రకారం జరిగి తీరవలసివుంది.


పంచాంగములు పనికి మాలినవైపోవు

కలియుగ ప్రత్యక్షదైవము శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం ప్రముఖ పండితుల, సిద్ధాంతుల, జ్యోతిష్యుల పంచాంగంలో ఒక్కొక్కరు ఒక్కోవిధంగా నిర్ణయించిన ముహూర్తులతో ప్రతి పండగ వివాదస్పదంగా జరుగుతోంది. అదేవిధంగా 2015 జులైలో వచ్చిన గోదావరి మహాపుష్కరాలు కూడా వివాదస్పదంగా నిర్వహించారు. వీరంతా ప్రముఖ సిద్ధాంతులే జ్యోతిష్యులే. అయినప్పటికి ముహూర్తాలు వారి ఇష్టానుసారంగా నిర్ణయించుకుంటున్నారు. రాజమండ్రి పట్టణానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యులు మదుర కృష్ణమÖర్తి శాస్త్రి 2015 జూన్ 28వ తేదీన గోదావరి మహాపుష్కరాలకు ముహూర్తము నిర్ణయించి ప్రారంభించారు. రాజమండ్రి పట్టణానికి చెందిన మరో సిద్ధాంతి బుట్టె వీరభద్రదైవజ్ఞ శ్రీశైల ఆస్థాన పండితుడు పంచాంగకర్త అయిన శ్రీబుట్టే వీర భద్ర దైవజ్ఞ గోదావరి మహాపుష్కరాలకు జులై 7 2015 వ తేదీన పుష్కర ముహూర్తము నిర్ణయించారు. దీంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానము నిర్ణయించిన ముహూర్తము పుష్కరాలకు సరియైన ముహూర్తం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరి ముహూర్తాలే కాకుండ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సిద్ధాంతులు జులై 14 2015 న గోదావరి మహాపుష్కరాలకు ముహూర్తము నిర్ణయించడం జరిగింది. అయితే ఏది సరి అయిన ముహూర్తమో,  ఏ ముహూర్తంలో పుష్కరస్నానం చేయాలో తెలియక భక్తులు అయోమయానికి గురయ్యారు. ఏది ఏమైనప్పటికి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి పుష్కరాల సందర్భంగా 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా పంచాంగం ప్రకారం జాతక చక్రాలు పరిశీలించి సరైన పెళ్ళి ముహూర్తాలు నిర్ణయించినప్పటికిపెళ్ళిపీటల మీదనే పెళ్ళిళ్ళు ఆగిపోవడం లేదా పెళ్ళి జరిగిన తర్వాత పెళ్ళి కుమారుని ఇంటికో పెళ్ళి కుమార్తె ఇంటికో వెళ్ళేటప్ప్పుడు మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోవటం జరుగుతున్నాయి. ఒక వేళ అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరిగినా కట్నం తక్కువ ఇచ్చారనో లంచానాలు పెట్టలేదనో, భర్త పెట్టే వేదింపులు తట్టుకోలేక నిండు నూరేళ్ళు కలిసి జీవించాల్సినవారు సం॥ గడవక ముందే విడాకులు తీసుకుంటున్నారు. ఈ విధంగా కాలజ్ఞానం ప్రకారం పంచాంగములు పనికిరాకుండా పోతున్నాయి. ఇదీ కాలజ్ఞాన మహిమే ముందుగా చెప్పినదే.


తియ్యని బెల్లం చేదయ్యేను

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారూ షుగర్ వ్యాది భారిన పడుతున్నారు. డయాబెటిస్‌ని మనవాళ్ళు మదుమేహం, షుగర్‌వ్యాది, చక్కెవ్యాది, అతిమÖత్ర వ్యాదిగా వ్యవహరిస్తున్నారు. రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని శరీరం సక్రమంగా నియంత్రించ లేకపోయినప్ప్పుడు డయాబేటిస్ వస్తుంది. షుగర్ ప్రపంచంలో అన్నింటి కంటే పెద్ద జబ్బుగా మారింది. ప్రపంచలో అన్నింటి కంటే పెద్ద జబ్బుగా మారింది. ప్రపంచంలో నేడు శరవేగంగా వ్యాపిస్తున్న మదుమేహం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. గుండె ఫెయిల్‌కావడం, కిడ్ని ఫెయిల్‌కావడం, పక్షవాతం, మెదడు, లివర్ ఫెయిల్ కావడం, అలసట, నీరసం, తరుచుగా మÖత్రవిసర్జన కలగడం లాంటి అనేక ఇబ్బందులు దీనివల్ల కలుగుతాయి. గ్రేటర్ హైదరాబాద్ నగరం ఇప్ప్పుడు మదుమేహనగరంగా మారుతోంది. దేశంలో ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే మదుమేహబాధితుల శాతం హైదరాబాద్‌లోనే ఎక్కువని ప్రస్తుతం వైద్యులు చెబుతున్నారు. అంటే దాదాపు 25% అన్నమాట. ఈ విధంగా షుగర్ వ్యాదితో బాధపడుతు 25% మందికి తియ్యని బెల్లం చేదుగానే ఉంటుంది. ఇదీ కాలజ్ఞాన మహిమే 17వ శతాబ్దంలో చెప్పినదే. 


పసిపిల్లలు మొదలు కొని చావుకు దగ్గరయ్యేరు

సైన్స్ పరంగా మానవుడు ఎంత అభివృద్ధి సాధించినప్పటికిని నేటికి ప్రపంచవ్యాప్తంగా పసిపిల్లల మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన “యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యÖనిసెఫ్) తాజ నివేదికలో పేర్కొంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగ దేశంలో   అతిసార వ్యాది కారణంగా ఏడాదికి 15లక్షల చిన్నారులు చనిపోతున్నారని సైన్స్ పర్యావరణ నివేదిక తెలిపింది. ప్రపంచ దేశాల్లో నిమిషానికి 11 మంది గంటకు 700 మంది రోజుకు 16000 మంది ఐదేళ్ళలోపు చిన్నారులు మృత్యువాత పడుతున్నారని ఆందోళనవ్యక్తం చేసింది. పౌష్టికాహార లోపం మరియు రోగాల వల్ల ఈ ఏడాది 2015 లో 59 లక్షల మంది చిన్నారులు 5వ పుట్టిన రోజు జరుపుకునే లోపే మరణానికి చేరువవుతున్నారని హెచ్చరించింది. 1990లో 1.27 కోట్లుగా నమోదైన పసి పిల్లల మరణాలు 2015 నాటికి 50% పైగా మరణాలు తగ్గి 60 లక్షల కన్నా తక్కువగా చేరుకున్నప్పటికి ఆ మరణాల రేటు ఎక్కువేనని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. న్యుమోనియా ప్రసవం సమయంలో సమస్యలు విరేచనాలు, మలేరియా వంటివి ఐదేళ్ళలోపు చిన్నారుల మరణాలకు ప్రధానకారణాలని ఈ విధంగా కాలజ్ఞానం ప్రకారం పసిపిల్లలు మొదలుకొని చావుకు దగ్గరవుచున్నారు. ఇదీ కాలజ్ఞాన మహిమే ముందుగా చెప్పినదే. 


కలిపురుషుని యొక్క పుట్టుక


శ్రీకృష్ణుని నిర్యాణాంతరము కలియుగము ప్రారంభమైంది. కలియుగమంతయు కలిపురుషుని పాలనలోనికి వచ్చింది. కలి పుట్టిన పద్దతి ఏమనగా యుగారంభములోనే అధర్మడనే వాడు పుట్టేను. ఇతని భార్య పేరు అసత్యము. ఈ దంపతులిద్దరికి “అంబుడ”ను కుమారుడు “మాయ” అను పేరుగల కూతురు. వీరి యొక్క సంతానము. ఈ అన్నా చెల్లెళ్ళిద్దరు పరస్పరం ప్రేమించుకొని పెండ్లికూడా చేసుకొన్నారు. వీరికి “దంబుడ”ను కుమారుడు “వికృతి” యను పేరుగల కుమార్తె కలిగిరి. మరల ఈ అన్నా చెల్లెళ్ళు కూడా దంపతులై కాపు చేస్తూ “క్రోదమనే” పేరుగల కుమారుడు “హింస” యను పేరుగల కూతురు కలిగారు. వీరు కూడా యదా ప్రకారము భార్య భర్తలై కాపురం చేస్తూ ఉండగా వీరికి పుట్టినవాడే “కలిపురుషుడు”గా పేరు గాంచెను.

కలిపురుషుని శరీరము నిండా నూనె కారుచు నల్లనికాంతితో కాకి కడుపుతో వెడల్పైన నోటితో, ఎరుపెక్కిన కళ్ళతో మిడిగ్రుడ్లేసుకొని, కోరమీసాలతో, వికృత భయంకరాకారుడై శరీరము కంపుతో కూడి యుండును. కలిపురుషునికి జూదమన్న, మద్యమన్న, వ్యబిచారమన్న మిక్కిలి ప్రతీ. ఇన్ని అవలక్షణములు గల కలిపురుషుడు లోకాలు నేలడం ప్రారంభించాడు. ఇంతటి అందగాణ్ణి చూచి “ద్విరుక్తి” యను నవ మోహనాంగి వరించి పెండ్లియాడెను. ఈ జంటను “భయ” మను పేరుగల కొడుకు” అకాలమృత్యువు” అనే పేరుగల కూతురు కలిగారు. పూర్వం వలె వీరిద్దరు అన్నా చెల్లెండ్రు అయినను ఒకనినొకరు ప్రేమించుకొని వివాహమాడకుండా వ్యబిచరించుచూయధా ప్రకారము వీరిద్దరికి “నరక” మను పేరుగల కొడుకు “యాతన” అను పేరు గల కూతురు కలరు. తిరిగి వీరు కూడా పరస్పరము ప్రేమించు కొని అనేక మంది దురాచారులైన ధుర్మార్గులను పుట్టించారు. ఈ ధుర్మార్గులందరు కలిసి లోకాలన్ని ఆక్రమించుకొని గర్వముతో చెలరేగిపోవుచు ధర్మాన్ని ద్వంసం చేస్తూ యజ్ఞ యాగాలను సర్వనాశనము చేస్తూ సత్పురుషులను పీడిస్తూ పవిత్ర కార్యక్రములు చేయకుండ పాపకృత్యములు మాత్రమే పరమావదిగా తలచుచు ముసలితనము, రోగాలు, అకాల మృత్యువులతో జనులను పీడించుచు అనేక బాధలు పెట్టుచుండిరి. 

కలిపురుషుని విజృంభణములతో ఎక్కడ చూచినా, తల్లిదండ్రులను తిట్టువారు, ఆచారాలు పాటించనివారు వేదములను, పురాణములను నాశనము చేయువారు, నీచులను ఆశ్రయించువారు, విద్యను, అన్నమును అమ్ముకొనువారు, మాంసం అమ్ముకొనువారు, దొంగలుగా, లంచగొండులుగా వ్యబిచారులుగా ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించుందురు.

అన్ని కులాలయందు, మతములయందు స్రీలందరు తమ తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచు, స్వేచ్ఛాజీవులై అనేక మంది పతులతో మరల మరల వివాహాలు చేసుకొనుచు స్త్రీలు వేశ్యా వృత్తిలో ధనసంసాదనే ముఖ్యముగ తలచి ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించుచు జీవితం గడుపుతూ ఉంటారు. లోకంలో అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, తుఫానులు సంభవించుచుండును. పాలకులు పనుల పేరిట జనాన్ని హింసించుచుందురు. దరిద్ర దేవత బ్రాహ్మణుల ఇంట నాట్యమాడును. వారు నీచుల ఇళ్ళలో సేవలు చేస్తూ జీవితం గడుపుతుంటారు. స్త్రీలు భ్రూణహత్యలకు పాల్పడుదురు. జనులకు ఆయుషు తగ్గును. మతాచారములు మంట కలుస్తాయి. జనులు వ్యబిచార ప్రియులై వేశ్యల చుట్టూ తిరుగుచుందురు. బావులు, చెరువులు, నదులు ఇంకిపోతాయి. దొంగతనాలు, ఆత్మహత్యలు పెరిగిపోతాయి. నీతినియమాలుండవు, భార్యాభర్తలకు కట్టుబాట్లుండవు. సమయం సందర్భం లేకుండా స్త్రీలు, పురుషులు కామక్రీడలతో ఎప్ప్పుడు పడితే అప్ప్పుడు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. ఈ విధంగా లోకమంతా చెడు ప్రవర్తనలతో, 




మహావిష్ణువు యొక్క దశావతారాలు


పవిత్రాణాయ సాధూనాం వినాశయచ దుష్కృతాం

ధర్మసంస్థాప నార్దాయ సంభవామి యుగే యుగే

ప్రతి యుగంలో దుష్టశిక్షణ శిష్టరక్షణార్దమై అవతరిస్తాననీ సత్పురుషుల రక్షణయే తన కర్తవ్యమని భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించాడు. భగవంతుడు భూమ్మీద ఎప్ప్పుడు అవతరించినా దేవతలకు విరోది అయినా వారిని సంహరించి ధర్మాన్ని స్థాపించడం జరుగుతుంది. దుష్టశిక్షణ శిష్టరక్షణ కొరకై కృతయుగంలో నారసింహునిగా, త్రేతాయుగంలో రావణుని సంహరించడానికై శ్రీరామునిగా, ద్వాపరయుగంలో కంసుని వదించేందుకై శ్రీకృష్ణునిగా, కలియుగంలో అన్ని పాపాలకు మÖల పురుషుడైన కలిపురుషుని సంహరించడానికి గాను శ్రీవీరభోగవసంతరాయులుగా అవతరించియున్నారు. శ్రీమహావిష్ణువు ఇప్పటి వరకు ఎత్తిన దశావతారాలు క్రింద వివరించబడ్డాయి.

1. మత్స్యావతారం: శ్రీమహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం. సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్న వైవస్వత మనువుకు చేతిలోని జలాల్లో చేపపిల్ల కనపడింది. దానిని రక్షించే ఉద్దేశంత ఒక పాత్రలోని నీట్లో దాన్ని వేసి సంరక్షించబోయాడు. అది ఇంకా పెద్దదిగా ఎదిగి పోగా దాన్ని చెరువలోకి మార్చాడు. చెరువు సహితం పట్టనంత ప్రమాణాన్ని ఆ చేప సంతరించుకోవడంతో దాన్ని ఒక సముద్రంలోకి మార్చాడు. అత్యంత స్వల్ప వ్యవదిలోనే ఇలా తన ప్రమాణాన్ని పెంచుకుంటూ పోతున్న ఆ చేపను అసాధారణ మైనదిగా దేవ మాయగా గుర్తించాడు. దానిని శ్రీహరిరూపంగా భావించి సోత్రములు చేయగా మత్స్య రూపుడైన నారాయణుడు వైవస్పతమనువీరా! త్వరలో ప్రళయం సంభవించనున్నదని చెప్పాడు. ఇంతలో బ్రహ్మ సృష్టికార్యం ప్రారంభించగా సోమకాసురుడు వేదాల్ని అపహరించి సముద్రంలో దాగియుండగా ఆమత్య్సరూపుడైన నారాయణుడే వానిని సంహరించి తిరిగి వేదాలను బ్రహ్మకు అప్పగించాడు.

2. కూర్మావతారం: ఇది దశావతారాల్లో రెండవది. దుర్వాస మహర్షి శాపం స్వర్గాదిపతి ఇంద్రుని సంపదలన్నీ సముద్రంలో కలిసిపోగా శ్రీమన్నారాయణుడి సలహాపై రాక్షసులతో చెలిమి నటించి దేవతలు సముద్రాన్ని మధించారు. ఈక్షీర సాగర మధనంలో వాసుకిని కవ్వం తాడుగాను, మందర పర్వతాన్ని కవ్వంగాను ఉపయోగించి చిలుకసాగారు. అయినప్పటికి పర్వతము సముద్రమున మునిగి పోతుండగా నారాయణుడు దానికి అధారభూతుడైన పీఠగా కూర్మరూపుడై నిలువరించాడు. దానితో మళ్ళీ యధాస్థితి నెలకొని దేవతల వస్తువులన్నీ దేవతలకు అమృతంతో సహా లభించాయి.

3. వరహావతారం: ఇది దశావతారల్లో మÖడవది. హిరణ్యాక్షుడనే రాక్షసుడు దేవతలను తరిమేసి స్వర్గాన్ని ఆక్రమించి ముల్లోకాల్నీ ముప్ప్పుతిప్పలు పెట్టుచుండగా శ్రీవారి యజ్ఞ వరాహరూపుడై భీకరమైన తన కోరలపై భూమిని నిలబెట్టి ఆరాక్షసున్ని వధించాడు.

4.  నృసింహావతారం: దశావాతారాల్లో ఇది నాల్గవది. హిరణ్యాక్షుడు సోదరుడు హిరణ్యకశిపుడు. తన అన్నను శ్రీహరి వధించినందుకు కక్ష బూని శత్రుత్వము వహించగా ఒక స్తంభం నుండి నృసింహావతారుడై బయటికి వచ్చి హిరణ్యకశ్యపుడ్ని వధించాడు.

5. వామనావతరం: దశావతారాల్లో ఐదవది వామనావతారం బలిచక్రవర్తి ఇంద్రుడిగా పదవినలంకరించి తన రాక్షస బుద్ధిచేత దేవతలను స్వర్గం నుంచి వెడలగొట్టగా నారాయణుడు వామనుడిగా అవతరించి బలియొక్క దాన గుణాన్ని అడ్డుగా పెట్టుకొని మÖడడుగుల నేల దానంగా గ్రహించి ఒక్క అడుగుతో భూమిని, మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి మÖడో అడుగు ఎక్కడ వేయమంటావో చెప్పమని అడిగి బలి తన శిరస్సును చూపగా మÖడో అడుగు అక్కడవేసి ఆ రాక్షసున్ని పాతాళానికి త్రొక్కేశాడు. 

6. పరశురామావతారం: దుష్టశిక్షణార్దమై శ్రీహరిఎత్తిన ఆరో అవతారం ఇది. ఒకప్ప్పుడు ధుర్మాదాందులైన రాజుల వల్ల సర్వులకును క్లేశములు సంభవించగా నారాయణుడు జమదగ్నికి కొడుకుగా పుట్టి పరశువు(గండ్రగొడ్డలి) ధరించి వారినందర్ని ఇరవై ఒక్క పర్యాయములు దండయాత్ర సంహరించాడు.

7. శ్రీరామావతారం: మహా బలవంతుడు శివభక్తుడైన రావణాసురుడు లంకనగరానికి రాజు దేవతలచే అనేక వరములు పొంది మారువేశంలో అడవికి చేరి సీతను అపహరించి లంకా నగరానికి చేరాడు. విషయం తెలుసుకున్న రాముడు ఆవేదనకు గురైనాడు. రాముడు సీత జాడకై హనుమంతుని సహయం కోరాడు. సీతజాడ తెలుసుకున్న హనుమంతుడు రాముడికి తెలిపాడు. రాముడు రావణుని సంహరించి రామబాణంతో రావణుని సంహరించాడు.

8. శ్రీకృష్ణావతారం: దుష్టశిక్షణార్దమై శ్రీహరి ఎత్తిన ఏనిమిదోవతారం ఇది. దేవకీ వసుదేవులకు అష్టమ గర్భాన జన్మించి రేపల్లెలో నందుని ఇంట పెరిగి బాల్యం నుంచే రాక్షసవధ చేస్తూ యశోద తనయుడిగా గోప బాలకులతో ఆటలాడి మధురనేలే  మామ కంసుడిని అంతమొందించి తాతగారికి తిరిగి రాజ్యం ఇప్పించాడు. పాండవ పక్షపాతియై భారతయుద్ధము నడుపుట మొదలగు లీలలన్నీ ఈ అవతారంలోనివే.

9. బుద్దావతారము: దశావతారల్లో తొమ్మిదోవతారం ఇది. ఎప్పటిలాగే లోకంలో అధర్మం పెచ్చరిల్లి ధర్మం సన్నగిల్లినపుడు శ్రీహరి అవతారము ఎత్తుచుండుట అందరికి తెలిసినదే. అట్టిదే ఈ బుద్దావతారం కూడా. రాక్షసులను వేద విరుద్ద బోధలతో ఆకట్టుకొని దేవతలకు తగినంత బలాన్ని చేకూర్చి రాక్షసులను సంహరించడానికే ఈ అవతారం.

10. కల్కి అవతారం: దుష్టశిక్షణ శిష్టరక్షణార్దమై మహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో చివరిది. కల్కి అవతారం. కలియుగానికి అధిపతి అయిన అక్రమాలకు అన్యాయాలకు అన్ని పాపాలకు మÖలపురుషుడైన కలిపురుషుని సంహరించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగానున్న పాలకుల రూపంలోనున్న దోపిడి దార్లను సంహరించడం ద్వారా కలియుగ ధర్మము నశించును. తద్వారా కలియుగాంతం అవుతుంది. కలియుగాంతంలో శ్రీమన్నారాయుణుడు మÖడుమÖరల ఖడ్గాన్ని ధరించి తెల్లని అశ్వాన్ని అధిరోహించి కలిమాయ విశేష పీడుతుల ఉద్దరణకై ధర్మసంస్థాపనకొరకై పాప వినాశనం జరుగుతుంది. 

2034 కలియుగాంతం:

ఆనందే దనుజాబ్దేతు లోకేశ్మిన్ కలినాశనమ్

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఏకాదశాశ్వాసము 88వ పేజి చివరలో చెప్పినట్లుగా ఆనంద రాక్షస సం॥ లోగా అనగా 2034`2035 ఉగాది లోగా లోకమందు కలియుగ ధర్మం నాశనమవుతుంది. తద్వారా 2034లో కలియుగాంతమవుతుంది. 

కాలజ్ఞానం ప్రకారం జరుగుచున్నవి (బిట్స్)


1. స్త్రీలు లజ్జను వీడి నడి వీధిలో చేరి మానంబు నమ్ముకొని బ్రతికేరు. సీతమ్మ తల్లులు పుట్టిన దేశమున చీడపురుగులు పుట్టేను.

2. రాజులేని రాజ్యమొచ్చేను ప్రజలే రాజులై యేలేరు. గజదొంగలు అందులో కలిసేరు. గంజి లేక ప్రజలు చచ్చేరు. 

3. తల్లిదండ్రులను గురువు దైవమును దూషించు తొత్తు కొడుకులు యిలలో పుట్టేరు.

4. అన్నదానంబని అసలు మ్రింగే వాళ్ళు ఓట్లు సంపాదించి కోట్లు జేర్చే వాళ్ళు పెరిగి పొయ్యేరు.

5. అన్నదమ్ముల మధ్య కలహంబులు పెరిగేను. పరమశత్రువుల వలే మెలిగేరు.

6. మగవారికన్న ఆడవారు అధికంగా అవనిలో పుట్టేరు.

7. కన్నబిడ్డను కూడ కామించేటి ధుర్మార్గులు యిలలోన పుట్టేరు.

8. తిన్న ఇంటికి కన్నమేసేటి ద్రోహులే కలిమాయ కొడుకులై పుట్టేరు.

9. లంచాల కొడుకులే పుడతారు. కంచాలు మ్రింగేసి పోతారు. వంచనే జీవితమయ్యేన. మరుజన్మలో పురుగులై పుట్టేరు.

10. రాజకీయము పేర కల్లోలములు పెంచి దేశమును నాశనము చేసేరు. దేశనాయకుల మనుచు దెయ్యాలుగా మారి ప్రజల రక్తము త్రాగి బ్రతికేరు.

11. ప్రేమ ప్రేమయనుచు పెడదారి పట్టేరు. పెండ్లి కాకముందే గర్భమును దాల్చేరు.

12. ముండమోపుýకు బిడ్డలు పుట్టేరు. పాపబీతిలేక ప్రాణాలు తీసేరు.

13. నాగరిక మనుచు స్త్రీలు సిగ్గు విడిచి జానెడు బట్ట కట్టేరు. 

14. కన్న బిడ్డýనైన అమ్మోరు కఠినంగా కాలం గడిపేరు.

15. మనిషి మనిషిని చంపి మాంసంబుగా జేసి మణుగోక్క నూటికి అమ్మేరు. 

16. కోట్లు ఖర్చు పెట్టి వంతెనలు భవనాలు నిర్మించు నిపుణులే వచ్చేరు. మొత్తమును మ్రింగేసి మÖడు రోజులకెల్ల కూలి పోయేటట్లు కట్టేరు.

17. వైద్య నిపుణులెల్ల లేని వ్యాదిని పెంచిపెద్ద మొత్తాలను గుంజేరు.

18. కడుపు నింపుకొనగ అన్యాయమును పెంచి న్యాయవ్యాదులమని చెప్పేరు.

19. బూటక స్వాములు వచ్చేరు. బూడిదను మహిమతో ఇచ్చేరు. బూడిదను ఇవ్వగలిగి బంగారు ఇవ్వలేరు. అది ఏమి మహిమ చెప్పండి.

20. కల్తీ కోడుకులే పుడతారు. అన్నిట్లో కల్తీలు చేస్తారు.

21. క్షణకాల కైపుతో తైతక్కలాడేటి త్రాగుబోతులను చూచి తిట్టేరు. స్త్రీకైపు, సిరికైపు, జూదకైపు కైపు లేని వారు కలియుగంబున అరుదుగా నుండేరు.

22. ఆలిమాటలు నమ్మి తల్లిదండ్రులను తన్నే పెద్దమనుష్యులు యిలలో పుడతారు.

23. వెయ్యి మందిని చంపి వేడుకలు జేసిన దనమున్న వారికి చెల్లేను. నీతి నియమముతోడ జీవుంచు నిరుపేద పెదవి విప్పిన పెద్ద తప్పేనయ.

24. దైవంబు పేరుతో వ్యాపారము బెట్టి కొళ్ళ గొట్టే పెద్దలొచ్చేరు.

25. అంతులేని కరువులొచ్చేను. అమ్మేరు.

26. హైందవ ధర్మము అణగారి పోయేటి నాగరికతను పెంచుకొని పోయేరు. భక్తిని వెదజల్లు పసుపు కుంకుమ వీడి పరువు తీసే వేషమేసేరు.

27. నిలువ స్థలమే లేక నీళ్ళపై ఇండ్లను నిర్మించు నిపుణులే వచ్చేరు. 

29. పవిత్రమైనట్టి స్వధర్మమును వీడి పరధర్మమును అనుసరించేరు.

29. దైవంబు ఒక్కడే వివిధ రూపాలతో వివిధ మతస్థులు కొలిచేరు.

30. పర్వతము క్రిందున్న బంగారం కనిపెట్టి పర్వతాలను పగలకొట్టేరు.

31. అగ్రకులము వారు అణగారిపొయ్యేరు. హరిజనులు అభివృద్ధికి వచ్చేరు.

32. కమ్మకాపువారు ఘనముగా బ్రతికేరు. రాజకీయము నందు రాజులయ్యేరు.

33. తల్లిబిడ్డలు కలిసి ఒకనినే ప్రేమించి బిడ్డలను కనేరు.

34. మాలమాదిగలకు మంచి యోగంబు వచ్చు దేశంబు పాలించు దొరలుగా మారేరు.

35. కులము నడ్డుబెట్టి కొళ్ళ గొట్టగా జూచు రాజకీయ వేత్తలొచ్చేరు. పవిత్రమైన భారతదేశమును ముక్కలు మక్కలుగా జేసేరు.


కాలజ్ఞానం ప్రకారం మునుముందు జరిగి తీరవలసినవి (బిట్స్)

1. తిరుమల వాసుని దేవాలయంలోన దేవకన్యలు నాట్యమాడేరు. మహాలక్ష్మీ పాటలే పాడేను. వేంకటేశ్వరుడు సంతోషించేను.

2. శ్రీ వేంకటేశ్వరుని అసలైన పూజలు అర్ధరాత్రి వేళజరిగేను. పది వేల దేవతలు బంగారు పూలతో ప్రతిరాత్రి పూజలే చేసేరు.

3. శ్రీవేంకటేశ్వరుని గర్భగుడి శిఖరాన ఏడు శిరస్సుల పాము వెలసేను. గర్భగుడి చుట్టును సింహమొక్కటి తిరిగి గర్జించి మాయమైపోయేను.

4. శ్రీ వేంకటేశ్వరుని గర్భగుడిలోకి ఏడు శిరస్సుల పాము వచ్చి బ్రాహ్మణ రూపంబు దాల్చి వేద మంత్రములను చదివేను.

5. దనమదముత దైవంబునే మరిచి గోవిందాయను భక్తి మరిచేరు.

6. వేంకటేశ్వరుని గుడిలో మాలమాదిగలెల్ల వేదమంత్రములు చదివేరు. మహ్మదీయలు వేంకటేశ్వరుడు మాదేవుడనుచు ఆటలాడిపాటలు పాడేరు. 

7. వేంకటేశ్వరుని కళ్యాణ విగ్రహము క్షణములో మాయమైపోయేను. అలివేలు మంగమ్మ గుడిలోన కనపడేను. అందరూ వింతగా చూసేరు.

8. సాదు రూపమున ఆంజనేయ స్వామి వేంకటేశ్వరుని కొలువ వచ్చేను. కొండపైనున్నట్టి కోతులన్నియు చేరి మారుతిని గుర్తించి కొలిచేను.

9. కంచి కామాక్షమ్మ మధుర మీనాక్షమ్మ కలకత్తా కాళీయు కనక దుర్గమ్మ సిద్ది విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యస్వామి వేంకటేశ్వరునని కొలువ వచ్చేరు.

10. గజదొంగ ఈ ఆరుగురు వేంకటేశ్వరుని సొమ్మును దోచుకొని పోవగా వచ్చేరు. ఏడవ దొంగగా ఏడు కొండలవాడు వారి సొమ్ము దోచి పంపేను.

11. భద్రాచలంలోని శ్రీరామ విగ్రహము భక్తులతో మాట్లాడేను. 

12. బెంగుళూర్‌లోన వైశ్య కులమున మహాలక్ష్మీ పుట్టేను. ఆమె కన్యగ నుండి నమ్మి చేరిన వార్ని ఐశ్వర్య వంతులుగా జేసేను.

13. సిరివెళ్ళ హనుమంతుడు నిజరూపమును దాల్చి సిగపట్టి పాపులను చంపేను. రామభక్తులను రమ్యముగా ప్రేమించి రక్షణగా తానుండి బ్రోచేను.

14. హంపి ఆంజనేయ స్వామి అరచి మÖల్గేను. మÖల్గు విన్న వారు నీల్గి చచ్చేరు. అప్ప్పుడే నారాక హనుమన్న చెప్పేను.

15. భూమి గడగడ వణికి నిలిచేను పర్వతములు కూలిపోయేను.

16. కొండవీటి సీమ దుర్గంబు లోపల భగ భగ మంటలే పుట్టేను. 

17. సర్వరూపమున నక్షత్రములు పుట్టేను. మతి లేను ధ్వనులను చేసేను. నుండి కొండలోనుండి మడుగులోని నీరు నక్షత్రములు త్రాగిపోయేను. 

18. బ్రాహ్మణులు మాదిగలు వాదమాడేరు. వాదమున మాదిగల మాట చెల్లెను.

19. తాడిపత్రియందు మేకొకటి వచ్చేను. ప్రజలతో మనిషిలా మాట్లాడేను. ఇది ఏమి చిత్రమని ప్రజలెల్ల గుమిగూడ క్షణములో మాయమైపోయేను.

20. గోల్కొండయందు కొంగ మాట్లాడును. వురవకొండ యందు కోడి మాట్లాడును. తాడిపత్రి యందు మేక మాట్లాడును మేక కడుపులోన మనిషి పుట్టేను.

21. తోకలేని మేక పుట్టేను. కలికాలమును దలచి యేడ్చేను.

22. కరువు కాటకాలు వచ్చేను. కోడిగ్రుడ్డుతో బియ్యం కొలిచేరు.

23. రాజకీయ మనగ ఏమిటో తెలియని రంగడు లింగడు నిలిచేరు. రాజకీయ మనుచు వూరిలోని ప్రజలను వేయి చీలికలు చేసేరు.

24. కొంగ కడుపులోన కోతిపుట్టు. కుక్క కడుపులోన కోడి ఒక్కటి పుట్టు, కుక్క పందికి పాలు ఇచ్చేను.

25. ఆకాశమంతయు ఎర్రగా మారేను. అర్ధరాత్రి వేళ రక్త వర్షము కరిసేను. అడవిలో జంతువులు వూర్లపై పడి సంచరించేను, దుర్మార్గులందరిని చంపేను.

26. మనిషి మనిషిని చంపి మాంసంబుగా జేసి మణుగొక్క నూటికి అమ్మేరు.

27. పరమ చండాలు లే పుడతారు. భక్తులను హీనంగా చూచేరు, భక్తులైనవారు శక్తులుగా మారేరు. యాగంటి క్షేత్రంబు చేరేరు.

28. రామ రామా యను ధ్యానంబు మరిచేరు. ప్రేమ ప్రేమ యని పాడయ్యి పోయేరు.

29. ఘనమైన వాహనము చేసేరు గాలిలో గ్రద్దలో పోయేను.

30. కప్ప కోడి కూసేను. పాము కప్పలాగ అరిచేను కప్పలు పాములు కలిసి జీవించే రోజులువచ్చేను.

31. ఆంధ్రదేశములోన అనసూయ పేరుతో ధర్మదేవత పుట్టేను. అన్నపూర్ణగా వెలిసి అందరిని ప్రేమించు. ఆమెయే నా దూతని తెలుసుకోండి. 

32. ఉత్తర దిక్కున వురుము ఒక్కటి పుట్టి దక్షిణమున వచ్చి మెరిసేను. వేయి సూర్యుల వెలుగునిచ్చేను, అది చూచినవారు అందులై పోయేరు.

33. నాలుగు సముద్రాల నడుమ నక్కేయున్న సొమ్ములన్ని నీటతేలేను, సర్ప రూపము దాల్చి సముద్రమే దాటి శ్రీశైలం వచ్చి  చేరేను.

34. సిద్దయ్య పుట్టేను చివరికులమునందు, శివరాత్రి కనిపించు నమ్మండి. ఘోర తపమును జేసి నాలోన జేరేను, అతడే శివుడని తెలుసుకోండి.

35. కొమ్మలతో ఒక మనిషి పుట్టేను, కోటి మందిని చంపి పోయేను.

36. చంద్రగిరి దుర్గాన శక్తులే పుట్టేను, పదివేల యేనుగులు వెంకటవచ్చేను, పల్లె పల్లెలు తిరిగి పాపాత్ములను బట్టి ప్రాణాలు తీసేను.

37. పుంజు పెట్టగ మారేను, పెట్ట పుంజుగ మారు ఇది ఏమి విచిత్రమో తెలుసుకోండి.

38. బెంగుళూర్‌లోని బసవన్ని విగ్రహము పదిరెట్లు పెరగేను, కోపముతో రంకేలు వేయుచు పాపులను పసిగట్టి చంపేను.

39. కృష్ణానది యందు రక్తము ప్రవహించు యుగ మార్పు దాని చిహ్మము కోతులన్ని చేరి నృత్యంబు జేసేను, రామ రామ యనుచు మైమరిచిపాడేను.

41. తెలుగు దేశములోన ఉత్తర దీవిలోన ఉత్పాతములు పుట్టు నమ్మండయ. గ్రామ గ్రామంబులే గంగపాలైపోవు వేలది ప్రజలందు చచ్చేరు.

42. ఆకలి బాధతో ఏకకాలమున పదహారు పట్నాలు కొళ్ళగొట్టేరు.

43. పదుగురి మేలుకై ప్రాణమిచ్చేవారు బ్రహ్మరథమున నన్ను జేరేరు.

44. అక్షయ సం॥ అక్షంతు లేసేటి ఐనవారే లేకపోయేరు. అనగా 2046లో. 

45. సాదు రూపంబున ఆంజనేయస్వామి వేంకటేశ్వరుని కొలువ వచ్చేను. కొండపైనున్నట్టి కోతులన్ని చేరి మారుతిని గుర్తించి  కొలిచేను.

46. ఆనాటి ఆంజనేయ స్వామి కొండలను మోయగా విన్నాము, ఈనాటి భక్తులు అదియోమి ఖర్మమో కుండలైననూ మోయ వెరచేరు.

47. కంచి కామాక్షమ్మ మధుర మీనాక్షమ్మ కలకత్తా కాళీయు కనక దుర్గమ్మ సిద్ది విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యస్వామి వేంకటేశ్వరునని కొలువ వచ్చేరు.

48. కదిరికి ఆమడ దూరమున నున్నట్టి మర్రి చెట్టు వద్ద తిమ్మమ్మ వెలసేను. పడరాని కష్టాలు పడిన సాద్విమణి మహిమలెన్నో చూపి సహగమనమయ్యేను.

49. కావేరినది పొంగి ఘనమైన పట్నాలు రూపనామం లేక పోయేను, లక్షలాది ప్రజలు నిలువ నీడలేక పక్షులై తిరిగేరు.

50. ఉత్తరాదిలోన మర్రి చెట్టులో నుండి కొమ్ములతో ఒక మనిషి పుట్టేను. మహిమలెన్నో చూపి దైవము నేననుచు చెప్పేను.

51. పగటివేళ ఆకాశము నుండి నక్షత్రములురాలు, పిడుగులు పడేను. బ్రహ్మాండమైనట్టి విషగాలి వీచి లక్షలాది ప్రజలు చచ్చేరు.

52. మహానందికి ఉత్తరాన ముప్పై మంది మునులు జన్మించెదరు, ప్రజలకు వారు మహిమలు చూపించేరు.


తప్ప్పులు తడకలుగా పంచాంగములు

అందరు ప్రముఖ జ్యోతిష్యులే ప్రముఖ సిద్ధాంతులే గురువు ఏ రాశిలో ఎప్ప్పుడు ప్రవేశించబోతున్నాడని పంచాంగములను పరిశీలించి చూడగా ఒక పంచాంగమునకు మరొక పంచాంగమునకు చాలా తేడాలున్నాయి. అందుకని ప్రతి పండగ ప్రతి పుష్కరాలు వివాదాస్పదంగా జరుగుచున్నాయి. ఏది ఏమైన కాలజ్ఞానం ప్రకారం పంచాంగములను మÖýన ఏడేసే రోజులు రానున్నాయి. 

తులరాశిగతీజీవే ధూమకేతూద్వవం భవేత్ 

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగ గురువ ఒక్కొక్కరాశిలో ఒక సం॥ ఉంటాడు. ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించినప్ప్పుడు ఒక్కొక్కనదికి పుష్కరాలు వస్తాయి. పుష్కర రాజైన గురువు తులరాశిలో ఎప్ప్పుడు ప్రవేశించబోతున్నాడని శతాబ్ది పంచాంగమును పరిశీలించి చూడగ 02.09.2017న గురువు తులరాశిలో ప్రవేశిస్తున్నాడు మరియు రెండవ సారి అనగ స్వస్తిశ్రీ సౌమ్య నామ సం॥ శ్రావణ మాస శుక్ల చవితి సోమవారం రోజున గురువు తులరాశిలో ప్రవేశించబోతున్నాడు. ఆ సం॥లో ఆకాశమున ధూమ కేతువులు పుట్టగలవు తద్వారా కొంత జన నష్టం సంభవించును. ఇది కాలజ్ఞానం ప్రకారం 2029 శ్రావణ మాసంలో జరిగి తీరవలసి వుంది.

గురువు వృశ్చిక రాశిలో ప్రవేశించితే అధిక ఫలంభగును

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగ గురువు వృశ్చిక రాశిలో ఎప్ప్పుడు ప్రవేశించబోతుతున్నాడని శతాబ్ది పంచాంగమును పరిశీలించి చూడగా 01.10.2018న అనగ స్వస్తిశ్రీ విళంచి నామ సం॥ భాద్రపదమాస బహుళ సప్తమి సోమవారము గురువు వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడు మరియు 10.09.2030 అనగ స్వస్తిశ్రీ సాధారణ నామ సం॥ భాద్రపదమాస శుక్ల చతుర్దశి మంగళవారం రోజున గురువు వృశ్చికరాశిలలో మరల ప్రవేశిస్తున్నాడు. ఈ సం॥లలో భీమ నదికి  పుష్కరాలు వచ్చును మరియు మంచి వర్షములు కురియుటవలన పంటలు అధికంగా పండటము వల్ల అందరు సుఖ సంతోషాలతో నుండగలరు. ఇది కాలజ్ఞానం ప్రకారం 2018లోను మరియు 2030లోను జరిగి తీరవలసి వుంది.


గురువు ధనుస్సు రాశిలో ప్రవేశమైతేను వీరధర్మరాజుల వారు పుణ్యాత్ములను రక్షించును.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానలో చెప్పిన ప్రకారంగా శతాబ్ది పంచాంగమును పరిశీలించి చూడగా గురువు ధనుస్సు రాశిలో 25.10.2019న  అనగా స్వస్తిశ్రీ వికారి నామ సం॥ర అశ్వయిజ మాస బహుళ ద్వాదశి శుక్ర వారము రోజున గురువు ధనుస్సు రాశిలో ప్రవేశించబోతున్నాడు. మరల 12 సం॥ల తర్వాత అనగా 30.09.2031న అనగా స్వస్తిశ్రీ విరోదికృత నామ సం॥ నిజ భాద్రపద మాసం శుద్ద పౌర్ణమి మంగళవారము రోజున గురువు మరల ధనుస్సురాశిలో ప్రవేశించబోతున్నాడు. ఆ సం॥ పుష్కర వాహిని నదికి పుష్కరాలు వచ్చును. అప్ప్పుడు దుర్మార్గులను సంహరించును ఇది కాలజ్ఞానం ప్రకారం 2031లో జరగవలసివుంది. 


గురువు మకర రాశిలో ప్రవేశమైతేను

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా శతాబ్ది పంచాంగమును పరిశీలించి చూడగ గురువు మకర రాశిలో 08.11.2020లో ప్రవేశించబోతున్నాడు. మరల 12 సం॥ల తర్వాత అనగా 2032 స్వస్తిశ్రీ పరదావి నామ సం॥ర భాద్రపద మాస బహుళ చతుర్దశి ఆదివారము రోజున తుంగభద్రానదికి పుష్కరాలు వచ్చును. ఆ సం॥లో వీర ధర్మరాజుల వారు అన్ని విధాలా శక్తి వంతులైన సైన్యాలతో పినాకినీ నదీ తీరానికి జేరి శ్రీశైలానికి విచ్చేయుచున్నారు. ఇది కాలజ్ఞానం ప్రకారము 2032లో జరిగితీరవలసి వుంది.


గురువు కుంభరాశిలో ప్రవేశమైతేను

కలియుగ ప్రత్యక్ష్య దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా శతాబ్ది పంచాంగమును పరిశీలించి చూడగ గురువు కుంభరాశిలో 02.11.2021లోను మరల 12సం॥ల తర్వాత 09.03.2033లో అనగా స్వస్తిశ్రీ పరదావి నామ సం॥ర పాల్గుణ మాస శుద్ద నవమి బుదవారం రోజున గురువు కుంభరాశిలో ప్రవేశించు చున్నాడు. ఆ సం॥ సిందునదికి పుష్కరాలు వచ్చును. ఈ కారణంగా భూమిని దివ్యమైన శుభం కల్గుతుంది. మరియు శ్రీశైల పర్వతము మల్లిఖార్జునస్వామి వాక్యము చేతను వీర ధర్మజుల వారు కేదార రామేశ్వర పర్వంత ఏక చక్రముగా రాజ్యమేలును. ఇది కాలజ్ఞానం ప్రకారము 2033లో జరిగి తీరవలసి వుంది.


గురువు మీన రాశిలో ప్రవేశమైతేను

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా గురువు మీనరాశిలో ఎప్ప్పుడు ప్రవేశించ బోతున్నాడని శతాబ్ది పంచాంగమును పరిశీలించి చూడగ తేది 06.04.2022 లోను మరల 12సం॥ల తర్వాత 21.03.2034లోను స్వస్తిశ్రీ ఆనంద సం॥ర చైత్రమాస శుద్ద పాడ్యమి మంగళవారము ఉగాది పర్వదినము న గురువు మీనరాశిలో ప్రవేశించబోతున్నాడు. అప్ప్పుడు ప్రణితానదికి పుష్కరములు వచ్చును. ఆ సం॥ కీర్తివంతులైన రామధర్మజుల వారి పట్టాభిషేకం కుర్వంతి దేవ బ్రాహ్మణోత్తములు చేయుదురు. ఇది కాలజ్ఞానం ప్రకారం 2034లో జరిగి తీరవలసి వుంది.


గురువు ఒక్కోక్కరాశిలో ప్రవేశించినప్ప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వచ్చును. ఏ రాశిలో ప్రవేశించినప్ప్పుడు ఏ నదికి పుష్కరాలు వచ్చునో రాశి చక్రంలో చూడవచ్చును.


మీనరాశిగతే మందే మ్లేచ్ఛానాం నాశనం భవేత్

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా నవగ్రహాలలో ఒక్కటైన శనిగ్రహం ఒక్కొక్కరాశిలో 21/2 సం॥లు చొప్ప్పున 12 రాశులును చుట్టి రావడానికి 30సం॥లు సమయం పడుతుంది. ప్రస్తుతం అనగా 2016లో శని వృశ్చికరాశిలో వున్నాడు. ఈ రాశినుండి మీనరాశిలో ఎప్ప్పుడు ప్రవేశించ బోతున్నాడని శతాబ్ది పంచాంగమును పరిశీలించి చూడగా స్వస్తిశ్రీ విశ్వావసు నామ సం॥ర పుష్యమాస బహుళ అష్టమి ఆదివారము రోజున తేది 11.01.2026లో శని మీన రాశిలో ప్రవేశించబోతున్నాడు. ఆ సం॥ మ్లేచ్ఛ నాశనము అయ్యేను. మ్లేచ్ఛులు అనగా హీన జాతీ వారు నశిస్తారు. ఇది కాలజ్ఞానం ప్రకారం 2026లో జరిగి తీరవలసి వుంది.


మేషరాశిలో శని ప్రవేశమైతేను`మేలుకొందరికి అయ్యేను. దోషకారులెల్ల ధూళయ్యి పోయేరు. ధూమకేతువు బుట్టేను.

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం శతాబ్ది పంచాంగమును పరిశీలించి చూడగా స్వస్తిశ్రీ ప్లవంగ నామ సం॥ర పాల్గుణ మాస శుద్ద పౌర్ణమి శనివారం రోజున తేది 11.03.2028న శనిమేషరాశిలో ప్రవేశించబోతున్నాడు. కావున దైవభక్తులైన పుణ్యాత్ములకు మంచి జరుగుతుంది. దుర్మార్గులైన వారు నశిస్తారు. మరియు ఆకాశమున ధూమ కేతువలు అందున కొందరు నశించడము వల్ల ప్రపంచమునకు కొంత శాంతి ఏర్పడుతుంది. కాలజ్ఞానం ప్రకారం 2028లో జన నష్టం సంభవించగలదు.


వృషభరాశి గతేమందే ఈశాన్య విషవాయవ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా వృషభరాశి యందు శని స్వస్తివ్రీ సాధారణ నామ సం॥ చైత్ర బహుళసప్తమి బుదవారం తేది 24.04.2030న ప్రవేశించబోతునన్నాడు. కావున ఈశాన్య మÖల విషగాలి పుట్టడం వల్ల విపరీతజనులను యమలోకానికి తీసుకొని పోవును. ఇదికాలజ్ఞానం ప్రకారం 2030లో జరిగి తీరవలసివుంది.


శనౌస్థిఏ జుగ్మరాశౌ భవేత్ భూభార నాశనమ్

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం పంచాంగమును పరిశీలించి చూడగ శనేశ్వరుడు మీదన రాశియందు స్వస్తిశ్రీ పరధావ నామ సం॥ర వైశాఖ మాస బహుళ షష్టి ఆదివారం రోజున తేది 30.05.2032 ప్రవేశించగానే అధిక జననష్టం సంభవించగలదు. ఇది కాలజ్ఞానంలో చెప్పిన ప్రకారంగా 2032లో జరిగి తీరవలసి వుంది.  


ఆనందాత్సరే సూతాదూతనాట్యసమాగత:

వసుధాకీర్లైకృపణై: భేతాళస్య తదాగత:

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి మఠము నందున్న తాళపత్ర గ్రంథము మాతృక ఏకదశాశ్వాసము. 88వ పేజీ చివరలో చెప్పినట్లుగా ఆనంద సంవత్సరం పుట్టగానే అనగా స్వస్తిశ్రీ ఆనంద సం॥ర చైత్రమాస శుక్ల పాడ్యమి మంగళవారం ఉగాది పర్వదినము మొదలుకొని అనగా 21.03.2034 నుండి యమదూతలు నాట్యమాడుదురు. భేతాళ చేత ప్రజలు నాశనమగుదురు. ఇది బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం 2034లో జరిగితీరవలdసి వుంది. 


బాగుగా ఆనంద సంవత్సరమున నాగుమల్లె రీతిగా నరులంతా చచ్చేటి యోగంబు మందికి వచ్చేను.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన గోవింద 14లో  చెప్పినట్లుగా ఆనంద సం॥ అనగా 2034లో నాగు మల్లె రీతిగా నరులంతా చచ్చేరు అని చెప్పియున్నారు. భూలోకంలో ఇప్ప్పుడు పాపం మÖడు పాళ్ళున్న పుణ్యం ఒక పాలున్న నడుస్తూ ఉన్నది. దుష్టులదికమై ధనమదముచే గర్వాభిమానులై పెద్ద తనము తెలియక నీతి దప్పి దుర్నీతులై వావివరుసలు లేక గర్వించి యున్నందున వాండ్లను శిక్షించడానికై దుష్టశిక్షణ శిష్ట రక్షణార్థమై కల్కి అవతారమైన వీరభోగవసంతరాయులు అవతరించి యున్నారు. ప్రస్తుత జనాభా 740 కోట్లు. రాబోవుకాలంలో జనాభా పెరిగే అవకాశాలు చాý తక్కువగా వున్నందున 800 కోట్లకు మించి అవకాశాలు లేనందున, 800 కోట్లలో మÖడుపాళ్ళు దుష్టులు అనగా సుమారు 600 కోట్లమంది 2034లో జరిగే కలియుగాంతం నాటికి నాగుమల్లె రీతిగా నరులంతా నశించిపోతారు. కాలజ్ఞానం ప్రకారం 2035 ఉగాది నాటికి ప్రపంచ జనాభా 200 కోట్లకు మించి వుండదని అర్ధమగుచున్నది. ఇది కాలజ్ఞానం ప్రకారం 2034లో జరిగి తీరవలసివుంది.


ఆనంద సం॥ర పాల్గుణ బహుళసప్తమి శుక్రవారాన మాకున్నూ మీకున్నూ ధర్శనమయ్యేను

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా స్వామివారు ఆనంద సం॥లో జరిగే విపత్తులను అనేక పర్యాయాలు పదే పదే చెప్పడం జరిగింది. స్వస్తిశ్రీ ఆనంద సం॥ర పాల్గుణ బహుళ సప్తమి శుక్రమవారమున మాకున్ను మీకున్న దర్శనమయ్యేను అని చెప్పియున్నారు. కల్కి అవతారమైన వీరబోగ వసంతరాయల వారి దర్శనము ప్రపంచవ్యాప్తంగా యున్న దైవభక్తులైన పుణ్యాత్ములందరి ఆనంద సం॥ర పాల్గుణ బహుళ సప్తమి శుక్రవారము రోజున అనగా తేది 31.03.2035న స్వామి వారి దర్శనము కల్గుతుంది. ఇది కాలజ్ఞానం ప్రకారం జరిగి తీరవలసి వుంది.


నల సంవత్సర అషాడ శుద్ద పౌర్ణమి ధర్మకృత యుగమే అది! ఆ“అదే సాంద్రసిందు వేదాన”కు మొదలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగా స్వస్తిశ్రీ నల సంవత్సర అషాడ శుద్ద పౌర్ణమి రోజున అనగా తేది 08.07.02036 నుండి కృతయుగ ధర్మము ప్రారంభమవుతుంdది. ఈ విధంగా ధర్మ సంస్థాపన గావించి 108 సం॥లు పాలించును. అప్ప్పుడు నెలకు మÖడు వర్షాలు కురియను, పంటలు సమృద్దిగా పండును ప్రజలందరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యములు కలిగియుందురు. అనగా ప్రజల పాలన నశించి దైవపాలన నడుస్తుందని అర్ధం తదుపరి వారి వంశం 1000 ఏండ్లు పాలించెదరు, ఇది కాలజ్ఞానం ప్రకారం జరగ వలసి వుంది.


వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన మహిమ....


నా కాలజ్ఞానంబు పఠియించు స్థలమున 

సప్త ఋషులును సకలదేవతలు వసియించు

నా కాలజ్ఞానంబు భక్తితో విను ప్రజలు

సకల తీర్ధస్నాన పుణ్యంబు పొందేరు.

నా కాలజ్ఞానంబు చెప్పించు ఘనులకు 

సుఖ: సౌఖ్యముల నిచ్చి స్వయంగా నే బ్రోతు

నా కాలజ్ఞానంబును ప్రచారం చేసిన వారికి

అన్నదానము కన్న మిన్న యజ్ఞ ఫలితము గల్గును.

నా కాలజ్ఞానంబు వేదవాక్కని దలిచి

నమ్ముకున్న వారి కర్మములు విడిపోవు.

నా కాలజ్ఞానంబు నమి పూజించు వారికి

ముంజేతి కంకణంబు రీతిగా నుండును.

నా కాలజ్ఞానంబును నమ్ముకున్న వారు 

ధనికులై లక్ష్మీ భోగములు గలిగి యుందురు.

నా మఠంబు దర్శింప జన్మజన్మల సకల పాపంబు లెల్ల

తొలగిపోయి క్రొత్త జీవనంబు పొందేరు.

నన్ను నమ్మని వారు నల్లులై పోతారు

తప్పదిదిగో గురు వాక్కు తెలియండయ.

కన్న బిడ్డలనైన అమ్మోరు కఠినముగా కాలం గడిపేరు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా తనయుడు పుట్టాలని తపస్సులు చేసే తల్లులున్నారు. పుత్రునికోసం పుత్రకామేష్టి యాగం చేసిన వాళ్ళున్నారు. అయితే ఓ తల్లి తన 8 నెలల కొడుకును లక్ష రూ॥కు అమ్మేసింది. ఆడపిల్ల లంటే వివక్ష ఇంకా కొనసాగుతోంది. పేదరికంతో పోషించలేమంటూ తల్లిదండ్రులు అమ్మకానికి పెట్టిన సంఘటనలు ఒకే రోజు మÖడు వెలులోకి వచ్చాయి. రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ఎత్తుకాల్వ తండాకు చెందిన శంకర్ గౌరమ్మ, ఇదే మండలం దాస్యానాయక్ తండాకు మగ్యసీత దంపతులు తమకు ఆడపిల్ల  పుట్టిందని అమ్మకానికి పెట్టారు. నల్గొండ జిల్లా డిండి మండలం రాస్యతండాలోనూ బిచ్యానాయక్ భారతి దంపతులు తమ 22 రోజుల బిడ్డను హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులకు విక్రయించారు. అప్ప్పు తీర్చే మార్గం కానరాక ఓ తండ్రి కన్నబిడ్డనే అమ్మేశాడు. ఆడశిశివును ఖరీదు చేస్తూ పోలీసులకు చిక్కిన సంఘటన రంగారెడ్డి జిల్లా మాల్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళ తన 5 నెలల కొడుకును తన భర్తే అమ్మేశాడంటు మహిళదినోత్సవం రోజున పోలీసులను ఆశ్రయించింది. ఈ విధంగా కాలజ్ఞానం ప్రకారం కన్నతల్లిదండ్రులే తమ బిడ్డలను అమ్ముచున్నారు.


కన్నబిడ్డలను కూడా కామించకోరేటి అధములే యిలలోన పుడతారు.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగ కళ్ళలో పెట్టుకొని చూసుకోవాల్సిన కన్న తండ్రి కర్కోటకుడై తన బిడ్డ జీవితాన్ని చిదిమే వేయడమే కాకుండా తనకు పరిచయమున్న వారికి అప్పగించి వారు అత్యచారాలు చేస్తుంటే ప్రక్కనే ఉండి చూస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవించిన ఒ ఆప్టేలియన్ కామాందుడికి కోర్టు 221/2 ఏళ్ళ కఠిన కారగార శిక్ష విధించింది. 2013 నుంచి 2015 మధ్య తన 11 సం॥ల కుమార్తెపై వద్దునాన్న అని వేడుకున్నా వినకుండ జరిపిన దారుణాలకు సంబంధించి 61 కేసులునమోదుకాగా వాటన్నింటిని నిందితుడు అంగీకరించాడని న్యాయవాది వెల్లడించారు. ఇంకొక సంఘటనలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కూతిరిపైనే కన్నేశాడు ఓ కామాంధుడు. తండ్రీ కూతుళ్ళ బంధాన్ని పక్కన పెట్టి ఆరేళ్ళుగా అత్యాచారం చేశాడు. విషయం బయటికి చెప్పితే చంపేస్తానని బెదిరించి మరీ లొంగ దీసుకున్నాడు. భార్య ఇంట్లో ఉండగానే కూతిరిపై అత్యాచారయత్నం చేస్తూ దొరికిపోయాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. మరో సంఘటనలో వావివరసలు మరిచి కన్న కూతిరిపై పలుమార్లు అత్యాచారం చేసిన నేరస్తుడికి న్యాయస్థానం పదేళ్ళ కఠిన కారాగారశిక్ష, రూ॥ వేయి జరిమాన విదించింది. కన్న కూతురుపైఏ అత్యచార యత్నానికి పాల్పడిన ఓ కామాందుడి ఉదంతం ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిదిలో జరిగింది. ఈ విధంగా కన్న తల్లిదండ్రులే తమ పిల్లల్ని అమ్ముచున్నట్లు నిత్యం పేపర్లో చదువుచున్నాము, టీవీల్లో చూస్తున్నాము. ఇది కాలజ్ఞానమహిమే, 17వ శతాబ్దంలో చెప్పినదే.

జపాసనాది వివరములు - నియమాలు

శ్లో॥ శుక్లం సర్వత్ర వైపోక్తం వశ్యే రక్తాసనం ప్రియే 

పద్మాసనే జపే నిత్య శాంతివశ్మం కరం పరం ॥

వస్త్రాగునేచే దారిద్య్రం పాషాణ రోగ సంభవ:

మదిన్యాం దు:ఖ మాస్నాతి కాష్టేభవతి నిష్పలమ్ ॥

కృష్ణాజినే జ్ఞాన సిద్ది ర్మోక్షశ్రిర్వా: ఘ్ర భరణి

కుశాసనే జ్ఞానసిద్ది: సర్వసిద్దిస్తు కంబళే ॥

జమము చేయునప్ప్పుడు తెల్లని ఆసనంబు ఉపయోగించిన శ్రేష్టమగును. అటులనే ఉపయోగించబడిన ఆసనము యేరుపైన జనవశీకరణంబగును. పద్మాసనంబునడిన క్రమేణా శాంతివృద్ధి పొందును. వస్తానంబున దాదిద్య్రం, శవాసనంబున వ్యాది, నేలపై కూర్చుండిన దు:ఖములు, కొయ్యపీఠలయిన ఫలితం లేకపోవుటయు సంభవించును. లేడి చర్మముపై కూర్చుండి జపం చేసిననను, దర్భాసముపై గూర్చున్నను జ్ఞాన సిద్ధియగును. పులిచర్మంపై కూర్చుండి జపం చేసినను ముక్తి ప్రాప్తించును. కంబళిపై నాసీనులై సర్వసిద్ధి కలుగును. మరియు ఎరర్రని కంబళి అయిన జపవశ్యమును, తెల్లని కంబళి యైన సంపదలు సిద్ధించును. గడ్డిపై కూర్చుండిన కీర్తిభంగము, చిగురు టాకులపై జపమాచరించిన చిత్త భ్రమలునగును.

జపమాల యొక్క ఫలితము

జపము చేయువారు పగడపు మాలగాని, ముత్యముల మాలగాని, స్పటికంబుల మాలగాని, ఉపయోగించిన కోటిఫలములు కల్గును. తులసిమాలగాని, మణిమాలనుగాని నుపయోగించిన అధిక ఫలము కల్గును. రుద్రాక్షమాలనుపయోగించుట మిక్కిలి శుభం. జపమాలయందు 108 పూసలుగాని, 54గాని, 27 వున్నను మంచిదియే. నూట ఎనిమిది సంఖ్యకు తక్కువ చేసిన యెడల జపం ఫలప్రదం కాదు. జపమాల యందు 108 పూసలు లేక 54 ఉన్న మాలను రెండు సార్లు, 27 వున్న నాలుగు సార్లు త్రిప్పి 108 పూర్తి చేయవలయును.

ఎటువైపు కూర్చుండి జపం చేయ్యాలి

తూర్పు ముఖముగా కూర్చుండి జపము చేయువారికి కోరికలు సిద్ధించును. దక్షిణాభిముఖంగా జపం చేయువారికి ఇతరుల మీద దుష్ప్రయోగంబులు చేయుటయందు ప్రతిభ గల్గును. ఉత్తర దిక్కుగా జపమాచరించిన వారికి జన్మ రాహిత్యంబగును.

జపం చేయునప్ప్పుడు జపమాలను బొటన వ్రేలుగాక మిగిలిన నాలుగు వ్రేళ్ళ మీద దేని మీదనైననుంచి బొటన వ్రేలితో ఒక్కొక్క పూసను మంత్రోచ్ఛారణ చేయుచు ముందుకు ముందుకు జరుపుచు నూట ఎనిమిది పూర్తి చేయవలయును. అనామిక మనగా బొటన వ్రేలుకు పక్కగ నున్న చూపుడు వ్రేలు మీద జపమాల నుంచి బొటన వ్రేలితో పూసలను జరుపుచుండిన మంచి కార్యములు సిద్ధించును. మధ్యమ వ్రేలిమీద జపమాల నుంచి బొటన వ్రేలితో పూసలను జరుపుచుండిన యెడల ఆకర్షణ సిద్ధి చేకూరును. ఉంగరపు వ్రేలు మీద జపమాల నుంచి బొటన వ్రేలుతో పూసలను జరుపిన యెడల వాగ్ధాటికల్గును. చివరి వ్రేలుపై నుంచి చేసిన యెడల కర్మఫలములు హరించుననియు చెప్పబడి యునది.  

జమము చేయునప్ప్పుడు తెల్లని ఆసనంబు ఉపయోగించిన శ్రేష్టమగును. అటులనే ఉపయోగించబడిన ఆసనము యేరుపైన జనవశీకరణంబగును. పద్మాసనంబునడిన క్రమేణా శాంతివృద్ధి పొందును. వస్తానంబున దాదిద్య్రం, శవాసనంబున వ్యాది, నేలపై కూర్చుండిన దు:ఖములు, కొయ్యపీఠలయిన ఫలితం లేకపోవుటయు సంభవించును. లేడి చర్మముపై కూర్చుండి జపం చేసిననను, దర్భాసముపై గూర్చున్నను జ్ఞాన సిద్ధియగును. పులిచర్మంపై కూర్చుండి జపం చేసినను ముక్తి ప్రాప్తించును. కంబళిపై నాసీనులై సర్వసిద్ధి కలుగును. మరియు ఎరర్రని కంబళి అయిన జపవశ్యమును, తెల్లని కంబళి యైన సంపదలు సిద్ధించును. గడ్డిపై కూర్చుండిన కీర్తిభంగము, చిగురు టాకులపై జపమాచరించిన చిత్త భ్రమలునగును.

జపమాల యొక్క ఫలితము

జపము చేయువారు పగడపు మాలగాని, ముత్యముల మాలగాని, స్పటికంబుల మాలగాని, ఉపయోగించిన కోటిఫలములు కల్గును. తులసిమాలగాని, మణిమాలనుగాని నుపయోగించిన అధిక ఫలము కల్గును. రుద్రాక్షమాలనుపయోగించుట మిక్కిలి శుభం. జపమాలయందు 108 పూసలుగాని, 54గాని, 27 వున్నను మంచిదియే. నూట ఎనిమిది సంఖ్యకు తక్కువ చేసిన యెడల జపం ఫలప్రదం కాదు. జపమాల యందు 108 పూసలు లేక 54 ఉన్న మాలను రెండు సార్లు, 27 వున్న నాలుగు సార్లు త్రిప్పి 108 పూర్తి చేయవలయును.

ఎటువైపు కూర్చుండి జపం చేయ్యాలి

తూర్పు ముఖముగా కూర్చుండి జపము చేయువారికి కోరికలు సిద్ధించును. దక్షిణాభిముఖంగా జపం చేయువారికి ఇతరుల మీద దుష్ప్రయోగంబులు చేయుటయందు ప్రతిభ గల్గును. ఉత్తర దిక్కుగా జపమాచరించిన వారికి జన్మ రాహిత్యంబగును.

జపం చేయునప్ప్పుడు జపమాలను బొటన వ్రేలుగాక మిగిలిన నాలుగు వ్రేళ్ళ మీద దేని మీదనైననుంచి బొటన వ్రేలితో ఒక్కొక్క పూసను మంత్రోచ్ఛారణ చేయుచు ముందుకు ముందుకు జరుపుచు నూట ఎనిమిది పూర్తి చేయవలయును. అనామిక మనగా బొటన వ్రేలుకు పక్కగ నున్న చూపుడు వ్రేలు మీద జపమాల నుంచి బొటన వ్రేలితో పూసలను జరుపుచుండిన మంచి కార్యములు సిద్ధించును. మధ్యమ వ్రేలిమీద జపమాల నుంచి బొటన వ్రేలితో పూసలను జరుపుచుండిన యెడల ఆకర్షణ సిద్ధి చేకూరును. ఉంగరపు వ్రేలు మీద జపమాల నుంచి బొటన వ్రేలుతో పూసలను జరుపిన యెడల వాగ్ధాటికల్గును. చివరి వ్రేలుపై నుంచి చేసిన యెడల కర్మఫలములు హరించుననియు చెప్పబడి యునది.  

జపం ఆగ్నేయ ముఖంగా చేసిన శత్రువులకు బాధయు వాయువ్యముఖంగా జపం చేసిన శత్రు వినాశనంబును, నైరుతీ ముఖంగా జపం చేసిన దేవతా ధర్శనంబును, ఈశాన్య ముఖంగా జపం చేసిన బ్రహ్మజ్ఞానంబును, ఉత్తరాభిముఖంగా చేయుజపం వలన శాంత చిత్తమును పశ్చిమాభిముఖంగా చేయుజపం వలన ధన ప్రాప్తియు, దక్షిణాభిముఖంగా చేయు జపం వలన శత్రు హరణమును కల్గును.

సముద్రతీరం`నదీతీరం`పుణ్యభూమి`శివకేశవాలయాలు`శక్తిదేవాలయం`జ్ఞానులు మొదలైన మహనీయుల నివాసన స్థానాలు` మునీద్రులుండు మఠాలు`మర్రి చెట్టు మొదట`ఉసరి చెట్టు మొదట` బృందావనం నిర్మ ప్రదేశాలందు జపమాచరింప వలయును అట్టి వారు సంకల్ప సిద్దులయ్యెదరు.

జపం ప్రక్కవారికి వినిపించరాదు. పెద్దలు దానిని జపమనక వాచక మందురు. శబ్ధము వినిపించక పెదవుల నాడించు చేయుజపమైనను శ్రేష్టంకాదు. అది “ఉపాంశు” అనబడును. బయటకు వినిపడకయు పెదవులను గదిలింపకయు అంత:కరణమున చేయు జపము “మానసిక” మనంబడును. మొదటి వాచకమునకు అధమమని పూరు. దీని ఫలితం కన్న “ఉపాంశు జపయునకు వెయ్యిరెట్లు ఫలమదికమైన మానసిక జపం మీVAత్తమంబనియు చెప్పబడినది.


 


వీర బ్రహ్మేంద్రస్వాముల ద్వాదశ సూక్తులు

1. నా భక్తులకు యే ప్రళయములు అంటవు.

2. అస్మద్దివ్యనామ పఠనాపరులై ఆనందన యుండరు.

3. పోతులూరు వారి భక్తులు జ్యోతిస్వరూపులై యుండేరు.

4. మమ్ములను దూషించినందులకైనా సహించేము. మా భక్తులను దూషించిన సహింపము.

5. నన్ను పూజించి నా కాలజ్ఞానమును పారాయణము చేసిన వారికి ఒక పుష్పమిచ్చిన జోడు పుష్పములగును.

6. నిజ భక్త హృదయంతరాళమందు నిలిచేము.

7. పుణ్య పురుషులను గురుని చెంతకు చేర్చేము.

8. ధర్మము చేసినవారు ఒకరిని దూషించనివారు, ఒకరి సొమ్ముకు ఆశపడనివారు నాకత్యంత ప్రీతి పాత్రుల.

9. తోడే కొలది బావిలోని నీరు, దానధర్మాలు చేసే కొలదీ సంపదలు వృద్ది చెందుతుంటాయి.

10.  నీ గత జన్మకర్మలే నిన్ను వేదిస్తుంటాయి. నన్నాశ్రయిస్తే అవి మెల్లగా వెనుదిరుగుతాయి.

11. నీ మనస్సును నావైపు మరలిస్తే జ్ఞాన ప్రదమౌతుంది. లేకుంటే అది అజ్ఞానం పాలవుతుంది.

12. నన్నాశ్రయించిన వారి సకల బాధ్యతలను నేనే నిర్వహింతును.

శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వాముల వారి మఠంలో ప్రతి సం॥ జరిగే ముఖ్యమైన ఉత్సవాలు

1. శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి - వైశాఖ శుద్ద దశమి

సజీవ సమాది నిష్ట వహించిన పవిత్రమైన రోజు ఆరాదనోత్సవం

2. రదోత్సవము -వైశాఖశుద్ద ఏకాదశి

3. మహాప్రసాదవినియోగం - వైశాఖశుద్ద ద్వాదశి

4. శ్రీవీర బ్రహ్మేంద్రసాములవారి కళ్యాణ మీVAత్సవము - మాఘ బహుళ త్రయోదశి

5. శ్రీ గోవిందామాంబ ఆరాధనోత్సవము -  పాల్గుణ బహుళ దశమి

6. ఈశ్వరమ్మ ఆరాధన - మార్గశిర బహుళనవమి

7. మఠాదిపతులు శ్రీశ్రీశ్రీ శ్రీనివాస స్వాముల వారి ఆరాధన - ఆషాడబహుళ పాడ్యమి

8. మఠాదిపతులు శ్రీశ్రీశ్రీ వీరభోగవసంత వేంకటేశ్వరస్వాముల వారి ఆరాధన - బాద్రపద శుద్ద ఏకాదశి

రుద్రాక్షలను ధరించేవారు ఏ నియమాలు పాటించాలి #rudraksha #rules #astrology #jyothisham #hindu


 

2, నవంబర్ 2026, సోమవారం

స్వస్వరూపసంధానం


అద్వైతంలోను, సాంఖ్యంలోను ఈ స్వస్వరూప సంధాన ప్రసక్తి కనిపిస్తుంది. స్వస్వరూప సంధానం అంటే తాను చతుర్వింశతి తత్వాత్మకమైన దేహమా ! దానికంటె వేరైన జీవుడా ! గీత పరిభాషలో క్షేత్రమా! క్షేత్రజ్ఞుడా! అనే విషయం తేల్చుకొని దానిని పరబ్రహ్మతో ఐక్యపరచుకోవటమని తాత్పర్యం. ముముక్షువులకు ఇందుకు నేతినేతి వాక్యవిచారం చక్కగా ఉపకరిస్తుంది. అయితే అదేగాక జీవితదశలను తాను లౌకికపద్దతిలో పరిశీలించి చూచుకున్నప్పటికి ముక్తి మార్గానికి అవకాశం ఉంది. అది యేలాగో పరిశీలించండి! 

పరబ్రహ్మము ఆనందస్వరూపం గనుక తదంశమైన జీవుడుగూడ ఆ స్వరూపమే యనక తప్పదు. అలా గాకుంటే అతనికి తల్లిదండ్రి యొక్క ఆనందావస్థలోనే దేహం లభించటం, జన్మించిన పిమ్మటగూడ అతడీ లోకానందానికో లేక పరలోకానందానికో ప్రయత్నం చేయటం సంభవించదు. 

జీవుడు మాతృగర్భంలో ఉన్నంతకాలం అతనిని మావి అనే పొరరక్షిస్తుంది, అతడు పూర్ణుడైనపిమ్మట ఆ జరాయువును భేదించుకొని మాతృకుక్షినుండి బయటపడుతాడు. అనంతరం తనను నవమాసాలు రక్షించిన అది నిష్ఫలమై పడిపోతుంది. 

జ్ఞానపరిపూర్ణుడైన మానవుని ముక్తావస్థగూడ సరిగా ఈ జననంలాగే ఉంటుంది. ప్రపంచంలో ఉన్నంతసేపు అతనిని అజ్ఞానమనే పొర ఆవరించి ఉంటుంది. దాన్నే మనం “మాయ” అంటున్నాం. దానినుండియే అతనికి వాస్తవజ్ఞానం కలుగవలసి ఉంది. అది కలిగి పూర్ణత్వం సిద్ధించినపిమ్మట అంతవరకు తనను రక్షించిన మాయ యిక వ్యరమై పోతుంది. జ్ఞాని పూర్ణావస్థలో యిక దానినుండి వేరు కావలసి ఉంది. ఇక్కడ శిశువును నాభినాళచ్చేదంచేసి మావినుండి పూర్తిగా వేరుచేసేసూతిక వలె తనను ఎఱుక విడిపించి వేరుచేసె కారణగురువు అవసరం. అపుడతడు జీవన్ముకుడౌతాడు. దానినే విదేహకైవల్యం అనిగూడా అంటాము. ఆదశలో అతనికి శరీరభ్రాంతి పూర్తిగా తొలగి మాయావరణాన్ని భేదించుకొని బయటబడి పరమహంసవుతాడు. 

భాగవత తృతీయస్కంధంలో సృష్టివిషయం చెబుతు బ్రహ్మాండానికి ప్రథమావరణం పృథివియని దానిపై సలిల తేజస్సమీరగగనాహం కార మహత్వాలు ఒక దానికొకటి దశగుణావరణాలై ఉంటవని, బ్రహ్మాండంలో పంచతన్మాత్రలు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఏకీకరణ సామర్థ్యం లేక పడిఉండి ఆ అండం ప్రళయ జలరాశిలో తేలుతూ వేయి సంవత్సరాలుండగా విష్ణువు దానిలో జీవరూపుడై ప్రవేశించి వానినన్నింటి నేకంచేసికొని వై రాజపురుషుడై అది భేదించుకొని బయటికివచ్చెనని అపుడతని యింద్రియాలచేత యింద్రియాభిమాన దేవతలు పుట్టిరని చెప్పబడింది. అంతేగాక అది “అమ్మహాత్మునికి పాదమÖలంబు పాతాళంబు, నాభీ వివరంబు నభస్థలంబు, భూలోకంబు కటి ప్రదేశంబు, మేఘజాలంబులు హృషీకేశుని కేశంబులు” అని వర్ణించింది. ఈ విశ్వరూప దర్శనం యిపుడు కావ్యజగత్తులో యథాతథంగా నిలిచి ఉంది. పాదాలకు మాత్రం పాతాళానికి బదులు అక్కడ ఉండే కూర్మరాజు పాదాలు, నాభీ వివరానికి బదులు అది వుండే అవలగ్నాన్ని గ్రహించినారు. 

మన పురాణాల ప్రకారం మహాభూమి వేరు, మనముండే భూమి వేరు. ఇది భువర్లోకంలో నక్షత్రాలలో ఒక గోళంగా ఉంది. ఆలోకం విరాట్పురుషునికి హృదయస్థానం, జీవుల హృదయస్థానం ఈశ్వరనివాసం, అందుచేతనే కాబోలు ఈ భూమిపైననే అతడెక్కువగా అవతరిస్తాడు. దీనిపైన సువర్లోకం ఉంది. అక్కడ దేవతలుంటారు. అందుచేత మన గాయత్రీ వ్యాహృతులలో “ఓం భూర్భువస్సువః” అనే ముల్లోకాల స్మరణ తప్పనిసరి అయింది. 

ఈ బ్రహ్మాండ కటాహంపంచాశత్కోటి యోజన విస్తీర్ణమని భాగవతం చెబుతుంది. ఇది ఎంత పెద్దదో మనమÖహించలేం, కాబట్టి యిక దీనిపై గల ఆవరణలను గుఱించి అడుగ నవసరం లేదు. ఈ ఆవరణ లొక్క బ్రహ్మాండానికే గాదు దానిలోని గోళాలన్నిటికి సామాన్యమే నేమో అనిపిస్తుంది. అది మనకు క్షుణ్ణంగా తెలియకున్నా ప్రతిగోళానికి కొంత వాతావరణ పరిధి ఉన్నట్లు శాస్త్రజ్ఞులభిప్రాయపడుతున్నారు. 

ఇపుడు మనభూమిచుట్టు మేఘమండలం ఉంది. మేఘమంటే అది నీటి పొరక్రిందనే లెక్క నీటి పొరనేగాదు దీనికి తేజోమండలం గూడ ఉందని ఈ లోకాన్ని చంద్రలోకంనుండి చూసినవారు చెప్పినారు. ఇక వాతావరణం పొర ఒకటి ఉన్నట్లు శాస్త్రజ్ఞులందరు అంగీకరించిందే కాబట్టి అదేవిధంగా శబ్దగుణకమైన అకాశావరణం గూడా ఒకటి 

ఉండవచ్చు. ఆపైన సర్వశూన్యమైన అంతరాళం, ఇట్లా ఈ స్థితి ప్రతిగోళానికి గూడ 

ఉందేమో!

ఇక భాగవతంలో చెప్పిన బ్రహ్మాండం జలమధ్యంలో తేలుతూ ఉండటాన్ని చూస్తే అది చక్కగా ఈనాటి శరీర శాస్త్రంలోని స్త్రీగర్భంలో పిండం పెరగటానికి పరిపక్వమై నిలిచి ఉన్న అండాన్ని స్ఫురింపజేస్తుంది. భాగవతంలోని బ్రహ్మాండంలో చెప్పినట్లు జీవునికి కావలసిన యింద్రియాలన్నిటికి మÖలపదార్ధం దానిలోనే ఉందేమో! పురుష దేహంనుండి జీవుడందులో ప్రవేశించిన పిమ్మట వానినన్నిటి నేకీకరణం చేసికొని వృద్ధిపొంది పూర్ణుడై ఆ అండాన్ని భేదించుకొని బయటపడుతున్నాడు. 

పైన బ్రహ్మాండానికి మనభూమికి ఉండే ఆవరణలు చూచినాము. మన దేహంగూడ వానిలోనే పెరుగుతుంది. పరిశీలిస్తే ఆ వాస్తవం పొడకట్టకపోదు. ఈ దేహమంటే ఏమిటి? జీవుని చుట్టు ఏర్పడిన పార్థివావరణమేగదా ! అది తల్లి కడుపులో ఉన్నపుడు జలావరణంలో వృద్ధి పొందింది. అది దాటిన పిమ్మట తేజోమండలంలో పెరుగుతుంది. మన దేహంనుండి నిరంతరం తేజోకిరణాలు వెలువడుతుంటవని ఇటీవల రష్యావారు ‘ఎక్స్ రే’ వంటి కెమెరాలతో ఫోటోలు తీసి నిరూపించినారు. దీన్ని మనం విజ్ఞానమయకోశంగా గూడ అన్వయించుకోవచ్చు. ఈ తరవాత ఇది వాయు మండలంలో వర్థిల్లవలసి ఉంది.

భారతీయుని జీవితం కేవలం మరణంతోనే ముగియదు, అది పంచత్వం మాత్రమే. అతనికి దేహాన్నిచ్చిన పంచభూతాలు తమతమ అంశల్లో లీనమైపోతవి, గాని వానితో దేహాన్ని ధరించిన జీవుడు మాత్రం వసురుద్రాదిత్యరూపాలు పొందుతూనే ఉంటాడు. ఆదిత్యరూపం పొందే వరకు సంతతి అతనికి పిండోదక ప్రదానాలచేత సహాయపడవలసి ఉంటుంది. ఆదిత్యలోకం చేరినపిమ్మట అక్కడినుండి జీవులు సూర్యరశ్మి ద్వారా సుషుమ్నానాడి నధిరోహించి బ్రహ్మ లోకానికి చేరుకుంటారు. కాబట్టి ఆకాశంలో వర్థిల్లటం ఆ దశల కన్వయించుకోవచ్చు. ఇవి జీవుని చుట్టుండే భూతావరణలు. 

ఇక మానవుని దశలను అవతారాలకు సమన్వయం చేసి చూపినవారున్నారు. తల్లికడుపులో ఉన్నపుడు చేప, బోరగిలబడినపుడు తాబేలు, దోగాడుతున్నపుడు వరాహం, తప్పుటడుగులతో లేస్తున్నప్పుడు నృసింహం నిటారుగా నిలిచినపుడు వామన - ఈ అవతారసమన్వయం గూడ ఈదశలోనే మానవునిలో కనిపిస్తుంది. 

బాలుడు బ్రహ్మస్వరూపం, బాలవాక్కు బ్రహ్మవాక్కు అనే జాతీయాలు మనకున్నవి. అవిఅతని బ్రాహ్మణత్వాన్ని తెలుపుతవి. శాస్త్రం బ్రాహ్మణునికి వయోభక్షణం, క్షత్రియునికి “యవాగు” అహారం విధించింది, స్తనంధయునికిమనం పాలుతప్ప మరో ఆహారమే యివ్వలేంగదా ! ఆహారంలో గూడ ఆదశ అతని బ్రహ్మత్వాన్నే సూచిస్తుంది. బ్రహ్మజ్ఞానంకలిగినవాడు బ్రాహ్మణుడని మనం ఈనాడు చెబుతున్నాం, బ్రహ్మం ఆనంద స్వరూపం గాబట్టి బ్రహ్మజ్ఞాని నిర్మలమైన ఆనందంలో మునిగి ఉంటాడు. ఆ ఆనందానికి సరూపమయింది సుషుప్తి. అందుచేతనే కాబోలు పసిపాపలలో నిద్ర ఎక్కువ.

అతడు పెరిగి చేతులబలంతో ప్రాకటం దోగటం నేర్చేనాటికి ఏలాగూ ఉగ్గు, యవాగు పెడుతారు కాబట్టి అది అతని క్షత్రియదశ. ఈ తరువాతిది వైశ్యస్థితి వైశ్యశబ్దము విశీధాతు నిష్పన్నం. అది ప్రఉప అనే రూపాల్లో కనిపిస్తుంది. ఉపవిశ అనేదానికి కూర్చొనుట అని అర్థంగాబట్టి శిశువుకు కూర్చునే దశనుండి వైశ్యత్వం, ఆ పిమ్మట “పద్భ్యాగంశూద్రో ఆజాయత” పాదముల నుండి శూద్రుడాయెను అనుటవల్ల నడకతో శూద్రత్వం సిద్ధిస్తుంది. ఈ విధంగా నడిచే నాటికి శిశుదశ పూర్తియై “జన్మనాజాయతే శూద్రః” అనే వ్యవహారవర్ణ చక్రం ఆరంభమౌతుంది. 

శిశువులకు నిద్రఎక్కువ అన్నారు కాబట్టి ఇక్కడ ఒకసారి దాన్ని పరిశీలింతాం. మనకు జాగ్స్వప్నసుషుప్తులనే మÖడవస్థలున్నవి, వానిలో వృక్షాలతాదులది స్వప్నావస్థ, శిలాదులది సుషుప్త్యవస్థ అని విజ్ఞులమతం, అయితే ఆ స్వప్న సుషుప్తులు మానవుల కున్నటువంటి ప్రభావశీలమైనవిగావు, వృక్షాదులది లీలా మాత్రమైన స్వప్నదశ. అందుకేవాని సుఖదుఃఖానుభవం మన చర్మచక్షువులకు కనిపించనంత సూక్ష్మంగా 

ఉంటుంది. కీ.శే.జగదీశచంద్రబోస్ గారు వాని సుఖదుఃఖాల నిరూపించినారుగదా, ఈ రంగంలో యిటీవల శాస్త్రజ్ఞులింకా ముందుకుపోయి దానికిగూడ నిద్రా జాగ్రతలు మానవదర్శనంచే హర్షభయాదులుగూడ ఉన్నవని నిరూపించినారు. మహర్షులైన మన ప్రాచీన కవులు వృక్ష లతాదులయొక్క ఈ తత్వం ఏనాడో ఎరిగినారు కాబట్టే వానిపై కావ్యాలలో మానవ ప్రకృతినారోపించి కొన్ని చోట్ల కథాగతమైన పాత్రలనుగా గూడ చేసినారు. 

ఇక స్వప్నాలను పరిశీలిస్తే ప్రకృతిలో కలలుగనే హక్కు జంతువులకున్నదో లేదో యింకాతేలలేదు. మన పురాణాలలో గూడ రాకుమారులకు వచ్చిన కలలేగాని జంతువులకు వచ్చినట్లు లేదు. కనుక ఇప్పటివరకి అదృష్టం ప్రకృతి మానవుని కొక్కనికే ప్రసాదించిందనుకోవలె.

నిద్రలో సుషుప్తి అచ్చమైన బ్రహ్మానందం వంటిదైతే స్వప్నావస్థ గంధర్వాది దేవయోనుల వంటిది అవి భోగజన్మలేగాని భౌతికకాయం ఉండదు గాబట్టి కర్మిష్ఠి జన్మగాదు. వారు మానవులకంటె ఉత్తములైనా మనవంటి శరీరం లేదు గాబట్టి కర్మలాచరించి కోరికలు సాధించుకునే మార్గంలేదు, ఆ కారణంగా తఱుచుగా ఎవరో ఒకరినావేశించి అవి తీర్చుకుంటు ఉంటారు, లేదా ముక్తిని కోరినపుడు లేక మరేదో సాధించదలచినపుడు మానవ యోనిలో పుట్టి వానిని సాధించుకుంటారు. అట్టివారిని మనమీనాడు కారణజన్ములని వ్యవహరిస్తుంటాము, మానవులు ప్రయత్నించి యక్షాది దేవశరీరాలు పొందవచ్చు, క్షుద్రదేవతోపాసకులేవేవో స్వాప్నిక సుఖాలాశించి ఉపాసనలు చేసి అట్టి దేహాలు పొందుతారుగాని వారికా దేహాలభీష్ఠ సాధనకుపకరించవు. కనుక మనుష్యుజన్మయే వానికంటే ఎన్నో రెట్లు గొప్పది, ఈ దేవమానవ యోనుల పోలిక లౌకికంగా పరిశీలిస్తే ఉద్యోగజీవి, స్వతంత్ర జీవివలె ఉంటుంది. 

స్వతంత్ర జీవికంటె ఉద్యోగి వేషంలోను, ఠీవిలోను పైకి బాగా కనిపించినా అతనికి వృత్తిలో స్వాతంత్య్రముండదు, అలాగే ఆర్జనగూడ నెలనెలకు పరిమితమై పోతుందిగాని యిష్ట ప్రకారంగా సంపాదించే వీలుండదు, అందువల్ల ఈ తత్వమెరిగిన విద్యావంతులుద్యోగానికంటె స్వతంత్ర జీవితానికే ప్రాముఖ్యమిస్తారు. ఆ ధైర్యంచాలనివారే ఉద్యోగాని కఱ్ఱులు చాస్తారు. 

స్వప్నంలో మానవునికి సుఖదుఃఖానుభవం ఉందిగాబట్టి అవిలేని సుషుప్త్యవస్థ స్వచ్చమైన ఆనంద స్వరూపం అనబడుతుంది. కాని లోకానికీ మాటపైన నమ్మకం కుదరదు. ప్రకృతి యొక్క మాయా విలాసం యిక్కడనే ఉంది. అది మానవునికి అఱ్ఱులు చాచు ఆనందాన్ని దినదినం ఒకసారి ఎరుగకుండానే ప్రదర్శించి పోతుంది. లోకంలో పరబ్రహ్మం కేవలం సాక్షి మాత్రమేగాని సామాన్యుడా విధంగా అంగీకరించడు. దానియందేవేవో అతీత శక్తులూహించుకుంటాడు. కనుక నిర్గుణము, నిష్క్రయము అయిన బ్రహ్మమే సాకారమై కనుపడి నేనేది చేయలేనని చెప్పినా నమ్మడు. అలాగే సుషుప్తిలోనిదే అచ్చమైన ఆత్మానందం అన్నపుడు గూడ “హైరానా” తింటాడు. అయితే శిలాదుల సుషుప్తి ఈ కోవకు చెందదు. అది గాఢమైన తామసంతో కూడింది అంటారు. రామాయణంలో ఏనుగులతో తొక్కించినా మెలకువరాని కుంభకర్ణుని నిద్రను చూస్తాం. అదిగూడ ఇదేకోవకు చెందుతుంది. అంతేగాక గౌతముని శాపంతో అహల్య, లక్ష్మణుని విరహంతో ఊర్మిళగూడ అట్టి స్థితిలోనికే వెళ్ళినారు. 

జీవుడు నిజానికి దినదినం తానెక్కడినుండి వచ్చినాడో అక్కడికి వెళ్ళి కాస్సేపు విశ్రాంతి తీసుకొనివస్తాడు. బాల్యములో అతని మనస్సింతా ప్రపంచాయత్తం కాదుగాబట్టి అతనికా విశ్రాంతి కాలం ఎక్కువ. రాను రాను మనస్సు ప్రపంచవ్యాహృతమైన కొలది ఆ సమయం తగ్గుతూ వచ్చి చివరకు ముసలితనానికి కొందరికి నిద్రపట్టకుండాగూడ పోతుంది. జీవుడొక వేళ తనవిశ్రాంతి స్థానానికి వెళ్ళి రాకపోతే మరునాటికతనికి కావలసిన క్రొత్త శక్తిరాదు. బాగా గాఢ నిద్రపట్టి మెలకువ వచ్చిన తరువాత మనస్సుకెంత చుఱుకుతనం ఉల్లాసం కలుగుతవో అవి రాత్రి అంతా కలత నిద్రలోనే గడిచితే కలుగవు. ఇది సాధారణంగా అందరికి అనుభవమే.

హిందువుల బ్రతుకమ్మ పండుగ


హిందువులకు వారి సంవత్సరం మొదటి ఆరు నెలలు పురుష రూపంగా చివరి ఆరునెలలు స్త్రీరూపంగా ఉండి అది స్త్రీ పుంసయోగాత్మకుడైన పరమేశ్వరునికి సంకేతంగా ఉంది. ఇందుకు మనకు సంవత్సరాది నుండి ప్రారంభమయ్యే వసంత ఋతువు పుంలింగ శబ్దమై, వసంత నవరాత్రులు పురుషపరమై మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముని ఆరాధనతో ఆశ్వీయుజం నుండి ప్రారంభమయ్యే శరద్రుతువు, స్త్రీలింగశబ్దమై అపుడు జరుపబడే శరన్నవరాత్రులు దేవీ పరంగా ఉండటం ఒక దృష్టాంతంగా ఉంది.

ఈనాడు మనకు పంచాంగంలో బ్రహ్మచైత్ర శుద్ధ పాడ్యమి నుంచి సృష్టికర్మ నారంభించినట్లు చెప్పబడుతుంది. కాని శరద్రుతువు కంటె మొదటిది భాద్రపదం. అది వర్షరుతువు. ఆ నెలలో చివరి దినాలకు మహాలయ పక్షాలని పేరు. మహాలయం అనగా సంపూర్ణమైన ప్రళయమని అర్థం. కనుక ఈ మహాలయం భాద్రపదంలో జరిగినపుడు పునఃస్సృష్టి చైత్రంతో ఎట్లా ప్రారంభం కాగలదు? అందువల్ల ప్రళయానంతర సృష్టి ఆశ్వీయుజంతోనే ప్రారంభం కావలె.  ఇపుడు మనం మన నెలలను చాంద్రమానాన్ని బట్టి వ్యవహరిస్తున్నాం కాబట్టి వాని పేర్లు పూర్ణిమ నాడు చంద్రుని వెంట ఉండే నక్షత్రాలను బట్టి చిత్త - చైత్రం, విశాఖ, వైశాఖం అని ఈ విధంగా ఏర్పడినవి. 

మన నక్షత్రాలలో మొదటిది అశ్విని కనుక అశ్వినిలో ప్రారంభమయ్యేది ఆశ్వయుజం అవుతుంది. అందువల్ల ఆశ్వీయుజమే సృష్ట్యాది అవుతుంది. దేవీ భాగవతంలో ఈ సృష్టికంతా మÖలం దేవియేనని ఆమె చేతనే ఈ జగత్తంతా ఏర్పడిందని చెప్పబడింది. ప్రాకృతికంగా గూడ సృష్టి విస్తరణ కార్యమంతా స్త్రీ చేతనే జరుగుతుంది. సంతానాన్ని కని పెంచి పోషించటంలో పురుషుని కంటే స్త్రీ బాధ్యతనే ఎక్కువ. ఇది ఎవరు కూడ కాదనలేని సత్యం కనుక అది సృష్టి వర్షచక్రంలో స్త్రీ రూపమైన శరద్రుతువు నుండియే అనగా ఆశ్వీయుజ ప్రారంభం నుండియే ప్రారంభమయిందనవలె.

బ్రహ్మ యొక్క సృష్టి తొమ్మిది విధాలని భాగవతంలో చెప్పబడింది. బ్రహ్మలు గూడ తొమ్మండుగురే! ఇప్పటికారుగురు బ్రహ్మలు గడిచినారట. ప్రస్తుతం మనం ఏడవ బ్రహ్మగారి కాలంలో అతని పరార్ధంలో అనగా ఏబది ఒకటవ సంవత్సరంలోని మొదటిదినంలో ఉన్నాం. బ్రహ్మ తన యొక్క నవవిధ సృష్టి దినమొకటిగా తొమ్మిది దినాలలో సృష్టించి నాడట. అందుచేత ఆ చిహ్నంగా పూర్వం మన పల్లెటూళ్లలో ఆశ్వీయుజం ప్రారంభం కాగానే జానపదులు తొమ్మిది దినాలు బ్రతుకమ్మ అనే పండుగను చేసేవారు. బ్రతుకమ్మ (బ్రతుకు G అమ్మ) పండుగ అనగా సృష్టి ప్రథమంలో జీవోత్పత్తి ప్రారంభమైన దినం అని తాత్పర్యం.

 శరద్రుతువు రాగానే ప్రకృతిలో అంతవరకు బాగా కురిసిన వర్షాల వల్ల వాతావరణమంతా శుభ్రంగా కడుగబడి దూళి రహితమై ఉంటుంది. శరద్రుతువులో అగస్త్యోదయం అవుతుంది కాబట్టి అంతవరకు వానలతో వరదలతో జలాశయాలన్ని పొంగి పొరలి రజో భూయిష్టమై ఉండి అగస్త్యోదయంతో వండు పగిలితేట పడుతుంటవి. కాబట్టి అదే విధంగా సృష్టి ప్రథమ దశలోగూడ ఈ భూగోళం పైన గూడ వాతావరణం మరియు స్థలజలాదులు నిర్మలపడిన పిమ్మటనే జీవోత్పత్తి జరిగి వుంటుంది.

శరద్రుతువు కంటె మొదటిది వర్షరుతువు. వర్షం చేత భూమి పై అన్యోత్పత్తి జరుగుతుంది. కనుక సృష్టి మొదటి దశలో గూడ భూమిపై మొదట అన్యోత్పత్తి జరిగిన పిమ్మటనే జీవన సృష్టి ఆరంభమై ఉంటుంది. భాద్రపదంలోని కృష్ణపక్షం హిందువులకు పితృపక్షాలు, అనగా ఆ పదిహేను దినాలు వారు నక్తం పాటిస్తు పితృ దేవతలకు తర్పణాలు విడవవలసిన దినాలు. “పెత్తరమాస” పితృ అమావాస్య, సామాన్య జనానికంతా తమ పెద్దలకు పెట్టుకోవలసిన పెద్ద పండుగ.

ఈ నెలలో యమ ధర్మరాజు పితృలందరిని మీరు భూలోకంలో మీ మీకుటుంబాలకు వెళ్లి వారర్పించే నైవేద్యాలు, జలతర్పణాలు స్వీకరించిరండని పంపుతాడట. అందువల్ల శరద్రుతువులో మానస సరోవరం నుండి దేశంలోని జలాశయాలలోనికి హంసలు వచ్చినట్లు యమలోకం నుండి పితరులంతా భూలోకానికి వస్తారు. అందుచేతనే ఈ నెలంతా హిందువులు తమ పితృదేవతలను పూజిస్తుంటారు. నెలంతా కాకున్నా కృష్ణపక్షంలో విధిగా వారికి తర్పణాలు విడుస్తుంటారు. కనుక వానిని గ్రహించటానికి వచ్చిన ఆయా వంశాలకు సంబంధించిన పితరులు తాము మళ్లీ అవతరించటానికి తమతమ వంశాలలో లేదా యితరస్థలాలలో తమకనువైన క్షేత్రాలు కూడ చూసుకుంటు ఉంటారు. కనుక ఈ విధంగా కూడ ఈ శరదృతువు జీవోత్పత్తికి ఒక సూచకంగా వుంది.

హిందుపురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు అత్తవారింటికి వచ్చి పడకవేస్తాడు. అందుకే దీనికి శయనైకాదశి అని పేరు. పిమ్మట అతడు శరద్రుతువులోనే కార్తీక శుద్ధేకాదశినాడు లేచి వెళ్లుతాడు. ఆనాడతనిని గోపికలు వచ్చి పిలుచుకొని వెళ్లుతారు. ఆయన లేచి వెళ్లుతాడు కాబట్టి దీనికి ఉత్థానైకాదశి అని పేరు. కనుక ఈ శరద్రుతువు ఆషాడంలో శయనించిన విష్ణువు మేల్కోని కన్నులు విచ్చే సమయం అవుతుంది. సృష్టిలో ప్రతి ప్రాణికి గర్భధారణకు ఒక ఋతువు నియమితమై వుంది కనుక దాన్ని అనుసరించి వసంతం మానవులకు అపుడు వృక్ష జాతులన్ని చిగిర్చి పూచి మన్మథునికి బాగా సమృద్ధిని కలిగిస్తవి. కాబట్టి (మాయ విహారాల సమయంగా ఉంది. కనుక చైత్రం నుండి లెక్కించినపుడు ఆశ్వీయుజం ఏడవనెల అవుతుంది. పిండోత్పతి క్రమాన్ననుసరించి సాంఖ్యంలో గర్భస్థజీవుడు మేల్కొని అతనికి పూర్వస్మృతి కలిగే తరుణం. కనుక సముద్రుని యింటికి వచ్చి శయనించిన విష్ణువు శరద్రుతువులో కన్నులు విచ్చటం మనకు గర్భస్థుడైన ఈ జీవుడు కన్నులు విచ్చటానికి అనగా అతనికి పూర్వ స్మృతి కలుగటానికి ఒక సూచనగా ఉంది. ఈ విధంగా యిది గూడ ఒక విధంగా శరద్రుతువులోని జీవోత్పత్తి స్థితినే సూచిస్తుంది. అందువల్ల తెలంగాణంలోని పల్లెటూళ్లలో శరద్రుతువులో స్త్రీలు జరుపుకొనే బ్రతుకమ్మ పండుగ వెనుక ఈ రహస్యాలన్ని తలదాచుకొని ఉన్నవి.

ఈ బ్రతుకమ్మను స్త్రీలు పుష్పరాశిని శిఖరకారంగా పేర్చి దానిలో ఆ దేవిని ఆహ్వానించి ఆరాధిస్తారు. పుష్పం మనకు ఫలోత్పత్తికి సంకేతం. అంతేగాదు, అది సృష్టి ఆరంభానికి కూడా సంకేతమే ఆది సృష్టిలో విష్ణువు నాభినుండి కమలం పుట్టిన పిమ్మటనే దానిలో బ్రహ్మ ఉదయించి ఈ జగత్తునంతా సృష్టించినాడు గదా! అందువల్ల జానపదులు పూలతో బతుకమ్మను తొమ్మిది దినాలు తొమ్మిది రకాలుగా అలంకరించి ఆరాధించి చివరినాడు జలనిమజ్జనం చేస్తారు.

ఈ బ్రతుకమ్మ ఆరాధనలో తంగెడు పూలకు ప్రాముఖ్యమెక్కువ. దేవి రూపం ఏదైనా జానపదులలో ఆమె పార్వతికే సంకేతం. పార్వతి గిరికుమారి కాబట్టి ఆమెకు గౌరి అని పేరు. ఈమెకు మొదటి పేరు కాలి. గౌరి మొదట నల్లగానే ఉండెనట. కాని శివుడామెను వివాహమాడిన పిమ్మట నల్లగా ఉన్నావని హేళన చేయగా ఆమె బ్రహ్మను గురించి తపస్సు చేసిందట. అప్పుడాయన ఆమెకు తన వంటి బంగారు వన్నె కలిగేటట్లు వరమిచ్చినాడని అందువల్ల ఆనాటి నుండి ఆమెకు బంగారు వెన్నె ప్రియమయినదని చెప్పబడుతుంది. కనుక స్త్రీలిపుడు. ఏ పండుగలో గౌరి దేవిని ప్రతిష్ఠించు కోవలసి వచ్చినా ఆమెను పసుపుతోనే చేయటం. ఆమె గిరికుమారి కనుక గౌరి మÖర్తిని శాఖాహారకారంగా చేయటం ఆనవాయితిగా ఏర్పడింది. కందూరులోని ఆలయంలో గౌరి యిపుడు ఈ రూపంలోనే ఉంటుంది కూడ.

పసుపు వన్నె కారణంగా బ్రతుకమ్మలో తంగెడు పూవులకు ప్రాముఖ్యం ఏర్పడింది. అవి ఈ ఋతువులో విరివిగా లభించే పుష్పాలు గూడ. అందువల్ల జానపదులు వానిలో బ్రతుకమ్మను గౌరమ్మ ఆకారంలో పేర్చుకుంటారు. ఈ విధంగా మన పల్లెటూరి బ్రతుకమ్మ వెనుక ప్రాచీనమైన సృష్టి రహస్యం ఎంతో ఇమిడి వుంది.

ముత్యాల పల్లకీసేవ


ముత్యం మనకు నవరత్నాలలో ఒకటి. కాని దీనికి ఒక ప్రత్యేకత ఉంది. రత్నాలన్నీ సాధారణంగా శిలావికారాలే గాని వానిలో ముత్యం, పగడం మాత్రం అలా కాదు. అవి నీటిలో కరిగియున్న కాల్షియం చేత ఏర్పడినవి అంటారు శాస్త్రజ్ఞులు. ఈ ముత్యాలు స్వాతిచినుకులతో ఏర్పడుతవని హిందువుల విశ్వాసం. వర్షాకాలానికి ముందు వేసవి ఉంటుంది. కాబట్టి అపుడు నేలంతా శుష్కించి వాతావరణమంతా ధూళిమయమై ఉంటుంది. గాబట్టి శ్రావణ భాద్రపదాలతో వర్షాలు ప్రారంభం కాగానే ఈ తొలికారు వర్షాలతో నదులని పాంసువుతో కూడిన వర్షాలతో వండు నీటిమయమై ఉంటవి. అందువల్ల ఈ కాలంలో నదులలో స్నానం చేయరాదని అవి రజస్వలలై ఉంటామని కూడా అంటారు.

శరదృతువుతో ఆకాశంలో అగస్త్య నక్షత్రం ఉదయిస్తుంది. అప్పటి నుండి ఇక నీరు వండు పగిలి కలక దేర నారంభిస్తుంది. అందుచేతనే తెనాలి రామకృష్ణయ్య అగస్త్యుని పాండురంగ మహాత్మ్యంలో ‘కత కఫలం’ అనగా వండు నీటి పాలిటికి చిల్లగింజ అని వర్ణించినాడు. చిల్లగింజను అరగదీసి నీటిలో కలిపితే అది ఎంత నిండుగా ఉన్నా తేరి శుభ్రపడుతుంది. ‘విశాఖాంతాని మేఘాని ప్రసవాంతాని యవ్వనం’ అనేది సంస్కృత సూక్తి. విశాఖ కార్తిలో మేఘాలు అంతమౌతవి కాబట్టి వర్షాకాలానికి స్వాతి చివరి కార్తి అవుతుంది. అప్పటి వరకు వానలు కురిసి కురిసి వాతావరణంలోని ధూళి అంతా కడిగి పెట్టబడుతుంది. కాబట్టి స్వాతి చినుకులు స్వచ్ఛంగా వడగట్టన నీటివలె (డిస్టిల్‌డ్ వాటర్) ఉంటవి. ఈ కాలంనాటికి సముద్రాలలో ముత్తెపు చిప్పలు విచ్చుకొని పైకి తేలి వస్తవి కనుక అవి స్వాతిచినుకులు పడగానే మళ్ళీ ముకుళించుకొని మునిగిపోతవి.

స్వాతి చినుకులు స్పటికంవలె నిర్మలంగా ఉంటవి కాబట్టి అందుచేత ఆ నీటితో ఏర్పడిన ముత్యాలలో నీటి తళుకు కనిపిస్తుంది అంటారు. ఈ ముత్యాలకు ఆణిముత్యాలని వ్యవహారం. నీటిలో మునిగిన చిప్పలు లోపల ముత్యం పూర్తి కాగానే పగిలి విచ్చు కొంటవి. అప్పుడు ముత్యం ఎగిరి నీటిలో పడుతుంది. చిప్పలు అలలతో ఒడ్డుకు కొట్టుకు వస్తుంటవి. చిప్పలో నుండి ముత్యం ఆ విధంగా ఎగిరి విడివడి పోతుంది. కనుకనే దానికి ముక్తం, ముక్తకం, మౌక్తికం అని పేరు. మేక్తికల అనగా తనను బంధించి ఉంచిన శుక్తి నుండి విడువడునది అని అర్థం. ఈ విధంగా ముత్యం మనకు ఒక సంసార బంధం నుండి విడువడునది అని అర్ధం. ఈ విధంగా ముత్యం మనకు ఒక సంసార బంధం నుండి విడివడిన ఒక ముక్త జీవునికి సంకేతంగా ఉంది.

మృత్యుంజయ మంత్రంలో ‘ఉర్వారుక మివ మృత్యోర్ము క్షీయ మామృతాత’ ` ఓ శంకరా - అమృ తత్వం కొరకు నన్ను సంసారం నుండి పండిన దోసపండు వలె విడిపించు అని అర్థం. దోసపండును అది వండిన పిదప తీగ నుండి దాన్ని మనం త్రెంపనవసరముండదు తొడిమ దానంతటదే విడిపోయి ఊర్ధ్వముఖంగా వంగుతుంది ఈ సంసారం కూడా అట్టిదే. దానిని మనమై మనం విడువలేం. అది మనలను విడిసిపెడితే తప్ప. అందుకే భగవంతుడు మనకు ఇచ్చిన ఒక్కొక్క ఇంద్రియం యొక్క శక్తి నపసంహరించి వానిని చంపి మనలను సంసారానికి గాని ఆలోచనకుగాని దేనికి పనికిరాని ముసలివానిగా చేస్తున్నాడు. అపుడిక మనం సంసారానికి పనికిరాము కాబట్టి ఇంటివారు. విడిచిపెట్టినట్లున్నా మనమే ఇంకా సంసారాన్ని పట్టుకొని ప్రాకులాడుతుంటాం.

దోసపండు ` ముత్యం :

ఈ రెండు మనకు మర్కట మార్జాల కిశోరన్యాయాలకు నిదర్శనంగా ఉన్నవి. కోతిపిల్ల తల్లిని తానే పట్టుకోవాలి గాని తల్లిదే బాధ్యత ఉండదు. పిల్లి పిల్లను తల్లియే పట్టుకోవలెగాని పిల్లదే భాద్యత ఉండదు. అట్లాగే దోసపండును తీగనే విడిచిపెడుతుంది తప్ప, అది తీగ నుండి రాలి పడదు. ముత్యం అట్లా గాదు. పూర్ణమైన తర్వాత అదియే చిప్పను పగుల దన్నుకొని బయట పడుతుంది కాని చిప్ప బయటకు నెట్టదు. మనవారు వివాహ సమయంలో లగ్న పత్రికలు వ్రాసుకునే అపుడు మనను “అము కాయ మాంబా గర్భశుక్తి నుంజనిత మౌక్తికాయ మాన అముకనామ వరాయ. అముకాయ మాంచా గర్భశుక్తి సంజనిత మౌక్తికాయ మాన అముకనామ్నీంవధూః” అని మనలను ముత్యాలతోనే పోల్చి చెప్పు కుంటారు. రతి సమయంలో స్త్రీ యోనికమలం తనంతట తానుగా వికసిస్తుంది. గాబట్టి అది వారి కానంద సమయం. ప్రసవం అట్లా గాక ప్రసవగత వాయువు చేత శిశువు ముందుకు త్రోయబడుతు తనంతట తానుగా యోనిని చీల్చుకొని భూపతనం కావలసి వస్తుంది. అందువల్ల స్త్రీకి ప్రసవం కష్ట దశ అవుతుంది. ఇది చిప్పలోపలి ముత్యం తనంతట తాను చిప్పను పగుల్చుకొని బయటపడటం వంటిదే. అందుకే వధూవరులను పెద్దలు అముకాయమానాంబ గర్భశుక్తి సంజనితులని చెప్పకుంటారు.

తల్లియొక్క కుక్షి నుండి మనం సంపూర్తిగా ముక్తమౌతున్నాం అనగా వేరౌతున్నాము కనుక మనం కూడ ఒక మౌక్తికం ముక్తి క్రిందనే లెక్క. రెండవసారి మళ్లీ వివాహమపుడు మధూవరులు తల్లి దండ్రుల నుండి పూర్తిగా వేరై వధువు కన్యాత్వం నుండి, పురుషుడు బ్రహ్మచర్యం నుండి విముక్తులవుతుంటారు కనుక అందుకే వూర్వం శాస్త్రవేత్తలు ముత్యాలను తలంబ్రాలుగా పోసుకునే ఆచారాన్ని ఏర్పరచినారు.

రత్నాలలో ముత్యాలు స్వతంత్రమైనవి. పగడాలు, ముత్యాలు ఈ రెండు తప్ప తక్కిన రత్నాలన్నీ శిలా వికారాలనియే మొదట చెప్పబడింది. వానిని గనుల నుండి త్రవ్వితీస్తారు. అపుడు వానిని గనిలోని రాళ్ళతో గుర్తించి రత్నాలను వేరు చేసుకోవలసి ఉంటుంది కాని ముత్యాల నట్లాకాదు. వానిని నీళ్ళలోంచి దేవుకోవటమే. ఆ తర్వాత అవి సైజునుబట్టి రంగును బట్టి వేరు చేయబడుతుంటవి కాని రత్నాలవలె మొదలే గుర్తించి ఎరుకోవలిసన అవసరముండదు. అవి స్వతంత్రాలు. మన పద్యాలలో ముక్తకాలు గూడ దేనికదే స్వతంత్రమే గదా! అందుకే పూర్వం తలంబ్రాలుగా ముత్యాల నేర్పరచనారు. అయితే ఈ కాలంలో మనకవ దోసిళ్ళకొద్దీ లభ్యం కావు. కనుక వానికి బదులు బియ్యాన్నేరచి వానిలో లాంఛనానికైనా మÖడు నాలుగు ముత్యాలు కలుపుతారు.

ఈ విధంగా ముత్యం మన పురుషార్థాలలో చతుర్థ పురుషార్థానికి అనగా ముక్తికి చిహ్నంగా నిలిచింది కాబట్టి ముత్యాల హారాలు ధరించటం, వివాహంలో ముత్యాల పందిరులు ఏర్పరచటం, యాన సాధనాలలో పల్లకీలను ముత్యాల దండలతో అలంకరించటం ఒక ఆనవాయితీగా అయింది.

వధూవరులు ముత్యాల పందిరి క్రింద తలంబ్రాలు పోసుకున్నారంటే వారు తమ శారీరక మానసిక బంధాలన్నిటి నుండి విడివడి స్వతంత్రులై ముక్తపురుషులై ఆ 

ఉభయులు ఏకాత్ములైతున్నారని తాత్పర్యం. ఈనాటి సంస్థలకు రజతోత్సవం, స్వర్ణోత్సవం, వజ్రోత్సవాలనేవి జరుపుతుంటారు. అలాగే నూరు సంవత్సరాలు నిండితె మౌక్తికోత్సవం అనేది గూడా జరుపుతారు. ఈ మౌక్తికోత్సవం అనేది మనుషులకు గూడ ఉంది. ఎవరైనా శతాయుష్కులు అయినపుడు వారికి జరుపుతారు. మౌక్తికోత్సవం జరుపటమంటె వారు జీవన్ముక్తులు అనగా జీవించి ఉండగా ముక్తిని చేకొన్నవారుగా భావించబడతారు.

ఈ ముత్యాలకు మరొక విధంగా గూడా ప్రశస్తి ఉంది. భాగవతంలో నారాయణ శబ్దానికి

శ్లో. ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపోవై నరసూనవః

తాయద స్వాయనం పూర్వం తేన నారాయణం స్మృతమ్

ఆప : అప్పు అనగా నీరు. ఆ నీటిలో నుండియే ప్రాణులన్నీ పుట్టినవి. మొదట ఆ నీరే శ్రీ మన్నారాయణునకు నివాసమయింది కనుక అతనికి నారాయణుడని పేరు కలిగినదని ఆ పై శ్లోక తాత్పర్యం.

ఈ నారాయణుని వలెనే ముత్యాలకు గూడ మొదట నీరే ఆశ్రయం. అవి పుట్టుకకు గూడ నీరే కారణం. కాబట్టి అవి నారాయణునికి ప్రతి రూపంగా కూడా ఉన్నవి. ముత్యాలు తెల్లనివి. విష్ణువు గూడ కృతయుగంలో తెల్లనివాడే.  విష్ణువునకు వలెనే ముత్యాలకు గూడ పసుపు, ఎఱుపు, నీలం అనే రంగులు గూడ ఉన్నవి. మనకు కలశ పూజలో “ఆపోవా ఇదగం సర్వం” అనే మంత్రం ఉంది. ఆ మంత్రంలో ఈ జగత్తంతా నీటి నుండియే పుట్టింది అని చెబుతుంది.

మంత్రపుష్పంలో ‘యోపాం పుష్పం’ అనే మరొక అంతర భాగం వస్తుంది. అది ‘య ఏవం వేదా యోపా మాయతనం ఆయతనవాన్ భవతి’ అని ప్రారంభమై ప్రతి పాదం చివరన ఆయతవాన్ భవతి  అని వస్తుంది. ఆయోపాం పుష్పం మొత్తం నీటి యొక్క మహిమనే కీర్తించి దాని మÖలం తెలిసికున్నవాడుగా ముక్తిని పొందుతాడు అని చెబుతుంది.ఇది నీటి యొక్క మహాత్మ్యం. అటువంటి నీటి యొక్క ఘన రూపమే ముత్యం. నారు అంటే నీరు. జ్ఞానం అని రెండర్థాలు. నారదుడు అంటే జ్ఞానం ఇచ్చేవాడు అని అర్థం. కనుక నారం యొక్క ఘనరూపం ఆచేతనంలో ముత్యమైతే చేతనంలో అదే నారం యొక్క ఘనరూపం మానవుడవుతున్నాడు. కనుక ఈ విధంగా ముత్యాలకు మానవునికి ఒక విడదీయరాని అర్థ సంబంధం ఉంది.అందుకే మానవుడు ముత్యాల హారాలు, ఆలంకారాలు ఎక్కువగా ఇష్ట పడతాడు. 

ముత్యం ఈ విధంగా నారాయణునికి నివాసం మరియు లక్ష్మీ దేవికి పుట్టినింటి బిడ్డ అయింది. కాబట్టి విష్ణువుకు కూడా ముత్యాలు చాలా ప్రియమైనవి. అందుచేతనే అతడు కృష్ణావతారంలో నాసాగ్రం నవమౌక్తికం మరియు కంఠంలో ముక్తావళి అనగా ముత్యాల దండను ధరించినాడు. ముత్యం ముక్తికి చిహ్నం కాబట్టి ముత్యాల పందిరిలో కూర్చోవటం, ముత్యాల పల్లకిలో ఊరేగటం అంటే స్వామి ముక్తి పీఠాన్ని అధిష్టించినవాడు. ఎల్లపుడాయన ముక్తిలోకంలోనే విహరిస్తుంటాడు అని అర్థం.

ఇక పల్లకిని గురించి ఆలోచింతాము. ఈనాడు దీని రూపాన్ని ‘డోలీ’ అంటున్నారు. అదే అలంకారాలన్నీ సంతరించుకొని పల్లకి రూపం ధరించింది. ఈ డోలీ అనేది నా అభిప్రాయంలో మానవుడు రథచక్రం కనిపెట్టిన నాటి యాన సాధనంగా ఉంది. సుమతీదేవి చరిత్రలో ఆమె కుష్టువ్యాధిగ్రస్తుడైన భర్తను వేశ్య ఇంటికి కొనివెళ్ళవలసి నపుడతనిని ఒక గంపలో కూర్చోబెట్టుకొని తలపై ఎత్తుకొని వెళ్ళింది. కాలాంతరంలో అటువంటి గంపకే రెండువైపులా రెండు త్రాళ్లు కట్టి వానిలో నుండి ఒక కఱ్ఱను దూర్చి తొట్లెవలె వ్రేలాడదీసినపుడది డోలీ అయింది. ఇప్పటికి ఇటువంటివి కేదార యాత్రలో చూడవచ్చు. ఈ డోలీలో కూర్చున్న వ్యక్తి ఏమాత్రం కొంత నిక్కెనా దాని వెన్ను కఱ్ఱ అతని తలకు తగిలే ప్రమాదముంది. అందువలన నాగరికత నేర్చిన మానవుడా వెన్నుకఱ్ఱను నడుమ విల్లువంపుగా వంచి చివరలు మాత్రం అలాగే చక్కగా ఉంచినాడు. కొన్ని తడవలు దానిని గూడ అర్ధచంద్రాకారంగా కొండపైకి వంచినాడు. దానికి వేలాడే తొట్లెను చక్కగా అలంకరించి లోపల పట్టుదిండ్లు ఏర్పరుచుకొని వెన్నుదండెను, ముత్యాలమాలలను, పట్టుక్రుచ్చులను వేలాడదీసి అలంకరించుకున్నాడు. ఇక ఇదే ఈనాటి పల్లకిరూపం

ఈ పల్లకిని మోసే బోయలు ముందు ఇద్దరు వెనుక ఇద్దరుంటారు. వారు దాన్ని మోస్తు నడిచే అపుడు అలసట రాకుండా ఓం అీVAం ఓం అీVAం అంటూ ఉంటారు. ఓం అనడంలో ప్రణవం స్పష్టంగానే ఉంది. అీVAంలో అది అచ్చుల హల్లుల స్వరాలలో దాగిపోయింది. అయినా బోయిల యొక్క ఈ ప్రణవనాదం పల్లకి యొక్క వెన్ను వంపు రెండు కలిసిపోయి మానవుని భావనలో దాన్ని ప్రణవపీఠం చేసినవి.

తెలుగులో ఓం కారానికి వంకలు చాలానే ఉన్నవి. ఒక్క తెలుగులోనే గాక సంస్కృతంలో గూడ ఒకారమైన అచ్చు వేరుగానే యున్న తెలుగులోని ఒకారాన్ని వారు అడ్డంగా తిరగే ఓంకారాన్ని చేసినారు. అందువల్ల ఇపుడు వేదాంతులు జిజ్ఞాసలో పడినపుడు ఓంకారానికే వంకలున్నవి కాబట్టి మరిక చక్కటి బాట ఏదంటాము అనే మీమాంసలో పడుతుంటారు. కాబట్టి ఇదెట్లా ఉన్నా ఈనాడు పల్లకి నెక్కిన పురుషుడు అంటే ప్రణవ పీఠాన్ని అధిష్టించిన వాడు - అనే అర్థం ఒకటి నిలిచింది కాబట్టి అర్చా మÖర్తికి మనం పల్లకి సేవ చేస్తున్నా మంటే ఆయన ఎవరో మామÖలు దైవం కాదు. ఆ ప్రణవ పీఠాన్ని అధిష్టించిన సాక్షాత్తు పరబ్రహ్మమÖర్తియే అని ధ్వనిస్తుంది.

ఈలాగే ముత్యాల పందిరి లేదా ముత్యాల పల్లకిని తీసుకున్నపుడు ఆ స్వామి ముక్తి పీఠాన్నధిష్టించినవాడు దానికి అధిపతి. తన దాసులను తన స్థానానికి అంటే ఆ ముక్తి స్థానానికి పిలుచుకోగలవాడు అని తెలుపుతుంది అనవచ్చు. ఇది ముత్యాల పల్లకి వెనకనున్న ఆధ్యాత్మిక తత్వం.