మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

మానవుని ఉత్కృష్టత


ఆహార నిద్రాభయమైథునం చ సామాన్య మేతత్‌ పశుభిర్నరాణామ్‌ ।
ధర్మో హి తేషామధికో విశేషో ధర్మేణ హీనాః పశుభిః సమానాః ॥
(హితోపదేశము, ప్రస్తావిక - 26)
శరీర పోషణకై ఆహారము తినుట, నిద్రా, భయము మరియు సంతానోత్పత్తి అను ఈ నాుగు గుణము పశువులోను, మనుష్యులోను సమానముగ కనిపించు సామాన్యగుణము. మనుష్యులో ధర్మమనునది విశేషగుణము. ధర్మాచరణలేని మనుష్యు పశువుతో సమానము.
ధర్మాచరణుడగుటకు మనుష్యుడు విద్యను - జ్ఞానమును సంపాదింపవసి యున్నది. విద్యవననే అతడు పదార్థముయొక్క యథార్థస్వరూపమును తెలిసికొనును. అప్పుడు వాటితో ఉచితరీతిలో వ్యవహరించి తన ముఖ్యోద్దేశ్యమైన మోక్షమును పొందుటకు ప్రయత్నించగడు. మోక్షమును పొందగ యోగ్యత కేవము మనుష్యునకే కదు. ఇదియే మానవుని ఉత్కృష్టత. ఈ మానవశరీరమందే పరమాత్మను సాక్షాత్కారము చేసికొనుటకు మీన్నది. మనుష్యుని నరుడు అని కూడ అంటారు. నృా నయే అను ధాతువుతో నర శబ్దమేర్పడును. నయతీతి నరః అని నిర్వచనము. నరుడనగా ఇతరుకు మార్గదర్శకుడు.
న రమతే ఇతి నరః అని కూడ ఒక పరిభాష. ఇంద్రియములో రమించనివాడు. అనగా వాటికి దాసుడు కాక వాటిని తన వశములో ఉంచుకొనువాడు.
విజ్ఞానసారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః ।
సో-ధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదమ్‌ ॥ (కఠోపనిషత్తు 3-9)
విశేష జ్ఞానమును సారథిగా గలిగి మనస్సును తన వశమందుంచుకొన్నవాడు నరుడు. అతడు జన్మమరణరూపకమగు మార్గముయొక్క అంతమును, వ్యాపకుడగు పరమాత్ముని పరమపదమును - మోక్షానందమును పొందగడు.
వైదిక సాహిత్యములో ఈ మానవశరీరము ఋషిభూమి, దేవపురి, బ్రహ్మపురి అని చెప్పబడిరది.  ఐదు జ్ఞానేంద్రియము, మనస్సు, బుద్ధి ఈ ఏడిరటిని ఋషుని అంటారు. ఇవి ఈ శరీరములో ఉంటాయి. కనుక ఇది ఋషిభూమి. ఇంద్రియముకు దేవతని పేరు. అందుచే ఇది దేవపురి. ఈ శరీరములోనే పరమాత్మ సాక్షాత్కారమవుతుంది. కావున ఇది బ్రహ్మపురి.


ఎవరిని ఆర్యులంటారు ?


1.     ఋ గతౌ అను ధాతువునకు ‘ణ్యత్‌’ ప్రత్యయము చేర్చినచో ఆర్య శబ్దమేర్పడును. ఈ ధాతువునకు జ్ఞానము, గమనము, ప్రాప్తి అని అర్థము. ఆర్య శబ్దమునకు ఈ క్రింది అర్థము కవు.
ఆర్యుడు    R    జ్ఞానవంతుడు.
        గతిశీుడు, కర్మశీుడు.
            ధర్మార్థకామమును త్రివిధపురుషార్థముచే
            ఉత్కృష్టమైన మోక్షమును పొందువాడు.
2.    శాంతిస్థితిక్షుర్దాన్తశ్చ సత్యవాదీ జితేన్ద్రియః ।
    దాతా దయాుర్నమ్రశ్చ ఆర్యః స్యాదష్టభిర్గుణైః ॥ (మహాభారతము)
1. శాంతగుణము, 2. సహనశీత, 3. మనోనిగ్రహము, 4. సత్యభాషణము, 5. ఇంద్రియ- జయత్వము, 6. దానశీత, 7. దయాగుణము, 8. నమ్రత - వినయము అను ఈ ఎనిమిది గుణము గ వ్యక్తిని ఆర్యుడని అంటారు.
3.    ఆర్య ఈశ్వరపుత్రః । (నిరుక్తము 6-26)
ఆర్య శబ్దము ఈశ్వరవాచకము. ఆర్యస్య అపత్యం ఆర్యః. ఆర్య శబ్దమునకు అపత్య (సంతానము) అర్థములో ‘అణ్‌’ ప్రత్యయము చేరి ఆర్యశబ్దము ఏర్పడును. అనగా ఈశ్వరుని కుమారుడు ఆర్యుడు అని అర్థము. ఈశ్వరుని గుణకర్మస్వభావముకు అతని ఆజ్ఞకు అనుకూముగ వ్యవహరించువాడు ఆర్యుడు.
4.    ఆర్యః R మాన్యః, ఉదారచరితః, శాన్తచిత్తః న్యాయపథావంబీ, ప్రకృతాచారశీః (శాస్త్రానుకూమైన ఆచారశీుడు) సతతకర్తవ్యకర్మానుష్ఠాతా. (ప్రాచీనకోశము)
5.    మహాకుకులీన (శ్రేష్ఠుడు) ఆర్యసభ్యసజ్జనసాధవః (అమరకోశము)
    ఇవి అన్ని సమానార్థక శబ్దము.
6.     అర్తుం ప్రకృతమాచరితుం యోగ్య ఆర్యః.
    శాస్త్రానుకూ ఆచారమునకు యోగ్యుడు ఆర్యుడు.
7.    ఆర్యాః శ్రేష్ఠగుణకర్మస్వభావయుక్తా మనుష్యాః (దయానంద సరస్వతి)
    శ్రేష్ఠమైన గుణకర్మస్వభావము కవారు ఆర్యు.
ఈ విధముగ మన ప్రాచీన భారతీయసాహిత్యమున ఆర్య శబ్దము గుణవాచకముగనే భించును. అందుచే ఈ భూగోళముపైననే కాదు ఈ విశ్వములో పైన చెప్పిన గుణము గ వ్యక్తి ఎచ్చటనున్నను ఆర్యశబ్ద వాచ్యుడే. అంతే కాని ఆధునికచరిత్ర ప్రకారము జాతివాచకము కాదు. కావున ఈశ్వరుడు వేదము ద్వారా కృణ్వన్తో విశ్వమార్యమ్‌ అని బోధించినాడు. అనగా విశ్వములోని మానవునందరిని ఆర్యుగా - శ్రేష్ఠుగా చేయుడు.

మానవుని జీవనోద్దేశ్యము


దీనిని పురుషార్థము అని కూడ అంటారు. అనగా ప్రతి మనుష్యుడు ప్రయత్నపూర్వకముగ క్రియాశీుడై సాధించవసినది - పొందదగినది. అది ధర్మము, అర్థము, కామము, మోక్షము - పరమాత్మ సాక్షాత్కారము అని నాుగు విధము. నాుగవదైన మోక్షమును అత్యంతపురుషార్థమని కూడా అంటారు.
ధర్మము: ప్రపంచములోని మానవుందరు ఆచరించదగినది. పక్షపాతములేని న్యాయము, అందరికి హితముచేయుట, భగవంతుని ఆజ్ఞను పాలించుట, అసత్యమును త్యజించుట, సత్యమును గ్రహించి ఆచరించుట.
అర్థము: మనము జీవించుటకు ఉపయోగపడే వస్తువు. ఆహార పదార్థము, వస్త్రము, గృహము, ధనము, గృహములో వాడుకొనే విభిన్న వస్తువు.
కామము: అనగా కోరిక. ధనసంపాదన, గృహనిర్మాణము, భూమును సంపాదించుట, కీర్తిప్రతిష్ఠను సంపాదించుట, ఉన్నత ఉద్యోగము కావానుకొనుట. ఈ కోరికు హద్దు దాటకూడదు.
మోక్షము: అన్నిరకము దుఃఖమునుండి విడిపోయి భగవంతునిలోని ఆనందమును - సుఖమును అనుభవించుట. అది భగవంతుని సాక్షాత్కారము వన కుగును. ఆ సుఖము ఎంత అనుభవించినను తనివితీరదు. లోకములోని ఇతర సమస్తసుఖము తాత్కాలికము. అవి సుఖముతో పాటు దుఃఖమును కలిగించును. వివేకవంతుని దృష్టిలో జగత్తులోని అన్ని పదార్థము దుఃఖమును కలిగించునవే. మోక్షమును పొందినవానికి శరీరము ఉండదు. సుదీర్ఘకాము వరకు ఆనందమునే అనుభవిస్తాడు. అతనికి ఏ విధమైన దుఃఖము ఉండవు. శరీరములో ఉన్నప్పుడే దుఃఖము ఉంటాయి. ధర్మము, అర్థము, కామము అను మూడు పురుషార్థము మోక్షమును పొందుటకు సాధనములే. మోక్షమే జీవితము యొక్క ముఖ్య ఆశయము - ఉద్దేశ్యము. అది మానవజన్మలోనే సాధ్యము. అదే మానవుని గమ్యము, పరమావధి.
ఇహ చేదవేదీదథ సత్యమస్తి న చేదవేదీన్మహతీ వినష్టిః ।
భూతేషు భూతేషు విచిన్త్య ధీరాః ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవన్తి ॥
                    (కేనోపనిషత్తు 2-5)
ఈ మానవ శరీరమందున్న జీవుడు పరమాత్మను తెలిసికొని అతనిని సాక్షాత్కారము చేసికొన్నప్పుడు ఈ జన్మ సఫము. దానికై ప్రయత్నించక ఇంద్రియలోుడై విషయముందు చిక్కుకొన్నవానికి కుగు నష్టమును ఇంత అని చెప్పలేము. అది ఊహించడానికి మీలేనిది. అందుకే విద్వాంసు ధ్యానశీురై ఈ చరాచర జగత్తునందలి జడచేతనపదార్థములో అతి సూక్ష్మమై వ్యాపించియున్న పరమాత్మను నిశ్చయపూర్వకముగ తెలిసికొని జన్మ మరణరూపమైన బంధనమునుండి - దుఃఖమునుండి విడిపోయి బ్రహ్మానందమును అనుభవిస్తారు. పామయి విషయలోురై దుఃఖమును అనుభవిస్తారు.


సత్యము, అసత్యము


సత్సు తాయతే తత్‌ సత్యమ్‌ ।
విద్యమాన - ఈ సృష్టిలో ఉన్న వస్తువులో వ్యాపకమై ఉన్న గుణము సత్యము.
సత్యం కస్మాత్‌? సత్సు తాయతే, సత్ప్రభవం భవతీతి వా ।
                    (నిరుక్తము 3-13)
సత్పురుషులో విస్తరించుటచేత, సత్పురుషునుండి ఉద్భవించుట వన సత్యమనబడుచున్నది.
యత్‌ యథావత్‌ తత్త్వపదార్థం తత్‌ సత్యమ్‌ ।
ఏ వస్తువు ఎట్లుండునో దానినట్లే చెప్పుట సత్యము. పదార్థము-వస్తువు ఏ విధముగా ఉంటుందో దానిని అట్లే తెలిసికొనుట, దానిని అదేమాదిరిగా ఒప్పుకొనుట, ఇతరుకు దానిని గురించి అదేవిధముగా చెప్పుట, ఆ వస్తువుతో అలాగే వ్యవహరించుట, దాని ద్వారా పూర్ణలాభమును పొందుటను సత్యము అందురు. దానికి విపరీతమైనది అసత్యము.
సత్యము: సరళము, వస్తుస్థితికి అనుకూము. సత్యము గ చోట ఉత్సాహము, నిర్భయము ఉంటుంది. ఇది వజ్రము కన్న కఠినము. పుష్పము కంటె మృదువు. అభ్యాసము లేకపోవుటవన సామర్థ్యము లేకపోవుటవన సత్యభాషణము కఠినమనిపించును. నిజానికి సత్యమును సాధారణవ్యక్తియు, విద్వాంసుడును సుభముగ చెప్పగడు.
అసత్యము: వక్రము, వస్తుస్థితికి ప్రతికూము. అసత్యముగ చోట జ్జా, భయము ఉండును. అసత్యమును అతితెలివిపయి మాత్రమే చెప్పగరు. అసత్యభాషణమువన కష్టప్రాప్తియు కుగును.
న హి సత్యాత్పరో ధర్మో నానృతాత్‌ పాతకం పరమ్‌ ।
న హి సత్యాత్పరం జ్ఞానం తస్మాత్సత్యం సమాచరేత్‌ ॥
సత్యము కన్న ధర్మము అసత్యమునకు మించిన పాపములేదు. సత్యమును మించిన జ్ఞానములేదు. అనగా సత్యమే జ్ఞానము. కావున సత్యమునే ఆచరించుము.
నాస్తి సత్యవతామప్రాప్యమ్‌ ॥ (చాణక్య నీతి సూత్రము)
సత్యవంతుకు భించనిది లేదు.
సత్యప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వమ్‌ ॥ (యోగదర్శనము 2-36)
సత్యము సిద్ధించినవాని వాక్కు అమోఘము. అనగా అతని వచనము వ్యర్థము కాదు. అతడు యోగ్యతగ వానిని ‘ధార్మికుడవు కమ్ము’ అని ఆశీర్వదించినచో అతడు ధార్మికుడగును. ‘సుఖీభవ’ అని ఆశీర్వదించినచో అతని దుఃఖము దూరమగును.
సత్యం బ్రూయాత్‌ ప్రియం బ్రూయాత్‌ న బ్రూయాత్‌ సత్యమప్రియమ్‌ ।
ప్రియం చ నానృతం బ్రూయాత్‌ ఏష ధర్మః సనాతనః ॥
                    (మనుస్మృతి 4-138)
సత్యమునే చెప్పుము. ఆ సత్యమును ప్రియమైన మాటలో చెప్పుము. కఠినవచనముతో మనస్సును బాధించునట్లు చెప్పకుము. మరియు ప్రియమైన మాటతో అసత్యమును మాత్రము చెప్పకుము. ఇదియే అతి ప్రాచీన ధర్మము.
ఇది ఎట్లన మన మధ్య ఒక వ్యక్తి అంధుడై ఉన్నచో అతడా మాట అంగీకరించును. ఈ మాట సత్యము. మనమాతనిని మాటిమాటికి అంధుడని అనినచో అతని మనస్సుకు బాధ కుగును. దీనినే అప్రియసత్యము అందురు. దీనిని చెప్పుట యోగ్యము కాదు.
మనము లోకములో స్తుతి, నిందా అను శబ్దము వినుచున్నాము. ఆ శబ్దమును చాలావరకు తప్పు అర్థములో ప్రయోగిస్తారు. వీటి సరిjైున అర్థము ఇట్లున్నది.
పదార్థ గుణ సంకీర్తనం స్తుతిః ॥
పదార్థము యొక్క గుణమును చెప్పుటను స్తుతి అంటారు.
గుణేషు గుణారోపణం స్తుతిః । దోషేషు దోషారోపణం చ స్తుతిః ॥
పదార్థములో ఉన్న గుణమును ఉన్నవని చెప్పుటను మరియు లేని గుణమును లేవని చెప్పుటను స్తుతి అంటారు.
గుణేషు దోషారోపణమసూయా । దోషేషు గుణారోపణమప్యసూయా ॥
ఇక్కడ ‘అసూయా’ అనగా నిందా అని అర్థము. పదార్థములో ఉన్న గుణమును లేవనుటను మరియు లేని గుణము ఉన్నవనుటను నిందా అని అంటారు.
అనగా సత్యమును చెప్పుటను స్తుతి యనియు అసత్యమును చెప్పుటను నిందా అనియు చెప్పవచ్చును.

సత్యాసత్యమును నిర్ణయించు సాధనములు


మనము ప్రతినిత్యము సిద్ధాంతపరమైన శాస్త్రీయవిషయమును మరియు లౌకిక విషయము నెన్నింటినో వినుచుంటాము. అవి ఎంతవరకు సత్యము అను సందేహము కుగుటలో ఆశ్చర్యము లేదు.
దారిలో మనకు ఒక పసుపుపచ్చని ధాతువు ముక్క కనిపించినపుడు అది ఇత్తడియా లేక బంగారమా అనునది మనకు కాని కంసాలి (స్వర్ణకారుడు)  కన్నుకు గాని సరిగా తెలియదు. దానిని ఒరిపిడిరాయిపై గీచి చూచినపుడు అది ఇత్తడియో, బంగారమో, బంగారమే jైున దానిలో మిశ్రితమైన ఇతర పదార్థమెంత అనునది నేర్పరిjైున వ్యక్తి తెలిసికొనును. అట్లే మనము వినుచుండు సిద్ధాంత సంబంధమైన విషయము సత్యాసత్యమును నిర్ణయించుటకు మహర్షు ఒరిపిడిరాయి లాంటి కొన్ని పద్ధతు తెలిపినారు. విద్వాంసుడైన వ్యక్తి వాటి ఆధారముగ వినిన విషయములోని సత్యాసత్యమును నిర్ణయింపగడు. అవి ఈ విధముగ ఉన్నవి.
1.    సృష్టి క్రమమునకు అనుకూమైనది సత్యము, విరుద్ధముగా నున్నది అసత్యము.
2.    తన ఆత్మ పవిత్రతకు, విద్యకు అనుకూమైనది సత్యము. అనగా తనకెట్లు సుఖము ప్రియమో దుఃఖమప్రియమో అట్లే తాను ఇతరుకు సుఖమును కలిగించినచో ప్రసన్నుగను, దుఃఖమును కలిగించినచో అప్రసన్నుగను అగుదురని తెలియవలెను.
3.      ప్రత్యక్షాది ప్రమాణము కనుకూమైనది సత్యము, విరుద్ధమైనది అసత్యము.
ప్రత్యక్షానుమానోపమానశబ్దాః ప్రమాణాని । (న్యాయదర్శనము 1-1-3)
ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము అనునవి ప్రమాణము.
1. ప్రత్యక్షము :
ఇన్ద్రియార్థసన్నికర్షోత్పన్నం జ్ఞానమవ్యపదేశ్యమవ్యభిచారి వ్యవసాయాత్మకం ప్రత్యక్షమ్‌ ॥ (న్యా.ద.1-1-4)
జ్ఞానేంద్రియముకు భూతముయొక్క గుణముతో సంబంధమేర్పడినపుడు కుగు జ్ఞానమును ప్రత్యక్షము అంటారు.
జ్ఞానేంద్రియము : 1. నాసిక, 2. నాుక, 3. కన్ను, 4. చర్మము, 5. చెవు.
భూతము : 1. పృథివి, 2. జము, 3. అగ్ని, 4. వాయువు, 5. ఆకాశము.
భూతము గుణము (అర్థము) : 1. గంధము (వాసన) 2. రుచి 3. రూపము, రంగు 4. స్పర్శ 5. శబ్దము.
ఆ జ్ఞానము సంజ్ఞాసంజ్ఞి సంబంధము వన కలిగినది (ఇతయి చెప్పినది) కాకూడదు. మొదట ఒక జ్ఞానము కలిగి తరువాత దాని స్థానమున ఇంకొక జ్ఞానము కుగకూడదు. అంతేకాదు ఆ జ్ఞానము నిశ్చయాత్మకమైనదిగా (ఇది ఇదియే అని) ఉండవలెను.
2. అనుమానము :
అథ తత్పూర్వకం త్రివిధమనుమానం
పూర్వవచ్చేషవత్‌ సామాన్యతో దృష్టం చ (న్యా.ద. 1-1-5)
ఒకప్పుడు ఏదైన పదార్థము ప్రత్యక్షముగా తెలిసినదై ఇంకొకచోట ఆ పదార్థము యొక్క సహచరి ప్రత్యక్షమైనచో ఆ కనపడని పదార్థము యొక్క జ్ఞానము కుగుటను అనుమానము అని అంటారు. అది ఎట్లన పుత్రుని చూచి తండ్రిని, పొగను చూచి అగ్నిని, సుఖదుఃఖమును చూచి పూర్వజన్మమును తెలిసికొనుట. ఇది మూడు విధము.
(1)     పూర్వవత్‌ : కారణమును చూచినపుడు కార్యజ్ఞానము కుగుట. మేఘమును చూచి వర్షమును, చదువుచున్న విద్యార్థి తెలివితేటను చూచి విద్వాంసుడగునని నిర్ణయించుట.
(2)     శేషవత్‌ : కార్యమును చూచినపుడు కార్యజ్ఞానము కుగుట. నదీ ప్రవాహమును చూచి కురిసిన వర్షమును, కుమారుని చూచి తండ్రిని, సృష్టిని చూచి అనాది కారణమును, దాని కర్తయగు ఈశ్వరుని, సుఖదుఃఖమునుచూచి పాపపుణ్యమును తెలిసికొనుట.
(3)     సామాన్యతోదృష్టము : కార్యకారణ సంబంధము లేనిచోట ఒకానొక సమాన ధర్మము వన కుగు జ్ఞానము. ఎట్లన ప్రతి మనుష్యుడు తానున్న స్థానమునుండి కదక వేరొక స్థానమునకు చేరడు. ఇది అందరిలోను కనిపించు సమానధర్మము. మనము బొంబాయి వెళ్ళినపుడు అక్కడ బెంగుళూరులోని స్నేహితుడు కనబడినచో అతడు బెంగుళూరునుండి బయుదేరి బొంబాయికి వచ్చినాడనియే తెలిసికొందుము.
‘అను అర్థాత్‌ ప్రత్యక్షస్య పశ్చాత్‌ మీయతే జ్ఞాయతే’ ప్రత్యక్షమునకు పిమ్మట కుగునదని అనుమాన శబ్దార్థము.
3. ఉపమానమ్‌ :
ప్రసిద్ధసాధర్మ్యాత్‌ సాధ్యసాధనముపమానమ్‌ । (న్యా.ద. 1-1-6)
ప్రసిద్ధ ప్రత్యక్షసాధర్మ్యముచే సాధ్యమును - సిద్ధపరుపవసిన పదార్థము యొక్క జ్ఞానమును కలిగించు సాధనమును ఉపమానము అని అంటారు. ఒకడు తన నౌకరును విష్ణుమిత్రుని పిుచుకొనిరమ్మని,  ఆ నౌకరు విష్ణుమిత్రుని ఎన్నడును చూచియుండని కారణమున, అతనిని బోలిన దేవదత్తుని చూపించి అతడిట్లుండునని చెప్పును. అప్పుడా నౌకరు విష్ణుమిత్రుని గుర్తించి పిుచుకొని వచ్చును.
4. శబ్దము : ఆప్తోపదేశః శబ్దః । (న్యా.ద.1-1-7)
పూర్ణవిద్వాంసుడును, ధర్మాత్ముడును, పరోపకారప్రియుడును, సత్యవాదియు, పురుషార్థియు, జితేంద్రియుడును, తాను దేని వన సుఖమును పొందెనో దానిని ఇతరుకు చెప్పవలెనను కోరికతో ప్రేరితుడై తనకు తెలిసినట్లు సమస్త మనుష్యు కల్యాణార్థము (మేుకొరకు) బోధించువాడును, పృథివి మొదుకొని పరమేశ్వరుని పర్యంతమువరకు గ పదార్థము జ్ఞానముకలిగినవాడును అగు ఉపదేష్ట ఆప్తుడు. ఇట్టి పురుషుని ఉపదేశము మరియు పూర్ణాప్తుడగు పరమేశ్వరుని యుపదేశమగు వేదమును శబ్దప్రమాణమంటారు.
ప్రమా అనగా జ్ఞానము. ప్రమాకరణం ప్రమాణం. ఏ సాధనము ద్వారా వస్తువు యొక్క జ్ఞానము కుగుతుందో దానిని ప్రమాణమంటారు. ఈ విధమగు పరీక్షచే మనుష్యుడు సత్యాసత్యమును నిర్ణయించవలెను. ఇంకొక మార్గము లేదు.
క్షణప్రమాణాభ్యాం వస్తుసిద్ధిః ।
తాను నిరూపింపజేయు వస్తువునకు ప్రమాణమును, క్షణమును తొపవలెను. లేనిచో దానిని ఇతయి అంగీకరించనవసరము లేదు. ప్రమాణమును గూర్చి పైన చెప్పబడినది.
అసాథారణో ధర్మః క్షణమ్‌ ।
ఇతర వస్తువులో లేకుండ కేవమావస్తువులోనే గ గుణమును క్షణమంటారు. ఆ క్షణము అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవము అను దోషము లేకుండా యుండవలెను.
అతివ్యాప్తి : చెప్పిన క్షణము సిద్ధింపజేయు వస్తువుతో పాటు ఇతర వస్తువులో ఉండుట. ఉదా: ఆవుకు క్షణము నాుగు కాళ్లుండుననుట. నాుగు కాళ్లు ఆవుతోపాటు కుక్క, గుఱ్ఱము మొదగు ఇతర జంతువులో కనిపించుటచే ఈ క్షణమును అతివ్యాప్తి అంటారు.
అవ్యాప్తి : చెప్పిన క్షణము సిద్ధింపజేయుదానిలో కాకుండ ఇతర వస్తువులో ఉండుట. ఉదా: గుఱ్ఱమునకు క్షణము కాలిగిట్టు చీలియుండుననుట. ఈ క్షణము గుఱ్ఱములో కాకుండ ఆవు మొదగు ఇతర జంతువులో నుండుటచే దీనిని అవ్యాప్తి అంటారు.
అసంభవము : ఆకాశ కుసుమము, గొడ్రాలి సంతానము, కుందేటి కొమ్ము మొదగునవి.
ఆవుకు క్షణము గంగడోు.
ప్రమేయము (తెలిసికొనదగినవి) :
ప్రమాణము ద్వారా తెలిసికొనదగిన పదార్థమును ప్రమేయము అంటారు. వాటిని ఇచట సామాన్యముగ తొపుతున్నాను. వీటిని విశేషముగ తెలిసికొనుటకు న్యాయదర్శనభాష్యమును చదవవలెను.
1.     ఈ సృష్టికి కారణములైన మూతత్వము. అవి 1. పరమేశ్వరుడు 2. జీవు 3. ప్రకృతి.
2.     ఆత్మశరీరేన్ద్ర్రియార్థబుద్ధిమనఃప్రవృత్తిదోషప్రేత్యభావఫదుఃఖాపవర్గాస్తు ప్రమేయమ్‌ (న్యా.ద. 1-1-9)
1. జీవాత్మ, పరమాత్మ 2. శరీరము, 3. జ్ఞానేంద్రియము, కర్మేంద్రియము 4. అర్థము - భూతము గుణము 5. బుద్ధి, 6. మనస్సు, 7. ప్రవృత్తి, 8. దోషము 9. ప్రేత్యభావము - పునర్జన్మ, 10. ఫము, 11. దుఃఖము, 12. అపవర్గము - మోక్షము అనునవి ప్రమేయము.


వేదాది ఆర్షగ్రంథములు


వేదము స్వతః ప్రమాణము. అనగా వేదములో చెప్పబడిన విషయము ప్రామాణికతను గూర్చి ఆలోచించుటకు ఇతర ప్రమాణముతో పనిలేదు. యథా ప్రదీపవత్‌, అనగా మనము సూర్యుని చూచుటకు వేరే ప్రకాశమక్కరలేదు. సూర్యుని ప్రకాశమే సూర్యుని చూచుటకు ఉపయోగపడును. అంతేకాదు. ఆ ప్రకాశము వననే ఇతర వస్తువును చూడగము. వేదము కూడ ఇదేవిధముగ స్వతః ప్రమాణమై ఇతర గ్రంథము ప్రామాణికతను నిర్ణయిస్తుంది.
విద జ్ఞానే అను ధాతువునుండి వేదశబ్దమేర్పడును. వేదమనగా జ్ఞానమని అర్థము. మానవుకు ఆ జ్ఞానము సృష్ట్యాదిలోనే భించవలెను. కారణమేమన -
ఇప్పుడు ప్రపంచములోని కొన్ని దేశాు వైజ్ఞానికరంగములో ఎంతో ప్రగతిని సాధించాయి. ఈ దేశాలోని అడవులో నివసించువారు ఈనాటికి అజ్ఞానుగానే ఉన్నారు. మనము పాఠశాలో, కళాశాలో విద్యాభ్యాసము చేసిన తరువాతనే విద్యావంతుము, జ్ఞానుము అగుచున్నాము. ఇప్పుడు జన్మించిన బాురను ఏకాంత ప్రదేశములోనో, మూర్ఖుసాంగత్యములోనో ఉంచినచో వారు పెరిగి మూర్ఖులే అగుదురు. సృష్టి ఆదిలో భగవంతుడు వేదవిద్యను మానవుకు ఇవ్వనిచో, వారు ఆ విద్యను ఇతరుకు నేర్పకపోయినచో మనము అజ్ఞానుగానే ఉండెడివారము. ఆర్యావర్తమునుండి విద్వాంసు ఈజిప్టు, గ్రీసు, యూరోపు మొదగు దేశాలోని ప్రజకు విద్యనేర్పక పూర్వము అక్కడివారు విద్యావిహీనులై ఉండిరి. యూరోపు నుండి కొంబసు మొదగువారు అమెరికాకు వెళ్ళకపూర్వము అక్కడివారు అజ్ఞానుగానే ఉండిరి. ఆఫ్రికాలోని నీగ్రోు అమెరికాతో సంబంధము కలిగిన తరువాతనే విద్యావంతులైనారు. దీనివన మనుష్యుడు నైమిత్తిక జ్ఞానము లేకుండా విద్యావంతుడు జ్ఞానవంతుడు కాలేడు. జ్ఞానోన్నతిని పొందడు అని నిర్థారణ యగుచున్నది. కన్నుకు సూర్యుని ప్రకాశమునకు సంబంధము ఉన్నది. ఈ రెంటిలో ఏ ఒకటి లేకపోయినను రెండవది నిరర్ధకము. అటునే బుద్ధికి జ్ఞానమునకు సంబంధము ఉన్నది. జ్ఞానములేనిచో బుద్ధి నిరర్థకము. అందుకే మానవుని బుద్ధియొక్క సార్థకత కొరకు జ్ఞానము - వేదము అవసరము.
సృష్టి ఆదిలో సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు మానవుకు అవసరమైన నైమిత్తిక జ్ఞానమును వేదముద్వారా అగ్ని, వాయువు, ఆదిత్యుడు, అంగిరా అను యోగ్యులైన నుగురు ఋషు మస్తిష్కములో ప్రకాశింపజేసినాడు. వారి ద్వారా వేదము లోకమున ప్రచారము గావింపబడినది. అందుకే భగవంతుడు ఆదిగురువు.
స పూర్వేషామపి గురుఃకాలేనానవచ్ఛేదాత్‌. (యోగదర్శనము 1-26).
కాముచే ఛేదింపబడనివాడు - త్రికాములో నుండువాడు అయిన పరమేశ్వరుడు సృష్టి ఆదిలోనున్న మన పూర్వుకు గురువు.
వేదము ఈశ్వరీయ జ్ఞానమని ఆర్షసాహిత్యము స్పష్టముగ తెలియజేయుచున్నది. అలాగే మహమ్మదీయు కురాన్‌ షరీఫ్‌ను క్రైస్తవు బైబిల్‌ను ఈశ్వరీయ జ్ఞానమని ప్రచారము చేయుచున్నారు. శ్రోతకు నిజముగా ఈశ్వరీయ జ్ఞానమేది? అను సందేహము కుగును. అందుచే ఈశ్వరీయ జ్ఞానమేదియో నిర్ణయించవయును. లేనిచో మానవు సందేహమునకు గురిjైు సత్యమును తెలిసికొనక అసత్యమార్గము ననుసరించి దుఃఖము ననుభవింతురు. జీవిత క్ష్యమును పొందరు. ఈశ్వరీయజ్ఞానమును నిర్ణయించుటకు ఈ క్రింది హేతువు ఉపయోగపడును.
1.    ఈశ్వరీయజ్ఞానము సృష్టికి ఆరంభమున ప్రకాశింపజేయబడవలెను. లేకున్న ఈశ్వరుడు పక్షపాతి యగును.
2.    ఈశ్వరీయజ్ఞానము ఒకానొక దేశమునకు సంబంధించిన భాషలో ప్రసాదింపబడరాదు.
3.    ఈశ్వరీయజ్ఞానము సృష్టినియమముకు విరుద్ధముగ ఉండకూడదు.
4.    ఈశ్వరీయజ్ఞానమునందు సమస్త సత్యవిద్య మూసిద్ధాంతము ఉండవలెను.
ఈ హేతువుకు బైబిల్‌, కురాన్‌ు నిువలేవు. వేదములే ఈశ్వరీయముని నిర్థారణ యగును. ఈశ్వరుని రచను రెండు.
1.     దృశ్యకావ్యము - జగత్తు. 2. శబ్దకావ్యము - వేదము. ఈ రెండిరటియందు సమన్వయము కదు. అందుకే వేదము స్వతః ప్రమాణము.
ఋషు యోగమువన సమాధిస్థులై వేదమంత్రమును సాక్షాత్కారము చేసికొని - యథార్థముగ తెలిసికొని ఇతర గ్రంథమును - శాస్త్రమును ఉపదేశించినారు. అందుకే అవి పరతః ప్రమాణము. అనగా వాటిలో వేదానుకూమైనదే గ్రాహ్యము.
స్వతఃప్రమాణము :-
ఋషిణా ద్రష్టమార్షమ్‌. ఋషుచే దర్శించబడినవి ఆర్షము. అవి మూ వేదసంహితు.
1. వేదము - సంహితు (నాుగు) :
1. ఋగ్వేదము, 2. యజుర్వేదము, 3. సామవేదము, 4. అథర్వవేదము.
పరతః ప్రమాణము :-
ఋషిణా ప్రోక్తమార్షమ్‌. ఋషుచే ఉపదేశింపబడినవి. ఇవి వేద ప్రామాణ్యము నంగీకరించునవి.
2. వేదాంగము (ఆరు) :
1. శిక్షా    -    పాణిని మహర్షి ‘వర్ణోచ్ఛారణశిక్షా’.
2. క్పము    -    శ్రౌతసూత్రము (యజ్ఞసంబంధమైనవి), గృహ్యసూత్రము (సంస్కారముకు సంబంధించినవి), ధర్మ సూత్రము (వర్ణాశ్రమ వ్యవస్థననుసరించి మానవుని కర్తవ్యమును బోధించునవి).
3. వ్యాకరణము    -    పాణినిమహర్షికృత అష్టాధ్యాయీ సూత్రపాఠము, ధాతుపాఠము, ఉణాది కోశము, గణపాఠము, లింగాను శాసనము. వీటిని ఉపదేశముని అంటారు.
4.  నిరుక్తము    -    యాస్కమునికృత నిఘంటువు, నిరుక్తము.
5.  ఛన్దస్సు    -    పింగళాచార్యముని కృతము.
6.  జ్యోతిషము    -    వశిష్టఋషికృతము. దీనియందు అంక గణితము, బీజగణితము, రేఖా గణితము, భూగోళము, భూగర్భము, ఖగోళవిషయము గవు.
జ్యోతిః అనగా ప్రకాశవంతమైన పదార్థము. వాటికి సంబంధించినది జ్యోతిషము. గ్రహము (సౌరకుటుంబము) నక్షత్రము యొక్క స్థితిగతును తొపును. స్థితివన కాజ్ఞానము, గతివన ఋతు జ్ఞానము కుగును.
మానవ శరీరమునకు గ అంగముతో వేదమునకు వేదాంగమును అంకారికముగా పోల్చి ఇట్లు చెప్పినారు.
1.     చన్దః పాదౌతు వేదస్య హస్తో కల్పో-థ పఠ్యతే ।
    జ్యోతిషాం అయనం చక్షుః నిరుక్తం శ్రోత్రముచ్యతే ॥
2.     శిక్షా ఘ్రాణం తు వేదస్య ముఖం వ్యాకరణం స్మృతమ్‌ ।
    తస్మాత్సాంగమధీత్యైవ బ్రహ్మలోకే మహీయతే ॥
ఛందస్సు    -        పాదము
క్పము    -        చేతు
జ్యోతిషము    -        కన్ను
నిరుక్తము    -        చెవు
శిక్షా    -        ముక్కు
వ్యాకరణము    -        ముఖము
వేదమును వేదాంగము యుక్తముగ చదువుకొన్నవాడు విద్వాంసులో పూజనీయుడగును.
మనుష్యుడు తన అభిప్రాయమును-భావమును ముఖము ద్వారా ఇతరుకు తెలియజేస్తాడు. అదేవిధముగ వేదముయొక్క అభిప్రాయమును-అర్థమును స్పష్టము చేయునది వ్యాకరణము. అందుకే  వ్యాకరణము ముఖముతో ప్చోబడినది. వ్యాకరణమును సంపూర్ణముగా అధ్యయనము చేయని వ్యక్తికి వేదము బోధపడదు. వేదాంగము ఉద్దేశ్యము వేదమంత్రమును సరిగా అర్థము చేయుటయే.
3. ఉపాంగము (ఆరు)
వీటిని దర్శనము లేక శాస్త్రము అని కూడ అంటారు.
1. న్యాయ దర్శనము        -    గౌతమఋషి కృతము
                వాత్సాయన భాష్యము
2. వైశేషిక దర్శనము        -    కణాదఋషి కృతము
                ప్రశస్తపాద భాష్యము
3. సాంఖ్యదర్శనము         -     కపిఋషి కృతము
                బాగురుముని భాష్యము (అభ్యము)
                విజ్ఞాన భిక్షు భాష్యము (భ్యము)
4. యోగ దర్శనము         -     పతంజలిఋషి కృతము
                వ్యాసభాష్యము
5.     మీమాంసా దర్శనము     -     జైమినిఋషి కృతము
                వ్యాసభాష్యము (అభ్యము)
                శాభరభాష్యము (భ్యము)
6.     వేదాంత దర్శనము     -     వ్యాసమహర్షి కృతము
                బౌధాయనవృత్తి (అభ్యము)
                శాంకరభాష్యము (భ్యము)
సాంఖ్య, మీమాంస, వేదాంతదర్శనముకు సంబంధించిన ప్రస్తుతము భించు భాష్యములో సూత్రకారు అభిప్రాయమునకు భిన్నమైన భాష్యకారు అభిప్రాయము అప్రామాణికమని తెలియవలెను.
4.     ఉపవేదము (నాుగు)
1. ఆయుర్వేదము    -    చరకము, శుశ్రుతము, ధన్వంతరికృత నిఘంటువు.
2. ధనుర్వేదము    -    శస్త్రాస్త్ర సంబంధమగు రాజవిద్య. అంగిరసుడు, భరద్వాజుడు వ్రాసినవి పూర్వముండెడివి. ఇప్పుడు ుప్తము.
3. గాంధర్వవేదము    -    గానవిద్య, సామగానము, నారద సంహిత.
4. అర్థవేదము    -    శ్పివిద్య (జుఅస్త్రఱఅవవతీఱఅస్త్ర డ ్‌వషష్ట్రఅశీశ్రీశీస్త్రవ), విశ్వకర్మ, త్వష్ట, దేవజ్ఞుడు మయుడు వ్రాసిన సంహితు. (భరద్వాజుని విమానశాస్త్రము కొంతకాము క్రితము భించినది. ఇది ‘యంత్ర సర్వస్వము’ అను గ్రంథములో ఒక భాగము).
5.     బ్రాహ్మణ గ్రంథము (నాుగు)
వేదమునకు బ్రహ్మ అని కూడ పేరు. బ్రహ్మయొక్క వ్యాఖ్యానము బ్రాహ్మణము. వీటిలో అనేక విషయముతో పాటు యాజ్ఞిక ప్రక్రియకు ప్రాధాన్యత కదు.
1. ఐతరేయము, 2. శతపథము, 3. సామవిధానము - తాండ్యబ్రాహ్మణము, 4. గోపథము.
6.     ఉపనిషత్తు (పదకొండు)
వీటిలో అధ్యాత్మ (పరమాత్మ, జీవాత్మ, శరీరము) విద్య ఉన్నది. సాధారణముగ బ్రహ్మవిద్య అని అంటారు. ఉపనిషత్తు అను పేరుతో 108 గ్రంథము ఉన్నాయి. వాటిలో అల్లా - ఉపనిషత్తు కూడ ఒకటి. వాటన్నింటిలో ఈ క్రింది 11 మాత్రమే వేదానుకూముగ నున్నవని శిష్టు - విద్వాంసు అభిప్రాయము.
1. ఈశ, 2. కేన, 3. కఠ, 4. ప్రశ్న, 5. ముండక, 6. మాండూక్య, 7. ఐతరేయ, 8. తైత్తిరీయ, 9. ఛాందోగ్య, 10. బృహదారణ్యక, 11. శ్వేతాశ్వతర.
వీటిలో మొదటిదిjైున ఈశోపనిషత్తు యజుర్వేదము యొక్క చివరి (40వ) అధ్యాయము. తక్కినవి ఋషి ప్రోక్తము.
7. వేదశాఖు - 1127
8. ఇతిహాస గ్రంథము
వాల్మీకిరామాయణము, మహాభారతము. వీటిలో చాలా ప్రక్షిప్తము - ఇతరుచే చేర్చబడినవి ఉన్నవి. ఆ విషయము అప్రామాణ్యము.
9. స్మృతు
మనుస్మృతి, యాజ్ఞవ్క్య స్మృతి, పారాశరస్మృతి మొదగునవి. వీటన్నింటిలో మనుస్మృతి ప్రక్షిప్తమును వదలి, ప్రామాణికముగ గ్రహించబడును.
    చతుర్దశ విద్యు
    వేదము, బ్రాహ్మణ గ్రంథము.
    ఉపనిషత్తుతో కలిసి                -    4
    ఉపవేదము                    -    4
    వేదాంగము ఉపాంగము యుక్తముగా        -    6
    మొత్తము                        -    14
  బ్రాహ్మణానీతిహాసాన్‌ పురాణాని కల్పాన్‌ గాథా నారశంసీరితి. (అశ్వలాయన గృహ్యసూత్రము)
శతపథాది బ్రాహ్మణ గ్రంథముకే ఇతిహాసము, పురాణము క్పము, గాథా నారశంసీ అని పేర్లు. ప్రాచీన సాహిత్యమున పురాణమను శబ్దము బ్రాహ్మణగ్రంథముకే వర్తించును. నవీనములైన అష్టాదశ పురాణముకు కాదు.
ఆర్ష గ్రంథముకు అనార్ష గ్రంథముకు (ఋషు కానివారివి) చాలా భేదమున్నది. ఆర్ష సాహిత్యము తేలికగా ఉండి తక్కువ శ్రమతో ఎక్కువ లాభమును పొందగము. అనార్ష సాహిత్యము కఠినము. ఎక్కువ శ్రమతో తక్కువ లాభమును పొందుదుము. ఆర్షసాహిత్యపఠనము సముద్రమునందు మునిగి అమ్యూములైన ముత్యమును పొందునట్టిది. అనార్షసాహిత్య పఠనము పర్వతమును పగుగొట్టి గవ్వంత లాభమును పొందునట్టిది. ఇందుకొక ఉదాహరణ. గౌతమమహర్షి. న్యాయదర్శనమున ప్రతిజ్ఞా అనునది తొపుటకు ఈ సూత్రము రచించినాడు.
సాధ్యనిర్దేశః ప్రతిజ్ఞా । (న్యా.ద. 1-1-3)
గంగేషోపాధ్యాయుడను పండితుడు తత్వచింతామణి అను నవ్యన్యాయదర్శనమున అదే ప్రతిజ్ఞా అనునది తొపుటకు రచించిన వాక్యమిది. ‘‘సాధ్యతావచ్ఛేదకావచ్ఛిన్న సాధ్యప్రకారకః, పక్షతావచ్ఛేదకావచ్ఛిన్న పక్ష విశేషకః బోధజనకః శబ్దః ప్రతిజ్ఞా’’ దీనివన ఆర్ష సాహత్యమునకు అనార్ష సాహిత్యమునకు గ భేదము తెలిసికొనవచ్చును.

ఆర్ష గ్రంథములే శాస్త్రములు మనకి


శాసు అనుశిష్టౌ అను ధాతువునకు ‘ష్ట్రన్‌’ ప్రత్యయము చేర్చిన ‘శాస్త్రమ్‌’ అను శబ్దమేర్పడును. శాస్త్రమనగా 
1. శిష్యతే అనేన ఇతి శాస్త్రమ్‌. ఆజ్ఞాపించునది, విధినిషేధమును బోధించు గ్రంథము.
2. శాసనాత్‌ శంసనాత్‌ ఇతి శాస్త్రమ్‌. శాసించునది శాస్త్రము.
3. ప్రవృత్తిర్వా నివృత్తిర్వా నిత్యేన కృతకేన వా ।
  పుంసాం యేనోపదిశ్యేత తచ్ఛాస్త్రమభిధీయతే ॥
శ్రేష్ఠమైన కర్మలో ప్రవర్తింపజేయుదానిని, దుష్కర్మ నుండి దూరము చేయుదానిని నిత్య, అనిత్య పదార్థమును (నిత్య పదార్థము R కారణ పదార్థముÑ అనిత్య పదార్థము R కార్య పదార్థము) ఉపదేశించువానిని శాస్త్రమ్‌ అని అంటారు.
4. శాస్త్రప్రయోజనం తత్త్వదర్శనం (చాణక్య సూత్రము)
శాస్త్రము యొక్క ముఖ్యోద్దేశ్యము తత్త్వ పదార్థము (తత్త్వ పదార్థము R కారణ పదార్థము, మూపదార్థము) జ్ఞానము కలిగించుట. ఈ క్షణము వేదాది ఆర్ష గ్రంథములోనే కనిపిస్తాయి. కావున అవియే శాస్త్రపదవాచ్యము.
న వేదశాస్త్రాదన్యత్తు కిఞ్చిచ్ఛాస్త్రం హి విద్యతే ।
నిఃసృతం సర్వశాస్త్రం తు వేదశాస్త్రాత్‌ సనాతనాత్‌ ॥
                (యాజ్ఞవ్క్యస్మృతి 12-1)
వేదశాస్త్రముకు భిన్నమైనదింకొక శాస్త్రము లేదు. సమస్తశాస్త్రము సనాతనవేదము నుండియే ఆవిర్భవించినవి.