మొత్తం పేజీ వీక్షణలు

3, ఆగస్టు 2026, సోమవారం

సాహిత్య విద్యార్థులందరికీ గురువు కపిలవాయి...

నేను పాలెం ప్రాచ్యకళాశాలలో 1965-66 , 1966-67 విద్యా సంవత్సరంలో డిప్లమా ఓ.ఎల్.చదివాను. శ్రీ కపిలవాయి లింగమÖర్తి ప్రాచ్యకళాశాలలో ఉపన్యాసకులు. నా చదువు ఆ రెండుసంవత్సరాలే. ఆ తర్వాతవారు ఉపన్యాసకులుగా వచ్చారు. నేను అప్పటికే మాడ్గుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగుపండిట్‌గా చేరాను. అయినా వారు నాకు గురుతుల్యులు. 

నేను 1973 నుండి 1985 మధ్యకాలంలో కామారెడ్డి డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాపకుడిగా పనిచేశాను. 1975-82 మధ్యకాలంతో నేను తెలుగు పొడుపు కథŠలపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తెలుగుశాఖలో ఆచార్య సి. నారాయణరెడ్డి గారి పర్యవేక్షణలో పిహెచ్.డి.చేశాను. 

ఆ సందర్భంలో రెండు పర్యాయాలు నాగర్‌కర్నూలులో గురువుగారిని కలిశాను. నా పరిశోధన విషయం చెప్పాను. ఆ సందర్భంలో వారు నా సందేహాలు తీర్చారు. అంతేగాక తమ దగ్గర ఎప్పటి నుండో దాచుకొని ఉన్న అచ్చుకాని కొన్ని పొడుపు పద్యాలిచ్చారు. అవి ‘పాపిశెట్టి సీతారామకవి’ వ్రాసినవి. వాటికి కొంత వ్యాఖ్యానం చేర్చి, మరికొన్ని పొడుపు పద్యాలు చేర్చి నేను ‘తెలుగు పొడుపు పద్యములు’ అనే చిన్న గ్రంథం ప్రచురించాను. గురువుగారు చేసిన సహాయాన్ని, ఇచ్చిన పద్యాలను వాటి ఆ పరమార్థాల్ని వివరించాను. పైగా నా పరిశోధనలో అవి యెలా ఉపయోగపడ్డాయో పేర్కొన్నాను. నాకు అర్ధం తెలియని కొన్ని పాదపుపద్యాలకు వారు తెలిపిన విధానాన్ని కూడా తెలిపి గురువు కపిలవాయి లింగమÖర్తికి నమస్కరించి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలుపుకొన్నాను. ఆ తర్వాత కూడా వారిని అనేక పర్యాయాలు కలిశాను. వారి సాహిత్యంపై అక్కడక్కడ ప్రసంగించాను. 

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో నేనున్నప్పుడు వారి శతక సాహిత్యంపై శ్రీ అల్పూరి అనంతరాములు, ‘కపిలవాయి లింగమÖర్తి శతకాలు ఒక పరిశీలన’ అనే అంశంపై ఎంఫిల్ నా పర్యవేక్షణలో పూర్తిచేశారు. ఆ విధంగా గురువుగారి ఋణం తీర్చుకొనే అవకాశం నాకు చిక్కింది. వారు విశ్వబ్రహ్మ. వారు పాలమÖరుకే కాదు, తెలుగు సాహిత్యానికే గురువు. పాలమÖరు విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న ఎం.వి.ఎస్. ఆర్ట్స్‌కళాశాల తెలుగుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కపిలవాయి సాహిత్యసమాలోచన సదస్సు’ లో విశిష్ఠాతిధిగా పాల్గొంటూ ఇలా స్మరించుకొంటున్నాను.

కపిలవాయి గారి వ్యక్తిత్వం- మÖర్తిమత్వం

శతాధిక గ్రంథకర్త, అపూర్వ గ్రంథ పరిష్కర్త, ఉత్తమోత్తమ గురువులైన లింగమÖర్తిని ప్రస్తుతిస్తూ వారి శిష్యుడు రుక్మాంగద రెడ్డి వ్రాసిన ఈ పద్యం వారి వ్యక్తిత్యమÖర్తిమత్వాలకు దర్పణంగా నిలుస్తుంది. 

సీ. మనిషిలో నిద్రాణమై యున్న జ్ఞానమ్ము 

మేల్కొల్పగలవాడు మేటి గురువు

కుల మతమ్ముల కూలగొట్టి అభ్యుదయమ్మ 

సాధించుమను వాడు బోధ గురువు

చదువుట సంపద సమమార్చుటకు గాదు

సేవకైయనును విశిష్ట గురువు

మణికిరీటము ధరించిన గర్వమబ్బును 

తలవంచుకొనుమను తత్త్వ గురువు 

ఆ.వె. వెలుగు నిచ్చువాడు తెలివినిచ్చెడివాడు 

అఖిల జనులు సమములనెడు వాడు

మణులుకాదు మట్టి మనకు జీవన మంచు 

బోధ పరిచె లింగమÖర్తి గురుడు

(ఉన్నోళ్లు - పోయినోళ్లు, పుట:32) 

నిజమే! వారు మేటి గురువు, బోధగురువు, విశిష్టగురువు, తత్త్వగురువు, మట్టినే మహత్రనకంగా నమ్మిన మహాగురువు. ఆ గురువుగారికి రుక్మాంగదుని వంటి శిష్యులెందరో ఉన్నారు. 

యోగివేమన బోధను నమ్మినవారి శిష్యులు. 

ఆ.వె. గురువు శిక్షలేక గురుతెట్టు కలుగురా ! 

అజునికైన వాని యబ్బకైన

తాళపు చెవివేక తలుపెట్టులూడరా !

విశ్వదాభిరామ! వినురవేమ! 

అవును! మనకు జ్ఞానం గురువే ప్రసాదిస్తారు. ఈ శరీరం తలిదండ్రు లిచ్చేది. కాని జ్ఞానశరీరం గురువు ద్వారానే లభిస్తుంది. అలాంటి పరమోత్తమ గురువు ‘గురునాం గురువు’ లింగమÖర్తి. 

అంత గొప్ప గురువు సామాన్యునిలో సామాన్యునిగా కనిపించేవారు. వస్త్రధారణలో అతిసాధారణ పండితులుగా ఉన్నా ప్రతిభాపాండిత్యంలో మాత్రం సమున్నత స్థానంలో ఉన్నవారు. లింగమÖర్తిగా కనిపించిన రంగమÖర్తిగా భాషించే హరిహరాద్వైతి వారు. గ్రంథపరిష్కర్తగా ఉభయ రాష్ట్ర పరిష్కర్తల్లో ప్రప్రథమ స్థానంలో నిలిచే శోధకులు. 

ఆయన కూచున్నా, నిలుచున్నా, నడిచినా ఆయన్ను కదిలిస్తే ఓ విజ్ఞాన సర్వస్వంగా కనిపించేవారు. సృజనాత్మక సాహిత్యంలో పద్య, గద్య, వచన, గేయ ప్రక్రియల్లోనూ నిలిచిన సాహిత్య స్రష్ట. అపూర్వలిఖిత ప్రతులసేకర్త. తాళపత్ర గ్రంథాల సమీకర్త. ఒక విధంగా వారు పరిశోధకుల పాలిటి కల్పవృక్షం. 

గ్రంధ గ్రంథులు తెలియని వారికి వివరించి చెప్పిన మహామేధావి.  గ్రామనామాల పరిశోధనలో ఎందరికో మార్గదర్శకులు. భాషా, వ్యాకరణ,  అలంకార, ఛందోలక్షణాది సాహిత్యశాస్త్ర నిష్ణాతులు. వీటన్నిటితోపాటు వారు చారిత్రిక శాస్త్రవేత్త, జానపద విజ్ఞానశాస్త్రవేత్త కూడా. సాహిత్య పద్య, గద్య సంకలనకర్త. దేవాలయ ఆగమ శాస్త్రవేత్త. రాజయోగ, అచలయోగ, కర్మ, జ్ఞాన, భక్తి, ధ్యాన యోగాది తాత్త్విక రహస్యాలు తెలిసిన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ‘కృషితో నాస్తి దుర్భిక్షమ’ అని నమ్మిన సాధకులు వారు. మొత్తమ్మీద చెప్పాలంటే నిరంతర సాహితీక్షేత్ర కృషీవలుడు.

సాహిత్యం ద్వారా జీవనవికాసం 

వ్యక్తి - కుటుంబం - సమాజం - ప్రాంతం - దేశం- విశ్వం ఇవన్నీ (వ్యక్తులు - సంస్థలు) అన్నీ సాహిత్యం ద్వారానే వికసిస్తాయని నమ్మి అనేక రచనలు చేశారు లింగమÖర్తి. తిరుమలేశ శతకంలోని ఈ పద్యం చూడండి. 

సీ. గీత బోధించెడు రీతిగా నడవక 

హిందువు నేనన్న కందు గాదె

పిటకముల్ బోధించు విధులు పాటించక

బౌద్ధుడనని యన్న పాటియగునె

అల కురాను వచించు నట్టుల నడవక 

మహమదీయుడనన్న మాయగాదె

బైబిలు జెప్పెడి పద్ధతి విడిచియు

క్రైస్తవుండనటన్న కల్లగాదె 

గీ. మతము మనుజుని హితమునే కుతుక పడెను 

గాని sTÖనాడు దానిని గాంతురెవరు?

భక్తజన పోష ! తెలరాలపల్లి వాస!

దితిజవిద్వేష ! బధతోష! తిరుమలేశ! (6.ప) 

హిందూ బౌద్ధ - ఇస్లాం - క్రైస్తవమతాల వారు వారివారి మతగ్రంధాలు బోధించే నీతి-నియమాలను పాటిస్తే మంచిదని వారి అభిప్రాయం. 

మనిషి పశువు నుండి ఎదిగి పశుపతి స్థానానికి చేరుకోవడమే వికాసం. కాని తనచుట్టూ ఉన్న జంతువుల్లాగానే ఉంటే ఎలా? చూడండి ! ఎన్ని జంతువుల గుణశీలాలు మనిషికున్నాయో! 

సీ. నక్కవినయంబులు, కుక్క పంచాయితి 

పిల్లి శీలంబును, పీతÁనడక 

కోతి యల్లరి, మేకపోతు గంభీరము

గాడిద గత్తర, కోడె పొగరు

మర్నాగి బుద్ధులు, మకరపు పట్టును

నల్లికుట్లూసరవిల్లి రంగు

మీను మిడిసిపాటు, మిడుతాట మరియును

కొంగజపంబును, గొఱ్ఱెదాటు 

గీ. మాననందకు జంతువే మానవుండు

నాగరిక మెంత పెరిగిన నాటకంబె 

భక్తజనపోష! తెలరాల పల్లివాస!

దివిజవిద్వేష ! బుధతోష! తిరుమలేశ! (8.ప)

నక్క, కుక్క, పిల్లి, పీతÁ, కోతి, మేక, గాడిద, కోడె, మర్నాగి, మకరం, నల్లి, ఊసరవిల్లి, మీను, మిడుత, కొంగ, గొఱ్ఱె... వీటిగుణాలన్నీ మనిషిలో ఉన్నాయి. ఇవి మాని మనిషి మాధవుడు కావాలన్నదే వారి సందేశం. 

ఇలా వారి ప్రతి గ్రంథం సామాన్యులకూ, సాహిత్యాధ్యయనశీలురకూ మాs్గÁ దర్శనం చేస్తుంది. వ్యక్తి శ్రేయస్సు నుండి విశ్వశ్రేయస్సు వైపుగా పయనింపజేస్తుంది.

(అంతర్జాతీయ సదస్సు ప్రారంభంలో ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డిగారి సందేశము)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి