పది సంవత్సరాల క్రిందట మల్లాది రామకృష్ణ శాస్త్రిగారెవరో నాకు తెలియదు. తెలుగుభాషలో నా ప్రవేశం అంతమాత్రం. అయిదు సంవత్సరాల ముందు వారితో ముఖ పరిచయం కూడా లేదు. పెద్దల సాంగత్యానికి అంత అలవాటు పడిన వాడిని మరి. నాలుగేళ్ల క్రితమే వారి పరిచయం కలిగింది. తన ప్రభావం నాపై ప్రసరించింది. అదే నా పాలిట దివ్యమైన వరమై జటిలమైనవీ, క్లిష్టమైనవీ అని వదిలివేసిన ఉత్కృష్ట మార్గాలలో నన్ను పయనింపజేసి, నాకందని పండనుకున్న వాటిని అందించింది. అంతకు ముందు గొంతెమ్మ కోరికలనిపించే గగన కుసుమాలు భగీరథŠ ప్రయత్నంతో సాధ్యములని తెలియ జెప్పినది. నా తాహతు యెమిటో నా అర్హత యేమిటో నా పరిధి యెంతవరకు యే విధంగా యెందుకని విస్తృతం చేసుకోవాలో బోధపరచినది.
ఈనాటి ప్రపంచంలో మానవునికి దేవుడివ్వ గలిగిన వరాలెన్నో లేవు. సదాచార సంపన్నులైన తల్లిదండ్రులు, ముక్తిదాయకుడైన గురువు, అనుగతపతి అనురాగవతియైన సŸతి, సత్సంతానము, యివి నాలుగు. వీటి ఫలితం ఐహికం కాకపోయినా ప్రభావం ప్రతిబింబించేది లౌకిక జీవనం మీదనే. మరొక్క వరం వున్నది. అది సాహిత్య కృషిని ప్రోత్సహించి కావ్యకుతూహలాన్ని పెంపొందించి సన్మార్గాన రచనా వ్యాసంగాన్ని నడిపించగల గురువు.
సదాచార సంపన్నులైన తల్లిదండ్రులు లేకపోతే తక్కిన సన్మీమాంసలంటే మనసు ఆరాట పడుట అరుదు. ఆరాటమే లేనప్ప్పుడు ఆ లేమి బాధించదు. సన్మార్గుల కడుపున పుట్టడానికి పూర్వజన్మ సుకృతం వుండాలి అలా వున్నవారికి సద్గురువు, ముక్తి ప్రయత్నాలలో చేదోడు వాదోడుగా వుండటానికి, లభించక మానడు. ఇవి రెండూ వుంటే, sTÖ కలిమిలో అనుపమ గుణాంబుధియైన భార్య లేకున్నా, కీర్తిదాయకులైన సంతానము లేకున్నా, అది ఒక బాధగా తోచదు. కాని మొదటి రెండు వరాలు పొందినవారిలో తప్పకవుండే సృజనాత్మకతమైన తపనకు ఉత్తమమైన లక్ష్యాన్ని చూపించి, దానిని పొందుటకు సక్రమమైన దారిని సూచించి అడుగడుగునా విమర్శలతో, ఆశీస్సులతో, ఆంక్షలతో ఆ ప్రవాహాన్ని సాహితీ సాగరోన్ముఖంగా పయనింపజేయగలిగిన విద్యా గురువు లేక పోతే, ఆ లేమి, ఆ కొఱత, ఆ కోత, ఆ బాధ దుర్భరమే.
మిత్రులు బాపు, రమణ పరిచయమైనప్పటినుంచీ చెప్ప్పుతూనే వుండేవారు, శాస్త్రిగారి కథలు చదవమని. చెప్పగా చెప్పగా “కాముని పున్నమి”లో కొన్ని కథలు చదివాను. వాళ్లేమైనా అనుకుంటారని బాగానే వున్నాయి కాని నాకంతగా నచ్చలేదని చెప్పాను. వాళ్లిద్దరూ నిర్ఘాంత పోయి ఆ అంతస్తుకి నీ వింకా పెరగలేదని చెప్పటానికి నోరురాక మాటాడక ఊరుకున్నారు. అప్పటికి నేనింకా రామకృష్ణశాస్త్రిగారిని కలుసుకొనలేదు.
మొదటిసారి వారిని చూచినది “కలిమిలేములు” చిత్రానికి వారు వ్రాసిన ‘కొమ్మలమీద కోతి కొమ్మచ్చు లాడింది తెల్లా తెల్లని బుల్లి యెండా’ అనే ఎండమీదనే వెన్నెల వంటి కవిత్వం రికార్డింగ్ జరుగుతున్నపుడు. రచన ఎంత మధురంగా వుందీ అనుకున్నాను. తాంబూల చర్వణం చేస్తూ పచ్చకర్పూరపు ఘుమాయింపుతో ముందు కూర్చున్న శాస్త్రిగారిని చూచి సౌమ్యులూ, సహృదయులూ అనుకున్నాను.
అప్ప్పుడే ఆంధ్రపత్రికలో సినిమా సంగీతం గురించి వ్రాయాలనే ఉద్దేశం కలగటమÖ దానికి పేరేమిటి పెట్టాలనే విషయంలో మాలో తర్జన భర్జన బయలుదేరటమÖ జరిగింది. ఏవేవో అనుకున్నాము గాని మా ముగ్గురికీ యేదీ నచ్చలేదు. శాస్త్రిగారిని అడుగుదామనే ఆలోచన కలిగింది. మేము చెప్పినవన్నీ విని “సరాగమాల” అని నామకరణం చేశారు. “మానసోల్లాసమ” “ఆనందమోహన కావ్యమాల” కూడ వారు పెట్టిన పేర్లే. అవును మరి వారి రచనోద్యానాలతో విరిసిన అసంఖ్యాక సుమాలను ఒకటో రెండో సంగ్రహించి చెండు కట్టితే వాటికి వారు పేరు పెట్టడంలో వింతేమున్నది?
“సరాగమాల”లో మొట్టమొదట వ్రాసింది వారి “కలిమిలేములు’ పాట గురించే. ఆ తరువాత యెన్నోమార్లు, వారి పాటలను పరిచయం చేస్తూ వారు వాడిన మాటలనే వాడటం, ఆ సంగతి తెలియని పాఠకులనుంచి యెన్నో ప్రశంసలను పొందటం జరిగింది. “మానసోల్లాసమ” శీర్షికలో మొదటి వ్యాసం వస్తువుకు ఆధారం వారు పెట్టిన పేరే. రేపు “ఆనంద మోహన కావ్యమాల”లో వేయబోయే మొదటిది వారు సూచించిన “జనార్దనాష్టకమే!” అప్పట్లోనే వారి పాత పాటలన్నీ మరొకమారు నెమరు వేసుకున్నాను. ఇతరుల పాటలలో వారికే చేతనైన మెత్తని పదప్రయోగాలు వుండటం గమనించాను. ‘కళలకు రాణులూ, కపురపు వీణెలూ మా నెరజాణలూ’, ‘జాణతనమునను, నాణెమునను నీసరి గడుసరి లేడురా’ (స్త్రీ సాహసం), ‘ఇవి ఆ కొమ్మ గురుతులు కాబోలు’ (జయభేరి) పాటలు వారివేనా అని తెలిసి వుండవలసిన వారిని అడిగాను. అవునన్నారు కొందరు. అబ్బే కాదు అవి సముద్రాలవీ, ఆరుద్రవీ అన్నారు మరికొందరు. చివరికి శాస్త్రిగారినే అడిగాను. ఇదమిద్ధమని తేల్చకుండా ఒక మాటని ఊరుకోమన్నారు. ఆలోచిస్తే సముద్రాల రాఘవాచార్యుల వద్ద మల్లాది కొంతకాలం వుండుటవలన ఆ ఛాయలు ఆనాటి వారి పాటలలోనూ, ఆ నాటికీ sTÖనాటికీ ఆరుద్ర శ్రీమల్లాదిని గురుతుల్యులుగా భావిస్తారు కనుక ఆ పోకడలు వీరి మాటలలోనూ కనబడటం ఒక వింతకాదు.
ఆ తరువాతి ఉగాదికే ననుకుంటాను ప్రభ, పత్రిక వార పత్రికలలో శాస్త్రిగారి ‘రాగమాలిక’, ‘ఏలేలో’ కథలు చదివాను. మొదటిమారు పూర్తిగా అర్థం కాలేదు కాని వాటిలో అజ్ఞాతంగా వున్న యేదో ఒక అందం, ఆకర్షణ మళ్లీ మళ్లీ ఆ కథలను చదివించినవి. అంతవఱకు నా కనుల కప్పిన పొరలు విడివడ్డాయి. తెలుగు అందమేమిటో తెలిసింది ఆ రోజు. అసలు తెలుగని దేన్ని అంటారో అర్థమయింది ఆ తరుణాన. అప్పటికప్ప్పుడు వారి కథలు దొరికినవన్నీ చదివాను. మళ్లీ మళ్లీ చదువుకున్నాను. ప్రతి మాటా ఒక ప్రత్యేక సౌందర్యంతో దీంచడం వారి కథల ప్రత్యేకత.
మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథలో వున్న రమ్యత వర్ణించడానికి నేనే కాదు యెవరూ చాలరు.
అ.వె. దమన వనమునందు దనరు సౌరభమును
మలయ సానువందు చెలగు గాలి
కలిసి హాయి గొలుపు గవివరు మల్లాది
రామకృష్ణు వచన రచన యందు.
అని విఫల ప్రయత్నాలు చేసిన వారెందరో వున్నారు. కాని ఘంటాపథంగా చెప్పగలిగిన విషయం ఒకటి వున్నది. తెలుగు సాహిత్యంలో శృంగార రసప్రధాన రచనలు యెన్నో వుంటాయి. దైవపరంగా చెప్పబడిన ‘గీత గోవిందం’ వంటి మహా కావ్యాలలో కూడ కొన్నిచోట్ల వుండే శృంగార వర్ణనల గురించి మన అక్కచెల్లెళ్లతో బాహటంగా తెలుగులో ముచ్చటించుకోలేము. ఈ మాత్రం కళంకమైనా లేనిది శాస్త్రిగారి శృంగార సృష్టి. ‘రాగమాలిక’నే కథలో మాధవీలతనే వయసున్న వేశ్య దేవాలయ ప్రాంగణంలో సుందరుడూ, నవయవ్వనుడూ అయిన ఒక సన్యాసిని నిలవేసి, కోరిక కన్నుల్లో మెరవగా స్వామీ పుత్రభిక్ష అని అడుగుతుంది. మరుక్షణమే, ఆ యోగి అమ్మా అని ఆమెను సంబోధిస్తాడు. ధన్యను నేను. కోరినదే కోరిక తీర్చారని మాధవీలత మోకరిల్లుతుంది. ఇంతకు మించిన పవిత్ర శృంగారం, యింతకన్న పునీతమైన భావ సంపద, యింతటి కోరిక, యింతకన్న భగవత్కాంక్షా ప్రేరకమైన సన్నివేశము sTÖ నాటి రచనలలో ఉండటం అరుదు.
ఏ సత్కార్యం తలపెట్టినా వారి ఆశీస్సు పొందిన తరువాతనే! ఒక యేడాది రాజమహల్లో కృష్ణజయంతి వేడుకలు జరపాలని అనుకున్నాము. వారం రోజులముందే ఆశీస్సులకని వారికి వ్రాశాను. ఏరోజు వచ్చినా పండగ చేసే వుత్తరం కృష్ణాష్టమి నాటి ఉదయం సరిగ్గా అందినది.
“ఆశీ:-
ఆహ్వానము అందుకున్నాను
ఆనంద కృష్ణుని లలితకళామయాశీస్సులు,-
వాని గొలిచేవారికి యెన్నటికీ పరిపూర్ణ
ఫలడాయినులే!
మీ యిలు వాసికి పండుగగా,-
మిమ్మెడబాయని వేడుకగా
ఆనంద మోహనుడు మీ కనుల కాపురమై
నూరేళ్ల పాటు మీ సేవలందని
మిమ్మనుగ్రహించేను.”
అంతటి ఆశీస్సు అందుకొన్న మా కేమి కొఱత! ఆ నాడు మాత్రం శ్రీకృష్ణుడు సంతోషంగా సగం పూజనే స్వీకరించాడు. మిగిలిన సగం మల్లాదికే అర్పితమైనది.
నాచేత అక్షరాభ్యాసం కూడా వారే చేయించారు అని చెప్ప్పుకోవడం అతిశయోక్తి అవుతుంది. కాని యిది నిజం. వారి యెదుటనే యేదో ఒక శీర్షిక ప్రారంభించనుంటే శ్రీ పంచకం వ్రాయమన్నారు. ఎలా వ్రాయాలో తెలియక ఒకదాని ప్రక్కన ఒకటి వ్రాస్తుంటే కాదు యిలా వ్రాయమని చెప్పి వ్రాయించారు.
నా చదువుకు మించినదీ, ఒకప్ప్పుడు నా ఊహకు కూడా అందనిదీ నే నెప్ప్పుడైనా తలపెడితే, అందులో లేశమైనా విజయం సాధిస్తే దీని వెనుకనున్న బలం శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు జరిపించిన sTÖ శ్రేయోక్షరాభ్యాసమే.
మరొకమారు ప్రణయ బృందావని అనే రేడియో సంగీత రూపకం ప్రసారం చేసేముందు యిలా వ్రాశారు :
మధురాధిపతే రఖిలం మధురమ్
అన్న సరసోక్తికి లలిత నిదర్శనముగా
సర్వ మధురముగ sTÖరేయి,
పవన లాలిత మయ్యేనని - భావన
కఱివేలుపు చిరునవ్వులె కలకాలము
మీ కైతల మెలగేనని దీవెన!
ఆ నాటి కార్యక్రమం రక్తి కట్టడానికి వారి ఆశీస్సులు యెంత కారణమో నాకు తెలుసు.
ఆశీస్సులే కాదు, ప్రతి రచనా, చదివి నాకు తెలియవలసిన విషయాలు కార్డుద్వారానో, కనబడినప్ప్పుడో తెలిపేవారు. ఈ ఆశీస్సులు, సలహాలు నాకెంత విలువైనవో నేను నా రచనలుకాని మాటలు ఉపయోగించినపుడు వారినద్దŠ నుంచి వచ్చిన మందలింపులూ అంతటివే. అన్నిటా చిన్న వాడనని సత్ప్రయత్నాలను హర్షించేవారు కొందరైనా యితరులు వుంటారు కాని క్షణికమైన వ్రాతలో కూడ తప్ప్పులు తెలియజెప్పి సరిదిద్దే ఓపికా, ప్రేమా అటువంటి పెద్దలలో యెందరికి వుంటుంది?
బహుముఖ ప్రజ్ఞావంతులని యెందరినో అంటారు. కాని ఆ బిరుదు వారికి తగినట్లుగా మరెవ్వరికీ సరిపోదు. వారి నిర్యాణానంతరం వారి మిత్రులు వ్రాసిన వ్యాసాలూ ఒకొక్కటి చదువుకొనడం - వారికి హార్మోనియం వాయించడం వచ్చునట, అలంకార శాస్త్రం, వేదం చెప్పేవారట, పాళీ భాషలో ప్రవీణులట అని చెప్ప్పుకుంటూ విస్తుపోవడం అందరికీ, ఆత్మీయుల మనుకున్న వారికే పరిపాటయింది. ఆంతరంగికులకూ తెలియని వారి విన్నాణాలెన్నో!
వారు వెళ్లిపోయారు. పామరులై యేడ్చి మనోభారం తీర్చుకోగలిగిన వాళ్లూ, యేడ్చినా తీరనివాళ్లూ యెందరో! వారిలో నేనూ ఒకడిని. కాని యిక sTÖ జన్మకు ఆ విషయమై విచారం లేదు. ఉండకూడదు. వారి అనుచరులలో యిటువంటి పామరత్వం వారు సహించలేరు. ఇక sTÖ జన్మకు సాహిత్య వ్యాసంగంలో ఒకటే ధ్యేయం - ఒకటే ధ్యాస. ఎప్పటికైన ఒక రచన చేసి, సాహితీవేత్తలతో సహృదయులలో ఒక మెప్ప్పు పొందాలి. ఏమని? మల్లాది రామకృష్ణశాస్త్రి ఆశీస్సుతోనే వీడింతటి వాడై నాడని! ఇన్ని మెట్లెక్కించి యెక్కడో వున్న నన్ను యింతవఱకు తెచ్చిన వారి ఆశీస్సు అంతవరకూ తీసుకు వెళ్లగలదనే నా నమ్మకం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి