భారతదేశం
శాంతికి నిలయం
ఎప్పుడూ
యుద్ధాన్ని
కోరుకోదు
కవ్వించదు
కయ్యానికి
కాలుదువ్వదు
అనివార్యమైనపుడు
యుద్ధానికి
దిగుతుంది
చుట్టుముట్టు దేశాలన్నీ
అదేపనిగా
కవ్విస్తుంటయి
రాళ్లు విసురుతుంటయి
అక్రమంగా
చొరబడుతుంటయి
భూఆక్రమణాలు చేస్తుంటవి
జోరీగెల్లా అల్లాడుతుంటయి
ఫేక్ ప్రచారాలు
ఫేక్ నినాదాలు
అసత్యారోపణలు చేస్తుంటవి
రెచ్చగొడుతుంటయి
రచ్చన నిలబడతయి
భారత్ శాంతితో జయిస్తుంది
ఉపాయంతో గెలుపొందుతుంది
బ్లాక్‌మెయిల్‌కు లొంగదు
బలవంతాన్ని సహించదు
సహనంతో
సంయమనంతో
అదునుచూసి
పదను పెడుతుంది
కర్రుగాల్చి
వాతపెడుతుంది
బుద్ధిరాని దేశాలు
హింసను ప్రేరేపించిన
హింసతోనే
సమాధానం చెబుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి