మొత్తం పేజీ వీక్షణలు

25, ఆగస్టు 2026, మంగళవారం

విశ్వగీతం పాడాలి.....

విశ్వగీతం పాడాలి

విశ్వశాంతి కోరాలి

విశ్వసృష్టిలో

కమ్మదనం

పొందాలంటే

విశ్వగీతం పాడాలి

విశ్వశాంతి కోరాలి

తనివి తీరని

ప్రేమకోసం

హృదయ తలుపులు

తెరవవలెను 

ద్వేషమే లేనివారికి 

దేహమే దేవాలయం 

మంచి వారికి

మనసే విరిసే వసంతం

కాలగతిని తెలుసుకొని 

కర్తవ్యంతో మెలగాలి

కనులకాంతితో 

చీకటిని చెండాడాలి

జ్ఞానమార్గం వేయాలి

మనుషులందరు

కలిసి ఉండే

వేదిక నిర్మించాలి

ఒకరి బాధలు

ఒకరు పంచుకొని

చేదోడు వాదోడుగా ఉండాలి

మంచి చేయని

మతాలకోసం

మనుషులను

ముక్కలు చేయొద్దు

ప్రేమించి

గెలిచినపుడే

మానవత్వం

పరిమళిస్తుంది

విశ్వగీతం పాడాలి

విశ్వశాంతి కోరాలి

ఎల్లపాయలు కలసి

ఒకేసంద్రం చేరినట్టు

సర్వజాతులు కలసి

ఐక్యతను చాటి

భారతీయతను నింపుకొని

విశ్వగీతం పాడాలి

విశ్వశాంతిని కోరాలి

నింగినుంచి చంద్రకిరణాలు

లోకాన్ని చేరి

వెండివెన్నెల పరచినట్టు

మనుషులందరిలో

విశ్వగీతం నింపుకొని

విశ్వశాంతి పాడాలి

శాంతితోనే విశ్వం

క్రాంతిపథాన్ని చేరుతుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి