మొత్తం పేజీ వీక్షణలు

13, ఆగస్టు 2026, గురువారం

భైరవభొట్ల నారాయణరావు తెలుగు సినిమాపాటలు



సంవత్సరాలవారీగా చేసిన చేస్తున్న కృషి 

సృష్టిలో మానవ మేధస్సులో జనించే ఆలోచనలను సక్రమ మార్గంలో 


నలుగురికీ ఉపయోగపడాలనే ఆకాంక్ష, ఆదర్శం గల పరి శోధకుడు, విశిష్టవ్యక్తి 


భైరవభొట్ల సంకల్పబలంతో అమలు చేయడానికి ప్రయత్నిస్తే ఏ అంశమైనా 


నిరుపయోగం కాదని తన పరిశోధన ద్వారా భైరవభొట్ల వేంకట నారాయణరావు 


నిరూపించాడు. 

దాదాపు -అరవై సంవత్సరాల్లో (1931-1991) విడుదలైన అన్ని 


సినిమాలకు సంబంధించిన పాటలు, రచయితలు, దర్శకులు, సంగీత దర్శకులు, 


గాయనీ గాయకుల గురించిన వివరాలన్నీ భైరవభొట్ల సమగ్రంగా పొందుపరిచాడు. 


మనం ఎంత పాతపాట అడిగినా, అరుదైన పాట అడిగినా, ఒకే ఒక్క నిముషంలో ఆ 


పాట ఉన్న సినిమా పుస్తకం, ఆ పాటకు సంబంధించిన ఆడియో, ఆ వెంటనే అవసర 


పాట అయితే వీడియో చూపిస్తాడు. ఇలా మనుకుంటే ప్రసిద్ధమైన కొన్ని వేల పాటల్లో 


ఏది అడిగినా వెంటనే మనకందివ్వగల క్రమ పద్ధతి, జ్ఞాపకశక్తి, శ్రద్ధాసక్తులు 


మెచ్చుకోదగిన, అభినందించ తగిన విషయం కూడా. ‘మనసే-అందాల 


బృందావనం’ లా ఆ వ్యక్తే ఒక పరిశోధనా సంస్థ. 

ప్రతిపనికి ఒక ధ్యేయం ఉంటుంది. ఒక లక్ష్యం ఉంటుంది. లక్ష్యశుద్ధిని 


బట్టి కార్యసిద్ధి, తదనంతరం ప్రతిఫలం ఉంటాయి. సహజంగా కాని కేవలం 


పాటలపైన ఇష్టం లేదా అభిమానం లేదా ప్రేమ ఏదైనా ఇలా ఒక తపనగా మారి ఒక 


వ్యక్తి చేత ఇంతా చేయించడం సాధ్యమా ననిపిస్తుంది. కానీ అది నిజం చేసిన పరిశో 


ధకుడు భైరవభొట్ల. 

భైరవభొట్ల బి.ఏ. చదివే రోజుల నుండే భవిష్యత్తులో తాను చేయబోయే 


‘ తెలుగు హిందీ సినిమా పాటల పరిశోధన’ కు గట్టి పునాది వేసుకున్నాడు. 


అలాగని కేవలం పరిశోధనకే కాకుండా, తాను చెన్నైలో ఒక సహాయక రచయితగా 


రాణించడానికి, చిత్ర కథల్లోనూ, చిత్ర సంభాషణల్లోనూ, పాటల్లోనూ ప్రధాన 


రచయితకు అన్ని విధాలా సహకారం అందించడానికి అనువుగా తన దగ్గరున్న 


సినిమా పాటలను వెండితెర నవలలను, హిందీ సినిమాకథలను, హిందీ సినిమా 


సంభాషణలను తయారు చేసుకున్నాడు. తాను భవిష్యత్తులో తెలుగు, హిందీ సినీ 


గీతాల తులనాత్మక పరిశోధనకు. ఆ రెండు భాషల చిత్రగీతాలను వస్తుపరంగా 


రాసుకుని, సంబంధిత సేకరించుకుని చెన్నైలో అడుగుపెట్టాడు. 

1972 వ సంవత్సరంలో భైరవభొట్ల ‘హిందీ తెలుగు సినిమా పాటల 


తులనాత్మక అధ్యయనం ‘అనే అంశం మీద పిహెచ్.డి. డిగ్రీకి నమోదు 


చేసుకున్నాడు. 1973 లో ప్రీ పిహెచ్.డి పరీక్ష పాసయ్యాడు. కానీ ఆర్ధిక పరిస్థితి 


అనుకూలించక, వివిధ రకాల మానసిక ఒత్తడి అధికమై భైరవభొట్ల తీవ్రమైన 


ఇబ్బందులు ఎదుర్కోవాల్సిరావడంతో సినిమాపాటలపై పరిశోధన కుంటుపడింది. 


చేసేది లేక హిందీ ప్రచార సభలో తనకు కేటాయించిన గదిని ఖాళీ చేసి, తను 


సేకరించిన సామాగ్రినంత బస్తాలలో వేసి, ఆ హిందీ ప్రచార సభలోనే ఒక 


ఆప్తమిత్రుని దగ్గర భద్రపరిచాడు. ఆ తర్వాత ఆచార్య ఆత్రేయ దగ్గర 


యాభైరూపాయలు తీసుకుని భైరవభొట్ల గుడివాడకొచ్చేశాడు. మళ్లీ 1978 వ 


సంవత్సరంలో భైరవభొట్ల చెన్నై వెళ్లి తన మిత్రుని దగ్గర భద్రంగా దాచిపెట్టిన తన 


పరిశోధనా మÖల ధనాన్ని విజయవాడకు తరలించాడు. తర్వాత అప్పుడప్పుడూ, 


తన ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, నలభై పాటల పుస్తకాలను కలిపి 


ఒక్కొక్క బైండింగ్ గా తయారు చేయించాడు. అలా అవి మొత్తం 81 బైండ్లు 


అయ్యాయి. వాటిని సంఖ్యల వారీగా తన పరిశోధనా కార్యక్రమంలో 


వినియోగించుకున్నాడు. 

కానీ ఆ బైండ్లలో తనకు నచ్చిన సినిమా పాట కావాలంటే ఏది ఎక్కడ 


ఉందో తెలిసేది కాదు. గంటల తరబడి పాటల పుస్తకాల 

బైండ్లను వెతకాల్సి వచ్చేది. ఇది ప్రయాసతో కూడి కాలాన్ని హరింజేది. దీంతో విసుగు 


చెందిన భైరవభొట్ల ఈ పాటల బైండ్లకన్నింటికీ ఒక అకారాది క్రమసూచికను తయారు 


చేయాలనుకున్నాడు. అది ఎలాగంటే ఉదాహరణకు “వరకట్నం” అయితే ఙ అనే 


పేజీలో రాశాడు. దానికి ఎదురుగుండా బైండు సంఖ్య వేశాడు. దాని పక్కనే పుస్తకం 


సంఖ్య వేశాడు. దాని పక్కనే విడుదలైన సంవత్సరం వేశాడు. పాటల పుస్తకం 


మొదటి పుట లోని పైభాగాన ఆ చిత్రం విడుదలైన సంవత్సరం వేశాడు. 

ఇలా ఈ విధమైన బైండ్లకు అకారాది సూచికలు తయారు చేయడంలో 


భైరవభొట్లకు, ఆయనదగ్గర చదువుకుంటున్న ఇద్దరు ముగ్గురు విద్యార్థులు 


సహాయపడుతుండేవారు. వాళ్లు పాటల పుస్తకాలను అక్షర క్రమంలో వున్న రిజిష్టరులో 


పొందుపరిచారు. దీంతో పాటు 1931 వ సంవత్సరం నుంచి 1978 సంవత్సరం దాకా 


విడుదలైన చిత్రాల జాబితాను సంవత్సరాల వారీగా వరుస క్రమంలో తెలిపే రిజిష్టర్ 


లో ఎక్కించడం ఒక ఘనకార్యంగా మారింది. 1978 దాకా ఎక్కించిన చిత్రాల జాబితా 


పూర్తయిన తర్వాత 1931 లో మొత్తం ఎన్ని చిత్రాలు విడుదలయ్యాయి? తన దగ్గర 


ఎన్ని పాటల పుస్తకాలున్నాయి? ఆ పాటల పుస్తకం ఏ సంఖ్య గల బైండులో వుంది? 


ఎన్నో సంఖ్యలో వుంది? అని వెతుక్కుంటూ తాను తయారు చేసిన అక్షర క్రమంలోని 


రిజిష్టర్ ఆధారంగా, సంవత్సరాల వారిగా తయారు చేసిన మరొక రిజిష్టర్ లో పొందు 


పరిచాడు. ఇలా 1932, 1933, 1934, 1935 దాకా విడుదలైన సంవత్సరాలలోని 


చిత్రాలు, తన దగ్గరున్న పాటల పుస్తకాలు ఏ నెంబరు గల బైండులో ఎన్నో సంఖ్యలో 


వున్నది పొందు పరిచాడు. ఈ అక్షర క్రమంలోని రిజిష్టర్ని, సంవత్సరం వారీగా 


తయారు చేసిన రిజిష్టర్ని, తన దగ్గర ఉన్న 81 పాటల పుస్తకాల బైండ్లలోని పాటల 


పుస్తకాలను రెండు రిజిష్టర్లలో పొందుపరచడం కష్ట సాధ్యమైనది . ఈ బృహత్ 


కార్యాన్ని పూర్తి చేయడానికి సుమారు 10 సంవత్సరాలు పట్టింది. భైరవభొట్ల 


పరిశోధనా కేంద్రంలో ఈ రెండు రిజిష్టర్లే పరిశోధకులకు ప్రాణాధారం, పరిశోధనకు 


మÖలాధారం. వీటిని భైరవభొట్ల ఎంతో సహనంతో, ఆత్మ ధైర్యంతో పూర్తి చేశాడు. 


ఇందుకు భైరవభొట్ల దగ్గర ఉండిన ఆత్మీయుడు, కాపీయిస్టు కొత్తపల్లి హనుమంతరావు 


ఎంతో సహకరించాడు. ఇతను భైరవభొట్ల దగ్గర సినిమా పాటల పరిశోధనా కేంద్రంలో 


సంవత్సరాలు నెలజీతం మీద కాఫీయిస్టుగా పని చేశాడు. 

చలసాని ప్రసాద్, కృష్ణాబాయి 15. 11.1987 న శ్రీశ్రీ సినిమా పాటల 


సంకలనం తయారు చేయడానికి భైరవభొట్ల దగ్గరకు వచ్చినపుడు ఆయన 


రూపొందించిన ఈ అక్షర క్రమంలోని రిజిష్టరు, సంవత్సరం వారీగా తయారు చేసిన 


రిజిష్టరు ప్రప్రథమంగా ఉపయోగపడ్డాయి. ఒక నెల రోజుల్లోనే శ్రీశ్రీ సినిమా పాటల 


జాబితాను తయారు చేయడానికి వీలైంది. ఇలా భైరవభొట్ల తయారు చేసిన రిజిష్టర్ 


పరిశోధకులకు వర ప్రసాదమైంది. 

28-5-1990 న బ్రిటీషు ఫిల్ము ఇనిస్టిట్యూట్ మరియు భారత 


ప్రభుత్వ ఫిల్మ్ ఆర్కేవ్స్ వారు సంయుక్తంగా రూపొందించిన ‘ఎన్ సైక్లోపిడియా ఆఫ్ 


ఇండియన్ సినిమా’ అనే గ్రంథంలో సంకలించ బడిన తెలుగు సినిమాల్లోని 


నటులు, నటీమణులు, దర్శకులు, సంగీత దర్శకులు, రచయితల ఫిల్మోగ్రఫీలు 


తయారు చేయడంలో గూడా భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రంలోని అకారాది 


సూచిక, సంవత్సరం వారీగా తయారు చేసిన రిజిష్టరు ఎంతో బాగా ఉపయోగపడింది. 


చాలా తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడానికి ఇవి 

ఉపయోగ పడ్డాయి. ఇలా తెలుగు సినిమా వైభవం అంతర్జాతీయంగా 


రూపొందించబడిన ‘ఎన’ సై క్లోపిడియా ఆఫ్ ఇండియన్ సినిమా’ లో చోటు 


చేసుకోవడం ముదావహం. ఇది ఒక విధంగా భైరవభొట్ల కృషి ఫలితమేనని 


చెప్పుకోవచ్చు. 

ఆత్రేయ సినీగేయ సంకలనాలు - భైరవభొట్ల కృషి : 

భైరవభొట్ల ఆత్రేయదగ్గర అసిస్టెంటు రైటర్ గా పని చేస్తున్న రోజుల్లోనే, 


ఆత్రేయకు తన సినీ గీతాల పరిశోధన చూపించాడు. ఆయన భైరవభొట్ల పరిశోధనకు 


ముగ్ధులై తన పాటల సంపుటిని తయారు చేయాల్సిందని చెన్నైలోని రోజుల్లోనే 


కోరాడు. ఆయన కోరిక మేరకు భైరవభొట్ల ఆత్రేయ పాటల్ని (1951 - 1975) ఒక జాబితా 


గా తయారు చేసి, దాని ప్రకారం ఆత్రేయ కార్యాలయంలో మేనేజరు, టైపిస్టుగా పని 


చేస్తున్న ఆది శేషుతో పాటలను టైపు చేయించి, వాటన్నింటినీ ఒక సంపుటిగా 


తయారు చేసి ఆత్రేయకు ఇచ్చాడు. 

మనసుకవి ఆత్రేయ 1986 వ సంవత్సరంలో భైరవభొట్ల గృహానికి 


(విజయవాడ) వచ్చాడు. 1975 సంవత్సరంలో భైరవభొట్ల తయారు చేసిచ్చిన పాటల 


సంపుటిని తాను ఇల్లు మారేటప్పుడు పోగొట్టుకున్నానని, మళ్లీ పాటల సంపుటిని 


తయారు చేయాల్సిందిగా భైరవభొట్లను కోరాడు. భైరవభొట్ల ఆ ప్రయత్నంలో ఆత్రేయ 


సినీ గీతాల సంపుటిని ప్రారంభించాడు. 1989 సంవత్సరంలో ఆత్రేయ స్వయంగా 


భైరవభొట్లకు తన పాటల సంపుటిని తయారు చేయ మని ఉత్తరం రాశాడు. ఆ 


ఉత్తరాన్ని బట్టి భైరవభొట్ల పాటల సంపుటి తయారు చేసే పనిలో ఉన్నప్పుడే ఆత్రేయ 


13.09.1989 మరణించాడు. ఆ తర్వాత ప్రముఖ సినీ నటుడు డా. కొంగర జగ్గయ్య, 

1. భైరవభొట్లకు ఆత్రేయ రాసిన ఉత్తరం. 

ప్రముఖ సినీ నిర్మాత సంస్థ డా. కాట్రగడ్డ మురారి, ‘మనస్విని’ అనే 


సంస్థ పెట్టి ఆత్రేయ రచనలన్నింటినీ ప్రచురించాలని సంకల్పించారు. అందుకోసం 


జగ్గయ్య, భైరవభొట్ల సహాయాన్ని అర్థిస్తూ ఆయనకు ఉత్తరం రాశాడు.’ భైరవభొట్ల ఆ 


ఉత్తరం ప్రకారం, ఆ సమయం లో తాను కాలు విరిగి మంచం దిగలేని స్థితిలో ఉన్నా 


సరే, కొత్తపల్లి హనుమంతరావు సహాయంతో ఆత్రేయ సినీ గీతాలను మÖడు భాగాలు గా 


చేసి భైరవభొట్ల డా. కొంగర జగ్గయ్యకు పంపించాడు. అలా ఆత్రేయ పాటలు 


వెలుగులోకి రావడంలో భైరవ భొట్లది ప్రధాన భూమిక. 

1990 సంవత్సరం ఉగాది రోజుకి ‘మనస్విని’ ఛారిటబుల్ ట్రస్టు వారు ఆత్రేయ 


మొత్తం సాహిత్యాన్ని ‘ఆత్రేయ సాహితి’ అనే పేరుతో 7 సంపుటాలుగా 


ముద్రించారు. అందులో 3 సంపుటాలు ‘నా పాట నీ నోట పలకాలి’ అనే పేరుతో 


ఆయన తొలి చిత్రం ‘ దీక్ష’ (1951) దగ్గర నుంచి “ ప్రేమ యుద్ధం” 


(1990) చిత్రం దాకా భైరవభొట్ల దగ్గర లభ్యమైన పాటల పుస్తకాల ఆధారంగా 1097 


పాటల్ని సంపు టీకరించడం జరిగింది. 

1.భైరవభొట్లకు డా. కొంగర జగ్గయ్య రాసిన ఉత్తరం - 15.12.1989. 

ఆ తర్వాత భైరవ భొట్ల ఆత్రేయ సినీ సంపుటాలకు సంవత్సరాల 


వారీగా విషయ సూచికను, ఒక ఇండెక్స్ బుక్ ను తయారు చేసి జగ్గయ్యకు 


అందజేశాడు. భైరవభొట్ల రూపొందించిన ఆత్రేయ పాటల సూచిక పలువురు 


పరిశోధకులకు, పత్రికల వాళ్లకు, ఆత్రేయ అభిమానులకు కరదీపికగా 


ఉపయోగపడుతోంది. అన్నం ఆదరించిన ఆత్రేయకు భైరవభొట్ల అందించిన అక్షర 


నైవేద్యంగా సంపుటాలను చెప్పుకోవచ్చు. 

ఇదేవిధంగా అక్షర క్రమంలో సినిమా పాటల పుస్తకాల వివరాలను 


తెలుసుకోవడానికి, పాటలు చూసి రాసుకోవడానికి, వాటిని జిరాక్స్ చేయించడానికి, 


పరిశోధకులు పరిశీలించడానికి, పాటలను సంకలనాలుగా తీసుకురావడానికి సినిమా 


పాటలపై పత్రికల్లో వ్యాసాలు రాయడానికి భైరవభొట్ల రూపొందించిన ఈ అక్షర 


క్రమంలోని రిజిష్టరు, సంవత్సరాల వారీగా రూపొందించిన రిజిష్టరు తెలుగు సినిమా 


పాటల పరిశోధనలో బహుముఖంగా బహుళ ప్రయోజనంగా ఉపయోగపడిందనడంలో 


అతిశయోక్తి లేదు. 

కొసరాజు సినీ గేయకోశం, సినారె సినీ గేయకోశం, ఆరుద్ర సినీ 


గేయకోశం, తెలుగుసినీ భక్తి గేయకోశం, దాశరథి సినీ గేయకోశం, తెలుగుసినీ దేశభక్తి 


గేయకోశం, తెలుగు సినీ శృంగార నృత్య గేయ కోశం మొదలగు వాటిని తయారు 


చేయటానికి sTÖ రెండు రిజిష్టర్లు ఉపయోగపడ్డాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి 


పాటల సంకలనం 6 భాగాలుగా తయారు చేసేటపుడు, వేటూరి సుందర రామÖ్మర్తి 


సినీగీతాలు 2 బైండ్లు తయారు చేసేటపుడు, sTÖ రెండు రిజిష్టర్ల ఆధారంగా 


పరిశోధన కృషి సులువు అయింది. 

ఇలా తెలుగు సినిమా పాటల పుస్తకాలలోని పాటలు, వాటి రచయితలు 


మొదలైన వివరాలు వెతకడానికి అక్షర క్రమంలో రూపొందించిన రిజిష్టరు, 


సంవత్సరం వారీగా రూపొందించిన రిజిష్టరు లైబ్రరీసైన్సు ఆధారంగా అనుసరించి 


ఆనాడే భైరవభొట్ల చే చేయబడడం ఆతని విశిష్ట పరిశోధక కృషికి నిదర్శనం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి