మొత్తం పేజీ వీక్షణలు

8, ఆగస్టు 2026, శనివారం

కపిలవాయి పరిష్కరణలు

కవులారా యువ కవులారా ! 

నవకవులారా! 

భావి తరానికి - బాటలు మీరే 

భారతజాతికి నేతలు మీరే 

అంటూ కొత్త కోణంలో ప్రాచీనాంధ్ర భాష సొభగుల్ని కాపాడాలనే సందేశమిచ్చిన భవ్యశీలి. శతధిక గ్రంథకర్త, వక్త, కవన సక్త అంపశయ్య మీద భీష్ముని వలె జీవిత ఒడిదుడుకుల్ని తట్టుకొని కవన రంగమందు తన దైన కలంతో కృతులెన్నో తీర్చి కీర్తిగాంచిన కపిలవాయి లింగమÖర్తి గారు సాహితి జగాన నిలువెత్తు నిదర్శనం.

శ్రీ లింగమÖర్తిగారు 1928 మార్చి 31వ తేదిన ప్రభవ మాఘశుద్ధ నవమినాడు నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూరు మండలం జినుకుంట గ్రామంలో ఒక పండితవంశమున శ్రీమతి మాణిక్యాంబ వెంకటాచలం పుణ్యదంపతులకు శుక్తిముక్తా ఫలంగా జన్మించారు. అమరాబాద్‌లోని మేనమామ గారైనా చేవూరు పెద్దలక్ష్మయ్యగారి దగ్గర పెరిగి విద్యాబుద్ధులు నేర్చి, మీనాక్షమ్మను వివాహం చేసుకున్నాడు. సంస్కృతాంధ్ర నిఘంటువులు పురాణేతిహాసాలు, కావ్య నాటకాలు, జ్యోతిష్య, శ్రాతాది భాగాలు నేర్చినారు. 

నాగర్ కర్నూల్ జాతియోన్నత పాఠశాలలో 1954లో తెలుగు పండితునిగా చేరి తరువాత మాస్టర్ ఆఫ్ ఓరియంటల్ లెర్నింగ్ (యం.ఓ.యల్) మరియు పండిత శిక్షణ కూడా పొందినారు. 1972 నుండి పాలెంలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్యకళాశాలలో చరిత్రోపన్యాసకులుగా 11 సంవత్సరాలు పనిచేసి పదవి విరమణ పొందినారు.

పరిష్కరణ పాణిని ` కపిలవాయి: 

ఒకవైపు ఉద్యోగం నిర్వహిస్తూనే పద్యాన్ని పదునుగా నడిపిన సవ్యసాచి. భావప్రకటనకు పద్యం ఏ మాత్రం ప్రతి బంధకం కాదని రమణీయంగా చూపించారు. అన్ని సాహిత్య ప్రక్రియలలో అనగా కవితలు, చరిత్రలు బాల సాహిత్యం మొదలగు ప్రక్రియలలో రచనలు చేసిన “కవిత కళానిధి” మరుగున పడ్డ తాళ పత్రాలను వెతికితీసి వానిలోని వ్యాఖ్య విషయాలను వివరిస్తూ పరిష్కరించి ఆ నాటి తరం కవులకు ఈ తరానికి పరిచయం చేసినారు. సాహిత్యంలోని అనేక విషయాలను అవలీలగా వివరించే “విద్యన్మణి” అనేక స్థల చరిత్రలు దేవాలయాల కథలకు ప్రాణం పోసిన “పరిశోధక పంచాననుడు” మతులు పోగొట్టి యతులు, అలంకార మదగడ కుంభస్థలాలను బద్దలు కొట్టి లాక్షణికుడు సాహిత్యం, సంగీతం, సంస్కృతి అనే ముందు విభూతి రేఖలను నిత్యం నుదుటిన ధరించే “కవ్విగుల వైతాలికుడు” వివిధ శాస్త్రాలలో ప్రజ్ఞపాటవాలను ప్రదర్శించిన దార్శనికుడు కవిత్వపు లోతులను తనువెల్ల నింపుతున్న ధీశాలి. నవనవోన్మేషి, కడయాడే విజ్ఞాన సర్వస్వం ఆయన సొంతం. 

సాహిత్యంలోని క్లిష్టమైన ప్రక్రియలలో కూడా అనగా చిత్రపది, బంధాలు, శబ్దపది, అలంకారాలు, యతులతో చమత్కారాలు వంటి రచనలు చేపట్టి భాషా సముద్రపు లోతుల్లోకి దిగి తెలుగు పలుకుబడిపై ప్రత్యేకధికారం పొందినారు. 

శతకం, సంకీర్తనలు, ఉదాహరణలు, వచనగేయ కృతులు తెలుగు సాహిత్యంలో వివాదస్పదమైన పద్యాలపై అల్లబడిన కథలు (కథాసంకలనం) కావ్యాలు (పద్య గేయ పరమైనవి, ఆధ్యాత్మిక చారిత్రకమైనవి), సంకలనాలు, వ్యాఖ్యానాలు, పరిష్కరణలు, యిలా ఒక్కటేమిటి బహుముఖ ప్రక్రియ రచనల్లో దిట్ట కపిలవాయి లింగమÖర్తిగారు. ఇవన్నీ వేటికవే ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. కానీ విశేషమేమిటంటే ఇతని పరిష్కరణలు నేటి పరిశోధకులకు పటుకొమ్మలుగా ఆధారమవుతున్నాయి. తెలుగు సాహితీ కొమ్మకు విరబూసిన వన్నెవాయనిగల పండితుడు కవనీయ కావ్య కర్త, రచనాదురందరుడు పరిశోధనా ప్రాజ్ఞుడు విమర్శనా వైతాళికుడు, నాటనాచాతుర్య చతురుడు ప్రత్యేకించి “పరిష్కరణ ప్రభాకరుడు”. 


కపిలవాయి పరిష్కరించిన గ్రంథరాజములు

1. చూతపురీవిలాసం (యక్షగానం) (1980) 

ఎల్లూరి నరసింగకవి కృతి. ఇది ఒక ప్రౌఢమైన యక్షగాన ప్రబంధం. తాళపత్రాల నుండి ఉద్ధరించి పరిష్కరించినారు. ఇందులో విప్రనారాయణ చరిత్ర వివరించినారు. మామిళ్ళపల్లి నృసింహస్వామికి అంకిత మిచ్చినారు. తిరుమలతిరుపతి దేవస్థానమువారి ఆర్థికసహాయముతో ముద్రించినారు. 

2. పరమహంసశతకం (1981) 

ఇది వేదాంతం మరియు లోకరీతి గీతశతకం. పీచు ప్రతి నుండి ఉద్ధరించి పరిష్కరించినారు. 

3. శ్రీమద్భాగవతమాహాత్మ్యం (1982) 

ఇది బోయనపల్లి వేంకటాచార్య కృతం. ప్రాచీనమైన కాగితం ప్రతినుండి ఉద్ధరించబడిన చక్కని సాంప్రదాయిక కావ్యం. దీనికి మÖలం పద్మపురాణాంతర్గత ఇతివృత్తం. ఇందులో సంకీర్తనం, కథాశ్రవణం, సందర్శనం, నీరాజనం, అంక సూచికలలో తెలిపిన సంగతులు కూలంకషములేగాక సమగ్రములు, విమర్శనా విలసితములు. తిరుమల తిరుపతి దేవస్థానమువారి ఆర్థికసహాయముతో ముద్రించినారు. 

4. రామోదాహరణం (1983) 

ఇది మహబూబ్ నగర్ జిల్లాలోని పెనల్లూరి వేంకటాద్రి కవి విరచితమైన మొదటి స్వతంత్ర ఉదాహరణం. విపులమైన పీఠికతో పరిష్కరించినారు. ఇతడు వృత్తస్థానమున మత్తకోకిల పంచచామర ఉత్సాహములను వాడినాడు. అదీగాక రగడలలో మదురగతిని రెట్టించి ద్విగుణమధురగతిని సృష్టించెను. ఇతడు దేశవృత్తమునే గ్రహించి దానిని పంచపాదిగా రచించెను. ఇది ఈ కావ్యమున ప్రత్యేకత. 

5. సాలగ్రామశాస్త్రం (1984) 

సాలగ్రామక్షేత్ర యాత్రలో వెలువడ్డ గండకీనది గాథలు, సాలగ్రామలక్షణాలు, సాలగ్రామ వైవిధ్యం, శిలోత్పత్తి లక్షణం, గ్రాహ్యశిలా నిర్ణయం, అవతార భేదాలు, బుద్ధకల్కిమÖర్తుల లక్షణాలు, కేశవనారాయణమÖర్తుల లక్షణాలు, సాలగ్రామ శిలాపూజవిధి. సాలగ్రామమహాత్మ్యం, తులసీదేవి చరిత్ర, తులసీపూజా పద్ధతి, రుద్రాక్షలక్షణం మొదలగు విషయాలు ఇందులో ప్రస్తావించినారు. ఇది మా ఇంటిలో తాళపత్ర భాండాగారంలో దొరికిన గ్రంథం. మొదటిముద్రణ 1984లో రెండవ ముద్రణ 2008లో జరిగినది. ప్రథమ ముద్రణ తిరుమల తిరుపతి దేవస్థానమువారి ఆర్థికసహాయముతో ముద్రించినారు. 

6. సులభ గాయత్రి సంధ్యావందన విజ్ఞాన ీVAమవిధి (1984) 

ఇది ఎన్ శ్రీరామాచార్య రచన. దీనిలో మౌనేశ్వర మహాత్యం, వ్రతకల్ప పూజా విధానము, ఏకరాత్ర క్రమము, వివాహ విధానము, అపకర్మ ఆబ్దిక విధానం సులభశైలిలో వివరించినారు. 

7. సావిత్రిచరిత్ర (సువ్వాల ప్రబంధం) (1985) 

ఇది వనపర్తి చెన్నకృష్ణకవి ప్రణీతం. తాళపత్ర ప్రతి నుండి ఉద్ధరించి పరిష్కరించినారు. కథాసంగ్రహంలో సావిత్రి లౌకికా లౌకిక రహస్యాలు వివరించినారు. అరవింద సావిత్రి ననువదించిన శ్రీ శార్వరి తిలకం తిలకాయమానం. ఇందులో వ్యాసుని సావిత్రి ప్రసక్తి, అశ్వపతి కూతురునకు బుద్ధులు చెప్పిన ఘట్టం, ఫలశృతి మొదలైనవి పాఠకులను ఆనంద భరితులను చేస్తాయి. ఇది సువ్వాల ఛందస్సులో రచించినారు. ఈ చంధస్సు తెలుగు సాహిత్యానికి కొత్తది. 

8. భువనమోహినీవిలాసం (1986) 

ఇది ద్విపద ప్రబంధం. పెన్గలూరి వేంకటాద్రి కృతం. తాళపత్ర ప్రతి నుండి ఉద్ధరించి పరిష్కరించినారు. దీని మÖలం పంచతంత్రంలోని చివరిదైన లబ్ధ ప్రకాశంలో ఉంటుంది. తెలివి లేనివాడు చేతికి చిక్కిన దానిని ఎట్లా పోగొట్టుకుంటాడో అనే దానికి ఉదాహరణ. 

9. యోగసక్తాపరిణయం (ప్రబంధం) (1986) 

మద్దిపట్ల అప్పశాస్త్రి, కొట్రవెంకట్రామ కవి విరచితమైన ఈ ప్రబంధంలో శ్రుతులు, పురాతన కథల ఆధారంగా కావ్యవస్తువును సంగ్రహించినారు. దీనిలో బృహస్పతి సోదరియైన యోగాసక్త, శిల్పి ప్రజాపతి కుమారుడైన ప్రభావసుల వివాహ వృత్తాంతం. విశ్వకర్మ శిల్పకళా నైపుణ్యం, విశ్వకర్మ మాహాత్మ్యం, పంచబ్రహ్మల ప్రతిభను గమనించవచ్చు. ఆం. ప్ర. ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం మరియు పరిశోధనాలయం వారు విపులమైన పీఠికతో దీనిని ప్రచురించినారు. 

10. శ్రీవిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (1990) 

దేవరకొండోజు నరసింహాచారిభాగవతార్ రచన. బుర్రకథ రూపంలో సులభశైలిలో రచించినారు. రాగ తాళాల వివరణతో వంతమాటలు కూడా తెలిపినారు. 

11. రామకీర్తనలు (1990) 

ఇది మాచిపల్లిసాయిదాసు రచన. 90 శ్రీరామకీర్తనలు రాగతాళాలతో పాడటానికి అనువుగా నున్నవి. మేలు కొలుపులు మంగళహారతులతో ముగించినారు. 

12. శ్రీరామవచనాలు (1991) 

దీని కర్త మండజానకిరామయ్య. వీనిని పద్యంతో ప్రారంభించినాడు. ఈ వచనాలలో సీసచ్చాయలు కనిపిస్తున్నవి. కనుక వీనిని సీసగంధి అనవచ్చును. రామాయణ కథాత్మికమైన ఈ వచనాలు తాళపత్ర ప్రతినుండి ఉద్ధరించినారు. 

13. తడకనపల్లెరామయోగి కృతులు (1993) 

రామయోగిగారి లఘుకృతులకు వేదాంతపరమైన ఆధ్యాత్మికతత్వం మరియు షట్చక్ర వివరంతో కూడిన సాధన పీఠికలో సమగ్రంగా వివరించినారు. ఈ పుస్తకం పూర్తిగా వేదాంత విషయభరితము. దీనిలో షటస్థల దర్పణము, మహానంది లింగశతకము, పంచరత్నములు, నవరత్నమాలిక, చివరన శుద్ధరాజయోగము, ఇది వివిధ విషయ పద్య సమాహారం. 

14. కమలారామం (చారగొండ రాంరెడ్డి జీవితచరిత్ర) (1996) 

మల్లేపల్లి శేఖరరెడ్డి రచన. చారగొండ రాంరెడ్డి అంటరానితనమును నిర్మూలించుటకు ‘సరోజ’ అనే హరిజన బాలికను పెంచుకొన్నాడు. గాంధీమార్గంలో నడిచి సమాజసేవ చేసినాడు. 

15. కర్పరాద్రిమహాత్మ్యం (2000) 

ఇది తాళ్ళపల్లి ఇమ్మడిశెట్టి చంద్రయ్యగారి కావ్యం. నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెరగట్టు చరిత్ర. విచిత్రమైన, అద్భుతమైన జానపద చారిత్రక గాథ. అవతారిక మొదలుకొని చివరి ఆశ్వాసాంత గద్యంవరకు ధారాళమైన శైలీ సౌభాగ్యంతో పాఠకులను అలరిస్తుంది. పరిష్కృత రచన. 

16. ధీరజనమనోవిరాజితం (2000) 

తెనాలి రామలింగకవి కృతం. ఇది ఏకాశ్వాస ప్రబంధం. చోళమహారాజు ఆస్థానంలో ఉన్న విశ్వకర్మీయులకు అమరుడు తలపెట్టిన అపకారం, గోపరాజు రామన్న విశ్వబ్రాహ్మణులకున్న కరణీకాలను తొలగించిన విధానం అనే రెండు వృత్తాంతాలు పద్య గద్యాలలో ఉన్నాయి. క్రీ.శ 17వ శతాబ్దానికి చెందిన ఈ కావ్యాన్ని విపుల పీఠికతో పరిష్కరించి ప్రచురించినారు. 

17. మనోబోధశతకం (2001) 

శ్రీ గురవయకవి రచించిన ఈ శతకం ద్వైతాద్వైత సిద్ధాంత ప్రబోధకం. ఇది వేదాంత కృతి. తెలంగాణ మాండలికంలో ఉన్న ఈ గ్రంథం పీచుప్రతి నుండి పరిష్కరించినారు. 

18. యయాతిచరిత్ర (అచ్చ తెలుగు కావ్యం) (2001) 

పొన్నగంటి తెలగన్న రచించిన అచ్చ తెలుగు కావ్యము. దీని ప్రవేశికలో గ్రంథాన్ని రచయితను, గ్రంథాన్ని అంకితం పొందిన అమీర్ ఖాన్ గురించి ఎన్నో కొత్త విషయాలను వెల్లడించినారు. గ్రంథకాలంనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులను విపులంగా చర్చించినారు. టీకా తాత్పర్య విశేష వ్యాఖ్యాన సహితంగా పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయంవారు ప్రచురించినారు. 

19. శ్రీబుద్ధారంగండి రామలింగేశ్వరశతకము (2001) 

దేవరాజు వేంకటలక్ష్మణరావు విరచితము. దీనిని రామలింగేశ్వరునిపై విసర్గ ధోరణిలో రచించినారు. శ్రీ గోనబుద్ధారెడ్డి సాహితీ సాంస్కృతికసమితి వారు ప్రచురించినారు. 

20. శారదరామాయణం (2002) 

ఇది వలపట్ల వెంకట రామకవి కృతం. తాళపత్ర ప్రతినుండి ఉద్ధరించి పునర్వసు శారదలో ప్రకటించినారు. శ్రీ శారదరామాయణకీర్తనలు సంగీతదర్వుతోనే కాక కథాదృష్టిలో గూడ చిరస్మరణీయమైనవి. 

21. మనోబుద్ధిర్వివాదం (2002) 

చేపూరి పెదలక్ష్మయ్యగారి సంకలన కృతి. పరమపద సోపాన మార్గ సహితం. విపుల పీఠిక తాత్పర్యంతో 

పరిష్కరించినారు. 

22. సత్యనారాయణ వ్రతకథ (2004) 

చేపూరిపెదలక్ష్మయ్య గారు షోడశోపచార కీర్తనలు, వ్యవహార భాషలో వ్రతకథలు రచించినారు. ఈ సత్యదేవుని కథాసంకీర్తనం సంప్రదాయమైన పద్ధతిలో ఉంది. ఇందులోని ప్రతి కీర్తన సరళమైనశైలిలో ప్రాచీన పద్ధతిలో నడిచింది. పరిష్కరించి ప్రచురించినారు. 

23. అచలతత్వాలు (2005) 

చేపూరి పెదలక్ష్మయ్య గారు అచల మార్గానికి చెందిన కవి. ఈ సిద్ధాంతాన్ని కందార్థాలు, తత్వాల రూపంలో ప్రచారం చేసినారు. వీరగురుని కాలజ్ఞానవచనాలను స్మరణకు తెచ్చే ఇందులో గురుస్తుతి, గాయత్రీ మంత్రార్ధం తదితరాలు నిక్షిప్తం చేసినారు. 

24. ఉప్పునూతలకేదారేశ్వరశతకము (2006) 

దరెగోని శ్రీశైలం కృతి. అంత్యానుప్రాస మకుటంతో భాసిస్తున్న 102 సీసపద్యాల శతకము. అచ్చంపేట దగ్గర నున్న ఉప్పునూతల కేదారేశ్వరస్వామిపై రచించినారు. ఇది కాళహస్తీశ్వర శతకమును స్మరణకు తెస్తుంది. 25. కందిమల్లయ్యపల్లి పోతులూరి వీరబ్రహ్మశతకం (2007) 

ఒరా విశ్వనాథకృతి. యతిప్రధానశతకం. శతక రచనలో ఒక కొత్త ఒరవడి. ఒద్దిరాజు సోదరులు 1927లో విజ్ఞాన ప్రచారిణీ గ్రంథమాల సహకారంతో ప్రచురించినారు. తర్వాత 2007లో విజ్ఞానాశ్రమం మహబూబాబాదువారు పరిష్కరింపజేసి విపులమైన పీఠికలతో ముద్రించినారు. 

26. ఆరు అముద్రితశతకాలు (2007) 

పాలమÖరు జిల్లాలో లభించిన ఆరు శతకాలను తాళపత్ర ప్రతులనుండి ఉద్దరించి పరిష్కరించినారు. శతక కవుల పరిచయాలు సమకూర్చి ‘పెన్గులూరికవుల పరిచయం’ పేరుతో ప్రత్యేక సంపాదకీయం కూడ కూర్చినారు. ఈ గ్రంథం ఆంధ్రప్రదేశ్ ప్రాచ్య లిఖిత పుస్తక భండాగారం గారి ప్రచురణలు.

27. బసవపురాణసారం (2007)

గొబ్బూరి వీరసంగయ్య రచించిన ఈ బసవపురాణ సారాన్ని నాగలింగ శివయోగిగారు అచ్చువేయించినారు. సాధారణ కావ్యసాహిత్యం కంటే మతపరమైన పద్యసాహిత్యం పరిష్కరించటం ఎంతో కష్టసాధ్యం. ఇది సమర్ధవంతంగా నిర్వహించి సాహీతీ ప్రియులకు అందించినారు.

28. శ్రీహనుమచ్ఛతకము (2007)

బండ్లబాలకిష్టయ్యగారు పామరగడ్డ హనుమంతునిపై సమీరపుత్ర అనే మకుటంతో రచించినారు. శతకం మొత్తం ఏకప్రాసతో ఉండి ఆంజనేయభక్తితోపాటు సామాజికాంశాల్ని గూడ స్పృశించింది.

29. కృష్ణనమస్కారశతకం (2008)

రెండు శతాబ్దాల ప్రాచీనత గలిగిన అజ్ఞాత కవి విరచితం. “కృష్ణ స్వామికిన్ మ్రొక్కెదన” మకుటం ఇందులో విలక్షణమైనది.భాగవతం లోని కృష్ణుడు మురళిని మ్రొగించడం కవి ఆలోచనలోని ప్రత్యేకత. భాగవతంలోని కృష్ణలీలలు, కథలతో నిండి ఉన్నదీ శతకం. పరిష్కరించి ప్రచురించినారు.

30. గురుత్రయస్తోత్రం (2008) 

మల్లేపల్లి శేఖర్రెడ్డి రచన. శంకరాచార్యుల భజగోవిందము, రామానుజాచార్యుల భజయతిరాజం, అప్పణాచార్యులు రాఘవేంద్రస్వామిస్తోత్రం సంస్కృతం నుండి తెలుగులోనికి స్వేచ్ఛానువాదం చేసినారు. మÖలంలో ఉన్న శ్లోకాల సంఖ్యను 108కి పెంచినారు. శంకర భగవానుల, రామానుజుల, రాఘవేంద్రస్వామి అష్టోత్తర శతనామావళి కూడ చేర్చినారు. 

31. ఆత్మైకబోధ (2008) 

యోగానందావధూత ద్విపదలో వ్రాసిన దీనిని తాళపత్రప్రతినుండి ఉద్ధరించి పరిష్కరించినారు. ఈయన దత్త సాంప్రదాయానికి చెందినవాడు. యోగానందావధూత ద్విపాదములను మడిచి సుఖాసీనుడై పలికిన ఈ సూక్తులు భక్తజనులకెల్ల బ్రహ్మరూపకమై ముక్తిదాయకమై ఆనందాన్ని కూర్చుతున్నవి. 

32. శ్రీశ్రీశ్రీ యోగినీశంకరాంబగారి జీవితచరిత్ర (2008) 

రామదాసురామగోపాలాచారి గారి రచన. శంకరాంబగారు జన్మసిద్ధంగానే యోగిని. త్యాగరాజువలె 96 కోట్ల రామనామ జపం చేసిన సాధకురాలు. చీకటిమామిడి రాఘవాచార్యులగారి శిష్యురాలు. దీనిలో ఆమె చరిత్ర సులభశైలిలో వివరించినారు. 

33. దైవభైషజ్యము (2009) 

మహర్షి పెద్దశాలన్న రచన. ఔషధ ద్రవ్యములచేత రోగికి దీపనాదులు కలిగించుట ఔషధ చికిత్సయని, ీVAరీమము, వ్రతము, తపము, దానము మరియు శాంతికర్మలచే రోగనివారణ గావించుట భేషజమని చెప్పినారు. ఈ పద్ధతిలో దైవముపై భారమువేసి పుణ్యకర్మలు చేయవలసియుండును. ఆ పద్ధతులన్నీ దీనిలో 

వివరించినారు. 

34. గురుభజనకీర్తనలు (2009) 

చిగుళ్ళపల్లి సుశీలకృతి. ఆమె తూడుకుర్తిలో మÖడు దినాలు తండ్రిగారి ఆరాధన మరియు భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఆ పరవశంలో అంతరంగంలో ఉప్పొంగిన భావాలను పాటలుగా మలుచుకొని కుమారుల చేత వ్రాయించి భద్రపరచినది. అవే ఈ కీర్తనల రూపంలో ప్రచురించినారు. 

35. అచలానందం-మంజరి (2010) 

అచలమార్గానికి సంబంధించిన చేపూరి పెద్దలక్ష్మయ్యగారి కృతి. అచలసిద్ధాంత నిరూపణం చేసినారు. అచలమంటే చలనం లేనిది. సాంఖ్యము, తారకము, అమనస్కము అభ్యసించిన తరువాత తురీయమునందు నిల్చిన స్థితియే అచలము. అది అమృతము, అచ్యుతము. ఇట్టి తురీయస్థితియందే అచల పరిపూర్ణతత్వము అనుభూతమవుతుంది. మనసు విషయవాంఛచే బంధలగ్నమవుతుంది. అమనస్కస్థితి, సహజ మనస్కం శీర్షిక క్రింద ఈ గ్రంథస్థ విషయం విశదీకరించి, పరిష్కరించి ప్రచురించినారు. 

36. వివేకశంఖారావం (2010) 

మల్లేపల్లి శేఖర్రెడ్డిగారిచే రచింపబడిన గేయ పద్యసంకలనం. ఇవన్నీ ఏకకర్తులేగాని ఏకకాలికాలు కావు. ఏకాత్మకాలు కాని ఏకముఖాలు కూడా గావు. ఇందులోని కవితలన్నీ అతని హృదయంలో కలిగిన స్పందనకు ప్రతిరూపాలు. 

37. విశ్వకర్మ పంచబ్రహ్మల యజ్ఞం (2010)

పంచబ్రహ్మలకు సంబంధించిన విశ్మకర్మ మంత్రములను వేదముల నుండి ఒకచోటికి చేర్చి నారాయణదాసు శ్రీరామాచార్యులు ఈ పస్తుకాన్ని రూపొందించినారు. పంచబ్రహ్మల ఆరాధనచే సకల కార్యాలు సిద్ధిస్తాయి. 

38. సంక్షిప్త ఆబ్దిక విధానం(2011)

తాడేపల్లి వీరరాఘవశర్మరచన. ఆబ్దిక ప్రయోగంలో మానవుడు మరణించిన తరువాత వ్యక్తి చేయవలసిన అపరకర్మల అంతరార్థం వివరించినారు. వైదికాగమ కర్మ విశేషాలు మంత్రసహితంగా ఉన్నాయి. పితృపూజ, మండల పూజ, తర్పణాలు మొదలగు వివరాలు, పద్ధతులు శాస్త్రోక్తంగా తెలిపినారు. 2011 సం॥లో ప్రథమ మరియు 2012 సం||లో ద్వితీయ ముద్రణ ఎమోస్కో పబ్లిషర్ష్ వారు ప్రచురించినారు.

39. శ్రీకరస్థలనాగలింగేశ్వరస్వామి చరిత్ర (ద్విపద) (2011) 

ద్విపద కావ్యం. 18వ శతాబ్దానికి చెందిన నాగెళ్ళశివమÖర్తి రచన. కరస్థల నాగలింగేశ్వరస్వామి “విశ్వకర్మ శైవ బ్రాహ్మణ వంశోద్భవుడు”. ఈ కావ్యానికి సరళ సుందర వచన కథా సంగ్రహాన్ని రచించి పరిష్కరించినారు. వెంకటాచలమహాత్మ్య సహితం (2012) 

40. రామగిరి-రామయోగిచరితం-వెంకటాచలమహాత్మ్యం సహితం (2012)

రామయోగి చరిత్రం మహంతుబాబా మహిమలను ఇతివృత్తంగా తీసుకొని మొలుగర రంగారావు గారు రచించిన పద్య ఖండిక. వెంకటాచలం మహాత్మ్యం మరింగంటి రాఘవాచార్యులు రామగిరిమీద ముచ్చటగా మÖడు రోజులలో వినిపించిన హరికథ. ఈ రెండు కృతులు డా. కపిలవాయి లింగమÖర్తి పర్యవేక్షణలో మల్లేపల్లి శేఖరరెడ్డి సంపాదకత్వంలో వెలువడినవి. 

41. కవితాకదంబం (2012) 

యం.డి. జహంగీర్ రచించిన పద్య ఖండికలు. పాలమÖరుచరిత్ర, సంస్కృతి, పాలమÖరు లేబరు బ్రతుకులు, నేటి సమాజ సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతూ వ్రాసినారు. పాలమÖరు పల్లె పదాలను వాడినారు. 

42. గేయగుచ్ఛం (2013) 

యం.డి. జహంగీర్ రచన. సామాజిక సమస్యలను గురించి వ్రాసిన గేయాలు. నేటి సామాజిక సమస్యలను సునిశితంగా పరిశీలిస్తూ ప్రజలపక్షాన ఆలోచించి వాటికి కవిత్వరూపాన్ని ఇచ్చినాడు. 

43. తారాతోరణం (వీడ్కోలు ప్రబంధం) (2013) 

యం.డి. జహంగీర్ రచన. సన్నిహితులు, స్నేహితులు జీవిత విశేషాలను, వ్యక్తిత్వాలను, నిజాలను, సాంసారిక జీవితసారాన్ని పద్యపదబంధంలో బంధించినారు. పదవీ విరమణ సందర్భంగా అందించిన గుచ్చాలు. 44. మార్కండేయచరిత్రము (2013) 

పుట్టా లక్ష్మీనారాయణ రచన, పద్మశాలీయుల కులదైవమైన మార్కండేయస్వామిపై రచించిన గ్రంథం. మార్కండేయ జీవితచరిత్ర కథలు గ్రాంథిక భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఉన్నవి. ఇది ఎన్నో ఏళ్ళు అముద్రితంగా ఉన్నది. పద్మశాలీయులేగాక ఇతర కులస్తులందరూ తప్పక చదవాల్సిన కులపురాణమిది. 

45. పద్మకల్పప్రకాశిక (2013) 

పుట్టా లక్ష్మినారాయణ రచన, విపుల పీఠికతో పరిష్కరించినారు. 

46. శ్రీమదాంధ్రపూర్ణాచార్యప్రభావము (2014) 

దొంతి పట్టాభిరాంరెడ్డి కృతి. విపుల పీఠికా సహితంగా వైద్యం వేంకటేశ్వరాచార్యుల వారితో కలిసి పరిష్కరించి ప్రచురించినారు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యం చేసి సుప్రతిష్టం గావించిన కారణజన్ములు భగవద్రామానుజులవారు. ఆయన స్థాపించిన 74 పీఠాలలో ఆంధ్రపూర్ణాచార్యులు ఒక పీఠానికి అధిపతి. వీరిని గురించి మరుగున పడిన అనేక విశేషాలు ఇందులో వివరించినారు. 

47. ఇంద్రేశ్వరభజనమాల (2015) 

బొడ్డు నర్సింహులు రచన. మరుగునపడిన భజన కీర్తనలను జనరంజకంగా పరిష్కరించినారు. 

48. ఉమామహేశ్వర వ్రతము (2015) 

గంగవరం చింతామణి నరసింహాచార్యుల రచన. ఈ గ్రంథాన్ని పరిష్కరించి వ్రతారంభమునకు ముందు ఆచరించవలసిన పూజావిధానమున సులభమైన శైలిలో వివరించినారు. 

49. విశ్వకర్మకులదీపకులు (2016) 

దువ్పల్లిశ్రీరాములు రచన. పాలమÖరు జిల్లాలోని విశ్వకర్మ ప్రతిభామÖర్తులు పరిచయం. మనుమయాదివర్గవిభాగంగా 150 మంది వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, కళామÖర్తుల చరిత్రలు వివరించినారు. రచయిత స్వయంగా అన్ని ప్రదేశాలు తిరిగి చరిత్ర సేకరణ జరిపినారు. 

50. ఔట్ పేషెంట్ (2016) 

డా. బి. బాలనారాయణ రచించిన నాటిక. గ్రామాలలోని ప్రజలు ప్రభుత్వ దవాఖానాలకు వెళ్లకుండా మంత్రగాళ్లు, నాటువైద్యుల చుట్టూ తిరిగి కొనితెచ్చుకునే కష్టాలను హాస్యరసపూర్వకంగా వివరించినారు. 

51. అమడబాకుల శ్రీకళ్యాణలక్ష్మీవెంకటేశ్వరీయం (2017) 

దుప్పల్లిశ్రీరాములు రచన. ఇది కొత్తకోట మండలంలోని గ్రామం. స్వయంభూలక్ష్మీ వేంకటేశ్వరుని చరిత్ర. అద్భుత లీలలు, గ్రామంపేరు రావడం వెనుక చరిత్ర, రచయిత అనుభవాలు వివరించినారు. దీనిలో క్షేత్ర వైభవాన్ని కన్నులకు కట్టించినారు. 

52. నిర్వచనశిల్పకళావిజయము (2020) 

ఇది మన్నె రాములు రచన-ఏకాశ్వాస కావ్యము. ఈ కృతిలో ధార ఉంది. కవిత్వముంది కాని గణయతి ప్రాసలు లేవు. మరుగున పడిన ఈ కావ్యాన్ని ఎం.డి. జహంగీర్ శ్రమకోర్చి ముద్రించినారు.

 

ఉపసంహారం

మన వలసవాద సంస్కృతి, ఆధునిక సంస్కృతి కలిసి జమిలిగా వచ్చాయి. ఈ రెండిటిలో ఏదిఏదో మనం విడదీసుకోలేక పోయాం, సాహిత్యపోరాట సమయంలో మనం కావాలని కోరుకున్నది రాజకీయ స్వాతంత్య్రమే మనం ఇంగ్లీషు వల్లనే ఆధునికమయ్యామని ఇంగ్లీషు లేకపోతే మనం పాతకాలపు మÖఢ నమ్మకాలతో కూరుకుపోయి ఉండే వాళ్ళమని మన సాంస్కృతిక నాయకులు నమ్మారు. ఈ నమ్మకానికి పొడిగింపే మనలో ఇంకా మిగిలిపోయిన బ్రౌన్ ఆరాధన మనదైన ఒక సంస్కృతి ఉన్నదని దాన్ని అనుసరించాలి. కాని పాశ్యాత్య భావద్యాసంలో పడిపోకూడదనే మాటలైతే మనకి తరచు వినిపించేవే కాని ఆయన సంస్కృతి ఏమిటో స్పష్టంగా అర్ధం చేసుకోవడానికి మనం ప్రయాత్నించలేదు. పైగా వలస పాలకులు అనుగ్రహ దృష్టితో మనకి నేర్పిన కొత్త సంస్కరణలో ఏవి మనకి పనికి వచ్చేవో, ఏవి బావి కింద నీరులా మన ఆలోచనల్ని మార్చేస్తుంటే అమాయకంగా ఆధునికత పేరుతో అవన్నీ మనకి అవసరమని మనం నమ్మి, వాటినే ఆ సంస్కరణలు తెచ్చిన వాళ్ళనీ ఆరాధనా బుద్ధితో పూజిస్తున్నామో మనకి ఇప్పటికి బోధపడటం లేదు.

పాతని పునరుద్ధరించాలని గత రెండువందల సం॥లలో ఆధునిక నాగరికత పొందిన ప్రయోజనాలని తిరస్కరించాలనే అభిమతం నాది కాదు. పాత సాహిత్యాన్ని పాత పాఠకుల శ్రోతలు ఉపయోగించుకున్న సందర్భాలని తిరిగి బోధపరచుకొని ఆ సాహిత్యం ఏ రకంగా ఉండేదో గమనించి దాని మÖలకంగా అప్పటి విధానాలని తెలుసుకోవచ్చు. అట్లా బోధపరుచుకున్న పద్ధతులు మళ్ళీ ఉన్నవి ఉన్నట్లుగా అమలులో గుడ్డిగా పెట్టకుండా అవగాహక దృష్టితో పరిష్కరించారు కపిలవాయిలింగమÖర్తిగారు. వారు అలా పరిష్కరించిన 52 పరిష్కరణ గ్రంథ రాజముల్లో ఒకటైన యోగసక్తా పరిణయ ప్రబంధంపై నేను (పి.హెచ్.డి.) పరిశోధన చేస్తున్నాను.

అలాగే సాహితీ పాఠకులు, నేడు పరిశోధన రంగంలో అడుగులిడుతున్నవారు వీరి పరిష్కృత గ్రంథాలపై గాని, ఇతర రచనలపై గాని దృష్టి సారించినట్లయితే శ్రీ కపిలవాయి లింగమÖర్తి వంటి కవి రత్నాల సాహిత్య కృషికి వన్నెవాయని కీర్తి కిరీటం లభిస్తుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి