సినిమా పాటలను అక్షర రూపంలో సేకరించడం, వాటిని శ్రవ్యరూపంలో
ఆడియో కాసెట్లుగా రూపొందించడం ఒక పని. మరి కాస్త ముందుకు వెళ్లి ఆ
పాటలన్నిటిని దృశ్యరూపంలో వీడియో తయారు చేయించడం మరొకపని. అవన్నీ
అకారాదిగా, సవివరంగా తయారు చేయడం అనేది నిజానికి ఒక అద్భుత ప్రక్రియ.
దీనికి భైరవభొట్ల వేంకట నారాయణరావు ఆద్యుడు. ఈయన కృష్ణాజిల్లా, గుడివాడ
నుండి ప్రారంభించిన చలనచిత్ర పరిశోధన కేంద్రం, ఆయన చేసిన పరిశోధన
దేశవ్యాప్తంగా పరిశోధకులందరికీ ఒక దిక్సూచిలాగా ఉపయోగపడాలని, తెలుగు సినీ
ప్రాభవాన్ని ప్రపంచాని- కంతటికీ చాటాలనేది ప్రధాన లక్ష్యం, సంకల్పం కూడా.
ఈ ప్రయత్నంలో భాగంగా భైరవభొట్ల తనకున్న విస్తృత పరిశోధన
జ్ఞానంతో రూపొందించిన సినీ గేయకోశాలను గురించి ఈ అధ్యాయంలో చర్చించడం
జరుగుతుంది.
3. 1. సినీ గేయ కోశాలు - ప్రేరణ :
భైరవభొట్లకు “శంకరాభరణం” చిత్రాన్ని హిందీలోకి అనువదించిన
తర్వాత, ఆయనలో మరింత ఉత్సాహం కలిగింది. ఆ ఉత్సాహంతోనే భైరవభొట్ల తన
పరిశోధనను మరింత విస్తృతం చేశాడు. మరిన్ని హిందీ సినిమా పరిశోధనా గ్రంథాలు,
హిందీ, తెలుగు సినిమా పత్రికలు నిశితంగా పరిశీలించేవాడు. జీవితం అలా నిరంతర
పరిశోధనగా సాగిపోతుండగా కాన్పూరుకు చెందిన హార్ మందిర్ సింగ్ హమురాజ్
అనే వ్యక్తి హిందీ సినిమాల గురించి, హిందీ సినీగేయకోశం నాలుగు సంపుటాలుగా
ప్రచురించాడని తెలుసుకున్న భైరవభొట్ల, వాటిని ఆయన దగ్గర నుండి
తెప్పించుకున్నాడు.
ఈ నాలుగు గ్రంథాల్లోని ప్రత్యేకత ఏమంటే, 1931 నుండి 1970 వ
సంవత్సరం వరకు విడుదలైన హిందీ చిత్రాలను సంవత్సరాల వారీగా యిస్తూ, ఆ
చిత్రాల్లోని పాటల పల్లవులను, వాటికెదురుగా ఆ పాటల రచయితలు, సంగీత
దర్శకులు, గాయనీగాయకులు, నిర్మాత, దర్శకుడు, నిర్మాణ సంస్థ వంటి
వివరాలన్నింటినీ రాసి పరిశోధనాత్మకంగా గ్రంథాలు ఉండడం.
భైరవభొట్ల వాటిని చూసి ప్రభావితుడై ఇలాంటి గేయ కోశాల్నే తెలుగులో
కూడా రూపొందించాలని ధృడంగా భావించాడు. అదేవిధంగా సూరత్ కు చెందిన
హరీష్ రఘువంశీ అనే ఆయన ముకేష్ గీత్ కోష్ ‘ అనే గ్రంథాన్ని సంకలనం
చేశాడని భైరవభొట్ల తెలుసుకున్నాడు. ఆ గ్రంధంలో ముకేష్ పాడిన పాటల సమగ్ర
వివరణ లతో పాటు ఆర్.పి.యం. (=.P.వీ), ఇ.పి. (జు.P.) గ్రామ ఫోను రికార్డు
సంఖ్యల వివరాలు కూడా ఉండడం అందులోని విశేషం. అలా ఆ రెండు పుస్తకాలు
ఇచ్చిన స్ఫూర్తితో భైరవ భొట్ల తెలుగు సినీ గేయ కోశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు.
తెలుగు సినీ గేయ కోశాలను తయారు చేయడంలో భైరవ భొట్ల అటు
ఎదుర్కొన్నాడు. ఆర్ధికంగా చాలా తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. అందుకనే
టి. వేంకటపతిరాజు అనే భైరవ బొట్ల మిత్రుడు. భైరవభొట్ల సినీపరిశోధన గురించి
చెప్తూ “చిత్తు కాగితాన్ని కరెన్సీగా, కరెన్సీని చిత్తు కాగితం లాగా చూసి భైరవభొట్ల
తెలుగు సినిమా పాటల పరిశోధనల్ని అభివృద్ధి చేశాడు అని చెప్పాడు. ఇది అక్షర
సత్యం.
భైరవభొట్ల సారథ్యంలో ‘మంగళహారతులు’(1988),’
ఘంటసాల గానసుధ’ (1989), కొంగర జగ్గయ్య సంపాదకత్వంలో వచ్చిన
‘ఆత్రేయ సినీ సంకలనాలు’(1990) అనే గ్రంథాలు వచ్చిన తర్వాత సినిమా
పాట అనేది భైరవభొట్ల ఇంటి పేరుగా మారి పోయింది. అనేక విశ్వ విద్యాలయాల్లో
తెలుగు సినిమాలపై పిహెచ్.డి చేసే పరిశోధకులకు, ఇతర సినీ విశ్లేషకులకు
భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రం ఒక ప్రధానక్షేత్రంగా, జ్ఞాన భండారంగా
మారిపోయింది. భైరవ భొట్లకు ‘ ఎన్ సైక్లో ఫిడియా ఆఫ్ ఫిల్మ్ సాంగ్స్ ‘ అనే
బిరుదు స్థిరపడి పోయింది. అప్పటినుంచి దాదాపు అన్ని దిన పత్రికలు భైరవ
భొట్లను వివిధ సందర్భాల్లో ప్రశంసిస్తూ, ప్రచురించడం అతని ఘనతకు, కృషికి
నిదర్శనం.
1.వెంకటపతి రాజు, విజయవాడ, ముత్యాలం పాడు నివాసి, తెలుగు నాటక రచయిత,
బహు గ్రంధ సేకర్త,.
3.1.1. కొసరాజు సినీ గేయకోశం :
గుంటూరు జిల్లా, నర్సారావుపేట లోని కొత్త రఘురామయ్య తెలుగు
ఉపన్యాసకుడుగా పని చేస్తున్న జూనియర్ కళాశాలలో నల్లూరి రామారావు “కొసరాజు
కవితా వైభవం” మీద నాగార్జున విశ్వ విద్యాలయం లో పిహెచ్.డి చేయడానికి పాటల
కోసం భైరవభొట్ల ను అడిగాడు. భైరవభొట్ల, ఆయన కోసం తన దగ్గరున్న హిందీ సినీ
గేయ కోశాల్ని దృష్టిలో పెట్టుకొని అదే పద్ధతిలో ‘కొసరాజు సినీ గేయ కోశం’
రూపొందించి అందించాడు. వీటి రూపకల్పనలో కొత్తపల్లి హనుమంతరావు బాగా
సహకరించాడు. ఆయనతో కలసి భైరవభొట్ల, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఒకటిన్నర
సంవత్సరం కాలంలో కొసరాజు సినీ గేయకోశాన్ని రూపొందించాడు. కె.వి. మహ
దేవన్, పుహళేంది ల మధ్య ఎంతటి ఆత్మయానురాగ బంధం ఉండేదో, అదే విధంగా
భైరవభొట్ల, కొత్త పల్లి హనుమంతరావుల మధ్య కూడా అలాంటి ఆత్మయ స్పర్శే
ఉండేది. అందుకే ఆయన మరణించి కొన్నేళ్లు గడచి పోయినా భైరవభొట్ల ఆయనను
మరచిపోలేక పోతున్నాడు.
కొసరాజు సినీ గేయ కోశాన్ని 3 భాగాలుగా, ఆయన మొదటి చిత్రం
సారథి వారి “ రైతుబిడ్డ (1939) చిత్రం నుంచి “గురుబ్రహ్మ” వరకు భైరవభొట్ల తన
‘చలనచిత్ర పరిశోధనా కేంద్రం’ లో లభ్యమైన పాటల పుస్తకాల ఆధారంగా
సుమారు 700 పాటల్ని సినీ గేయ కోశ ప్రక్రియలో, సంవత్సరాల వారీగా
రూపొందించడం జరిగింది. ప్రతి పాటకు పై భాగంలో ఆచిత్ర నిర్మాణ సంస్థ పేరు,
చిత్రం విడుదలైన సంవత్సరం, నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు,
గాయనీగాయకుల వివరాలను ఇవ్వడం జరిగింది. ఈ మÖడు భాగాలకు
విషయసూచికలు కూడా తయారు చేశాడు. తర్వాత ఆ మÖడు భాగాల
విషయసూచికల్ని కలిపి ఒక భాగంగా తయారు చేసి, కొసరాజు సినీ గేయకోశానికి ఒక
ప్రధాన సూచికలాగా ఆయన రూపొందించాడు. ఇది కొసరాజుపై పరిశోధన చేసిన
నల్లూరి రామారావుకే గాక, అనేకమంది పరిశోధకులకు ఉపయోగపడు తున్నది.
మొదటి నుంచి కూడా భైరవభొట్లకు తన పరిశోధనలు అందరికీ ఉపయోగపడాలని,
ఒక చిరుదీపమే వేయి దీపాలను వెలిగించ గలదని ఒక ధృడమైన అభిప్రాయం
వుండేది . అది అలాగే నేటికీ కొనసాగుతుండడం సినీ పరిశోధకుల అదృష్టం.
కొసరాజు సినీ గేయ కోశాన్ని 02.10.1991 సంవత్సరంలో ప్రముఖ
సినీ నటుడు కొంగర జగ్గయ్య ఆవిష్కరించాడు. అప్పటి నుండి, మరణించేంత వరకు
కొంగర జగ్గయ్యే భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా ‘ కేంద్రాని’ కి గౌరవ
అధ్యకుడిగా వ్యవహరించాడు.
భైరవభొట్ల 26.10.2007 న విజయవాడలో కొసరాజు వర్ధంతి సభను
నిర్వహించాడు. ఆ సభకు విశిష్ట అతిథిగా వచ్చిన కొసరాజు భానుప్రసాద్ ( కొసరాజు
కుమారుడు), తన తండ్రి గారి సినీ గేయకోశాన్ని తానే ముద్రిస్తానని ప్రకటించాడు.
అదే సభలో కొసరాజు ఆడియో ఎం. పి. 3 సిడీని భైరవభొట్ల, కొసరాజు భాను ప్రసాదు
బహూకరించాడు. దాంతో పాటు కొసరాజు పాటలు రచించి, నటించిన సారథి వారి
‘రైతుబిడ్డ (1939) చిత్రాన్ని వీసీడి రూపంలో ఆయనకు భైరవభొట్ల అందించాడు.
3.2. డా. సి. నారాయణరెడ్డి సినీ గేయ కోశం :
భైరవభొట్ల రూపొందించిన సినీగేయ కోళాలు పరిశో ధకులకు
కరదీపికలయ్యాయి. గుంటూరు విద్వాన్ రెసిడెన్షియల్ కళాశాలలో సంస్కృతాంధ్రాల్లో
ఉపన్యాసకులుగా పని చేస్తున్న డా. ఉయÖ్యరు లక్ష్మీ నరసింహారావు రెండో
పిహెచ్.డి. చేసేందుకు డా. సినారె సినిమా పాటలు - పరిశోధన. తన పరిశోధనకు
ఎన్నుకున్నాడు. ఆయన భైరవభొట్ల గురించి తెలుసుకొని, విజయవాడ వచ్చి డా. సి.
నారాయణరెడ్డి సినీ గేయకోశాన్ని తయారు చేసివ్వమని భైరవభొట్లను అడిగాడు.
ఆయన కోరిక మేరకు భైరవభొట్ల, కొత్తపల్లి, హనుమంతరావు సహాయ సహకారాలతో
సినారె గేయకోశాన్ని మొత్తం 6 సంకలనాలుగా రూపొందించాడు. వాటిలో సినారె
పాటలు 1200 పైగా డా. సినారె సినీ గేయకోశంలో కూడా చిత్రంపేరు, అది విడుదలైన
సంవత్సరం, చిత్రం నిర్మించిన సంస్థ, నిర్మాత, దర్శకుడు, సంగీత, నృత్య
దర్శకులు, గాయనీ గాయకులు మొదలగు వివరాలతో “గులేబకా వళి కథ”
(1961) నుంచి ఈ గేయకోశాన్ని రూపొందించడం జరిగింది. ఈ సినీ గేయ కోశాలను డా.
సి. నారాయణరెడ్డే విజయవాడ లో ఆవిష్కరించాడు. ఆ సందర్భంలోనే సినారె
భైరవభొట్లను అక్షరాభినందన చేశాడు.
భైరవభొట్ల రూపొందించిన పై గీతకోశాల సహాయంతో డా. ఉయÖ
్యరు లక్ష్మీ నరసింహారావు తన పరిశోధన పూర్తి చేశాడు. భైరవభొట్ల పరిశోధన
బహుళ ప్రయోజన కారి అని, బహుళార్థ సాధకమని, బహుముఖమని ముందుగానే
చెప్పుకున్నాం. ఆంధ్రజ్యోతి వారపత్రిక వారు సినారెను ఆయన సినిమా పాటల
గురించి ఆయననే స్వయంగా వ్యాసాలు రాయమని కోరారు. దానికోసం నారాయణరెడ్డి
తన సినీ గేయకోశాలను భైరవభొట్ల నుండి పొందాడు.
ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి వారపత్రికల్లో అవన్నీ వ్యాసాలు రాశాడు.
వీటిని రాసేటప్పుడే సినారె భైరవభొట్లను ఎంతగానో అభినందించాడు. ఈ
వ్యాసాలన్నీ “ పాటలో ఏముంది - నా మాటలో ఏముంది” అనే పేరుతో రెండు
సంపుటాలుగా కూడా వెలుగులోకి వచ్చాయి. వీటిల్లో సినారె భైరవభొట్లను “తెలుగు
సినీ గీతాలు నిరంతర పరిశోధకులు” అని అభినందిస్తూ కృతజ్ఞతలు తెల్పడం
విశేషం. దీనిని బట్టి భైరవభొట్ల పరిశోధన బహుముఖమైనదని, బహుళ ప్రయోజన కారి
అయిందని తెలుస్తోంది. దీనికి చరిత్రే సాక్షి.
3.3. తెలుగు సినీ భక్తి గేయ కోశం :
వివిధ విశ్వ విద్యాలయాల్లో తెలుగు సినిమా పాటలను పరిశోధించే
పిహెచ్.డి. విద్యార్థులకు అవసరమైన, మÖలాధారమైన తెలుగు సినీ గేయకోశాల్ని
భైరవభొట్ల రూపొందిస్తాడనే వార్త తెలుసుకుని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం,
తిరుపతి - తెలుగు శాఖలో అప్పటికి రీడర్ గా పని చేస్తున్న డా. ఉగ్రాణం చంద్ర శేఖర
రెడ్డి, పరిశోధకుడైన టి. మున స్వామి (సూపరెంటెండెంట్, తి.తి.దే, తిరుపతి) లు
విజయవాడకు వచ్చి భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రాన్ని దర్శించారు.
ఆయన పరిశోధనకు ముగ్ధులై, డా. వి. చంద్ర శేఖర రెడ్డి విజిటర్స్ బుక్ లో
అక్షరాభినందన చేస్తూ, భైరవభొట్లని “పరిశోధక రాక్షసుడు” గా అభివర్ణించాడు.
1. డా.సి.నారె - పాటలో ఏముంది నామాటలో ఏముంది, మొదటి సంపుటం - 1996,
రెండో సంపుటం - 1998.
టి. మున స్వామి “తెలుగు సినిమాలలో హైందవ భక్తి పాటలు -
వైశిష్ట్యం’ అనే అంశం మీద పిహెచ్.డి. చేశాడు. ఆయన కోసం రెండు
సంవత్సరాల కాలవ్యవధిలో భైరవభొట్ల తెలుగు సినీ భక్తి గేయ కోశాన్ని
రూపొందించాడు. 1999 లో భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రంలో సినీ భక్తి
గేయ కోశాల ఆవిష్కరణ సభ జరిగింది. దానికి ప్రముఖ పాత్రికేయులు, పద్మశ్రీ
తుర్లపాటి కుటుంబరావు అధ్యక్షత వహించాడు. ఈ భక్తి గేయకోశాల ఆధారంగా టి.
మున స్వామి ‘తెలుగు సినిమాలలో హైందవభక్తి పాటలు - వైశిష్ట్యం’ అనే అంశం
మీద పరిశోధన చేసి 2002 లో పిహెచ్.డి. పట్టాను పొందాడు.
త్యాగదుర్గం మునస్వామి 20.03.1949న చిత్తూరు జిల్లా, చంద్రగిరి
మండలం, ముంగిలి పట్టు గ్రామంలో జన్మించాడు. త్యాగదుర్గం వెంకటముని, శ్రీమతి
రాజమ్మలకు ఆయన జన్మించాడు. ఈయన కలం పేరు మౌని. ఈయన తిరుమల -
తిరుపతి దేవస్థానంలో వివిధ ీVAదాలలో పని చేసి, 2007లో డిప్యూటి ఎగ్జిక్యూటివ్
ఆఫీసరుగా పదవీ విరమణ గావించాడు.
ఈయన తెలుగు సినిమాల్లో దాదాపు 300 పైగా హైందవ భక్తి పాటలను
పాఠాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల వారీగా పరిశోధనకు ఎన్నుకుని
విశ్లేషించడం జరిగింది.
మునస్వామి కోసం భైరవభొట్ల రూపొందించిన సినీ గేయకోశం 2 భాగాలు
కలిపి 481 పుటలతో తయారైంది. భైరవభొట్ల సినీ భక్తి గేయాల్ని 32 రకాలుగా విభజించి
మొదటి భాగంలో 16 రకాలు, రెండో భాగంలో 16 రకాలు మొత్తం 32 రకాల భక్తి
గీతాలను సినీగేయ కోశ ప్రక్రియలో రూపొందించాడు. ఉదాహరణకు మొదటి భాగంలో
త్రిమÖర్తుల పత్నులు, మÖడో విభాగంలో త్రిమÖర్తులకు సంబంధించిన గీతాలు,
రెండవ విభాగంలో వినాయకుడు, సరస్వతి, తులసి మొదలగు దేవతల భక్తి గీతాలు
ఉన్నాయి.
కొసరాజు, నారాయణరెడ్డి సినీ గేయకోశాలకు ఏ పద్ధతి అనుసరించారో
అదే పద్ధతిని సినీభక్తి గేయకోశంలో కూడా అను సరించాడు. ప్రతి పాటకు పైన చిత్రం
పేరు, చిత్ర నిర్మాణ సంస్థ పేరు, విడుదలైన సంవత్సరం, గీత రచయిత, సంగీత
దర్శకుడు, దర్శకుడు, నిర్మాత, నాట్య దర్శకుడు, గాయనీ గాయకుల వివరాలు
ఇస్తూ, గేయకోశాన్ని రూపొందించాడు. ఈ భక్తి గేయకోశం ఆబాల గోపాలానికి పారాయణ
గ్రంధమయ్యిందనడం అసత్యం కాదు.
భైరవ బొట్ల అందించిన సినీభక్తి గేయకోశం మునస్వామి పరిశోధన కొక
కరదీపికయ్యింది.
త్యాగదుర్గం మునస్వామి పరిశోధన చేయక పూర్వం రచయితగా పేరు
తెచ్చుకున్నారు. మౌన గాంధర్వం (1991) శ్రీ వేంకటేశ్వర సంకీర్తనా తరంగిణి
‘(1995), ప్రేమతరంగాలు భావ ‘ విహంగాలు’(2002), ‘శ్రీ వేంకటాద్రి
నాథ శతకం’(2003), శ్రీ అలమేలు మంగ శతకం (2005), ‘మౌనీలు’
(1006), ‘వెన్నెలమ్మ పదాలు’ (1006 ) ‘శ్రీ శ్రీనివాస సంకీర్తనా
తరంగిణి’ (2006), ‘ మౌని సూక్తులు’(2007) ‘శ్రీ పద్మావతి శ్రీనివాస
కల్యాణం’ (2007), ‘మౌని శతకం’ (2007) మొ. వి మౌని రచనలు.
నాలుగు దశాబ్దాలుగా కవిగా, రచయితగా నిరంతర సాహితీ ప్రయాణం
చేస్తున్నాడు. అనేక పురస్కారాలు, సన్మానాలు ప్రముఖ సాంస్కృతిక సంస్థల నుండి
అందుకున్నాడు.
భైరవభొట్ల రూపొందించిన సినీ భక్తి, గేయకోశాలు రెండు భాగాలను జె.పి.
పబ్లికేషన్స్ (విజయవాడ) వారు ‘తెలుగు సినిమాలలో భక్తి పారవశ్య గీతాలు’,
‘తెలుగు సినిమాల్లో భక్తి రసాత్మక గీతాలు’ అని 2 భాగాలుగా ప్రచురించారు. ఈ
గ్రంథాలు 23-12. 2004 న హైదరాబాద్ సిటీ కేంద్ర గ్రంథాలయ ఆవరణలో
ఆవిష్కరణ సభలో ఆవిష్కరించబడ్డాయి. ఈ గ్రంథాలు వెలువడిన తర్వాత భైరవ
భొట్ల ఖ్యాతి మరింత పెరిగింది.
3. 4. శ్రీ శ్రీ సినీ గేయ కోశ నిర్మాణం :
చలసాని ప్రసాద్, కృష్ణాబాయిలు 15.11.1987 న భైరవ భొట్ల
దగ్గరకు వచ్చి శ్రీశ్రీ రాసిన సినిమా పాటలను ముద్రించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
కానీ ఆ ప్రణాళిక పదేళ్లయినా కార్య రూపం దాల్చలేదు. అటు సాహిత్యంలో ఇటు సినీ
రంగంలోనూ సమాన
పేరు ప్రతిష్ఠలున్న మహాకవి శ్రీశ్రీ పాటలు, సినీ గేయకోశ రూపంలో లేకపోవడం
భైరవభొట్లకు మింగుడుపడలేదు. కనుక శ్రీశ్రీ సినీ గేయకోశాన్ని, శ్రీశ్రీ డబ్బింగ్ చిత్ర గీత
కోశాన్ని రూపొందించాలని ఆయన సంకల్పించాడు.
శ్రీశ్రీ సినీ గేయ కోశ నిర్మాణంలో ముందు ఆయన రాసిన స్ట్రెయిట్
చిత్రాల్లోని పాటలను, డబ్బింగ్ చిత్రాల్లోని పాటలను భైరవ బొట్లు విడివిడిగా తయారు
చేశాడు. యథా ప్రకారం చలన చిత్ర పరిశోధన కేంద్రం కాఫీయిస్టు కొత్త పల్లి
హనుమంత రావు ద్వారా ప్రతి పాటను 3 కాఫీలు రాయించాడు. శ్రీశ్రీ సినీ గేయకోశంలో
భాగంగా స్ట్రెయిట్ చిత్రాల్లోని పాటలను 3 భాగాలుగా, డబ్బింగ్ సినీ గేయ కోశాన్ని 3
భాగాలుగా మొత్తం 6 భాగాలుగా భైరవభొట్ల రూపొందించాడు. శ్రీశ్రీ తొలిసారిగా పాటలు
రాసిన “ఆహుతి” (1950) చిత్రం నుంచి “ప్రజాశక్తి” (1983) దాకా
స్ట్రెయిట్ చిత్రాలు, డబ్బింగ్ చిత్రాలను కలిపి మొత్తం 756 పాటలను 06
సంపుటాలుగా రూపొందించాడు.
05.01.1999 లో భైరవభొట్ల నిర్వహించిన దశమ వార్షికోత్సవ సభలో
ప్రముఖ సినీ గేయరచయిత వెన్నెలకంటి శ్రీ శ్రీ డబ్బింగ్ సినీ గేయకోశాలను
ఆవిష్కరించాడు. ఆనాటి సభలో వెన్నెలకంటి “డబ్బింగ్ సినిమా పాటల పుస్తకాలు
దొరకడం మహా కష్టం అయితే వాటిని సేకరించి, ఒక సినీగేయకోశాన్నే రూపొందించిన
భైరవభొట్ల కృషి ప్రశంసనీయం. ఆయన చేసిన ఈ పరిశోధనకు తెలుగు సినీ పరిశ్రమ,
సినీ పాఠకులు ఎంతో ఋణపడి ఉంటార’ని ప్రశంసిం విజయవాడలోని శ్రీశ్రీ
సాహిత్యనిధి కన్వీనర్ సింగంపల్లె అశోక్ కుమార్, శ్రీశ్రీ సినిమా పాటలను తాను
ముద్రిస్తానని భైరవ భొట్లకు హామీ ఇచ్చాడు. దానికి ఆయన ఎంతో సంతోషించి
14.10.1997 న శ్రీశ్రీ సినీ గేయకోశాన్ని అశోక్ కుమార్ కు అప్పగించాడు.
జీవితానికి ఒక ధ్యేయం కావాలి. ఆ ధ్యేయాన్ని సాధించే దీక్ష కావాలి.
(మైనరు బాబు, 1974) అన్న శ్రీశ్రీ పాటను భైరవభొట్ల అక్షరాలా తన జీవితానికి సార్థకం
చేసుకున్నాడు
3.5. ఆరుద్ర సినీ గేయ కోశ నిర్మాణం :
సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రను తెలుగు సాహితీ లోకానికి అందించిన
పరిశోధక తపస్వి ఆరుద్ర. ఆయన భైరవ బొట్ల చలన చిత్ర పరిశోధనా కేంద్రాన్ని
సందర్శించాడు. ఆ సందర్భంలోనే “శాస్త్రీయ పద్ధతుల్లో పరిశోధన చేస్తున్న సినీ
పరిశోధకులు భైరవభొట్ల సదా అభినందనీయుడు, ఆరాధనీయుడు” అని విజిటర్స్
బుక్ లో అక్షరా ఆనందన చేశాడు. అంతేకాకుండా చలన చిత్ర పరిశోధన
కేంద్రంలోని దృశ్య, శ్రవ్య మాధ్యమాల ద్వారా భైరవభొట్లు చేస్తున్న పరిశోధనా
ప్రయోగాలను వీక్షించి ముగ్ధుడై భైరవభొట్లను అభినందించాడు.
ఆరుద్ర అక్షరాలు, స్వరం చలనచిత్ర పరిశోధన కేంద్రంలో
సురక్షితంగా నేటికీ భద్రపరచబడి ఉన్నాయి. తెలుగు చలన చిత్ర గీతాలపై చెరగని
ముద్ర వేసిన ఆరుద్రకు అక్షర నైవేద్యంగా సినీగేయకోశాన్ని రూపొందించాలని
భైరవభొట్ల ఒక పరిశోధనా ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆయన రాసిన మొదటి చిత్రం “
బీదల పాట్లు” (1950) నుండి “కలలు కనే కళ్లు (1984) దాకా భైరవభొట్లకు
లభ్యమైన 1036 పాటలను ఆధారంగా చేసుకొని ఆరుద్ర స్ట్రెయిట్ చిత్రాల గేయకోశం
3 భాగాలుగా తయారు చేశాడు. తర్వాత “ శభాష్ రంగా” అని సినిమాతో
ప్రారంభమై “ ప్రేమించి పెళ్లి చేసుకో” అనే చిత్రం వరకు డబ్బింగ్ సినీ గేయ
కోశాన్ని ఒక సంపుటం గానూ ఆరుద్ర సినీ గేయ కోశాన్ని భైరవ భొట్లు రూపొం -
దించాడు. ఇందులో డబ్బింగ్ సినీ గేయ కోశాన్ని 2000 సంవత్సరంలో ఆరుద్ర
జయంతి సందర్భంగా విజయవాడలో భైరవభొట్లు ఆవిష్కరింప జేశాడు.
సంకల్పబలం, ఆత్మ స్థైర్యం రెండూ కలిస్తేనే ‘భైరవభొట్ల ‘ అని మరోసారి
ఋజువయ్యింది.
1. ఖీ.=.్పు. విజిటర్స్ బుక్, పుట. 41
3.6. ఆత్రేయ సినీ లఘుగేయ కోశం :
భైరవ భొట్లకు ఆత్రేయతో 1984 నుంచి 1989 లో ఆయన
మరణించేంత వరకు అవ్యాజమైన అనుబంధం కొన సాగింది. ఈ మధ్య కాలంలో
ఆత్రేయ భైరవభొట్ల సినీ గీతాల పరిశోధనను చూసి పరవశించి పోయాడు. ప్రతి
సంవత్సరం తన పుట్టిన రోజు పండుగకి భైరవభొట్లను ఆహ్వానించేవాడు. భైరవ
భొట్లను మళ్లీ తెలుగు, హిందీ సినిమాలలో రచయితగా చూడాలని ప్రయత్నించేవాడు.
1984 - 1988 మధ్యకాలంలో తాను రాసిన సినిమా పాటల
వివరాలు తెలిపే ‘సినీ లఘు గేయ కోశం’ రూపొందించాల్సి - నదిగా కోరాడు
ఆత్రేయ. అయితే ముందుగా sTÖ ఐదు సంవత్సరాలలో తాను రాసిన సినిమా
పాటలు తాలూకు గ్రామఫోను రికార్డుల నెంబర్లు, నిర్మాత, దర్శకుల వివరాలు, చిత్ర
నిర్మాణ సంస్థ పేరు వంటివన్నీ తొందరగా తనకు పంపించాలని, తద్వారా తనకు
రాయల్టీ రూపంలో కొంత ఆదాయం వస్తుందని భైరవభొట్లకు ఆయన ఉత్తరం రాశాడు.
దాన్ని చూడగానే భైరవభొట్ల ఆత్రేయ గీతాల వివరాలను 1984-1988 దాకా మొత్తం
108 పాటల వివరాల జాబితాను
1. భైరవభొట్లకు ఆత్రేయ రాసిన ఉత్తరం : 20-03 - 1988
సిద్ధం చేసి పంపించాడు. ఆతర్వాత భైరవభొట్ల, ఆ 108 పాటలనే సిద్ధం ‘ఆత్రేయ
సినీ లఘు వేయ కోశం’ అనే పేరుతో అక్షర సంపుటీకరణ చేశాడు. ఈ గేయ
కోశంలోని పాటల్ని కింది విధంగా సంపుటీకరించాడు.
చిత్రం పేరు
పాట పల్లవి
1. అనుబంధం (1984)
ఆనాటి ఆ స్నేహం
2. మహానగరంలో మాయగాడు (1984) హరికథా
3. భలే రాముడు (1984)
గడ్డివాము చాటుల్లో
4. మరో మొనగాడు (1985)
మనిషి లాంటి మనిషి
5. ఇల్లాలే దేవత (1985)
పువ్వులాగ నవ్వుకోవే
6. స్వాతిముత్యం (1986)
చిన్నారి పొన్నారి కిట్టయ్యా
7.సీతారామ కల్యాణం (1986)
రాళ్లల్లో ఇసుకల్లో
8. నిరీక్షణ (1986)
యమునా తీరే
9. డబ్బెవరికి చేదు (1987)
డబ్బెవరికి చేదు
10. ఉమ్మడి మొగుడు (1987)
రాముడంటి మంచి వాన్ని
ఆత్రేయ మరణానంతరం కొంగర జగ్గయ్య ఆత్రేయ సమగ్ర సాహిత్యాన్ని
ప్రచురణ చేసే నిమిత్తం “ ఆత్రేయ సాహితి” అనే శీర్షికతో, ఆయన సాహిత్యాన్ని 07
సంపుటాలుగా విభజించి అందులో 3 సంపుటాలను ఆత్రేయ సినిమా పాటలుగా
రూపొందించడానికి సంకల్పించాడు. ఈ మÖడు సంకలన భాద్యత జగ్గయ్య
భైరవభొట్లకే అప్పగించాడు.
భైరవభొట్ల, తాను రాసుకుని, దాచుకున్న ఏ చిత్తు కాగితం ఏనాడూ
వృధా కాలేదు. ఆయన రాసుకున్న అక్షరాలే తర్వాత చాలా మంది ప్రముఖులకు
లక్షలు సంపాదించిపెట్టాయన్నది నగ్న సత్యం.
3.1. దేవులపల్లి కృష్ణశాస్త్రి లఘు సినీ గేయ కోశ నిర్మాణం
దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన సినిమా పాటలు ఇంతకు మునుపే
సంకలనాలుగా వచ్చాయి. కానీ అవి సినీ గేయ కోశ ప్రక్రియలో లేవు. భైరవభొట్ల
‘చలనచిత్ర పరిశోధన కేంద్రం’ స్థాపించిన తర్వాత ప్రసిద్ధ సినీ కవులందరికీ సినీ
గేయ కోశ నిర్మాణం చేయడం జరిగింది. అదే రీతిలో దేవులపల్లి సినిమాపాటలకు
లఘు సినీ గేయ కోశం భైరవభొట్ల ఇచ్ఛికంగానే తయారు చేశాడు.
భైరవభొట్ల రూపొందించిన దేవులపల్లి సినీ లఘు గేయ కోశం లోని
ముఖ్యమైన పాటలను ఈ కింది విధంగా రూపొందించాడు.
చిత్రం పేరు
పాట పల్లవి
1. ధనవంతులు, గుణవంతులు (1974)
తెరచి వుంచేవు సుమా!
2. అమ్మ మనసు (1974)
శ్రీ శైల భవనా
మేలుకో
3. అన్నదమ్ముల కథ (1975)
తరలిరా జలధరా
4. చీకటి వెలుగులు (1975)
చీకటి వెలుగుల
5. బలి పీఠం (1975)
కుశలమా !
6. ప్రేమాయణం (1975)
మబ్బుల రాణి
వాసంలో
1. అమెరికా అమ్మాయి (1976)
పాడనా తెలుగు పాట
8. దేవుడే గెలిచాడు (1976)
గూడు ఏదైతేనేమి
9. ఈనాటి బంధం ఏనాటిదో (1977)
ఎవరు నేర్పేరమ్మా
10. మేఘసందేశం (1982)
ఆకులో ఆకునై
సినిమా పాటల పరిశోధనే ప్రాణంగా, అందుకు తన జీవితాన్నే పణంగా
పెట్టిన భైరవభొట్ల ధన్యజీవి.
38. వేటూరి సినీ పాటల సంకలనం :
వేటూరి సుందర రామమÖర్తి 02.12.1997 న భైరవభొట్ల చలనచిత్ర
కేంద్రాన్ని సందర్శించాడు. అక్కడ భైరవభొట్ల చేస్తున్న సినీ గీత పరిశోధనలకు
ముగ్ధుడై వేటూరి ఆయనను ‘అక్షర పూజారి’గా అభివర్ణించారు.
1. ఖీ.=.c. విజిటర్స్ బుక్, పుట-69.
విజయవాడకు చెందిన జయంతి చక్రవర్తి తెలుగు విశ్వ విద్యాలయంలో
వేటూరి సినిమా పాటలపై పరిశోధన చేస్తూ, పాటల కోసం భైరవభొట్ల దగ్గరకు
వచ్చాడు. అతనికి తన పాటలను ఇవ్వమని వేటూరి, భైరవభొట్లకు ఉత్తరం కూడా
రాశాడు. అలా భైరవభొట్ల జయంతి చక్రవర్తికి వేటూరి పాటలనన్నింటినీ ఇచ్చాడు.
వాటి సహాయంతో 2000 సంవత్సరంలో జయంతి చక్రవర్తి పిహెచ్.డి. డిగ్రీ పొందాడు.
3.9. సిరివెన్నెల సీతారామశాస్త్రి సినీ పాటల సంకలనం
ప్రముఖ సినీకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి 22.06.1998 న
చలనచిత్ర పరిశోధనా కేంద్రాన్ని సందర్శించాడు. భైరవభొట్ల పరిశోధనా కృషి
విస్తృతంగా ఉన్నదని, విలక్షణంగా ఉన్నదని, మీVAన్నత మైనదని” ఆయన
ప్రశంసించాడు. కొసరాజు, ఆత్రేయ, శ్రీశ్రీ వంటి కవుల సంకలనాలు చూసిన తర్వాత,
తన పేరు మీద కూడా సినీ గీతాల సంకలనం తయారు చేయమని భైరవభొట్లను
సీతారామ శాస్త్రి
కోరాడు.
1.ఖీ.=.c. విజిటర్స్ బుక్, పుట. 69
సిరివెన్నెల మొట్ట మొదటగా పాటలు రాసిన “సిరి వెన్నెల”
(1986) చిత్రం నుంచి 1998 సంవత్సరం దాకా మొత్తం 1200 పాటల్ని 6 సంపుటాలుగా
భైరవభొట్ల రూపొందించాడు. ఈ పాటల సంక లనాల కోసం కొన్ని పాటల పుస్తకాలు
లభ్యం కానందువల్ల విని రాసుకోవడం జరిగింది. మరికొన్నింటిని వీడియో క్యాసెట్ల
నుంచి ఆడియోను వేరు చేసి భైరవభొట్లను ఎత్తి రాయడం జరిగింది. ఇది చాలా
కష్టమైన పని అయినా ఒక పని అనుకుంటే దాని పూర్తి చేయడం భైరవభొట్ల నైజం.
జయంతి చక్రవర్తి, సహకారంతో, సీతారామ శాస్త్రి సినీ గేయ
సంకలనాలను కూర్చిన భైరవభొట్ల, వాటిని తానే స్వయంగా తీసు
కెళ్లి ఆయనకు అందజేశాడు.
3.10. తెలుగు సినీ దేశభక్తి గేయ కోశం
బరంపురం విశ్వవిద్యాలయంలో పంచాళ్ళ భామశ్రీ అనే పరిశోధకురాలు
1998 సంవత్సరంలో “తెలుగు చలన చిత్రాలలో దేశభక్తి గేయాలు” అనే అంశం
మీద పరిశోధన చేస్తూ, మÖల సామగ్రి కోసం భైరవభొట్ల సహాయమాశించింది. ఆమె
కోరిక మేరకు భైరవభొట్ల తెలుగు సినీ దేశభక్తి గేయ కోశం రూపొందించాడు. ఇందులో
‘ మాలపిల్ల (1938) దగ్గర నుంచి బాలమురళి ఎం.ఏ. (1988) దాకా భైరవ భొట్ల దగ్గర
లభ్యమైన తెలుగు సినిమా పాటల పుస్తకాల నుంచి పాటల్ని తీసుకుని ప్రతి పాట
మÖడు ప్రతులుగా రాయించి ఈ గేయకోశాన్ని రూపొందించాడు. దీన్ని జ్ఞానవికాస్
ప్రచురణ, విజయవాడ వారు ఆగస్టు, 2007 లో ముద్రించారు. “తెలుగు సినిమా
దేశభక్తి గీతాలు” అనే పేరున వచ్చిన ఈ పుస్తకం భైరవ భొట్లకు మంచిపేరు
తెచ్చింది. ఈ సంకలనంలో సినీ గీతాలే గాకుండా, విశ్వనాథ సత్యనారాయణ,
గురజాడ, వేములపల్లి శ్రీకృష్ణ మొదలగు వారు రచించిన దేశభక్తి, ప్రభోదాత్మక గీతాలు
కూడా చోటు చేసుకున్నాయి. ఈ గ్రంథాన్ని గుంటూరు శాసన సభ్యుడు తాడిశెట్టి
వెంకట్రావ్ ఆవిష్కరించాడు.
3-11. తెలుగు సినిమా శృంగార (శాస్త్రీయ) నృత్య గేయ కోశం :
తెలుగు చలన చిత్రాల్లో శాస్త్రీయ నృత్య గీతాలు అజరామరాలు.
సంగీత, సాహిత్య, నృత్య సమ్మేళనం రనజ్ఞులను ఎప్పటికీ మంత్ర ముగ్ధుల్ని
చేస్తుంది. నృత్యం మనసుల్ని ఆహ్లాద పరుస్తుంది. భైరవభొట్లకి బాల్యం నుంచి
సినిమాల్లోని నృత్యగీతాలంటే ఎంతో యిష్టం. తన అభిరుచి కోసమనే గాక,
పరిశోధకుల ఉపయోగార్థం కూడా ఇరవై ఏళ్ల క్రితమే ఈ నృత్య సినీ గేయకోశాన్ని
భైరవభొట్ల రూపొందించాడు. ఇందులో ‘ మల్లేశ్వరి (1951)లోని ‘ పిలచిన
బిగువటరా’ గీతం దగ్గర నుంచి అమెరికా-అమ్మాయి (1976) దాకా 60 సినిమాల్లోని
నృత్య గీతాలను ఈ గ్రంథంలో పొందుపరిచాడు. దీన్ని జె.పి. పబ్లికేషన్సు
(విజయవాడ) వారు పొందు పరిచారు. ఈ గ్రంథం ముందు మాటలో భైరవభొట్ల
రాసుకున్న “ నా వయసు అరవై, నా మనసు ఇరవై” అనే వాక్యం అందరినీ
ఆకట్టుకున్నది. చాలామంది నాట్యాచార్యులకు నాటా గురువులకు ఇది టెక్స్ట్సు బుక్
గా ఉపయోగపడుతున్నది. మార్కెట్టులో ప్రతులు చెల్లి పోతే, చాలామంది భైరవభొట్ల
దగ్గరకు వచ్చి ఆ పుస్తకాన్ని జిరాక్స్ తీయించుకొని వెళ్లారు. ఈ పుస్త కానికి మార్కెట్టులో
మంచి డిమాండు, ప్రముఖులు ప్రశంసలు ఉన్నాయి.
3.12. జిక్కి, ఏ.ఎం. రాజా తెలుగు సినీ గేయ కోశం :
1991 సంవత్సరంలో విజయవాడలోని శారద కళాసమితి కార్యదర్శి
అయిన డోకివర్తి శంకర రావు తమ కళాసంస్థ వార్షి కోత్సవానికి జిక్కీ, ఏ. ఎం. రాజా
సంగీత విభావరి ఏర్పాటు చేస్తామని చెప్పాడు. ఆ విభావరికి కావాల్సిన జిక్కీ, రాజాల
పాటలు ఇమ్మని భైరవ భొట్లనడిగాడు. ఆ పాటలన్నిటినీ సినీ గేయకోశ ప్రక్రియలో రాత
ప్రతిగా తయారు చేసి, అదే వరుసలో ఆడియో క్యాసెట్లను రికార్డు చేసి, జిక్కీ (చెన్నై)కి
పంపించడం జరిగింది. వారం రోజుల పాటు వ్యవధి ఉండడం వల్ల భైరవభొట్లు
పంపిన పాటలు జిక్కీకి బాగా ఉపయోగపడ్డాయి. ఆనాటి సభలో జిక్కి భైరవభొట్లను
మంచి జ్ఞాపికతో సత్కరించింది.
ఈ సంపుటంలో “రోజులు మారాయి” చిత్రంలోని ‘ఏరువాకా
సాగారో’, ‘సువర్ణ సుందరి’ చిత్రంలోని ‘హాయిహాయిగా ఆమని సాగే మొదలైన
31 పాటలు ఉన్నాయి. ఆనాటి నుంచి సంగీత విభావరులకు ఏ పాట కావాలన్నా
భైరవభొట్లే ప్రధాన కేంద్ర మయ్యాడు. జె.పి. పబ్లికేషన్స్ (విజయవాడ) వారు “జిక్కీ, ఏ.
ఎం. రాజా తెలుగు సినీ సంగీత విభావరి గీతాలు” మరియు తెలుగు సినిమాలలో
శృంగార నృత్యగీతాలు” కలిపి ముద్రిం చారు.
3.13.భారతీయ చలన చిత్రాల నిఘంటువు (తెలుగు విభాగం)
నిర్మాణం :
భైరవభొట్ల చలన చిత్ర కేంద్రాన్ని, కేంద్ర ప్రభుత్వం నిర్వహణ లో ఉన్న
చీatఱశీఅaశ్రీ ఖీఱశ్రీఎ Aతీcష్ట్రఱఙవs శీf Iఅdఱa కు చెందిన క్యూరేటర్
పి.కె. నాయర’, సినిమా పాత్రికేయుడు కె.యన్.టి. శాస్త్రి సందర్శించారు.
భైరవభొట్ల చేసిన పరిశోధన కృషిని అభినందిస్తూ, వాళ్లు రూపొందించ బోయే
భారతీయ చిత్రాల నిఘంటువులో కొన్ని ఫిల్మోగ్రఫీస్ ని తయారు చేసే బాధ్యత
భైరవభొట్లకు అప్పగించారు.
వారి కోరిక మేరకు భైరవభొట్ల తెలుగు సినిమాల దర్శకులు, నటీనటులు, సంగీత
దర్శకులు, రచయితలకు సంబంధించిన ‘ఫిల్మోగ్రఫీస’ రూపొందించాడు.
భైరవభొట్ల తయారు చేసిన ఫిల్మోగ్రఫీస్ లోని వ్యక్తుల వివరాలు-
1. ఖీ.=.్పు. విజిటర్స్ బుక్, పుట 11, తేది: 10.04.1990
దర్శకులు :
1. డా. దాసరి నారాయణరావు (2) కె. రాఘవేంద్రరావు (3) బాపు (4) ఆదుర్తి సుబ్బారావు
(5) యు. విశ్వేశ్వరరావు (6) కె.యస్. ప్రకాశరావు (7) కె.ప్రత్యగాత్మ (8) తాతినేని
ప్రకాశరావు (9) లక్ష్మీ దీపక్ (10) వి.మధుసూదనరావు
నటులు
(1) డా. అక్కినేని నాగేశ్వరరావు (2) డా. ఎన్.టి. రామారావు 3) డా. కొంగర జగ్గయ్య
నటీమణులు
1) అంజలీ దేవి (2) సావిత్రి (3) జమున
సంగీత దర్శకులు
(1) సుసర్ల దక్షిణా మÖర్తి (2) పెండ్యాల (3) కె.వి. మహాదేవన్
రచయితలు
(1) ఆత్రేయ (1) కొసరాజు (3) దేవులపల్లి (4) మల్లాది (5) శ్రీశ్రీ (6) పింగళి (7) ముళ్లపూడి
పైన పేర్కొనబడిన ఇరవై ఆరుమంది తెలుగు సినీ ప్రముఖుల గురించి
భారతీయ సినిమా నిఘంటువులోని తెలుగు సినిమా శాఖలో స్థానం కల్పించబడింది.
భైరవ బొట్లు కృషి అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపబడం చెప్పుకోదగ్గ విషయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి