మొత్తం పేజీ వీక్షణలు

9, ఆగస్టు 2026, ఆదివారం

కపిలవాయి ఆత్మకథ ఆంతర్యము వ్యక్తిత్వ వివేచనము


కందమాలు కవి భీష్ముడు, విశ్వకర్మ, మైత్రేయ గోత్రుడు సాహిత్య స్వర్ణ సౌరభీ కేసరి, కవితా కళానిధి విశ్వకర్మ భగవానుని యొక్క సంతతికి చెందిన శ్రీ కపిలవాయి లింగమÖర్తి గారు 1928 మార్చి 31 వ తేదిన ప్రభవ మాఘశుద్ధ నవమినాడు నాగర్ కర్నూల్ జిల్లా నందు పండిత వంశమున, వెంకటాచలం, శ్రీమతి మాణిక్యాంబ పుణ్యదంపతులకు జన్మించిన విద్యన్మణి శ్రీ కపిలవాయి లింగమÖర్తిగారు. 

బాల్యం, విద్యాభ్యాసం

అమ్రాబాద్‌లోని మేనమామగారైన చేవూరు పెద్దలక్ష్మయ్య దగ్గర పెరిగి విద్యాబుద్దులు నేర్చి సంస్కృతాంధ్ర 

నిఘంటువులు, పురాణేûతిహాసాలు, నాటాకాలు, జోతిష్యశాస్త్రాలను నేర్చినారు. మేనమామ గారింట్లో మగ సంతానం లేనందు వలన కపిలవాయిగారు అంటే చాలా ఇష్టం ఉండేది. మానవ జీవితంలో “బాల్యం భవిష్యత్తుకు పునాది” అది చక్కగా క్రమశిక్షణతో గడిచినపుడు మిగతా రోజులు చక్కగా గడుస్తాయి. కాబట్టి ఆయన జీవితం తన పెదమామ వంటి మహానీయుని సన్నిధిలో గడపడం తాను చేసుకున్న అదృష్టం అని తానే స్వయంగా పేర్కొన్నారు. 

విద్యాభ్యాసం:

లింగమÖర్తి గారు తల్లికి ఏకైకపుత్రుడు. అందునా తండ్రి గతించినవాడు కావటం వలన గారాబంగా పెరిగాడు. తన అక్షరాభ్యాసం 5 సం॥ వయస్సులో అంగీరస, కార్తీక శుద్ధదశమి. (7/11/1932) నాడు తన  

పెద్ద మామయ్యగారి చేతుల మీద జరిగింది. 

ఆనాడు ప్రభుత్వ భాష ఉర్దూ కాబట్టి, తెలుగును అంతగా అడిగేవారు లేరు. అయినప్పటికి ప్రతి సంవత్సరం మొదటి శ్రేణిలో రాణించేవారు. ఈ విధంగా లింగమÖర్తిగారు అంచెలంచెలుగా ఎదుగుతూ వివిధ శతకాలను పఠిస్తూన్న విజ్ఞానఖనిగా, నవనవోన్మేషిగా వేదాంత విశారదడిగా సాహిత్య స్వర్ణసౌరభ కవితాకళానిధిగా పద్యాన్ని గద్యాన్ని పదునుగా నడిపిన సవ్యసాచి కపిలవాయి లింగమÖర్తిగారు. 

అభిరుచులు ఇష్టాఇష్టాలు: 

పద్యాలు కంఠస్థం చేయడం, ఏ విధంగా అయితే సులభంగా ఉండేదో అదే విధంగా చిత్రాలను గీయడం కూడా తాను 4 వ తరగతిలో ఉన్నప్ప్పుడే రేఖామాత్రంగా అభ్యసనం చేసి పట్టువదలని విక్రమార్కుడిలా చిత్రాలను గీయడం అనే కళను కూడా సొంతం చేసుకున్న ధీశాలి కపిలవాయి 

లింగమÖర్తి గారు.

వివాహం:

తారణ వైశాఖ శుద్ధ షష్టి శుక్రవారం రాత్రి మీన లగ్నపుష్కరంలో మÖడు దినాల పాటు. రకరకాల పిండి వంటలతో మహావైభవంగా “మీనాక్షమ్మ”తో వివాహం జరిగింది. ఆనాటి లాంచనాలతో, మర్యాదలతో అబ్బురపడే విధంగా మేనమామల ఆశీర్వాదాలతో మరచిపోలేని జ్ఞాపకాలమÖటగా తన వివాహ వేడుక జరిగింది. 

సంతానం:

కపిలవాయి లింగమÖర్తిగారికి మీనాక్షమ్మతో వివాహం అనంతరం కపిలవాయి కిషోర్‌బాబు,  కపిలవాయి అశోక్‌బాబు అను ఇద్దరు పుత్రులు జన్మించారు. 

జీవన విధానము:

కొన్ని రోజులకు సొంత గ్రామములో కాపురము పెట్టడం జరిగింది. వారిది వ్యవసాయ కుటుంబం కాబట్టి ఉదయం తరవాణి అనగా కలితో చేసిన అంబలని తాగి తన దినచరá్యను మొదలు పెట్టేవాడు. విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత కులవృత్తిని అనగా దుకాణమునందు కూర్చొని వృత్తిని నేర్చుకునేవాడు. ఆకాలంలో పగటి వేషగాండ్రు అధికంగా వచ్చేవారు. యక్షŠగానాల వ్యాప్తి మాత్రం ఎక్కువగా ఉండేది. కరువు కాలంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మానసికమైన ఆలోచనలు, దాన్యం కొరత, స్వతంత్ర జీవనం, అనగా సొంతంగా బంగారు దుకాణం ప్రారంభించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులను జయించడం ఆ సమయంలోనే సెప్టెంబర్ 17, 1948 న నైజాం లొంగిపోయాడు అనే వార్తను వినడం ముస్లింసోదరులలో బాధ కనిపించడం. ఉర్దూ పుస్తకాలన్ని కుప్పలుగా పడి ఉండడం ఇలాంటి దృశ్యాలు ఆనాడు ఎన్నో. 

కపిలవాయి గారి బామ్మగారు, అంతమ్మగారు, జినుకుంటలో తుంటి క్యాన్సర్‌తో బాధపడుతూ కొన్ని రోజులకు తన 75వ యేట 1949లో మరణించారు. ఇలా ఎన్నో బాధలతోనున్న కానీ తన అడుగును ముందుకు వేస్తూ, తనదైన పŸంథాను చాటుకున్న అపర భగీరథుడు.

అదే సమయంలో ప్లేగు వ్యాధి అదే ‘బొబ్బరోగం’ అనగా చంకల వంటి మృదు ప్రదేశంలో బొగ్గ వచ్చి పగిలి రోగి చనిపోయేవాళ్లు. ఇది ఎలుకల వలన సంబవించేది. వ్యాపారం ప్రారంభించిన కొద్దిరోజులకే ఈ మహామారి రావడం. ఊరు వదల వలెనని చాటింపు రావడంతో ఊరి అవతల గుడిసె వేసుకున్నా ఫలితంలేక వర్షం వరదలు కారణంచేత గుడిసెలన్నీ వెల్లువపాలైనవి. 

తన జీవితంలో నాలుగు పెద్ద తవాయిలు గత్తెర, పేరు, రేషను కంట్రోలు, రజాకర్ ఉద్యమాలు జరిగినా అటువంటి కష్టకాలంలో కూడా కులవృత్తి లభించక ఎన్నో అవస్థలు పడ్డా ఎప్పుడు చదువు మాత్రం మానలేదు. దొరికిన పుస్తకమల్లా చదువుతూ వేదాంత విశారదుడిగా, సాహిత్య స్వర్ణసౌరభ కేసరిగా,  కవితా కళానిధిగా, సాహిత్య భీష్ముడిగా పేరుపొందెను. 

మాణిక్యమ్మ గారి మరణం తన అనారోగ్యం కిశోర్ బాబుగారి అనారోగ్యం, కోడలు గారైన భార్గవి మరణం, శ్రీమతి మీనాక్షమ్మగారి మరణం, కిశోర్ బాబుగారి మరణం ఇలా తన జీవన ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి అనితర సాధ్యుడిగా సాహితీ సేవకు అంకితం అయిన ధీశాలి.

ఉద్యోగ ప్రవేశం: 

జయ సంవత్సరం, జ్యేష్ఠ బహుళ ఏకాదశి 01.07.1954 నాడు ఉపాధ్యాయవృత్తిలో నెలకు (30 రూపాయలు) వేతనంతో ప్రవేశం పొందాడు. నాగర్‌కర్నూల్ జాతీయోన్నత పాఠశాలలో పండితునిగా చేరి తర్వాత మాస్టర్ ఆఫ్ ఓరియంటల్ లెర్నింగ్ పండిత శిక్షను పూర్తి చేసి, 1972 నుండి పాలెంలోని, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో చరిత్రోపన్యాసకులుగా 11 సంవత్సరాలు విధులు నిర్వహించి 28.02.1983లో పదవివిరమణ పొందినారు. 

రచనలు: 

శతకములు: పండరినాథ విఠల శతకం 1972, తిరుమలేశ శతకం 1999, ఆర్యశతకం, దుర్గాశతకం, ఆటవెలది, భర్గశతకం, రామబంటు శతకం, హనుమద్వచనాలు, వచనశతకం, గీతపద్యాలు, రామరామ శతకం, సాయి శతకత్రయం మొదలగు రచనలు చేశారు.

కావ్యాలు:

్న  కపిలవాయి గేయ ఖండికలు - 2010 

సౌధశేఖరం, జీవిత చక్రం, మేధహృదయాలు, ఊయలమంచం అనే ఖండికలు. 

్న  చ్కతీర్థ మహాత్మ్యం ` లఘుకావ్యం - 1983 

పెద్దపల్లి, బుగ్గస్వామి చరిత్ర 

్న  శ్రీమత్పతాపగిరి ఖండం - ప్రౌఢ కావ్యం ` 1983

అమ్రాబాద్ స్థలచరిత్ర ` ద్వితీయ ముద్రణ ` 2004

్న  కంకణ గ్రహణం ` 1992 

1979లో జరిగిన సంపూర్ణ సూర్యగ్రహరూ విశేషాలు మరియు 1980 సం॥ డైరీ కావ్యం

్న  కుటుంబగీత - 1994 ` కుటుంబనియంత్రణపై ఏకైక కావ్యం

్న  ఇంద్రేశ్వర చరిత్ర - లఘుకావ్యం ` 2007

ఇంద్రకల్లు చరిత్ర 

్న  సంకీర్తనలు ` 3

్న  చరిత్రులు - 6 

్న  క్షేత్రా విర్భావ చరిత్రలు - 8 

్న  ఉదాహరణలు ` 4

్న  సంచికలు (సంపాదకులుగా) 4 

్న  ఆధ్యాత్మికాలు - 3 

్న  సంకలనాలు - వ్యాఖ్యానాలు ` 4

్న  సంపాదితాలు - పరిష్కృతాలు ` 18

్న  అనువాదాలు ` 1 

విశ్వబ్రాహ్మణుల సంస్కృతి - అనుకరణ (కన్నడ నుంచి) 

్న  ఇతరాలు (తాత్పర్యాలు - వ్యాఖ్యానాలు) - 6 

్న  అముద్రితాలు ` 28

సాహిత్య సంస్థల గౌరవ పురస్కారాలు బిరుదులు: 

్జ కవితా కళానిధి ` 1992

్జ పరిశోధనా పంచానన - 1992 

్జ కవి కేసరి - 1996 

్జ వేదాంత విశారద (2005) 

్జ గురుశిరోమణి ` 2010 

్జ సాహిత్య స్వర్ణసౌరభ కేసరి (2012) 

సాహిత్యంపై పరిశోధనలు: 

1. అనంత రాములు (00) ` కపిలవాయి శతకాలు -పరిశీలన 

2. అనంతరాములు (00) కపిలవాయి జీవితం సాహిత్యం

3. యాదగిరిచారి (మధురై యÖనివర్సిట) ` శ్రీమత్ప్రతాపగిరి ఖండం - పరిశీలన 

4. రామాచారి (ఎస్.వి. యÖనివర్సిటీ) ` చక్రతీర్థమహాత్మ్యం పరిశీలన 

5. రామాచారి ` కపిలవాయి జీవితం - సాహిత్యం

6. వెంకటరాజం ` (00) కపిలవాయి లింగమÖర్తి సాహిత్యంలో చరిత్ర ` సంస్కృతి

అనారోగ్యం (మరణం): 

ప్రతి శ్రావణంలో అనారోగ్యమేర్పడటం పరిపాటి అన్నట్టుగా ఉండేది. మÖత్ర బంధమేర్పడడం మరియు ప్రొస్టేటు ఆపరేషన్ 2017 తర్వాత అనారోగ్య సమస్యలు వృద్ధాప్య సమస్యలు 2018లో కేర్‌హాస్పిటల్ నాంపల్లిలో చేరడం. సాయిబాబా గారు కలలో కనిపించి రెండు చేతులు అభయహస్తముద్రలో చూపించడం, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ హాస్పిటల్‌నందు జాయిన్ కావడం “అప్పుడు హృదయంలో నుండి ప్రాణపక్షి ఎగిరిపోయి దక్షిణ దిశగా పోతున్నట్టు” కల రావడంతో అశోక్ బాబు గారికి తెలియజేయడం కాళ్లలో నిస్సత్తువ ఏర్పడి నడవడం ఇబ్బందిగా మారడంతో 2018 నవంబర్ 6న 90 సం॥ల వయస్సులో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

సాహితీ దిగ్గజం: 

కపిలవాయి లింగమÖర్తి పద్యాన్ని గద్యాన్ని ఏక కాలంలో పదునుగా నడిపిన సవ్యసాచి మతులు పోగెట్టే యతులు అలంకార మదగజ కుంభస్థానాలను బద్దలుకొట్టిన లాక్షణికుడు. 

సాహిత్యం, సంగీతం, సంస్కృతి అనే మÖడు విభూతి రేఖలను నిత్యం నుదట ధరించే కవికుల వైతాళికుడు. నడిచొచ్చే విజ్ఞానసర్వస్వం కపిలవాయి లింగమÖర్తి. చెదిరిపోని తెలంగాణ సాహితీ కీర్తి. 

అరుదైన గౌరవం: పరిశోధకుడు బహుముఖ గ్రంథకర్త అయిన లింగమÖర్తి గారికి అరుదైన గౌరము దక్కింది. తెలుగు సాహిత్యం విశేషసేవలను అందిచిన తెలంగాణ ముద్దుబిడ్డకు గుర్తింపునిచ్చింది. తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ని ప్రధానం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి డాక్టరేట్ పొందిన ఘనత మన కపిలవాయి లింగమÖర్తిగారికి దక్కింది.

సందేశం:

యువకవులకు దిశానిర్దేశం చేసి ప్రోత్సహించిన మేట కవి దిగ్గజం. భావితరానికి - బాటలు మీరే / భారతజాతికి నేతలు మీరే అనే కొత్త కోణంలో ప్రాచీనాంధ్ర భాషను కాపాడాలనీ సందేశమిచ్చిన భవ్యశీలి. అంపశయ్య మీద భీష్ముడి వలె జీవిత ఒడిదుడుకుల్ని తట్టుకొని, తనదైన కలంతో ఎన్నో  కృతులను తీర్చిదిద్దిన కపిలవాయి లింగమÖర్తి గారు నాటి నేటి తరాలకు మార్గదర్శిలా నిలిచి సాహితీ జగత్తుకు నిలువెత్తు నిదర్శనమయ్యారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి