శ్రీ మల్లాది రామకృష్ణశాస్తిగారి రచనా పాటవం దర్శకులు పి.పుల్లయ్యకు తెలియనిది కాదు. అయినా సరే “శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం”(1960)లో ఒక పాటే, అతి సాధారణమైన శివలోక సన్నివేశానికి వ్రాయించుకున్నారు. ఈ కినుకతోనే నేనీ చిత్రం చూశాను, u£బ్బిలిలో, అప్ప్పుడు మా నాన్నగారు నడుపుతున్న శ్రీరామా టాకీసులో.
ఆ కినుక మాయమైపోవడానికి ఒక రీలు కూడా పట్టలేదు. అయితే యిదెంతటి చిత్రమో బోధపడటానికి కొన్నేళ్లు పట్టింది. అంతకు యిరవైయేళ్ల ముందు పి.పుల్లయ్య దర్శకత్వంలో తయారయినదే, నేను చూడలేదుగాని అందులో శాంతకుమారి, సి.ఎస్.ఆర్., మద్దూరి బుచ్చన్న శాస్తి (పద్మావతి, శ్రీనివాసుడు, బావాజీ) పాడిన పాటలు రికార్డుల ద్వారా నేనెరిగినవే.
బాలాజీ భక్తులు యావద్భారతమంతా వున్నా, sTÖ కథతో ఎక్కువ సినిమాలు రాలేదు. మొదటిది శ్రీనివాస్ సినీటోన్ “శ్రీనివాస కల్యాణం”(తమిళం, 1934, ఎ.నారాయణన్) నటీనటులు పి.ఎస్.శ్రీనివాసరావు (యితని వద్ద మÖడు దశాబ్దాల తరువాత ఆర్.బాలసరస్వతీ దేవి ఉరఫు కోలంకారాణి భజనలు నేర్చింది), ఆర్.బి.లక్క్ష్మీదేవి (ఈమె సి.రామచంద్ర మొదటి సినిమా ‘జయక్కొడి’లో-తమిళం-నాయిక). రెండవది ఫేమస్ పిక్చర్స్ వారి “శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం-బాలాజి” (తెలుగు, 1939, పి.పుల్లయ్య). మÖడవది మహాత్మ పిక్చర్స్ “శ్రీ శ్రీనివాస కల్యాణ” (కన్నడం, 1952, డి.శంకర్‌సింగ్ - బి.విఠలాచార్య). విమలానందదాస్ (పండరీబాయి సోదరుడు), ప్రతిమాదేవి (శంకర్‌సింగ్ భార్య, రాజేంద్రసింగ్ బాబు తల్లి). నాల్గవది పద్మశ్రీ పిక్చర్స్ “శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం-బాలాజీ” (తెలుగు, 1960, పి.పుల్లయ్య) ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వరలక్క్ష్మి యిత్యాదులు. అయిదవది శ్రీనివాస ఆర్ట్స్ కంబైన్స్
“శ్రీ శ్రీనివాస కల్యాణ” (కన్నడం, 1974, విజయా కె.) రాజ్‌కుమార్, బి.సరోజాదేవి, మంజుల, ఆదవాని లక్క్ష్మి. ఆరవది ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం” (తెలుగు, 1979, ఎన్.టి.రామారావు) ఎన్.టి.రామారావు, జయసుధ, జయప్రద. చివరి రెండూ వర్ణచిత్రాలు. పై చిత్రాలన్నీ డబ్బులు రాల్చినా విజయఢంకా మ్రోగించినది పద్మశ్రీవారిదే.
ఈ పద్మశ్రీ చిత్రం తమిళానికి “శ్రీనివాస కల్యాణం”గానూ, హిందీకి “భగవాన్ బాలాజీ” (1961) గాను అనువదించబడింది. అరవంలో సుమారుగా ఆడింది. హిందీలో విడుదలే అంతంత మాత్రం. ఈ తమిళ నకలుకు యిటీవలే రంగులు పూసి, స్కోప్‌లోకి మార్చి అదే పేరుతో విడుదల చేశారు.
“భగవాన్ బాలాజీ”లో ఎస్.వరలక్క్ష్మి, శాంతకుమారి తమ నాలుగు పాటలూ తామే పాడుకొన్నారు. ‘శ్రీ దేవ్ తేరీ హు” అర్థాంగినీ’, ‘గోపాల నందగోపాలా’ భలే భేషుగ్గానూ, బాగానూ పాడగా, యివి రెండూ ఒక రికార్డుగా (జిఇ33536) విడుదలైనవి. తక్కిన పాటలు గీతా దత్, మన్నా డే, లత, ఆశా, రఫి, మహేంద్ర కపూర్ వంటి నిష్ణాతులు పాడారు. మొత్తం ఆరు రికార్డులు విడుదలైనవి. తమిళం పాటలు విడిగా రికార్డులు రాలేదు కాని సినిమా సెట్ (సంక్షిప్త శబ్ద చిత్రం) వచ్చింది. ఇందులో శాంతకుమారి మాటా పాటా ఆమెవి కావు. డబ్బింగ్ సమయంలో ఆమె విశాఖపట్టణంలో వుండగా, హక్కులు కొన్న సుందర్‌లాల్ నహాతా విడుదలకు తొందర చేయడంతో, మాటలు డబ్బింగ్ కళాకారిణి చేత, పాటలు పి.లీల చేత పాడించారు.
రాజ్‌కుమార్ చిత్రం తెలుగులోకి “శ్రీ తిరుపతి క్షేత్ర మహాత్మ్యం” అని డబ్ చేయబడింది.
వీటిలో అయిదు చిత్రాల పాటలు విన్నాను (మÖడు తెలుగు, రెండు కన్నడం), మÖడు (మొదటి మÖడు కాక) చూశాను. అన్నిటా రెండు మÖడు మంచి పాటలున్నా అంతా విమలగాంధర్వమే అని చెప్ప్పుకోదగ్గది పద్మశ్రీకి పెండ్యాల చేసిన సంగీతమే. దానికి తగిన రచన, గాయకులు, పాత్రధారులు, చిత్రీకరణ సమకూడటం ఆయనదే కాదు అందరి అదృష్టం.
నేను 1961లో సినిమా పరిశ్రమలో పి.ఆర్.ఓగా ప్రవేశించాను. శాంతకుమారితోను, భర్త పి.పుల్లయ్యతోను, తమ్ముడు వి. వెంకటేశ్వర్లు (పద్మశ్రీ నిర్మాత)తోను పరిచయమైంది. ఈ చిత్రం విడుదలైన 24 యేళ్లకు ఆ సౌండ్ ట్రాక్ సుమారు 78 నిమిషాలకు ఒక ఎల్.పి., ఒక సూపర్ సెవెన్ పైన దించాను. ఇది యింత ప్రతిభావంతంగా జరిగిందీ అంటే దానికి తొంభైశాతం కారణం హెచ్.ఎం.వి. శబ్దగ్రాహకుడు కె.యస్.రఘునాథన్ కర్తరీ లాఘవం. నేనెక్కడ చెబితే అక్కడ కత్తిరించి నేపథ్య సంగీతంలో ఒడిదుడుకులు వినబడకుండా సర్దగలిగిన నేర్పరీ, తీర్పరీ sTÖయన.
అప్పటికే నిడివి తగ్గించటానికని పుల్లయ్య ‘పిల్లగో’లో ఒక చరణం, ‘చిలుకా’ పూర్తిగానూ తొలగించారు. “షావుకారు జానకి సోది అద్భుతంగా చెప్పింది. దాన్ని వదలకూడ”దని శాంతకుమారి పట్టుబట్టి దానినీ పెట్టించారు. షావుకారు జానకి కంఠం 1968లోనే రికార్డుకి మొట్టమొదటిమారుగా ఎక్కించింది నేనే. “మంచి కుటుంబం”(1968)లోని షేక్‌స్పియర్ ఆంగ్లంలో జూలియట్‌కి వ్రాసిన రెండు పంక్తులు.
ప్రజ్ఞాపాటవాలు కాదుగాని సినిమా పాటలూ, పద్యాలూ అంటే నాకుండే భక్తిశ్రద్ధలు స్పష్టమయ్యేది ఆ రికార్డుల వెనుక నేను పొందుపరచిన వివరాలు (142, 145వ పుటలు చూడండి). గ్రామసింహం వారు నా ప్రమేయం లేకుండా చేసిన ఎల్.పి.లలో యిచ్చిన వివరణలతో సరిపోల్చితే ఆ తేడా తెలుస్తుంది. పాట పల్లవి, రచన, పాడింది, తెరపై పెదవులు కదలించినది, సంభాషణలు చెప్పింది, ఆ పాత్రల పేర్లు యివ్వడం నాతో మొదలై నాతోనే ముగిసిన సత్సాంప్రదాయం. అతని యజమాని కంఠం కంపెనీలోనూ, గీర్ స్టోర్స్ కంపెనీలోనూ ‘ఏమిటీ చాదస్తపు సొద’ అని అందరూ విసుక్కొనేవారే. అయితే నా పంతం నెగ్గించుకొన్నాను. నేను తలపెట్టకపోతే sTÖ పనులు (మల్లీశ్వరి, విప్రనారాయణ రెండేసి గంటలు మిస్సమ్మ, హిందీ శారద, విజయా వారి కన్నడ హరిశ్చంద్ర గంటసేపు) జరగవని ఆ ఈస్టిండియా కంపెనీలకు తెలుసు. ఆ నిర్మాతలు నన్ను మెచ్చి యిచ్చినవే sTÖ సౌండ్ ట్రాక్‌లు. కొందరు నిర్మాతలు డబ్బులివ్వమÖ అని (రికార్డు కంపెనీలే యిచ్చుకోవాలని వారి అభిమతం రాయల్టీ ఎగవేసేవాళ్లు నాకిస్తారా?) చేతులెత్తేసిన కొన్ని ఎల్.పి.లకు నాకు ఆర్థిక మద్దతు యిచ్చినది ప్రసాద్ బ్రదర్స్ పేరిట బి.విశ్వనాథరెడ్డి.
నాకు పుల్లయ్య-శాంతకుమారి కుటుంబంతోనూ పరిచయం. నిర్మాతయిన వారి బామ్మరిదిని ‘రాణీగారి తమ్ముడూ!’ అని సంబోధించేవాడిని. వారి పిల్లలు పద్మ, రాధ, అల్లుళ్లు భూపతి, లోకప్రియ నన్నెంతగా ఆదరిస్తారో నాకు తెలుసు.
శాంతకుమారి పుట్టిన తేది మే 17. ఆమె పోయిన తరువాత కూడా ఆరోజు వారింటికి నేను, మా వదిన లీలా బి.డి. ప్రియ వెళ్లి, వారున్నప్ప్పుడు చేసినట్టే వారి కుటుంబం ముందు ఆడి, పాడి వస్తాం. లీల మొదట శాంతకుమారి వద్ద ఆమె చేసిన భక్తిపాటలు నేర్చింది (వీటిలో కొన్నిటిని వేరే వరసలతో నా మేనల్లుడు చిరంజీవి మంగళంపల్లి బాలమురళీకృష్ణ కేసెట్టులో పాడారు). ఆ తరువాత ‘కలకలా ఆ కోకిలేమో’ (గుణసుందరి కథ), ‘లంబాడి లంబాడి లంబ లంబ’ (ధర్మదేవత) పాటకు అభినయ నాట్యాలలో తరిఫీదు పొందింది. అవి వారి ముందే చేయడం (ఒక్కమారు మాత్రం మంగళంపల్లి అన్నపూర్ణమ్మ గారి ముందు, ఆమె కోడలి ముందూ అప్ప్పుడే నేర్చుకొన్న సరదాతో!). ఇదంతా తన గురువునీ, వారి కుటుంబాన్నీ అలరించడానికీ, తన కృతజ్ఞత తెలుపుకొనడానికీ. ఘంటసాల కోడలు పార్వతీ రవి ఘంటసాల ఒక కృష్ణ నాటికలో తనకు తగిన కుచేలుని వేషం-కృష్ణుడూ ఆడపిల్లేనని చెప్పి - వేయమన్నా రిహార్సలుకి టైముండదు అని తప్పించుకొంది.
నేనంటే ఎంత వాత్సల్యమో శాంతకుమారికి! వారి తమ్ముళ్లను చేయనంతగా నన్ను గారాము చేసేవారు. “కృష్ణప్రేమ”(1943)లో రాధ ‘ఇదే ఆనందమÖ’ అని చుట్టూ తిరుగుతూ చేసిన నాట్యం నేను చేసి చూపితే, అది వెక్కిరింతగా తీసుకోక అభిమానంగానే గ్రహించేవారు. మొదటి టాకీ రోజుల్లో పాటల చిత్రీకరణ, శబ్దగ్రహణం ఒకేమారెలా జరిగేవో నాకు అవగాహన కలిగేలా వివరించిందీ, నేనడగ్గానే మద్రాసు దూరదర్శన్‌లో యింటర్వ్యూకి అంగీకరించిందీ వారే.
‘చిరు చిరు నగవుల’ సినిమాతో బాటు రికార్డుగా లేదు. మÖడేళ్ల పరిచయం గాఢమైన తరువాత రికార్డులకివ్వమని అడిగితే ‘ఒక్క పాటెలా రికార్డుకివ్వను?’ అని భర్త కస్సుమంటే, సిఫారసు చేసి “సత్యం పాడిన ‘పాహిమామ’ ఒకటి మిగిలిపోయింది కదా, దానితో కలపండి” అని చెప్పిందీ శాంతకుమారే.
“అల్లుడే మేనల్లుడు”(1970) చిత్రంలో పసిపిల్లవానికి అన్నం పెట్టే సన్నివేశంలో శాంతకుమారికి పాట పెట్టండీ అని పుల్లయ్యనడిగితే “ముసలి వేషాలకు పాటలు పెడితే ఎవడు వింటాడు జమీందారూ? (పుల్లయ్యగారు నాకు పెట్టుకొన్న ముద్దు పేరు)” అని తిట్టినప్ప్పుడు “పెడితే పెట్టండి లేకపోతే లేదు. ఆయన్ను తిట్టడమెందుకు?” అని నన్ను వెనకేసుకువచ్చిందీ శాంతకుమారే. చివరికి పాట పెట్టలేదు.
ఇలా ‘జమీందారూ’ అంటూ కించపరుస్తున్నారన్న కోపంతో ఒకసారి నేనేంచేశానంటే: పుల్లయ్యగారికి ఒక సంస్థ (నా గురుపుత్రులు టి.వి.కె.శాస్తిది) చిన్న సైజు సన్మానం చేస్తుంటే, నేను ‘సిద్ధమై’ వెళ్లాను. అంటే, శాంతకుమారి “మాయలోకం”లో పాడిన శృంగారాహ్వాన గీతం ‘మోహనాంగ రారా నవ మోహనాంగ రారా” అన్నది కేసెట్ కెక్కించుకుని. సభలో పుల్లయ్యగారి నెరిగిన పెద్దలెందరో గాక కూతుళ్లు, అల్లుళ్లు కూడా ఉన్నారు. నిర్వాహకుల పిలుపు విని పుల్లయ్య వేదికనెక్కుతుండగా sTÖ పాట వినిపించాను. ఆయనకు sTÖగ వాలినట్లు కూడా లేదు. ముందు వరసలో కూర్చున్న శాంతకుమారి మాత్రం పదహారేళ్ల ముగ్ధలా సిగ్గుతో ముడుచుకుపోయారు.
పి. పుల్లయ్య గురించి చాలామందికి తెలియని విషయం. ఆయన మద్రాసుకు వచ్చిన క్రొత్తలో ఒక రికార్డింగ్ కంపెనీకి రిప్రజెంటేటివ్‌గా పనిచేశారు. అది సూరజ్‌మల్స్ అన్న నగల వర్తకులు గుత్తకు పుచ్చుకున్న బ్రిటిష్ కంపెనీ బ్రాడ్‌కాస్ట్ లేబుల్. తక్కిన రికార్డులు మÖడుంకాలు నిమిషాలే పాడితే, యివి నాలుగున్నర నిమిషాలు పాడేవి. కాబట్టి లాంగ్ ప్లేయింగ్ అని ప్రకటించేవారు. అప్పటికి హెచ్.యం.వికి మాత్రం రికార్డు చేస్తున్న కపిలవాయి రామనాథ శాస్తి, ్పు£న్నవిత్తుల శేషగిరిరావు, స్థానం నరసింహారావు, యం.యస్. సుబ్బులక్క్ష్మి యిత్యాదులు పుల్లయ్య కోరికపై sTÖ కంపెనీకి పాడారు. ఆ ఉద్యోగం వదలిన తరువాత కొలంబియా వారికి పుల్లయ్య తన నెల్లూరి మిత్రులిద్దరితో కలిసి రెండు కామిక్ రికార్డులిచ్చారు. వాటిలో ‘కొప్పునిండా పువ్వులేమే కోడలా కోడలా’ అన్న జానపద గీతం (తదుపరి ఒక విజయా చిత్రంలో పసుమర్తి కృష్ణమÖర్తి, జెమిని చంద్రా దీనికి నర్తించారు) ఒకటి. ఇవి నాదగ్గరున్నవి.
అన్నట్టు మరచాను పద్మశ్రీ ఎంబ్లమ్‌లో కనపడేది ఆనాటి యువ తార వాసంతి అట యిప్ప్పుడే “నేను పద్మనండి” అంటూ రాధ చెప్పారు. అలా ‘పద్మను’ అని చెప్పి sTÖ తాతయ్యను ఆటపట్టించడం లోకప్రియ రాధకు వేడుక.
పుల్లయ్యగారు పోయినప్ప్పుడు పరామర్శకు వెంటనే వెళ్లాను. కాని శాంతకుమారి పోయిన తరువాత కొద్దిరోజుల వరకూ వెళ్లే ధైర్యం లేకపోయింది నాకు. పద్మ, రాధ నా బలహీనతనర్థం చేసికొన్నారు. తమ ద్ణుఖాన్ని మరచి నా ఏడుపు ఓపిగ్గా విన్నారు. నన్ను ఓదార్చారు.
పుల్లయ్య ఎన్నో మంచి చిత్రాలకు-“రేచుక్క” (1954), “అర్థాంగి” (1955), “జయభేరి” (1959) - దర్శకులు. శాంతకుమారి వేంప్‌గా (సారంగధర, 1937), నాయికగా (కృష్ణప్రేమ, 1943) తల్లిగా వేసిన మంచి చిత్రాలెన్నో. పాడిన ‘ఊదుము కృష్ణా’, ‘ఇదే ఆనందమÖ’ నందనగాంధర్వంలో నవపారిజాతాలు. ఇవి sTÖనాటికీ దొరుకుతున్నా ఏనాటికీ వారిద్దరి కలయికను చిరస్థాయిగా చరితార్థం చేసే చిత్రం “శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం”.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి