మొత్తం పేజీ వీక్షణలు

13, ఆగస్టు 2026, గురువారం

కథావస్తుపరంగా భైరవభొట్ల చేసిన సినీ పాటల పరిశోధన

సినిమాపాటలు కథా వస్తుపరంగా వర్గీకరణ - పరిశీలన 

4. తెలుగు సినిమాపాటలు కథా, వస్తుపరంగా వర్గీకరణ - భైరవభొట్ల కృషి 

మనిషికి వినోదాన్ని విజ్ఞానాన్ని ఒకేసారి అతి స్వల్పకాలంలో అందించే చిత్రమైన సాధనం సినిమా. సినిమా కళతో కూడుకొన్న వ్యాపారం. అటు సాంకేతిక పరిజ్ఞానంతో ఇటు సృజనాత్మక దృష్టితో కలగలిసి ఏర్పడిన కళ యిది. సినిమాకు సాంకేతికత బాహ్యశరీర నిర్మాణమైతే, సృజనాత్మకత ఆత్మభూతమైంది. ఆత్మలేని శరీరం శవప్రాయమైనట్లే, సృజనాత్మకత లేకుండా సాంకేతికంగా నిర్మింపబడిన కళ నిర్జీవంగా ఉంటుంది. సినిమాకళకు సాహితీపరమైన సృజనాత్మకత ప్రాణం. తెలుగు సినిమా సాహితీ రచన మÖడు విధాలుగా కనిపిస్తుంది. అది కథాసాహిత్యంగా, సంభాషణ సాహిత్యంగా, పాటల సాహిత్యంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ మÖడు ప్రధానాంశాల్లోనూ చెప్పుకోదగిన అంశం ‘పాటల సాహిత్యం’ 1. 

4. సినిమా పాట : 

మాటల్లో చెప్పలేని ఏ అనుభూతినైనా అందంగా మనసుకు హత్తుకునేలా చెప్పడానికే పాట! దీనినే ‘గోరింటా’ కు (1979) చిత్రంలో ఓ పాటలో వేటూరి తన కవితా పరిభాషలో ‘మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది’ అన్నారు. పని- పాట అనేది అనాదిగా వస్తున్న మాట. పనితో తమ

(1. యువచిత్ర పాటలు - సాహిత్య విలువలు - కంపల్లె రబిచంద్రన్ పుట:59)

శ్రమను మర్చిపోవడానికి ఉపశమన సాధనంగా ప్రారంభమైన పాట క్రమంగా వినోద సాధనంగా మారింది. అలా జనంలో పుట్టి పెరిగిన పాట పదమై భక్తినీ, రక్తినీ పుణికి పుచ్చుకొని అన్నమయ్య ద్వారా, క్షేత్రయ్య ద్వారా పరువు, పరువం తెచ్చుకొని త్యాగరాజాదుల వాక్కుల్లో కృతియై, మరికొంచెం ముందుకు వచ్చి సొంకం బింకం పొదువుకుని జావళీ అయి, రంగమండపం ఎక్కి, అక్కడి నుంచి కూడా మహారాష్ట్ర మెట్లతో నాటక రంగస్థలం మీద గొంతు సవరించుకొని సినిమాల్లోకి ఒక్క ఉరుకు ఉరికి మహా ప్రవాహంగా పరిణమించింది 1

4.1 సినిమా పాటలు - ఆవశ్యకత : 

· ప్రంబంధాల్లో ఆష్టాదశ వర్ణనల్లాగా ‘సినిమా’ అనే సరికి కూడా కొంత పోపు సామాగ్రి మనకు స్ఫురిస్తుంది. ఇది కేవలం ఇతివృత్తం, పాత్ర కల్పన, సన్నివేశాల కల్పలన వంటి వాటికే పరిమితం కాదు. ప్రేక్షజన మనోరంజనం ముఖ్యాశయంగా విస్తరిస్తుంది. ఇలాంటి పోపు సామాగ్రిలో ముఖ్యమైనది పాట. 

(1. పాట మోసుకు వస్తున్నది అలనాటి సౌరభాల్ని - మోహిని (వ్యాస సంకలనం) ఇంద్రగంటి శ్రీకాంత శర్మ పుట - 99, 100) 

ఒక కవి ఒక సన్నివేశాన్ని ఉద్దేశించి రాస్తే, దానిని సంగీత దర్శకుడు ‘ధని’ ద్వారా ఆవిష్కరిస్తే గాయనీగాయకులు సమర్థతను బట్టి, ఆ పాట ఫలవంతం అవుతుంది. డెభ్భై ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో గుర్తుంచుకోదగిన గొప్ప చిత్రాలను ప్రేక్షకుల మనస్సుల్లో అజరామరంగా నిలిపినవి మాత్రం పాటలే. ఒక రచయిత, దర్శకుడు ఏమి చెప్పదలచుకున్నారో దాని సారాన్ని మÖడున్నర నిమిషాల పాట గొప్పగా నిలబెట్టిన సందర్భాలున్నాయి. ఒక చిత్ర దర్శకునీ, నిర్మాతనీ, కడకు రచయితనీ, సంభాషణలనీ ప్రేక్షకులు మర్చిపోవచ్చునేమో కానీ, ఒక పాటనీ, దాని చిత్రీకరణలో ఇమిడివున్న అనుభూతిని తొందరగా జనం మరచిపోరు. ఇలా చిత్రాలకు ప్రాణప్రతిష్ట చేసిన ఖ్యాతి మన సినిమా పాటల రచయితలందరికీ దక్కుతుంది. ఆ పాటలకు సంగీతంలో చైతన్యం కలిగించిన సంగీత దర్శకులకు, గాయనీగాయకులకు చెందుతుంది.1 

సాధారణంగా ఏ సినిమాకైనా ప్రేక్షకుణ్ణి ఆహ్వానించే సింహద్వారం కథ అయితే మిగతా గృహద్వారాలు నాటకీయ సన్నివేశాలు. పాట మాత్రం వెల్లడిగా వెలుగూ, గాలి వచ్చే కిటికీ. ఆ గాలీ వెలుగు వల్ల ప్రాణానికి కలిగే అనుభవం వర్ణనా తీతం. అందుకేనేమో కొన్ని పాటలు యుగకర్తృత్వాన్ని మోస్తే కొన్ని పాటలు జ్ఞాపకాల్లో తీయని బాధలుగా గడిచిన కాలంలో అనుభవాల గుర్తులుగా శ్రోతలకు మిగిలే వుంటాయి. ఉదాహరణకి - లైలామజ్ను (1949), మల్లీశ్వరి (1951), పాతాళ భైరవి (51), దేవదాసు (53), రోజులు మారాయి (55), మాయబజార్ (57), భూకైలాస్ (57), ‘వెలుగనీడలు’ (61), లవకుశ (63), మÖగమనుషులు (64), సిరి సిరిమువ్వ’ (76), సీతామాలక్ష్మి (78) శంకరాభరణం (80), సాగ- రసంగమం’ (83), ‘సిరివెన్నెల’ (86) మరి ఇటీవల మనసంతా నువ్వే (2000) వంటి చిత్రాల్లో పాటలు ఆయా కాలాల్లో యుగకర్తృత్వం వహించాయి. ఈ పాటల పాదాలు కొన్ని సామెతలంత ప్రసిద్ధిపొందాయి. 

(1. యువచిత్ర పాటలు - సాహిత్య విలువలు, కంపల్లె రవిచంద్రన్ పుట. 62) 

ఏ చిత్రంలోనైన, ఒక సన్నివేశంలో, కేవలం సంభాషణల ద్వారా, చిత్రీకరణ ద్వారా ఒక అనుభూతి కలిగించడం చాలదనుకున్నప్పుడు, అక్కడ పాట అవసరమవుతుంది. ఏ అనుభూతి కోసమైతే పాటను అక్కడ కలిగిస్తామో ఆ అనుభూతిని ఆపాటలో స్థిరింపజేస్తే ఆ పనికి ప్రతిఫలం ఉంటుంది. కథాంశ వివరణ కోసమో, సంఘటన విశదీకరించడం కోసమో, పాత్రగాని, పాత్రలు పొందిన ప్రాధాన్యం తెలపడం కోసమో, కథా సంవిధానం కోసమో, నేపథ్య స్థితి కోసమో, పాట సినిమాలో అవసరం అవుతుంది. కథా భాగమో, కథా వ్యాఖ్యానమో, భావమో, వర్ణనమో ఉంటుంది. ఆ సందర్భంలో సన్నివేశం రసవత్తరంగా బలపడటానికి పాట ఉద్దిష్టం కావచ్చు 1

(1. సాహిత్య దర్శనం ఆచార్య కొలకలూరి ఇనాక్ - పుట- 61)

మన చలన చిత్రాల్లో సన్నివేశబలం కలిగిన పాటలు ఎక్కువగా వచ్చాయి. అందువల్ల వస్తువైవిద్యం ఉండడానికి అవకాశం కలిగింది. పాట లేకపోతే కథ ముందుకు సాగనంతగా పాటకు ప్రాధాన్యం ఉండేది. అసలు పాట లేనిదే సినిమా లేదు. సినిమాలో పాటలు సంగీత ధర్మం, సాహిత్య గుణం మాత్రమే సంతరించుకొని లేవు. సినిమా స్వరూపంలోని కళా ధర్మాలన్నీ పాటల్లో దర్శనమిస్థాయి. అందువల్ల సమాంతర కళారూపమైన పాట సినిమాకు ప్రాణం. అంతేగాక మానవ శరీరానికి రక్తప్రసరణ వంటిది.

4.2. సినిమా పాటలు - ప్రయోజనం : 

సినిమాపాట జీవితంలో ఒక భాగమైపోయింది. సుమతి, వేమన శతకాలలోని ఏదో ఒక పద్యం రానివాడు కూడా ఈనాడు ఏదైనా సినిమా పాట చరణాన్ని, రాగాన్ని మననం చేసుకోకుండా ఉండలేడు. అంటే పద్యం రానివాళ్ళు వుండ వచ్చు గాని పాటలలోని ఒకటి రెండు పంక్తులైనా రానివాళ్ళరుదు. సాహిత్య ప్రక్రియలలో విశేష పాండిత్యం (వైదగ్ధ) చూపిన రచయితకు కేవలం సినిమా పాటల వల్ల కీర్తిప్రతిష్టలు రావడం పాట ప్ర యోజనాన్ని తెలియజేస్తుంది. సినిమా సాహిత్యానికి దానిలో భాగమైన పాటను గుర్తించి ఇటు ప్రభుత్వం, అటు జనసామాన్యం సినిమా కవులకిస్తున్న గౌరవసత్కారాలు చూస్తే పాటకుండే ప్రయోజనం వ్యక్తమవుతుంది. మాటల్లో చెప్పలేని ఏ అనుభూతినైన అందంగా మ- నసుకు హత్తుకునేలా చెప్పటం పాట ప్రయోజనం. 1

(1. డా. సినారె సినీగీతాల సంపుటి ‘పగలే వెన్నెల’ సౌందర్య దృష్టి పుట -20)

తొలినాటి సినిమాలలో ఉపశమనం, ఉత్సాహం, కథానిర్వహన పాటలు ప్రయోజనాలు. అయితే వాటిలో అధిక శాతం వాచ్యంగా ఉండేవి. రామరాము సినిమా పాట ధ్వని, క్లుప్తత, ఆప్తత, ప్రసన్నత తదితర లక్షణాలను అలవర్చుకొని ప్రేక్షకుల తలలో నాలుకైంది, సినిమాకు ప్రాణమైంది. సినిమాల వల్ల పాటలకు పాటల వల్ల సినిమాలకు జనంలో ఆదరణ పెరిగింది. పాటలు లేని సినిమాలు ఊహించలేని పరిస్థితి ఏర్పడింది. చలనచిత్ర సంగీతం నేడు ప్రజాసంగీతం. 

సినిమా పాట అనేది వ్యాపార ప్రక్రియే అయినా అందులోనూ ఏ గొప్ప కవిత్వానికి తీసిపోని సినిమా పాటలున్నాయి. అటు సినిమా పాటల్ని యిటు సినీయేతర సాహిత్య ప్రక్రియలను ఏలిన ఎందరో రచయితలకు ఆ సాహిత్య ప్రక్రియల్లో కంటే సినిమా పాటల వల్ల వచ్చిన గుర్తింపే ఎక్కువ. పూర్వం సినిమాలకు పాటలు రాసిన వారిలో పాండిత్య ప్రకర్ష, సాహిత్యంలో అభినవేశం వున్న వాళ్ళే ఎక్కువ. 

(1. తెలుగు సినిమా పాట - డా. పైడిపాల, పుట : 17)

సినిమా వ్యాపార పరిశ్రమ అయినా పాటల్లో సాహితీ విలువలు లేకపోలేదు. శ్రీశ్రీ ఒక చోట చెప్పినట్లు న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే కానీ, గెలిచినదంతా న్యాయం కాదు. అదే విధంగా సినిమాలు ఎన్నో వచ్చినా, అందులో ఎన్నో పాటలు వినిపించినా చౌకబారు వన్నీ గతించిపోయాయి. కళాత్మకమైనవి మాత్రమే కాలమనే గీటురాయిపై నిగ్గుదేలి కలకాలం నిలిచి ఉన్నాయి, ఉంటాయి కూడా కాల పరీక్షకు నిలబడిన ఎన్నో పాటల ఆధారంగా సినిమా పాటల్లో సాహితీ విలువల్ని, కవితా సౌం దర్యాన్ని అంచనా వేయవచ్చు. ఇలాంటి పరిశోధనలెన్నింటిలో కేంద్ర బిందువుగా నిలిచినది. భైరవభొట్ల చలనచిత్ర పరిశోధన కేంద్రం. ఈ కేంద్రంలో భద్రపరచబడివున్న అమÖల్యమైన సినీ గేయకోశాలను భైరవభట్ల ఎంతో శ్రమించి, కథాపరంగా, అందులోని వస్తువైవిద్యపరంగా విభజించి భావి పరిశోధకుల కోసం నిక్షిప్త సినీజ్ఞాన సంపదను మనకు అందించాడనుట నిజం. తెలుగు సినిమా పాటల్లో కథావస్తు పరంగా భైరవభొట్ల చేసిన వర్గీకరణ లోని వైశిష్ట్యతను, పరిశోధన విషయాన్ని వివరించటం ఈ అధ్యాయంలో జరుగుతుంది. 

కొన్ని విశ్లేషించే ముందుగా ఈ రకమైన క్లిష్ట పరిశోధనకు భైరవభొట్లకు ప్రేరణగల పూర్వరంగాన్ని వివరించడం సముచితం. 

4.3. పూర్వరంగం : 

భైరవభొట్లకు చాలా చిన్నతనం నుంచే పాటలు విని పరవశించే గుణం వుండేది. ఆ పారవశ్యంలో ఏీVAటల్లో తెల్లవారు జామున సినిమాలకు సంబంధించిన గ్రామ్ ఫోన్ రికార్డులు వేసినపుడు, పెళ్ళిళ్ళకు సన్నాయితో సినిమా పాటలు వినిపించేటపుడు, సినిమా పాటల గాత్ర కచ్చేరీలు వినేటపుడు, తనువును, మనసును భైరవభొట్లు మరచిపోవటం సర్వసాధార ణమైనది. పసితనంలో జోలపాటలు విన్న బాల్యంలో సంగీత మాష్టారు చెప్పే పాటలు విన్న, హైస్కూల్ చదివేటపుడు వార్షి- కోత్సవాల్లో సినిమా పాటలు ఎవరు పాడినా తనకు తెలియ- కుండానే మనస్సు అటు వెళ్ళిపోయేది. బాల్యంలో తాను చూసిన ‘మల్లీశ్వరి (1951), ‘రోజులు మారాయి’ (1955), విప్రనారాయణ (1955), సువర్ణ సుందరి (1957), ‘అల్లా ఉద్దీన్ అద్భుత ద్వీపం (1957), మాయాబజార్ (1957) చిత్రాల్లోని పాటలు వినగా వినగా వాటి తాలుకు పాటల పుస్తకాల కోసం కొనుక్కొని చదువుతుండేవాడు. అలా చదవడంలో ఎంతో మధురానుభూతి పొందేవాడు. జూన్ 1963 లో ఏ. ఎన్. ఆర్ కాలేజీలో బి.ఏ., లిటరేచర్ లో చేరిన రోజు నుంచి డా. బండ్లమÖడి ఆంజనేయలు (రిటైర్డ్ హిందీ లెక్చరర్, ఏ.ఎన్.ఆర్ కాలేజీ, గుడివాడ) మరియు గార సత్యనారాయణ మÖరి ఆనాటి తన సహపాఠి, ఈ నాటి మేటి సినీ దర్శకులు). వీరిద్దరి హిందీ తెలుగు సాహిత్యం ద్వారా, సినిమా పాటల ద్వారా భైరవ భొట్లలోని పరిశోధకుడు క్రమక్రమంగా పరిణితి చెందాడు. 

డా. బండ్లమÖడి ఆంజనేయులు హిందీ సాహిత్య పాఠాలే కాకుండా శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, గజ్జెల మల్లారెడ్డి, డా. సి.నారాయణరెడ్డి మొదలైనవారి రచనలను వినిపించి భైర వభొట్ల చేత చదివించాడు. అప్పటిదాకా చిన్నచిన్న హిందీ గేయాలు రాస్తున్న భైరవభొట్ల తెలుగులో కూడా గేయాలు రాయమన్నాడు. మనస్సులోకి వచ్చిన భావావేశాన్ని కాగితం మీద వెంటనే పెట్టి తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. భైరవభట్ల రాయడానికి సంకోచించినపుడు భయాన్ని పోగొట్టి ధైర్యంతో గేయాలను రాయటానికి బండ్లమÖడి ఆంజనేయులు ప్రేరేపిం చాడు. అట్లాగే భైరవభొట్ల తన మనస్సులోకి వచ్చిన భావావేశాల్ని కాగితం మీద పెట్టి రోజు కాలేజు ఆయిపోయిన తరువాత ఆంజనేయులు ఇంటికి వెళ్ళి చూపించేవాడు. ఆంజనేయులు ప్రతి పదాన్ని సరిదిద్ది సరియైన పదాన్ని ఎక్కడ వాడాలో, భావానికి భాష ఎంత కావాలో ఉదాహరణగా చెప్పేవాడు. ఒక్కోసారి భావానికి భాష సరిపోకపోతే దానికి సరిపడే గ్రంథాలు ఇచ్చి చదవమనేవాడు. ఇట్లా శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ గేయాలు, ఆ గేయాలు రోజు భైరవ బొట్ల చేత చదివించే వాడు. ఇలా చదవటం, రాయటం ఒక వ్యవనంగా మారింది. ఆంజనేయులుగారు సరిదిద్దిన తెలుగు గేయాలను పత్రికలకు ప్రచురణార్థం భైరవభొట్ల పంపించేవాడు. పంపించిన గేయాలు మరల తిరుగు ప్రయాణంలో వస్తుండేది. కానీ 1-9-1963న హైదరాబాద్ నుంచి వెలువడిన పంచాయత్ అనే మాసపత్రి భైరవభొట్లు రచించిన ‘ధన్యజీవి అనే గేయం ప్రచురింపబడింది. ఆ గేయం ప్రచురింపబడిన తరువాత ఇంకా రాయాలనే ఉత్సాహం పెరిగింది. ఆ ఉత్సాహంతోనే తమ కళాశాల పత్రికల్లో ‘ బంగారుపాప’, ‘ఆశాకిరణం’, ‘భారతవీరా రావేలా’ మొదలగునవి ప్రచురింపబడ్డాయి. 

గార సత్యనారాయణ మÖర్తి బి.ఏ., తరగతిలో మÖడు సంవత్సరాలు తనకు క్లాస్ మేట్. ఈ మÖడు సంవత్సరాల కాలంలో హిందీ సినిమా ప్రముఖుల గురించి, ఖాళీ దొరికినప్పుడల్లా సినిమా పాఠాలు చెప్పి ముఖ్యంగా హిందీ తెలుగు సినిమా కవుల రచనల పట్ల ఆసక్తి పెంచాడు. 

ఆరు సంవత్సరాల కాలంలో ఒక ప్రక్క హిందీ సినిమా పాటల పుస్తకాలు, మరో ప్రక్క తెలుగు సినిమా పాటల పుస్తకాలు కొనుక్కొని పాటలను విడివిడిగా రాసుకోవటం ఆయ నకు అలవాటు అయింది. ఒకే సన్నివేశంలో హిందీ సినీ కవి ఎట్లా రాశారో, అదే సన్నివేశానికి తెలుగు సినీకవి ఎట్లా రాశారో రెండు పాటలను విడివిడిగా రాసుకొని తులనాత్మకంగా పరిశీ- లించడం ఆనాడే ప్రారంభమైంది. 

ఆదే విధంగా ఒక నాయక ప్రేమగీతం, దేవులపల్లి ఎట్లా రాసారో  మల్లాది కృష్ణశాస్త్రి, సముద్రాల, పింగళి, ఆరుద్ర, ఆత్రేయ, శ్రీశ్రీ మొదలగువారు కూడా ఏ విధంగా రాశారో, వాటినన్నింటిని విడివిడిగా రాసుకొని ఒక క్రమ పద్ధతిగా చేసుకొని చదవటం ప్రారంభించేవారు. ఇదే విధానం ఒకే సందర్భానికి హిందీ సినిమా కవులైన షకీల్ బదయుని ‘శైలేంద్ర’, ‘రాజేంద్ర కిషన’, ‘సాహిర’, ‘ప్రదీప’ మొదలగువారు  పాటలను విడివిడిగా రాసుకొని హిందీ భాషలో కూడా తులనాత్మక పరిశీలన ప్రారంభించాడు. ఇట్లా హిందీ సినిమా కవుల గురించి, తెలుగు సినిమా కవుల గురించి కథావస్తుపరంగా హిందీ పాటలను, తెలుగు పాటలనూ విడివిడిగా రాసుకొని ఫైలు చేసుకోవడం ఒక అలవాటుగా భైరవ భొట్లకు అయింది. 

ఆ రోజుల్లో గ్రామఫోను రికార్డులు, పాటల పుస్తకాలు మినహా ఈ నాటిలాగా ఆడియో, వీడియో క్యాసెట్లు, ఆడియో, వీడియో సి.డిలు, డి.వి.డిలు లేవు. అందరికీ ఆ రోజుల్లో అందుబాటులో ఉండేవి హిందీ సినిమాలకైనా, తెలుగు సినిమాలకైనా పాటల పుస్తకాలే. పాటల పుస్తకాలు చదవటం దశనుండి అవి విడివిడిగా రాసుకొని వాటిని ఫైలు చేసుకొని చదవటం అనే అలవాటు 1963 సంవత్సరంలోనే భైరవభొట్లకు ప్రారంభమైంది. 

హిందీ తెలుగు సినిమా పాటల తులనాత్మక అధ్యయనానికి చేసిన సహాయక రచయిత కృషి అటు హిందీ, తెలుగు కవుల దగ్గర భైరవభొట్ల శ్రమ ఆర్థికంగా స్థిరపడడానికి ఉపయోగపడలేదు. ఇటు మహెచ్.డి డిగ్రీ కూడా పూర్తికాలేదు. కాని కృష్ణా జిల్లా గుడివాడలో 1988 వ సంవత్సరంలో భైరవభొట్ల చలనచిత్ర పరిశోధన కేంద్రం స్థాపించిన నాటినుండి నేటిదాకా తెలుగు సినిమా పాటల పరిశోధకులకు ఈ పరిశోధన కేంద్రం వరప్రసాదమైంది. 

4.4. గీతాల వర్గీకరణ : 

భైరవభొట్ల నారాయణరావు తెలుగు సినిమా పాటలను పి.హెచ్ కథావస్తు పరంగా ఈ క్రింది విధముగా వర్గీక- రించాడు. వీటిలో కొన్ని మాత్రమే ముద్రితమయ్యాయి కూడా. 

1. నాయక ప్రేమ గీతాలు 

2. నాయిక ప్రేమ గీతాలు 

3. యుగళ ప్రేమ గీతాలు 

4. నాయక భగ్న ప్రేమ గీతాలు 

5. నాయిక భగ్న ప్రేమ గీతాలు 

6. నృత్య గీతాలు 

7. శృంగార (శాస్త్రీయ) నృత్య గీతాలు 

8. భక్తి గీతాలు 

9. లాలి గీతాలు/ జోల పాటలు 

10. దేశభక్తి గీతాలు 

4.4.1. నాయక ప్రేమగీతాలు : 

“ప్రణయ శబ్దమును ప్రాచీన కవులు లాక్షణికులు, స్త్రీ, పురుషుల మధ్య గల శృంగారంలోనే కాక సాధారణ స్నేహమును వాడిరి.1 “ప్రేమ, స్నేహం, అనురాగం, మన అర్థంలోను సౌహార్థం మొదలైన వివిధ నామములతో పేర్కొనబడెడి ఏ మథుర కోమల భావం. ఈ విశ్వంలోని చరాచర భూత జాలము నందుడు ఏక సూత్ర బద్దం చేయుట కవి యత్నించుచుండునో, ఆనిర్వచనీయమైన ఆ హృదయమునకు ప్రణయం 2 అని అంటారు. కాగా కాళిదాసు తన కుమార సంభవంలో ప్రణయాన్ని స్నేహార్థంలో ప్రయోగించినట్లు క్రింది శ్లోకాన్ని బట్టి తెలుస్తుంది. 

‘అపి ప్రసన్నం హరిణేఘతేమన: కరస్థ దర్భ ప్రణయాపహారిఘ’ 3

శృంగారం అంగికమని, ప్రణయం పరస్పర భావ సంబంధమున్న ఇద్దరు జీవుల మధ్య ఉండే ఇష్టమని చెప్పవచ్చు. అంతమాత్రాన శృంగార స్పర్శ ఉండదని కాదు. అది అంతర్లీనంగా మాత్రమే ఉండి నాయికా నాయకులు విషయానికొస్తే నాయికా నాయకులు ఇష్టపడి పాడుకునే ప్రేమగీతాలే ప్రణయ గీతాలని చెప్పాలి. 

1. ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయము - ప్రయోగములు డా. సి.నా.రె. పుట: 112 )

2. సాహిత్య శిల్ప సమీక్షబీ పింగళి లక్ష్మీకాంతం, పుట : 35)

3. కుమార సంభవం - పంచమ సర్గ 

శృంగారాన్ని తెరమీద చూపవలసి వచ్చినపుడు పడకిల్లు, ఉద్దీపనాలూ, శృంగార చేష్టలూ, మన్మధావస్థలూ ప్రదర్శించవలసి ఉంటుంది. ప్రణయ గీతాల్లో ఇవేవీ ఉండనక్కరలేదు. ప్రేయసీ ప్రియులు ఉద్యానవనాల్లోనో, తమకిష్టమైన ఏకాంత ప్రదేశాల్లోనో ఒకరిపై మరొకరికి గల ఇష్టాన్ని చూపులతోనూ, చిరు స్పర్శలతోనూ వ్యక్తం చేస్తూ పాడుకునే ఈ పాటలే ప్రణయగీతాలు. 

తెలుగు సినిమాలలో ప్రణయ సన్నివేశానికి అనుగుణంగా నాయకుడు పాడే ప్రేమ గీతాలను ఈ సంపుటిలో భైరవభొట్ల పొందుపరిచాడు. గుణసుందరి కథ (1949) చిత్రం నుంచి అల్లుడే మేనల్లుడు (1970) సినిమా దాకా లభ్యమవుతున్నాయి. ఈ సంపుటిలో ప్రసిద్ధమైన పాలు ఈ క్రింది ప్రకారము యివ్వబడ్డాయి. 

చిత్రం పేరు పాట పల్లవి 

1. సంతానం (1954) దేవి శ్రీదేవి 

2. జయం మనదే (1956) చల్లని వెన్నెల 

3. మంచి మనసుకు మంచి రోజులు (1958) నా చెలియా ... 

4. జయభేరి (1959) రాగమయి రావే, అనురాగమయి రావే

5. గుండమ్మకథ (1962) మౌనముగా నీమనసు పొడిన 

6. ఆరాధన (1962) నాహృదయంలో నిదురించే చెలి 

7. తోబుట్టువులు (1963) సాగేను జీవిత నావ

8. పునర్జన్మ (1963) ఓ సజీవ శిల్పసుందరి 

9. దాగుడు మÖతలు (1964) గోరంక గూటికి చేరేవు చిలుక 

10 దేశద్రోహులు (1964) జగమే మారినది మధురముగా ఈ వేళ 

11. పూజాఫలం (1964) నిన్నలేని అందమేదో 

తెలుగు సినిమా సంగీత సాహిత్యాలకు పట్టం కట్టిన కాలంలోని అమÖల్యమైన ఉత్తమ గీతాలను భైరవభొట్ల ఇందులో 

ఎంపికచేసి గ్రంథస్థం చేశాడు. 

4.4.2. నాయిక ప్రేమ గీతాలు : 

నవయవ్వనుల హృదయాల్లో ప్రేమోదయం ప్రకృతి సహజం. అట్టి తరుణంలో యువతీయువకులు తమకు కాబోయే ప్రియుడు లేదా జీవిత భాగస్వామి గురించి అందమైన కలలు కంటూ మధురమైన ఆశలు మనసులో పెంచుకోవడం సర్వ సాధారణం. ఈ విషయమై కథానాయిక పాత్రలకు మాత్రమే నిర్ధేశింపబడిన సోలో గీతాలనూ భైరవభట్ల ఒక గ్రంథరూపంలో సంపుటీకరించాడు. ఈ సంపుటిలో మల్లీశ్వరి (1951) దగ్గరి నుంచి కుటుంబాల కథ (1970) మధ్య కాలంలో ఉన్న ప్రసిద్ధమైన సంగీత సాహిత్యాలకు సమన్వయమైన నాయిక ప్రేమ గీతాలను 3 సంపుటిలో పొందుపరిచాడు. యథాప్రకారంగా పాట పై భాగంలో పాట రచించిన కవిపేరు, పాడినవారి పేరు ఇవ్వ బడ్డాయి. ఈ సంపుటిలో ప్రసిద్ధమైన పాటలు ఈ క్రింది ప్రకారంగా ఉన్నాయి. 

చిత్రం పేరు పాట పల్లవి

1. మల్లీశ్వరి (1951) మనసున మల్లెల మాల లూగేనే 

2. దొంగరాముడు (1955) అనురాగము విరిసెన ఓరే రాజా 

3. మిస్సమ్మ (1955) ఏమిటో ఈ మాయ 

4. భలే అమ్మాయి (1956) అందాల రూపము ఆనంద దీపము 

5. అన్నా తమ్ముడు (1957) మ్రోయింపవే హృదయ వీణా

6. దొంగల్లో దొర (1957) వన్నెల మోహనుడేడమ్మా

7. సారంగధర (1958) అడుగడుగో అల్లడుగో అభినవ నారీ మన్మధుడు

8. రాజ నందిని (1958) నీ మీద మనసాయే రా 9. శాంతినివాసం (1960) కలనైనా నీ వలపే 

10. పెళ్ళి కానుక (1960) పులకించని మది పులకించు

11. గుండమ్మకథ (1962) కనులు మÖసినా నీవాయె

12. ఇద్దరు మిత్రులు (1962) పాడవేలా రాధికా

13. చదువుకొన్న అమ్మాయిలు (1963) వినిపించని రాగాలే. 

14. పూజాఫలం (1964) పగలే వెన్నెల జగమే ఊయల 

15. కథా నాయకుడు (1969) ముత్యాల ఝల్లు కురిసే 

4.4.3. యుగళ ప్రేమగీతాలు : 

తెలుగు సినిమాల్లో కథలో ప్రేమ సన్నివేశాన్ని బట్టి ప్రేమను పరస్పరం తెలుసుకునేందుకు, ప్రేమ ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు నిర్మలమైన, నిస్వార్థమైన ప్రేమను ప్రతిపాదించేందుకు కథలో ప్రేక్షకుడికి మనోల్లాసాన్ని కలిగించేందుకు కథా గమనాన్ని పెంచేందుకు ఈ యుగళ ప్రేమగీతాలు రచింపబడతాయి. 

ఇద్దరు గాయనీగాయకులు లేదా ఇద్దరు గాయకులు లేదా ఇద్దరు గాయనీ మణులు గానీ కలిసి ఆలపించే గీతాలను సాధారణంగా ‘యుగళగీతాలని అంటారు. కథాపరమైన సందర్భ సన్నివేశాలు, పాత్రల స్వభావ స్థితిగతులు వంటి అంశాలు సినీ గీతానికి మÖల ప్రేరణలు. వీటిని అనుసరించి గీతాలను రచించే సంప్రదాయం ప్రసిద్ధంగా పాటింపబడిన రోజుల్లో వెలువడిన శృంగార యుగళ గీతాలలో కూడా మానవజీవితంలో ప్రధానపాత్ర వహించే అనుబంధాలు, ఆత్మీయతలు, సామాజిక కట్టుబాట్లు, సాంప్రదాయకమైన ఆలోచన సరళి ఇత్యాది ప్రధానాంశాలను హృద్యంగా ప్రకటించడం జరిగింది. 

తెలుగు సినిమా స్వర్ణయుగంలో కవుల చేత రచింపబడ్డ దర్శకులచే చిత్రింపబడ్డ ఈ పాటలను “పాతాళభైరవి (1951) దగ్గరనుంచి విజయం మనదే (1970) దాకా వున్న యుగళగీతాలను సంపుటిలో భైరవభట్ల పొందుపరిచాడు. ఈ సంపుటిలోని ప్రసిద్ధమైన పాటలు ఇక్కడ ఉదహరించడం జరిగింది. 


చిత్రం పేరు పాట పల్లవి రచయిత

1. పాతాళభైరవి (1951) ఎంత ఘాటు ప్రేమయో పింగళి 

2. దొంగరాముడు (1955) చిగురాకులలో చిలుకమ్మ సీ. సముద్రాల 

3. మాయ బజార్ (1957) చూపులు కలిసిన శుభవేళ పింగళి 

4. తోడికోడళ్లు (1957) ఆడుతూ, పాడుతూ పనిచేస్తుంటే కొసరాజు 

5. భలే అమ్మాయిలు (1957) మది ఉయ్యాల లూగే సదాశివబ్రహ్మం

6. పాండురంగమహాత్యు (1957) నీవని నేనని తలచితిరా జూనియర్ సముద్రాల 

7. మాంగల్యబలం (1959) ఆకాశ వీధిలో అందాల జాబిలి శ్రీ శ్రీ 

8. పెళ్ళి సందడి (1959) రావే ప్రేమలత జూ. సముద్రాల 

9. భట్టి విక్రమార్క (1960) ఓ నెలరాజా వెన్నెల రాజా అనిసెట్టి 

10. ఇద్దరు మిత్రులు (1961) ఖుషీ ఖుషీగా నవ్వుతూ దాశరథి 

11. భార్యాభర్తలు (1961) మధురం మధురం ఈ సమయం శ్రీశ్రీ 

12. గుండమ్మ కథ (1962) ప్రేమ యాత్రలకు బృందావనము పింగళి 

13. మంచి చెడు (1963) రేపంటి రూపం కంటి ఆత్రేయ

14. శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) మనసు పరిమళించెనే పింగళి

15. చదువుకున్న అమ్మాయిలు (1963) కిలకిల నవ్వులు చితికిన సినారె

16. ఆత్మబలం (1964) చిటపట చినుకులు పడుతూ వుంటే ఆత్రేయ 

1. రాముడు భీముడు(1964) తెలిసిందిలే తెలిసిందిలే సినారె 

18. గుడు మÖతలు (1964) అడగకనే ఇచ్చిన మనసే ముద్దు ఆత్రేయ 

19. వారసత్వం (1965) ప్రేయసి మనోహరీ ఆరుద్ర

20. విజయం మనదే (1970) నామదిలో ఉందకు మందిరమా 

4.4.4. నాయక భగ్న ప్రేమ గీతాలు: 

తెలుగు సినిమాలలో కథావస్తుపరంగా సన్నివేశాన్ని బట్టి, నాయకుని భగ్న ప్రేమను తెలిపే గీతాలు ఇవి. వీటినే ‘విప్రలంభ శృంగార గీతాలు’ అంటారు. విప్రలంభ శృంగారానికి ‘వియోగశృంగారం’ అని పేరు. పరస్పర కలయికకు దూరమై, ఆ కలయిక పొందలేని ప్రేయసీ ప్రియులు, నాయికా నాయకుల లేదా యువతీ యువకుల మధ్య అనురాగం, అభీష్టం, ఆలింగనం వంటివి దూరమైతే అందమైన విరహం పొందడమే విప్రలంభ శృంగారం. అంటే స్త్రీ పురుషులు లేదా ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు విడిచి దూరంగా ఉంటూ, ఎడబాటు కలిగితే అది విప్రలంభ లేదా వియోగ శృంగారాన్ని సూచిస్తుంది. 

ఈ పాటల్లో కథలో పాత్రను బట్టి, నాయకుడు తన దురదృష్టాన్ని గురించి బాధపడుతాడు. తన అమాయకత్వాని రోధిస్తాడు ప్రకృతిని నిలదీస్తాడు. దేవుణ్ణి కూడా ప్రశ్నిస్తాడు. ఒకోసారి ఈ భగ్న ప్రేమలో నాయిక సుఖ సంతోషాలను కోరుకుంటారు. ఒకసారి ఓడిపోయిన మనసును వేదాంతంలోకి మార్చుకొంటాడు. తెలుగు సినిమా చరిత్రలో విషాద గీతాలకు గాని, నాయక భగ్న ప్రేమగీతాలకు గాని మంచి గుర్తింపు వుంది. సన్నివేశం విషాదమైన ప్రేక్షకులకు శ్రోతలకు విషాదమే వేదాంతాన్ని బోధిస్తుంది. దుఃఖాన్ని ప్రతిరోజు చూస్తే, దుఃఖాన్ని వింటే, దుఃఖం మనిషి దగ్గరకి రాదంటారు. పాశ్చాత్య శాస్త్రజ్ఞుల యుగళ ప్రేమగీతాలు ఎట్లాగైతే ప్రచారం పొందాయో భగ్నప్రేమ గీతాలు కూడా అట్లా ప్రచారాన్ని పొందాయి. ఈ నాయక భగ్న ప్రేమ గీతాల సంపుటిలో దేవదాసు (1953) దగ్గరి నుంచి ప్రేమలు - పెళ్ళిళ్ళు (1974) దాకా భగ్న ప్రేమ గీతాలను పొందుపరచడం జరిగింది. ఈ సంపుటిలో ప్రసిద్ధమైన నాయక భగ్న ప్రేమ గీతాల పాటలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

చిత్రం పేరు పాట పల్లవి రచయిత

1. దేవదాసు (1953) జగమే మాయ బ్రతుకే మాయ సీ. సముద్రాల 

2. పెళ్ళికానుక (1960) తీరెనుగా నేటితో నీ తియ్యని గాధ ఆత్రేయ

3. పెండ్లి పిలుపు (1961) నాలోని అనురాగమంతా 

4. జగదేక వీరుని కథ (1961) రారా కనరారా పింగళి

5. పరువు ప్రతిష్ట (1963) ఇలా ఇలా జీవితం పోతేపోనీ... 

6. డాక్టర్ చక్రవర్తి (1964) ఎవరో జ్వాలను రగిలించారు ఆత్రేయ

7. మురళీకృష్ణ (1964) నీ సుఖమే నేవోరుతున్నా ఆత్రేయ

8. ఆడ బ్రతుకు (1965) తనువుకి ఎన్ని గాయాలైనా 

9. ఉయ్యాల జంపాల (1965) ఏటిలోని కెరటాలు ఏరు విరిచి పోవు ఆరుద్ర

10. కన్న మనషులు (1967) ఓ హృదయం లేని ప్రియురాలా 

11.రాము (1968) మంటలు రేపే నెలరాజా దాశరథి 

12. భాగ్యచక్రం (1968) ఆశను నిరాశ చేసితివా పింగళి

13. పెళ్ళిరోజు (1968) అలనాటి చెలిమి ఒక వేళ 

14 మÖగసోము (1969) నిజమైన కల అయిన నిరాశ ఒకటిలే దాశరథి 

చిత్రం పేరు పాట పల్లవి రచయిత

15. ప్రేమనగర్ (1971) మనసుగతి ఇంతే ఆత్రేయ

16.పగ బట్టిన పడుచు (1971) అనుకొన్నది ఏమైనది 

11. మనువు మనసు (1973) ఎవరులేరు నీకు ఎవరు లేరు 

18. బంగారు బాబు (1973) ఏమనుకొన్నావు నన్నేమను కొన్నావు ఆత్రేయ 

19. ప్రేమలు పెళ్ళిళ్ళు (1974) మనసులేని దేవుడు ఆత్రేయ 

4.4.5. నాయిక భగ్న ప్రేమగీతాలు : 

తెలుగు సినిమాలలో కథా వస్తుపరంగా, సన్నివేశ ప్రధానంగా ప్రేమను పొందలేకపోయిన ప్రేమమÖర్తి అయిన నాయిక తన ప్రియునితో ఎడబాటు కలిగినపుడు నాయిక శోకిస్తూ పాడుకొనే పాటలు నాయిక భగ్నప్రేమ గీతాలు అంటారు. ఈ రకమైన పాటలన్నింటిని భైరవభొట్ల సంపుటీకరించాడు. 

ఇందులో దేవదాసు (1953) నుంచి భార్యాబిడ్డలు (1972) దాకా మధ్యలో ఉన్న నాయిక భగ్నప్రేమ గీతాలను పొందుపరచటం జరిగింది. యథాప్రకారంగా పాట పై భాగాన ఆపాట రచించిన కవి పేరు, పాట పాడినవారి పేరు, చిత్రం పేరు ఇవ్వబడ్డాయి. 

చిత్రంపేరు పాట పల్లవి రచయిత

1. దేవదాసు (1953) తానే మారిన గుణమే మారిన సీ. సముద్రాల

2. దేవదాసు (1953) అంతా భ్రాంతియేనా, జీవితాన

3. అర్ధాంగి (1955) ఎక్కడమ్మా చంద్రుడు ఆత్రేయ

4. పెండ్లి పిలుపు (1962) మారెను ప్రేమ సుధ విషముగా

5. భార్యాభర్తలు (1962) ఏమని పాడెదనో ఈవేళ శ్రీశ్రీ

6. పరువు ప్రతిష్ట (1962) 1. కన్నులు ఉండి చూడలేను

2. ఆమబ్బు తెరల్లో దాగుంది చందమామ

7. ఆరాధన (1962) నీ చెలిమి నీడే కోరితి నార్ల చిరంజీవి 

8. సవతి కొడుకు (1963) ఆనాటిహాయి ఏమాయినో 

9. మÖగమనుసులు (1964) మానుమాకును కాను ఆత్రేయ 

10. ఆత్మబలం (1964) నాలుగు కళ్ళు రెండై నాయి ఆత్రేయ 

11. సి. ఐ.డి. (1965) జగము చీకటాయినే పింగళి 

12 . మనుషులు మమతలు (1965) కన్ను మÖసింది లేదు దాశరథి

13. వివాహబంధం (1965) ఆలు మగలు విడిపోయినంతనే సి.నా.రె. 

14. అడుగుజాడలు(1966) మÖగబోయిన హృదయ వీణ 

15 ఆత్మగౌరవం (1966) బ్రతుకే నేటితో బరువైపోయెతే 

16. పూలరంగడు (1967) నీవు రావు నిదురరాదు 

17. దసరాబుల్లోడు (1971) చేతిలో చెయ్యేసి చెప్పు బావ ఆత్రేయ 

4.4.6 నృత్య గీతాలు : 

సినిమాకున్న Vఱsuaశ్రీ attతీactఱశీఅ వశ్రీవఎవఅts లో అత్యంత ప్రధాన పాత్ర వహిస్తున్న కళాంశమే నృత్యం. నేడు దేశవ్యాప్తంగా నిర్మితమవుతున్న ఏ భాషా చిత్ర గీతానికి చెందిన దృశ్యరూపానికైనా ప్రాణం, ఆయా నటీనటుల నటనాకౌశలానికి కొలమానం నృత్యమేనని సినీ పెద్దల అభిప్రాయం. 

నేడు సినిమారంగంలో హీరో, హీరోయిన్లుగా స్థానం సంపాదించుకోవాలన్నా, సంపాదించుకొన్న స్థానం సుస్థిరం చేసుకోవాలన్నా ఆయా నటీనలులకు నృత్యమే శరణ్యం. అంటే సినిమారంగాన్ని పాలించే నటులు ఇమేజ్ ను ్పుశీఎఎaఅd చేస్తున్న జూశీwవతీfuశ్రీ ఎవdఱa నృత్యం అనడంలో అతిశయోక్తి లేదు. ఆనంద మయమైన భావావేశాన్ని గానీ విషాదమయమైన మనోద్వేగాన్ని గానీ అభివ్యక్త పరచడానికి నాట్యం ఒక బలమైన సాధనం. అట్టి నాట్యం మానవునికి ప్రకృతిచ్చిన వరం. ప్రాక్తన మానవుని యొక్క సుఖదుఃఖానుభూతులను ప్రేరణ ఫలితంగా పాటతో పాటే పుట్టిన లయాత్మకమైన చిందులే నాట్యానికి బీజాలు. గానంతో పాటే నాట్యానికి ఒక ప్రత్యేకమైన సృజనశీల కళారూపాన్ని ప్రసాదించింది మానవుడే అని పండితులు నిర్ధారణ. 

‘తెలుగు టాకీయుగం ప్రారంభమైన తొలిదశలో (1937-38) అంటే వెండి తెరపై కదిలే బొమ్మలను చూడటానికి జనం అలవాటుపడుతున్న రోజుల్లో సినిమా ప్రదర్శనను మధ్యలో ఆపుజేసి, అదే వేదికపై శాస్త్రీయ నృత్యాలను మరియు మ్యాజిక్ షోలను వినోదార్థమై ప్రదర్శించేవారు’ 1. ఆవిధంగా ఒకనాడు సినిమా కంటే ప్రజారంజకమైన కళగా భాషించిన నృత్యం. నేడు సినీగీతాలకే కీలక కళాంశంగా స్థిరపడింది. అందుకు ముఖ్య కారణం నృత్యకళలో నిక్షిప్తమై వున్న ప్రధాన ఆకర్షణే. 

(1. పోణంకి శ్రీరామ అప్పారావు - తెలుగు నాటక వికాసము పుట: 10,11,12) 

తెలుగు సినిమా భాంగ్రా పాటలలో కథావస్తుహారంగా శాస్త్రీయ నృత్యాలు, జావళీ నృత్యాలు, పంజాబీ నృత్యాలు, పాశ్చాత్య నృత్యగీతాలు, సామÖహిక నృత్యగీతాలు మొదలగునవి చోటుచేసుకున్నాయి. భైరవభొట్ల రూపొందించిన పాటల సంపుటిలో అనేక రకాల నృత్యగీతాలను, నృత్య నాటికలను సంపుటీకరించారు. శాస్త్రీయ నృత్యాలకు ప్రత్యేకంగా ఒక సంపుటిని భైరవభొట్ల తయారుచేశాడు. ఆ సంపుటి వివరాలు గురించి తరువాతి శీర్షికలో చర్చించడం జరుగుతుంది. తెలుగు సినిమాల్లో ప్రఖ్యాత నర్తకీమణులైన లలిత, పద్మిని, రాగిణి, సరోజ, కుచలకుమారి, ఎల్. విజయలక్ష్మి, జ్యోతిలక్ష్మి, జయమాలిని, హలం మొదలగు నర్తకీమణుల ప్రసిద్ధ నృత్యగీతాలను కూడా ఈ సంపుటిలో 

పొందుపరచడం జరిగింది. 

యథాప్రకారంగా ఈ నృత్యగీతాల సంపుటికి కూడా పాట రచించిన కవిపేరు, పాడినవారి పేరు, సినిమా పేరు ఇవ్వటం జరిగింది. ఇందులో ‘గుణసుందరి (1949) నుంచి ‘మంచివాడు (1974) చిత్రం దాకా ఉన్న ఎన్నో నృత్యగీతాలను పొందుపరచటం జరిగింది. ఈ పాటల సంపుటిలో ప్రసిద్ధమైన నృత్యగీతాలు క్రింది విధంగా ఉన్నాయి. 

చిత్రంపేరు పాట పల్లవి  రచయిత

1. గుణసుందరికథ (1949) చల్లని దొరవేలే చందమామ పింగళి 

2. దేవదాసు (1953) అందం చూడవయా సీ. సముద్రాల 

3. తెనాలిరామకృష్ణ (1956) ఇచ్చకాలు నీకు నాకు అన్నమయ్య

4. పెళ్ళిసందడి (1956) హైలేలో నారాజ జూ. సముద్రాల

5. తోడికోడళ్ళు (1955) పొద్దైనా తిరగకముందే కొసరాజు

6. తోడికోడళ్ళు (1955) తింటానికి కూడు చాలదే కొసరాజు

7. మాయబజార్ (1957) ఒకటే మావయసు పింగళి

8. భూకైలాస్ (1958) సుందరాంగ అందుకోరా సీ. సముద్రాల 

9. జయభేరి (1959) నీ వెంత నెరజాన వగురా మల్లాది

10. భట్టి విక్రమార్క (1960) నటించన జగాలనే జయించనా అనిసెట్టి 

కన్నెపిల్ల సొగసు చూడు మహరాజు అనిసెట్టి

11. వెలుగు నీడలు (1961) సరిగంచు చీరకట్టి కొసరాజు 

12. ఇద్దరు మిత్రులు (1961) నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకేయివ్వాలి దాశరథి 

13. భార్యాభర్తలు (1961) రంగరంగేళి ఆరుద్ర 

14. గులేబకావళికథ (1962) మదనా సుందరా నా దొర సి.నా.రె. 

15. కులగోత్రాలు (1962) ఓ వన్నెల చిన్నెల కన్నెయ దాశరథి 

16. డాక్టర్ చక్రవర్తి (1964) ఓ ఉంగరాల మంగూరాల రాజా దాశరథి 

17 బాల మిత్రుల కథ (1973) పుట్టమీద పాల పిట్రోయ్ నాస్వామి 

4.4.7. శృంగార (శాస్త్రీయ) నృత్యగీతాలు (జావళీలు) : 

‘జావళి” అనేది శృంగార గీత రచనా ప్రక్రియ. ఈ ప్రక్రియ దాదాపు నాలుగైదు వందల సంవత్సరాలకు పూర్వం నాటి దేవదాసి వ్యవస్థలో మిక్కిలి ప్రాచుర్యం పొందిందని పండితుల అభిప్రాయం. ముఖ్యంగా సాత్వికాభినయ ప్రధానమైన ఈ సాహిత్యరూప ప్రదర్శనలో ముఖకవలికలు, కనుబొమల కదలికలు మరియు దరహాసాదుల ద్వారా నాయిక తన మనోగతాన్ని వెల్లడించవలసి వస్తుందనీ, తెలుగునాట ఒకప్పుడు క్షేత్రయ్య పదాలను జావళీలుగా పాడుకోవడం జరిగింది. సినారె గారు ఒక సందర్భంలో వివరించారు. 

చలనచిత్ర గీతాల్లోనూ ఈ విషయం స్పష్టంగా నిరూపించబడింది. క్షేత్రయ్య మరియు శీనయ్య వంటి వాగ్గేయకారుల రచనలను యథాతదంగా స్వీకరించి వాటిని జనరంజకమైన సినీగీతాలుగా మలచడం జరిగింది. 

‘ఇంతా తెలిసియుండి ఈ గుణమేలరా 

పంతమా మువ్వాగోపాలా నాస్వామి - దేవదాసు (1953) 

క్షేత్రయ్య 

“శివదీక్షా పరురాలనురా - నే 

శివదీక్షా పరురాలనురా - పూజాఫలం (1964) శీనయ్య వంటి గీతాలే ఇందుకు నిదర్శనాలు. 60వ దశకంలో శ్రీశ్రీ, ఆరుద్ర, సినారె వంటి వారిచే అన్ని తరహా చిత్రాల్లోనూ ఈ జావళీలను ఎక్కువగా రాయడం జరిగింది. నేడు సినిమా గీతాల్లో జావళీలకు కొంత కాలం చెల్లిపోయిందనవచ్చు. 

తెలుగు సినిమా పాటల్లో శ్రావ్యమైన, మంత్రముగ్దమైన శాస్త్రీయ నృత్యగీతాలు “మల్లీశ్వరి” (1951) చిత్రంలోని ‘పిలిచిన బిగువటరా’ లో మొదలయ్యాయి. అప్పటి నుంచి దాదాపు మÖడు దశాబ్దాలపాటు నృత్యగీతాలు జనాన్ని బాగా ఆకట్టుకొ అనేకమంది నాట్యాచార్యులకు ఇవి పాఠ్యగ్రంథాలయ్యాయి. భైరవభొట్లకు బాల్యం నుంచి నృత్యాలంటే ఒక ఆకర్షణ. అందువల్లనే ఆయన తన కోసం కాకుండా పరిశో ధకుల నిమిత్తం ఇరవయ్యేళ్ళనాడే దీనిని నృత్యగేయ కోశంగా రూపొందించాడు. ఈ గ్రంథం 23.12.2004 సంవత్సరమున హైదరాబాద్ లోని ఎస్. పి. బాలసుబ్రమణ్యం సమక్షంలో ఆవిష్కరింపబడింది. దీని తాలూకు వీడియో క్యాసెట్టుకూడా 17. 10. 1993 న అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా విశాఖపట్టణంలో ఆవిష్కరింపబడింది. ఈ పాటల సంపుటిలో మొత్తం అరవై నృత్యగీతాలున్నాయి. ఈ సంపుటిని కూడా సినీగేయ ప్రక్రియలో రూపొందించడం జరిగింది. ఈ సంపుటిలో ప్రసిద్ధమైన శృంగార (శాస్త్రీయ) నృత్యగీతాలు క్రింది విధంగా ఉన్నాయి. 

చిత్రంపేరు పాటపల్లవి రచయిత

మల్లీశ్వరి (1951) పిలిచిన బిగువట రా దే. కృష్ణశాస్త్రి 

మిస్సమ్మ (1955) బాలనురా మదన పింగళి

అప్పుచేసి పప్పుకూడు (1959) జోహారు గైకొనరా  పింగళి

సీతారామకళ్యాణం (1961) సరసాల జవరాలను సీ. సముద్రాల

అమరశిల్పి జక్కన (1964) అందాల బొమ్మతో ఆటాడవా దాశరథి

అమరశిల్పి జక్కన (1964) నగుమోము చూపించవా దాశరథి

బొబ్బిలియుద్ధం (1964) నినుచేర మనసాయెరా శ్రీశ్రీ

మంగమ్మ శపథం (1965) అందాల నారాజు అలకేలరా సినారె

పరమానందయ్య శిష్యుల కథ (1966) కామిని మదనరారా సినారె

డాక్టర్ ఆనంద్ (1966) నీలమోహనరారా కృష్ణశాస్త్రి 

భక్త ప్రహ్లాద (1967) రారా ప్రియ సుందరా దాశరథి 

కంచుకోట (1967) సరిలేరు నీకెవ్వరూ సినారె 

వసంతసేన (1967) ఏమివ్వగల దానరా

విచిత్ర కుటుంబం (1969) నలుగురు నవ్వేరు రా సినారె 

చిన్ననాటి స్నేహితులు (1971) ఏమి తెలపను రా సినారె

భక్త తుకారాం (1973) పూజకు వేళాయరా సినారె

భక్తతుకారాం (1973) సరిసరి వగలు తెలిసేరా గడుసరి సినారె

అభిమాన వంతులు (1973) ఎప్పటివలె కాదురా 

సిరిసిరి మువ్వ (1974) రారా స్వామి రారా 

మయÖరి (1985) అందెలు పిలిచిన 

ఈ సంపుటి ద్వారా భైరవబొట్లకు ఆంధ్రదేశంలో పండిత పామరులనుంచి, కళాకారుల నుంచి, నటీనటుల నుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి . 

4.4.8. భక్తి గీతాలు: 

“పూజ్యపూజక భావమే భక్తికి మÖల బీజము వంటిది. పూజ్య పదార్థమును పొందుటకు భక్తుడు చేయు ప్రయత్నము సాధన. ఈ సాధన అనేక రూపముల నుండి వచ్చును. దాస్యభక్తి, సఖ్యభక్తి, వాత్సల్య భక్తి, మధురభక్తి మున్నగునవి దీని రూపాంతరములు. 1

(1. సి. నా.రె. ఆధునికాంధ్ర కవిత్వం (1977) - సంప్రదాయములు ప్రయోగములు పుట : 432)

ఈ భక్తికి సంబంధించిన గీతాలు మన తెలుగు సినిమాల్లో అపారంగా ఉన్నాయి. అందుకు కారణం ఆంధ్రులు ఆధ్యాత్మిక ప్రియులు కావడమే. ముఖ్యంగా 1931 నుండి 1971 వరకు దాదాపు మన చిత్రరంగంలో భక్తి చిత్రాలే రాజ్యమేలాయి. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో దర్శక నిర్మాతలు విరివిగా భక్తిగీతాలు చిత్రీకరించారు. ఈ చిత్రాలన్నింటిలో శివభక్తి గీతాలు, శ్రీమహావిష్ణువు దశావతారాలకు సంబంధించిన కీర్తనలు, బ్రహ్మదేవునికి సంబంధించిన తత్త్వాలు, త్రిమÖర్తుల పత్నులకు సంబంధించిన భక్తిగీతాలు, ఇతర దేవతలు వినాయకుడు, కుమారస్వామి మొదలగు వారి గీతాలు, పెరటి వేల్పు తులసిమాతకు సంబంధించిన గీతాలు, హైందవేతర అల్లా, ఏసు ప్రభువుకు సంబంధించిన గీతాలు కూడా మన తెలుగు చలనచిత్రాల్లో భక్తి గీతాలుగా కనిపిస్తాయి. సీనియర్ సముద్రాల, బలిజేపల్లి లక్ష్మీకాంతం, చందాల కేశవదాసు, తాఫీ ధర్మారావు, పింగళి, ఆరుద్ర, ఆత్రేయ, జూనియర్ సముద్రాల, వేటూరి, సినారె, దాశరథి, వేటూరి, వంటి అతిరథ మహారథులు ఎందరో భక్తి గీతాలను రచించి తెలుగు చలనచిత్ర సీమను సుసంపన్నం చేశారు. 

ఈ భక్తి గీతాలన్నింటిని భైరవభొట్ల అక్షర సంపుటీకరణమే కాకుండా శ్రవణ సంపుటీకరణ కూడా చేశాడు. బాల్యం నుంచి తయారు చేసుకొన్న ఈ పరిశోధన 1963 నాటికి తెలుగు సినిమా పాటల భక్తి గీతాల సంపుటి’ తయారు అయింది. 

త్యాగదుర్గం మునస్వామి అనే ఆయన 1997లో తెలుగు సినిమా భక్తి గీతాలపై ఉగ్రాణం చంద్రశేఖర రెడ్డి (రీడర్, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) పర్యవేక్షణలో పరిశోధన చేసే నిమిత్తం భైరవభొట్లను సంప్రదించడం జరిగింది. ఆయన కోరిక మేరకు భైరవభొట్ల భక్తిగీతాల కోశాలు తయారు చేశాడు. ఈ భక్తి గేయకోశాన్ని 1999 సంవత్సంలో ఆవిష్కరించారు. టి. మునస్వామి పరిశోధన విషయమై దీనిని ఆధార గ్రంథంగా స్వీకరించి “తెలుగు సినిమాలలో హైందవ భక్తి పాటలు - వైశిష్ట్యం’ అనే అంశం మీద 2001లో పి. హెచ్‌డి పట్టాకూడా పొందారు. 

జె. పి. పబ్లికేషన్ (విజయవాడ) అనే ప్రచురణ సంస్థ 2004లో సినీభక్తి గేయ కోశాన్ని “తెలుగు సినిమాలలో భక్తి పారవశ్య గీతాలు’ ‘తెలుగు సినిమాలలో భక్తి రసాత్మక గీతాలు” అనే రెండు పుస్తకాలుగా ముద్రించారు. ఈ రెండు పుస్తకాలలోనూ 32 రకాల భక్తిగీతాల్ని, వాటికి సంబంధించిన పాటల్ని పొందుపరచడం జరిగింది. 

హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయ ఆవరణంలో భక్తి గీతాలు ఆవిష్కరణ సభ జరిగింది. ఆనాటి సభకు ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్. పి. బాలసుబ్రమణ్యం ముఖ్య అతిథిగా విచ్చేశాడు. డా. తుర్లపాటి కుటుంబరావు, వాసిరాజు ప్రకాశం. డా. టి. గౌరీశంకర్ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు. ఆ కార్యక్రమం మరుసటి రోజున దినపత్రికలో విశేష వార్తలుగా ప్రచురించి, ప్రశంసింప బడింది. ఈ సంపుటిలో ప్రసిద్ధమైన భక్తిగీతాలు క్రింది విధంగా ఉన్నాయి. అందుకే భైరవభొట్ల సినీ పరిశోధనా భక్తుడు. 

చిత్రం పేరు పాట పల్లవి 

భక్త పోతన (1942) సర్వ మంగళ నామ 

గుణసుందరికథ (1949) ఉపకారగుణాల యవై 

సంసారం (1950) అమ్మ శ్రీ తులసి

భాగ్యరేఖ (1957) నీవుండేదా కొండపై 

జయభేరి (1959) మది శారదా దేవి

ఇద్దరు మిత్రులు (1961) శ్రీరామ నీనామ మెంతోరుచిరా 

గులేబకావళికథ (1962) మాత జగన్మాత

లవకుశ (1963) వినుడు వినుడు రామాయణగాధ 

లవకుశ (1963) జయజయ రామ శ్రీరామ 

విశాల హృదయాలు (1965) జయజయ నటరాజు 

పరమానందయ్య శిష్యుల కథ (1966) ఓం నమశ్శివాయ

పరమానందయ్య శిష్యుల కథ (1966) ఓ మహాదేవ నీపద సేవ 

రంగుల రాట్నం (1967) నడిరేయి ఏ జాములో 

నిండుమనసులు (1967) ఆపద మొక్కుల వాడా 

దేవకన్య (1968) ఈశ, గిరీష మహేశ 

ఆడజన్మ (1970) శ్రీ వేంకటేశా

రామాలయం (1971) జగ దబి రామ

అంతా మన మంచికే (1972) తిరుమల మందిరా సుందరా

మల్లమ్మ కథ (1973) అంతా శివమయమే 

4.4.9. తెలుగు సినీ లాలిపాటలు/జోలపాటలు : 

తెలుగు చలన చిత్రాలలో లాలి పాటలు అధికంగా చోటుచేసుకొన్నాయి. సాధారణంగా పసిపాపలను నిద్రపుచ్చుతూ పాడే పాటే లాలిపాట ఉయ్యాలలూపుతూ తన బిడ్డని చూస్తూ పొంగిపోతూ లోకాన్ని మరచిపోతూ తన బిడ్డ తనకు వరప్రసాదం అని, తన జీవితం ధన్యమని, తన కుటుంబం ధన్యమనీ తల్లి పాడే పాటలు లాలిపాటలు. 

నిరాశ నిస్పృహలలో నాయకుడు, నాయిక తన బాబుని, పాపని చూస్తూ తమ దుఃఖాన్ని మరచిపోతూ పాడే లాలి పాటలు పిల్లలకు వారి భవిష్యత్ జీవితం మీVAన్నతంగా ఉండాలని చాటిచెప్పే సందేశాత్మక ప్రభోదాలు, వేదాంత ధోరణులు ఈ లాలిపాటల్లో కొంత చోటు చేసుకుంటాయి. బాల్యం నుంచి భైరవభొట్లకు లాలిపాటల్లోని సందేశాలు, ప్రభోదాలు జీవన వేదంగా భావించేవారు. అందువల్లనే 1963 వ సంవత్సరంలోనే భైరవభొట్ల ఈ లాలిపాటల సంపుటిని తయారు చేశాడు. దీన్ని అక్షర సంపుటిగానే కాకుండా శ్రవణ సంపుటిగా కూడా రూపొందించాడు. లాలిపాటలలో ఆత్రేయ రచించిన సంగీత లక్ష్మి (1966) చిత్రంలోని 

‘పాప పాప కనుపాప 

పుత్తడిపాప నెలపాప’ అనే పల్లివి గల పాటలో 

‘తప్పటి అడుగులు ఇప్పుడు ముద్దు 

జీవితాన ఇవి రానే వద్దు 

నడక నేర్పిన అమ్మానాన్న 

నీ నడత చూసి మురియాలమ్మా’ అనే చరణాన్ని ఇప్పటికీ భైరవభొట్ల స్మరిస్తూ ఉంటాడు. ఇలాంటివి లాలిపాటల్లో చాలా ఉన్నాయి. ‘చంద్రహారం’ (1954) చిత్రం నుంచి ‘కన్నవారి కలలు’ (1974) వరకు తెలుగు సినిమాలోని లాలిపాటల్ని భైరవ భొట్ల అక్షర సంపుటీకరణ చేశాడు. ఈ సంపుటిలోని లాలాపాటలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

చిత్రంపేరు పాట పల్లవి 

చంద్రహారం (1954) తనయా వినవయ్య 

సంతానం (1955) నిదురపోరా తమ్ముడా 

శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (1960) చిరుచిరు నగవుల చిలికే తండ్రి 

వెలుగు నీడలు (1960) చల్లని వెన్నెల సోనలు 

మహామంత్రి తిమ్మరుసు (1962) జయ అనరే, జయజయ అనరే 

భీష్మ (1962) జోజోజో జో రాగాల బాల 

వారసత్వం (1964) చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ 

వారసత్వం (1964) మన గుట్టే నిలుపుకోవాలి 

ఆడబ్రతుకు (1965) బుజ్జి బుజ్జి పాపాయి 

తోడు, నీడా (1965) అత్తబడి పూవువలె మెత్తనమ్మా 

సత్యహరిశ్చంద్ర (1965) అందాల తనయా ఆనంద నిలయా 

డాక్టర్ ఆనంద్ (1966) చక్కని చల్లని ఇల్లు 

సంగీతలక్ష్మి (1966) పాపపాప కనుపాప

మనసే మందిరం (1966) అల్లారు ముద్దుగదే

భక్త ప్రహ్లాద (1967) సిరిసిరిలాలి చిన్నారిలాలి 

స్త్రీ జన్మ (1967) చేయని నోమై అడగని వరమై

నిర్దోషి (1967) చిన్నారి కృష్ణయ్యరారా

చదరంగం (1967) తారంగం మాబాబు తారంగం 

మన సంసారం (1968) చిన్నారి నాతల్లి లాలి 

పాపకోసం (1968) కొండలపైన, కోనలపైన గోగులు పూసే 

తెలుగు సినిమా పాటలలో తల్లి లాలిపాటలతో జాబిలి నిద్రపుచ్చుతుంటే భైరవభొట్ల పరిశోధనా లాలితో మనల్ని మైమరపింపజేస్తున్నాడు. 

4.4.10. తెలుగు సినిమాలలో దేశభక్తి గీతాలు : 

భైరవభొట్ల తన జీవితంలో మొట్టమొదటగా రచించినది దేశభక్తి గీతమే. అది ధన్యజీవి పేరుతో 01.09.1963వ తేదీన హైదరాబాద్ నుండి వెలువడిన పంచాయత్ అనే మాస పత్రికలో ప్రచురింపబడింది. 

భైరవభొట్ల ఏ. ఎన్. ఆర్ కాలేజీలో బి.ఏ ద్వితీయ సంవత్సరం చదివేటపుడు 1966వ సంవత్సరంలో కళాశాల పత్రికలో ‘భారతవీరా రావేలా’ అనే భక్తిగేయం ప్రచురింపబడింది. 1969 లో విజయవాడలోని అమరవాహినికేతన్ స్కూల్లో తెలుగు గేయాల రచనాపోటీలలో భైరవభొట్ల ‘వీరప్రభోదం’ అనే గేయానికి మొదటి బహుమతి వచ్చింది. 

ప్రభోదమంటే ‘మేలుకొలుపు’ మారాల్సిన పరిస్థితులను, చేరాల్సిన ఉత్తమ గమ్యాలను నిర్దేశిస్తూ చేసే మేలుకొలుపే ప్రభోదం. ఆధునిక సాహిత్యంలో ప్రభోదాని పెద్దపీటే వేయబడినది.” కవిత్వంలో ప్రభోదగీతాలు, ప్రచార గీతాలు ఎన్నో కనబడతాయి. ఆనాటి కాలపరిస్థితులకు, సంఘపరిస్థితులకు స్పందించిన కవులు జాతీయ భావాన్ని, ఆంధ్రాభిమానాన్ని ప్రభోదిస్తూ ఎన్నో పద్యాలు, గీతాలు రాశారు. వాటిలో రాయప్రోలు “ఏదేశమేగినా ఎందుకాలిడినా, దువ్వూరి ద్రౌపదీ సందేశము’ మొదలైనవి భారత జాతీయతను ప్రబోధించినవి కాగా ఆంధ్ర ప్రశస్తిని, ఆంధ్ర పౌరుషాన్ని, తెలుగు తేజస్సును వర్ణిస్తూ ఆంధ్రాభిమానాన్ని ప్రభోదించినవి మరికొన్ని గీతాలు కూడా కనిపిస్తాయి. గాంధీ గురించి. రాట్నం గురించి, స్వరాజ్యం గురించి, వివిధ జాతీయోద్యమాలను గురించి ప్రచార గీతాలన్నీ ఆనాడు వచ్చాయి. స్వాతంత్య్ర సిద్ధి, సంఘ సంస్కరణ ఆనాటి ప్రభోద గీతాలకు వస్తువు. తదుపరి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన అభ్యుదయ కవిత్వానికి విప్లవ ప్రభోదమÖ, వీరగాథా కథనమే వస్తువైంది. సమకాలీన సమాజం దీనికి నేపథ్యం. 1

(1 యువచిత్ర పాటలు- సాహిత్య విలువలు - కంపల్లె రవిచంద్రన్` పుట: 145)

ఇక సినీగీతాల విషయానికి వస్తే సామాన్య ప్రజలను ప్రభోదితులను చేయడంలో సినీకవులు కూడా తమ వంతు కర్తవ్యం నిర్వర్తించారని చెప్పవచ్చు. వినోదార్థ సినిమాలకు వెళ్ళే ప్రేక్షకుడు తెలియకుండానే ప్రభోదాన్ని పొందుతాడు. మంచినీ, మానవ ప్రగతినీ, ఉత్తమ వ్యక్తిత్వలక్షణాలను ప్రభోదించిన దేశభక్తి గీతాలు, ఆంధ్ర అభ్యుదయ గీతాలు మన చలన చిత్రాల్లో చాలా ఉన్నాయి. వీటన్నింటిని భైరవభొట్ల ఒక గ్రంథం ద్వారా అక్షర సంపుటీకరణ చేశాడు. 

1992వ సంవత్సరంలో కొంగర జగ్గయ్య చలన చిత్ర పరిశోధనా కేంద్రంను సందర్శించినపుడు భైరవభొట్ల రూపొందించిన తెలుగు సినిమాల్లో దేశభక్తి గీతాలు అనే శ్రవణ సంపుటిని ఆవిష్కరించాడు. తరువాతి కాలంలో బరంపురం విశ్వవిద్యాలయంలో ఒక పిహెచ్‌డి గ్రంథాల కోసం మÖలాధార గ్రంథమైన ‘తెలుగు సినీ దేభక్తి గేయ కోశం’ తయారు చేశారు. 

జ్ఞానవికాస్ (విజయవాడ) ప్రచురణలు అనే సంస్థవారు ఆగష్టు 15, 2007 సంవత్సరంలో స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా తెలుగు సినిమా దేశభక్తి గీతాల సంపుటి ని ప్రచురించింది దీన్ని గుంటారు ఎం. ఎల్. ఏ., తాడిశెట్టి వెంకట ప్రసాద్ ఆవిష్క రించాడు. ఇందులో మాలపిల్ల (1938) చిత్రం దగ్గరనుంచి బాలమురళి ఎం.ఏ., (1988) దాకా విడుదలైన దేశభక్తి గీతాలను, తెలుగు సాహిత్యంలో ప్రముఖులైన గురజాడ అప్పారావు, వేములపల్లి శ్రీకృష్ణ, విశ్వనాథ సత్యనారాయణ, రాయప్రోలు సుబ్బారావు మొదలగువారి దేశభక్తి గేయాలను కూడా పొందుపరిచాడు. ఈ సంపుటిలో ప్రసిద్ధమైన దేశభక్తి గేయాలు ఈ క్రింది ప్రకారంగా కన్పిస్తాయి. 

చిత్రంపేరు పాట పల్లవి 

మాలపిల్ల (1938) కొల్లాగట్టితేనేమి మనగాంధీ

మాలపిల్ల (1938) మాలలు మాత్రము మనుషులు కారా 

పంతులమ్మ (1943) జైజై మహేంద్రా జననీ

బాలరాజు (1948) నవోదయం, శుభోదయం

సొంత ఊరు (1950) మన ఊరే భారతదేశం, మనమంతా భారతీయులం

పల్లెటూరు (1952) చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా

పుట్టినిల్లు (1953) మనది భారతదేశం వమ్మా 

అగ్గిరాముడు (1954) జై ఆంధ్ర జననీ, విశాలాంధ్ర ధరణీ 

అంతామనవాళ్ళే (1957) పాడురా ఓ తెలుగు వాడా 

మేనరికం (1954) పండుగ దినమిదిరా, భారత స్వాతంత్య్ర దినమిదిరా 

కన్యా దానం (1955) ఓరోరి తెలుగువాడా, వయ్యారి తెలుగువాడా

జయం మనదే (1956) వీరగంధము తెచ్చినాము 

జయం మనదే (1956) వినవోయి బాటసారి

వీరకంకణం (1957) కట్టండి వీరకంకణం 

పరాశక్తి మా తెలుగు తల్లికి మల్లెపూదండ

వెలుగు నీడలు (1961) పాడవోయి భారతీయుడా

పదండి ముందుకు (1962) మేలుకో! సాగిపో! బంధనాలు తెంచుకో 

తెలుగు సినిమా పాటల కథావస్తుపరంగా సందర్భాన్ని బట్టి ఇంకా ఎన్నో సినీ గీతాలు భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రంలో ఆముద్రిత, అక్షర సంపుటాలలో సురక్షితంగా ఉన్నాయి. భావి పరిశోధకుల కోసం అవి ఎదురుచూస్తున్నాయి. భైరవభొట్ల దేశభక్తుడే కాదు, సినీ పరిశోధన భక్తుడు కూడా. 

పై విధంగా భైరవభొట్ల తన అభిరుచికి పరిశోధనా ప్రతిభను జోడించి విభిన్న వస్తువులతో నిరంతరం వైవిధ్యాన్ని పాటిస్తూ ఎన్నో రకాలుగా తెలుగు సినిమా పాటల పరిశోధనను పరిపుష్టం చేశాడు. భైరవభొట్ల సాగించిన ఈ పరిశోధన వ్యవసాయం భవిష్యత్తులో మరిన్ని వంగడాలను సృష్టిస్తుంది అనడం అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు కథావస్తుపరంగా భైరవభొట్ల చేసిన సినీ పాటల పరిశోధన గురించి చర్చించుకున్నాం. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి