మొత్తం పేజీ వీక్షణలు

13, ఆగస్టు 2026, గురువారం

భైరవభొట్ల నారాయణరావు అక్షర , శ్రవణ , దృశ్యం ద్వారా సినిమాపాటలు రూపొందించే తీరుతెన్నులు


వజ్రోత్సవాలు జరుపుకున్న తెలుగు సినిమా సంగీత చరిత్రలో అధునాతన సాంకేతిక పరిజ్ఞాన ప్రాబల్యం వల్ల ఎప్పటికప్పుడు నూతన విధానాలు ధ్వని ముద్రణలో చోటు చేసుకుంటూ సినిమా పాటకు నిత్యనూతన శోభను చేకూర్చుతున్నాయి. 

సినీ గీతానికి ఉన్న ఇతర సౌకర్యం విశేషవ్యాప్తి. మొదటి నుండి కూడా సినిమా కళ గొప్ప ప్రసార మాధ్యమమని గుర్తింపబడింది. అయితే రేడియో, టేప్ కార్డరర్, దూరదర్శన్ వంటి శ్రవ్య, దృశ్యరూపాలు ఎంత ప్రభావం చూపినా, సాంకేతిక ఉపకరణాల ప్రవేశంతో సినిమా కళ ప్రాచుర్యం మరింత బలమైంది. ఈ పరిణామ మెంతటిదంటే ప్రపంచమంతటా చలన చిత్రాలు, సమాజం ఒకదానికొకటి విడదీయరానంత ధృడంగా పెనవేసుకున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత కలగలిసిన సినిమా నేడు అంతర్జాతీయ కళాంశ మంటే అతిశయోక్తి కాదు. 

ప్రపంచంలో ఏ మÖల ఏవిధమైన సంగీతం, నృత్యం తదితర సాంస్కృతి కాంశాలు విశేష జనాదరణకు పాత్రమైతే ఆయా నూతన ధోరణులు వెనువెంటనే చిత్ర జగతిలో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. దీంతో సినిమా అనేది విశ్వవ్యాప్తమైన కళా ప్రక్రియగా వర్ధిల్లడమే గాక జాతీయ సమైక్యతా భావానికి, వసుధైక కుటుంబమనే సత్యానికి నిరూపణగా నానాటికీ స్థిరపడుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన సినిమా పాటల పరిశోధకుడు భైరవభొట్ల తన దగ్గరున్న, తాను సేకరించిన చిత్రగీతాలను ఆడియో క్యాసెట్ల రూపంలోనూ (శ్రవణరూపాలు), ఆ పాటలకు సంబంధించిన చిత్ర సన్నివేశాలను వీడియో క్యాసెట్ల రూపంలోనూ (దృశ్యమాధ్యమాలు) తయారు చేసి భావి పరిశోధకులకు, వారి పరిశోధనా మార్గాన్ని సుగమం చేశాడు. 

అలా చేయడానికి అసలు ప్రేరణ ఏమిటి? ఆయన పాటలను ఆయా విధానాల్లో వర్గీకరించి విశ్లేషించిన విధానం ఏమిటి? మొదలైన అంశాలు ప్రధానంగా ఈ అధ్యాయంలో వివరింప బడుతుంది. 

0.5. ప్రేరణ : 

భైరవభొట్ల, ఏ.ఎన్.ఆర్. కళాశాలలో బి.ఏ. లిటరేచర్ చదివే రోజుల్లో తమ గురువుగారైన డా. బండ్లమÖడి ఆంజనేయులు, ఆత్రేయ “దీక్ష’ (1951) చరిత్రంలో రాసిన- 

“మనుషులంటే వీళ్లేనా, ప్రపంచమంతా ఇంతేనా 

వేషాలకు విలువిచ్చారు, మోసాలకు తలవంచారు” అనే పాటను వినిపించి ఆత్రేయ భాషలోని క్లుప్తత, సరళత, సులభశైలిని పరిశీలించమని, అవగాహన చేసుకోమని భైరవభొట్లకు గురూపదేశం చేశాడు. అప్పటి నుండి భైరవభొట్ల, ఆత్రేయ పాటల్ని సేకరించి, చదవడం ప్రారంభించాడు. దాంతో పాటు తన సహాధ్యాయి అయిన గార సత్యనారాయణమÖర్తి వల్ల కూడా తెలుగు హిందీ సినిమాల్లోని ప్రముఖులందరి గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు. 

ఒకవైపు హిందీ సాహిత్యం, మరోవైపు తెలుగు, హిందీ చిత్ర గీతాలను కథావస్తుపరంగా, సన్నివేశపరంగా విడివిడిగా రాసుకొని, ఫైలు చేసుకుని అధ్యయనం చేయడం ప్రారంభించాడు. అలా చదవడం వల్ల సముద్రాల, మల్లాది, పింగళి, ఆరుద్ర, శ్రీశ్రీ వంటి కవులందరూ సినిమాపాటల్ని ఎలా రాస్తారో భైరవ భొట్లకు అర్థమయ్యింది. వీటితో పాటు వెండితెర నవలల్లోని సినిమా సన్నివేశాలు, సందర్భోచిత భాష, శైలి ఇత్యాది అంశాల్ని పరిశీలించడం అలవాటు చేసుకున్నాడు. 

అలా పరిశీలిస్తుంటే, ఇలాంటి వెండితెర నవలలే హిందీలో కూడా ఎక్కడ లభిస్తాయోననే అన్వేషణను ప్రారంభించాడు భైరవభొట్ల. ఆ అన్వేషణలో భాగంగా గుడివాడలోని హిగెన్ బాదమ్ బుక్ స్పాలు లో హిందీ సినిమా పత్రికలైన “నవచిత్రపట్ ‘ప్రియ’, ‘లలిత’ అనే పత్రికలను కొనేవాడు. వాటిల్లోని ఫిలిం వార్తల కంటే విడుదల కాబోయే హిందీ చిత్రాల కథలు, సంభాషణలు, పాటలు భైరవభొట్లను ఆకర్షించేవి. వాటిని కత్తరించి సంవత్సరాల వారిగా 32 బైండ్లలలో సంపుటీకరించాడు. ఆ బైండ్లన్నీ నేటికీ గుడివాడలోని పరిశోధనా కేంద్రంలో సురక్షితంగా ఉన్నాయి. ఆ బైండ్లకు అకారాది క్రమంలో ఒక రిజిష్టరును తయారు చేశాడు. తరువాత హిందీ పాటలను నాయక ప్రేమగీతాలు, నాయిక ప్రేమగీతాలు, యుగళ గీతాలు, నాయికా నాయకుల భగ్న ప్రేమ గీతాలు, నృత్య గీతాలు, భక్తి గీతాలు మొదలైన రకాలుగా వర్గీకరించి, రాసుకొని ఫైలు చేసుకునేవాడు భైరవభొట్ల. ఇలా నిరంతర పరిశీలన వల్ల హిందీ సినీ రంగంలో సుప్రసిద్ధులైన శైలేంద్ర, షకీల్ బదయÖని, రాజేంద్రకిషన్ మొదలైనవారు ఒకే నాయిక ప్రేమగీతాన్ని తమతమ ప్రత్యేకశైలిలో ఎట్లా రచిస్తారో భైరవభొట్లకు అర్థమయ్యింది. 

రానురాను తెలుగు సినిమా పాటల్ని కూడా ఈ పద్ధతిలోనే విడివిడిగా రాసుకుని పరిశీలించడం ప్రారంభించాడు భైరవ భొట్ల. ఇలా రెండు భాషల్లోనూ సినిమా పాటలను తులనాత్మకంగా అధ్యయనం చేయడం పరాకాష్టకు చేరుకుంది. మొదటి నుంచి భైరవభొట్ల సినీ పరిశోధనా, పరిశీలన సినిమాటిక్‌గా కవులు ఎలా రచిస్తారో అనే అంశం మీదే ఆధారపడి ఉండేది. తాను స్వయంగా రాసుకున్న తెలుగు, హిందీ సినిమా పాటల రాత ప్రతులు అన్నీ 30 బైండ్లు, సుమారు నలభై ఐదు సంవత్సరాలు దాటి పోయినా కూడా ఇంకా భైరవభొట్ల చలన చిత్ర పరిశోధన కేంద్రంలో సురక్షితం గానే ఉన్నాయి. 

భైరవభొట్ల బాల్యం నుండే అక్షర, శ్రవణ, దృశ్యరూపాలలో తెలుగు సినిమా పాటలను సంకలనం చేసి పరిశోధించాలని, అది అందరికీ ఉపయోగపడాలని అనుకునేవాడు. అందుకోసం పరిశోధనా కేంద్రాన్ని కూడా స్థాపించాలని, అది ఒక ఖీఱశ్రీఎ Aతీcష్ట్రఱవఙవs గా నిలిచిపోవాలని భావించాడు. ఆ స్థిర సంకల్పంతోనే యాభై ఏళ్ల అమÖల్యమైన కాలాన్ని, ధనాన్ని, శక్తి సామార్థ్యాల్ని వెచ్చించి పరిశోధనా 

యజ్ఞాన్ని విజయవంతంగా కొనసాగించాడు. అయితే ఆరోజుల్లో తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేని కారణంగా భైరవభొట్ల, తన సినీ పరిశోధనను ప్రారంభదశలో తెలుగు సినిమా పాటల్ని రాత ప్రతులుగా మాత్రమే సంపుటీకరించాడు. తర్వాత విజయవాడ, జ్యోతి కళాశాలలో హిందీ ఉపన్యాసకుడిగా స్థిరపడిన తర్వాత, రాతప్రతుల్లో ఉన్న సినిమా పాటల్ని ఆడియో క్యాసెట్ల రూపంలోకి, వీడియో క్యాసెట్ల రూపంలోకి మార్చాడు. 

తన పరిశోధనా కేంద్రంలో ఆడియో క్యాసెట్టు నుంచి మరో ఆడియో క్యాసెట్ రికార్డు చేసే Twశీ ఱఅ శీఅ టేపురికార్డును, ఒక వి.సి.ఆర్. ను కష్టార్జితంతో కొన్నాడు. రికార్డు చేసిన వీడియో క్యాసెట్లలోని పాటలను మళ్లీ వేరు వేరు విభాగాలలో వీడియో క్యాసెట్లుగా రికార్డు చేయడానికి 1990 లో మళ్లీ ఒక వి.సి.పి. ని కొన్నాడు. ఇలా తెలుగు సినిమాలకు సంబంధించిన పాటల్ని 1000 దాకా వీడియో క్యాసెట్లలో దృశ్యరూపంలోనూ, 500 దాకా ఆడియో క్యాసెట్లలో శ్రవణ రూపంలోనూ భైరవభొట్ల నిక్షిప్తం చేశాడు. 

భైరవభొట్ల సేకరించిన తెలుగు సినిమా పాటలను కథా వస్తుపరంగా, సన్నివేశపరంగా కింది విధంగా వర్గీకరించి విశ్లేషించవచ్చు. భైరవభొట్ల మొదట తనదగ్గరున్న సినిమాపాటల్ని అక్షర, శ్రవణ, దృశ్య రూపాలుగా వర్గీకరించాడు. వాటిలో మళ్లీ వస్తుపరమైన వర్గీకరణ చేశాడు. తెలుగు సినిమాల్లో శృంగార (శాస్త్రీయ) నృత్యగీతాలు, తెలుగు సినిమాల్లో వాన పాటలు, తెలుగు సినిమాల్లో చందమామ గీతలు అని 3 రకాలుగా వర్గీకరించి వాటిని పరిశీలించడం జరిగింది. 

తర్వాత రెండోభాగంలో భైరవభొట్ల దగ్గరున్న సినిమా పాటల్ని అక్షర, శ్రవణ రూపాలుగా నాయక ప్రేమగీతాలు, నాయిక ప్రేమగీతాలు, నాయికా నాయకుల యుగళ ప్రేమగీతాలు, నాయక భగ్న ప్రేమగీతాలు, నాయిక భగ్న ప్రేమగీతాలు, నాయికా నాయకుల యుగళ భగ్న ప్రేమగీతాలు, ప్రముఖ గాయకీ గాయకులైన జిక్కీ, ఏ.ఎం. దంపతులు పాడిన సినీ గీతాలు, సినీదేశభక్తి గేయ కోశం, తెలుగు సినిమాల్లో మంగళ హారతులు, తెలుగు సినిమాల్లో లాలిపాటలు, కొసరాజు సినీ గేయకోశం అని 11 రకాలుగా వర్గీకరించి పరిశీలించడమైనది. వీటికి దృశ్యరూపం లేదు. 

తర్వాత మÖడో భాగంలో భైరవభొట్ల దగ్గర వున్న సినిమా పాటల్ని కేవలం అక్షర సంపుటాలుగానే సినీభక్తి, గేయ కోశం, ఘంటసాల గానసుధ, సినారె సినీ గేయకోశం, శ్రీశ్రీ సినీ గేయకోశం, ఆరుద్ర సినీ గేయకోశం, దేవులపల్లి కృష్ణశాస్త్రి గేయకోశం, సిరివెన్నెల సినిమా పాటల సంకలనం, వేటూరి సినిమా పాటలు అని వర్గీకరించి పరిశీలించడమైంది. వీటిని మÖడో అధ్యాయంలో చర్చింపబడడం జరిగింది. 

భైరవభొట్ల తెలుగు సినిమా పాటల్ని కథావస్తు పరంగా, సన్నివేశంగా కింది విధంగా వర్గీకరించి విశ్లేషించవచ్చు. ఇలా శీర్షికలను అక్షర, శ్రవణ, దృశ్య రూపాలతో సమన్వయ పరుస్తూ భైరవభొట్ల ఎలా వస్తు పరంగా విభజించి పరిశోధకులకు దిక్సూచి అనడంలో అసత్యం లేదు. ఈ 8 భాగాలను కేవలం అక్షర సంపుటాలుగానే భైరవభొట్ల రూపొందించాడు. 

15. అక్షర, శ్రవణ, దృశ్యరూపాలలో ఉన్న సినిమా పాటలు : 

తెలుగు సినిమా పాటల్ని వస్తుపరంగా వర్గీకరించి ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

1. శృంగార (శాస్త్రీయ) నృత్యగీతాలు 

2. తెలుగు సినిమాల్లో వాన పాటలు 

3. తెలుగు సినిమాల్లో చందమామ పాటలు - వీటికి అక్షర రూపం, ఆడియో, వీడియో రూపాలు ఉన్నాయి. 

రెండో భాగంలో అక్షర, శ్రవణ సమన్వయ రూపంలో రూపొందించిన తెలుగు సినిమా పాటల్ని తిరిగి 11 రకాలుగా భైరవభొట్ల వర్గీకరించాడు. అవి - 

1. నాయక ప్రేమగీతాలు 

2. నాయిక ప్రేమ గీతాలు 

3. నాయికానాయకుల యుగళ ప్రేమ గీతాలు 

4. నాయక భగ్న ప్రేమగీతాలు 

5. నాయిక భగ్న ప్రేమగీతాలు 

6. నాయికా నాయకుల యుగళ భగ్న ప్రేమ గీతాలు. 

7. జిక్కీ, ఏ. ఎం. రాజా పాడిన సినీ గీతాలు

8. సినీ దేశభక్తి గేయకోశం 

9. తెలుగు సినిమా మంగళ హారతి గీతాలు 

10. తెలుగు సినిమా లాలి పాటలు 

11. కొసరాజు సినీ గేయ కోశం 

వీటికి దృశ్యరూపం లేదు. 

ఇక మÖడో భాగంలో కేవలం అక్షర రూపంలోనే సంపుటీకరించిన సినిమా పాటల సంకలనాలను గురించి 8 రకాలుగా భైరవభొట్ల వర్గీకరించడం జరిగింది. ఇవన్నీ శ్రవణ, దృశ్య రూపాల్లో లేవు. 

అవి 

(1) సినీ భక్తి, గేయకోశం 

(1) ఘంటసాల గాన సుధ 

(3) సినారె సినీగేయ కోశం - 6 భాగాలు 

(4) శ్రీశ్రీ సినీ గేయకోశం (స్ట్రెయిట్ G డబ్బింగ్) -6 భాగాలు

(5) ఆరుద్ర సినీ గేయకోశం (స్ట్రెయిట్ G డబ్బింగ్) - 4 భాగాలు

(6) దేవులపల్లి సినీ గేయకోశం (27 బాటలు) 

(7) సిరివెన్నెల సినిమా పాటల సంకలనం - 6 భాగాలు 

(8) వేటూరి సినిమా పాటలు ( 2 జిరాక్సు బైండ్లు) 

ఈ 8 భాగాలు కేవలం అక్షర సంపుటాలు గానే భైరవభొట్ల రూపొందించాడు. 

భైరవభొట్ల, చలనచిత్ర పరిశోధనా కేంద్రం అభివృద్ధికి, అక్షర, శ్రవ్య, దృశ్య మాధ్యమ విభాగాలకు లక్షలాది రూపాయలు వెచ్చించాడు. 

తెలుగు సినిమా పాటలకు అంతర్జాతీయ వైభవాన్ని తెచ్చి పెట్టడానికి భైరవభొట్ల, అక్షర, శ్రవ్య, దృశ్య సమన్వయమైన సృజనాత్మక పరిశోధనను చేపట్టి దానిని ఇప్పటికీ పవిత్ర యజ్ఞంలా నిర్వర్తిస్తున్నాడు. 

5.2. శృంగార (శాస్త్రీయ) నృత్య గీతాలు

5.2-1. ఎ). అక్షర రూపం ( ప్రింట్) : 

భైరవభొట్ల, పరిశోధకుల సౌకర్యార్థం తెలుగు సినిమాల్లోని శృంగార (శాస్త్రీయ నృత్య గీతాలను ఒక పరిశోధనాత్మక రాత సంపుటిగా రూపొందించాడు. తెలుగు సినిమాల్లోని చారిత్రాత్మక, జానపద, సాంఘిక చిత్రాల్లోని శాస్త్రీయ నృత్యగీతాలను పొందుపరచడం జరిగింది. ఈ పాటల్ని 2004 లో జె.పి. పబ్లిషర్స్ (విజయవాడ) వారు ముద్రించారు. వాటిని కింది విధంగా ఇవ్వడం జరిగింది. 

చిత్రం పేరు పాట పల్లవి 

1. మల్లీశ్వరి (1951) పిలచిన బిగువటరా! 

2. మిస్సమ్మ (1955) బాలనురా మదనా ! 

3. అప్పు చేసి పప్పుకూడు (1959) జోహారు గైకొనరా దేవా 

4. భట్టి విక్రమార్క (1960) మనసార ప్రేమించి నారా !

5. అమర శిల్పి జక్కన (1964) అందాల బొమ్మతో ఆటాడవా! 

6. బొబ్బిలి యుద్ధం (1964) నిను చేర మనసాయెరా

7. పరమానందయ్య శిష్యుల కథ (1966) కామినీ మదన రారా 

8. వసంతసేన (1967) ఏమివ్వగల దానరా !

9. చిన్ననాటి స్నేహితులు (1971) ఏమని తెలుపనరా 

10. భక్త తుకారాం (1973) సరి సరి వగలు తెలిసెర గడుసరి

5.2.2. శ్రవణరూపం (ఆడియో) : 

భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రంలో పైన పేర్కొన్న (శృంగార) నృత్యగీతాలను 4 ఆడియో క్యాసెట్లుగా శ్రవణ రూపంలో రూపొందించాడు. తెలుగు చలన చిత్రాల్లో ఇంకా ఎన్నో అమÖల్యమైన శాస్త్రీయ నృత్య గీతాలున్నాయి. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా భైరవభొట్ల మిగతా వాటిని ఇంకా శ్రవణ రూపంలోకి తేలేక పోయాడు. 

5.2.3. దృశ్యరూపం (వీడియో) 

1988వ సంవత్సరంలో పైన పేర్కొన్న శృంగార (శాస్త్రీయ) నృత్యగీతాల అక్షర సంపుటాన్ని, 1992 లో శ్రవణ సంపుటాలను 1993 వ సంవత్సరంలో దృశ్య సంపుటాన్ని ( శ్రవణ సంయుక్త వీడియో క్యాసెట్టు) భైరవభొట్ల రూపొందించాడు. 1993 లో అక్కినేని నాగేశ్వరరావు ఈ 3 రకాల (అక్షర, శ్రవణ, దృశ్య) సంపుటాలను ఆవిష్కరించాడు. ప్రధానంగా భైరవభొట్ల రూపొందించిన దశ్యరూపాన్ని ( వీడియో క్యాసెట్టు) అద్వితీయమైన కృషిగా అభినందించాడు. అదే రోజున విజిటర్లుక్ లో భైరవభొట్లను అక్షరాభినందన చేశాడు. అంతే గాకుండా, ఆయన హైదరాబాదు వెళ్లిన తర్వాత భైరవభొట్ల పరిశోధనా వైవిధ్యాన్ని ప్రశంసిస్తూ ఉత్తరం కూడా రాశాడు. ఈ విధమైన పరిశోధనలో భైరవభొట్లకిది తొలి సోపానమయ్యింది. 

5.3. తెలుగు సినిమాల్లోని వానపాటలు : 

తెలుగు సినిమాల్లో వాన పాటలు, నాయికా నాయకుల శృంగారాన్ని ఉద్దీపన చేయడానికి ఉద్దేశింపబడినవి. ఇవి సాహిత్య, సంగీతాల పరంగానే గాకుండా చిత్రీకరణ పరంగా ప్రేక్షలను శృంగార రసోన్ముఖులను చేస్తాయి. ఆత్రేయ “ఆత్మబలం” (1964) అనే చిత్రంలో రాసిన ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ అనే పాట వానపాటల్లో తలమానికమైంది. తర్వాత వచ్చిన పాటలకు అది ప్రేరణ అయింది. 

5.3.1. అక్షర రూపం ( ప్రింట్) : 

తెలుగు సినిమాల్లోని ముఖ్యమైన వాన పాటలను భైరవభొట్ల ఈ కింది విధంగా రూపొందించాడు. 

చిత్రం పేరు పాట పల్లవి

1. ఆత్మ బలం (1964) చిటపట చినుకులు పడుతూ ఉంటే 

2. బుల్లెమ్మ బుల్లోడు (1972) కురిసింది వాన నా గుండెలోన

3. ఏజెంటు గోపి (1978) చిటపట చినుకులు మనకోసం 

4. అడవిదొంగ (1985) వాన వాన వందనం

5. నారీ నారీ నడుమ మురారి (1990) ఏం వానో తరుముతున్నది

6. గ్యాంగ్ లీడర్ (1991) వాన వాన వెల్లువాయె

7. కలెక్టర్ గారి అల్లుడు (1992) గిల్లు గిచ్చి అల్లి బుచ్చి

8. ఇనెస్పెక్టర్ ఝూన్సీ (1993) గిల్లు గిల్లు చెమ్మ గిల్లు 

9. అమ్మ కొడుకు (1993) చిన్న చిన్న చినుకుల్లోన 

10. మాయలోడు (1993) చిటపట చిరు సవ్వడిలో

ఈ పాటల సంపుటిలో పైన పేర్కొన్న వాన పాటలే గాకుండా ఇంకా చాలా వానపాటలున్నాయి. కానీ ఆర్థిక కారణాల వల్ల భైరవభొట్ల అక్షర రూపంలోకి వాన పాటల్ని రూపొందించ లేకపోయాడు. 

5.3.2. శ్రవణ రూపం (ఆడియో) : 

భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రంలో పైన పేర్కొన్న తెలుగు సినిమా వానపాటలను శ్రవణ రూపంలో రెండు ప్రత్యేక ఆడియో క్యాసెట్లుగా భైరవభొట్ల రూపొందించాడు. ఇంకా శ్రవణ రూపంలో రాని వానపాటలెన్లో ఆయన దగ్గర ఉన్నాయి.

5.3.3. దృశ్యరూపం (వీడియో) : 

పైన పేర్కొన్న తెలుగు సినిమా వానపాటలను భైరవ బొట్ల ఒక నమÖనా క్యాసెట్టుగా రూపొందించాడు. 15 సంవత్స రాల తర్వాత ఆ వీడియో క్యాసెట్టును రెండు వి.సి.డి.లుగా మార్చాడు. 

5.4. తెలుగు సినిమాల్లో చందమామ పాటలు : 

భైరవభొట్ల, చలన చిత్ర పరిశోధనా కేంద్రంలో సినీ పరిశోధన ప్రయోగాత్మకంగానూ, ప్రయోజనాత్మకంగానూ నిరంతరం ఉపయోగ పడేటట్టు తయారు చేస్తున్నాడు. విశిష్టమైన సృజనాత్మకత ఈ పరిశోధనా కేంద్రం ప్రత్యేకత. ఇందులో భాగంగానే భైరవభొట్ల తెలుగు సినిమాల్లోని చందమామ పాటల్ని “వంద సినీ చందమామలు” అనే శీర్షికతో అక్షర రూపంలో సంపుటీకరించాడు. ఇది రాత ప్రతి రూపంలోనే ఉన్నది. ఈ సంపుటంలో ముఖ్యమైన చందమామ పాటలను భైరవభొట్ల ఈ కింది విధంగా సంపుటీకరించాడు. 

చిత్రం పేరు  పాట పల్లవి

1. మిస్సమ్మ (1955) రావోయి చందమామ 

2. ఇలవేల్పు (1956) చల్లని రాజా ఓ చందమామ

3. జయం మనదే (1956) ఓ చందమామ అందాల భామ

4. రాజనందిని (1958) నీ మీద మనసాయెరా ఓరాజా 

5. మాంగల్య బలం (1959) ఆకాశ వీధిలో అందాల జాబిలి

6. భట్టి విక్రమార్క (1960) ఓ నెలరాజా... వెన్నెల రాజా...

7. గండి కోట రహస్యం (1969) నీలాల నింగి 

8. శివరంజని (1978) చందమామ వచ్చాడమ్మా 

9. రంగూన్ రౌడీ (1979) ఓ జాబిలి వెన్నెల ఆకాశం 

10. సిరివెన్నెల (1986) చందమామ రావె.. జాబిల్లి రావె 

తెలుగు సినిమా పాటల్లో ఇలాంటి చందమామ పాటలెన్నో ఉన్నాయి. వాటన్నింటినీ భైరవభొట్ల ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల అక్షర రూపంలో సంపుటీకరించలేని పరిస్థితిలో ఉన్నాడు. 

5.4.1. శ్రవణ రూపం (ఆడియో) : 

పైన పేర్కొన్న సినీ చందమామ పాటలను భైరవ భొట్ల శ్రవణ రూపంలో ఒక ప్రత్యేక ఆడియో క్యాసెట్ గా రూపొందించాడు. కానీ తనకున్న ఆర్థిక దుస్థితి కారణంగా మిగతా పాటలను భైరవభొట్ల శ్రవణ రూపంలో రూపొందించ లేక పోయాడు.

5.4.2. దృశ్య రూపం (వీడియో) 

భైరవ భొట్ల పైన పేర్కొన్న తెలుగు సినీ చందమామ పాటలను 15 సంవత్సరాల క్రితమే చలనచిత్ర పరిశోధనా కేంద్రంలో ఒక నమÖనా వీడియో క్యాసెట్టుగా రూపొందించాడు. 

ఇప్పటి వరకు అక్షర, శ్రవణ, దృశ్య రూపాలలో నిక్షిప్తమై ఉన్న సినిమా పాటలను గురించి వివరించడం జరిగింది. ఇంకా కొన్ని అక్షర, శ్రవణ, సమన్వయ సంపుటాలుగా ఉండి దృశ్యరూపాలలో లేని పాటలు ఈ కింది విధంగా ఉన్నాయి. 

1. నాయక ప్రేమ గీతాలు 

2. నాయిక ప్రేమ గీతాలు 

3. నాయికా నాయకుల యుగళ ప్రేమగీతాలు 

4. నాయక భగ్న ప్రేమ గీతాలు 

5. నాయిక భగ్న ప్రేమ గీతాలు 

6. నాయికా నాయకులు యుగళ భగ్న ప్రేమ గీతాలు

7. జిక్కీ, ఏ. ఎం. రాజాలు పాడిన సినీ గీతాలు 

8. సినీ దేశభక్తి గేయ కోశం 

9. తెలుగు సినిమాల్లో మంగళహారతి గీతాలు 

10. తెలుగు సినిమాల్లో లాలి పాటలు 

11. కొసరాజు సినీగేయ కోశం. 

5.5. నాయిక ప్రేమగీతాలు : 

5.5.1. అక్షర రూపం (ప్రింట్) : 

ఈ సంపుటంలో సంగీత సాహిత్యాలకు పెద్దపీట వేసిన ఆనాటి సుప్రసిద్ధమైన, ఉదాత్తమైన, మధుర గీతములనీ సంపుటంలో పొందు పరిచాడు. ఇందులో నాయక ప్రేమగీతాలు ప్రసిద్ధమైనవిగా కింది విధంగా ఇవ్వబడ్డాయి. ఇది భైరవభొట్ల రూపొందించిన పరిశోధనాత్మక రాత సంపుటి. 

చిత్రం పేరు పాట పల్లవి 

1. బతుకు తెరువు (1953) అందమె ఆనందం 

2. సంతానం (1954) చల్లని వెన్నెలలో

3. జయభేరి (1959) రాగమsTÖ రావే

4. ఆరాధన (1962) నా హృదయంలో నిదురించే చెలి 

5. గుండమ్మకథ (1962) మౌనముగా నీ మనసు పాడిన

6. అమర శిల్ప జక్కన (1964) నిలువుమా నిలువుమా నీలవేణి 

7. పాండవ వనవాసం (1965) నా చందమామ నీవే భామ 

8. ప్రేమనగర్ (1971) తేట తేట తెలుగుల 

9. అద్దాల మేడ (1981) నా జీవిత గగనములో 

10. అంతం కాదిది ఆరంభం (1981) అబ్బలాలో అమ్మలాలో

5.5.2. శ్రవణ రూపం (ఆడియో) : 

పైన పేర్కొన్న ప్రసిద్ధమైన సంగీత సాహిత్యాల పరిశోధనాత్మక విలువ కలిగిన 15 పాటలను ప్రత్యేక శ్రవణ రూపంలో రికార్డు చేయడం జరిగింది. ఈ విభాగంలో ఈ విధమైన నాయక ప్రేమ గీతాలు వందల కొద్దీ ఉన్నాయి. అంతేగాక పరిశోధనకు ఒక నమÖనాగా చూపించాలనే భావంతో sTÖ ఆడియో క్యాసెట్టును రూపొందించాడు భైరవభొట్ల.

5.6. నాయిక ప్రేమ గీతాలు : 

5.6.1 అక్షర రూపం ( ప్రింట్) : 

భైరవభొట్ల పరిశోధనా కేంద్రంలో ఉన్న నాయిక ప్రేమ గీతాల సంపుటంలో ఉత్తమ సాహిత్యానికి, కర్ణపేయమైన సంగీతానికి, మనోహరమైన దృశ్యాల్ని ప్రతిబింబించే నాయిక ప్రేమ గీతాలను ఈ కింది విధంగా పొందు పరిచాడు. ఇది కేవలం పరిశోధనాత్మక రాత సంపుటే. 

చిత్రం పేరు పాట పల్లవి 

1. అన్నపూర్ణ (1960) తళతళ మిల మిలా 

2. జగదేక వీరుని కథ (1961) జలకాలాటలలో 

3. గుండమ్మకథ (1962) సన్నగవీచే చల్ల గాలికి 

4. చదువుకున్న అమ్మాయిలు (1963) వినిపించని రాగాలే 


5. ఆడపడుచు (1967) మది తుళ్లి తుళ్లి 

6. మేఘ సందేశం (1982) ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై 

7. మేఘసందేశం (1982) నిన్నటి దాకా శిలనైనా 

8. సాగర సంగమం (1983) మౌనమేలనోయి 

5.6.2. శ్రవణ (ఆడియో) రూపం : 

పైన పేర్కొన్న రాత ప్రతిలోని నాయిక ప్రేమ గీతాలను మొత్తం 18 పాటలను ఆడియో క్యాసెట్టుగా రూపొందిం 

చడం జరిగింది. 

5.1. నాయికా నాయకుల యుగళ ప్రేమగీతాలు : 

5.7.1. అక్షర రూపం (ప్రింట్) : 

భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రంలోని నాయిక నాయకుల యుగళ ప్రేమ గీతాల సంపుటిలో ఉదాత్తమైన, సంస్కార వంతమైన సాహిత్యాన్ని, సుమధుర సంగీతాన్ని, కను విందైన దృశ్యాన్ని ప్రస్ఫుటింప జేసే ఈ కింది యుగళ గీతాన్ని భైరవభొట్ల రూపొందించాడు. 

చిత్రం పేరు పాట పల్లవి 

1. అనార్కలి (1955) రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

2. దొంగరాముడు (1955) చిగురాకులలో చిలకమ్మా 

3. ఇలవేల్పు (1957) చల్లని రాజా ! ఓ చందమామ! 

4. అప్పు చేసి పప్పుకూడు (1959) ఎచటి నుండి వీచెనో

5. చదువుకున్న అమ్మాయిలు (1963) కిలకిల నవ్వులు చిలికిన 

6. మÖగనోము (1969) పగడాల జాబిలి చూడు 

7. అడవి రాముడు (1977) కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి 

8. అందమైన అనుభవం (1979) హలో! నేస్తం బాగున్నావా! 

9. అమర జీవి (1983) శ్రీ రంగనాథా ! 

10. ఆనందభైరవి (1984) పిలిచిన మురళికి 

5.7.2. శ్రవణ (ఆడియో) రూపం 

అక్షర రూపంలో పేర్కొన్న ఈ పాటల్లో ఒక పాటల్ని శ్రవణ రూపంలో రూపొందించడం జరిగింది. కానీ ఆర్థిక కారణాల రీత్యా sTÖ విభాగంలోని అన్ని పాటలను భైరవ బొట్లు రూపొందించలేక పోయాడు. 

5.8. నాయక భగ్న ప్రేమ గీతాలు

5.8.1. అక్షర రూపం ( ప్రింట్) 

తెలుగు సినిమాలలోని కథలలో ప్రియురాలికి దూరమై, ప్రేమలో విఫలమై, విధిరాతకు బలియై, వేదనతో రోధించే నాయక భగ్న ప్రేమ గీతాలను ఈ సంపుటంలో పొందుపరచడం జరిగింది. భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రంలో ఉండే నాయక భగ్న ప్రేమ గీతాలను కింది విధంగా పొందు పరచడం జరిగింది. 

చిత్రం పేరు పాట పల్లవి

1. దేవదాసు (1953) కుడి ఎడమైతే పొరబాటు 

2. జగదేక వీరుని కథ (1961) రారా కనరారా కరుణ మాని నారా 

3. టాక్సీరాముడు (1962) శోకించకోsTÖ 

4. పెండ్లి పిలుపు (1962) నాలోని అనురాగమంతా 

5. అమర శిల్పి జక్కన (1964) మధురమైన జీవితాల

6. ఆడ బ్రతుకు (1965) తనువుకెన్ని గాయాలైనా

7. కన్నెమనసులు (1967) ఓ హృదయం లేని ప్రియురాలా 

8. భాగ్యచక్రం (1968) ఆశ నిరాశను చేసితివా 

9. ప్రేమనగర్ (1971) మనసు గతి యింతే.. 

5.8.2. శ్రవణ(ఆడియో) రూపం : 

పైన పేర్కొన్న నాయక భగ్న ప్రేమ గీతాలు 30 పాటలను శ్రవణరూపంలో రెండు ఆడియో క్యాసెట్లు గా రికార్డు చేయడం జరిగింది. భైరవభొట్ల కొన్ని ఆర్థిక కారణాల వల్ల వీటిని శ్రవణరూపంలో రూపొందించలేక పోయాడు. 

5.9. నాయిక భగ్న ప్రేమ గీతాలు : 

5.9.1. అక్షర రూపం ( ప్రింట్) : 

భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రంలో నాయిక భగ్న ప్రేమ గీతాలు ఎన్నో అక్షర రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. సముద్రాల, దేవులపల్లి, శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర మొదలైన వారు రచించిన ఎన్నో పాటలు సినీ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. అలాంటి సాయిక భగ్న ప్రేమ గీతాలు ఈ సంపుటంలో కింది విధంగా రూపొందించడం జరిగింది. 

చిత్రం పేరు పాట పల్లవి 

1. లైలా మజ్ను (1949) నినుబాసి పోవుదానా 

2. మల్లేశ్వరి (1951) ఎవరు ఏమని విందురో ... 

3. దేవదాసు (1953) అంతా భ్రాంతి యేనా 

4. ఆరాధన (1962) నీ చెలిమి నేడె కోరితిని 

5. భార్యాభర్తలు (1962) ఏమని పాడెదనో 

6. పరువు ప్రతిష్ఠ (1962) కనులుండి చూడలేను 

7. మÖగమనసులు (1964) మాను మారును కాకు 

8. ఆత్మబలం (1964) నాలుగు కన్నులు రెండైనాయి 

9. మనుషులు మమతలు (1965) కన్ను మÖసింది లేదు 

5.9.2. శ్రవణ (ఆడియో) రూపం 

భైరవభొట్ల చలన చిత్ర పరిశోధనా కేంద్రంలో పైన పేర్కొన్న నాయిక భగ్న ప్రేమ గీతాలు 24 పాటలను ఒక నమÖనా ఆడియో క్యాసెట్టుగా రూపొందించడం జరిగింది. ఈ పాటలే గాకుండా ఇంకా ఎన్నో నాయిక భగ్న ప్రేమ గీతాలు తెలుగు సినిమా పాటలలో వున్నాయి. భైరవభొట్ల తనకున్న దుర్భరమైన ఆర్ధిక పరిస్థితుల వల్ల ఈ విభాగంలోని పాటలను శ్రవణరూపంలో రూపొందించలేక పోయాడు. 

5.10. నాయికా నాయకుల యుగళ భగ్న ప్రేమ గీతాలు :

5.10.1. అక్షర(ప్రింట్) రూపం : 

భైరవభొట్ల తన పరిశోధనా కేంద్రంలో నాయికా నాయకుల యుగళ భగ్న ప్రేమ గీతాలు అక్షర సంపుటిలో పొందుపరచడం జరిగింది. ఆ పాటలను కింది విధంగా పొందు పరచడం జరిగింది. 

చిత్రం పేరు పాట పల్లవి 

1. మల్లీశ్వరి ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు 

2. దేవదాసు (1953) చెలియ లేదు చెలిమి లేదు 

3. చిరంజీవులు (1956) కనుపాప కరువైన కనులెందుకో 

4. మాయాబజార్ (1957) నీ కోసమె నీ జీవించునది 

5. మాంగల్యబలం (1959) పెను చీకటాయె లోకం 

6. ఋణాను బంధం (1960) నిండు పున్నమి వెన్నెల 

7. శభాష్ సూరి (1964) ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల 

8. చక్రవాకం (1974) తీగలేని వీణను 

5.10.2. శ్రవణ (ఆడియో) రూపం : 

నాయికా నాయకులు భగ్న ప్రేమ గీతాలను భైరవభొట్ల శ్రవణ రూపంలో ఒక నమÖనా ఆడియో క్యాసెట్టు గా మాత్రమే రూపొందించాడు. ఆర్ధిక కారణాల రీత్యా దీన్ని శ్రవణ రూపంలో రూపొందించలేక పోయాడు. 

5.11. జిక్కి, ఏ.ఎం. రాజాం సినీగేయ సంకలనం : 

5.11.1. అక్షర(ప్రింట్) రూపం : 

భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రంలో 1991 వ సంవత్సరంలో జిక్కీ గారి సంగీత విభావరి కోసం జిక్కి, ఏ. ఎం. 

రాజాల పాటల రాత సంపుటిని తయారు చేయడం జరిగింది. ఈ సంకలనాన్ని 2004 వ సంవత్సరంలో జె.పి. పబ్లికేషన్స్ (విజయవాడ) వారు శాస్త్రీయ నృత్యగీతాలతో కలిపి ప్రచురించారు. ఇందులోని జిక్కీ, ఏ. ఎం. రాజా ముఖ్యమైన పాటలను కింది విధంగా ఇవ్వబడ్డాయి. 

చిత్రంపేరు పాటల పల్లవి 

1. సంసారం (1950) కల నిజమాయెగా 

2. ప్రేమ లేఖలు (1953) పందిట్లో పెళ్లవుతున్నది

3. కళ రాజు పేద (1954) కళ్లు తెరచికనరా 

4. రోజులు మారాయి (1955) ఏరువాకా సాగారో 

5. దొంగరాముడు (1955) లేవోయి చిన్నవాడా 

6. అర్ధాంగి (1955) ఎక్కడమ్మా చంద్రుడూ

7. పెళ్లికానుక (1960) పులకించని మది పులకించు 

8. పెళ్లికానుక (1960) వాడుక మరచద వేలా 

9. శ్రీ కృష్ణ పాండవీయం (1966) ఛాంగురే బంగారు రాజా 

10. ఆదిత్య 369 (1991) జాణవులే నెరజాణవులే

5.11.2. శ్రవణ (ఆడియో) రూపం : 

1991 వ సంవత్సరంలో జిక్కీ సంగీత విభావరి కోసం పైన పేర్కొన్న పాటలను అక్షర రూపంలో పాటల సంపుటిని శ్రవణ రూపంలో ఒక ఆడియో క్యాసెట్టు గా మాత్రమే భైరవభొట్ల రూపొందించి దానిని చెనై లో ఉన్న జిక్కీకి పంపించాడు. అవి ఆమెకు ఎంతగానో ఉపయోగ పడ్డాయి. కానీ దీన్ని శ్రవణ రూపంలో మాత్రం తీసుకు రాలేక పోయాడు. 

5.12. సినీ దేశభక్తి గీతాలు : 

5.12.1. అక్షర (ప్రింట్) రూపం : 

భైరవ భొట్ల రూపొందించిన ‘తెలుగు సినిమా దేశభక్తి’ గీతాలు’ అనే పుస్తకాన్ని జ్ఞానవికాస్ సంస్థ (విజయవాడ) వారు 15.08.2007న ఆవిష్కరించారు. ఇటువంటి దేశభక్తి గీతాల సంకలనంలో ముఖ్యమైన పాటలను భైరవభొట్ల ఈ కింది విధంగా రూపొందించడం జరిగింది. 

చిత్రం పేరు పాట పల్లవి 

1. మాలపిల్ల (1938) కొల్లాయి గట్టితేనేమి 

2. మాల పిల్ల (1938) మాలలు మాత్రం మనుషులు కారా? 

3. భక్తిమాల (1941) మనకేలా మధుపానము 

4. పల్లెటూరు (1952) చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా

5. పుట్టిల్లు (1953) మనది భారతదేశమమ్మా 

6. అగ్గిరాముడు (1954) జై ఆంధ్ర జనని

7. మేనరికం (1954) పండుగ దినమిదిరా 

8. పరాశక్తి (1954) మాతెలుగు తల్లికి మల్లె పూదండ

9. మనదే (1956) వీర గంధము తెచ్చినామయా 

10. వెలుగు నీడలు (1961) పాడవోయి భారతీయుడా 

అయితే ఈ దేశభక్తి గీతాల సంకలనాన్ని ఒక నమÖనాగా మాత్రం తయారు చేసిందే. 

5.12.2. శ్రవణ(ఆడియో) రూపం : 

పైన పేర్కొన్న దేశభక్తి గీతాలను 1990 వ సంవత్సరంలో శ్రవణ రూపంలో ఒక ఆడియో క్యాసెట్టు గా మాత్రమే భైరవభొట్ల రూపొందించాడు. 1992 వ సంవత్సరంలో భైరవభొట్లు పరిశోధనా కేంద్రం గౌరవాధ్యక్షుడైన డా. కొంగర జగ్గయ్య ఈ క్యాసెట్టును ఆవిష్కరించాడు. 

5.13. తెలుగు సినీ మంగళహారతి గీతాలు : 

5.13.1అక్షర రూపం (ప్రింట్) : 

భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రం తెలుగు సినిమాల్లో వచ్చిన సకల దేవతా మÖర్తులను వర్ణించిన భక్తి గీతాలను, స్త్రీల పాటలను ‘మంగళ హారతి గీతాలు’ అనే పేరుతో 1988లో రూపొందించింది. బాలాజీ పబ్లికేషన్స్ (విజయవాడ) వారు దీన్ని ముద్రించారు. ఆంధ్రదేశంలోని ప్రతి ఇంట్లోనూ ఈ గ్రంధం పరాయణ గ్రంథంగా శోభిల్లుతోంది. ఈ పుస్తకాన్నే గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ (రాజమండ్రి) వారు ముద్రించారు. సినిమా పాటల సంకలనాల్లో ఇదే పెద్ద రికార్డు. ఈ సంకలనం లోని పాటలను భైరవ భొట్ల కింది విధంగా రూపొందించాడు. 

చిత్రం పేరు పాట పల్లవి 

1. సంతానం (1954) అమ్మా మాయమ్మ

2. భాగ్యరేఖ (1957) నీ వుండేదా కొండపై 

3. నర్తనశాల (1963) జనని శివకామిని 

4. రహస్యం (1967) శ్రీ లలితా శివ జ్యోతి 

5. అందరి కంటే మొనగాడు (1971) మంగళ గౌరీ దీవెనలు 

6. మీనా (1974) శ్రీరామనామాలు శతకోటి

7. చిల్లరదేవుళ్లు (1978) శ్రీ లక్ష్మీ నీ మహిమలు

8. గృహప్రవేశం (1982) శ్రీసత్యనారాయణుని సేవకు 

9. దేవి శ్రీ దేవి (1982) మంగళ గౌరికి హారతులు 

5.13.2. శ్రవణ(ఆడియో) రూపం : 

భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రంలో 1988వ సంవత్సరంలోనే పైన పేర్కొన్న మంగళహారతి గీతాల్లోని 18 పాటలను శ్రవణ రూపంలో ఒక ప్రత్యేక ఆడియో క్యాసెట్టుగా మాత్రమే భైరవభొట్ల రూపొందించాడు. ఇది పరిశోధన కోసం రూపొందించిన నమÖనా క్యాసెట్టు మాత్రమే. 

5.14. తెలుగు సినిమాల్లో లాలి పాటలు

5.14.1. అక్షర రూపం (ప్రింట్) 

భైరవభొట్ల చలన చిత్ర పరిశోధన కేంద్రంలో 1988 వ సంవత్సరంలోనే మాతృత్వానికి ప్రతీకలైన తల్లుల హృదయాల్ని, పిల్లలకు తల్లిదండ్రులు పాడే లాలి పాటల్ని పొందుపరిచాడు. భైరవభొట్ల ఈ సంపుటిలో పేర్కొన్న ముఖ్యమైన లాలి పాటలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

చిత్రం పేరు పాట పల్లవి 

1. వెలుగు నీడలు (1961) చల్లని వెన్నెల సోనలు 

2. భీష్మ (1962) జోజో గారాల బాల 

3. ఆడబ్రతుకు (1965) బుజ్జి బుజ్జి పాపాయి

4. సత్యహరిశ్చంద్ర (1965) అందాల తనయా 

5. తోడు నీడ (1965) అత్త ఒడి పూవు వలే 

6. మనసే మందిరం (1966) అల్లారు ముద్దుగదే 

7. నిర్దోషి (1967) చిన్నారి క్రిష్ణయ్య 

8. చదరంగం (1961) తారంగం తారంగం

9. చల్లని నీడ (1968) మల్లెల కన్నా, జాబు కన్నా 

10. నిండు హృదయాలు (1969) రామలాలి మేఘశ్యామలాలి 

ఇది భైరవ భొట్లు రూపొందించిన సినీ లాలిపాటల అక్షర సంపుటి. 

5.14.2. శ్రవణ రూపం (ఆడియో) : 

భైరవభొట్ల, ఫిలిం రీసెర్చి సెంటర్ లో పైన పేర్కొన్న తెలుగు సినిమా లాలి పాటలను 1987 వ సంవత్సరంలోనే శ్రవణ రూపంలో 4 ఆడియో క్యాసెట్లుగా రూపొందించి భద్రపరిచాడు. 

5.15. కొసరాజు సినీ గేయ కోశం : 

5.15.1. అక్షర రూపం : (ప్రింట్) 

ఒక విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి. నిమిత్తం కొసరాజు సినీ గేయ కోశాన్ని మÖలాధార గ్రంధంగా 1990 వ సంవత్సరంలో 3 భాగాలుగా భైరవభొట్ల దీన్ని రూపొందించాడు. 

5.15.2. శ్రవణ రూపం (ఆడియో) 

కొసరాజు సినీ గీతాలను 1991 వ సంవత్సరంలో 4 ప్రత్యేక ఆడియో క్యాసెట్లుగా శ్రవణ రూపంలో రూపొందించాడు భైరవభొట్ల. 

20.06.2017 న కొసరాజు వర్ధంతి సందర్భంగా ఆయన పాటల్ని ఆడియో వీ.P.3. గా ఆవిష్కరింపజేశాడు భైరవభొట్ల. ఆ వీ.P.3. లను పుట్టా జగన్మోహనరావు, కొసరాజు తాను ప్రసాద్ లకు ఆ భైరవభొట్ల అందజేశాడు. 

అక్షర, శ్రవణ, దృశ్య సమన్వయంతో భైరవభొట్ల రూపొందించిన సినిమా పాటలను మొదటి విభాగంలో శృంగార (శాస్త్రీయ) నృత్యగీతాలు, తెలుగు సినిమా వాన పాటలు, తెలుగు సినిమాల్లో చందమామ గీతాలు చర్చించడం జరిగింది. 

రెండో విభాగంలో నాయక ప్రేమ గీతాలు, నాయిక ప్రేమ గీతాలు, నాయికా నాయకుల యుగళ ప్రేమ గీతాలు, నాయిక భగ్న ప్రేమ గీతాలు, నాయక భగ్న ప్రేమగీతాలు, నాయికా నాయకుల యుగళ భగ్న ప్రేమ గీతాలు, ప్రముఖ గాయనీ గాయకులైన జిక్కీ, ఏ. ఎం. రాజా పాడిన సినీ గీతాలు, సినీ దేశభక్తి గీతాలు, మంగళహారతి గీతాలు, లాలిపాటలు, కొసరాజు సినీ గేయకోశం మొదలైన వాటిని అక్షర శ్రవణ రూపంలో చర్చించుకోవడం జరిగింది. 

మÖడో విభాగంలో కేవలం అక్షర సంపుటాలు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ శ్రవణ, దృశ్య రూపంలో లేవు. 

1. సినీ భక్తి గేయ కోశం 

2. ఘంటసాల గాన సుధ 

3. సినారె సినీ గేయకోశం 

4. శ్రీశ్రీ సినీ గేయ కోశం 

5. ఆరుద్ర సినీగేయ కోశం 

6. దేవులపల్లి కృష్ణ శాస్త్రి, సినీ గేయకోశం 

7. సిరివెన్నెల సినిమా పాటల సంకలనం 

8. వేటూరి సినిమా పాటలు 

మÖడో విభాగంలో పైన పేర్కొన్న ఈ అక్షర సంపుటాల గురించి మÖడో అధ్యాయంలోనూ (సినీ గేయ కోశాల నిర్మాణం - పరిశీలన) నాల్గో అధ్యాయంలోనూ ( తెలుగు సినిమా పాటలు - కథా వస్తు పరంగా విశ్లేషణ) సవిస్తారంగా చర్చించడం జరిగింది. ఈ విభాగంలో ఇచ్చిన శీర్షిక తాలుకు సంకలనాలు భైరవభొట్ల అక్షర రూపంలో మాత్రమే పొందు పరిచాడని పరిశోధక మిత్రులకు చెప్పడం జరుగుతుంది. 

భైరవభొట్ల సినీ పరిశోధన గురించి డా. పరుచూరి గోపాల కృష్ణ అన్నట్లు భైరవభొట్ల హిందీ మాష్టారే కాదు, హిందూ మహా సముద్రమంత మహా స్టార” - ఈ పలుకులు అక్షర సత్యాలు. 

భైరవభొట్ల తెలుగు సినిమా పాటలను అక్షర, శ్రవణ, దృశ్య సమన్వయ రూపాలలో రూపొందించడమే గాకుండా తన సినీ పరిశోధనను ప్రత్యేకించి శ్రవణ రూపాలలోనూ, దృశ్యరూపాలలోనూ మైలురాళ్లుగా నిలబెట్టాడు. 

5.16. శ్రవణ రూపంలో రూపొందించిన సినిమా పాటలపై భైరవ భొట్ల కృషి : 

భైరవభొట్ల కేవలం సినిమా పాటలు సేకర్తగానే కాకుండా ఒక పరిశోధకుడిగా కూడా అనన్య సామాన్యమైన కృషి చేశాడు. తనకున్న అభిరుచికి, సృజనాత్మకతను జత కలిపి అనేక సినీ సాహితీ ప్రయోగాలు చేశాడు. వాటిలో ముఖ్యంగా ఒకే రాగంలో హిందీ, తెలుగు సినిమాపాటలు, అంత్యాక్షరి, అక్కినేని కథానాయికా గీతాల సమాహారం, చిత్ర గీతాలలో సైకోథెరపీ అనే అంశాలు చెప్పుకోదగ్గవి. 

5.16.1. ఒకే రాగంలో హిందీ, తెలుగు సినిమా పాటలు : 

డా. ఉయÖ్యరు లక్ష్మీనరసింహారావు రెండో పిహెచ్.డి సిద్ధాంత గ్రంధమైన ‘డా. సినారె సినిమాపాటలు - పరిశోధన’ అనే అంశానికి మÖలాధార గ్రంథాన్ని భైరవభొట్ల తయారు చేయటం జరిగింది. ఈ సినీ గేయకోశం తయారు చేయడమే గాకుండా ఆ పరిశోధనా గ్రంథంలో 12 వ అధ్యాయానికి సంబంధించిన అనుకరణ గీతాల్లోని ‘లయాను కరణం’ అనే ఉపశీర్షికకు ఉపయోగపడే ఒకే రాగంలోని హిందీ తెలుగు సినిమా పాటల వివరాలనూ, ముఖ్యంగా సినారె రచించిన కొన్ని పాటలకు హిందీ సినిమా పాటల మÖలాలు ఎక్కడ ఉన్నాయో, వాటిని పరిశీలించడం జరిగింది. ఇలాంటి వివరాలను భైరవభొట్ల ఈ కింది విధంగా రూపొందించాడు. 

“మంగమ్మ శపథం”(1965) చిత్రంలోని ‘ఒయ్యారమొలికే చిన్నది’ అనే పాటను సినారె రచించాడు. దీనికి మÖలం “షహారా” (1963) అనే హిందీ చిత్రంలోనిదిగా భైరవభొట్ల పరిశోధించాడు. 

‘ఫంకే ీVAతేతో ఉడ్ ఆతిరే 

రసియా ఓ జాలియా’ అనే పాట పల్లవినే తీసుకుని సి. నారాయణ రెడ్డి హిందీ రాగంలోనే తెలుగులో ‘వయ్యార మొలికే చిన్నది’ 

అనే పల్లవితో తెలుగులో రాశాడు. ఇలా 22 తెలుగు సినిమా పాటలకు హిందీ సినిమా పాటల మÖలాలనూ, వాటి రాగాలకూ భైరవభొట్ల 

ఆ సిద్ధాంత గ్రంథంలోని 12వ అధ్యాయానికి సిద్ధాంత గ్రంధంలో హిందీ తెలుగు పాటల వివరాల పట్టికను తయారు చేసి డా. ఉయÖ్యరు లక్ష్మీ నరసింహరావుకు అందజేశాడు. 

పైన పేర్కొన్న ఒకే రాగంలోని హిందీ, తెలుగు సినిమా పాటల వివరాలు సేకరించిన తర్వాత భైరవభొట్లకు దాన్ని ఒక రీసెర్చు ప్రాజెక్టుగా చేయాలని సంకల్పం కలిగింది. అందుకోసం ఒకే రాగంలో హిందీ, తెలుగు సినిమా పాటలు” అనే అంశానికి చెందిన తెలుగు, హిందీ పాటల్ని 12 క్యాసెట్లుగా శ్రవణ రూపంలో సిద్ధం కున్నాడు. అదే విధంగా హిందీ, తెలుగు డబ్బింగ్ చిత్రాల్లోని పాటలను కూడా 24 క్యాసెట్లలో 24 క్యాసెట్లలో రూపొందించాడు. 

ఒకే రాగంలోని హిందీ తెలుగు సినిమా పాటల పరిశోధనలోని పాటలను పాటలను సి.డీ. రూపంలోకి మార్చాడు భైరవభొట్ల. ఈ ఆడియో సి.డి.ని 22.02.2005లో హైదరాబాదులో డా. సినారె ఆవిష్కరించాడు. ఆ పాటలు ఈ కింది విధంగా రూపొందించబడ్డాయి. 

తెలుగు సినిమా పాటలు 

చిత్రం పేరు పాట పల్లవి 

1. ఆమె ఎవరు ? (1964) ఓ నా రాజా 

2. అభిమానం (1960) ఓీVA బస్తీ దొరసాని

3. ఉమాసుందరి (1956) నమ్మకురా ఇల్లాలు పిల్లలు

4. శభాష్ రాముడు (1959) హల్లో డార్లింగ్ మాటాడవా 

5. ధనమా? దైవమా? (1974) నీ మది చల్లగా

6. ప్రేమ పావురాలు (1989) నీ జతలేక పిచ్చిది కాక

7. రంగేళి (1990) హాయిరే హాయ్ ..

హిందీ సినిమా పాటలు 

చిత్రం పేరు పాట పల్లవి 

1. ఓకౌన్ థి ? నయానాబర్ సే రింజిం 

2. సి.ఐ.డి లేకే పెహలా పెహలా ప్యార్ 

3. నాస్తిక్ దేక్ తేరే ఇన్ సాన్‌కి 

4. సి.ఐ.డి ఏదిల్ ముష్కిల్ జీనా మహా 

6. షర్మిలి ఖిల్‌తే హై గులియహా 

6. మైనే ప్యార్ కియా దిల్ దివానా బిన్ సజనాకే 

7. రంగీలా యాయిరే యాయిరే జోర్

భైరవ భొట్ల కొనసాగిస్తున్న ఈ పరిశోధనా యజ్ఞం భావితరంలోని పరిశోధక విద్యార్థులకు బాగా ఉపకరిస్తుంది అనడంలో సందేహం లేదు. అందుకనే భైరవభొట్లను ‘నిరంతరం నడిచే గ్రంథాలయం’ అని చెప్పుకోవచ్చు. 

5.16.2. అంత్యాక్షరి పోటీలకు ఆడియో ప్రశ్నా పత్రం : 

విజయవాడలోని సిద్ధార్థ కళాశాల వారు ఇంటర్ కాలేజ్ సాంస్కృతికోత్సవాల సందర్భంగా వివిధ రకాలైన పోటీలు నిర్వహించారు. ఆ పోటీలన్నీ కళాశాల పూర్వసంఘం విద్యార్థి నాయకుడైన ఎన్.ఆదిత్య (“మనసంతా నువ్వే” దర్శకుడు) ఆధ్వర్యంలో జరుగుతుండేవి. ఆయన, అంత్యాక్షరీ పోటీలకు భైరవభొట్లను వరుసగా 5 సంవత్సరాల పాటు న్యాయ నిర్ణేతగా ఆహ్వానించాడు. ఆ సందర్భంగా ఒక శ్రవణ ప్రశ్నావళిని భైరవభొట్ల తయారు చేశాడు. 10 పాటలకు ముందువచ్చే వాద్య సంగీతాన్ని ఒక క్యాసెట్ గాను, తర్వాత 50 పాటలకు ముందు వచ్చే వాద్య సంగీతాన్ని కూడా ఒక క్యాసెట్ గాను రికార్డు చేశాడు. ఆ ఆడియో ప్రశ్నావళిని సిద్ధార్థ కళాశాల వారు 5 సంవత్సరాల పాటు బాగా ఉపయోగించుకున్నారు. 1997 వ సంవత్సరంలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కుమారుడు అయిన చరణ్ వివాహానికి భైరవభొట్ల ఈ ఆడియో ప్రశ్నావళిని పెళ్లి కానుక గా సమర్పించాడు. 

భైరవభొట్ల రూపొందించిన దృశ్యరూపంలోని (శ్రవణ సంయుక్త వీడియో క్యాసెట్లు) సినీ పరిశోధనలు కూడా అపురూపమైనవి, అఖండమైనవి. దీనిలో భాగంగానే (1) అక్కినేని నాగేశ్వర రావు 50 మంది కథానాయికలతో నటించిన వీడియో క్యాసెట్ (1) ‘అమర శిల్ప జక్కన్న’, “పునర్జన్మ”, “అర్ధాంగి” చిత్రాలలో ‘సైకోథెరపి’ అనే వీడియో క్యాసెట్టు. 

పైన పేర్కొన్న దృశ్యరూపంలో రూపొందించిన భైరవ బొట్ల సినీ పరిశోధన గురించి కింది విధంగా చర్చించడం జరుగుతుంది. 

5.16.3. అక్కినేని సినిమాల్లో నటించిన కథా నాయికలు : 

1994వ సంవత్సరం సెప్టెంబరు నెలలో అక్కినేని కథా నాయికలు అందరూ అక్కినేని సన్మానించడం జరుగుతుందని వంశీ రామరాజు (హైదరాబాదు) భైరవభొట్లకు తెలియజేసాడు. అప్పుడు భైరవభొట్లకు ఒక ఆలోచన వచ్చింది. వచ్చిన వెంటనే భైరవభొట్ల అక్కినేని తో నటించిన కథానాయికల జాబితాను తయారు చేశాడు. ఆ తర్వాత తనకు లభ్యమైన వీడియో క్యాసెట్ల ఆధారంగా “బాలరాజు” చిత్రంలో అక్కినేనితో కలిసి నటించిన ఎస్. వరలక్ష్మి దగ్గరి నుంచి “కాలేజీ బుల్లోడు” చిత్రంలో నటించిన రోజా వరకు ఆయనతో నటించిన కథానాయికల చిత్రాలన్నిటినీ సంవత్సరాల వారీగా రూపొందించి ఒక వీడియో క్యాసెట్‌ను తయారు చేశాడు. అందులో ఒక్కొక్క చిత్రంలో నుంచి ఒక్కో పాటను తీసుకుని, ఆ పాట పై భాగాన చిత్రం పేరు, విడుదలైన సంవత్సరం, కథానాయిక పేరు ఇవ్వడం జరిగింది. ఆకాశవాణి (విజయవాడ) లో న్యూస్ రీడర్‌గా పని చేసే ప్రయాగరామకృష్ణ ఆ వీడియో క్యాసెట్‌కి ఉపోద్ఘాతం చెప్పాడు. 

సుమారు 2 నెలల కాలవ్యవధిలో తయారైన ఆ వీడియో క్యాసెట్ను 11.09.2004 న విశాఖపట్నంలో దాసరి నారాయణ రావు ఆవిష్కరించాడు. ఆ సభలో కథానాయికలంతా అక్కినేనిని స్మనానిస్తే, భైరవభొట్లను అక్కినేని సన్మానించాడు. ఈ విషయం అప్పట్లో ప్రధాన పత్రికల్లో వార్తగా వచ్చింది. భైరవభొట్ల 2000 సంవత్సరంలో అక్కినేని కథానాయికల వీడియో క్యాసెట్‌ని విసిడిలోకి మార్పించాడు. దాన్ని ఏ.ఎన్.ఆర్. కళాశాల గ్రంథాలయానికి ఒక పూర్వ విద్యార్థి కానుకగా అందించాడు. అది ఇప్పటికీ ఏ.ఎన్.ఆర్. కళాశాల గ్రంథాలయంలో సురక్షితంగా ఉంది.

5.16.4. తెలుగు సినిమా పాటల్లో సైకోథెరపీ - భైరవ భొట్ల కృషి :

“అర్ధాంగి”, “అమరశిల్ప జక్కన”, “పునర్జన్మ’ చిత్రాల్లో సైకో థెరపి అనేది ముఖ్యమైన పరిశోధన. భైరవభొట్ల చలన చిత్ర పరిశోధన కేంద్రంలో అనేక ప్రయోజనాత్మక, ప్రయోగాత్మక సినీ పరిశోధనలు జరిగాయి. దానిలో ముఖ్యమైనది, ప్రముఖ మానసిక వైద్యనిపుణులు, (విజయవాడ) డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి రచించిన మానసిక వైద్య గ్రంధాలు ఆధారంగా తయారు చేసిన ఈ వీడియో క్యాసెట్ సైకో థెరపీ పై పరిశోధన చేసే పరిశోధకులకు మÖలధారమైనది. 

కష్టాలకు కృంగిపోవడం, సుఖాలకు పొంగిపోవడం మానవ నైజం. ఇదే నైజం మనకు సినిమాల్లో కూడా కన్పిస్తుంది. భైరవ బొట్ల సినీ గీతాల మీదే కాకుండా, పాత్రల మీద, ముఖ్యంగా మనస్తత్వ చిత్రీకరణ మీద కూడా ఓ వీడియో క్యాసెట్‌ను రూపొందించాడు. 

‘అర్ధాంగి” చిత్రంలో బొత్తిగా లోకజ్ఞానం తెలిని అమాయకుడైన కథానాయకుడు, ప్రతినాయకుని అంతు ఎలా చూస్తాడో, తన భార్య చేయÖతతో ఎలా విద్యావంతుడౌతాడో, అతని జీవితం ఎలా ఆదర్శ పాత్రమవుతుందోనన్న సన్నివేశాలనూ, 

అమరశిల్పి జక్కన” చిత్రంలో జక్కన భగ్న హృదయుడై. వికల మనస్కుడై మళ్లీ మామÖలు మనిషయ్యే దాకా ఉన్న సన్నివేశ దృశ్యాలనూ,

“పునర్జన్మ” చిత్రంలో కథానాయకుడు అగ్ని ప్రమాదంలో మతిస్థిమితం పోగొట్టుకుని ఎట్లా ప్రవర్తిస్తాడో, ఒక నర్తకి ద్వారా ఎలా పునర్జన్మను పొందుతాడో, ఆ దృశ్యాలన్నింటినీ క్రమపద్ధతిలో, కథాపరంగా, సన్నివేశపరంగా భైరవభొట్ల రూపొందించాడు. దానిని చూచి శ్రీ ఇండ్ల రామ సుబ్బారెడ్డి స్పందించి “ సైకాలజీ” అంటే ఏమిటో తెలీని భైరవభొట్ల దీన్ని రూపొందించడం మహాద్భుతం. ఇది ప్రత్యేకమైన పరిశోధనా మేధస్సుకు ఒక ఉదాహరణ. మున్ముందు భైరవభొట్ల యింకా యిలాంటి పరిశోధనాత్మక ప్రయోగాలు చెయ్యాలని, ఆయనకు నా ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని” చెప్పాడు. 

ఈ పరిశోధనాత్మకమైన వీడియో క్యాసెట్టు గురించి అప్పటి పత్రికలన్నీ చాలా విశేషంగా ప్రచురించాయి. 1997, మే నెలలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ దీని గురించి చాలా గొప్పగా రాసింది. అప్పటి నుండి చాలా మంది పరిశోధకుల దృష్టి భైరవ బొట్ల మీద పడింది. ఈనాడు తెలుగు చిత్రాలలో ‘సైకో థెరపీ’ అనే అంశం ఎందరో భావి పరిశోధక విద్యార్థులకు మÖలాధార గ్రంధమయ్యింది. భైరవ బొట్లను భవిష్య ద్రష్టగా చేసింది కూడా ఈ చలన ప్రయోగం అని చెప్పుకోవచ్చు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి