మొత్తం పేజీ వీక్షణలు

8, జూన్ 2022, బుధవారం

విరతి లేక తిరిగి వేసారినాడ.. telugu ramayanam padhyam and meaning

   విరతి లేక తిరిగి వేసారినాడ.. ని

   ఘ్న మగు మనము నాదిగా నెఱిగితి..

   రాజ వదనఁ గనను, రామ లంబరములు

   జార నిదుర మునిగినారు, కంటి..

విరతి = విశ్రాంతి, విరామం

నిఘ్నము = అధీనమయినది

అంబరము = వస్త్రము

ఆంజనేయుడు సీతామాతను వెదికే సందర్భంలో తనలో తాను ఇలా తలపోసినాడు.

     "విరతి (విరామం) లేకుండా లంక నంతా గాలించి వేసారినాను. రామ (స్త్రీ)లు ఒంటిమీది వస్త్రాలు జారిపోతున్నా (పరాకుగా) గాఢ నిద్రలో మునిగిపోయి వుండగా కంటిని (చూసినాను). కాని రాజవదనయైన సీతా మాతను మటుకు కనను (చూడను). 

    ఐనా ఇంత మంది మహిళలను యీ స్థితిలో చూసినా నా మనస్సు చలించలేదు. నిఘ్నమైన (స్వాధీనమైన) మనస్సు నా దని తెలుసుకో గలిగితిని."

     కొందరు వనితలు "నిద్రాబలపరాజితలై" పక్కనున్న వారి వస్త్రములు లాగి కప్పుకొని నిద్రించుచుండిరి.(సుం.కాం.11-29)

మే తత్ చ సువ్యవస్థితమ్.. (11-41) నా మనస్సు ఎట్టి వికారము చెందక స్థిరముగా నున్నది.




7, జూన్ 2022, మంగళవారం

అప్పులైనను నిప్పులైనను....telugu padhyam ramayanam and meaning

     అప్పులైనను నిప్పులైనను

      నాంజనేయుని కేమిలే!

     పప్పు లుప్పుల చింతపండుల

        పాడు సంసృతి లేదులే!

     తుప్పు బట్టని యాయుధం బది..

        తోడు.. రాముని నామమే!

     తప్పు జేయగనీదు.. గెల్పును

        దప్పకుండ నొసంగులే!

 లంకకు వెళ్ళి జానకీ మాతను దర్శించి తిరిగి వచ్చిన హనుమ జరిగిన వృత్తాంత మంతా వివరించి చెప్పాడు. అప్పుడు జాంబవంతుడు సంతోషించి వానరులతో యిలా అన్నాడు.

   "అప్పు లంటే నీళ్ళు.. నీళ్ళైనా నిప్పులైనా ఆంజనేయుని కేమీ ప్రమాదం లేదు. శతయోజన విస్తీర్ణమైన లవణ సముద్రాన్నే లంఘించి వెళ్ళడమే కాదు. క్షేమంగా తిరిగి వచ్చినాడు. అంతేకాదు. లంకలో తోకకు నిప్పంటించినా ఏ ప్రమాదమూ కానేలేదు. ఆయనే లంకను దహించివేసినాడు.

   సంసృతి అంటే సంసారం. ఎంతసేపూ పప్పులూ, ఉప్పులూ, చింతపండూ లాంటి సరుకుల

ఆలోచనతో ముడివడి వున్నది. అది మనకే గాని ఆంజనేయునికి లేదు కదా!

   తుప్పుపట్టని ఆయుధమైన రామనామం ఆయన కెప్పుడూ తోడుగా వుంటుంది. (ఆయన ఆలోచన అంతా రామనామంతోనే ముడివడి వున్నది.) ఆ రామ నామం తప్పు చేయనీయదు. తప్పకుండా గెలుపే ఇస్తుంది. చూశారా! మన ఆంజనేయుడు కార్యం సాధించుకొనే వచ్చాడు."


సాగ దింక మాయ.. సంహరించెదను.. ramayanam telugu padhyam and meaning

     "సాగ దింక మాయ.. సంహరించెదను.. ల

     క్ష్య మిపు డింద్రజిత్తె" యని శరము సు

     మిత్ర సూను డేసె, మిత్తి జేర్చె నరి, న

     మ్ముల పొది నొదిగె.. జనములు మురిసిరి


ఆకాశంలో అదృశ్యరూపుడై ఇంద్రజిత్తు శర వర్షం కురిపిస్తున్నాడు. అతని రాక్షస మాయ ముందు వానరులు నిలువలేక పోతున్నారు. సుమిత్రా సూనుడైన లక్ష్మణు డిది గ్రహించి తీవ్రస్థాయిలోనే ఎదుర్కోవా లని నిశ్చయించుకొన్నాడు.

    "నే డింద్రజిత్తును సంహరించాల్సిందే! లక్ష్యం ఆతడే!" అని శర ప్రయోగం చేసినాడు. అది అరిని (శత్రువును) మిత్తి (మృత్యువును) జేర్చినది. తిరిగివచ్చి లక్ష్మణుని అమ్ములపొదిలో దూరినది. జనాలు మురిసిపోయినారు.


ఇంద్రజిత్తును వధియించె నింపుమీరఁ...ramayanam telugu padhyam and meaning

ఇంద్రజిత్తును వధియించె నింపుమీరఁ

ఘనుడు సౌమిత్రి భీష్మ విక్రముడు గాడె!

విష్ణు విద్వేషి యైనట్టి వీరవరుడు,

రావణ బ్రహ్మ కే మాట రాదు నోట..

ఇంద్రజిత్తును లక్ష్మణుడు వధించగలిగినా డంటే చిన్న విషయ మేమీ కాదు. ఆతడు భీష్మ (భయంకరమైన) విక్రముడే! అదివిని నిశ్చేష్టు డైన రావణ బ్రహ్మకు నోట మాట రాలేదు.


క్షయము వృద్ధి లేని చంద్రుండు రాముండు.. telugu padhyam with meaning

క్షయము వృద్ధి లేని చంద్రుండు రాముండు..

క్షమను నతని కెవడు సాటి లేడు..

క్షత్రియులకు నతని చరిత మాదర్శమ్ము..

క్షరము గాదు రామచంద్రు నమ్ము..

పట్టాభిషిక్తుడైన శ్రీ రామ చంద్రుని చూసి ఇన్నాళ్ళ ఇన్నేళ్ళ తమ నిరీక్షణ ఫలించిందని సంతోషించిన పౌరులు తమలో తా మిలా ముచ్చటించుకున్నారు..

     "క్షయ వృద్ధులు లేకుండా వుండే చంద్రుడు రాముడు.. అంటే ఎటువంటి సంఘటన ఎదురైనా పొంగడం కుంగడం అనేది వుండని వాడు.. క్షమలో అంటే సహనంలో నతని కెవడూ సాటి లేడు.. క్షత్రియులకు నతని చరిత్రమే ఆదర్శము.. అమ్ము అంటే బాణం. రామ బాణానికి తిరుగు లేదు. అది క్షరము (నశించేది) గాదు."


భూమిదేవి హరికి భామిని రాముడై.... telugu poem with meaning

         భూమిదేవి హరికి భామిని; రాముడై

         హరియె చెట్టబట్టె నవని సుతను..

          రాము డల్లు డయ్యె భూమిదేవికిఁ గాన

          భర్త అల్లు డయ్యె భార్య కిపుడు

శ్రీదేవి భూదేవి శ్రీ మహా విష్ణువుకు భార్యలు. విష్ణువే రామునిగా అవతరించినాడు. భూదేవి కూతురైన సీతాదేవి రామునికి భార్యయైనది. తన భర్తయే తన కూతురును చేపట్టినాడు కాబట్టి భూదేవికి తన భర్తయైన విష్ణుమూర్తియే అల్లుడైనా డనవచ్చు.

    భూమిదేవి = భూదేవి; అవనిసుత = సీత

   పద్య చమత్కృతికై తప్ప తాత్విక దృష్టి ముం దీ భావన నిలువదు.

  "తనువుతో గలుగు బాంధవ్యంబు లెల్ల

   తనువుతో నశియించి ధరణిలో గలియు"

అనే "శ్రీ కృష్ణావతారం" సినిమాలోని మాటలు గుర్తుకు రావాలి. చుట్టరికా లన్నీ ఈ శరీరంతోనే! శరీరం మారితే అన్నీ మారిపోతాయి. ఇ దేమిటి.. అనడానికి లేదు. ఏ జన్మ బంధుత్వ మా జన్మ వరకే!


6, జూన్ 2022, సోమవారం

10th class telugu vyutpathyardhalu

తెలుగు వ్యుత్పత్తరాలు


నీరజ భవుడు:- నీరజమునందు పుట్టిన వాడు (బ్రహ్మ విష్ణువు నాభి కమలము పుట్టినవాడు 

త్రివిక్రముడు:-మూడడుగులచే భూమిని కొలిచిన వాడు.

విష్ణువు:-- విశ్వము అంతటా వ్యాపించిన వాడు,

విశ్వంభరుడు:- విశ్వమును భరించువాడు

బార్గవుడు :- భృగువంశమున పుట్టిన వాడు

వదాన్యుడు:- మిక్కిలిగా యిచ్చేవాడు.

హరుడు:- హరించేవాడు

హరి :- భక్తుల హృదయాలను ఆకర్షించువాడు (విష్ణువు) చీకటిని హరించువాడు 

మానవకుడు:- మనువు యొక్క అల్పమైన సంతానం.

దానవులు:- ధనువువల్ల పుట్టిన వారు

బ్రహ్మ:- ప్రజలను వర్దిల్ల చేయువాడు

భాష = బాషించునది.

గురువు:- అజ్ఞానమనే అంధకారమును హరించువాడు (ఉపాధ్యాయుడు)

అధ్యక్షుడు:- చర్యలను కనిపెట్టి చూచేవాడు

పౌరాణికుడు:- పురాణములు తెలిసినవాడు (చెప్పివాడు)

పురోహితుడు:- పురము యొక్క క్షేమాన్ని కోరేవాడు

మిత్రుడు :- అన్ని ప్రాణుల యందు స్నేహంతో కూడిన వాడు (స్నేహితుడు, సూర్యుడు) 

జలేజము:- నీటియందు పుట్టినది (పద్మము)

భానుడు: ప్రకాశించు వాడు (సూర్యుడు)

పారాశర్వుడు:- పరాశర మహర్షి కుమారుడు.

భాగీరధి:- భగీరథునిచే తీసుకొని రాబడినది

అతిధి :- తిధి మొదలయిని నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు

తెలుగు :- త్రిలింగముల మధ్య ఉపయోగించే బాష

హృదయము:- హరింప బడేది. 

ఆయుదము:- యుద్ధము చేయుటకు తగిన సాధనము 

ముక్కంటి :- మాడు కన్నులు కలవాడు 

ఉష్ణ రష్మి :- చల్లని కానివి  భానువులు కలవాడు.

చిగురు బోడి:- చిగురు వంటి శరీరం కలది. 

భవాని : భవుని భార్య

మచ్చెకంటి:- మత్స్యముల వంటి కన్నులు కలది.

కమలాలన:- కమలముల వంటి అననము కలది. 

ఛాత్రుడు :  గురువు దోషములను కప్పి పుచ్చేవాడు.

ఆహిమ భానుడు : చల్లనివి కాని కిరణాలు కలవాడు

అంగన:- మంచి అవయవములు కలది.

వేదవ్యాసుడు;- వేదములను విభజించినవాడు

మనోహరమైనది: హర్మ్యము 

అక్షరము - నాశనము పొందనిది.

ఈశ్వరుడు : స్వభావము చేతనే ఐశ్వర్యము కలవాడు 

దాశరథి : దశరథుని కుమారుడు 

మిత్రుడు : సర్వ భూతములయందు స్నేహయుక్తుడు 

భీముడు : భయమును కలుగజేయువాడు 

శౌరి : సూరికి మనుమడు