మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

కర్మానుసారముగ యోని ప్రాప్తి


పునర్జన్మ గురించి చెప్పబడినది. మానవుడు ఈ జన్మలో చేయు కర్మ ననుసరించి పునర్జన్మ భిస్తుంది. మనుష్యుడు చేయు కర్మన్నియు అతని మనోప్రవృత్తిపై ఆధారపడియుంటాయి. అది సాత్త్వికము, రాజసికము, తామసికము అని మూడు విధము. వీటిని గుణము అంటారు.
సత్త్వం జ్ఞానం తమో-జ్ఞానం రాగద్వేషౌ రజః స్మృతమ్‌ ॥
ఏతద్‌ వ్యాప్తిమదేతేషాం సర్వభూతాశ్రితం వపుః ॥ (మనుస్మృతి 12-26)
సత్త్వరజస్తమోగుణము ప్రపంచమందలి ప్రతిపదార్థములో వ్యాపించి ఉన్నవి. మనస్సు, బుద్ధియందు సత్త్వగుణమెక్కువగా నున్నపుడు జ్ఞానము, తమోగుణమెక్కువగా నున్నపుడు అజ్ఞానము, రజోగుణమెక్కువగా నున్నపుడు రాగద్వేషము కుగును.
వేదాభ్యాసస్తపో జ్ఞానం శౌచమిన్ద్రియనిగ్రహః ।
ధర్మ క్రియాత్మచిన్తా చ సాత్త్వికం గుణక్షణమ్‌ ॥ (మనుస్మృతి 12-31)
సాత్త్వికగుణమెక్కువగా నున్నప్పుడు మనుష్యునిలో ఈ క్షణము ఉంటాయి. వేదాభ్యాసము, ధర్మానుష్ఠానము, జ్ఞానవృద్ధి, పవిత్రత, ఇంద్రియనిగ్రహము, ధార్మికత, ఆత్మచింతనము.
    ఆరంభరుచితా-ధైర్యమసత్కార్యపరిగ్రహః ।
    విషయోపసేవా చౌజస్రం రాజసం గుణక్షణమ్‌ ॥ (మనుస్మృతి 12-32)
రజోగుణమెక్కువగా నున్నపుడు ఆరంభములో రుచి, అధైర్యము, అసత్కార్యము చేయుట, విషయసేవనమునందు ప్రీతియనునవి కుగును.
    లోభః స్వప్నో-ధృతిః క్రౌర్యం నాస్తిక్యం భిన్నవృత్తితా ।
    యాచిష్ణుతా ప్రమాదశ్చ తామసం గుణక్షణమ్‌ ॥ (మనుస్మృతి 12-33)
తమోగుణమెక్కువగా నున్నపుడు అన్ని పాపముకు మూమైన లోభము, అతినిద్ర, అధైర్యము, క్రూరత, నాస్తిక్యము - వేదము, ఈశ్వరునియందు అశ్రద్ధ, మనస్సునంది భిన్న భిన్న వృత్తు, ఏకాగ్రత లేకపోవుట, వ్యసనముందు చిక్కుకొనుట మొదగు క్షణము కనిపించును.
    తమసో క్షణం కామో రజసస్త్వర్థ ఉచ్యతే ।
    సత్త్వస్య క్షణం ధర్మః శ్రేష్ఠమేషాం యథోత్తరమ్‌ ॥ (మనుస్మృతి 12-38)
తమోగుణక్షణము కామము, రజోగుణక్షణము అర్థసంగ్రహము, సత్త్వగుణక్షణము ధర్మము. తమోగుణముకన్న రజోగుణము, రజోగుణముకన్న సత్త్వగుణము శ్రేష్ఠము.
ఇట్టి గుణముతో ప్రవృత్తుడయిన జీవునకు పునర్జన్మలో అతని గతి R యోనిప్రాప్తి (శరీరప్రాప్తి) ఈ విధముగా ఉంటుంది.
    దేవత్వం సాత్త్వికా యాన్తి మనుష్యత్వం చ రాజసాః ।
    తిర్యక్త్వం తామాసా నిత్యమిత్యేషా త్రివిధా గతిః ॥ (మనుస్మృతి 12-40)
సాత్త్వికుయినవారు దేవతు అగా విద్వాంసుగను, రజోగుణము కవారు మధ్యమ మనుష్యుగను, తమోగుణము గవారు నీచగతిని పొందుదురు.
    ఇంద్రియాణాం ప్రసంగేన ధర్మస్యాసేవనేన చ ।
    పాపాన్‌ సంయాతి సంసారానవిద్వాంసో నరాధమాః ॥ (మనుస్మృతి 12-52)
ఇంద్రియముకు దాసులై విషయముకు లోబడి ధర్మమును వదలి అధర్మము నాచరించు అవిద్వాంసు నీచజన్మను, దుఃఖరూపమగు హీనజన్మను పొందుదురు.
ఈ ప్రకారము సత్త్వరజస్తమోగుణయుక్త వేగముచే జీవుడేయే ప్రకారపు కర్ము చేయునో ఆయా ప్రకారపు ఫమును పొందును. ముక్తిని కోరువారు గుణాతీతులై - గుణస్వభావములో చిక్కుకొనక యోగుయి ముక్తికొరకు సాధన చేయవలెను.
సత్త్వధర్మము : ప్రీతి, ప్రసన్నత, లాఘవము, తితిక్షా, సంతోషము, ఆర్జవము, మృదుత, జ్జ, శ్రద్ధ, క్షమ, దయ, జ్ఞానము మొదగునవి.
రజోధర్మము : అప్రీతి, దుఃఖము, ద్వేషము, ద్రోహము, మత్సరము, నింద, వంచన, అశాంతి, యుద్ధము, కామక్రోధము, శోకము, ఆరంభరుచిత, పరాభవము మొదగునవి.
తమోధర్మము : మదము, మోహము, భయము, నాస్తిక్యము, కుటిత, కృపణత, ఆస్యము, నిద్ర, అకర్మణ్యత, అజ్ఞానము మొదగునవి.
బుద్ధి భేదము
సాత్త్వికబుద్ధి :
    ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే ।
    బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ ॥
ప్రవృత్తినివృత్తును, కార్యాకార్యమును భయాభయమును, బంధమోక్షమును ఎరుగుదానిని  సాత్త్వికబుద్ధి అంటారు.
రాజసబుద్ధి :
    యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ ।
    అయథావత్‌ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ ॥
ధర్మాధర్మమును, కార్యాకార్యమును ఉన్నవి ఉన్నట్లు గుర్తింపక విపరీతముగ నెరుగుదానిని రాజసబుద్ధి అంటారు.
తామసబుద్ధి :
    అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా ।
    సర్వార్థాన్‌ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ॥
తమోగుణము - అజ్ఞానముతో ఆవరింపబడి అధర్మమును ధర్మముగ గుర్తించుచు సర్వ ప్రయోజనమును విపరీతముగ నెరుగుదానిని తామసబుద్ధి అంటారు.

కార్యకారణ సంబంధము


దార్శనిక భాషలో కార్యము, కారణము అను శబ్దము పారిభాషిక పదము. కార్యము ఏర్పడుటకు మూడు కారణముత్యవసరము.
1.     చేతన నిమిత్తకారణము
2.     ఉపాదనకారణము
3.     సాధారణకారణము
ఉదాహరణ వన ఈ విషయము స్పష్టమగును. ఘటము (మట్టికుండ) - కార్యము. ఇది ఏర్పడుటకు కావసిన మూడు కారణము -
1. కుమ్మరి - చేతననిమిత్తకారణము.
2. మృత్తిక (మట్టి) - ఉపాదానకారణము.
3. చక్రదండాదు, ప్రయోజనము - సాధారణకారణము.
ఈ విధముగ వస్త్రము, ఆభరణము, గృహము, గడియారము మొదగువెన్నియో కార్యము నబడును. వీటిని భావపదార్థముని కూడ అంటారు. అనగా పుట్టిన పదార్థము - తయారుచేయబడిన పదార్థము. ఈ కార్యపదార్థమున్ని ఒకప్పుడు లేక అవి నిర్మింపబడి కొంతకాము స్థితి - ఉనికిలో ఉండి పిదప నశించును. అందుచే పుట్టిన ప్రతి పదార్థము తప్పక నశించును అని దార్శనిక నియమము. అనగా ఆది (మొదు) క ప్రతిదానికి అంతము (చివర) తప్పకయుండునని చెప్పవచ్చును.
ప్రతి కార్యములో విక్షణమైన, నియమపూర్వకమైన పనితనము, సంయోజకత - కూర్పు కనిపిస్తుంది. పైనుదహరించిన ఘటాది కార్యములో ఈ నియమము కనిపిస్తుంది. అందుచే కార్యమనగా జ్ఞానపూర్ణమైన, నియమబద్ధమైన అనేక అవయవము కూర్పు అని చెప్పవచ్చును. ఆ కార్యము యొక్క విభిన్న అవయవమును విడదీసినచో దానిని ఆ కార్యము యొక్క నాశము అని అంటారు. ఘటమునందు మట్టిపరమాణువు, వస్త్రమునందు దారము, ఆభరణముందు స్వర్ణము, రత్నము మొదగునవి వాటి కార్యము అవయవము. కార్యమునందు ఉపాదానకారణము యొక్క గుణము ఉండును. చేతననిమిత్తకారణము లేదా సాధారణకారణము యొక్క గుణము ఉండవు.

చేతననిమిత్తకారణము :


ఇది ఉపాదానకారణమును కార్యరూపములోనికి మార్చునది. ఇది జ్ఞానవంతమైనది. అనగా ఉపాదానకారణమును కార్యముగా మార్చుటకు కావసిన జ్ఞానము కలిగినట్టిది. దీనిని కర్త అని కూడ అంటారు. ‘స్వతన్త్రఃకర్తా’ (1-4-54). ఇది పాణిని యొక్క వ్యాకరణసూత్రము. కర్తjైునవాడు ‘కర్తుమ్‌, అకర్తుమ్‌, అన్యథా కర్తుం సమర్థః’. (ఇచట ఒక విషయము గమనింపవలెను. ఈశ్వరునిలో కేవము కర్తృత్వము గదు. జీవునిలోనే ఈ మూడు గుణమున్నవి.) అనగా కర్త కార్యము చేయుటయందు స్వతంత్రుడు. కార్యము చేయుటను మానుకొనును లేదా విపరీతముగ గూడ చేయగడు. ఉదాహరణలో కుమ్మరి (కర్త) ఘటము చేయుటకై మృత్తికను సిద్ధముచేసికొని ఘటము చేయవచ్చును. లేదా మానుకొనవచ్చును లేదా విపరీత కార్యము చేయవచ్చును. అందుకతడు స్వతంత్రుడు, సమర్థుడు. కర్త కేవము నిర్మాతయే కాదు, దానినతడు రక్షించగడు, నాశము కూడ చేయగడు. అనగా కర్త నిర్మించుట, రక్షించుట, నశింపచేయుట అను మూడు పను చేయగడు.
కర్త ఉన్నచోటనే కార్యము ఏర్పడును. కర్తయొక్క గుణములైన కర్తృత్వము, జ్ఞానము మొదగునవి కార్యములో నుండవు.
ఉపాదానకారణము :
ఇది కార్యమేర్పడుటకు కావసిన ముడిపదార్థము. ఇది జడము - జ్ఞానము లేనిది.
కారణాభావాత్కార్యాభావః । (వైశేషిక దర్శనము 1-2-1)
అనగా ఉపాదాన కారణము లేనిచో కార్యమేర్పడదు. అంతే కాదు.
కారణగుణపూర్వకః కార్యగుణో దృష్టః । (వైశేషిక దర్శనము 2-1-24)
ఉపాదాన కారణములోని గుణము కార్యములో కనిపించును. ఉపాదాన కారణము కార్యరూపము లోనికి మారును. అపుడు కారణముండదు. కార్యము నశించినపుడు కార్యముండదు. అప్పుడు అది కారణరూపములో ఉండును.
న తు కార్యాభావాత్‌ కారణాభావః । (వైశేషిక దర్శనము 1-2-2)
కారణ భావాత్‌ కార్యభావః । (వైశేషిక దర్శనము 4-1-3)
కార్యము నశించినపుడు కారణముండదనుట సరిjైునది కాదు. కారణమున్నపుడు మాత్రమే కార్యమేర్పడును. ఉదాహరణలో ఉపాదాన కారణమైన మట్టి ఘటముగా ఏర్పడినపుడు కారణముండదు. ఘటమును ముక్కుగ, చూర్ణముగ చేసినపుడు అది కారణమైన మృత్తికగా మారి కార్యము (ఘటము) ఉండదు.
సాధారణ కారణము :
ఉపాదాన కారణమును కార్యముగా మార్చుటకు చేతన నిమిత్తకారణమునకు ఉపకరించు సాధనము, కాము, కార్యప్రయోజనము మున్నగునవి. ఉదాహరణలో కుమ్మరి కుండచేయుట కుపయోగించు చక్రదండాదు, అందుకు కావసిన కాము కుండ ప్రయోజనము మొదగునవి. ‘వినా ప్రయోజనం మందో-పి న ప్రవర్తతే’. ప్రపంచములో ప్రయోజనరహితమైన పనిని మూర్ఖుడు కూడ చేయడని లోకోక్తి. సాధారణ కారణము కార్యముకన్న భిన్నములే.
కేవము కుమ్మరిగాని, మృత్తిక గాని, చక్రదండాదు గాని ఘటమును చేయజావు. ఈ మూడు కారణమున్నపుడే కార్యమేర్పడును. ఇది నియమము - సిద్ధాంతము. ఇది కార్యకారణము సంబంధమున సంక్షిప్త వివరణ.

అనాదితత్త్వము


ఇంతకుముందు కార్యకారణము అననేమో వివరింపబడినవి. విభిన్న అవయవము జ్ఞానపూర్ణమైన, నియమబద్ధమైన, పనితనము గ కూర్పు - సంయోజకతను కార్యమని తెలిసికొన్నాము. అది దాని అవయవము వియోగము వన నశించునని కూడ తెలిసికొన్నాము. మనకు ప్రతిదినము ఉపయోగములోనికి వచ్చు లేదా దృష్టిలోనికి వచ్చు పదార్థములో పై గుణమున్నచో దానిని కార్యము అనవచ్చును. ఎవరైన మొదటిసారిగ తాజమహును చూచినపుడు దాని నిర్మాణములో కనబడు పనితనమును అందుకు ఉపయోగించిన పదార్థము విశిష్టతను, దానిని నిర్మించిన శిల్పియొక్క బుద్ధికుశతను, చాతుర్యమును ప్రశంసించకుండ యుండలేడు. దాని నిర్మాణములో ఎందరో వ్యక్తు పనిచేసియుందురనియు, దానికి కొన్ని సంవత్సరము కాము పట్టియుండుననియు తెలిసికొనును. అతడు ప్రత్యక్షముగా దాని నిర్మాణమును చూచి యుండనక్కరలేదు. అయినను అతనికి పైన చెప్పిన జ్ఞానము కుగును. ఆ జ్ఞానము దార్శనికభాషలో కార్యకారణసంబంధము వన కలిగినది. సాధారణ మానవుడీ విషయమును శాస్త్రీయముగ తొపలేకపోవచ్చును. ఇచ్చట
తాజమహు - కార్యము
దానికి రూపక్పనచేసి దానిని నిర్మించిన శిల్పి - చేతననిమిత్తకారణము. అందుకు ఉపయోగించిన పారాయి, సున్నము మొదగునవి - ఉపాదానకారణము. దాని నిర్మాణములో ఉపయోగపడిన పనిముట్లు, కూలీు, కాము, మొదగునవి - సాధారణకారణము.
ఇదేవిధముగ మనకు దృష్టిగోచరమగు జగత్తును పరీక్షించినచో ఇది నియమబద్ధముగ నున్నట్లు తెలియును. ఆధునికై వైజ్ఞానికు చేయుచున్న పని సృష్టిలోని నియమమును తెలిసికొనుటయే. దీనిలో ఎంతో జ్ఞానపూర్వకమైన పనితనము గోచరించును. సూర్యుని చుట్టు గ్రహము యొక్క నియమబద్ధ భ్రమణమే సృష్టిలోని కఠోర - అటమైన నియమముకు నిదర్శనము. లేనిచో వేదాంగములోని జ్యోతిశ్శాస్త్రమే వ్యర్ధమగును. అంతేకాదు ఆధునిక శ్పిజగత్తునకు (లిదీవీరిదీలిలిజీరిదీవీ తీరిలిజిఖి) మనుగడయే యుండదు.
అతి సూక్ష్మపరమాణువు సంయోగమే ఈ సృష్టి. మరియు వాటి వియోగమే నాశము - యము. కావున సృష్టి ఒక కార్యము. ఐనచో దీనికి మూడు మూకారణము తప్పనిసరిగా యుండును. అవి 1. చేతననిమిత్తకారణము - ఈశ్వరుడు 2. ఉపాదానకారణము - ప్రకృతి. 3. సాధారణకారణము - జీవు. వీటిని అనాదితత్త్వము అని అంటారు. ఇవి వేదములో ఆంకారికముగ ఇట్లు వర్ణింపబడియున్నవి.
ఓం     ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరి షస్వజాతే ।
    తయోరన్యః పిప్పం స్వాద్వత్త్యనశ్నన్నన్యో అభిచాకశీతి ॥
                (ఋగ్వేదము 1-164-20)
రెండు పక్షు-1. జీవాత్మ, 2. పరమాత్మ (ఈశ్వరుడు) చేతనత, పాన అను సమానగుణము కలిగి మిత్రభావముతో ఒక వృక్షమును (ప్రకృతిని) పరిష్వంగమొనర్చుచున్నవి. వాటిలో ఒకటి-జీవాత్మ వృక్ష ఫమును (కర్మఫమును) అనుభవించుచున్నది. రెండవది - ఈశ్వరుడు అట్లు అనుభవించకుండ సాక్షివలె అంతట ప్రకాశించుచున్నది.
ఈ మంత్రమునందు 1. ఈశ్వరుడు, 2. జీవుడు. 3. ప్రకృతి అను మూడు అనాది పదార్థము వర్ణింపబడియున్నవి. అనాది అనగా ఆది - ప్రారంభము లేనిది అని అర్థము. ఇవి మూకారణము. మూకారణముకు కారణముండవు. లేనిచో వానికి అనవస్థాదోషము ప్రాప్తించును. అనాది పదార్థముకు అంతము ఉండదు. అవి ఎ్లప్పుడు ఉండును.


ఈశ్వరుడు, జీవుడు మరియు ప్రకృతి


ఈశ్వరుడు    -    సృష్టికర్త
సత్‌    -    ఎ్లప్పుడు ఉండేవాడు
చిత్‌    -    చేతనము, జ్ఞానవంతము - సర్వజ్ఞుడు
ఆనందము    -    శాశ్వత సుఖముగవాడు
        అందుకని ‘సచ్చిదానందుడు’ అని అంటారు.
అపరిణామి, నిత్యుడు    -    మార్పుచెందనివాడు
బ్రహ్మ    -    అన్నింటికన్న గొప్పవాడు
పరమ్‌    -    అతిసూక్ష్ముడు
1.     జన్మాద్యస్య యతః (వేదాంత దర్శనము 1-1-2)
    అస్య జగతః జన్మాదిః సృష్టిస్థితియాః యతః భవన్తి తద్‌ బ్రహ్మ ।
మనకు కనిపించు ఈ జగత్తుయొక్క ఉత్పత్తి స్థితియము దేనిద్వారా జరుగునో అది బ్రహ్మ - ఈశ్వరుడు.
2.    యతో వా ఇమాని భూతాని జాయన్తే యేన జాతాని జీవన్తి ।   
    యత్‌ ప్రయన్త్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్య తద్‌ బ్రహేమతి ॥
                (తైత్తిరీయ ఉపనిషత్తు 3-1)
దేనివన ఇంద్రియముచే తెలియబడు ప్రాణు, పదార్థము పుట్టుచున్నవో, ఎవనిద్వారా పుట్టినవి జీవించుచున్నవో ప్రళయకామున దేనియందు ప్రవేశించుచున్నవో దానిని తెలిసికొనగోరును. అదియే బ్రహ్మ.
జగత్తును ఉత్పన్నము చేయుట, జీవుయొక్క పాపపుణ్యకర్మ ననుసరించి వారికి జన్మనిచ్చుట, పుట్టించినవానిని పోషించుట చివరకు జగత్తును ప్రళయము చేయుట - ఇవి ఈశ్వరుడు చేయు కర్ము.
3. ఓం    స పర్యగాచ్ఛుక్రమకాయమవ్రణమస్నావిర శుద్ధమపాప
    విద్ధమ్‌ । కవిర్మనీషీ పరిభూః స్వయమ్భూర్యాథాతథ్యతో-ర్థాన్‌
    వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః ॥ (యజుర్వేదము 40-8)
సః R ఆ పరమేశ్వరుడుÑ పర్యగాత్‌ R అంతట వ్యాపించియున్నాడుÑ శుక్రమ్‌ R శీఘ్రకారి, సర్వశక్తిమంతుడుÑ అకాయమ్‌ R స్థూ సూక్ష్మ కారణదేహరహితుడుÑ అవ్రణమ్‌ R ఛిద్రరహితుడు, ఛేదింప మీలేనివాడుÑ అస్నావిరమ్‌ R నాడ్యాది సంబంధ బంధనము లేనివాడుÑ శుద్ధమ్‌ R అవిద్యాదిదోషము లేనందున సదా పవిత్రుడుÑ అపాపవిద్ధమ్‌ R పాపకర్ము చేయనందున పాపబంధనములోనికి రానివాడుÑ కవిః R సర్వజ్ఞుడుÑ మనీషీ R జీవు మనోవృత్తును తెలిసికొనువాడుÑ పరిభూః R దుష్టును పరాభవించువాడుÑ స్వయంభూః R సంయోగాదు లేని అనాది స్వరూపుడుÑ మాతాపితయి, గర్భవాసము, జన్మ, వృద్ధి క్షయాదు లేనివాడుÑ శాశ్వతీభ్యః సమాభ్యః R సనాతనము, అనాది స్వరూపు, స్వరూపముతో ఉత్పత్తి వినాశము లేని జీవు కొరకు యాథాతథ్యతః R యథార్థభావముతోÑ అర్థాన్‌ R వేదము ద్వారా పదార్థము నన్నింటినిÑ వ్యదధాత్‌ R విశేషరూపమున చేయుచున్నాడు.
ఈ మంత్రమునందు పరమాత్మునిలోని సగుణము - ఉన్న గుణము కొన్ని, నిర్గుణము - లేని గుణము కొన్ని తొపబడినవి. అవి
సగుణము : 1. పర్యగాత్‌ 2. శుక్రమ్‌. 3. శుద్ధమ్‌. 4. కవిః. 5. మనీషీ. 6. పరిభూః. 7. స్వయంభూః.
నిర్గుణము : 1. అకాయమ్‌. 2. అవ్రణమ్‌. 3. అస్నావిరమ్‌. 4. అపాపవిద్ధమ్‌.
కొందరు గుణశబ్దమునకు ‘ఆకారమని’ అర్థము చెప్పి సగుణోపాసన - సాకారోపాసన, నిర్గుణోపాసన - నిరాకారోపాసన అని వ్యాఖ్యానింతురు. ఆకారము ఒక గుణము. అంతమాత్రమున గుణమునకు అర్థము ఆకారము కాదు. అది విజ్ఞుంగీకరింపరు. అది శబ్దార్థమునకు విరుద్ధము. అట్టివారు అవైదిక సిద్ధాంతమును ప్రచారము చేయుట కొరకు ప్రజను మభ్యపెట్టి వారిని తప్పుదారిన ప్రయాణింప జేయుదురు.
ప్రపంచములో ఏ వస్తువు కేవ సగుణము లేదా కేవ నిర్గుణముగా నుండదు. నిర్గుణములే ఒక పదార్థమునకు ఇంకొక పదార్థమునకు గ భేదమును చూపును. ఈ సగుణనిర్గుణము వైశేషిక దర్శనమునందు సాధర్మ్యము వైధర్మ్యము అని చెప్పబడినవి.
ఉదా: 1. ఇనుము : ఘనపదార్థము, సూదంటురాయిచే ఆకర్షింపబడును (సగుణము)
2. రాగి : ఘనపదార్థము (సగుణము)Ñ సూదంటురాయిచే ఆకర్షింపబడదు (నిర్గుణము)
3. ప్రాణవాయువు : ప్రాణు జీవించుటకు ఉపయోగపడును, మండుటకు సహకరించును. (సగుణము) రంగు, రుచి, వాసనలేనిది (నిర్గుణము)
4. ఓం    ఇన్ద్రం మిత్రం వరుణమగ్నిమాహరథో దివ్యః స
    సుపర్ణో గరుత్మాన్‌ । ఏకం సద్విప్రా బహుధా వదన్త్యగ్నిం
    యమం మాతరిశ్వానమాహుః ॥ (ఋగ్వేదము 1-164-46)
సత్‌ పదార్థమైన ఆ ఒకే పరమాత్మను విద్వాంసు ఎన్నియో నామముచే చెప్పుదురు. అవి ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు, అగ్ని, దివ్యుడు, సుపర్ణుడు, గరుత్మాన్‌, యముడు, మాతరిశ్వా. ఈ మంత్రము ఒకే ఒక భగవంతునకు ఎన్నో నామమున్నవని బోధించుచున్నది.
ఈశ్వరునకు గ నామమున్నియు అతని గుణకర్మస్వభావమును బోధించును. ప్రతినామము సార్థకము. నిరర్థకమైన దొక్కటి కూడ లేదు. వేదాది శాస్త్రములో ఈశ్వరునికై వాడబడిన పేర్లకు యౌగికార్థమును గ్రహించవలెను. అనగా వ్యాకరణానుసారముగ ధాతుప్రత్యయము ననుసరించి, ప్రకరణమును - సందర్భమును దృష్టిలోనుంచుకొని అర్థము చెప్పుకొనుట అత్యంతావశ్యకము. కారణమేమన శబ్దముకు నానార్థముండును.
5. ఈశ్వరునకు గ మరికొన్ని నామము. సచ్చిదానందస్వరూపుడు, నిరాకారుడు, సర్వశక్తిమంతుడు, న్యాయకారీ, దయాళువు, అజన్ముడు, అనంతుడు, నిర్వికారుడు, అనాది, అనుపముడు, సర్వాధారుడు, సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, అజరుడు, అమరుడు, అభయుడు, నిత్యుడు, పవిత్రుడు, సృష్టికర్త. ఇతనినే ఉపాసింపవలెను.
6. సమస్త సత్యవిద్యకును, విద్యవన నెరుంగదగు సర్వపదార్థముకు ఆదిమూము పరమేశ్వరుడు.
7.    అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం
    నిత్యమగన్ధవచ్చ యత్‌ । అనాద్యనన్తం మహతః పరం
    ధ్రువం నిచాయ్య తం మృత్యుముఖాత్‌ ప్రముచ్యతే ॥ (కఠోపనిషత్తు 3-15)
ఆ ఈశ్వరునిలో శబ్దగుణము లేదు, స్పర్శగుణము లేదు, రూపగుణము లేదు. రసగుణము లేదు, గంధగుణము లేదు. ఇవి పృథివ్యాదిపంచభూతము గుణము. కావున మన జ్ఞానేంద్రియముచే అతడు తెలియబడడు. అతడు అవ్యయం R వికారము, పరిణామము లేనివాడు, నిత్యం R ఎ్లప్పుడు ఒకేరకముగ నుండువాడు, ఏకరసుడు, ఆది అంతము లేనివాడు, అన్నింటికన్న గొప్పవాడు, అన్నింటికన్న సూక్ష్ముడు, అంతట వ్యాపించియుండుటచే ధ్రువం R కదలిక లేనివాడు. పరమాత్మను ఈ విధముగ తెలిసికొన్నవాడు జన్మమరణరూప మృత్యువు (బంధనము) నుండి ముక్తుడగును.
8.    న తత్ర చక్షుర్గచ్ఛతి న వాగ్గచ్ఛతి ।   
    వో మనో న విద్మో న విజానీమో ॥ (కేనోపనిషత్తు 1-3)
ఆ పరమాత్మను చక్షుః R కన్ను (జ్ఞానేంద్రియము) చూడలేవు. వాక్కు (కర్మేంద్రియము) పట్టుకొనలేవు. అంతరింద్రియమైన మనస్సు కూడ తెలిసికొనలేదు.
మనమొక వ్యక్తిని దూరమునుండి చూచినపుడు అతడొక మనిషని తెలియును. అతడెవరో నిర్దుష్టముగ తెలియదు. ఇది సాధారణ జ్ఞానము. అతడు మనకు దగ్గరగా వచ్చినప్పుడు అతడెవరో స్పష్టముగ తెలియును. ఇది విశేష జ్ఞానము. ఈ విధముగ జ్ఞానకర్మేంద్రియముకు లేదా మనస్సుకు సాధారణముగ గాని విశేషముగా గాని తెలియునది భౌతిక పదార్థము. ఈశ్వరుడు అభౌతిక పదార్థము, చేతనము అందుచే ఈశ్వరుడు జ్ఞానకర్మేంద్రియముకు అందడు.
9.     యచ్చక్షుషా న పశ్యతి యేన చక్షూంషి పశ్యతి ।
తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిదముపాసతే ॥ (కేనోపనిషత్తు 1-6)
యత్‌ R ఏదిÑ చక్షుషా R నేత్రముతో, న పశ్యతి R చూడదోÑ యేన R  దేని మూమునÑ చక్షూంషి R కన్నునుపయోగించి జీవుడుÑ పశ్యతి R చూచుచున్నాడోÑ తదేవ R అదియేÑ బ్రహ్మ R భగవంతుడనిÑ త్వం విద్ధి R నీవు తెలిసికొనుముÑ యత్‌ ఇదముపాసతే R కన్నుతో చూడబడుÑ ఇదమ్‌ R రంగు, రూపము గ ఈ జగత్తుÑ న R బ్రహ్మ కాదు.
రూపవంతమైన వస్తువును తెలిసికొనుటకు నేత్రము జీవునకు సాధనము. బ్రహ్మచే నిర్మింపబడిన కన్నుతో జీవు నానావిధ చిత్రవిచిత్రముగు వర్ణముతో, రూపముతో గ ఈ జగత్తును దర్శించుచుందురు. భగవంతుడు రూపవంతమగు భౌతికపదార్థము కాదు. అందుచే భగవంతుడు కన్నుకు కనిపించడు.
జ్ఞానేంద్రియము ఐదు. ఇవి పంచభూతముయొక్క గుణమును గ్రహించుటకు భగవంతుడు జీవునకు ఇచ్చిన సాధనము. వీటినే భగవంతుని తెలిసికొనలేము.
10.    కరణవచ్ఛేన్న భోగాదిభ్యః । (వేదాంతదర్శనము 2-2-40)
కరణవత్‌ చేత్‌ న భోగాదిభ్యః. ఈశ్వరునకు మానవుకు వలె ఉపకరణము - ఇంద్రియము ఉన్నవనుటకు మీలేదు. ఎందుకనగా అపుడు భగవంతుడు భోగి అగును. అప్పుడు అతనిలో ఈశ్వరత్వమే నశించి సాధారణ జీవుడగును.
11.    క్లేశకర్మ విపాకాశాjైురపరామృష్టః పురుషవిశేష ఈశ్వరః । (యోగదర్శనము 1-24)
ఈశ్వరుడు అవిద్యాది క్లేశము ధర్మాధర్మమునెడి కర్ము, కర్మఫముయిన జాతి, ఆయువు, భోగము అనెడి విపాకము, విపాకమున కనుగుణమయిన (ఆశయము) వాసను - సంస్కారము మొదగువాటితో సంబంధములేని పురుషోత్తముడు.
క్లేశాదు మనస్సునందుండి జీవునియందు చేరి వ్యవహరింపబడును. జీవుడు వానిననుభవించును. అట్టి అనుభవముతో సంబంధములేని పురుషుడు ఈశ్వరుడు.
12.    తత్ర నిరతిశయం సర్వజ్ఞభీజమ్‌ । (యోగదర్శనము 1-25)
ఈశ్వరునియందు పూర్ణమగు (దానికి మించి మరియొకచోట నుండని విధముగ) సర్వజ్ఞతకు నిమిత్తమగు జ్ఞానమున్నది.
13.    స పూర్వేషామపి గురుః కాలేనానవచ్ఛేదాత్‌ । (యోగదర్శనము 1-26)
ఈశ్వరుడు సృష్ట్యారంభమున వేదప్రకాశకుయిన పూర్వఋషుకు కూడ గురువు. ఎందుకనగా అతడు కాముచే ఛేదింపబడదు. ఆద్యంతము లేనివాడు.
14.    అపాణిపాదో జననో గ్రహీతా పశ్యత్యచక్షుః
    స సృణోత్యకర్ణః । స వేత్తి విశ్వం న చ తస్యాస్తి వేత్తా
    తమాహురగ్య్రం పురుషం మహాన్తమ్‌ ॥ (శ్వేతాశ్వతరోపనిషత్తు 3-10)
ఆ పరమేశ్వరుడు హస్తపాదాది కర్మేంద్రియము, కన్ను, చెవు మొదగు జ్ఞానేంద్రియము లేకయే ఆయా ఇంద్రియముచే చేయబడు కార్యమును చేయును. అతనికి జీవుకు వలె సాధనమువసరము లేదు. అతడీ విశ్వమునంతయు ఎరుగును. అతనిని సమగ్రముగా తెలిసినవాడు లేడు. అతడు అనాది, అనంతుడు, పూర్ణుడు అని బ్రహ్మజ్ఞు చెప్పుదురు.
15.     న తస్య కార్యం కరణం చ విద్యతే న
    తత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే । పరా-స్య శక్తిర్వివిధైవ శ్రూయతే
    స్వాభావికీ జ్ఞానబక్రియా చ ॥ (శ్వేతాశ్వతరోపనిషత్తు 6-8)
ఆ పరమేశ్వరునకు శరీరరూపకార్యము గాని, చక్షురాదీంద్రియరూప కరణము - సాధనము గాని లేవు. అతనితో సమానుడు గాని, అతనికంటె అధికుడు గాని లేడు. అతని జ్ఞానము పరా - నిరతిశయమైనది. అతనిలోగ జ్ఞానము, క్రియ స్వాభావికము.
16.    యత్తదద్రేశ్యమగ్రాహ్యమగోత్రమవర్ణ మచక్షుఃశ్రోత్రం
    తదపాణిపాదమ్‌ । నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం
    తదవ్యయం యద్‌ భూతయోనిం పరిపశ్యన్తి ధీరాః ॥
                (ముండకోపనిషత్తు 1-1-6)
ఆ పరమాత్మతత్త్వము జ్ఞానేంద్రియముకు తెలియదు. కర్మేంద్రియముకు దొరకదు. దానికి వంశము, రంగు, నేత్రము, చెవు, కాళ్లు, చేతు లేవు. ఎ్లప్పుడు అంతటను, అన్నింటియందును ఉండునది. అది అతి సూక్ష్మము. నాశము లేనిది. విశ్వమునందలి సక పదార్థముకు మూకారణమైన ఆ తత్త్వమును ధ్యానశీురైన వివేకు అంతటను సాక్షాత్కారము చేసికొందురు.


జీవుడు - జీవాత్మ


సత్‌    -    ఎ్లప్పుడు ఉండేవాడు
చిత్‌    -    చేతనము, జ్ఞానవంతము, అ్పజ్ఞుడు
అపరిణామి    -    మార్పు చెందనివాడు
ఏకదేశి    -    అణుపరిమాణుడు
జీవునేకము.
1.     శరీరాదివ్యతిరిక్తః పుమాన్‌ । (సాంఖ్యదర్శనము 1-39)
పుమాన్‌ - జీవుడు శరీరము మొదు ప్రకృతి వరకు గ పదార్థమున్నింటి కంటె భిన్నుడు.
2.     ఇచ్ఛాద్వేషప్రయత్నసుఖదుఃఖజ్ఞానాన్యాత్మనో లిఙ్గమ్‌ ।
                (న్యాయదర్శనము 1-1-10)
1. ఇచ్ఛా - కావానుకొనుట, 2. ద్వేషము - వదనుకొనుట, 3. ప్రయత్నము, 5. సుఖము, 5. దుఃఖము, 6. జ్ఞానము ఈ గుణము ఎక్కడ కనిపించునో అక్కడ జీవుడున్నాడని గుర్తు.
3.     ప్రాణాపాననిమేషోన్మేషజీవనమనోగతీంద్రియాంతర్వికారాః ।
    సుఖదుఃఖేచ్ఛాద్వేషప్రయత్నాశ్చాత్మనో లింగాని ॥
                (వైశేషిక దర్శనము 3-2-4)
(ప్రాణ) వాయువును లోపనుండి బయటకు వదుట, (అపాన) బయటినుండి వాయువును లోపకు ప్చీుకొనుట (నిమేష) కన్ను మూసికొనుట, (ఉన్మేష) కన్ను తెరచుకొనుట, (జీవన) ప్రాణమును ధరించుట, (మన) మననము చేయుట, (గతి) కదుట, (ఇంద్రియము) ఇంద్రియమును విషయముయందు పోనిచ్చి విషయమును గ్రహించుట, (అంతర్వికార) ఆకలి, దప్పిక, జ్వరపీడాదు కుగుట, సుఖము, దుఃఖము, ఇచ్ఛా, ద్వేషము, ప్రయత్నము ఇవన్నీ జీవునియొక్క లింగము - గుర్తు - గుణకర్ము.
4.    నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః ।
    న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః ॥ (భగవద్గీత 2-23)
ఈ జీవాత్మను శస్త్రము ఛేదింపవు, అగ్ని దహింపదు, నీరు తడుపదు, వాయువు శుష్కింప చేయలేదు.
5.    వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని
    గృహ్ణాతి నరో-పరాణి । తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని
    సంయాతి నవాని దేహి ॥ (భగవద్గీత 2-22)
ఏ విధముగ మనుష్యుడు చిరిగిన వస్త్రమును విడిచి వేరే నూతన వస్త్రమును ధరించునో అదేవిధముగ జీవాత్మ జీర్ణ శరీరమును వదలి ఇతర కొత్త శరీరమును పొందును.

శరీరము


చేష్టేంద్రియార్థాశ్రయః శరీరమ్‌ । (న్యాయదర్శనము 1-1-11)
జీవుడు శరీరమునందుండి లోకమునందు వ్యవహరిస్తుంటాడు. ఈ శరీరము చేష్ట - క్రియ, ఇంద్రియము, అర్థముకు ఆశ్రయము.
ఇంద్రియము జీవునకు సాధనము. అవి జ్ఞానేంద్రియము, కర్మేంద్రియము, అంతరింద్రియము అని మువ్విధము.
జ్ఞానేంద్రియము : 1. ముక్కు, 2. నాుక, 3. నేత్రము, 4. చర్మము, 5. చెవు. వీటిద్వార జీవునకు పాంచభౌతికమైన ప్రపంచ జ్ఞానము కుగును. ఒక్కొక్క ఇంద్రియము దానికి సంబంధించిన భూతముయొక్క గుణమును మాత్రమే గ్రహించును. ఇతరభూతము గుణము దానికి తెలియవు. ఇది నిర్దుష్టమైన నియమము. అభౌతిక పదార్థము జ్ఞానము జ్ఞానేంద్రియముకు కుగదు.
కర్మేంద్రియము : 1. ముఖము, 2. హస్తము, 3. పాదము, 4. పాయువు 5. ఉపస్థ. వీటితో జీవుడు కర్ము చేయును.
అంతరింద్రియము - మనస్సు  : జీవుడు దీని సహాయమున సంక్ప వికల్పాదు నొనర్చును. మనస్సు ఒక సమయమున ఒక ఇంద్రియముతో మాత్రము సంబంధము కలిగియుండును. అప్పుడు మనస్సు ద్వారా ఆ ఇంద్రియము గ్రహించిన జ్ఞానమును తెలిసికొనును. కర్మేంద్రియమైనచో తత్సంబంధమైన కార్యము చేయును. జీవుడు శరీరమునందుండి పాపపుణ్యకర్ము చేయుచు వాటి ఫమును అనుభవించుచుండును. ఈ విధముగ జీవునకు శరీరముతో సంబంధము కుగటను బంధనము అంటారు. జీవునకు శరీరముతో సంబంధము తొగిపోవుటను ముక్తి అంటారు. బంధనముగాని ముక్తి గాని జీవునకు స్వాభావిక గుణము కావు. అవి నైమిత్తికము.
బంధో విపర్యయాత్‌ । (సాంఖ్యదర్శనము 3-24)
విపర్యయము - అవిద్యా - అజ్ఞాననిమిత్తముగా జీవునకు బంధనము కుగును.
జ్ఞానాన్ముక్తిః । (సాంఖ్యదర్శనము 3-23)
జ్ఞాన - విద్యానిమిత్తముగ జీవునకు ముక్తి కుగును.
అజ్ఞానము వన ప్రకృతి (శరీరము)తో సంబంధమేర్పడును. ప్రకృతిలో దుఃఖము మాత్రమే కదు. శరీర సంబంధమున్నంతవరకు జీవునకు దుఃఖము తప్పదు.
జ్ఞానము వన పరమాత్మతో సంపర్కమేర్పడును. పరమాత్మతో ఆనందము, పూర్ణశాశ్వతసుఖము కదు. ముక్తజీవుడు పరమాత్మలోని ఆనందము ననుభవించును.
జ్ఞానము, అజ్ఞానము అనునవి రెండు విభిన్న వస్తువు కావు. అదేవిధముగ ప్రకాశము, అంధకారము కూడ వేరు వేరు వస్తువు కావు. జ్ఞానము యొక్క అభావము అజ్ఞానము. ప్రకాశము యొక్క అభావము అంధకారము.