మొత్తం పేజీ వీక్షణలు

18, జులై 2021, ఆదివారం

క్లాస్ సబ్జెక్టు హోమ్ వర్క్ ప్రాజెక్ట్ నోట్స్ | X Grade students social ...

కృష్ణాతీరమందలి పుణ్య క్షేత్రాలు

మహారాష్ట్ట్రము:  

కృష్ణ పుట్టిన సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మహాబలేశ్వరం వద్ద కృష్ణ అవతరించినందున కృష్ణమాత పేరున మందిరం కట్టబడిరది.

నర్సోబాడ :

కృష్ణవేణీ హృదయంగా పేర్కొనబడే నర్సోబాడ (గాణుగాపురం) సమీపంలో భీమానది కుస్తుంది. యీ సంగమస్థానం అతి పవిత్రమైనది.

సహ్యాద్రి పర్వతము:

సహ్యాద్రిపైన ఉద్భవించిన కృష్ణానదిలో పరశురాముడు సుస్నాతుడై తండ్రి అయిన జమదగ్నికి ఉత్తరప్రక్రియు నిర్వర్తించాడు. 

యీ కర్మకాండను శ్రీదత్తాత్రయుల వారు పూర్తి చేయించారు. 

ఈ సహ్యాద్రిపై కృష్ణానదిలో తీర్థస్నానం చేసిన వారికి పాపనివృత్తి ద్వారా పుణ్యం భిస్తుంది.

తెంగాణ రాష్ట్రము:

మూసీనది రంగారెడ్డి జిల్లా అనంతగిరి కొండల్లో జన్మించింది. 

తూర్పుగా ప్రవహిస్తూ వచ్చి హైదరాబాదులో ఉస్మాన్‌సాగర్‌ చెరువులో కలు స్తుంది. 

అక్కడి నుండి ముందుకుసాగి న్లగొండ జిల్లాలో 64 కిలో మీటర్లు ప్రవహించింది. 

ఆలేరు నదిని  తనలో కలుపు కొని ఆగ్నేయదిశగా ప్రవహిస్తూ వజీరాబాదు దగ్గర కృష్ణవేణిలో కుస్తుంది. 

దీనికే ముచుకుంద అనే పేరుంది. 

కృష్ణమ్మ తల్లి పొడవు 1440 కిలో మీటర్లు. 

ఆంధ్రప్రదేశ్‌ తెంగాణాల్లో కలిపి 720 కిలో మీటర్ల దూరం ప్రవహిస్తుంది.

శ్రీ జోగులాంబ దేవాయం : ఆలం పురం

మహబూబ్‌నగర్‌ జిల్లాలో  కర్నూల్ పట్టణానికి సుమారు 27 కి. మీ. దూరంలో  ఆలం పురం ఉంది. 

ఇక్కడున్న నవబ్రహ్మ ఆలయాలు అధ్యాత్మికంగా, శిల్ప పరంగా ప్రసిద్ధి చెందాయి. 

నవబ్రహ్మలు  ప్రతిష్ఠించినట్టుగా  చెప్పబడుతూ వున్న శివాయాల్లో ప్రధానదైవం శ్రీ బాల బ్రహ్మేశ్వరస్వామి. 

ఈ ఆయంలో మహాశక్తి శ్రీ జోగులాంబదేవిగా కొలువై ఆరాధనందుకొంటూ ఉంది. 

తుంగ, భద్రనదు  కృష్ణానదిలో కలిసే ప్రాంతంలో ఆలం పురం ఉంది. 

ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలో ఒకటి. 

ఆలం పురంకి ఉత్తర వాహినిగా తుంగభద్రా నది ఉంది. 

ఇక్కడి బ్రహ్మేశ్వరుడు, జోగులాంబ, పాపనాశిని, మణికర్ణిక మొదలైన 64 ఘ;టాలు న్నాయి. 

ఈ ఆలం పురాన్ని దక్షిణకాశిగా పిలు స్తారు. 

జోగులాంబ పీఠాన్ని ఆదిశంకరులు సందర్శించారని చెబుతారు.

కృష్ణానది పరీవాహకతీరం

కృష్ణానది సహ్యాద్రి పర్వతాగ్రమునుండి ప్రవహించుచూ మహాబలేశ్వర క్షేత్రమున భూమియందు ప్రవేశించింది. 

వేదగిరి  పర్వత శిఖరాగ్రమున ఆమక వృక్షము నుంచి వేణి నది జనించెను. 

పర్వతాల  మీద కొంత దూరం ప్రవహించి సతారా అను ప్రాంతమున కృష్ణను కలిసెను. 

ఈ ప్రాంతము కృష్ణ వేణి సంగమం అని ప్రశస్తి పొందియున్నది. 

బ్రహ్మశిఖరమునకు దక్షిణమునుండి కకుద్మతీ నది బయుదేరి కృష్ణవేణిలో కలిసినది. 

కృష్ణవేణి సహ్యాద్రి పర్వతము నుంచి ప్రవహిస్తూ 60 నదీ, నదమును అనేక వాగును వంకను కుపుకొనుచూ అనేక ప్రాంతములో పంటకు, త్రాగునీటికి ఉపయోగపడుతూ అనేక పుణ్యక్షేత్రము యందు ప్రవహించుచూ కృష్ణాజిల్లా హంసదీవి వద్ద సాగరమునందు కలియుచున్నది. 

కృష్ణవేణినది పశ్చిమకనుమల్లో మహాబలేశ్వరాన గోముఖం నుండి ఒక ఊట కొనులో జన్మించినది. 

కృష్ణమ్మ మహారాష్ట్ర, కర్ణాటకల్లో 560 కి.మీ. ప్రవహించి మహబూబ్‌ నగర్‌  జిల్లా అంపురం దగ్గర తెంగాణలో ప్రవేశిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో 720 కి.మీ. దూరం ప్రవహించి కృష్ణాజిల్లా పులిగడ్డ వద్ద రెండు పాయలు చీలి ఏటిమొగ, ఎదురుమొండి దగ్గర సముద్రంలో కలు స్తోంది. 

కృష్ణానదికి దిండి, మూసి, పాలేరు, మున్నేరు, తంగభద్ర వంటి ఉపనదున్నాయి

కృష్ణానది ఆలం పురం వద్ద తెలం గాణలో ప్రవేశించినపుడు ఉత్తరదిశగా ప్రవహిస్తుంది. 

కృష్ణానది శ్రీశైలం వద్ద న్లమ కొండ మధ్యగా ఒక సన్నని కనుమ గుండా ప్రవహిస్తుంది. 

శ్రీశైలం నుంచి కృష్ణానది తూర్పుగా ప్రవహించి నాగార్జునాసాగర్‌ చేరుకుంటుంది. 

నాగార్జునకొండ దాటి కృష్ణానది అమరావతి క్షేత్రం చేరుకుంటుంది. 

బౌద్ధమతం క్షీణించి వైదిక మత ప్రాబల్యం పెరగడంతో తూర్పుచాణక్యరాజు భీమదేవుడు ఇక్కడ అమరేశ్వరాయాన్ని నిర్మించినట్టు శాసనాలు తెలుపు తున్నాయి. 

అమరావతి దాటాక కృష్ణానది పులిచింత దగ్గర మైదానాల్లో ప్రవేశిస్తుంది. 

విజయవాడ మీదుగా సముద్రం వైపు పయనిస్తూ పులిగడ్డ దగ్గర రెండు పాయల వుతుంది. 

ఈ రెండు పాయల  మధ్య ప్రాంతమే దివిసీమ. 

మరి కొంతదూరం ప్రవహించి మూడు పాయలు చీలి కృష్ణవేణి సముద్రంలో కుస్తుంది.

కృష్ణానది విశ్వరూపిణిగా లోక ప్రసిద్ధి. 

లోకాను తరింపజేయటానికి కృష్ణ పరమాత్మ సహ్యాద్రిపైన అశ్వత్థ వృక్షరూపంలో నిలిచాడని, ఆ చెట్టు వ్రేళ్ళ నుండి కృష్ణానది అవతరించిందని ఐతిహ్యం. 

మహారాష్ట్ర, కర్ణాటక, తెలం గాణ, ఆంధ్రరాష్ట్రా చారిత్రక సాంస్కృతిక జీవనంలో ఈ నది ప్రముఖస్థానం పొందింది.

చరిత్రలో నేడు : జులై 18 : ఎస్. వి. రంగారావు వర్ధంతి

సామర్ల వెంకట రంగారావు (జులై 3, 1918 - జులై 18, 1974) ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత.

కృష్ణా జిల్లా, నూజివీడులో జన్మించిన రంగారావు మద్రాసులో, ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు.

చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా ఉద్యోగం చేశారు.

జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. 

నటన కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు.

1946లో వచ్చిన వరూధిని అతనుకు నటుడిగా తొలి చిత్రం. 

దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడొందల చిత్రాలకు పైగా నటించారు.

రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలలో రాణించారు 

పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన సినిమాలు. 

నటుడిగా ఆయన చివరి చిత్రం యశోదకృష్ణ (1975)

నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా అందుకున్నారు. 

ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతులు అందుకున్నాయి. 

విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ మొదలైనవి ఆయన బిరుదులు. 

1974 లో యాభై ఆరేళ్ళ వయసులో మద్రాసులో గుండెపోటుతో మరణించారు. 


10th ఇంగ్లీష్ మోడల్ పేపర్ | 10th Class English Question Paper | X Englis...

17, జులై 2021, శనివారం

నీ జ్ఞాపకం చాలదా నాకు

నిను ఆర్తిగా ఆశగా వెతికే ఎదురు చూపులకి

నా కంటి పాప నువ్వే నని ఎలా చెప్పను! 

నాయెద లోని నీ ప్రతి జ్ఞాపకానికి

గుండె చప్పుడు నువ్వు కాదని ఎలా చెప్పను! 

నా ప్రేమ మీద ఏ కవిత రాయను ?

చెలి నా చెంత లేదని దిగులు చెందనా? 

ఇక మరలిరాని గతంలో ...

ఎప్పటికీ మరువలేని జ్ఞాపకం ...నీ ప్రేమ!

నీతో గడిపిన ఆనంద క్షణాలను తలచుకొంటూ... 

నీవు లేని క్షణాలను ఆలా గడుపుతున్నా...

కలత చెందిన మదిలో కదిలెను 

నీ రూపు మరి మరి 

చెంత చేరవని ఎంత చెప్పినా,

మది నమ్మనంటోంది ఎం చేయను?

ఎవరివి నీవు...?  నాకే మౌతావు...?

ఎందుకు నన్ను కలవర పెడతావు...

ఏమీ కాని నన్ను కవిని చేశావు...

నా ప్రేమ నిజ మైనది ఐతే 

నీవెందుకు నాకిక 

నీ జ్ఞాపకం చాలదా నాకు... 

ప్రేమంటే పదవులపై కదిలే పదాలు కాదు...

పెదాలు సైతం పలకలేని భావాలు... 

నీకు ఎంతో దూర దూరంగా...

ఒంటరి తనానికి మరింత దగ్గరగా...

నీ కోసం ఎదురు చుస్తూ...

నీ జ్ఞాపకాల్లో మత్తుగా ఒదిగిపోతూ ... 


శ్రీవిష్ణు సహస్రనామస్తోత్ర వైభవము

భీష్మపితా మహుడు లోకానికి ప్రసాదించిన శ్రీవిష్ణు సహస్రనామస్తోత్రము.

భారత సంగ్రామం అనంతరం అంపశయ్యపై పడి యుండిన భీష్మపితామహుని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు ఉపదేశం చేయిస్తూ లోకాన్ని తరింపచేసాడు.

భారతీయ సంస్కృతికి  వాల్మీకి రామాయణము, వ్యాస మద్భారతము ఇతిహాసాలు వల్లనే గౌరవం దక్కుతుంది 

భగవద్గీత కంటే శ్రీవిష్ణు సహస్రనామస్తోత్రంవల్లనే సులభంగా తరించవచ్చని అంటారు 

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవము శ్రీకృష్ణుని అభిమతం. 

శ్రీకృష్ణుడు పాండవుల నందరినీ తీసుకొని భారతసంగ్రామా నంతరం అంపశయ్య పైనున్న భీష్మపితామహుని దగ్గరకు వస్తాడు.

ధర్మరాజుకు కలిగిన ధర్మసంశయములను తీర్చమని శ్రీకృష్ణుడు భీష్ముని కోరుతాడు. 

తనకు అవేవీ జ్ఞాపకంలేవు, చెప్పే శక్తిలేదు అంటాడు భీష్ముడు. 

అతనికి తెలిసినవన్నీ జ్ఞాపకం వచ్చేటట్లు పూర్వపు శక్తికలుగు నట్లు, నోటనీరూరునట్లు దేహబాధ తెలియనట్లుగా శ్రీకృష్ణుడు వరాలిస్తాడు. భీష్ముడు "అన్ని వరాలు నాకిచ్చి, నాచే చెప్పించడమెందుకు కృష్ణా! నీవే చెప్పవచ్చు కద!” అని ప్రశ్నిస్తాడు.

లోకంలో ఎవరైనా తనను గూర్చి తనే చెప్పుకుంటే సొంతడబ్బా కొడుతున్నాడని అను కుంటారు. 

ఎదుటివారు గుర్తించి పొగిడితే, లోకం కూడా ఆ గొప్పతనాన్ని అంగీకరిస్తుంది.

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవము తత్వసారం చెప్పానే కాని, తత్వము తనను గూర్చి తాను చెప్పుకోరాదు కద!

భీష్మపితామహా! నీవు తత్త్వదర్శనం చేసిన ఆచార్యుడవు. నీ నుంచి తెలుసుకోవాలని పాండవులు కోరుతున్నారు. వారికి తత్త్వమును, హితమును ఉపదేశముచేయి” అంటాడు శ్రీకృష్ణుడు.

దాహం కలిగిన వానికి సముద్రం తనలో నీరు నిండావున్నా యివ్వటానికి వీలులేదు. 

యిచ్చినా త్రాగడానికి పనికిరావు. 

ఆ నీటినే మేఘము గ్రహించి వర్షంగా కురిపిస్తేనే త్రాగ వీలవుతుంది. 

కృష్ణుడు సముద్రములాంటి వాడు. 

అతని గుణ ప్రవాహాన్ని గ్రహించిన భీష్ముడు మేఘములాంటి వాడు. 

కనుక, శ్రీకృష్ణుడు వరాలిచ్చి ఆతనిని ప్రోత్సహించాడు. 

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవము కల్గించాలన్నది నా అభిప్రాయం అని భీష్ముని ప్రేరేపిస్తాడు. 

భీష్ముడు పాండవులకు ఉపదేశం చేస్తుంటే తాను చేతులు కట్టుకొని విని,  ఆమోదిస్తాడు 

ముందుగ సామాన్య ధర్మాలను గురించి ధర్మరాజు అనేక సమాధాన ములు పొందెను. 

జన్మనెత్తిన ఏ జీవి అయినా ఈ సంసార చక్రము నుండి బయట పడాలంటే తెలియ వలసిన తత్త్వమేది? 

ఈ జీవులపుడు ఎక్కడ చేరుతారు? 

ఆ చేరడానికేమి చేయాలి? 

ఎవరిని స్తుతిస్తే అర్చిస్తే మానవులు కోరిన సుఖాలన్నీ పొందు తారని “భవతః పరమో మతః” తాతా! నీవు భావిస్తున్నావో దానిని అనుగ్రహించు” అని ధర్మరాజు ప్రశ్నిస్తాడు. 

సర్వజగత్కారణమైన సర్వలోకేశ్వరుడయిన శ్రీమన్నారాయణుని స్తుతి చేయుచు 'తమేవ చ అర్చయన్' అతనినే ప్రేమతో పూజిస్తే 'సర్వదుఃఖాతిగో భవేత్' అన్ని దుఃఖములను దాటి పోవచ్చు నయ్యా. 

ఆ పుండరీకాక్షుని అర్చించడమే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవము

'ఏష మే... అధికతమో మతః' అన్ని ధర్మాలలోకి శ్రేష్ఠమైన ధర్మము 

నామములను కీర్తిస్తే నకల పాపాలూపోతాయి. 

పవిత్రులౌతారు. 

ఏ కోరిక కోరినా అవన్నీ లభిస్తాయి. 

దీనిని మించిన గొప్ప మంత్రము మరొకటి లేదు. 

వేయి నామాలు కల మూలమంత్రమీ స్తోత్రము.

వేయిమంత్రాలు గౌణాని విఖ్యాతాని ఋషిభిః పరి గీతాని ఋషులచే గానము చేయబడినవి. 

శ్రీమన్నారాయణుని గుణములననుభవించిన ఋషులు, ఆ అనుభవ సారంగ ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కీర్తించి ఆనందించారు. అక్కడక్కడా గల ఆ ఋషుల వాగమృతం కలిసి పరీవాహమై లోకములో మనం కూడా పాడ గలిగేటట్లు శ్రీవ్యాస భగవానుడు సేకరించి కృప చేయగా నేను దర్శించాను. 

సర్వ జీవులు ఉజ్జీవించ డానికని చెప్పుచున్నాను విను అని భీష్ముడు ఉపదేశిస్తాడు.

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము మహాభారతసారము, పరమ ఋషులచే దర్శితము, శ్రీ భీష్మపితా మహుని అభిమతము, శ్రీ వేదవ్యాస ఉపదేశలబ్దము, భగవద్గీతకంటే శ్రేష్ఠము. 

ఎందరో ఆధునికులు గూడ ఇదే సకల శ్రేయస్సంధాయ కమని స్వీకరించిన ఈ విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని మనమూ నిత్యం పాడి కోరినవన్నీ పొందుతారు 

ఇందులో 107 శ్లోకాలున్నాయి. 

వనమాలీ... శ్లోకంతో కలిపి 108 శ్లోకాలు అవుతాయి. 

మనకి ఉన్న నక్షత్రాలు 27. 

ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 

ఒక్కొక్క నక్షత్రానికి 4 శ్లోకాలు చొప్పున కేటాయిస్తే (27x4)108పాదాలకు 108 శ్లోకాలు అవుతాయి. 

ఏ నక్షత్రంలో ఏ పాదానికి 108శ్లోకాలు అవుతాయి. 

ఏనక్షత్రంలో ఏ పాదానికి చెందివవారు ఆయా పాద సంఖ్య శ్లోకాన్ని ఎన్నుకొని పారాయణం చేయవచ్చు. 

ఆ శ్లోకాలలో నామాలకు ముందు 'ఓంకారం' లేదా చివర'నమః పదం చేర్చి పఠించటం ద్వారా తమ అభీష్టాన్ని పొందవచ్చును.